
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఒక్క సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం. అది బయటికి మంచి మెసేజ్ ను ఇవ్వలేదు ’ అని పవన్ అన్నారు.
‘పుష్ప’గురించేనా?
పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గందపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా నటించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అల్లు నటనకు ఫిదా అయ్యారు. ఈ చిత్రం బన్నీకి జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాపై పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment