
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం చెన్నై పర్యటనలో తనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన ఓ బీజేపీ కార్యకర్తపై ప్రశంసలు కురింపించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో మోదీకి ఓ బీజేపీ కార్యకర్త స్వాగతం పలికారు. అయితే తన భార్య ఇద్దరు కవల పిల్లలు జన్మనించిందని అయినా వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చినట్లు స్వయంగా మోదీకే తెలియజేయటం విశేషం. అటువంటి అంకితభావం ఉన్న కార్యకర్త చేసిన పనికి తాను ఎమోషనల్ అయినట్లు మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. ప్రస్తుతం మోదీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
மிகவும் சிறப்பு வாய்ந்த சந்திப்பு!
— Narendra Modi (@narendramodi) March 4, 2024
சென்னை விமான நிலையத்தில், நமது கட்சி நிர்வாகிகளில் ஒருவரான திரு அஸ்வந்த் பிஜய் அவர்கள் என்னை வரவேற்க காத்திருந்தார். சற்றுமுன் தான், அவரது மனைவி இரட்டைக் குழந்தைகளைப் பெற்றெடுத்துள்ளார் என்றும், ஆனால் அவர் இன்னும் அவர்களை சந்திக்கவில்லை… pic.twitter.com/bufqjbe9wo
‘చైన్నై ఎయిర్‌పోర్టులో నాకు స్వాగతం పలకడానికి వచ్చిన బీజేపీ కార్యకర్త అశ్వంత్ పిజై చాలా ప్రత్యేకంగా అనిపించారు. అతను తన భార్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచిందని చెప్పారు. అయినా వారిని ఇంకా కలవలేదన్నారు. వారిని కలవకుండా నాకు స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చానని తెలిపారు. నేను ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు తెలియజేశాను’ అని సదరు కార్యకర్తపై ప్రశంసలు కురిపించారు. ‘అభిమానం, అంకితభావంతో కూడిన అశ్వంత్ పిజై వంటి బీజేపీ కార్యకర్తను చూడటం చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలు చూపించే ప్రేమ, అనురాగం నన్ను భావోద్వేగానికి గురిచేశాయి’ అని ప్రధాని మోదీ అన్నారు.