heroes
-
లుక్కు మారింది.. కిక్కు ఖాయం
సంవత్సరం మారింది... లుక్ మార్చి బాక్సాఫీస్ లెక్కలు కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు కొందరు హీరోలు. ఇందు కోసం కథానుగుణంగా గెటప్ మార్చేశారు. ఇలా సరికొత్త లుక్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడానికి అభిమానులకు ఓ కిక్కు అని ప్రత్యేకంగా చెప్పలేదు. ఇక ఈ ఏడాది స్క్రీన్‌పై ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న కొందరు స్టార్స్ గురించి తెలుసుకుందాం.సరికొత్త మహేశ్ మహేశ్‌బాబు కెరీర్లో ఇప్పటివరకు ఇరవై ఎనిమిది సినిమాలు పూర్తయ్యాయి. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ కనిపించనంత కొత్తగా మేకోవర్ అయ్యే పనిలో పడ్డారు మహేశ్‌బాబు. రాజమౌళి డైరెక్షన్‌లోని కొత్త సినిమా కోసమే మహేశ్‌బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాలోని లుక్, మేకోవర్ కోసం ఆయన జర్మనీలో కొంత సమయం గడిపారు. గురువారం ఈ సినిమా లాంచ్ జరిగింది. కానీ మహేశ్ లుక్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి అండ్ టీమ్. ఈ సినిమాలో మహేశ్ లాంగ్ హెయిర్‌తో, కాస్త గెడ్డంతో కనిపిస్తారని ఇటీవల బయటికొచ్చిన ఆయన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రాజా సాబ్ ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న హారర్ మూవీ ‘రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రభాస్ రెండు గెటప్స్‌లో ఉన్న లుక్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే ప్రభాస్ కుర్చీలో కూర్చున్న ఓ గెటప్ మాత్రం కొత్తగా అనిపిస్తోంది. అలాగే ప్రభాస్ ఇటీవల ఎక్కువగా రగ్డ్ లుక్‌తో, గెడ్డంతోనే కనిపించారు. కానీ ‘రాజాసాబ్’లో మాత్రం క్లీన్ షేవ్‌తో ఓ గెటప్, కాస్త రగ్డ్ లుక్‌తో మరో గెటప్‌లో కనిపిస్తారు.మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. అయితే విడుదల విషయంలో మార్పు ఉండొచ్చనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే పోలీస్ యాక్షన్ డ్రామా చిత్రం కమిటయ్యారు ప్రభాస్. ఈ చిత్రంలోనూ ప్రభాస్ ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్. ఆ మేకోవర్ కోసం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారట సందీప్ రెడ్డి వంగా.రగ్డ్ పెద్ది ‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్‌చరణ్ క్లీన్ షేవ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం గుబురు గడ్డం, కాస్త లాంగ్ హెయిర్‌తో రగ్డ్గా కనిపిస్తున్నారు. చరణ్ ఇలా కొత్తగా మేకోవర్ అయ్యింది తన లేటెస్ట్ మూవీ కోసం అని ఊహించవచ్చు. రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ అనే ఓ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది.ఈ సినిమా కోసమే రామ్‌చరణ్ కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇందుకోసం రామ్ చరణ్ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఫిజిక్ విషయంలోనే కాదు... హెయిర్ స్టైల్‌తోనూ చరణ్ కొత్తగా కనిపిస్తారు. ‘పెద్ది’ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్లో జరిగింది. ఈ షెడ్యూల్లో సెలిబ్రిటీ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పాల్గొని, రామ్‌చరణ్ హెయిర్ స్టైల్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆఫీసర్ అర్జున్ సర్కార్ రోల్‌కు తగ్గట్లుగా నాని మౌల్డ్ అవుతుంటారు. తాజాగా అర్జున్ సర్కార్ పాత్ర కోసం నాని కొంత మేకోవర్ అయ్యారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హిట్ 3’. ఈ మూవీలో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఈ చిత్రంలో నాని కొన్ని సీన్స్‌లో ఫుల్ వైట్ హెయిర్‌తో కనిపిస్తారని తెలిసింది. అంటే... ఓ సీనియర్ పోలీసాఫీసర్ లెక్క అన్నమాట. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. అలాగే ‘దసరా’ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఫుల్ వయొలెన్స్‌తో సాగే ఈ చిత్రంలో ఓ ఫిరోషియస్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందుకోసం నాని ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంది. ‘హిట్ 3’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత నాని కొత్త మేకోవర్ స్టార్ట్ అవుతుందని ఊహించవచ్చు.రొమాంటిక్ లవ్‌స్టోరీ గతేడాది వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కాస్త మాసీ లుక్‌లో కనిపించారు హీరో రామ్. తన తాజా చిత్రం కోసం రామ్ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కోసం లాంగ్ హెయిర్ పెంచారు రామ్. అలాగే బరువు కూడా తగ్గారు. యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే థియేటర్స్‌లోకి వచ్చే చాన్స్ ఉంది. స్పై డ్రామా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఫ్యామిలీ మేన్‌లా కనిపించారు విజయ్ దేవరకొండ. అయితే ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో అందుకు భిన్నంగా కనిపించనున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లుగా తెలిసింది. దీంతో పోలీస్ రోల్‌కు తగ్గట్లుగా షార్ట్ హెయిర్‌తో, కరెక్ట్ ఫిజిక్‌తో కనిపించనున్నారట విజయ్. కాగా ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఈ సీన్స్‌లో విజయ్ లుక్ రగ్డ్గా... చాలా మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇలా ఈ చిత్రంలో విజయ్ రెండు గెటప్స్‌లో కనిపించనున్నారట. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీలో మార్పు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.మాస్ సంబరాలు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో సాయి దుర్గా తేజ్ మేకోవర్ చూశారుగా... మాసీ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మాస్ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా హార్డ్‌వర్క్ చేశారు సాయి దుర్గాతేజ్. సిక్స్‌ఫ్యాక్ చేశారు. కేపీ రోహిత్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, దాదాపు రూ. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందని తెలిసింది. తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.లేడీ గెటప్‌లో.. మాసీ లుక్స్‌తో కనిపించే విశ్వక్ సేన్ తొలిసారిగా లైలాగా అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. ఓ అబ్బాయి లేడీ గెటప్‌లో నటించాలంటే స్పెషల్‌గా మేకోవర్ అవ్వాల్సిందే. అలా లైలాగా కనిపించడానికి విశ్వక్ మౌల్డ్ అయ్యారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో మోడల్ సోను, లైలా అనే అమ్మాయి... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు విశ్వక్ సేన్. లెనిన్‌గా... ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ హీరోగా చేయాల్సిన నెక్ట్స్ మూవీపై మరో అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరితో అఖిల్ ఓ మూవీ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని, ఆల్రెడీ హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ మొదలైందని, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే ఈ సినిమా కథ అనంతపురం నేపథ్యంలో సాగుతుందని, లెనిన్ పాత్ర కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని తెలిసింది.పీరియాడికల్ వార్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘స్వయంభూ’. పీరియాడికల్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం నిఖిల్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. చెప్పాలంటే గత ఏడాదిగా ఈ లుక్‌నే మెయిన్టైన్ చేస్తున్నారు నిఖిల్. లాంగ్ హెయిర్‌తో, స్ట్రాంగ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు నిఖిల్. అంతే కాదు... ఈ సినిమా కోసం నిఖిల్ కొన్ని యాక్షన్ సీన్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ కోవలో మరికొందరు హీరోలు కూడా తమ కొత్త సినిమాల కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
వెండితెరపై ‘పేట’ యువకులు
నర్సంపేట : ఆ ముగ్గురికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఎక్కడ ఆడిషన్స్ జరిగినా వెళ్లే వారు. అలాగే, వివిధ సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరిగే వారు. చిన్న పాత్ర అయినా ఇవ్వమని కోరారు. తెలిసి వారి వద్దకు వెళ్లి తమలోని నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారు. అవకాశం వచ్చినట్లు వచ్చే చేజారేది. అయినా ఏమాత్రం నిరాశపడేవారు కాదు. మళ్లీ ప్రయత్నం చేసేవారు. చివరకు అనుకున్నది సాధించారు. తమ ఆకాంక్షకు అనుగుణంగా అవకాశం రావడంతో ఆ ముగ్గురు యువకులు హీరోలుగా రాణిస్తున్నారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారు తమప్రతిభతో ముందుకెళుతున్నారు. వారే నర్సంపేట నియోజకవర్గానికి చెందిన బూరగాని అనిల్, భూక్య సిద్ధు శ్రీఇంద్ర, బూస కుమార్. ఈ ముగ్గురు హీరోలుగా నటించిన తమ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.అనిల్ నటన అద్భుతం..బూరగాని అనిల్‌ది నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రం. తల్లిదండ్రులు బూరగాని కొమురయ్య–రమాదేవి. అనిల్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సినిమాపై ఆసక్తి ఉండడంతో ఆ రంగం వైపు వెళ్లాడు. పలువురి వద్దకు వెళ్లి తన ప్రతిభను తెలియజేశాడు. వారికి అనిల్ నటన నచ్చడంతో అవకాశం ఇచ్చారు. దీంతో అనిల్ ‘వజ్రాలు కావాలా నాయనా’ అనే సినిమాలో మొదటిసారిగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2017న విడుదలైంది. ఇందులో అనిల్ అద్భుత నటనకు పలువురు ముగ్థులయ్యారు. రెండో సినిమా ‘ఇరావణ’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రేమతో మీ అభిరామ్, దునియా, ప్రేమకుజై, తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు అనిల్ చెప్పాడు. కాగా, టీవీషోలు అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, రాజేశ్వరివిల్లాస్ కాఫీ క్లబ్, అనుపల్లవి, కలవారి కోడలు కనకమహాలక్ష్మి వంటి సీరియల్లో నటిస్తున్నట్లు అనిల్ తెలిపారు.సిద్ధు..‘అనాథ’భూక్య సిద్ధు గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తనలో ఉన్న నటనా ప్రావీణ్యంతో సినిమా రంగంలో రాణించాలని 13 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. చివరకు అదృష్టం వరించింది. వారం రోజుల క్రితం ‘అనా«థ’ అనే సినిమాను నిర్మించి హీరోగా వెండి తెరకు పరిచమయ్యాడు. మొదటి సినిమాలోనే మంచి నటన ప్రావీణ్యం కనబర్చడంతో ఈ సినిమా పలువురిని ఆకట్టుకుంది. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన సకృ, సరోజన దంపతుల కుమారుడు సిద్ధు. మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోగా రాణిస్తూ గోనేంద్ర ఫిలింస్ సంస్థ ద్వారా అనాథ సినిమాను తెలుగు, కన్నడంలో తీసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం రెండో సినిమా కూడా తీస్తున్నట్లు సిద్ధు తెలిపారు.‘రియల్’ రంగం నుంచి హీరోగా..రియల్ ఎస్టేట్ రంగంలో రాణిసూ్తనే సినిమా హీరోగా గుర్తింపు పొందాలనే తపనతో వెండి తెరకు పరిచయమయ్యాడు నర్సంపేట నియోజకవర్గంలోని గుర్రాలగండి రాజపలి్ల గ్రామానికి చెందిన బూస కుమార్. సినిమా రంగంలోని పలువురు ప్రముఖులను కలిసినా ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు. దీంతో తానే స్వయంగా ‘షాన్’ అనే సినిమాను రూపొందించాడు. ఇందులో తనే హీరోగా నటించాడు. అంతేకాకుండా నిర్మాత, దర్శకుడిగా వ్యవహరించి గత సంవత్సరం తన అదృష్టం పరీక్షించుకున్నాడు. వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిగా అవగాహన ఉండడంతో ఆయా ప్రాంతాల్లో చిత్రీకరణ చేసి తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా పూర్తి చేశాడు. అనంతరం విడుదల చేసి సఫలీకృతుడయ్యాడు. ప్రస్తుతం మరో సినిమా కూడా చేస్తున్నట్లు ‘సాక్షి’కి వివరించాడు. -
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్‌లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్‌ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్‌లో ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్‌కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్‌బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్‌కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
సినిమా హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
సినిమా హీరోలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయ్యిందని వ్యాఖ్యానించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరోనే అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఒక్క సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం నాకు కష్టం. అది బయటికి మంచి మెసేజ్ ను ఇవ్వలేదు ’ అని పవన్ అన్నారు.‘పుష్ప’గురించేనా?పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గందపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా నటించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అల్లు నటనకు ఫిదా అయ్యారు. ఈ చిత్రం బన్నీకి జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాపై పవన్ కల్యాణ్ పరోక్షంగా సెటైర్లు వేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. -
రికార్డుల వేటకు టాలీవుడ్ హీరోలు రెడీ
-
డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న స్టార్ హీరోలు
అభిమాన హీరో ఒక పాత్రలో కనిపించి సింగిల్ ట్రీట్ ఇస్తేనే అభిమానులు ఖుషీ అయిపోతారు. ఇక రెండు పాత్రల్లో కనిపిస్తే పట్టరాని ఆనందం వారి సొంతం. అలా డబుల్ రోల్లో కనిపించి, డబుల్ ట్రీట్ ఇవ్వడానికి కొందరు హీరోలు రెడీ అయ్యారు. ఆ స్టార్స్ చేస్తున్న ద్విపాత్రాభినయం గురించి తెలుసుకుందాం ► రెండు, మూడు, నాలుగు, పది... ఇలా ఒకే సినిమాలో ఎన్ని పాత్రల్లో అయినా మెప్పించగలరు కమల్‌హాసన్. అలా సేనాపతి, అతని తనయుడు చంద్రబోస్ సేనాపతిగా ‘ఇండియన్’ (భారతీయుడు) లో కమల్ రెండు పాత్రల్లో మెప్పించిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో 1996లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఇండియన్ 2’ సేనాపతి, అతని తండ్రి పాత్ర నేపథ్యంలో ఉంటుంది. అంటే.. సేనాపతికి అంత దేశభక్తి రావడానికి అతని తండ్రి ఎలా కారణం అయ్యాడు? అనేది ఈ చిత్రంలో ఉంటుందట. 1920లలో కథ సాగడంతో పాటు ఇప్పటికాలం టచ్ అయ్యేలా స్క్రీన్‌ప్లే రెడీ చేశారట శంకర్. ఇక తాజా చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, కీలక పాత్రల్లో రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా నటిస్తున్నారు. ►‘సలార్’ సినిమా తొలి భాగం ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’తో ప్రభాస్ మరో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పాత్రలో కనిపిస్తేనే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక రెండు పాత్రల్లో కనిపిస్తే డబుల్ ధమాకానే. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం’లో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనున్నారట. తండ్రీ కొడుకుగా ప్రభాస్ కనిపించే సీన్స్ సరికొత్త అనుభూతిని పంచుతాయని టాక్. ప్రత్యేకించి 1000 మందితో ఫైట్ చేసే ఒక యాక్షన్ సీన్లో ప్రభాస్ రెండో పాత్ర (తండ్రి) ఎంట్రీ ఉంటుందని సమాచారం. ‘సలార్’ తొలి భాగంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేశారు. రెండో భాగంలో పృథ్వీరాజ్ కూడా రెండు పాత్రల్లో కనిపిస్తారట. తొలి భాగంలో ఉన్న బాబీ సింహా, శ్రియా రెడ్డి తదితరులు మలి భాగంలోనూ కనిపిస్తారు. ► ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ‘దేవర’ సినిమా గ్లింప్స్‌లో ఉన్నాయి. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర చేస్తు్తన్నారు. కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ అక్టోబర్ 10న విడుదల కానుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో, నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. ఎన్టీఆర్ తండ్రీకొడుకుగా సందడి చేస్తారని భోగట్టా. యాక్షన్, ఎమోషన్స్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే గతంలో ‘ఆంధ్రావాలా, శక్తి, అదుర్స్’ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’లో త్రిపాత్రాభినయంతో మెప్పించిన విషయం తెలిసిందే. ► ఒక్క సినిమాలో కాదు.. వరుసగా రెండు చిత్రాల్లో రామ్‌చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఒకటి శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా. మరొకటి బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్‌చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రం. ఇక రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే... సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తండ్రీ కొడుకుగా కనిపిస్తారని భోగట్టా. తనయుడి పాత్రలో ఎన్నికల అధికారిగా, తండ్రి పాత్రలో రాజకీయ నేతగా కనిపించనున్నారట. రెండో పాత్రకు సంబంధించిన ఫొటోలు కొన్ని బయటికొచ్చాయి. అందులో చరణ్ 70ల్లో వ్యక్తిగా ఖద్దరు వస్త్రాలు ధరించి సైకిల్‌పై వెళుతూ కనిపించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్ ప్రత్యేక పాత్రధారులు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. ఇక బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌చరణ్ చేస్తున్న సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ అన్న, తమ్ముడు పాత్రల్లో కనిపించనున్నారట. వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. కాగా ‘మగధీర, నాయక్’ చిత్రాల్లో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. - పోడూరి నాగ ఆంజనేయులు -
వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోలు వీరే!
సినిమా అంటే కొన్ని పరిమితులుంటాయి. వెబ్ సిరీస్‌లకు హద్దులు లేవు. రొమాన్స్, వయొలెన్స్, సెంటిమెంట్.. ఏదైనా కొంచెం ఓవర్‌గా చూపించొచ్చు. ఈ నేపథ్యంలో సినిమా స్టార్స్ తమ ఇమేజ్‌కి భిన్నమైన క్యారెక్టర్లు, కథలు ఒప్పుకుని వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది వెబ్ వరల్డ్‌లోకి వేంచేసిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ హీరోలలో ఒకరైన వెంకటేశ్ ఓటీటీ వరల్డ్ కోసం కొత్త ట్రాక్‌లోకి వచ్చారు. కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్ ’ ఆధారంగా ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తీశారు దర్శక ద్వయం సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ . వెంకటేశ్‌తో పాటు రానా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, సుచిత్రా పిళ్లై కీలక పాత్రలు చేశారు. కథ విషయానికొస్తే.. సెలబ్రిటీల సమస్యలను పరిష్కరించే రానా నాయుడు (రానా)కు అతని తండ్రి నాగ నాయుడు (వెంకటేశ్) అంటే ద్వేషం. పదిహేనేళ్ల జైలు జీవితం తర్వాత తిరిగొచ్చిన నాగ నాయుడుతో రానా నాయుడు తిరిగి కలుస్తాడా? నాగ నాయుడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అనే అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది. పది ఎపిసోడ్ల ఈ సిరీస్‌కి డైలాగ్స్ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ఈ ఏడాది మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ‘రానా నాయుడు’ సెకండ్ సీజన్ కూడా ఉంటుంది. ► ‘దూత’గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. ఆయన హీరోగా ‘మనం’, ‘థ్యాంక్యూ’ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ‘దూత’కు దర్శకుడు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా సాగే ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియాభవానీ శంకర్, పశుపతి కీలక పాత్రలు పోషించారు. పాత్రికేయ విలువల కన్నా ధనమే ముఖ్యమని భావించే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ వర్మ (నాగచైతన్య పాత్ర) ‘సమాచార పత్రిక’కు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. సాగర్‌కు దొరికే పేపర్ క్లిప్పింగ్‌లో ఉన్నవారు చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాగర్ ఏం చేశాడు? అన్నది ‘దూత’ సిరీస్‌లో చూడొచ్చు. డిసెంబరు 1 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ► ‘హనుమాన్ జంక్షన్ ’, ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో..’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపీ గోపికా గోదావరి’ వంటి సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వెండితెరపై కాస్త స్లో అయిన వేణు డిజిటల్ తెరపై సత్తా చాటాలని హారర్ థ్రిల్లర్ జానర్లో సాగే ‘అతిథి’ వెబ్ సిరీస్‌లో నటించారు. అవంతికా మిశ్రా, అదితీ గౌతమ్ కీలక పాత్రలు పోషించారు. వైజీ భరత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్స్‌గా సాగుతోంది. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం సాగే దెయ్యాల మిట్ట అనే ప్రాంతానికి సమీపాన సంధ్య నిలయం అనే పెద్ద భవంతిలో రచయిత రవివర్మ (వేణు తొట్టెంపూడి), అతని భార్య సంధ్య (అదితీ గౌతమ్) నివసిస్తుంటారు. అయితే దెయ్యాలు లేవని నమ్మే యూట్యూబర్ సవారి (వెంకటేశ్ కాకుమాను) అక్కడికి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని ఘటనలకు భయపడి సంధ్య నిలయంకు వెళ్తాడు. తన కంటే ముందే సంధ్య నిలయంకు వచ్చిన మాయ (అవంతిక మిశ్రా) చనిపోతుందని తెలుసుకుంటాడు సవారి. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా దెయ్యాల మిట్టలో దెయ్యాల సంచారం ఉందా? మాయ చావుకు కారణం ఎవరు? ఫైనల్‌గా సవారి ఏం తెలుసుకుంటాడు? అన్నది క్లుప్తంగా ‘అతిథి’ సిరీస్ కథ. ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ► నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది వెబ్ వరల్డ్‌లో డబుల్ ధమాకా ఇచ్చారు జేడీ. ఆయన టైటిల్ రోల్ చేసిన వెబ్ సిరీస్ ‘దయా’. ఈ సిరీస్‌కు పవన్ సాధినేని దర్శకుడు. ఈషా రెబ్బా, పృథ్వీరాజ్, రమ్యా నంబీసన్ , కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించారు. చేపలు ట్రాన్స్పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ దయా (జేడీ చక్రవర్తి). అతని భార్య అలివేలు (ఈషా రెబ్బా) నిండు గర్భిణి. ఓ రోజు దయా పని మీద కాకినాడకు బయలుదేరతాడు. అయితే తన వ్యాన్ లో శవం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. ఆ శవం దయా బండిలోకి ఎందుకు వచ్చింది. ఈ ఘటనకు, జర్నలిస్ట్ కవిత (రమ్యా నంబీసన్)కు సంబంధం ఏంటి? అనేది సిరీస్‌లో చూడాలి. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జేడీ చక్రవర్తి ఓ ముఖ్య పాత్రలో నటించిన మరో వెబ్ సిరీస్ ‘తాజా ఖబర్’ జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆది సాయికుమార్ నటించిన వెబ్ సిరీస్ ‘పులిమేక’. ఈ సిరీస్‌కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకుడు. లావణ్యా త్రిపాఠి ఓ లీడ్ రోల్ చేశారు. కథ విషయానికొస్తే...హైదరాబాద్‌లో జరుగుతున్న పోలీసుల వరుస హత్యల మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగుతారు కిరణ్ ప్రభ (లావణ్యా త్రిపాఠి). ఫోరెన్సిక్ హెడ్ ప్రభాకర్ శర్మగా పోలీ సులకు హెల్ప్ చేస్తుంటాడు ఆది సాయికుమార్. మరి.. కిల్లర్‌ను కిరణ్ ప్రభ పట్టుకున్నారా? అతను పోలీసులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అనేది ‘పులి మేక’ సిరీస్ కథాంశం. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. -
గూఢచారితో జోడీ
అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి 2’ (జీ 2). వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో యిన్‌గా బనితా సంధుని ఫిక్స్ చేసినట్లు యూనిట్ పేర్కొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అక్టోబర్, సర్దార్ ఉదమ్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న బనితా. ‘జీ 2’లో సరికొత్త పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘నా తొలి పాన్ ఇండియా చిత్రమిది’’ అన్నారు బనితా సంధు. -
ప్రధాని మోదీ భావోద్వేగం..
బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఇస్రో కమాండ్ సెంటర్లో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. భారత్ చంద్రునిపైకి చేరుకుందని అన్నారు. జాతి గౌరవాన్ని చంద్రమండలం వరకు తీసుకువెళ్లామని చెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో చంద్రయాన్ 3 మిషన్ ఓ అద్భుత ఘట్టం అని అన్నారు. PM Modi gets emotional while addressing ISRO scientists on Chandrayaan-3 success. Watch what he said 📹#PMModi #Chandrayaan3Success #ISRO #Chandrayaan3 | @isro @narendramodi @PMOIndia pic.twitter.com/P7DVbpR69u — Moneycontrol (@moneycontrolcom) August 26, 2023 40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ జాబిల్లి దక్షిణ ధృవాన్ని బుధవారం చేరింది. ప్రజ్ఞాన్ రోవర్ కూడా బయటకు వచ్చి వివరాలను సేకరించే పనిని ప్రారంభించింది. అయితే.. చంద్రయాన్ 3 ల్యాండర్ జాబిల్లిని చేరినప్పుడు ప్రధాని మోదీ బ్రిక్స్ సదస్సుకు హాజరవడానికి దక్షిణాఫ్రికా వెళ్లారు. అనంతరం ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా గ్రీస్‌కు వెళ్లారు. నేరుగా గ్రీస్ నుంచి నేడు బెంగళూరుకు చేరుకున్నారు. ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌కు వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తల ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. సాహసోపేతమైన ఘట్టంగా అభివర్ణించారు. కేవలం భారతీయులకే గాక యావత్ ప్రపంచ విజ్ఞానానికి ఉపయోగం ఉంటుందని అన్నారు. ఇదీ చదవండి: PM Modi ISRO Visit Highlights: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
గూగుల్ హ్యాక్ ఫర్ చేంజ్ విజేత ‘టీమ్ అగ్రి హీరోస్’
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారిత యాప్‌ను రూపొందించిన ‘టీమ్ అగ్రిహీరోస్’.. గూగుల్ ‘హ్యాక్ 4 చేంజ్’విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’, టీ–హబ్ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్ జరిగింది. దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్‌లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్‌లో ‘టీమ్ అగ్రిహీరోస్’తొలిస్థానంలో నిలిచింది. ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్ డీప్.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. ‘టీమ్ లైట్హెడ్స్’కి మూడో బహుమతి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్ ప్రవీణ్ కుమార్, గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) గురు భట్, ప్రిన్సిపల్ ఇంజనీర్ అరుణ్ ప్రసాద్ అరుణాచలం, టీ–హబ్ సీఓఓ వింగ్ కమాండర్ ఆంటోని అనీశ్, ద నడ్జ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్‌లో ఘజియాబాద్‌కు చెందిన ‘టీమ్ ఇన్ఫెర్నోస్’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది. వ్యవసాయంలో ఆల్టర్నేట్ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కే చెందిన ‘టీమ్ లైట్హెడ్స్’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్‌కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది. -
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?
దాగుడు మూతలాట ఆడుకోని వాళ్లుండరు... కళ్లకు గంతలు కట్టి పేర్లు అడిగితే చెప్పాలి. ఇది రియల్ ఆట. రీల్ గేమ్ విషయానికి వస్తే.. గంతలు కట్టకుండా.. ఆర్టిస్ట్‌ని ఎదురుగా నిలబెట్టి, ‘వీరి పేరేమి’ అని అడిగితే.. ఆ ఆర్టిస్ట్నిగుర్తుపట్టడానికి కాస్త టైమ్ పడుతుంది. అసలు గుర్తు పట్టకపోవచ్చు కూడా. అంతలా కొందరు స్టార్స్ క్యారెక్టర్లలో ఒదిగిపోయారు. ఫిజికల్ మేకోవర్‌తో, మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆ హీరోల గురించి తెలుసుకుందాం. ♦ పాత్రల కోసం రూపా న్ని మార్చుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు విక్రమ్. ‘శివపుత్రుడు, అపరిచితుడు, ఐ’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. తాజాగా ‘తంగలాన్’లో కొత్త అవతారంలో కనిపించనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు విక్రమ్. గనుల తవ్వకాల పనులు చేసే వ్యక్తుల జీవితాల నేపథ్యంలో దర్శకుడు పా . రంజిత్ పా న్ ఇండియా మూవీగా ‘తంగలాన్’ని తెరకెక్కిస్తున్నారు. ♦ క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవాలనుకుంటారు అల్లు అర్జున్. గతంలో ‘దేశ ముదురు’ సినిమా కోసం సిక్స్ ΄్యాక్ చేశారు. తాజాగా ‘పుష్ప’ కోసం ఫిజికల్ మేకోవర్‌తో పా టు మేకప్ పరంగానూ వ్యత్యాసం చూపించారు. స్మగ్లర్ పుష్పరాజ్‌గా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో రెచ్చి పోయారు అల్లు అర్జున్. మలి భాగం ‘పుష్ప:ది రూల్’ చిత్రీకరణ జరుగుతోంది. కాగా.. పుష్పరాజ్‌గా గుర్తు పట్టలేనంతగా అల్లు అర్జున్ మారలేదు. కానీ రెండో భాగంలో జాతర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఒక ఫైట్‌లో గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. పండగ చివరి రోజు స్త్రీ వేషధారణలో పురుషులు చెడును నాశనం చేసే గంగమ్మ తల్లిగా మారతారని, ఈ ఫైట్‌లో అల్లు అర్జున్ గెటప్ అదే అని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ♦ దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పా త్రల్లో సుధీర్‌బాబు కనిపించనున్న చిత్రం ‘మామా మశ్చింద్ర’.. వీటిలో దుర్గ పా త్ర డిఫరెంట్. ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్ అన్నమాట. మామూలుగా సు«దీర్‌బాబు చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటారు. అయితే ఈ పా త్రలో అందుకు భిన్నంగా బొద్దుగా కనబడతారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది, ♦ అటు మలయాళంకి వెళితే సీనియర్ హీరో మోహన్‌లాల్, యంగ్ హీరో పృథ్వీ రాజ్కుమారన్లు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. మోహన్‌లాల్ టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ బర్రోజ్. ఆ నిధిని వాస్కో అసలు వారసునికి అప్పగించడానికి ఆ ఆత్మ వేచి ఉంటుంది. కాల్పనిక కథతో త్రీడీ చిత్రంగా ‘బర్రోజ్’ రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేయడంతో పా టు మోహన్ లాల్ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ♦ మరో మలయాళ హీరో–దర్శకుడు పృథ్వీ రాజ్కుమారన్ గొర్రెల కాపరిగా కనిపించనున్న చిత్రం ‘ఆడు జీవితం’. 2008లో ఇదే పేరుతో వచ్చిన నవల నేపథ్యంలో బ్లెస్సీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నజీబ్ అనే మలయాళీ వలస కార్మికుడి పా త్రలో పృథ్వి రాజ్ కనిపిస్తారు. సౌదీ అరేబియాకి వలస వెళ్లిన నజీబ్‌ను గొర్రెల కాపరిని చేసి, బలవంతంగా బానిసత్వంలోకి నెట్టివేస్తారు. నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. సవాళ్లను ఇష్టపడని స్టార్స్ ఉండరు. అయితే సవాళ్లు అరుదుగా వస్తుంటాయి. అందుకే చాలెంజింగ్ రోల్స్ వచ్చి నప్పుడు ‘సై’ అంటూ ఎంత కష్టపడటానికైనా సిద్ధపడిపోతారు. ఈ సవాళ్లు స్టార్స్‌కి కిక్కే.. అభిమానులకూ కిక్కే. సినిమా సరిగ్గా క్లిక్ అయితే బాక్సాఫీస్కీ కిక్కే. -
పాన్ వరల్డ్ మేనియాకి సీక్వెల్ ప్రాణం పోస్తుందా..?
-
ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి!
♦ ‘రుద్రమదేవి’ తర్వాత ‘హిరణ్య కశ్యప’ సినిమా స్క్రిప్్ట, ప్రీ ప్రొడక్షన్‌పై ఐదేళ్లు వర్క్ చేశాను. షూటింగ్ ఆరంభించే టైమ్‌లో కోవిడ్ వచ్చింది. దీంతో అప్పుడు మాతో కలిసి ఉన్న ఓ హాలీవుడ్ సంస్థ మరో వర్క్‌పై ఫోకస్ పెట్టింది. ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాం. ♦లాక్డౌన్ టైమ్‌లో కొన్ని పురాణాలు, ఇతిహాసాల కలయికలో ఓ ప్రేమకథ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాకు నచ్చింది. దాన్ని సోషలైజ్ చేయటమెందుకు.. అలాగే తీస్తే బెటర్ కదా అని ‘శాకుంతలం’ మొదలుపెట్టాను. సాధారణంగా శకుంతల అనగానే శృంగార శకుంతల గుర్తుకొచ్చేలా ఇప్పటివరకూ చూపించారు. కానీ, ఆమెలో అంతర్గతంగా చాలా శక్తి, ఆత్మాభిమానం ఉంటుందని ‘అభిజ్ఞాన శాకుంతలం’లో కాళిదాసు ప్రస్తావించారు. నేను కూడా శకుంతల లోని రెండో కోణంతో కథ అల్లుకుని, ‘శాకుంతలం’ తీశాను. ♦ తన ఆత్మాభిమానం కోసం అప్పట్లో రాజు, రాజ్యాలను శకుంతల లెక్క చేయకుండా పోరాడి నిలబడింది. పెళ్లి కాకుండా తల్లి కావటం అనేది అప్పట్లో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులను ఆమె ఎలా ఎదురొడ్డి నిలబడిందనేది ఈ చిత్రకథాంశం. ♦ సమంత చాలా మంచి నటి. అందుకే శకుంతల పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌ను సెకండ్రీ చేశా. నటనకు ప్రాధాన్యం ఉండేలా చూపించాను. నేను, అరుణ బిక్షుగారు, సమంతగారు కలిసి మాట్లాడుకుని శకుంతల పాత్రను డిజైన్ చేశాం. సమంత కొత్త హీరోయిన్లా అరుణ బిక్షుగారి వద్ద శిక్షణ తీసుకుని నటించింది. ♦ ‘శాకుంతలం’లో దుర్వాస మహామునిగా మోహన్‌బాబుగారు నటించారు. ఆ పాత్రని ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఆయన ఒప్పుకోకుంటే ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఆలోచనలో పడేవాణ్ణి. ♦ అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్.. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ది అతిథి పాత్ర అయినా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రలో చాలా కోణాలుంటాయి. ఆ పాత్రని తెలుగు హీరోలు చేస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అడిగి లేదనిపించుకోవటం ఇష్టం లేక వారిని సంప్రదించలేదు. దేవ్ మోహన్ ‘శాకుంతలం’ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనన్నాడు. అతనికి శిక్షణ ఇప్పించి దుష్యంతుడి పాత్ర చేయించుకున్నాను. -
సీనియర్ హీరోలను చూసి యంగ్ హీరోలు నేర్చుకోవాలి
-
ఇండస్ట్రీ హిట్స్‌కి గురి పెడుతోన్న దర్శకులు, హీరోలు
-
ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్న అగ్రహీరోలు
-
ప్రతి హీరోకి డ్యూయల్ రోల్ ఒక ఛాలెంజ్
-
లాభాలు తెచ్చే స్తతా లేదు కానీ కోట్లు కావాలి: హీరోలపై షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హీరోల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి లాభాలు తెచ్చే సత్తా ఉండదు కానీ కోట్లకు కోట్లు పారితోషికం అడుగుతారని ఎద్దేవా చేశారు. అలాగే కొన్ని సినిమాల వల్ల తాను పెద్ద మొత్తంలో నష్టపోయానని వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. 'ఇద్దరు వ్యక్తులతో ఒక స్టార్టప్‌లాగా ధర్మ ప్రొడక్షన్స్ ప్రారంభించాను. యశ్ చోప్రా చెప్పినట్లు సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాదు, దానికోసం మనం పెట్టే బడ్జెటే దాన్ని నిర్ణయిస్తుంది. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ విషయంలో అదే రుజువైంది. ఆ సినిమాతో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రాలను లాంచ్ చేశాను. ఆ సినిమా పేరుకు హిట్టయింది కానీ నాకు డబ్బులు రావడం కాదు కదా పెట్టినవి కూడా పోయాయి. సినిమా అంటే నాకు ఒక ఎమోషన్. హిందీ సినిమా కోసం నా మనసు ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. కానీ ఒక బిజినెస్‌మెన్‌గా మాట్లాడాల్సి వస్తే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఇకపోతే సినిమాలో ఎక్కువ మొత్తం పారితోషికం రూపంలో స్టార్స్‌కే వెళ్లిపోతుంది. ఇలా అంటున్నందుకు నన్ను హత్య చేస్తారేమో, కానీ ఇదే నిజం. సినిమా ఫస్ట్ డేకు రూ.5 కోట్లు కూడా రాబట్టలేరు కానీ రూ.20 కోట్లు అడుగుతారు. ఇదసలు న్యాయమేనా?' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు కరణ్. ఇది చూసిన నెటిజన్లు 'కరణ్ కరెక్ట్‌గా చెప్పాడు', 'తెలుగు సినిమాల విషయంలో కరణ్ నిజాయితీగా మాట్లాడతాడు' అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ అద్దెకు, ఎన్ని లక్షలంటే? దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వీజే సన్నీ -
స్టార్ పటాస్
-
నా దృష్టిలో నిర్మాతలే హీరోలు
‘‘నా దృష్టిలో నిర్మాతలే హీరోలు. అందుకే నా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నిర్మాతలను ఆహ్వానించాను. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాస్. లక్ష్ చదలవాడ, వేదిక దత్త జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదలవుతోంది. ‘‘ఒక పెద్ద సినిమా తీసే బడ్జెట్లో 25 చిన్న సినిమాలు తీయొచ్చు. అందుకే కొత్త వారితో మా బ్యానర్లో 15 సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాస్. -
స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు
మన తెలుగు హీరోలు కొందరు స్టూడెంట్స్‌గా మారి బాక్సాఫీస్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారు. ప్రేక్షకులే ఇన్విజిలేటర్స్‌గా సాగే ఈ బాక్సాఫీస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి, వసూళ్ల మార్కులు తెచ్చుకోవడానికి ఎవరికి తగ్గట్లు వారు రెడీ అవుతున్నారు. కొన్ని ఎగ్జామ్ డేట్స్ (రిలీజ్ డేట్స్) కూడా ఫిక్సయ్యాయి. మరి.. ఈ విద్యార్థుల వివరాల్లోకి ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌చరణ్ అమృత్‌సర్‌కి వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. చరణ్ అక్కడికి కాలేజీ స్టూడెంట్‌గా వెళ్లారు. ఈ హీరో ఇలా కాలేజీకి వెళ్లింది శంకర్ సినిమా కోసమే. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ పాత్రలో షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్ లీడర్, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రల్లో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఆల్రెడీ కాలేజీ బ్యాక్‌డ్రాప్ సీన్లను అమృత్‌సర్‌లో చిత్రీకరించారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్య కూడా స్టూడెంట్‌గా ‘థ్యాంక్యూ’ సినిమా కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్లారు. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగ చైతన్యల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య, మాళవికా నాయర్ హీరోయిన్లుగా, అవికా గోర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర చేశారు. స్టూడెంట్‌గానూ నాగచైతన్య కనిపిస్తారు. చైతూ స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు అవికా గోర్ స్కూల్ స్టూడెంట్‌గా, కాలేజీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మాళవికా నాయర్ కూడా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తారు. ఓ వ్యక్తి జర్నీగా రూపొందిన ఈ చిత్రం జూలై 8న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇంకోవైపు ఆది, సత్యదేవ్ కూడా స్టూడెంట్ రోల్స్ చేశారు. ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రం కోసం కాలేజీకి వెళ్లారు సత్యదేవ్. నాగశేఖర్ ఈ సినిమాకు దర్శకుడు. తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాష్ హీరోయిన్లుగా నటించారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలే ఈ సినిమా కథను మలుపు తిప్పుతాయి. ఈ చిత్రం జూలై 15న రిలీజ్ కానుంది. ఇక ‘తీస్మార్ ఖాన్’ కోసం ఆది సాయికుమార్ స్టూడెంట్ అవతారం ఎత్తారు. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీసాఫీసర్.. ఇలా త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆది సాయికుమార్. ఇక ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రంగ రంగ వెభవంగా..’. ఇది కంప్లీట్ క్యాంపస్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో మెడికల్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత వస్తుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని క్యాంపస్ డ్రామాలు కూడా వెండితెరపై ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. -
చల్ చల్ చలో.. షూటింగ్ చేద్దాం చలో.. అంటున్న హీరోలు
కరోనా వ్యాప్తి కారణంగా ఆ మధ్య కొందరు స్టార్ల సినిమా షూట్‌కి బ్రేక్ పడింది. సంక్రాంతి పండగ బ్రేక్ కూడా తోడైంది. ఇప్పుడు బ్రేక్‌లు తీశారు.. మేకప్ వేద్దాం.. షూటింగ్ చేద్దాం.. చలో.. చలో అంటూ స్టార్స్ షూట్లో పాల్గొంటున్నారు. గత నెల చివర్లో చిరంజీవి కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉన్నారు. స్వల్ప లక్షణాలతో కరోనా ఆయన్ను ఇబ్బందిపెట్టలేదు. త్వరగానే నెగటివ్ వచ్చేసింది. దాంతో ఒకవైపు మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న ‘గాడ్ ఫాదర్’, మరోవైపు మెహర్ రమేశ్ డైరెక్షన్లో చేస్తున్న ‘బోళా శంకర్’ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్ చేసుకున్నారు చిరంజీవి. శుక్రవారం ‘గాడ్ ఫాదర్’ షూట్లో ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజుల్లో ‘బోళా శంకర్’ కూడా ఆరంభమవుతుందని తెలిసింది. అలాగే ప్రభాస్ కూడా హైదరాబాద్‌లోనే షూట్‌తో బిజీగా ఉన్నారు. ‘ఆదిపురుష్’ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’.. ఇవి ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు. ‘ఆదిపురుష్’ పూర్తయింది. ‘సలార్’ కొన్ని షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇటీవల వెకేషన్ నిమిత్తం యూరోప్ వెళ్లొచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇక రవితేజ అయితే ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలకు తన డైరీలో చోటిచ్చేశారు. ‘ఖిలాడీ’గా ఈ నెల 11న థియేటర్స్‌లోకి రానున్నారు. మిగతా చిత్రాల షూట్‌ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘రావణాసుర’ షూట్లో ఉన్నారు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌లోనే షూట్‌తో బిజీగా ఉన్న మరో హీరో రామ్. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న ‘ది వారియర్’ చిత్రీకరణ జరుగుతోంది. కొందరు స్టార్స్ హైదరాబాద్‌లో చిత్రీకరణతో బిజీగా ఉంటే నాగచైతన్య కొన్నాళ్లుగా రష్యాలో ఉన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ హీరో నటిస్తోన్న ‘థ్యాంక్యూ’ షూటింగ్ శుక్రవారం వరకూ అక్కడ జరిగింది. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తయింది. ఇక ముంబైలో ‘లైగర్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ శుక్రవారం ముంబైలో ఆరంభమైంది. ఈ హీరోలే కాదు... మరికొందరు కూడా జోరుగా షూట్లో పాల్గొంటున్నారు. ఈ నెలలోనే పక్కా.. ఈ నెలలో మరో పదీ ఇరవై రోజుల్లో షూటింగ్లో పాల్గొననున్నారు బాలకృష్ణ, మహేశ్‌బాబు, రామ్‌చరణ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్న చిత్రం షూట్లో ఈ నెల మూడో వారం నుంచి బాలకృష్ణ పాల్గొంటారని తెలిసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే మహేశ్ పాల్గొనడంలేదు. మరో నాలుగు రోజుల్లో మహేశ్ ఈ షూట్లో అడుగుపెడతారు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూట్లో ఈ నెల 10 నుంచి రామ్‌చరణ్ పాల్గొంటారని తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట. -
చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపిస్తున్న హీరోలు!
చోలీ కే పీచే క్యా హై అంటే... చోలీ మే దిల్ హై మేరా అన్నారు మాధురీ దీక్షిత్. ‘ఖల్ నాయక్’లోని ఈ పాట చాలామంది దిల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు... ‘చొక్కా కే పీచే క్యా హై’ అని మన హీరోలను అడిగితే... చొక్కా మే ప్యాక్ హై మేరా అంటారేమో. కథ డిమాండ్ చేస్తే ఆరు పలకలు.. ఎనిమిది పలకల దేహంతో ఫ్యాన్స్ దిల్ని ఖుషీ చేయడానికి రెడీ అయ్యారు హీరోలు. షర్ట్‌లెస్‌గా కనిపించనున్నారు.. రండి... సిక్స్ ప్యాక్ చూద్దాం. ఫైట్ సీన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకుల శాతం ఎక్కువే ఉంటుంది. అందుకే హీరోలు కూడా డిఫరెంట్ యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. వీటికోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతారు. కొందరు హీరోలు అవసరమైతే సిక్స్ ప్యాక్ చేస్తారు. చొక్కా విప్పి, ఆ ప్యాక్‌ని చూపిస్తారు. ఒక సినిమాలో కనిపించి, మరో సినిమాలో కూడా షర్ట్‌లెస్‌గా కనిపించాలంటే ‘సై’ అంటారు. ‘టెంపర్’ చిత్రంలో షర్ట్‌లెస్‌గా సిక్స్ ప్యాక్‌తో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లో షర్ట్‌లెస్‌గా కనిపించిన దృశ్యాలు ఈ చిత్రం ట్రైలర్లో కనిపించాయి. ఇక ఇదే చిత్రంలో మరో హీరోగా చేసిన రామ్‌చరణ్ ‘ధృవ’లో షర్ట్‌లెస్‌గా కనిపించారు. ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లోనూ అలా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (జనవరి 7న) విడుదల కావాల్సింది. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక ‘అర్జున్‌రెడ్డి’లో కొన్ని సీన్స్‌లో చొక్కా లేకుండా కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ‘లైగర్’ కోసం బాక్సర్‌గా సిక్స్‌ప్యాక్‌తో రెడీ అయ్యారు. ఇటీవల విడుదలైన ‘లైగర్’ గ్లింప్స్ వీడియోలో విజయ్ షర్ట్‌లెస్‌గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా ‘లైగర్’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్లు విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఇప్పటివరకు లవర్‌బాయ్‌లా కనిపించిన అఖిల్ ‘ఏజెంట్’ చిత్రం కోసం ఒక్కసారిగా మాస్ లుక్‌లోకి మారిపోయారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాది కష్టపడి అఖిల్ మేకోవర్ అయ్యారు. ఇందులో అఖిల్ సిక్స్‌ప్యాక్ లుక్‌లో కనిపిస్తారు. ఇక హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘ఆర్ఎక్స్100’లోనే సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించారు కార్తికేయ. ఆ చిత్రం తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో షర్ట్‌లెస్‌గా కనిపించారు. తాజాగా అజిత్ హీరోగా చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘వలిమై’లో కార్తికేయ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కార్తికేయ ఓ ఫైట్‌లో సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లుగా కార్తికేయ సోషల్ మీడియాలో చొక్కా లేకుండా షేర్ చేసిన ఫొటో ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ హీరోలే కాదు.. మరికొందరు కూడా షర్ట్లెస్కి సై అంటున్నారు. మళ్లీ అలా కనిపిస్తారా డ్యూడ్... సిక్స్ ప్లస్ కటౌట్ ఉన్న ప్రభాస్ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తే.. ‘వావ్ డ్యూడ్’ అంటారు. ‘మిర్చి’ లో ప్రభాస్ కటౌట్ మీద ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే డైలాగ్ కూడా ఉందిగా. ‘బాహుబలి’లో తన కటౌట్‌ని చూపించారు ప్రభాస్. మరోసారి చొక్కా లేకుండా కనిపించే అవకాశం ఉంది. తాజా చిత్రం ‘ఆదిపురుష్’లో రాముడి పాత్ర చేస్తున్నారు ప్రభాస్. రాముడంటే చొక్కా లేకుండా కనబడతారు కదా.. సో.. మరోసారి ప్రభాస్ కటౌట్‌ని చూడొచ్చన్న మాట. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. -
న్యూ ఇయర్ జోష్.. ఫ్యాన్స్ ఖుష్
గడచిన ఏడాది చివరి రోజు వచ్చిన సినిమాల కొత్త అప్డేట్స్తో సినీ లవర్స్‌లో న్యూ ఇయర్ జోష్ ఆరంభమైంది. ఆ అప్‌డేట్స్‌లోకి వస్తే...‘లాహే లాహే.., నీలాంబరి’ పాటల తర్వాత ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘సాన కష్టం..’ అనే మాస్ పాట లిరికల్ వీడియో ఈ నెల 3న విడుదల కానుంది. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇటు ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రం టీజర్ నేడు రిలీజ్ అవుతోంది. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. అటు ‘భీమ్లా నాయక్’ కొత్త సౌండ్ వినిపించాడు. పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి ‘లాలా భీమ్లా’ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాట డీజే వెర్షన్‌ను విడుదల చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘రామం రాఘవం’ మ్యూజిక్ వీడియో రిలీజైంది. రైజ్ ఆఫ్ రామ్‌గా వచ్చిన ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ మెరిశారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది. అటు ‘అట్టా సూడకే..’ అంటూ మాసీ స్టెప్పులేశారు ‘ఖిలాడి’. రవితేజ, మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడి’ నుంచి ‘అట్టా సూడకే’ పాట లిరికల్ వీడియో విడుదలైంది. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. మరోవైపు çపూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది. ఇంకోవైపు ‘మేజర్’ హిందీ వెర్షన్‌కి డబ్బింగ్ చెబుతున్నారు అడివి శేష్. వీరజవాన్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ పాత్ర చేశారు శేష్. ముంబై 26/11 దాడుల ఆధారంగా జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ఫ్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కానుంది. కొత్త ఏడాదికి తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు శ్రీ విష్ణు. వేదరాజ్ టింబర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం. ఓ విభిన్న కథాంశంతో సినిమా నిర్మించనున్నాం’’ అన్నారు వేదరాజ్. -
ఈ ఏడాదైనా స్టార్ హీరోల దర్శనం దొరికేనా?