'రాత్రికి రాత్రే హీరోలయ్యారు' | On Camera, How Teen Delhi Footballers Turned Into Heroes | Sakshi
Sakshi News home page

'రాత్రికి రాత్రే హీరోలయ్యారు'

Published Fri, Sep 18 2015 2:27 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

'రాత్రికి రాత్రే హీరోలయ్యారు' - Sakshi

'రాత్రికి రాత్రే హీరోలయ్యారు'

న్యూఢిల్లీ: వారంతా ఓ పార్క్లో సాయంత్రం పూట సరదాగా ఫుట్ బాల్ ఆడుకునే పిల్లలు. వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కూడా. కానీ అనుకోకుండా రాత్రికి రాత్రే పెద్ద హీరోలయ్యారు. ఢిల్లీ అంతటా శబాష్ యువత అనిపించుకుంటున్నారు. ఓ విదేశీయురాలిని రక్షించడమే వారికి హీరోలు అనే బిరుదును ఇచ్చేలా చేసింది. గత ఆగస్టులో ఢిల్లీలో ఓ రాత్రి పూట ఓ విదేశీయురాలు నడుచుకుంటూ వెళుతోంది. రోడ్డుకు ఇరువైపుల కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అనూహ్యంగా ఓ యువకుడు కొంత దూరం ఆమెను అనుసరించి చుట్టూ ఎవరూ లేరనుకోని ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగాడు.

ఆమె సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించే క్రమంలో పిడిగుద్దులు గుప్పించాడు. దీంతో ఆ మహిళ రక్షించండంటూ కేకలు పెట్టింది. ఈ కేకలు విన్న కుర్రాళ్లు వెంటనే ఫెన్సింగ్ గోడ దూకి వచ్చారు. వారు వస్తున్నది గమనించి ఫోన్ దొంగతనానికి ప్రయత్నించిన యువకుడు పారిపోయాడు. అయితే, అతడు దూరంగా పారిపోయినట్లు నటించి ఓ కారు వెనకాలే దాక్కున్నాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు అదే గుంపులో కలిశాడు. అయిన పసిగట్టిన యువకులు అతడిని కొట్టి బందించి పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement