PM Modi Emotional Video: బాల్యాన్ని గుర్తు చేసుకుని ప్రధాని భావోద్వేగం | Pm Modi Gets Emotional While Giving Houses To Poor In Maharashtra | Sakshi
Sakshi News home page

PM Modi Emotional Video: బాల్యాన్ని గుర్తు చేసుకుని ప్రధాని మోదీ భావోద్వేగం

Published Fri, Jan 19 2024 3:04 PM | Last Updated on Fri, Jan 19 2024 4:23 PM

Pm Modi Gets Emotional While Giving Houses To Poor In Maharashtra - Sakshi

సోలాపూర్‌: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భావోద్వేగానికి గురయ్యారు. లబ్ధిదారులకు పీఎం ఆవాస్‌ యోజన స్కీమ్‌ కింద ఇళ్లు అందజేస్తూ తన బాల్యాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో 90 వేల మంది నిరుపేదలకు పీఎం ఆవాస్‌(అర్బన్‌) కింద ఇళ్లు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘లబ్ధిదారులకు అందజేసిన ఇళ్లను చూసినపుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నతనంలో నాకు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండనిపించింది. అయితే ఇప్పుడు ఇంత మంది లబ్ధిదారుల  ఇంటి కల నిజమయినందుకు సంతృప్తిగా ఉంది. వాళ్ల ఆశీర్వాదాలే నాకు పెద్ద ఆస్తి’ అని చెమర్చిన కళ్లతో మోదీ చెప్పారు.

అణగారిన వర్గాల అభ్యన్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెపపడానికి ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడమే ఒక ఉదాహరణ అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన గ్యారెంటీని పూర్తి చేయడమే అని చెప్పారు. పీఎం అర్బన్ స్కీమ్‌ కింద సోలాపూర్‌లో చేపట్టిన రాయ్‌ హౌసింగ్‌  సొసైటీ ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టని మోదీ తెలిపారు. 90 వేల ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో శానిటరీ సిబ్బంది, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం గమనార్హం. 

ఇదీచదవండి.. దశాబ్దాల కల నెరవేరుతోంది.. మోదీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement