Producers
-
సినీ ప్రముఖులపై ముగిసిన ఐటీ సోదాలు
-
ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం ముగిశాయి. మూడురోజుల పాటు సాగిన తనిఖీల్లో భాగంగా.. పన్నుల చెల్లింపులు, బ్యాంకు లావాదేవీల వివరాలు, చిత్ర నిర్మాణంలో పలురకాల చెల్లింపులు, సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం..ఇలా అనేక అంశాలపై అధికారులు ఆరా తీశారు. భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను ఈ సందర్భంగా గుర్తించినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్‌్కలు, ఆడిట్ రిపోర్టులు స్వా«దీనం చేసుకున్న అధికారులు.. వీటి ఆధారంగా పలువురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్టు సమాచారం. భారీ చిత్రాల నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా.. ఇటీవల విడుదలైన భారీ తెలుగు చిత్రాలను నిర్మించిన సంస్థలు, వాటి నిర్మాతలు, ఫైనాన్షియర్లే లక్ష్యంగా పలు బృందాలు సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి దాడులు ప్రారంభం కాగా.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ, భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మొదటి రోజు సోదాల్లో దిల్‌రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేక ర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో స్వా«దీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఆధారంగా..బుధవారం ఉద యం నుంచి పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంత మంది డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టారు. గురువారం సైతం సుకుమార్‌తో పాటు మరో బడా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒకపక్క సోదా లు సాగుతుండగానే దిల్‌రాజు తల్లి అస్వస్థతకు గురికావడంతో ఐటీ అధికారుల వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. -
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్‌లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వరద బాధితులకు సహాయం ప్రకటించిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
-
ఆరోపణలు నిజమైతే ఐదేళ్లు బహిష్కరణ
నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమా కమిటీ ప్రభావం ఇతర ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నటీమణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం చెన్నైలోని ఆ సంఘం నిర్వాహకుల సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. ఇందులో ముఖ్యంగా విశాఖ కమిటీ సూచనల మేరకు నటీమణుల రక్షణ కోసం ఎస్ఐఏఏ–జీఎస్ఐసీసీ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీనికి నటి రోహిణి అధ్యక్షురాలిగానూ, నటీమణులు సుహాసిని, ఖుష్బూ సభ్యులుగానూ వ్యవహరిస్తారు. ఈ కమిటీకి ఒక న్యాయవాదిని నియమించనున్నారు. నటీమణులపై లైంగిక వేధింపులు రుజువైతే అందుకు కారణమైన వారిని సినిమాల నుంచి 5 ఏళ్లు బహిష్కరించాలని నిర్మాతల మండలికి సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా బాధిత నటీమణులకు చట్టపరంగా సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. అలాగే బాధితుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశామనీ, తాజాగా ఈమెయిల్ ద్వారానూ ఫిర్యాదులు చేయవచ్చనీ తీర్మానం చేశారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ కారణంగా బాధితులైనవారు సైబర్ ΄ోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ కమిటీ వారికి సహకరిస్తుందని, కమిటీ చర్యలను నటీనటుల సంఘం పర్యవేక్షిస్తుందని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు నాజర్, ఉ΄ాద్యక్షుడు పూచి మురుగన్, కోశాధికారి కార్తీ ΄ాల్గొన్నారు. -
నిర్మాతల మండలి ఏకపక్ష నిర్ణయం సరికాదు: నడిగర్ సంఘం
తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నిర్మాతల మండలి, యాక్టీవ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కలిసి నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ ప్రకటనలో వెల్లడించారు.ముఖ్యంగా నటీనటులు ముందుగా నటించడానికి అంగీకరించి, అడ్వాన్స్ లు తీసుకున్న చిత్రాల్లోనే నటించాలని, అదే విధంగా నటీనటులపారితోషికం, నిర్మాణ వ్యయం వంటి విషయాల గురించి నూతన విధి విధానాలను నిర్ణయించే వరకూ నవంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపి వేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆగస్ట్ 16 తర్వాత కొత్త చిత్రాల ఆరంభానికి అనుమతి లేదని కూడా నిర్మాతల సంఘం పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్‌లను అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని తీర్మానం చేసింది.అలాగే నటుడు ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారనీ, అందువల్ల ఆయనతో కొత్త చిత్రాలను నిర్మించే నిర్మా తలు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో చర్చించాకే ఆ సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టాలనే తీర్మానం చేశారు. కాగా నిర్మాతల మండలి తీర్మానాలపై నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సారాంశం ఈ విధంగా...తమిళ నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో నటీనటులకు సంబంధించిన తీర్మానాలు, నటుడు ధనుష్‌కు సంబంధించిన తీర్మానం తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని నటీనటుల సంఘం పేర్కొంది. ధనుష్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అకస్మాత్తుగా అతనిపై నిషేధం విధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని కూడా ఆ ప్రకటనలో ఉంది.సమస్యను తమతో చర్చించకుండా తీర్మానించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. రెండు సంఘాలూ కలిసి మాట్లాడుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఏక పక్షంగా నిర్ణయించి, పత్రికా ప్రకటనలా ఇవ్వడం సరి కాదని కూడా నటీనటుల సంఘం అభిప్రాయపడింది. తమిళ సినీ సంఘాల్లో ముఖ్యమైన నటీ నటీనటుల సంఘం నిర్వాహకులను సంప్రదించకుండా వేలాది మంది నటీనటులు, కార్మికుల జీవితాలను బాధించే విధంగా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తాము విడుదల చేసిన నోట్లో నటీనటుల సంఘం పేర్కొంది.ఈ ఏక పక్ష తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గంతో చర్చించి తగిన చర్యలు గురించి వెల్లడించడం జరుగుతుందని పేర్కొంది. – సాక్షి, చెన్నైనిర్మాతల మండలి తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కార్తీనటీనటుల సంఘం కోశాధికారి, నటుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతల మండలి ఏక పక్షంగా చేసిన తీర్మాలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా నటుడు ధనుష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు.నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లను సంపద్రించాకే పత్రికా ప్రకటన విడుదల చేశామని కూడా కార్తీ పేర్కొన్నారు. అదే విధంగా నడిగర్ సంఘాన్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తున్నట్లు నటీనటుల సంఘం ఉపాధ్యక్షుల్లో ఒకరైన కరుణాస్ కూడా పేర్కొన్నారు. -
'ఆ రోజు నుంచి షూటింగ్‌లు బంద్'.. నిర్మాతల మండలి కీలక నిర్ణయం
తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు వెల్లడించింది. స్టార్ హీరోలు నటించే ఏ సినిమాలైనా రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించింది. ఆగస్టు 16వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగ్ ప్రారంభించవద్దని సూచించింది.అంతే కాకుండా ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న సినిమాలన్నీ అక్టోబరు 31వ తేదీలోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ సమావేశంలో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు ఫిల్మ్ డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు..అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి.ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి.నటుడు ధనుష్ విషయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయనకు వివిధ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు వెళ్లాయి. వారందరూ నిర్మాతల అసోసియేషన్‌తో మాట్లాడి తమ పనులు మొదలు పెట్టాలి. కొత్త సినిమాల పనిని ప్రారంభించే ముందు నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు తెలియజేయాలి.అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరక్క నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి అసోసియేషన్ కొత్త నిబంధనలను ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల షూటింగ్‌లు ప్రారంభించకూడదు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలు అక్టోబర్ 31 నాటికి పూర్తి కావాలి. నిర్మాణ సంస్థలు ఈ సినిమా షూటింగ్ వివరాలను తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు అందించాలి.నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే నవంబర్ 1 నుంచి తమిళ సినిమాకు సంబంధించిన అన్ని రకాల షూటింగ్‌లను నిలిపివేయాలని మండలి ప్రతిపాదించింది.చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
టాలీవుడ్ నిర్మాతలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ (ఫోటోలు)
-
పవన్‌తో భేటీ కానున్న టాలీవుడ్ నిర్మాతలు.. అది అసలు విషయం
తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలవనున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్‌ని కోరబోతున్నారు.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే?)కొత్త రిలీజయ్యే సినిమా టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు లాంటి విషయాలని సదరు నిర్మాతలు పవన్ కల్యాణ్‌తో చర్చించనున్నారు. ఈ భేటీకి వెళ్లేవారిలో అశ్వనీ దత్, చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, వివేక్, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.(ఇదీ చదవండి: అలాంటివాటిని పట్టించుకోరు కానీ.. మాపై పడి ఏడుస్తారు: అనసూయ కౌంటర్) -
నిజాలు తెలుసుకుని రాయండి: దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
సంక్రాంతికి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై సినిమాల రిలీజ్‌పై తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా లో వస్తున్న ఆర్టికల్స్‌తో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని రాయండని దిల్ రాజు కోరారు. ముఖ్యంగా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నందుకు రవితేజకు కృతజ్ఞతలు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ..'సోషల్ మీడియాలో వచ్చే వార్తలతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది. దయచేసి నిజాలు తెలుసుకొని రాయండి. సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో చర్చించాం. ఒక సినిమా వెనక్కి తగ్గితే ఏదో జరిగినట్టు కాదు. గతేడాది మూడు సినిమాలకే రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు 5 సినిమాలు పోటీలో ఉన్నాయి. మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా రవితేజ, పీపుల్స్ మీడియా వారికి మా కృతజ్ఞతలు. ఇదొక మంచి పరిణామం' అని అన్నారు. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ..' సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. 15 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి గ్రౌండ్ రియాలిటీ చెప్పాం. నిర్మాతలు సహకరిస్తున్నారు. రవితేజ ఈగల్ సినిమా నిర్మాతలకు థాంక్స్' అని అన్నారు. కాగా.. సంక్రాంతి రేసులో మహేశ్ బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, ప్రశాంత వర్మ హనుమాన్, నాగార్జున మూవీ నాసామిరంగ రిలీజ్ కానున్నాయి. రవితేజ పోటీ నుంచి తప్పుకోవడంతో నాలుగు చిత్రాలు బరిలో నిలిచాయి. -
టికెట్ల ధర పెంచాలని కోరిన భోళా శంకర్ నిర్మాతలు
-
హాయిగా నవ్వుకుంటారు
‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ వినోదాత్మక చిత్రం. మూఢ నమ్మకాలపై సెటైర్లా ఉండే ఈ కథ కొత్తగా అనిపించింది.. అందుకే నిర్మించాం. మా సినిమా చూసి ప్రేక్షకులు రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు’’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ నెల 29న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ– ‘‘వ్యాపారరీత్యా అమెరికా వెళ్లాం. అక్కడ 2016లో ఓ హాలీవుడ్ మూవీ నిర్మించాం. 2017కి ఇండియా వచ్చి, తెలుగులో మొదటి సినిమాగా ‘జార్జ్ రెడ్డి’ నిర్మించాం. ఏఆర్ శ్రీధర్ చెప్పిన కథ నచ్చడంతో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ తీశాం. మా బ్యానర్లో నిర్మించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఆగస్టు 18న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి -
స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!
కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా కిచ్చా సుదీప్‌పై కొందరు నిర్మాతలు తీవ్ర విమర్శలు చేశారు. తమ వద్ద రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేయలేదని ఆరోపించారు. దీంతో ఈ వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా') దీంతో తనపై కామెంట్స్ చేసిన నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్‌లపై కిచ్చా సుదీప్ మండిపడ్డారు. అంతేకాకుండా వారిద్దరిపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు నిర్మాతలపై కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుదీప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు వివాదం ఏంటి? ఒక సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుని ఎగ్గొట్టాడని నిర్మాత ఎంఎన్ కుమార్ ఆరోపించారు. ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి అంగీకరించి.. ఇప్పటి వరకు తనకు డేట్స్ కేటాయించలేదని నిర్మాత పేర్కొన్నారు. కోటిగొబ్బ -3, విక్రాంత్ రోనా చిత్రాల తర్వాత తన సినిమా పని ప్రారంభిస్తానని హామీ ఇచ్చాడని.. కానీ సుదీప్ వద్దకు వెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినా స్పందన రాలేదని ఆరోపించారు. ఈ చిత్రానికి ముత్తట్టి సత్యరాజు అనే టైటిల్‌ను నమోదు చేశానని.. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే ధర్నా చేస్తానని ఎంఎన్ కుమార్ ప్రకటించారు. కాగా.. కిచ్చా సుదీప్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు విజయ్ కార్తికేయతో చేయనున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా కిచ్చా46 అని టైటిల్ పెట్టగా.. కలైపులి ఎస్ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) -
ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న రీ రిలీజ్ మూవీస్ ధ్వంసం అవుతున్న ధీయేటర్లు
-
సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు: బెక్కెం వేణుగోపాల్
‘‘ప్రస్తుతం తెలుగులో కథ కంటే కాంబినేషన్‌ని నమ్ముకుని ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దానివల్ల సినిమా సూపర్ హిట్టయినా లాభాలు రావడం లేదు. కాంబినేషన్‌ని నమ్ముకుని పారితోషికాలు పెంచడం వల్ల బడ్జెట్ ఊహించని స్థాయికి చేరుకుంటోంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. నేడు(ఏప్రిల్ 27) బెక్కెం వేణుగోపాల్ బర్త్ డే. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ‘‘2006 అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ విడుదలైంది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాను. ఈ 16 ఏళ్లల్లో సొంతంగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్ సినిమాలు తీసేందుకు రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఇక నిర్మాతలను మించిన నటులు ఎవరూ ఉండరు. అప్పుడప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటికి మాత్రం శాంతంగా ఉండాల్సిన పరిస్థితి. భవిష్యత్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటించాలనుంది. కానీ, దర్శకత్వ ఆలోచన లేదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో ‘రోటి కపడా రొమాన్స్’, సుడిగాలి సుధీర్‌తో నరేష్ దర్శకత్వంలో నిర్మాత చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మరో మూవీ చేస్తున్నాను. అవికా గోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓటీటీ కోసం ఓ మూవీ నిర్మిస్తున్నాను’’ అన్నారు. -
ప్రభాస్,ఎన్టీఆర్,చరణ్,బన్నీ వెనుక పడుతున్నబాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్
-
Sakshi 15th Anniversary: సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
‘సాక్షి’ ప్రారంభమై పదిహేనేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ప్రారంభ వేడుకకి మొన్న మొన్నే వెళ్లినట్లుగా అనిపిస్తోంది. ఆ వేడుక ఇంకా గుర్తుంది. ‘సాక్షి’కి నా ప్రత్యేక అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘సాక్షి’ దినపత్రిక ఆరంభమై నేటితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా బ్రహ్మండంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిడ్డి. ‘‘సాక్షి’ ఇలాంటి విజయవంతమైన వసంతాలను ఎన్నో చూడాలి’’ అన్నారు కన్నడ హీరో శివరాజ్‌కుమార్. ‘సాక్షి’ పదిహేనేళ్లు పూర్తి చేసుకుని, పదహారో ఏడాదిలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు’’ అన్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ‘‘తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వాస్తవాలను అందించాలని, స్ఫూర్తినిచ్చే వార్తలు ఇవ్వాలనే ప్రజాసంకల్పాన్ని ధ్యేయంగా చేసుకుని అందులో విజయం సాధిస్తూ, ప్రతి ఏడాది ప్రజలకు మరింత చేరువవుతున్నందుకు అభినందనలు’’ అన్నారు నిర్మాత కె.అచ్చిరెడ్డి. ఇంకా హీరోలు ‘అల్లరి’ నరేశ్, అది సాయికుమార్, కార్తికేయ, విశ్వక్ సేన్, కిరణ్ అబ్బవరం, నటులు తనికెళ్ల భరణి, సుమన్, సాయికుమార్, ‘సీనియర్’ నరేశ్, అలీ, దర్శకులు కృష్ణవంశీ, బి.గోపాల్, నందినీ రెడ్డి, నిర్మాతలు సి.కల్యాణ్, ‘దిల్’ రాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, రచయిత, నిర్మాత కోన వెంకట్ తదితరులు ‘సాక్షి’కి శుభాకాంక్షలు తెలిపి, మరిన్ని విజయవంతమైన వసంతాలను చూడాలని ఆకాంక్షించారు. -
ఆ మాఫియా వల్ల సినీపరిశ్రమ నాశనమవుతోంది
