బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరు చేరుకున్నారు. చంద్రయాన్ 3లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఇస్రో కమాండ్ సెంటర్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. భారత్ చంద్రునిపైకి చేరుకుందని అన్నారు. జాతి గౌరవాన్ని చంద్రమండలం వరకు తీసుకువెళ్లామని చెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో చంద్రయాన్ 3 మిషన్ ఓ అద్భుత ఘట్టం అని అన్నారు.
PM Modi gets emotional while addressing ISRO scientists on Chandrayaan-3 success.
— Moneycontrol (@moneycontrolcom) August 26, 2023
Watch what he said 📹#PMModi #Chandrayaan3Success #ISRO #Chandrayaan3 | @isro @narendramodi @PMOIndia pic.twitter.com/P7DVbpR69u
40 రోజుల ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ జాబిల్లి దక్షిణ ధృవాన్ని బుధవారం చేరింది. ప్రజ్ఞాన్ రోవర్ కూడా బయటకు వచ్చి వివరాలను సేకరించే పనిని ప్రారంభించింది. అయితే.. చంద్రయాన్ 3 ల్యాండర్ జాబిల్లిని చేరినప్పుడు ప్రధాని మోదీ బ్రిక్స్ సదస్సుకు హాజరవడానికి దక్షిణాఫ్రికా వెళ్లారు. అనంతరం ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా గ్రీస్‌కు వెళ్లారు.
నేరుగా గ్రీస్ నుంచి నేడు బెంగళూరుకు చేరుకున్నారు. ఇస్రో టెలిమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌కు వెళ్లారు. అక్కడ శాస్త్రవేత్తలతో ముచ్చటించారు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తల ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. సాహసోపేతమైన ఘట్టంగా అభివర్ణించారు. కేవలం భారతీయులకే గాక యావత్ ప్రపంచ విజ్ఞానానికి ఉపయోగం ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి: PM Modi ISRO Visit Highlights: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు
Comments
Please login to add a commentAdd a comment