
ఇషాన్ సూర్య, చదలవాడ శ్రీనివాస్, లక్ష్
‘‘నా దృష్టిలో నిర్మాతలే హీరోలు. అందుకే నా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నిర్మాతలను ఆహ్వానించాను. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాస్. లక్ష్ చదలవాడ, వేదిక దత్త జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదలవుతోంది. ‘‘ఒక పెద్ద సినిమా తీసే బడ్జెట్‌లో 25 చిన్న సినిమాలు తీయొచ్చు. అందుకే కొత్త వారితో మా బ్యానర్‌లో 15 సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాస్.