‘‘నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులు ఉన్నారు. కానీప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో 27 మంది సభ్యులు ఉన్నారు.ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాఫియాగా మారింది. గుత్తాధిపత్యం వల్ల పరిశ్రమ నాశనమవుతోంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ ఆరోపణలు చేశారు. నేడు నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షడు సి. కల్యాణ్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ – ‘‘అందరూ ఒకే తాటిపై ఉండాలని ఆరంభం అయిన ఆర్గనైజేషన్ చిన్నగా ఎల్ఎల్పీగా మారి అది కాస్తా ‘గిల్డ్’గా మారింది. గిల్డ్ ఏంటి?ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏంటి? రెండింటినీ కలిపేయొచ్చు కదా అని చాలామంది అంటున్నారు. కలపడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. ఇక్కడంతా మోనోపలి అయ్యింది. వారే హీరోలు, వారే డిస్ట్రిబ్యూటర్స్, వారివే థియేటర్స్.. ఇలా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కల్యాణ్ లీడ్ చేస్తే మంచే జరుగుతుంది అనే నమ్మకం కలిగితే మా ఫ్యానల్‌కు ఓటు వెయ్యండి’’ అన్నారు. కాగా ఈ ఎన్నికల్లో కల్యాణ్ పోటీపడటంలేదు. నిర్మాతల మండలి తరఫున అధ్యక్ష పదవికి పి. కిరణ్ పోటీలో ఉన్నారు.ఈ ఎన్నికలపై ‘దిల్’ రాజు స్పందిస్తూ – ‘‘ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న నిర్మాతలు ఉన్న ప్రోగ్రెసివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్’ని గెలిపించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ ఫ్యానెల్ తరఫున అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. -
దిల్రాజును ట్రోల్ చేసిన ప్రముఖ నిర్మాత.. వీడియో వైరల్
ఈమధ్యకాలంలో సోషల్‌మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఏది ఎప్పుడు, ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు ఊహించలేం. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా ట్రోల్స్ బారిన పడుతుంటారు. ఇటీవలి కాలంలో దిల్‌రాజు పేరు నెట్టింట బాగా వైరల్ అయ్యింది. వారీసు ప్రీరిలీజ్ ఈవెంట్లో తమిళం, ఇంగ్లీష్ కలిపి ఆయన మాట్లాడిన తీరు ఎంతలా ట్రోల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మీమ్స్, ట్రోల్స్ సహా చివరికి రివ్యూలు కూడా దిల్‌రాజు స్టైల్లో చెప్పి నెట్టింట తెగ హడావిడి చేశారు. తాజాగా నిర్మాత ఎస్కేఎన్ కూడా దిల్రాజును ఇమిటేట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన స్పీచ్ చివర్లో.. ఈ సినిమాలో కామెడీ ఇరిక్కు ఫైట్స్ ఇరిక్కు స్టొరీ ఇరిక్కు.. అంటూ దిల్రాజును ఇమిటేట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Swaggg Starrrrr @SKNonline 🔥 Total auditorium maamulu response kaadu pic.twitter.com/kIgO47vOqP — AYYAPPA REDDY (@lucky59000) January 20, 2023 -
తెలుగు నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం రసాభాస
-
నిర్మాణ రంగంలో రాణిస్తున్న లేడీ ప్రొడ్యూసర్స్, ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చింది వీరే
అమ్మాయిలంటే సిల్వర్ స్క్రీన్‌పై మెరవడానికే.. స్క్రీన్ వెనక టెక్నీషియన్స్గానో, సినిమాలకు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌గా సూట్ అవ్వరనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. అందుకే ఈ రెండు విభాగాల్లో తక్కువమంది ఉంటారు. అయితే రోజులు మారుతున్నాయి. మహిళా సాంకేతిక నిపుణులు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య పెరిగింది. అరడజను మందికి పైగా ఈ ఏడాది నిర్మాతలుగా పరిచయం కావడం ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పువచ్చు. ఇక ఈ ఏడాది ఫిలిం మేకింగ్ (నిర్మాణం)లోకి వచ్చిన మేడమ్స్ గురించి తెలుసుకుందాం. దివంగత ప్రముఖ నటులు, నిర్మాత కృష్ణంరాజు పెద్ద కుమార్తె సాయి ప్రసీద ‘రాధేశ్యామ్’ సినిమాతో ఈ ఏడాది నిర్మాతగా పరిచయం అయ్యారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. వంశీ, ప్రమోద్ (యూవీ క్రియేషన్స్)లతో కలిసి ప్రసీద (గోపీకృష్ణా మూవీస్) ఈ సినిమా నిర్మించారు. నిర్మాణరంగంలోకి అడుగు పెట్టక ముందు విదేశాల్లో ప్రసీద ప్రొడక్షన్ కోర్స్‌లో చేశారు. మరోవైపు దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దివ్య దీప్తి నిర్మించిన తొలి చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, సంజన జంటగా నటించారు. తండ్రి దర్శకత్వం వహించిన చిత్రాల షూటింగ్‌లకు దివ్య వెళ్లేవారు. అలా ఫిలిం మేకింగ్‌పై అవగాహన పెంచుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ నిర్మాతగా మారారు. సమంత టైటిల్ రోల్ చేసిన ‘శాకుంతలం’ సినిమాకు నీలిమ ఓ నిర్మాత. ఈ ఏడాది నవంబరులో విడుదల కావాల్సిన ఈ పీరియాడికల్ ఫిల్మ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఇక నిర్మాణరంగంలో ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రాలకు (సిరి సిరి మువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం..) పదికిపైగా జాతీయ అవార్డులు వచ్చాయి. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు. శ్రీజ ఎంటర్టైన్మెంట్స్పై రూపొందిన ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా నటించారు. కాగా ప్రస్తుతం తెలుగులో ఉన్న అగ్ర నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. ఆయన కుమార్తె హన్షిత రెడ్డి నిర్మాణరంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లో ‘ఏటీఎమ్’ అనే వెబ్ సిరీస్ కూడా ఆరంభమైంది. ఈ సిరీస్‌కు దర్శకుడు హరీష్ శంకర్ కథ ఇచ్చారు. బిగ్‌బాస్ ఫేమ్ వీజే సన్నీ, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్‌కి హన్షిత రెడ్డి ఓ నిర్మాతగా ఉన్నారు. యాక్షన్ టు ప్రొడక్షన్ హీరోయిన్లు కూడా నిర్మాతలుగా మారు తుంటారు. హీరోయిన్ మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ నిర్మాతగా మారారు. రాహుల్ విజయ్, మేఘా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మాటే మంత్రము’ చిత్రానికి బిందు ఆకాష్ ఓ నిర్మాతగా ఉన్నారు. పేరు తల్లిది అయినప్పటికీ కూతురు మేఘా ఆకాష్ సపోర్ట్‌తోనే బిందు నిర్మాత అయ్యుంటారని ఊహించవచ్చు. ఇక మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మి ‘గార్గి’ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయం అయ్యారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే టాప్ హీరోయిన్ కీర్తీ సురేష్ త్వరలో ఓ ప్రొడక్షన్ హౌస్ ఆరంభించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలోనూ.. బాలీవుడ్‌లోనూ ఈ ఏడాది లేడీ నిర్మాతల జాబితాలో కొందరు హీరోయిన్ల పేర్లు చేరాయి. హన్సల్ మెహతా తెరకెక్కించనున్న ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లో నటించి, నిర్మించనున్నారు కరీనా కపూర్. ఏక్తా కపూర్‌తో కలిసి ఆమె ఈ సినిమా నిర్మించనున్నారు. ఇక షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఆలియా భట్ ‘డార్లింగ్స్’ అనే సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ఆలియా నటించారు కూడా. హీరోయిన్ కృతీ కుల్హారి కూడా ‘నాయిక’ అనే సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇలా నిర్మాణ రంగంలోనూ స్త్రీ శక్తి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. -
కోవిడ్‌లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: సిటీ నటి జీవితను టార్గెట్ చేసి, ఆమె మేనేజర్ నుంచి రూ.1.25 లక్షలు కాజేసి, కటకటాల్లోకి చేరిన చెన్నై వాసి టిక్కిశెట్టి నాగేంద్రబాబుకు (29) ఘనమైన నేరచరిత్రే ఉంది. కోవిడ్ సీజన్లోనూ ఇతగాడు తనదైన పంథాలో, సమకాలీన అవసరాలకు అనువుగా మార్చుకుని రెచ్చిపోయాడని బయటపడింది. ఇతడి తాజా నేరాల చిట్టా బయటపడడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేంద్రబాబు స్వస్థలం విజయవాడ. ఇతగాడు 2016 నుంచి మోసాలు చేయడం మొదలెట్టాడు. అప్పట్లో ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు దండుకున్నాడు. ఈ మోసాలకు సంబంధించి ఇతడిపై విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు మకాం మార్చిన నాగేంద్ర అక్కడి లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్‌గా పని చేశాడు. కోవిడ్–19 వ్యాక్సిన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో వాటికి ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకున్నాడు. ఇతగాడు తొలుత తాను టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్లను వివిధ మార్గాల్లో సేకరించే వాడు. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా అనేక మందికి ఫోన్లు చేశాడు. ప్రముఖ హాస్యనటుడు, ప్రముఖ నిర్మాతలకు ఫోన్లు చేశాడు. వారితో పాటు వారివద్ద పని చేసే వారికీ వ్యాక్సిన్లు వేస్తానంటూ రూ.లక్ష చొప్పున తీసుకుని మోసం చేశాడు. ఓ టెలివిజన్ ఛానెల్‌ను ఇలానే టార్గెట్ చేసిన నాగేంద్ర వారితో ఏకంగా తాను మంత్రి కేటీఆర్ సన్నిహితుడినంటూ చెప్పుకుని రూ.1.5 లక్షలు వసూలు చేశాడు. ఓ యువ నిర్మాతకు మీడియా అవార్డు ఇప్పిస్తానంటూ చెప్పి ఆమె నుంచి రూ.3.5 లక్షలు కాజేశాడు. ఈ నేరాలకు సంబంధించి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సైబరాబాద్ రాయదుర్గం తదితర ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చినా తన పంథా మార్చుకోకుండా కొనసాగిస్తున్నాడు. -
తెలుగులో కొత్త కథలు లేవా..? పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా..?
-
కోలీవుడ్‌లో సోదాల కలకలం
న్యూఢిల్లీ: పలువురు తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిందని, ఈ సోదాల్లో రూ.200 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరు తదితర నగరాల్లో దాదాపు 40 చోట్ట సోదాలు జరిపినట్లు పేర్కొంది. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతోపాటు రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది. బహిర్గతం చేయని నగదు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమిళ నిర్మాతలు కలైపులి ఎస్.థాను, అన్బుసెళియన్, ఎస్ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా తదితరులు కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సదరు నిర్మాతలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అధికారులు గుర్తించారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, ఆ సొమ్మును లెక్కల్లో చూపలేదని అధికారులు తేల్చారు. -
అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్..!
Tollywood Movies Shooting Close From August 1: ఆగస్టు 1నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిపివేయాలని సినీ అగ్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అవసరమైతే రెండు, మూడు నెలలు చిత్రీకరణ బంద్ చేద్దామని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలతో గతకొద్దిరోజులుగా నిర్మాతలందరూ ఈ వ్యవహారంపై చర్చిస్తున్నారు. మరోవైపు థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంపైనా నిర్మాతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ సినిమా చిత్రీకరణ నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కొవిడ్ తర్వాత థియేటర్‌కు వచ్చే ఆడియెన్స్ సంఖ్య భారీగా తగ్గింది. దీంతో టాలీవుడ్ భారీ నష్టాలను చవిచూసింది. వేసవిలో పెద్ద సినిమాలు సందడి చేయడంతో కాస్త కోలుకున్నట్లు అనిపించినా, తాజాగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొద్ది రోజులపాటు షూటింగ్‌లు ఆపేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చివరి దశ షూటింగ్ ఉన్న చిత్రాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి, ఆగస్టు 1 నుంచి అన్ని సినిమాల చిత్రీకరణను నిలిపివేయాలని చూస్తున్నారు. నిర్మాణ వ్యయం, ఓటీటీలు తదితర సమస్యలపై చర్చించిన తర్వాతే షూటింగ్‌లకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చదవండి: బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. వీడియో వైరల్ స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ ఈ విషయంపై త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓటీటీలో రిలీజయ్యే సినిమాల విషయంలో సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. జులై 1 నుంచి 50 రోజుల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు 10 వారాలకు పొడిగించాలని భావిస్తున్నారట. ఈ విషయాలన్నింటిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. ఆయన మాకు గురువులాంటివారు: పూజా హెగ్డే -
నా దృష్టిలో నిర్మాతలే హీరోలు
‘‘నా దృష్టిలో నిర్మాతలే హీరోలు. అందుకే నా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నిర్మాతలను ఆహ్వానించాను. ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాస్. లక్ష్ చదలవాడ, వేదిక దత్త జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రేపు విడుదలవుతోంది. ‘‘ఒక పెద్ద సినిమా తీసే బడ్జెట్లో 25 చిన్న సినిమాలు తీయొచ్చు. అందుకే కొత్త వారితో మా బ్యానర్లో 15 సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు చదలవాడ శ్రీనివాస్. -
పూజాకు నిర్మాతలు షాక్, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!
ప్రస్తుతం సౌత్‌లో పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్ హీరో అందరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ పూజా బిజీగా మారింది. అయితే ఇటీవల పూజా నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్‌లు ఫ్లాప్ అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలు పరాజయం కావడానికి పూజా హెగ్డేనే కారణమని, ఆమెది ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఓ బడా నిర్మాత పూజాకు షాకిచ్చినట్టు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బీస్ట్ మూవీ షూటింగ్ సమయంలో పూజా హెగ్డే స్టాఫ్‌కు సంబందించిన ఖర్చులు భారీగా వచ్చాయట. కేవలం వీరి ఫుడ్ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. రీసెంట్గా వీటికి సంబంధించిన బిల్లులు బీస్ట్ నిర్మాతలకు అందాయట. ఇక ఆ బిల్లు చూసిన నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారని వినికిడి. పూజా స్టాఫ్ ఫుడ్‌కు, మెయింటెన్స్‌కు అయిన బిల్లు చూసి నిర్మాతలు ఒక్కసారిగా చుక్కలు చూశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీస్ట్ మూవీ డిజాస్టర్‌తో భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజా, ఆమె స్టాఫ్‌కు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట. దీంతో ఈ బిల్లులతో తమకు సంబంధం లేదని, తన స్టాఫ్‌కు అయిన ఖర్చులను ఆమె భరించాలంటూ నిర్మాతలు ఆ బిల్లును పూజాకు పంపినట్లు సమాచారం. ఇక సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూజా కూడా దీనిపై నోరు విప్పకుండ ఆ బిల్లును తానే కట్టాలని నిర్ణయించుందని సినీవర్గాల నుంచి సమాచారం. అయితే అ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. మరి దీనిపై పూజా, బీస్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే గతంలో పూజా నిర్మాతలకు మరింత భారమయ్యాలే వ్యవహరిస్తుందని ఓ దర్శకుడు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రమే కాకుండా తన స్టాఫ్‌ని సైతం షూటింగ్‌కు తీసుకువస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారమే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. -
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని సీనియర్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(మే 30) దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్మరించుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు. చదవండి: అదిరిపోయిన అనన్య, విజయ్ హుక్ స్టెప్, వీడియో చూశారా? ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరిగారు ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారని గుర్తు చేశారు. ‘ముఖ్యంగా ఆయన బయ్యర్స్ గురించి ఆలోచించేవారు. ఒక సినిమా ప్లాప్ అయితే తర్వాత సినిమాను ఫ్రీగా చేసి బయ్యర్స్‌ను కాపాడేవారు. కానీ ప్రస్తుత నిర్మాతలు బయ్యర్స్ గురించి ఆలోచించడం లేదు. మేకర్స్ వల్ల బయ్యర్స్ నష్టపోతున్నారు. వారి తీరుతో బయ్యర్స్ సంతోషంగా ఉండటం లేదు. కోట్టకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో బయ్యర్స్ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్ అయితే నష్టపోయేది వారే. అసలు బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరు. సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలు లేదు. నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్ ఉన్నారు. ఇది నేను ఆవేశంతో మాట్టాడుతున్నాను అనుకున్నా.. ఇది మాత్రం నిజం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో సుమన్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. -
హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు
చెన్నై సినిమా: కోలీవుడ్ హీరో విమల్ చీటింగ్ చేశారంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మన్నన్ వగైయారా. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి తనను మోసం చేశారని విమల్‌పై నిర్మాత గోపి గత వారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్ కూడా కంప్లైట్ ఇచ్చారు. తాజాగా మరో నిర్మాత గణేశన్ కూతురు హేమ మంగళవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో నటుడు విమల్ పై రూ. 1.74 కోట్లు మోసానికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. అందులో తిరుప్పూర్‌కు చెందిన తమ కుటుంబం మాంసం విక్రయం వృత్తి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఎదిగిందని పేర్కొన్నారు. కాగా సినిమా అంటే వ్యామోహం కలిగిన తన తండ్రి గణేశన్.. విమల్ హీరోగా మన్నర్ వగైయారా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నారు. అలా ప్రారంభమైన చిత్ర షూటింగ్ హీరో హీరోయిన్ల మధ్య విభేదాల కారణంగా నిలిచిపోవడంతో ప్రొడక్షన్ ఖర్చు పెరిగిందన్నారు. దీంతో తన తండ్రి చిత్ర నిర్మాణం నిలిపేసి ఊరికి తిరిగొచ్చేశారని, ఆ తరువాత విమల్ తమ తండ్రిని కలిసి చిత్రాన్ని తానే నిర్మిస్తానని, మీ పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ రాశారన్నారు. అయినా తమ డబ్బు చెల్లించకపోవడంతో తాము చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దీంతో విమల్ తమను కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని, పిటిషన్‌ను వాపస్ తీసుకోమని కోరారన్నారు. చిత్రం విడుదలైనా తమకు నగదు చెల్లించకపోగా చిత్ర తెలుగు అనువాద హక్కులను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయనపై తగిన చర్యలు తీసుకుని తమ రూ.1.74 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: చరణ్ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1631343214.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు..
Pushpa Movie Producers Press Meet On Movie Success: ‘‘పుష్ప: ది రైజ్’ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది.. కానీ ఇంత పెద్ద హిట్ సాధిస్తుందని ఊహించలేదు. బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నవీన్, రవిశంకర్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు రూ. 173 కోట్ల గ్రాస్, రూ. 85 కోట్ల షేర్ సాధించింది’’ అని తెలిపారు. ‘‘పుష్ప’ విడుదల తర్వాత ఇక్కడ హాలీవుడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్’కి థియేటర్స్ తగ్గాయంటే మా సినిమా క్రేజ్ ఏంటో తెలుస్తోంది’’ అన్నారు సీఈఓ చెర్రీ. ‘‘పుష్ప’లో భాగం కావడం గర్వంగా ఉంది’’ అన్నారు కెమెరామ్యాన్ మిరోస్లా క్యూబా. 'పుష్ప' సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 173 కోట్ల వసూళ్లు సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది. ఆదివారం (డిసెంబర్ 19) భారీ కలెక్షన్లతో దుమ్ములేపిన పుష్పరాజ్ 2021 సంవత్సరంలో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచాడు. పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేసింది 'పుష్ప'. ఈ సినిమా సెకండ్ పార్ట్ 'పుష్ప: ది రూల్' షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: 2021లో దేశంలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా 'పుష్ప'.. 3 రోజుల్లోనే.. -
లక్ష్య కథ వినగానే భయపడ్డాను: నిర్మాత
నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘లక్ష్య’. ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా లక్ష్య విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► లవ్ స్టోరీ సినిమా మాకు మంచి విజయాన్ని అందించింది. కమర్షియల్గానూ పెద్ద సక్సెస్ అయింది. శేఖర్ కమ్ముల గారు మాకు ఒక మంచి సినిమాను ఇచ్చారు. ఆ సమయంలో మాకు వచ్చిన మొత్తం చాలా ఎక్కువే. వారం వారం సినిమాలు మారుతుంటాయి. ఈ వారం లక్ష్య సినిమా రాబోతోంది. ఆర్చరీ బేస్డ్ సినిమాలు ఇంత వరకు రాలేదు. ఆ పాయింట్ అందరినీ ఆకట్టుకుంది. ► మొదట ఈ కథ విన్నప్పుడు కొద్దిగా భయపడ్డాను. కానీ పూర్తిగా కథ విన్నాక చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఆటతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కథ విన్నవెంటనే నాగ శౌర్యకు పంపించాం. అతను విన్న వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ తరువాత నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ శరత్ మరార్తో కలిసి నిర్మించాం. ► రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లు, ఓవర్సీస్లో 100 థియేటర్లలో లక్ష్య సినిమాను విడుదల చేయబోతోన్నాం. ► అఖండ సినిమా పెద్ద సక్సెస్ అయింది. అది మాకు సంతోషంగా అనిపించింది. అసలు థియేటర్లకు జనాలు వస్తారా? లేరా? అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ భయాలన్నీ పోయాయి. రెండేళ్ల క్రితమే శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మేశాం. ఫిల్మ్ బాగుంటే జనాలు వస్తారు అని తెలిసింది. ఇప్పుడు మేం థియేటర్ రెవిన్యూ మీద ఆధారపడ్డాం. ► సినిమాలు చిన్నవి పెద్దవి అని కాదు. పెద్ద సినిమా అయినా బాగా లేకపోతే ఎవ్వరూ చూడటం లేదు. అదే జాతి రత్నాలు లాంటి చిన్న సినిమా బాగుంది. యాభై కోట్లు కలెక్ట్ చేసింది. ► ఆన్ లైన్ టికెటింగ్ అనేది మంచిదే. దానిపై ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే టికెట్ రేట్లు ఇబ్బందిగా ఉంది. తెలంగాణలో రేట్లు బాగున్నాయి. కానీ ఏపీలో పరిస్థితి బాగా లేదు. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. దేశం అంతా ఒక వైపు పోతోంటే మనం ఇంకో వైపు పోలేం కదా. కచ్చితంగా రేట్లు పెంచాల్సింది. మన దగ్గర ఉన్న థియేటర్లు దేశంలో ఎక్కడా లేవు. అత్యాధునిక హంగులతో థియేటర్లను నిర్మించాం. ప్రేక్షకులు కూడా అలాంటి థియేటర్లోనే సినిమాలను చూడాలని అనుకుంటారు. ► మరీ ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా రేట్లు ఉంటేనే పరిశ్రమకు మంచిదని నా అభిప్రాయం. మరీ ఎక్కువగా ఉంటే కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. టికెట్ రేట్లను మరీ ఇంత తక్కువగా తగ్గించడంతో నిర్మాతలకు కష్టంగా మారింది. ► శేఖర్ కమ్ముల-ధనుష్, శివ కార్తికేయన్‌తో ఒక సినిమా, సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ డైరెక్షన్లో ఒక సినిమా, రంజిత్ దర్శకత్వంలో గౌతమ్ విజయ్ సేతుపతి- సందీప్ కిషన్ల కాంబినేషన్లో మరో సినిమా.. నాగార్జునతో ఓ సినిమాను చేస్తున్నాం. ఈ సినిమాకు ముందుగా కాజల్ అనుకున్నాం. కానీ ఇప్పుడు వేరే హీరోయిన్ను చూస్తున్నాం. ► లక్ష్య సినిమా క్రీడా నేపథ్యంలో రావడమే ప్లస్ పాయింట్. కేతిక శర్మ చాలా బాగా నటించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా వచ్చింది. ఆల్రెడీ లక్ష్యం అనే వచ్చిందనే ఉద్దేశ్యంతో లక్ష్య అనే టైటిల్‌ను పెట్టామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. -
మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ
-
మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ
సాక్షి, అమరావతి: సచివాలయంలో మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. సమావేశంలో దిల్ రాజు, అలంకార్ ప్రసాద్.. ఇతర నిర్మాతలు పాల్గొన్నారు. భేటీలో సినీ రంగానికి సంబంధించిన సమస్యలు, ఆన్లైన్ టికెట్ విధానంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంపై దిల్‌రాజు స్పందిస్తూ.. 'ప్రభుత్వం మా నుంచి కొంత సమాచారం అడిగింది. ఆ సమాచారం ఇవ్వడానికే మంత్రిని కలిశాము' అని నిర్మాత దిల్ రాజు తెలిపారు. -
మూవీ థియేటర్స్ అసోసియేషన్‌పై టాలీవుడ్ నిర్మాతల ఫైర్
సినిమాల విడుదలపై థియేటర్స్ అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘టక్ జగదీశ్’ ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకోవడంతో మూవీ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్మాతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎగ్జిబిటర్ల వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత దిల్ రాజు, ఠాగూర్ మధు సహా పలువురు అగ్ర నిర్మాతలతో కూడిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా థియేటర్స్ అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ తీరుపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ ఈ మేరకు నిర్మాతల గిల్డ్ స్పందిస్తూ.. సినిమా థియేటర్స్ అసోసియేషన్ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొంది. సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే ఉంటుందని, తమ సినిమా ఎక్కడ, ఎప్పుడు విడుదల చేసుకోవాలో వారి ఇష్టమని వెల్లడించింది. ఎగ్జిబిటర్లు... డిమాండ్ ఉన్న పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని, చిన్న సినిమాలను విస్మరిస్తున్నారని నిర్మాతల గిల్డ్ ఆరోపించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లందరూ కలిసి ఉంటేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమవుతుందని సూచించిన నిర్మాతల గిల్డ్... కలిసి కట్టుగా పనిచేసి తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని ప్రకటనలో కోరింది. చదవండి: Karthikeya Engagement: ఘనంగా కార్తికేయ నిశ్చితార్థం -
ట్రిబ్యునల్ రద్దుతో సినీ నిర్మాతలకు చిక్కులే
గప్‌చుప్‌గా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 4న కొన్ని అప్పిలేట్ ట్రిబ్యునళ్లను రద్దు చేసింది. అందులో సినిమా సెన్సార్ బోర్డుకు చెందిన ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఒకటి. సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరిస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్థానంలో హైకోర్టును చేర్చారు. దేశంలో ఇన్ని హైకోర్టులు ఉన్నపుడు ప్రత్యేకంగా ఒక్కో విభాగానికి మళ్ళీ ట్రిబ్యునళ్లు ఎందుకని కేంద్రం ప్రశ్న. వీటిని తొలగించడం వల్ల సత్వరన్యాయం దూరమవడంతో పాటు కోర్టు ఖర్చులు మోయవలసి వస్తుందని సినీవర్గాలు అంటున్నాయి. అప్పిలేట్ ట్రిబ్యునల్ అంటే ఒక కోర్టులాంటిదే, అయితే అది ప్రత్యేక విషయానికే పరిమితమై పనిచేస్తుంది. దేశంలో ఆదాయపు పన్ను, జీఎస్టీ, విద్యుత్తు, సైన్యం, సైబర్ నేరాలు ఇలా చాలా విభాగాలకు సొంత ట్రిబ్యునళ్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన వ్యాజ్యాలపై కోర్టుకు వెళ్లనవసరం లేదు. ట్రిబ్యునల్‌కు ఒక రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్‌గా మరి కొందరు సభ్యులు ఉంటారు. ఏ ఖర్చూ లేకుండా వారి ముందుకు వచ్చిన పిటిషన్‌కు తుది తీర్పు చెబుతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2017లో భాగంగా క్రమబద్ధీకరణ పేరిట దేశంలో ఉన్న 26 ట్రిబ్యునళ్లను 19కు కుదించింది లేదా తగ్గించింది. మళ్ళీ ఈసారి వివిధ చట్టాలను సవరిస్తూ వాటికి అనుబంధంగా ఉన్న ఐదు చిన్న కోర్టులను రద్దు చేసింది. వీటిలో సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, కస్టమ్స్ చట్టం 1962, ఎయిర్ పోర్ట్ చట్టం 1994, ట్రేడ్ మార్క్ చట్టం 1991, మొక్కల పరిరక్షణ రైతుల హక్కు చట్టం 2001 ఉన్నాయి. ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ రద్దు చేసి సెన్సార్ బోర్డుపై ఫిర్యాదు ఉంటే హైకోర్టుకు వెళ్ళమనడం పట్ల సినీ నిర్మాతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణపై కోర్టుకెళితే ఆ కేసు తేలేదెన్నడు, సినిమా విడుదల అయ్యేదెన్నడు అని తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన దేశంలో సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం 1952లో సెన్సార్ బోర్డు ఏర్పడింది. సినీ నిర్మాతలు సెన్సార్ సమస్యలను సులువుగా తేల్చుకొనేందుకు చట్టంలోని సెక్షన్ డి ప్రకారం 1983లో బోర్డుకు అనుబంధంగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. సెన్సార్ బోర్డులో మూడు వ్యవస్థలుంటాయి. మొదటిది ఐదుగురు సభ్యులుండే ఎగ్జామినింగ్ కమిటీ, చాలా సినిమాలు ఇక్కడే సర్టిఫికెట్ పొందుతాయి. రెండోది రివైజింగ్ కమిటీ. మొదటి కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసిన సినిమాలకు కొన్ని తొలగింపులతో ఇది విడుదలకు అనుమతినీయవచ్చు. వీటికి ఒప్పుకొని సినిమా సర్టిఫికెట్ తెచ్చుకోనేవారు కూడా ఉంటారు. సెన్సార్ కటింగ్స్‌తో సినిమా విడుదల చేయడం వ్యర్థమని భావించి వాటిని ఒప్పుకోని నిర్మాత చివరి ప్రయత్నంగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తలుపు తడతాడు. ఈ ట్రిబ్యునల్‌కు ఒక రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ఉంటారు కాబట్టి దీని నిర్ణయం కోర్టు తీర్పుతో సమానం. పై రెండు కమిటీలు దీని మాటకు కట్టుబడి ఉండాల్సిందే. దీని తీర్పు నచ్చని నిర్మాత బయట కోర్టుల్లో సవాలు చేయవచ్చు. ఇక్కడ ప్రభుత్వానికి మింగుడుపడనిది, సినిమావాళ్ళకు ఇష్టమైనది ఏమిటంటే సామాజిక, రాజకీయ అంశాలపై విమర్శనాత్మకంగా వచ్చిన ఎన్నో సినిమాల విడుదలకు ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ మార్గాన్ని సుగమం చేస్తోంది. పాలక పక్ష అనుయాయులను బోర్డు చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టినా ఫలితం శూన్యం. ట్రిబ్యునల్ ఉండడం వల్ల ప్రభుత్వాన్ని, సామాజిక కట్టుబాట్లను, విశ్వాసాలను విమర్శించే ప్రగతిశీల, అభ్యుదయ సినిమాలు బయటికి వస్తున్నాయి. ట్రిబ్యునల్ రద్దు చేసి ఇలాంటి సినిమాలు తీసేవారిని కోర్టుల చుట్టూ తిప్పితే కష్ట నష్టాలపాలై విమర్శనాత్మక సినిమాలు తీయడానికి ముందుకు రారు అని ప్రభుత్వం భావిస్తోందని సినీజీవులంటున్నారు. 1994లో ‘బాండిట్ క్వీన్’ విడుదలకు రెండు కమిటీలు ఒప్పుకోకున్నా ట్రిబ్యునల్ ప్రమేయంతో మన దేశంలో రిలీజ్ అయింది. 2017లో ‘లిప్‌స్టిక్ అండర్ మై బురఖా’ ట్రిబ్యునల్ తీర్పు మూలంగానే తెర మీదికొచ్చింది. 2016లో శ్యామ్ బెనెగల్ కమిటీ ట్రిబ్యునల్ అధికారాలను మరింత పెంచాలని సిఫారసు చేసింది. షర్మిలా ఠాగూర్ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్‌గా ఉన్నప్పుడు తాను ట్రిబ్యునల్ ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తెచ్చానని, రద్దు విషయంలో సినీ ప్రముఖులతో చర్చించి ఉండాల్సిందని అంటున్నారు.. ప్రజలకు అవసరం లేవని, ప్రభుత్వానికి భారమని భావించే ట్రిబ్యునళ్ల తొలగింపుపై కనీసం ఏకసభ్య కమిటీ అయినా వేసి అంతిమ నిర్ణయాలు తీసుకోవాలి. లక్షలాది మందికి ఉపాధికి, కోట్ల రూపాయల పన్నుకు మూలమైన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించాలి తప్ప ఉన్న సదుపాయాలను దూరం చేయవద్దు. వ్యాసకర్త :బి. నర్సన్ కవి, విశ్లేషకులు మొబైల్ : 94401 28169 -
హైకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నిర్మాతలు
ఢిల్లీ : వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ప్రవర్తించాయంటూ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తూ ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా ఈ మీడియా సంస్థలు బాధ్యతా రహితమైన, అవమానకర వ్యాఖ్యలు చేశాయంటూ ఆరోపించాయి. ఈ మేరకు బాలీవుడ్‌లోని నాలుగు అసోషియేషన్స్, 34 ప్రముఖ నిర్మాణ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి, రిపోర్టర్ ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ శివశంకర్ గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్ పేర్లను పిటిషన్లో చేర్చారు. (పొరుగింటామెను అరెస్ట్ చేయండి: రియా) చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకుండా వీరిని నివారించాలంటూ నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో మహరాష్ట్ర ప్రభుత్వంపై, ముంబై పోలీసులపై ఈ న్యూస్ చానల్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో డ్రగ్స్ వాడకం చాలా సర్వసాధారణమని, ఇది ఓ చెత్త పరిశ్రమ అంటూ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. (ముంబైలో టీఆర్పీ స్కామ్) -
సినీ అభిమానులకు ‘జీ’ సంస్థ శుభవార్త
ముంబై: సినిమా ప్రేమికులకు జీ ఎంటర్టేన్మెంట్ లిమిటెడ్ శుభవార్త తెలిపింది. త్వరలో ‘సినిమా టు హోమ్’, జీప్లెక్స్ సేవలను వినియోగదారులకు అందించనుంది. కాగా తమ సినిమా టు హోమ్ సేవల ద్వారా వినియోగదారులు, సినీ నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుందని జీ ఎంటర్టేన్మెంట్ తెలిపింది. అయితే ఎంటర్టేన్మెంట్ ప్టాట్ఫార్మ్లో తమ సేవలు నూతన ఒరవడి సృష్టిస్తాయని పేర్కొంది. ఈ విషయమై జీ స్టూడియో సీఈఓ షారీక్ పటేల్ స్పందిస్తు.. నూతన సాంకేతికతో జీప్లెక్స్ సేవలను ప్రారంభించనున్నామని, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన సేవలను అందిస్తామని తెలిపారు. కాగా తాము ప్రారంభించబోయే జీప్లెక్స్ సేవల పట్ల నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. మరోవైపు జీప్లెక్స్ సేవల ద్వారా వివిధ భాషలలో బ్లాక్ బ్లస్టర్ సినిమాలను అందించనున్నట్లు జీ సంస్థ రెవెన్యూ అధికారి అతుల్ దాస్ పేర్కొన్నారు. అయిత నాణ్యతలో నూతన ట్రెండ్ సృష్టిస్తామని జీ సంస్థ తెలిపింది. అత్యుత్తమ నాణ్యత అందించేందుకు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని సంస్థ తెలిపింది. జీ 5 చానెల్‌లోను సీనిమా టు హోమ్ సేవలు అందుబాటులో ఉంటాయని, దేశంలో జీప్లెక్స్ సేవలు అక్టోబర్ 2న ప్రారంభించనున్నట్లు సంస్థ పేర్కొంది. -
శుభ్రంగా పని చేసుకుందాం
సినిమా షూటింగ్ అంటే సందడి. ఓ హడావిడి. ఓ గందరగోళం. లొకేషన్ అంతా యూనిట్ సభ్యులతో కిటకిటలాడుతుంది. రానున్న రోజుల్లో సందడి ఉంటుంది కానీ లొకేషన్లో ఉండేవాళ్ల సంఖ్య తగ్గుతుంది. హడావిడి ఉంటుంది.. భద్రతతో కూడినది. కరోనా పూర్తిగా తొలగిపోలేదు. పనులన్నీ మెల్లిగా ప్రారంభమయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ షూటింగ్‌కి అనుమతులు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. షూటింగ్ చేసే పరిసరాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నిబంధనలు పాటించాలి? వంటి విషయాలతో ప్రతీ ఇండస్ట్రీ కొన్ని గైడ్లెన్స్ తయారు చేసుకుంటోంది. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన టీవీ మరియు సినిమాల చిత్రీకరణలో ‘ఇలాంటి భద్రతలను పాటిస్తూ షూటింగ్ చేసుకుంటాం’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొన్ని గైడ్ లైన్స్‌తో ఓ లేఖను మహారాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అందులోని గైడ్ లైన్స్‌ని నిర్మాణ సంస్థలు పాటించాలని.. ఇవన్నీ పాటిస్తూ ‘శుభ్రంగా’ పని చేసుకుందాం అని గిల్డ్ కోరనుంది. కొన్ని గైడ్ లైన్స్ ఈ విధంగా. ► లొకేషన్‌కి అడుగుపెట్టే ముందు ప్రతిఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వారితో పాటు తెచ్చుకున్నవన్నీ శానిటైజ్ చేయడం తప్పనిసరి. ► లొకేషన్లో ఉండేవాళ్లందరూ తప్పకుండా మాస్కులు ధరించే పని చేయాలి. వాడిన మాస్క్‌ను జాగ్రత్తగా పడేయాలి. ఎక్కడపడితే అక్కడ వదిలేయకూడదు. ► సెట్లో చేతులు కలపడాలు, కౌగిలించుకోవడాలు మానేయాలి. ► చిత్రీకరణలో వాడే తినుబండరాలను సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ► లొకేషన్లో ప్రతిఒక్కరూ కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి. ► ఈ జాగ్రతలన్నీ అలవాటుగా మరేంత వరకూ ప్రతిరోజూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో షూటింగ్‌కి ముందు ఓ డ్రిల్లా చేయాలి. ► షూటింగ్‌కి 45 నిమిషాల ముందే ప్రతీ ఒక్కరూ లొకేషన్లో ఉండేలా చూసుకోవాలి. ► ప్రతీరోజూ షూటింగ్‌కి ముందు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన ఏజెన్సీ ద్వారా స్టూడియో మొత్తాన్ని శానిటైజ్ చేయించాలి. ► లొకేషన్లో చేతులు శుభ్రపరుచుకోవడానికి వీలుగా బేసిన్లు ఏర్పాటు చేయాలి. ► ఇంట్లో ఉండి అయినా చేయగలిగే పని అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని ప్రోత్సహించాలి. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు, ఆరోగ్యం బాగాలేని వాళ్లను ఇంటి నుండి పని చేసేలా చూడాలి. ► సినిమాకు పని చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ సర్టిఫికెట్‌ను నిర్మాణ సంస్థకు అందజేయాలి. ► ఫేస్ మాస్కులను, గ్లౌజ్‌లను తప్పనిసరిగా వాడేలా చూసుకోవాలి. ► నటీనటుల ఆడిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేసుకునేలా చూసుకోవాలి. ► చిత్రీకరణ జరిపే లొకేషన్ ఏ జోన్లోఉందో చూసుకుని దాన్ని బట్టి అనుమతులు తీసుకుని చిత్రీకరణ జరపాలి. ► లొకేషన్స్ కోసం వెతకడానికి వెళ్లినప్పుడు టీమ్‌లో తక్కువ మంది ఉండేట్టు చూసుకోవాలి. ► మేకప్, హెయిర్ స్టయిల్ ఆర్టిస్ట్‌లు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించే మేకప్, స్టయిలింగ్ చేయాలి. కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకుని మేకప్ వేయాలి. ► యాక్టర్ మేకప్ వేసుకున్న తర్వాత మాస్క్ ధరించడం కుదరకపోతే ఫేస్ మాస్క్ వేసుకోవాలి. ► విగ్గులు, సవరాలు తప్పకుండా శానిటైజ్ చేసినవే వాడాలి. ► సినిమాకు వాడే కాస్ట్యూమ్స్ తప్పకుండా శుభ్రపరిచినవే వాడాలి. ► క్యాటరింగ్ చేసేవాళ్లు తప్పనిసరి పీపీఈ కిట్స్ ధరించాలి. అవసరమైతే ఇంట్లో తయారు చేసుకున్న భోజనం తీసుకురావడం బెస్ట్. ► వీలైనంత అవుట్ డోర్ షూటింగ్స్ తగ్గించుకోవాలి. వీలైనంత తక్కువమంది స్టాఫ్ పని చేసేట్టు చూసుకోవాలి. -
బకాయిలు చెల్లించండి
సినీ పరిశ్రమకు చెందిన దినసరి వేతనాలు అందుకునే సాంకేతిక నిపుణులు, నటీనటులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను నిర్మాతలు చెల్లించాలని ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (ఐఎమ్పీపీఏ) శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘షూటింగ్స్ లేకపోవడం వల్ల చాలామంది ఉపాధిని కోల్పోయారు. ప్రభుత్వ ఆదేశానుసారంగా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పెండింగ్ వేతనాలు అందక దినసరి కార్మికులు, సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో నిర్మాతలు కూడా కష్టాల్లోనే ఉన్నారు. అది అర్థం చేసుకోగలం. కానీ మానవీయ కోణంలో నిర్మాతలు ఆలోచించి బకాయిలను వీలైనంత తొందరగా చెల్లించాలని కోరుతున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో వారు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి వీలవుతుంది’’ అని ఐఎమ్పీపీఏ పేర్కొంది. -
ఓవర్ ది టాప్
‘సృష్టిలో స్థిరమైనది మార్పు మాత్రమే’ అన్నది గ్రీకు ఫిలాసఫీ. ‘సినిమా’ రంగంలో మార్పు గమనిస్తే... మూకీ సినిమా మాటలు నేర్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ స్టయిలుగా రంగులేసుకుంది. రీలును చుట్టి చిప్‌లో పెట్టారు. ఇది సినిమా తయారవడంలో వచ్చిన మార్పు. సినిమా ఎన్నో సవాళ్లను చూస్తూ వస్తోంది. సినిమా మొదలయినప్పుడు నాటకం నడక వేగం తగ్గిందన్నది నిజం. ఆ తర్వాత కేబుల్ టీవీ వచ్చింది. బుల్లితెరకు అంటుకుపోతున్నవాళ్లను పెద్ద తెరకు తీసుకురావడం కొంచెం కష్టం అవుతోంది. ఇప్పుడు ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్‌ఫామ్స్ (అమేజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్, హాట్‌స్టార్, జీ5 వంటివి) వచ్చాయి. ఓవర్ ది టాప్ అంటూ దూసుకొచ్చిన ఈ మాధ్యమం సినిమా బిజినెస్‌ని అధిగమిస్తుందా? ఇప్పుడు సినిమాకు పెద్ద సవాల్ ఈ ఓటీటీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడే వరకే ఓటీటీ ప్రత్యామ్నాయమా? భవిష్యత్తులో థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌ను ఓటీటీ ఆపేస్తుందా? లేదంటే ఓటీటీయే భవిష్యత్తా? ఓటీటీకి అందరం అలవాటు పడాలా? ప్రస్తుతం అన్నీ ప్రశ్నలే. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచం స్తంభించింది. సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయి. షూటింగ్ నుంచి విడుదల వరకూ అన్నీ బంద్. విడుదలకు సిద్ధమైన సినిమాలు పలు కారణాలతో ప్రత్యామ్నాయంగా ఓటీటీలో విడుదలకు సిద్ధపడ్డాయి. ఇదో సంచలనాత్మకమైన మార్పు. సినిమాను థియేటర్లో విడుదల చేయకుండా ఓటీటీలో విడుదల చేయడం సరికాదని పలు మల్టీప్లెక్స్ చైన్ల అధినేతలు, కొందరు పంపిణీదారులు, థియేటర్ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. థియేటరా? ఓటీటీయా? సినిమాను థియేటర్లో చూడాలా? ఎవరింట్లో వాళ్లు ఓటీటీలో చూసుకోవాలా? సినిమా చూడటం అనేది ఓ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. థియేటర్లో ఒక రెండు వందల మంది సినిమాలోని ఒక ఎమోషన్ని సమానంగా ఫీలవడం. ‘సినిమాను సినిమాలాగా చూడటం థియేటర్లోనే జరుగుతుంది. సినిమాను థియేటర్లోనే అనుభూతి చెందాలి’ అని ఒక వాదన. మరోవైపు ‘ప్రతీ సినిమాను థియేటర్లో చూడలేం. పెరిగే టికెట్ రేట్లను ఫ్యామిలీ అందరం భరించలేం. ఓటీటీలో అయితే అందరూ ఇంట్లోనే వీలున్నప్పుడు చూసుకోవచ్చు. థియేటర్లో చూడదగ్గ సినిమా అయితే థియేటర్‌కి వస్తాం కదా?’ అనేది మరో వాదన. అభిప్రాయాలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ‘ఖచ్చితంగా ఇదే కరెక్ట్’ అని ఏదీ చెప్పలేం. ప్రేక్షకుడు సినిమాను థియేటర్లో నలుగురితో చూడాలా? ఏకాంతంగా తన ల్యాప్టాప్లోనా, టీవీలోనా? అనేది తన నిర్ణయం. ప్రస్తుతానికి మాత్రం ఏడు సినిమాలు ‘ఓటీటీ’కి రావడానికి రెడీ అయ్యాయి. ఓటీటీకే మా ఓటు లాక్డౌన్ వల్ల విడుదల ఆగిపోయిన పలు సినిమాలు మా ఓటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే అని డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి. ఆ చిత్రాల వివరాలు.. పొన్ మగళ్ వందాళ్: ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు మొదట ప్రకటించబడిన తమిళ సినిమా జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’. సూర్య నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల నిర్ణయం పట్ల డిస్ట్రిబ్యూటర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్య–జ్యోతిక సినిమాలు థియేటర్స్‌లో ప్రదర్శించం అని స్టేట్మెంట్లు విడుదల చేశారు. అయితే మే 29 నుంచి ఈ సినిమా ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. గులాబో సితాబో: అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ముఖ్య పాత్రల్లో సూజిత్ సర్కార్ తెరకెక్కించిన హిందీ సినిమా ‘గులాబో సితాబో’. ఈ సినిమా జూన్ 12 నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ విషయం గురించి అమితాబ్ మాట్లాడుతూ –‘‘నా కెరీర్లో ఎన్నో మార్పులు, సవాళ్లు చూస్తూ వచ్చాను. డిజిటల్ రిలీజ్ అనేది మరో కొత్త సవాల్’’ అన్నారు. పెంగ్విన్: కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సినిమా ‘పెంగ్విన్’. ఈ సినిమాలో గర్భిణి పాత్రలో కనిపిస్తారు కీర్తి. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ను జూన్ 19 నుంచి చూడొచ్చు. కన్నడ చిత్రాలు ‘లా, ఫ్రెంచ్ బిర్యానీ’ జూన్ 26, జూలై 24వ తేదీలనుంచి లభ్యమవుతాయి. ఈ రెండు చిత్రాలకు ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ నిర్మాత. గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా విద్యా బాలన్ టైటిల్ రోల్లో నటించిన హిందీ చిత్రం ‘శకుంతలా దేవి’. జయసూర్య, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘సూఫీయుమ్ సుజాతయుమ్’. ఈ రెండు చిత్రాలు కూడా అందుబాటులోకి రానున్నట్టు ప్రైమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ విడుదల తేదీలు ప్రకటించలేదు. మార్పు మొదలైన వెంటనే భవిష్యత్తు ఇదే అని తుది నిర్ణయానికి రావడం అన్నిసార్లూ సరి కాదు. సాంకేతికత పెరిగేకొద్దీ సినిమా థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఓటీటీ కూడా థియేట్రికల్ బిజినెస్‌కి ఇబ్బంది అవుతుందేమోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా మీడియమ్ మారబోతోందా? సినిమాల మీద ఓటీటీ ప్రభావం చూపిస్తుందా? సమాధానాల కోసం వెతకడం కంటే వేచి చూడటమే కొన్నిసార్లు ఉత్తమమేమో? పెద్ద తెర అనుభూతి వేరు – ఎఫ్డీసీ చైర్మన్ పి. రామ్మోహన్రావు ► ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీల వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్ టీవీ 65 ఇంచెస్ ఉన్నప్పటికీ థియేటర్లో పెద్ద తెర మీద సినిమాను వీక్షిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ అనుభూతి వేరు. థియేటర్లో దాదాపు 20–40లక్షల ఖర్చుతో ఉన్న సౌండింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలను వీక్షిస్తే ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంతగా కలగకపోవచ్చు. ► నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అమ్మకపోవడమే ఉత్తమమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి సినిమా థియేట్రికల్ రిలీజై హిట్ సాధిస్తే మంచి వసూళ్లు వస్తాయి. ఈ వసూళ్ల రూపంలో వచ్చేంత డబ్బును ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నిర్మాతలకు చెల్లించలేవు. ► కరోనా ప్రభావం వల్ల షూటింగ్‌లు క్యాన్సిల్ అయ్యాయి. భవిష్యత్‌లో థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూడటానికి వస్తారో? రారో? అనే భయంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఇచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నాగచైతన్యతో తీస్తున్న ‘లవ్‌స్టోరీ’కి నేను ఒక నిర్మాతను. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మా సినిమాని రిలీజ్ చేస్తాం కానీ ఓటీటీలకు అమ్మాలనుకోవడం లేదు. ► ఈ క్లిష్టపరిస్థితుల్లో ఇండస్ట్రీకి ప్రభుత్వం అండగా ఉండాలి. షూటింగ్, సినిమాల విడుదల, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వంటి విషయాలపై ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఒకసారి థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మొదటి మూడు నెలల్లో విడుదయ్యే సినిమాలకు ప్రభుత్వం ఏదైనా రాయితీ ఇవ్వాలి. జీరో ట్యాక్సేషన్, పార్కింగ్ ఫీజు వసూలు చేయడం వంటి వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే మల్టీప్లెక్స్వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. షూటింగ్‌లు మొదలుపెట్టే పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చని అధికారికంగా ప్రభుత్వం చెబితే, అప్పుడు తక్కువమందితో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటాం. ప్రభుత్వ స్పందన కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. నా సపోర్ట్ థియేటర్స్‌కే – నిర్మాత అల్లు అరవింద్ ► అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్ నటించిన సినిమా నుంచి స్టార్ ఆర్టిస్ట్‌లు జ్యోతిక, కీర్తీ సురేష్ వంటి వారు నటించిన సినిమాలు డిజిటల్ రిలీజ్‌కి రెడీ అయ్యాయి.. ఈ ప్లాట్ఫామ్లో విడుదల చేయడం పై మీ ఒపీనియన్? ఎవరైనా థియేటర్లో విడుదలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొందరు ఓటీటీవైపు మొగ్గు చూపుతున్నారు. చాలా సినిమాలు విడుదల వాయిదా పడుతుండటంతో ఒకేసారి విడుదల చేస్తే థియేటర్లు దొరుకుతాయో? లేదో? పైగా అప్పులపై వడ్డీలు పెరిగిపోతుంటాయి కదా? ఈ కారణాల వల్ల డిజిటల్ రిలీజ్ బెటర్ అనుకునే అవకాశం ఉంది. ► ‘ఆహా’తో మీరూ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టారు. మరి.. మీరు డిజిటల్ రిలీజ్‌కి ఓకే అంటారా? థియేటర్లు ఓపెన్ అయ్యేవరకూ ఆగేవాళ్లు ఆగుతారు. నా సపోర్ట్ మాత్రం థియేటర్స్‌కే. అయితే ఓటీటీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ► పెద్ద బడ్జెట్ చిత్రాలేమైనా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు మీ దృష్టికి వచ్చిందా? నాకు తెలిసి లాక్‌డౌన్‌కి ముందు రిలీజ్ కావడానికి పెద్ద సినిమాలేవీ రెడీగా లేవు. నాలుగైదు చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయేమో.. మరికొన్ని చిన్న చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఓ బడా నిర్మాత సినిమా విడుదలకు రెడీ అయింది. లాక్డౌన్ వల్ల అది ఆగింది. ఆ సినిమాకి కూడా ఓటీటీ వాళ్లతో చర్చలు జరిగాయి.. కానీ ‘పెద్ద మొత్తం’ ఇవ్వడానికి ఓటీటీ వాళ్లు సిద్ధంగా లేరు. అందుకే వడ్డీ భారం ఉన్నా కూడా థియేటర్లోనే విడుదల చేద్దామని ఆ నిర్మాత ఆగారు. ► తక్కువ మందితో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని తమిళ ఇండస్ట్రీకి ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి అనుమతులు ఇంకా రాలేదు కదా? అనధికారికంగా కొందరు తక్కువమందితో జాగ్రత్తలు పాటిస్తూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. అయితే అధికారికంగా ప్రకటిస్తే కొంచెం రిలీఫ్‌గా పని చేసుకుంటారు. ► షూటింగ్స్ ఎప్పటి నుంచి మొదలవుతాయనుకుంటున్నారు? ఆగస్టు నుంచి మొదలవుతాయనుకుంటున్నాను. అయితే గతంలా ఉండకపోవచ్చు. తక్కువ మందితో షూటింగ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా మంది కార్మికులకు పని లేకుండా పోతుంది. అలాంటివాళ్లను ఆదుకోవడానికి ఏదోటి చేయాలి. ► గీతా ఆర్ట్స్ బ్యానర్లోని ప్రస్తుత సినిమాల పరిస్థితేంటి? ప్రస్తుతం మా బ్యానర్లో మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ‘జెర్సీ’ హిందీ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తయి ఆగిపోయింది. తెలుగులో అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ 75 శాతం షూటింగ్ అయింది. కార్తికేయతో తీస్తున్న ‘చావు కబురు చల్లగా’ సినిమా 25 శాతం చిత్రీకరణ జరిగింది. లాక్డౌన్ ముగిశాక ఈ షూటింగ్స్ మొదలుపెట్టడమే. ఒకరి మీద ఒకరం ఆధారపడ్డాం పలు సినిమాలు ఓటీటీని ఆశ్రయించడంతో ప్రముఖ థియేటర్ చైన్ సంస్థ ఐనాక్స్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘‘థియేటర్స్– సినిమా నిర్మించేవాళ్లు ఒకరి మీద ఒకరు ఆధారపడ్డవాళ్లం. ఇలాంటి కష్టకాలంలో రెండు పార్టీలు లబ్ధి పొందే పద్ధతిని కాదనుకుని ఒక పార్టనర్ వేరే పద్ధతిని అనుసరించడం సరికాదనిపిస్తోంది. కష్ట సమయంలో అనుబంధాన్ని వదిలి, ప్రత్యామ్నాయాన్ని ఆశ్రయించినవాళ్లను భవిష్యత్తులో ఆప్తమిత్రుల్లా చూడటానికి లేదు. థియేటర్లో సినిమాను విడుదల చేసే విధానాన్ని మరువకండి. ఎప్పటిలానే కలసి ప్రయాణిద్దాం’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్మాతలు అలా ఆలోచించడం సహజం – ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలను విడుదల చేయడానికి అంగీకరించిన నిర్మాతలను ఉద్దేశిస్తూ ఎగ్జిబిటర్ సెక్టార్‌లోని మా సహచరులు కొందరు కటువుగా మాట్లాడటం బాధగా ఉంది. ఇప్పట్లో దేశవ్యాప్తంగా సినిమాలు ప్రదర్శితం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటి వరకు తమ సినిమాల విడుదల కోసం నిర్మాతలు ఎదురుచూడటం అంటే వారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. తిరిగి థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ థియేటర్స్ ప్రేక్షకులతో నిండకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మార్గాల ద్వారా తమ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి నిర్మాతలు ఆలోచిస్తారు. అది సహజం. అయితే సినిమాల థియేట్రికల్ రిలీజ్‌నే ప్రొడ్యూసర్స్ గిల్డ్ సపోర్ట్ చేస్తుంది. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు ఎగ్జిబిటర్ సెక్టార్‌కు మేం తప్పక సహకారం అందిస్తాం. అలాగే పెద్ద సంఖ్యలో థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించేందుకు మా వంతుగా మేం చేయాల్సింది అంతా చేస్తాం. -
అది ఫైనల్ కాదు
కరోనా ప్రభావంతో ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌లు మొదలవుతాయా? అని పెట్టుబడి పెట్టే నిర్మాతల నుంచి పారితోషికం తీసుకునే నటీనటులు, సాంకేతిక నిపుణుల వరకూ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ కొన్ని నియమాలను పాటిస్తూ షూటింగ్స్‌ను జూన్‌లో ప్రారంభించుకోవచ్చని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. షూటింగ్స్ మొదలైన మొదటి మూడు నెలలు పాటు యాక్టర్స్ తమ ఇంట్లోనే మేకప్ వేసుకుని సెట్స్‌కు రావాలి. ఒక అసిస్టెంట్‌ను మాత్రమే యాక్టర్స్ తమ వెంట తెచ్చుకోవాలి. అలాగే 60ఏళ్లు పైబడిన వారిని క్రూ మెంబర్స్‌గా తీసుకోకూడదు. ఇటువంటి బేసిక్ సేఫ్టీ రూల్స్‌తో షూటింగ్స్‌ను ప్రారంభించాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. వీటిపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. ‘‘షూటింగ్స్‌ను తిరిగి ఏయే నియమాలతో ప్రారంభించాలి? ఎటువంటి షరతులు విధించాలి? అని జరిగిన చర్చలకు సంబంధించిన మా డాక్యుమెంట్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అయితే అది ఫైనల్ కాదు. మేం ఇంకా చర్చించుకోవాలి. ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య ప్రతినిధులు, ఇండస్ట్రీ ప్రముఖులు వంటి వారితో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మాత్రమే ఫైనల్ గైడ్లెన్స్ నిర్ణయించి, వాటిని తెలియజేస్తాం’’ అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనను విడుదల చేసింది. -
ఓటీటీకే ఓటు
థియేటర్స్ మూసేసి నెల రోజులు దాటిపోయింది. దీంతో రిలీజ్‌కి రెడీ అయిన చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు కొందరు నిర్మాతలు. ఇందులో భాగంగా సూర్య నిర్మాణంలో జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలనుకున్నారు. ముందు ఈ నిర్ణయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అంగీకరించలేదు. భవిష్యత్తులో సూర్య నిర్మాణంలో వచ్చే చిత్రాలను ప్రదర్శించబోమని ప్రకటించారు. అయితే ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని డిజిటల్ ద్వారా రిలీజ్ చేయడం సరైన నిర్ణయమే అని నిర్మాతల సంఘం అభిప్రాయపడింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సినిమాను ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాత ఇష్టం. చిన్న సినిమాలను మరియు మీడియమ్ బడ్జెట్ సినిమాలను ఆన్ లైన్లో రిలీజ్ చేయడం నిర్మాతలకు కలసి వచ్చే విషయమే. అలాగే లాక్ డౌన్ తీసేసిన తర్వాత రిలీజ్‌కి భారీ క్యూ ఉండి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి రాదు’’ అని నిర్మాతల సంఘం పేర్కొంది. -
సూర్యకు నిర్మాతల అండ
నటుడు, నిర్మాత సూర్య తన భార్య జ్యోతిక హీరోయిన్గా 2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన పొన్మగల్ వందాల్ చిత్రం లాక్డౌన్ కారణంగా విడుదల చేయలేని పరిస్థితి. దీంతో ఈ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని అమేజాన్ సంస్థ విడుదల హక్కులను పొందింది.ఆన్లైన్లో చిత్రాన్ని విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన థియేటర్ల అసోసియేషన్.. సూర్య నిర్మించే చిత్రాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. థియేటర్ల సంఘం తీసుకున్న నిర్ణయంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న నిర్మాతల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయనున్న అమ్మ క్రియేషన్స్ టి.శివ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలో చిన్న చిత్రాల నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునే విధంగా అమేజాన్ సంస్థ ఆన్లైన్లో విడుదల చేయడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన విషయం. అలాంటిది సూర్య నిర్మించిన పొన్మగల్ వందాల్ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేయడాన్ని థియేటర్ల సంఘం వ్యతిరేకించడం సరికాదు. పొన్మగల్ వందాల్ చిత్రంతో పాటు మరో ఐదు చిత్రాలను ఆన్లైన్లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారని అన్నారు. ఇది చిన్న నిర్మాతలకు లభించిన గొప్ప అవకాశం. ఈ విషయమై ప్రముఖ డిస్టిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణ్యం కూడా చర్చిద్దామని తెలిపారన్నారు. తాజాగా విజయ్ నటించిన మాస్టర్, సూర్య నటించిన సూరరైపొట్రి వంటి భారీ చిత్రాలను కూడా ఆన్లైన్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. మాస్టర్ చిత్రాన్ని రూ. 130 కోట్లకు, అదే విధంగా సూరరైపోట్రు చిత్రాన్ని రూ. 55 కోట్లకు విక్రయించే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. దీనిపై థియేటర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
నాన్నను చూసి ఎంచుకున్నాం
►స్క్రీన్ మీద స్త్రీలు కనిపించడం సాధారణమే. కానీ కెమెరా వెనక పని చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కారణం? స్వప్నా దత్: సినిమా నిర్మాణం ఎందుకు ఎంచుకున్నాం అంటే మా నాన్నగారిని (అశ్వనీదత్) చూశాం. ఆయన ప్యాషన్‌తో సినిమాలు నిర్మించడం చూశాం. కథను ఎంచుకోవడం, నటీనటులను, దర్శకుడిని ఎంపిక చేసుకోవడం వంటి విషయాలు చూసి ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా యాక్టింగ్ అయినా, డిజైనింగ్ పైన అయినా ఆసక్తి చూపుతారు. కానీ మా ఇంట్లో అంత మంచి ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు నిర్మాణం కాకుండా ఏం చేస్తాం చెప్పండి. సినిమా నిర్మాణమే అన్నింటికంటే సాహసమైనది అనిపించింది. అదే చేస్తున్నాం (నవ్వుతూ). ►స్త్రీలు నిర్మాతలైతే షూటింగ్ లొకేషన్లో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది? ప్రియాంకా దత్: నిర్మాత ఆడవారైనా మగవారైనా సరే అందరూ సురక్షితంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలి. లేడీ నిర్మాతలంటే.. మేం కొంచెం ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటాం కాబట్టి సెట్లో అమ్మాయిలు ఉంటే వాళ్లు సేఫ్‌గా ఇంటికి వెళ్లగలుగుతున్నారా? వాళ్ల బాత్రూమ్స్ సరిగ్గా ఉంటున్నాయా? అని చూస్తాం. అలాగే ఏదైనా ఇష్యూలు వస్తే వెంటనే మాతో చెప్పగలిగే వాతావరణం ఉంటుంది. మా మేనేజర్లతో అన్నీ సరిగ్గా చూసుకోమని చెబుతాం. నిర్మాత ఆడైనా మగైనా ఎవ్వరైనా సరే సెట్లో అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ►రామానాయుడుగారు నిర్మాతగా వంద సినిమాలుపైనే నిర్మించారు. లేడీ ప్రొడ్యూసర్స్ కూడా ఆ రికార్డుని అందుకోగలుగుతారా? స్వప్నా: ఇది ఆడా మగా సమస్య అని చెప్పను. కొంచెం మేల్ డామినేటెడ్ ప్రపంచంలో ఉమెన్‌కి కచ్చితంగా చాలెంజెస్ ఉంటాయి. కష్టం అయితే అందరికీ ఒకటే. రామానాయుడిగారి అంత విజన్ ఉంటే ప్రయత్నించొచ్చు అనుకుంటా. ►నాన్నగారి బాటలో నిర్మాతలు అయి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, దేవదాస్ వంటి సినిమాలు నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ లెగసీని మోయడం ఒత్తిడి ఏమైనా? స్వప్నా: అవును. ఏదైనా పెద్ద పెద్ద పనులు చేస్తున్నప్పుడు కచ్చితంగా ఉంటుంది. అలాంటిది 50 ఏళ్ల హిస్టరీ ఉన్న సంస్థ (వైజయంతీ మూవీస్)ను ముందుకు తీసుకెళ్లడం కచ్చితంగా ప్రెషరే. అలాగే ప్లెషర్ కూడా. ►లేడీ ప్రొడ్యూసర్స్ ఎదుర్కొనే చాలెంజ్‌లు? స్వప్నా: ప్రొడక్షన్ అంటేనే చాలెంజ్. ప్రొడ్యూసర్స్ అంటేనే చాలెంజెస్ ఎదుర్కొనేవారు. అందులో ఆడామగా అని ఉండదనుకుంటున్నాను. జెన్యూన్‌గా సినిమా తీసేవాళ్లకు ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. -
సీఎం జగన్‌తో టాలీవుడ్ నిర్మాతల భేటీ
-
సీఎం వైఎస్ జగన్‌తో సీనీ నిర్మాతల భేటీ
-
త్రిషకు వార్నింగ్
నటి త్రిషకు నిర్మాతలమండలి హెచ్చరికలు జారీ చేసింది. 24 హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శక నిర్మాత తిరుజ్ఞానం తెరకెక్కించిన చిత్రం పరమపదం విళైయాట్టు. త్రిష సెంట్రిక్ కథా పాత్రలో నటించిన ఈ చిత్రానికి అమ్రీష్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర ప్రీ ప్రమోషన్ కార్యక్రమం శనివారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో చిత్ర యూనిట్ నిర్వహించారు. కార్యక్రమంలో దర్శక నటుడు కే.భాగ్యరాజ్, నిర్మాతలమండలి నిర్వాహకుడు టి.శివ, నిర్మాత కే.రాజన్ పాల్గొన్నారు. చిత్ర సంగీతదర్శకుడు అమ్రీష్ మాట్లాడుతూ ఇది తనకు 8వ చిత్రం త్రిషకు 60వ చిత్రం కావడం సంతోషంగా ఉందన్నారు. దర్శక, నిర్మాత తిరుజ్ఞానం ఈ చిత్రంలో ఒక్క పాట మాత్రమే ఉంటుందని చెప్పారన్నారు. అది మొట్ట శివ కెట్ట శివ చిత్రంలోని హరహర మహాదేవ పాట మాదిరిగా ఉండాలని కోరారన్నారు.అదే మాదిరి ఈ చిత్రంలోని పాట హిట్ అయ్యిందని చెప్పారు. ఇందులో నటించిన విజయ్‌వర్మ మాట్లాడుతూ పరమపదం విళైయాట్టు చిత్రాన్ని అందరి వద్దకు తీసుకెళ్లాలని కోరారు. అనంతరం నిర్మాత సురేశ్‌కామాక్షి మాట్లాడుతూ 15 రోజుల క్రితం ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా తిరుజ్ఞానం తనను పిలిచారన్నారు. చిత్రం చూసిన తరువాత 20 చిత్రాల అనుభవం కలిగిన దర్శకుడు తీసిన చిత్రంగా అనిపించిందన్నారు. బేబీ మానస్వి చాలా చక్కగా నటించిందని ప్రశంసించారు. చదవండి: సగం పారితోషికం ఇచ్చేయాలి ఈ చిన్నారి నటుడు కొట్టాచ్చి కూతురన్నది తరువాతనే తెలిసిందన్నారు. సంగీతదర్శకుడు అమ్రీష్ సంగీతం చాలా బాగుందన్నారు. కాగా హీరోయిన్ల తాము నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదే తెలియడం లేదన్నారు. ప్రముఖ నటులు రజనీకాంత్, విజయ్, కమలహాసన్ వంటి వారే తాము నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తున్నప్పుడు హీరోయిన్లు ఎందుకు రావడం లేదో తెలియడం లేదన్నారు. అలాంటి వారితో సినిమాలను చేస్తే మంచి ప్రచారం లభిస్తుందనే వారిని ఎంపిక చేస్తున్నామని, లేకుంటే కొత్తవారికే అవకాశాలు ఇచ్చి చిత్రాలు చేస్తామని అన్నారు. చదవండి: మాళవిక మోహన్‌కు సూపర్ ఆఫర్ నిర్మాతలమండలి నిర్వాహకుడు, నిర్మాత శివ మాట్లాడుతూ తాను ఈ చిత్రాన్ని ఇంకా చూడలేదని, అయితే మిత్రులు చిత్రం బాగా వచ్చిందని చెప్పారని అన్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌కు నటి త్రిష రాకపోవడం బాధాకరంగా పేర్కొన్నారు. చిత్రం ఈ నెల 28న విడుదల కానుందని, ఈలోగా ఆమె చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని అల్టిమేట్ జారీ చేశారు. లేదంటే ఆమె తీసుకున్న పారితోషికంలో సగ భాగాన్ని నిర్మాతకు తిరిగివ్వాల్సి ఉంటుందని నిర్మాతల సంఘం తరఫున హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
బాధలో ఉంటే విమర్శలా?
‘నిత్యామీనన్ బాగా యాటిట్యూడ్ చూపిస్తోంది. పెద్ద ఈగోయిస్ట్. త్వరలోనే ఇండస్ట్రీలో నుంచి తనను బ్యాన్ చేయాలనుకుంటున్నాం’ అంటూ కొందరు మలయాళ నిర్మాతలు నిత్యామీనన్ గురించి విమర్శనాస్త్రాలు సంధించారు. నిర్మాతలు నిత్యపై ఎందుకు ఆగ్రహానికి గురయ్యారు? కారణం ఏంటి? అంటే.. టి. రాజీవ్ కుమార్ రూపొందిస్తున్న మలయాళ చిత్రం ‘తత్సమయం ఒరు పెన్‌కుట్టి’లో నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ షూటింగ్లో ఆమె చిత్రబృందాన్ని ఇబ్బంది పెట్టారని, అలాగే కలవడానికి వచ్చిన నిర్మాతలను కలవలేదని సదరు నిర్మాతలు ఆరోపించారు. దాంతో ఆ నిర్మాతలు నిత్యను బ్యాన్ చేయాలని, అహంభావి అని కామెంట్స్ చేశారట. ఈ వివాదం గురించి నిత్యామీనన్ ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందిస్తూ – ‘‘ఈ సంఘటన జరిగినప్పుడు (నిర్మాతలను కలవడానికి నిరాకరించినప్పుడు) మా అమ్మగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే విషయం తెలిసింది. థర్డ్ స్టేజ్. షూటింగ్ సమయాల్లో కూడా క్యారవ్యాన్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని. అప్పుడే నాకు మైగ్రేన్ కూడా అటాక్ అయింది. ఆ టైమ్‌లో నేను వాళ్లను కలసి మాట్లాడే పరిస్థితిలో లేను. అందుకే నన్ను ఈగోయిస్ట్ అని, యాటిట్యూడ్ చూపిస్తున్నానని అనుకొని ఉండొచ్చు. ఇలాంటి వాటిని పట్టించుకుని నా సమయాన్ని వృథా చేసుకోను. దానికి బదులు నా వర్క్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి పని చేస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్యామీనన్ ‘జయలలిత’ బయోపిక్, ‘అమేజాన్ బ్రీత్’ వెబ్ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపిస్తారని టాక్. -
‘నన్ను బ్యాన్ చేస్తామని బెదిరించారు’
పాత్రలు మాత్రమే కనిపించేలా నటించే విలక్షణ నటి నిత్యామీనన్. పాత్రలు పోషించడంలోనే కాదు వాటిని ఎంచుకోవడంలోనూ నిత్యది డిఫరెంట్ స్టైల్. కంటెంట్‌కు ప్రాధాన్యం ఉంటే చిన్న పాత్రలైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. వ్యక్తిగతంగా కూడా తనకు నచ్చినట్లే ఉంటారు నిత్యా. దాంతో చాలామంది ఆమెకు పొగరు అని కూడా అనుకుంటారు. తాజాగా నిత్యా మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను కలవడానికి వచ్చిన నిర్మాతలతో నిత్యా మాట్లాడలేదని.. చాలా పొగరుగా ప్రవర్తించిందనే ప్రచారం జరుగుతుంది. ఆమెని బ్యాన్ చేయాలని సదరు నిర్మాతలు భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. తాజాగా ఓ టీవీ షో ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన నిత్యా.. ‘వారు(నిర్మాతలు) ముందుగా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి.. నన్ను కలవాలని చెప్పారు. అప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను. ఎవరితో మాట్లాడలని కూడా అనిపించలేదు. ఆ సమయంలో మా అమ్మకు క్యాన్సర్ అని తెలిసింది. అది కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉంది. షూటింగ్ సమయంలో కూడా దీని గురించి ఆలోచిస్తే నాకు ఏడుపు వచ్చేది. వెంటనే కార్వాన్లోకి వెళ్లి మా అమ్మ గురించి తల్చుకుని బాధపడేదాన్ని. అంతేకాక అదే సమయంలో నేను మైగ్రేన్‌తో బాధపడుతున్నాను. అప్పుడు ఎవరితో మాట్లాడలని అనిపించలేద’న్నారు. ‘కానీ ఇవేవి తెలీకుండా ఆ నిర్మాతలు నాకు చాలా పొగరని.. యాటిట్యూడ్ చూపిస్తాను అన్నారు. కానీ ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నా పనేదో నేను చూసుకుంటాన’ని తెలిపారు. నిత్యా సమాధానం అభిమానలు మనసు గెల్చుకుంది. ఎప్పుడు మీరు ఇంతే ధైర్యంగా ఉండాలని అభినందిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం నిత్యా తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ఐరన్ లేడీ’లో నటిస్తున్నారు. ఆమె చేతిలో ‘కొలంబి’, ‘సైకో’, ‘మిషన్ మంగళ్’ తదితర చిత్రాలు ఉన్నాయి. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్లో కూడా నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
శ్రీశ్రీశ్రీ లేడీ ప్రొడ్యూసర్స్
కుందనపు బొమ్మలే కాదు..ఇప్పుడు బొమ్మా బొరుసూ కూడా.బొమ్మ తయారవ్వడానికి కావాల్సి నంత లక్ష్మిని కటాక్షిస్తున్నారు.ఇదిగో వచ్చారు.. శ్రీశ్రీశ్రీ లేడీ ప్రొడ్యూసర్స్. పారితోషికం తీసుకోవడమే కాదు.. ఇస్తాం కూడా అంటున్నారు అందాల నాయికలు. నటన మీద ఆసక్తితో సిల్వర్ స్క్రీన్ కనపించడంతో పాటు మేకింగ్ మీద ఇంట్రస్ట్‌తో నిర్మాతలుగా మారుతున్నారు. కథానాయికలు నిర్మాతలుగా మారడం కొత్త విషయం ఏం కాదు. కొత్తగా ఈ తరంలో కొందరు కథానాయికలు తమ పేర్లను రిజిష్టర్ చేయించుకున్నారు. అలా నిర్మాతలుగా అడ్వాన్సులు ఇవ్వడానికి సిద్ధపడిన ప్రొడ్యూసరమ్మల గురించి తెలుసుకుందాం. సినిమాలు లేక కాదు సౌత్‌లో కథానాయికగా కాజల్ సూపర్ సక్సెస్. ‘మగధీర, బృందావనం, డార్లింగ్, మిస్టర్ ఫర్పెక్ట్, బిజినెస్‌మేన్, తుపాకీ’ ఇలా... చెప్పుకుంటూ పోతే కాజల్ కథానాయికగా నటించిన హిట్టు సినిమాల లిస్ట్ పెద్దదే. రెండేళ్ల క్రితం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో నాయికగా 50వ చిత్రం మైలురాయిని కూడా చేరుకున్నారు. ఇండస్ట్రీలో ఇంత సాధించిన కాజల్ ఇక ప్రొడ్యూసర్‌గా సత్తా చాటాలనుకుంటున్నారు. అందుకే ప్రొడక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గతేడాది ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ సినిమాకు కాజల్ నిర్మాతగా మారనున్నారని సమాచారం. 50 సినిమాలు చేసింది కదా.. ఇక హీరోయిన్గా అవకాశాలు లేక నిర్మాతగా మారుతుందేమో అనుకుంటున్నారా? అంటే అలాంటిదేం లేదండీ బాబు. కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నటిగా ప్రస్తుతం ఆరేడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. మనసు గెలవాలని.. ఇండస్ట్రీలో తాను సంపాదించిన సొమ్మును ఇండస్ట్రీలోనే పెడుతున్నందుకు రొంబ (చాలా) హ్యాపీ అని అమలాపాల్ అంటున్నారు. అవును... ఆమె నిర్మాతగా మారారు. అనూప్ ఫణిక్కర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తమిళంలో ‘కడవేర్’ అనే ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తూనే నిర్మాతగాను వ్యహరించేందుకు రెడీ అయ్యారు అమలాపాల్. కేరళ పోలీస్ శాఖకు చెందిన ఫోరెన్సిక్ సర్జన్ బి. ఉమాదతాన్ జీవితంలో జరిగిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌గా నటిస్తున్నారు అమలాపాల్. ఆడియన్స్ మనసు గెలుచుకునే స్క్రిప్ట్ కాబట్టి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా వారి మనసు గెలవాలనుకుంటున్నాని అమలా పాల్ పేర్కొన్నారు. ఇటు హీరోయిన్‌గానూ ఆమె కెరీర్ ఫుల్ రైజింగ్లోనే ఉంది. తండ్రి బాటలో... కమల్‌హాసన్ కూతురిగా శ్రుతీహాసన్ ఇండస్ట్రీకి పరచయం అయ్యారు కానీ తక్కువ కాలంలోనే తానేంటో ప్రూవ్ చేసుకుని సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు శ్రుతీహాసన్. కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు వీలైనప్పుడు సంగీతంలోనూ తన ప్రావీణ్యతను చాటుతున్నారు శ్రుతి. కొత్త కథలను, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించడానికి ఆమె నిర్మాతగా మారారు. 2017లో తమిళంలో ‘లెన్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్నారు జయప్రకాష్ రా«ధాకృష్ణన్. ఆ తర్వాత ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అనే సినిమా తీశారు. ఈ సినిమా చూపి ఇంప్రెస్ అయిన శ్రుతీహాసన్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇలా నిర్మాతగా మారారు. ఇదిలా ఉంటే.. కమల్హాస రాజ్ కమల్ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బేనర్‌పై సినిమాలు నిర్మిస్తుంటారని తెలిసిందే. చిన్నప్పటి నుంచి తండ్రిని చూశారు కదా. అలా యాక్టింగ్, ప్రొడక్షన్‌ను రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ శ్రుతీ తండ్రి బాటలో నడుస్తున్నట్లున్నారు. డైరెక్షన్ మారింది డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా టాప్ యాక్టర్స్ అందరూ ఎంటర్టైనింగ్ డిజిటల్ సెక్టార్ వైపు కన్నేశారు. ఈ జాబితాలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ కూడా ఉన్నారు. కానీ యాక్టింగ్ పరంగా కాదు. నిర్మాతగా. 2010లోనే ‘గోవా’ అనే సినిమాను నిర్మించిన సౌందర్యా రజనీకాంత్ తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్రముఖ తమిళ నవల ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ‘కొచ్చాడియన్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సూర్యప్రతాప్ దర్శకుడు. అన్నట్లు ‘కొచ్చాడియన్’ సినిమాకు సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బావ ధనుష్ హీరోగా ‘వీఐపీ 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు సౌందర్య. అయితే దర్శకురాలిగా రెండు వైఫల్యాలను చవిచూడటంతో నిర్మాణం వైపు డైరెక్షన్ మార్చారేమో! హిందీ హిట్ ‘క్వీన్’ చిత్రం సౌత్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు పరుల్ ఒక నిర్మాతగా ఉన్నారు. కన్నడ రీమేక్ ‘బటర్‌ఫ్లై’లో పరుల్ యాదవ్ కథానాయికగా నటించారు. విశేషం ఏంటంటే.. ‘క్వీన్’ సౌత్ రీమేక్లన్నింటికి సహ–నిర్మాతల లిస్ట్‌లో కన్నడ బ్యూటీ పరుల్ యాదవ్ పేరు ఉంది. సో... పరుల్ కూడా ప్రొడక్షన్లోకి వచ్చినట్లే. టాలీవుడ్లో సమంత ఎంత పెద్ద స్టార్ హీరోయిన్నో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే... డైరెక్షన్ పట్ల తనకు పెద్దగా ఆసక్తి లేదని భవిష్యత్‌లో నిర్మాణ రంగంవైపు దృష్టి పెట్టాలనే ఆలోచన మాత్రం ఉందని ఓ సందర్భంలో సమంత చెప్పుకొచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక కొణిదెల కూడా ప్రొడక్షన్వైపు తనకు ఆసక్తి ఉందన్నారు. ఆల్రెడీ వెబ్ సిరీస్‌లను ప్రొడ్యూస్ చేస్తున్నానని, భవిష్యత్‌లో సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందని ఇటీవల చెప్పారు. చార్మింగ్ ప్రొడ్యూసర్ తెలుగుతెరపై కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు నటి చార్మీ. ‘మాస్, అనుకోకుండా ఒకరోజు, మంత్ర’ వంటి హిట్ చిత్రాలు కథానాయికగా ఆమె లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత హీరోయిన్గా కెరీర్లో కాస్త స్లో అయ్యారు. కానీ నిర్మాతగా జోరు పెంచారు చార్మీ. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల (రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’) నిర్మాణాన్ని చూసుకుంటూ ‘చార్మింగ్ ప్రొడ్యూసర్’ అనిపించుకుంటున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ పూరీ కనెక్ట్స్‌తో కలిసి ఆమె ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. 2017లో వచ్చిన ‘రోగ్’ సినిమాకు తొలిసారి కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ‘పైసా వసూల్, మెహబూబా’ సినిమాలకు కూడా ఆమె నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. ఆ అనుభవంతో ఒకేసారి ‘ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్’ చిత్రాల నిర్మాణాన్ని చాకచక్యంగా చూసుకుంటున్నారని చెప్పొచ్చు. బాలీవుడ్లో అగ్రకథానాయికలుగా ఎదిగిన ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ‘వెంటిలేటర్’ అనే చిత్రానికి ప్రియాంకా చోప్రా అయితే నిర్మాతగా జాతీయ అవార్డును కూడా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ నిర్మాతగా మారారు. ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ‘రాజీ’ ఫేమ్ మేఘన్ గుల్జార్ దర్శకత్వంలో ‘చప్పాక్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మి పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే నిర్మాతగా మారారు దీపికా పదుకోన్. ఇక ఇప్పుడిప్పుడే నటిగా పైకొస్తున్న స్వరా భాస్కర్ కూడా నిర్మాతగా మారారు. ‘‘తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, ఎక్స్: పాస్ట్ అండ్ ప్రజెంట్, వీరే ది వెడ్డింగ్’’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు స్వర. ఆమె తన తమ్ముడు ఇషాన్ భాస్కర్‌తో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశారు. కొత్త కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికే నిర్మాతగా మారాను అని స్పష్టం చేశారు స్వరాభాస్కర్. మరో యువనటి రీచా చద్దా కూడా నిర్మాతల జాబితాలో చేరారు. ఫుక్రే, మసాన్ వంటి సినిమాల్లో నటించిన రీచా చద్దా ఇటీవల షకీలా బయోపిక్‌లో నటించారు. ‘‘హీరోయిన్లు కెమెరా ముందు నటించడానికి మాత్రమే కాదు. డైరెక్షన్, రైటింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని క్రాఫ్ట్స్‌లో సత్తా చాటగలరు’’ అని రీచా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కంగానా రనౌత్ కూడా ప్రొడక్షన్ ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కథానాయికగా ఉన్న కంగనా ఇటీవల ‘మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంలో కొన్ని సన్నివేశాల కోసం మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. అలాగే కన్ఫార్డ్మ్గా చెప్పలేదు కానీ సోనమ్ కపూర్, ఆలియా భట్ కూడా భవిష్యత్‌లో ప్రొడక్షన్ వైపు అడుగులు వేసే ప్లాన్‌లో ఉన్నట్లు మాత్రం చెబుతున్నారు. – ముసిమి శివాంజనేయులు -
సినిమాల విడుదలపై నిర్మాతల్లో ముదిరిన వివాదం
సాక్షి, హైదరాబాద్: పండుగ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి కనబరుస్తారు. తెలుగునాట పెద్ద పండుగైనా సంక్రాంతికి తమ సినిమాను బరిలో నిలిపి ప్రాఫిట్ పొందాలని నిర్మాతలు భావిస్తారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల విడుదలపై నిర్మాతల్లో నెలకొన్న వివాదం ముదిరింది. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేట చిత్రానికి తెలుగు రాష్ట్రాలో థియేటర్లు దొరకడం లేదంటూ నిర్మాత అశోక్ వల్లభనేని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అశోక్ వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత దిల్‌రాజు.. సంక్రాంతికి తెలుగు నుంచి 3 పెద్ద సినిమాలు విడుదలవుతుంటే అనువాద చిత్రానికి ధియేటర్లు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు. తెలుగు సినిమాలకే థియేటర్లు సరిపోని పరిస్థితి నెలకొందన్నారు. గతేడాది పంపిణీదారుడిగా చాలా డబ్బులు పోగొట్టుకున్నానని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమాల విడుదల తేదీలను ఆరు నెలల ముందే ప్రకటించినట్టు తెలిపారు. అశోక్ అనుచితంగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. కాగా, ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’, బాలకృష్ణ ‘ఎన్టీఆర్’, వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్2’ చిత్రాలతో పాటు పేట చిత్రం కూడా విడుదల కాబోతుంది. -
జనవరి నుంచి పండగే...తగ్గనున్న టికెట్ల రేట్లు
సాక్షి, న్యూఢిల్లీ: సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గిస్తూ శనివారం, ఢిల్లీలో జరిగిన 31వ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో సినిమా పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. కౌన్సిల్ నిర్ణయాలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దాదాపు 33 వస్తువులపై ఇప్పటివరకు వున్న 18శాతం జీఎస్టీని 12, 5 శాతానికి తగ్గించామనీ, అలాగే 28శాతం జీఎస్టీ స్లాబునుంచి 6 వస్తువులను 18శాతానికి తగ్గించినట్టు ఆర్థికమంత్రి తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయంపై దాదాపు 55వేల కోట్ల రూపాయల భారం పడునుందని జైట్లీ వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక ప్రకటన జారీ చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు సిద్ధార్థ్‌రాయ్ కపూర్ వెల్లడించారు. భారతీయ సినీ పరిశ్రమ తరపున ప్రభుత్వానికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ నిర్ణయం ఇండస్ట్రీలో మరిన్ని పెట్టుబడులకు, పరిశ్రమ అభివృద్ధికి అవకాశం లభిస్తుందన్నారు. 100రూపాయల లోపు ఉన్న సినిమా టికెట్లపై వసూలు చేసే జీఎస్టీ 18 శాతంనుంచి 12 శాతానికి, రూ.100 రూపాయలకు మించిన టికెట్లపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ సవరించిన జీఎస్టీ రేట్లు జనవరి 1, 2019నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. -
నీదీ నాదీ ఒకే దారి
‘ఇష్క్ జాదే’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు అర్జున్ కపూర్, పరిణీతీ చోప్రా. తాజాగా ‘నమస్తే లండన్’ సినిమాలో కలసి యాక్ట్ చేశారు. అయితే త్వరలోనే ఈ ఇద్దరూ ప్రొడ్యూసర్స్‌గా మారనున్నారట. ప్రస్తుతానికి సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసే ప్లాన్ వేస్తున్నారు. దానికి సంబంధించిన పనులను కూడా మొదలెట్టారని బాలీవుడ్ టాక్. అర్జున్ కపూర్ తాత సురీందర్ కపూర్, తండ్రి బోనీ కపూర్ ఆల్రెడీ బడా ప్రొడ్యూసర్స్. అయితే తన ఆలోచనలకు తగ్గ సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యంగ్ హీరో సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నాడట. అలాగే పరిణీతీ చోప్రా తన కజిన్ ప్రియాంకలానే నిర్మాతలా మారాలనుకున్నారట. ఒకేసారి హీరో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ఇద్దరూ ఒకేసారి నిర్మాణ రంగంలోకి ప్రవేశించాలనుకోవడం విశేషం. అన్నట్లు.. ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నారని టాక్. -
బాహుబలి నిర్మాతల భారీ ప్రాజెక్ట్
బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్కా మీడియా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు రెడీ అవుతోంది. బాహుబలి తరువాత రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అదే సమయంలో బుల్లితెర మీద బాహుబలి స్థాయిలో ఓ భారీ టీవీ సీరియల్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సీరీస్‌ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారట. ఇప్పటికే ప్రస్థానం ఫేం దేవ కట్టా ఫైనల్ కాగా ఓ హిందీ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ భారీ వెబ్ సీరీస్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
నిర్మాతలు కదా బాధ పడాల్సింది.. వారికెందుకు
హీరోయిన్ అదితిరావ్ హైదరి రెండవ చిత్రంతోనే తన పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం హల్చల్ చేస్తోంది. ఈ వార్తలపై ఉత్తరాది భామ స్పందించింది. తాను పారితోషికం పెంచినట్లు కొందరు వదంతులు ప్రచారం చేస్తున్నారు. అయినా పారితోషికం గురించి వారికేందుకు బాధ.. ఆ విషయంలో నిర్మాతలు కదా బాధ పడాల్సిందని అదితి చురకలు వేసింది. డబ్బు మీద కంటే మంచి పాత్రలే ముఖ్యం అని ఆమె పేర్కొంది. ఇప్పటివరకూ హిందీ, తమిళ చిత్రాల్లోనే నటిస్తున్నాను.. ప్రస్తుతం తెలుగులోనూ నటించే అవకాశం వచ్చిందని అదితి చెప్పుకొచ్చింది. తెలుగులో సుధీప్‌కు జంటగా ‘సమ్మోహనం’ అనే చిత్రంలో నటిస్తున్నానని తెలిపింది. మూడు భాషల్లో నటించడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. గ్లామరస్ పాత్రలు తనకు నప్పవని, హిందీలో కూడా అలాంటి పాత్రల్లో నటించలేదన్నారు. మోడ్రన్ దుస్తులు ధరించినా అధిక చిత్రాల్లో తన పాత్రలు హోమ్లీగానే కనిపిస్తాయని తెలిపింది. అలా నటించడమే చాలా ఇష్టమని అదితిరావ్ పేర్కొంది. దర్శకుడు మణిరత్నం మెచ్చిన నటిగా ఈ బ్యూటీ గుర్తింపు పొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన కాట్రువెలియిడై చిత్రంతో కోలీవుడ్‌కు అదితిరావ్ పరిచయమైంది. ప్రస్తుతం మరోసారి తన చిత్రం సెక్క సివంద వానంలోనూ మణిరత్నం అవకాశం కల్పించారు. -
సల్మాన్ నిర్మాతల్లో గుబులు
సాక్షి, ముంబయి : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో బాలీవుడ్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. సల్మాన్ హీరోగా రూ వందల కోట్లతో పలు సినిమాలు రూపొందుతుండటంతో ఆయా చిత్ర నిర్మాతల్లో ఉత్కంఠ నెలకొంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సల్మాన్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. బాలీవుడ్ కండలవీరుడు ప్రస్తుతం రెమోడిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రేస్ 3 దుబాయ్ షెడ్యూల్‌ను ఇటీవల పూర్తి చేశారు. ఈద్ సందర్భంగా ఈ మూవీ జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. రేస్ 3తో పాటు అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్న భరత్ మూవీకి పనిచేయాల్సి ఉంది. భరత్ తర్వాత సోనాక్షి సిన్హాతో కలిసి దబాంగ్ 3 సెట్స్‌లో అడుగుపెడతారు. కిక్ 2లో కూడా సల్మాన్ నటించేందుకు రంగం సిద్ధమైంది. ఇంతవరకూ షూటింగ్‌కు వెళ్లని ఈ మూవీని 2019 క్రిస్మస్కు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొద్ది నెలల్లో ప్రసారమయ్యే టెలివిజన్ సో దస్ కా దమ్‌ను సల్మాన్ నిర్వహిస్తున్నారు. ఇక రియాల్టీ షో బిగ్ బాస్‌లో తిరిగి సల్మాన్‌ను ప్రవేశపెట్టాలని మేకర్లు భావిస్తున్నారు. కృష్ణజింకల కేసులో సల్మాన్‌ను జోధ్‌పూర్ కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఈ ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకమైంది. -
సూర్య కీలక నిర్ణయం.. వాళ్లకు చిక్కులే!
సాక్షి, చెన్నై : కోలీవుడ్ హీరోలు, సూర్య, విశాల్, కార్తీలు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిర్మాతలపై భారాన్ని తగ్గిస్తూ.. తమ వ్యక్తిగత సిబ్బందులకు తామే జీతాలు చెల్లించేందుకు వాళ్లు సిద్ధమైపోయారు. సాధారణంగా కోలీవుడ్‌లో ఆర్టిస్టుల మేకప్‌మెన్, డిజైనర్లు ఇతరత్రా వ్యక్తిగత సిబ్బందికి నిర్మాతలే ఇంత కాలం జీతాలు చెల్లించుకుంటూ వస్తున్నారు. కొందరు స్టార్లైతే ఏకంగా బౌన్సర్ల జీతభత్యాలను కూడా నిర్మాతల ఖాతాల్లోనే వేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ సమస్యలపై ఈ మధ్యనే తమిళ నిర్మాతల మండలి చర్చించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలపై భారం తగ్గించేందుకు తన సిబ్బందికి తానే జీతం చెల్లిస్తానని సూర్య ముందుకు వచ్చారు. ఆ వెంటనే సూర్య సోదరుడు-హీరో కార్తీ, నడిగర్ సంఘం కార్యదర్శి, హీరో విశాల్ కూడా సూర్య బాటలో పయనిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సొంత బ్యానర్లోనే ఎక్కువ చిత్రాలు చేసే ఈ హీరోలకు ఈ నిర్ణయం పెద్ద సమస్యకాకపోవచ్చని... ఇతర నటీనటులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కోలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. -
16 నుంచి థియేటర్లకు తాళం
తమిళసినిమా: ఈ నెల 16వ తేదీ నుంచి తమిళనాడులోని అన్ని థియేటర్లలో ప్రదర్శనలను నిలిపివేయనున్నట్లు థియేటర్ల యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే దక్షిణాది నిర్మాతలకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు మధ్య రేట్లు తగ్గించాలన్న విషయంపై చర్చలు విఫలం కావడంతో మార్చి ఒకటవ తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను విడుదలను నిలిపేశారు. ఈ వ్యవహారంలో తెలుగు చిత్ర నిర్మాతలకు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య బుధవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో అక్కడి నిర్మాతలు కొత్త సినిమాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే తమిళ నిర్మాతలు మాత్రం సమ్మె కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం తమిళనాడు థియేటర్ల సంఘం నిర్వాహకులు చెన్నైలోని రోహిణి థియేటర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. సంఘం కార్యదర్శి పన్నీర్‌సెల్వం నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి ఇచ్చిన హామీలను వారంలోగా నెరవేర్చాలని లేనిపక్షంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రదర్శనలను నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విధిస్తున్న వినోదపు పన్ను 8శాతాన్ని పూర్తిగా రద్దు చేయాలి. థియేటర్ల నిర్వహణ చార్జీలను ఏసీ థియేటర్లకు ఒక్క రూపాయి నుంచి రూ.5వరకూ, నాన్ ఏసీ థియేటర్లకు 50పైసల నుంచి రూ.3వరకూ పెంచేందుకు అనుమతించాలని, థియేటర్ల లైసెన్స్ మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకునేలా చర్యలు చేపట్టాలి తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఇలా ఉండగా నిర్మాతల మండలి నిర్ణయంతో తమకు ఎలాంటి సమస్యలేదని, ప్రభుత్వం విధిస్తున్న 8శాతం వినోదపు పన్ను కారణంగానే నష్టపోతున్నామని థియేటర్ల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 16వ తేదీ నుంచి చిత్రాల షూటింగ్‌ను సైతం రద్దు చేస్తున్నట్టు నిర్మాతల మండలి నిర్ణయించింది. -
సినిమా హిట్.. కారు గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : నాగశౌర్య, రష్మిక నటించిన ఛలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రెండు వారాల్లో సుమారు రూ.23.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. శాటిలైట్, రీమేక్ హక్కులతో మరో ఆరు కోట్లవరకూ బిజినెస్ చేసి 2018లో బ్లాక్‌బస్టర్‌గా నిలించింది. ఈ సందర్భంగా నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉషా ముల్పూరి సినిమాకు పనిచేసిన 24 రంగాలకు చెందిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సినిమా ప్రారంభం రోజునే అనుకున్నామని, హిట్ అవగానే సినిమాకు కష్టపడి పని చేసిన వారిని సత్కరించాలని అనుకున్నామని తెలిపారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారికి తాము ఇచ్చే చిరుకానుక అని అన్నారు. ఐరా బ్యానర్ ప్రారంభించడానికి కారణమైన వెంకీ కుడుములకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుములకు నిర్మాతలు కారు బహుమతిగా ఇచ్చారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి సినిమా నిర్మించిన నిర్మాతల రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ సినిమా చేసే అవకాశం ఇవ్వడం గిఫ్ట్ అయితే, హిట్ అవడం డబుల్ గిఫ్ట్ అని, ఇక నిర్మాతలు కారు బహుమతిగా ఇవ్వడం జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌గా భావిస్తున్నానని తెలిపారు. నాగ శౌర్యలేకపోతే తాను లేనని, తన హీరోను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు. -
సినీ నిర్మాతలు,దర్శకులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త
-
లావణ్యకు భారీ జరిమానా!
సాక్షి, సినిమా: లావణ్య త్రిపాఠీ చిక్కుల్లో పడింది. ఆమెకి కోలీవుడ్ నిర్మాతల సంఘం మూడు కోట్ల రూపాయల జరిమానా విధించిందని తమిళ చిత్ర వర్గాలు అంటున్నాయి. తెలుగులో మంచి హిట్టయిన 100% లవ్ సినిమాను తమిళంలో 100% కాదల్ గా రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు కథానాయకిగా లావణ్య త్రిపాఠీని ఎంచుకున్నారు. కానీ షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే లావణ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దీంతో చిత్రీకరణను నిలిపివేశారు. అప్పటికే నిర్మాతలకు మూడు కోట్ల రుపాయల నష్టం వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలు.. సంఘాన్ని ఆశ్రయించడం జరిగిపోయింది. అయితే జరిమానా విషయంపై లావణ్య నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తాజాగా ఈ చిత్ర కథానాయకిగా అర్జున్‌రెడ్డి ఫేం షాలిని పాండేను ఎంపిక చేశారు. కథానాయకుడిగా జి.వి. ప్రకాశ్ నటిస్తున్నారు. -
విద్యార్థులే నిర్మాతలు
తమిళసినిమా: విద్యార్థులతో పెట్టుకోకూడదు. వారు తలుచుకుంటే ఏమైనా చేస్తారు అంటారు. అది సినిమా రంగంలోనూ నిజం అవుతోంది. అవును కథ నచ్చడంతో ఏకంగా 50 మంది విద్యార్థులు కలిసి సినిమా నిర్మించేస్తున్నారు. ఆ చిత్రం పేరు నెడు నల్వాడై. బీ స్టార్స్ ప్రొడక్షన్స్ పతాకంపై వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక తాత పాత్రలో 70 ఏళ్ల పూరాము అనే నటుడు నటించడం విశేషం. ఆయనతో పాటు ఇళంగో, అంజలీనాయర్, మైమ్‌గోపీ, ఐందుకోవిలాన్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను సెల్వ కన్నన్ నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ మారుతున్న ఈ ఆధునిక యుగంలో మన సంస్కృతి, సంప్రదాయాలను తెరపై ఆవిష్కరించే కథా చిత్రాల రాక అరుదైపోతోందన్నారు. అయితే అలాంటి మంచి కథా చిత్రాలపై ప్రేక్షకులు మాత్రం ప్రత్యేక ఆదరణ చూపుతూనే ఉన్నారని అన్నారు. అలాంటి మన సంస్కృతిని ఆవిష్కరించే చిత్రంగా నెడు నల్వాడు ఉంటుందన్నారు. ఇది తాతామనవళ్ల ప్రేమానుబంధాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. నెల్లై జిల్లాలో ఇప్పటికీ జీవిస్తున్న ప్రజల జీవన విధానాన్ని యదార్థంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. తనతో పాటు నెల్లైలోని శంకర్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకున్న 50 మంది విద్యార్థులు కథ నచ్చడంతో నిర్మించడానికి ముందుకొచ్చారని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ నెడు నల్వాడై చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆగస్ట్ నెలలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సెల్వ కన్నన్ వెల్లడించారు. -
ఛాన్స్ అడిగితే... ఆ ఛాన్స్ అడుగుతున్నారు!
కెరీర్‌ను కష్టంతో అల్లుకోవాలి. కానీ, ఇక్కడేమో నవ్వారుతో అల్లేస్తున్నారు. ఎన్నో కలలు, ఆశలతో రంగుల లోకంలో అకాశమంత ఎత్తుకి ఎగరాలని వచ్చినోళ్లను రెండు కాళ్లపై ఎదగనివ్వక నాలుగు కోళ్ల నవ్వారుపైకి రావాల్సిందేనంటున్నారు! ఈ మాటలంటున్నది ఎవరో కాదు... రత్తాలు రాయ్ లక్ష్మి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ (అవకాశాల కోసం అమ్మాయిలు లైంగిక సుఖాలు అందించడం) ఉందన్నారామె. ‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తమ్మాయిలు, హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్లను నిర్మాతలు, ఫిల్మ్ మేకర్స్ పీడిస్తున్నారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ ఇండస్ట్రీకి సరాదాల కోసం, సుఖాలు అనుభవించడం కోసం (స్లీప్ అరౌండ్) వస్తారు’’ అని మొహమాటం లేకుండా ఇండస్ట్రీ తీరును ఎండగట్టారు రాయ్ లక్ష్మి. ‘‘తమ సుఖాల కోసం పేరున్న ఆర్టిస్టులను కూడా వీళ్లు వదలడం లేదు. తమతో పడక పంచుకోవడానికి నిరాకరించిన ఆర్టిస్టులను కొందరు ఫిల్మ్ మేకర్స్ సినిమా నుంచి తప్పిస్తున్నారు’’ అని బోల్డ్‌గా చెప్పేశారీ బ్యూటీ. ‘కాస్టింగ్ కౌచ్’ అన్ని ఇండస్ట్రీలలోనూ ఉందన్నారు. నిజం చెప్పాలంటే తనకెప్పుడూ అటువంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పుకొచ్చారు. -
షరతులు వర్తిస్తాయి!
‘మేం చెప్పినట్లు చేయాల్సిందే. కాదు కూడదంటే సినిమా వదులుకోవాల్సిందే’... బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చే నటీనటులకు ఇలాంటి కండీషన్స్ ఉంటాయి. స్టార్ అయ్యాక సీన్ రివర్స్ అవుతుంది. సినిమా ఒప్పుకునే ముందు ‘ఇలాంటివి చేయం’ అని వీళ్లే కండీషన్లు పెడతారు. ప్రస్తుతం నయనతార ఆ స్థాయిలోనే ఉన్నారు. ఈ మధ్య తెలుగు సినిమాలు తగ్గించేసి, వరుసగా తమిళ సినిమాలు ఒప్పు కుంటున్నారు ఈ మలయాళ బ్యూటీ. అది కూడా తన కండీషన్లకు ఒప్పుకునే దర్శక– నిర్మాతలతోనే సినిమాలు చేస్తున్నారామె. ‘సినిమాలో నటిస్తా కానీ, ప్రచార కార్యక్రమాలకు పిలవొద్దు’ అని ఎప్పుడో కండీషన్ పెట్టారు. అందుకే ప్రచార కార్యక్రమాల్లో ఆమె కనిపించరు. తాజాగా మూడు నిబంధనలు పెట్టారట. వాటికి సమ్మతించినవాళ్లకే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చెన్నై టాక్. ఆ మూడు నిబంధనల విషయానికొస్తే.. లిప్ లాక్ సీన్స్‌లో నటించనన్నది మొదటి కండీషన్, స్నానం చేసే సీన్స్‌కి నో అన్నది రెండోది, చిట్టిపొట్టి దుస్తులు వేసుకోనన్నది మూడో కండీషన్. కథ వినే ముందే నయనతార ఈ నిబంధనలను చెప్పేస్తున్నారట. స్టార్ హీరోయిన్ పెట్టే షరతులను కాదంటారా? అందుకే చిత్తం అని దర్శక–నిర్మాతలు అంటున్నారట. -
నాగచైతన్య హీరో...రానా నిర్మాత!
‘ఓన్లీ హీరోగానేనా? ఇంకా ఏమైనా చేయాలని ఉందా?’ అని నాగచైతన్యను ఓ ఇంటర్వ్యూలో ‘సాక్షి’ అడిగితే.. ‘నాకు ప్రొడక్షన్ అంటే ఇంట్రస్ట్ అండి. అందుకని భవిష్యత్తులో నిర్మాతగా మారతా’ అన్నారు. ఇప్పుడా సమయం దగ్గర పడినట్లే అనిపిస్తోంది. బావ (చైతూకి రానా మేనమామ కొడుకు అవుతాడనే విషయం తెలిసిందే) రానాతో కలసి ఆ ప్రయత్నం మీదే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతకన్నా ముందే రానా నిర్మాతగా నాచైగతన్య హీరోగా ఓ సినిమా రూపొందనుంది. మాతృసంస్థ సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఇప్పటివరకూ చైతూ సినిమా చేయలేదు. ఇప్పుడో సినిమా కుదిరిందట. అయితే ఆ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించాలనుకుంటు న్నారు. ఆ తర్వాత తామిద్దరూ కలసి నిర్మించే చిత్రాల గురించి రానా – చైతూ పకడ్బందీగా ప్రణాళికలు వేసుకుని రంగంలోకి దిగుతారట. అన్నట్లు రానాకు నిర్మాతగా ఇది మొదటి సినిమా కాదు. గతంలో కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో బాలల చిత్రం ‘బొమ్మలాట’ నిర్మించారు. హిందీ హీరో అక్షయ్ కుమార్‌తో కలసి ఇప్పుడు కొన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నారు. -
వారిని చూస్తే బాధేస్తుంది
ఆ నిర్మాతలను చూస్తే బాధేస్తుందంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ఇంతకీ ఈ అమ్మడు చెప్పేదేమిటి? తొలిరోజుల్లో తమన్నా కోలీవుడ్‌లో విజయ్, ధనుష్, సూర్య, కార్తీ, అజిత్ వంటి టాప్ హీరోలతో నటించారు.అయితే చిన్న గ్యాప్ తరువాత రీఎంట్రీ అయిన తమన్నాను బాహుబలి, తోళా చిత్రాలు విజయాలతో పరికరించాయి. దీంతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్నారనే చెప్పాలి. ప్రస్తుతం బాహుబలి-2, విజయ్‌సేతుపతితో ధర్మదురై, ప్రభుదేవాకు జంటగా దేవి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. శివకార్తికేయన్ లాంటి యువనటులతో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇలా బిజీగా ఉన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ తానే కాదు ప్రతి నటి, నటుడు తాము నటించే చిత్రాలు విజయం సాధించాలన్న భావంతోనే శ్రమించి నటిస్తారన్నారు. అయినా కొన్ని చిత్రాలు అపజయం చెందుతాయన్నారు. అలాంటప్పుడు చాలా మనస్థాపం కలుగుతుందన్నారు. ఇక ఆ చిత్రాల నిర్మాతలను చూస్తే బాధేస్తుందని చెప్పారు. చిత్ర విజయాన్ని నిర్ణయించేది కథేనని అన్నారు.అందుకే తాను కథ నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తున్నానన్నారు. తనకు కథ చెప్పడానికి వచ్చిన దర్శక నిర్మాతలతో కథ నచ్చకపోతే నటించనని నిర్మొహమాటంగా చెప్పేస్తానన్నారు. తన చిత్రాలు విజయం సాధించాలి, నిర్మాతలు సంతోషంగా ఉండాలన్నదే తన భావన అని తమన్న పేర్కొన్నారు. -
చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలి
సినీనటుడు సుమన్ హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం చిన్న సినిమాలకు సబ్సిడీలతో ప్రోత్సాహం అందించాలని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పెద్ద సినిమాల ధాటికి చిన్న సినిమాల నిర్మాతలు తట్టుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాలకు థియేటర్ల ఏర్పాటు ద్వారా చేయూతనందించాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ చరిత్ర నేపథ్యంతో చిత్రీకరించిన సినిమాలకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు అందజేయాలన్నారు. అనంతరం సుమన్‌ను పలువురు సన్మానించారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు యరగాని నాగన్నగౌడ్, కాంగ్రెస్ పార్టీ నగరపంచాయతీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, న్యాయవాది కుక్కడపు బాలకృష్ణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కోదాడలో ‘ఇదో ప్రేమలోకం’ కోదాడ : కోదాడ పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా ఇదో ప్రేమలోకం సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ప్రముఖ నటుడు సుమన్ ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. సోమవారం హీరో సుంకర అశోక్, హీరోయిన్ తేజారెడ్డి,సుమన్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. కోదాడవాసి సుంకర పుల్లయ్య నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోడి రామకృష్ణ శిష్యు డు కరణ్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. -
ఒక సినిమా, ఆరు నిర్మాణ సంస్థలు
ఇండస్ట్రీలో రోజు రోజుకు భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ పరిధులు దాటి పోతుండటంతో నిర్మాణ రంగంలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయటం కార్పోరేట్ కంపెనీలతో చేతులు కలుపుతున్నారు భారీ చిత్ర నిర్మాతలు. అదే బాటలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ సినిమా కోసం ఏకంగా ఆరు నిర్మాణ సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఓ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమాకు బడ్జెట్ 80 కోట్ల వరకు అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇంత భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం ఆరు నిర్మాణ సంస్ధలు కలిసి పని చేయనున్నాయి. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఠాగూర్ మధు, ఎన్వీప్రసాద్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, లియో ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ లు నిర్మాణంలో భాగం పంచుకుంటాయి. ఇక హీరో మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తాడు. -
యూ సర్టిఫికెట్ కోసం బతిమాలుతున్నారు
చిత్రాలకు యూ సర్టిఫికెట్ కావాలంటూ నిర్మాతలు బతిమలాడుతున్నారని సీనియర్ నటుడు,సెన్సార్ బోర్డు సభ్యుడు ఎస్వి.శేఖర్ వ్యాఖ్యానించారు. ఎంఎస్‌జీ. మూవీస్ పతాకంపై జి.హరి నిర్మించిన చిత్రం జంబులింగం. 3డీ ఫార్మెట్లో రూపొందిన ఈ చిత్రానికి హరి అండ్ హరీష్ ద్వయం కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. వీరు ఇంతకు ముందు జంబులి 3డీ తదితర ప్రయోగాత్మక సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి మహిళా సంగీత దర్శకురాలు శ్రీవిద్య సంగీతాన్ని అందించడం విశేషం. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్వీ.శేఖర్ మాట్లాడుతూ నిర్మాతలు బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందన్నారు.అయితే చాలా మంది నిర్మాతలు చిత్ర నిర్మాణంపై అవగాహన లేకుండానే చిత్రాలు నిర్మించడానికి సిద్ధం అవుతున్నారన్నారు. విదేశాల్లో చిత్రీకరణ అంటూ స్క్రిప్ట్ లేకుండానే అక్కడ చిత్ర నిర్మాణాలు చేస్తున్నారన్నారు. చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలకు ఎలాగైనా యూ సర్టిఫికెట్ కావాలంటూ సెన్సార్ బోర్డు సభ్యులను బతిమలాడుతున్నారన్నారు. నిజానికి అలా బతిమలాడాల్సిన అవసరం లేదన్నారు. మంచి స్క్రిప్ట్‌తో ప్రణాళిక ప్రకారం చిత్రాలు చేసుకోవాలని హితవు పలికారు. మరో విషయం ఏమిటంటే నిర్మాతలు ము సర్టిఫికెట్ల కోసం బతిమలాడడానికి ప్రభుత్వం కూడా ఒక కారణం అని పిస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసమే యూ సర్టిఫికెట్ కోసం పడరాని పాట్లు పడుతున్నారని, అసలు ప్రభుత్వం యూ, యూఏ అనే భేదాలు లేకుండా చిత్రానికి ఇంత సబ్సిడీ అని చెల్లిస్తే నిర్మాతలకు ఈ సమస్యలు ఉండవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక జంబులింగం చిత్రం గురించి చెప్పాలంటే ఈ చిత్ర యూనిట్ జపాన్‌లో చిత్రీకరణ నిర్వహించినా మంచి స్క్రిప్ట్‌ను తీసుకెళ్లినట్లుందన్నారు. జంబులింగం ఈ వేసవి కాలంలో కుటుంబ సభ్యులు పిల్లలను తీసుకుని చూసి ఆనందించే చిత్రం అన్నారు. దర్శకుడు పి.వాసు, వైజీ.మహేంద్రన్, సంగీత దర్శకుడు గంగై అమరన్, కృష్ణ స్వీట్స్ మురళి, జపాన్ దేశ కోఆర్డినేటర్ సుహానో జెనిసీ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ఎంపీఎస్ ఫిలింస్ సంస్థ ఈ నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. -
'పులి' నిర్మాతలపై శ్రీదేవి కేసు
చాలా కాలం తరువాత పులి సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆ సినిమాలో శ్రీదేవి పాత్ర, ఆమె గెటప్, ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ అభిమానులను కూడా ఆకట్టుకున్నాయి. అయితే శ్రీదేవి వెండితెర మీద కనిపించిన ఆనందం అభిమానులకు ఎక్కువ రోజులు మిగల్లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పులి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంది. దీంతో భారీగా ఉంటుందనుకున్న శ్రీదేవి రీ ఎంట్రీ అతిలోక సుందరి అభిమానులను నిరాశపరిచింది. సినిమా షూటింగ్ సమయంలో పులి యూనిట్ తో శ్రీదేవి కి వివాదాలున్నట్టుగా చాలా వార్తలు వినిపించినా వాటిని కొట్టి పారేశారు. తాజాగా సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల తరువాత మరోసారి ఈ వివాదాలు తెర మీదకు వచ్చాయి. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం ఇవ్వలేదంటూ పులి నిర్మాతలపై శ్రీదేవి ముంబై ఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ చేసింది. త్వరలోనే ఈ కంప్లయింట్ ను చెన్నై చాంబర్ కు పంపేందుకు సిద్దమవుతున్నారు ముంబై వర్గాలు. -
హాలీవుడ్ రీమేక్స్ అక్కడి కథ... ఇక్కడి తెరపై!
ప్రపంచంలో పన్నెండు కథలే ఉంటాయట. ఏ సినిమా అయినా ప్రాథమికమైన ఆ కథల నుంచి మార్పులు, చేర్పులతో తయారవుతుందని సినీ పండితుల విశ్లేషణ. ఆ మాట అలా ఉంచితే, మన సినిమాల్లో చాలా వాటికి అమెరికా నుంచి కొరియా, జపాన్ దాకా అనేక దేశాల విదేశీ సినిమాలు స్ఫూర్తి అన్నది తరచూ వింటూనే ఉంటాం. చాలావరకు కాపీరైట్ తీసుకోకుండానే తెర కెక్కిన ఫ్రీమేక్లైతే, కొన్ని మాత్రం రీమేక్‌లు. అయితే, తాజాగా మన బాలీవుడ్ దర్శక, నిర్మాతలు కొందరు ‘ఫలానా హాలీవుడ్ సినిమాకు మాది రీమేక్’ అంటూ రైట్స్ తీసుకొని మరీ ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం తెర మీదకొ స్తున్న అలాంటి విదేశీ చిత్రాల స్వదేశీ రీమేక్‌లలో కొన్నిటి గురించి... అక్కడ గెలవని ‘వారియర్’... ఇక్కడ గెలుస్తాడా? అక్షయ్‌కుమార్, సిద్ధార్థ మల్హోత్రాలు బాక్సింగ్ రింగ్‌లో హోరాహోరీగా తలపడుతున్న దృశ్యాలు యూట్యూబ్‌లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అవి హిందీ చిత్రం ‘బ్రదర్స్’కి సంబంధించిన ప్రచార చిత్రంలోని సన్నివేశాలు. అన్నదమ్ముల మధ్య సాగే కథగా తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘వారియర్’ దీనికి ఆధారం. గెవిన్ ఒ కానర్ దర్శకత్వంలో రూపొందిన ఆ హాలీవుడ్ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ హాలీవుడ్ సినిమా ప్రేరణతో దర్శకుడు కరణ్ మల్హోత్రా ఈ ‘బ్రదర్స్’ చిత్రం తీస్తున్నారు. గతంలో హృతిక్ రోషన్‌తో ‘అగ్నిపథ్’ తెరకెక్కించిన కరణ్ మల్హోత్రా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందిస్తున్నారు. హాలీవుడ్ మాతృక ‘వారియర్’లో అత్యంత సహజంగా చిత్రీకరించిన పోరాట సన్నివేశాలకు బాగా పేరొచ్చింది. అందుకే, మాతృకకు ఏ మాత్రం తీసిపోని విధంగా ‘బ్రదర్స్’లో స్టంట్స్ డిజైన్ చేయాలని కరణ్ భావించారు. అందుకని ఏకంగా హాలీవుడ్ ‘వారియర్’కి పనిచేసిన స్టంట్ మాస్టర్స్నే ఇక్కడా రంగంలోకి దింపారు. కాగా, మాతృక కోసం తాము చేసిన యాక్షన్ పార్ట్ కన్నా, ‘బ్రదర్స్ ’లోని పోరాట సన్నివేశాలే బాగా వచ్చాయని ఈ హాలీవుడ్ నిపుణులు తెలిపారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. హాలీవుడ్లో ఫర్వాలేదనిపించుకున్న ‘వారియర్’ ఇక్కడ ‘బ్రదర్స్’గా సత్తా చూపిస్తుందా, లేదా అన్నది తెలియాలంటే ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే. ఈ థ్రిల్లర్ క్లిక్ అవుతుందా? పదేళ్ల పాటు కోమాలో ఉన్న ఓ యువతికి స్పృహ వస్తుంది. ఆమెకు అంతా కొత్తగా అనిపిస్తోంది. అప్పటికే పెళ్లయిందనీ, ఇప్పుడు తనకు సేవలు చేస్తోంది భర్తే అనీ ఆమె గ్రహిస్తుంది. కానీ కొన్ని ప్రశ్నలు ఆమెను వేధిస్తూ ఉంటాయి. ఆ సమాధానాల కోసం ఆమె చేసే అన్వేషణే - ‘బిఫోర్ ఐ గో టూ స్లీప్’ నవల కథ. 2011 ఏప్రిల్ 28 న మార్కెట్లోకి వచ్చిన ఈ నవల సంచలనం సృష్టించింది. ‘గ్లాడియేటర్’, ‘బ్లాక్ హాక్ డౌన్’, ‘బాడీ ఆఫ్ లౌస్’ తదితర చిత్రాల దర్శకుడు రిడ్లీ స్కాట్ దృష్టిని ఆకర్షించింది. చదువుతున్నంతసేపూ ఎంతో ఉత్కంఠకు గురి చేసిన ఈ నవలను సినిమాగా తీద్దామనుకున్నారాయన. వెంటనే కథను సెట్స్‌పైకి ఎక్కించేశారు. రోవన్ జోఫె దర్శకత్వంలో నికోల్ కిడ్‌మెన్, మార్క్ స్ట్రాంగ్, కొలిన్ ఫిర్త్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ‘బిఫోర్ ఐ గో టూ స్లీప్’ తెరకెక్కింది. హాలీవుడ్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే, ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి నిర్మాతలు విపుల్ షా, భూషణ్‌కుమార్‌లు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించడానికి హీరో సైఫ్ అలీ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. బాలీవుడ్ తెరపై... కొరియా కథ ఆ యువకుడు సాధారణ వ్యాపారి. ఒక పాప ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో అతను అనుకోకుండా రెండు డ్రగ్స్ మాఫియా ముఠాలతో తలపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఆ యువకుడి గురించి కొన్ని నిజాలు బయటకొస్తాయి. ఇంతకీ అతను ఎవరు? ఆ పాప ప్రాణాలు కాపాడగలిగాడా అన్న కథాంశంతో లీ జియాంగ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కొరియన్ చిత్రం ‘దమ్యాన్ ఫ్రమ్ నో వేర్’. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో జాన్ అబ్రహమ్ తానే హీరోగా, నిర్మిస్తున్నారు. హిందీలో ‘రాకీ హ్యాండ్సమ్’ అని పేరు పెట్టారు. గతంలో జాన్‌తో ‘ఫోర్స్’, అజయ్‌దేవగణ్‌తో ‘దృశ్యం’ చిత్రాలను తెరకెక్కించిన నిశికాంత్ కామత్ దర్శకుడు. శ్రుతీహాసన్, నటాలియా కౌర్ ముఖ్య తారలు. ఫ్రెంచ్ సినిమా... మన వెండితెరపై! మెడ కింద భాగం నుంచి శరీరం పనిచేయని క్వాడ్రప్లెజిక్ వ్యాధితో బాధపడే ఓ యువకుడికీ, అతని సంరక్షకుడైన ఒకప్పటి నేరస్థుడికీ మధ్య ఘట్టాలతో తెరకెక్కిన ఫ్రెంచ్ చిత్రం ‘ది ఇన్టచ్బుల్స్’. ప్యారా గ్లైడింగ్ సమయంలో ప్రమాదానికి గురై, మెడ కింద నుంచి శరీరం చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ ఫ్రెంచ్ చిత్రం తీశారు. ఈ చిత్రంలో ఫ్రాంకాయీస్ క్లుజెట్, ఒమర్ సై ముఖ్యతారలు. ఫ్రాన్స్‌లో జనం విపరీతంగా చూసిన ఈ సినిమా కూడా హిందీ తెరపైకి దిగుమతి అవుతోంది. మోహిత్ సూరి దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్‌జోహార్ ఈ హిందీ రీమేక్‌ను నిర్మించనున్నారు. ఇద్దరు హీరోలకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ కథానాయకునిగా ‘ఆషికి 2’ ఫేమ్ ఆదిత్యారాయ్ కపూర్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. సౌతిండియన్ సినిమాలదీ అదే వరస! విదేశీ చిత్రాల నుంచి కథ, కథనాన్ని అంది పుచ్చుకోవడంలో హిందీ దర్శక, నిర్మాతలే కాదు. మనవాళ్ళూ ముందంజలో ఉన్నారు. నాగార్జున, కార్తీ హీరోలుగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం తీస్తున్న ద్విభాషా చిత్రానికి కూడా ‘ది ఇన్‌టచబుల్స్’ అనే ఈ ఫ్రెంచ్ సినిమాయే ఆధారమని కోడమ్బాకమ్ వర్గాల కబురు. ఈ సినిమాలో తమన్నా ఒక కథానాయిక. కాగా, కమలహాసన్ నటిస్తూ, నిర్మిస్తున్న తాజా ద్విభాషా చిత్రం (తెలుగులో ‘చీకటి రాజ్యం’, తమిళంలో ‘తూంగావనమ్’) కూడా ఒక ఫ్రెంచ్ సినిమా ఆధారంగా అల్లుకున్నదేనని సమాచారం. ఫ్రెడరిక్ జార్డిన్ రూపొందించిన ‘స్లీప్‌లెస్ నైట్’ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ నుంచి ఈ సినిమా తయారవుతున్నట్లు కోడంబాకమ్ వర్గాల కథనం. నిజానికి, ఇలా ప్రసిద్ధ విదేశీ చిత్రాల ఆధారంగా మన సినిమాలు రావడం కొత్తేమీ కాదు. కాకపోతే, ఒకప్పుడు ఫలానా సినిమాకు ఇవి రీమేక్లన్న విషయం చెప్పేవారూ కాదు... కష్టపడితే తప్ప తెలిసేదీ కాదు. ఉదాహరణకు ఆమిర్‌ఖాన్, పూజాభట్లతో మహేశ్‌భట్ తీసిన హిందీ చిత్రం ‘దిల్ హై కీ మాన్తా నహీ’ (1991) అంతకు కొన్ని దశాబ్దాల క్రితం నాటి ఫ్రాంక్ కాప్రా సినిమా ‘ఇట్ హ్యాపెన్డ్ వన్ నైట్’ (1934)కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్. కానీ, ఆయన ఆ విషయం చెప్పనూ లేదు. ఒప్పుకోనూ లేదు. కానీ, ఇప్పుడు అలా కాదు. ఏ సినిమాకు ఏది మాతృక అన్నది వెంటనే చెబుతున్నారు. లేదంటే తెలిసిపోతుంది. ఏ సినిమా దేనికి రీమేక్ అయినా, కథతో పాటు కథనంలోనూ పట్టు ఉంటేనే అది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని వేరే చెప్పాలా! క్యాన్సర్‌తో బాధపడే అమ్మాయి ప్రేమ! మలబద్ధకంతో బాధపడే తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకునే కూతురి పాత్రలో ‘పీకూ’ సినిమాలో నటి దీపికా పదుకొనే అదరగొట్టారు. ఈ అభినేత్రి ఇప్పుడు కాన్సర్‌తో బాధపడే యువతిగా నటించనున్నారట. చిత్ర కథేమిటంటే... క్యాన్సర్ బారిన పడి చిన్నతనం నుంచే జీవితం మీద ఆశలు వదులుకున్న ఓ అమ్మాయి, తన లాగే క్యాన్సర్‌తో బాధపడే ఓ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఏంటీ? నాగార్జున, గిరిజలతో దర్శకుడు మణిరత్నం తీసిన ‘గీతాంజలి’ గుర్తొస్తోందా? ఇంచుమించు ‘గీతాంజలి’ కథలా అనిపించే హాలీవుడ్ చిత్రం ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’. జాన్ గ్రీన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. జోష్ బూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో షాలీన్ ఉడ్లీ, ఆన్సెల్ ఎల్గోర్ట్, నాట్ వోల్ఫ్ ముఖ్య తారలు. ఇప్పుడీ విషాదభరిత ప్రేమకథను బాలీవుడ్లో రీమేక్ చేద్దామనుకుంటున్నారు. దీపికా పదుకొనే కథానాయికగా దర్శకుడు హోమీ అడజానియా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు భోగట్టా. ఆద్యంతం నవ్వించేలా స్క్రిప్ట్‌లో మార్పులూ, చేర్పులూ చేస్తున్నారట దర్శకుడు హోమీ అడజానియా. - శశాంక్ -
పాడి రైతుల ధర్నా
కోలారు : ఎస్ఎన్ఎఫ్ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని 8.5 కంటె తక్కువ వెన్న శాతం కలిగిన పాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహక ధనాన్ని రూ.4 తక్కువ చేయడాన్ని ఖండిస్తూ తాలూకా పాల ఉత్పత్తి దారుల సహకార క్షేమాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. అంతకు ముందు ప్రభుత్వ అతిథి గృహం వద్ద నుంచి ర్యాలీగా కలెక్టరేట్ చేరుకుని బైఠాయించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ప్రోత్సాహక ధనాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాల ధరను కనీసం రెండు సంవత్సరాలకో సారి పెంచాలని కోరారు. పాల సంఘాలలో పనిచేసే సిబ్బందికి కనీస వేతనం నిర్ణయించాలని, ఆహార భద్రతా చట్టం కింద కార్యదర్శులపై తీసుకుంటున్న చర్యలను ఉపసంహరించుకోవాలని సూచిస్తూ జిల్లా కలెక్టర్ త్రిలోక్ చంద్రకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వి ఎం వెంకటేష్, కోచిముల్ డెరైక్టర్ ఆర్ రామకృష్ణేగౌడ, సంఘం కార్యదర్శి రామసంద్ర శివరుద్ర తదితరులు పాల్గొన్నారు. -
ప్రోడ్యూసర్స్గా మారిన టాలీవుడ్ హీరోలు
-
నిర్మాతల్ని హడలెత్తిస్తున్న హన్సిక
నటి హన్సిక నిర్మాతలను హడలెత్తిస్తున్నట్టు ప్రచారం జోరందుకుంటోంది. నిజానికి ఈ ఉత్తరాది బామకు కోలీవుడ్‌లో మంచి పేరు ఉంది. షూటింగ్‌లకు డుమ్మా కొట్టకుండా క్రమం తప్పకుండా, నిర్ణీత సమయానికి హాజరవుతుందని దర్శకులు పేర్కొంటూ వస్తున్నారు. అలాగే, దర్శకులు చెప్పినట్టు నటిస్తూ, గ్లామర్ విషయంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఎలాంటి కాల్ షీట్ సమస్యలు సృష్టించదన్న పేరు హన్సికకు ఉంది. అదేవిధంగా పారితోషికం కూడా న్యాయ బద్ధంగా తీసుకుంటుందన్న మంచి పేరు ఉంది. అయితే, తాజాగా హన్సిక నిర్మాతలను తన ఇతర ఖర్చులతో హడలెత్తిస్తున్న ప్రచారం కోలీవుడ్‌లో బయలు దేరింది. ఈ బ్యూటీ చెన్నైకు వస్తే, తాను కోరుకున్న నక్షత్ర హోటల్లోనే బసచేస్తుందట. నిత్యం ఆ హోటల్ నుంచే అన్ని రకాల భోజనాలు తెప్పించుకుంటుందని ప్రచారం. సాధారణంగా హీరోయిన్లకు ఇద్దరు లేదా, ముగ్గురు సహాయకులు ఉంటారు. అలాంటిది హన్సికకు ఏకంగా పది మంది సహాయకులు ఉండడం, వారి ఖర్చు భారాన్ని అంతా నిర్మాతల నెత్తిన వేస్తున్నట్టు ప్రచారం. అదే విధంగా షూటింగ్ సమయాల్లో కనీసం రెండు సార్లు అయినా, ఈ బామ ముంబైకు చెక్కేస్తూ, విమాన పయన ఖర్చును నిర్మాతల నెత్తినేస్తున్నదట. అదేవిధంగా ఇష్టం వచ్చినన్ని రోజులు నక్షత్ర హోటల్లో ఉంటూ, అన్ని రకాల ఖర్చులను నిర్మాతలకు అప్పగించే పనిలో పడిందని ప్రచారం సాగుతోంది. ఆమె పారితోషికం కంటే, ఈ ఖర్చులే అధికంగా ఉండడంతో నిర్మాతలు గగ్గోలు పెడుతున్నట్టు కోలీవుడ్‌లో టాక్. -
ప్రొడ్యూసర్స్‌గా మారుతున్న స్టార్ డైరెక్టర్లు
-
సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకటి ఏర్పాటైంది. పలువురు నిర్మాతలు, దర్శకుల సహకారంతో ఈ ఛాంబర్‌ను ఏర్పాటుచేశామని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఛాంబర్‌ను శనివారం ఏర్పాటుచేశారు. సినిమా పరిశ్రమలో వివాదాలు సహజమేనని ఈ సందర్భంగా దిలీప్ రాజా అన్నారు. విజయవాడలో సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, గుంటూరు - విజయవాడ మధ్య సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆయన తెలిపారు. -
టాలీవుడ్లో షూటింగులు బంద్!
-
సినిమా డిస్ట్రిబ్యూషన్ పై నిర్మాతల్లో ఆందోళన!
చెన్నై:సినిమా తీయడం ఒక ఎత్తైతే.. దాన్ని మార్కెట్ చేయడం మరో ఎత్తు. సినిమా తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సినిమాలు తీస్తున్నా.. వాటిని విజయవంతంగా పంపిణీ చేయడంపై తమిళ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తమిళనాడులో ప్రముఖ నిర్మాతాలైన కేఈ గ్నణవేల్ రాజా, ఎస్, శశికాంత్, సీవీ కుమార్, ఎల్రెడ్ కుమార్, అభినేష్ ఎలన్ గోవన్, లక్ష్మణ్ కుమార్ లు ఒక కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 'మేము ఎప్పట్నుంచో సినిమా డిస్ట్రిబ్యూషన్ పై పలు రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. అసలు తమిళనాడులో సినిమాను ఎలా మార్కెట్ చేయాలో తెలియడం లేదు. దీన్ని వ్యవస్థీకరించే మార్గం కనబడటం లేదు. ఇందుకు గాను ఒక కంపెనీని ఏర్పాటు చేస్తున్నాం' అని వారు స్పష్టం చేశారు. ఈ డ్రీమ్ ఫ్యాక్టరీతో నిర్మాతలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రూపుదిద్దుకున్నాక డిస్ట్రిబ్యూషన్-మార్కెటింగ్ కు మధ్య చోటుచేసుకునే సమస్యలకు తాము ఏర్పాటు చేసే కంపెనీ తగిన పరిష్కారం చూపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సరభమ్, మద్రాసు, యాన్, కావియా తలైయ్ వాన్, లుసియా చిత్రాలతో ఆ కంపెనీ సేవలు అందుబాటులోకి వస్తాయని నిర్మాతలు స్పష్టం చేశారు. -
నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న అవికా..?
-
ప్రొడ్యూసర్స్‌గా మారుతున్న యంగ్ హీరోస్
-
అనువివాదం చందన సీమలో డబ్బింగ్ ఫైట్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అనువాద (డబ్బింగ్) చిత్రాలను అనుమతించే విషయమై కన్నడ చిత్ర పరిశ్రమ రెండుగా చీలింది. డబ్బింగ్ చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని ఓ బలమైన వర్గం గట్టిగా వాదిస్తుండగా, ఇతర భాషల్లో వచ్చే మంచి చిత్రాలను చూసే స్వేచ్ఛ ప్రేక్షకులకు ఉండాలన్నది మరో వర్గం దృఢాభిప్రాయం. ఈ నేపథ్యంలో డబ్బింగ్‌కు వ్యతిరేకంగా సోమవారం కన్నడ చిత్ర పరిశ్రమ బంద్‌కు వాటాళ్ నాగరాజ్ పిలుపునిచ్చారు. కన్నడ చళువళి వాటాళ్ పక్ష తరఫున ఆయన భాషా, సంృ్కతులపై పోరాటాలు చేస్తూ ఉంటారు. కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఈ బంద్‌ను వ్యతిరేకిస్తోంది. కళాకారులు మాత్రం బంద్‌కు సంపూర్ణ మద్దతునిస్తున్నారు. సీనియర్ నటుడు శివ రాజ్‌కుమార్ డబ్బింగ్ చిత్రాలను అనుమతించనే కూడదని కుండ బద్ధలు కొట్టారు. భాషతో వ్యాపారం చేయకూడదనేది ఆయన నిశ్చితాభిప్రాయం. తమ సామర్థ్యంపై నమ్మకం లేని వారే డబ్బింగ్ చిత్రాల వైపు మొగ్గు చూపుతారని ఎద్దేవా చేశారు. కూలీ పనులు చేసైనా కుటుంబాన్ని పోషించుకుంటామే తప్ప, డబ్బింగ్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. బంద్‌లో రవిచంద్రన్, సుదీప్, దర్శన్, పునీత్, విజయ్, యశ్ సహా కళాకారులందరూ పాల్గొంటారని తెలిపారు. డబ్బింగ్ చిత్రాల వల్ల కన్నడ చిత్ర పరిశ్రమకు ఏ విధంగానూ ఉపయోగం లేదని మరో నటుడు జగ్గేశ్ చెబుతున్నారు. అయితే డబ్బింగ్ సినిమాలు కావాలా.. వద్దా అనే నిర్ణయాన్ని ప్రేక్షకుల విజ్ఞతకే వదిలివేయాలన్నది దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు అభిప్రాయం. ఇతర భాషల సినిమాలు ఎలా ఉంటాయో చూడాలన్న కుతూహలం కన్నడిగుల్లో ఉండడం సహజమని అన్నారు. అలాంటి వారికి అవకాశం ఇచ్చి తీరాలన్నారు. భాష, సంృ్కతులకు హాని కలుగుతుందనే నెపంతో ప్రముఖ దర్శకుల సినిమాలను కన్నడ సినీ ప్రియులు చూడకుండా అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ‘అవసాన దశలో ఉన్న మరాఠీ చిత్ర రంగం డబ్బింగ్‌ను అనుమతిస్తోంది. డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏటా రూ.వంద కోట్ల వ్యాపారం జరుగుతోంది’ అని ఆయన వివరించారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర కంబార సైతం డబ్బింగ్ చిత్రాలకు అనుకూలంగానే ఉన్నారు. -
1 సినిమా నిర్మాణ సంస్ధ పై ఐటి సోదాలు
-
సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాలు విడుదలవడం సంప్రదాయం. అయితే తమిళనాడులో దీపావళి సమయంలో పెద్ద చిత్రాలు విడుదలవుతుంటాయి. ఈ దీపావళికీ భారీ చిత్రాలు ముస్తాబయ్యాయి. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన అళగురాజా, ఎ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరించిన ఆరంభం, మరికొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. తమిళ ప్రజలను తన హాస్యంతో ఉర్రూతలూగించి పారితోషికంలో రికార్డు సృష్టించిన వడివేలుకు రాజకీయ గ్రహణం పట్టడంతో తెరమరుగయ్యారు. ప్రస్తుతం సంతానం హవా నడుస్తోందని చెప్పవచ్చు. సంతానం రోజుకు రూ.10 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో 15 చిత్రాలతో సంతానం డైరీ ఫుల్ అని చెబుతున్నారు. ఆర్.బి.చౌదరి ప్రస్తుతం ‘జిల్లా’ అనే సినిమాను నిర్మిస్తూ పొంగల్‌కు విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అళగురాజా నిర్మించిన జ్ఞానవేల్‌రాజా, ఇదే చిత్రంలో హాస్యపాత్ర పోషించిన సంతానం ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. చెన్నై తణికాచలం రోడ్డులోని జ్ఞానవేల్‌రాజా, సాలిగ్రామంలోని సంతానం ఇళ్లపై దాడులు జరిపారు. సేలం కొత్త బస్టాండ్ సమీపంలోని సినిమా నగర్‌లోని జ్ఞానవేల్‌రాజా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం లో సోదాలు నిర్వహించారు. అలాగే నిర్మాత అశోక్సామ్రాజ్ ఇంటిపై, కస్తూరి ఫిలిమ్స్ పేరుతో నిర్వహిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంపై దాడులు జరిగాయి. చెన్నై టి.నగర్‌లోని సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి ఇంటిపై, సాలిగ్రామంలోని సూర్య ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాత ఎ.ఎం.రత్నం ఇల్లు, కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఎ.ఎం.రత్నానికి చెందిన మరో ఇల్లు హైదరాబాద్‌లో ఉండగా అక్కడా ఇదే సమయంలో ఐటీ దాడులు నిర్వహించారు. కోయంబత్తూరు సింగానల్లూరులోని కోవైతండి, ఎస్బీ కాలనీ రామ్‌నగర్‌లోని కేటీవీఆర్ రామస్వామి, వీరకేరళంలో స్టూడియో గ్రీన్, సేలం మాదంపట్టిలోని శివకుమార్, తిరిడా ముత్తూరులోని మరుదు సెల్వం, పీఎస్జీ కల్వారీ సమీపంలోని సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులుకోవై మురుగన్ తదితర సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరిపారు. ‘తలైవా’ చిత్ర నిర్మాత సుందరప్రకాష్ జైన్, దర్శకులు లింగుస్వామి ఇళ్లపైనా దాడులు జరిపారు. 30 చోట్ల దాడులు చెన్నైలో 23 చోట్ల, ఇతర జిల్లాల్లో 6 చోట్ల, హైదరాబాద్‌లో చోట దాడులు జరిగాయి. సుమారు వంద మంది అధికారులు ఏకకాలంలో రంగంలోకి దిగారు. ప్రముఖుల ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున నగదు, నగలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులతో కోలీవుడ్ ఉలిక్కి పడింది. -
సినిమాలను టార్గెట్ చేయొద్దు
‘‘రాష్ట్రంలో ఏ ఆందోళన జరిగినా ఇతర వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి. సినిమాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఉద్యమాల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బాగా నష్టపోతున్నారు. సినిమాల నిర్మాణం కూడా తగ్గే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే ఎంతో మంది ఉపాధి కోల్పోతారు. ఉద్యమం దేనికోసం అయినా కానివ్వండి.. సినిమాని టార్గెట్ చేయకపోతే బాగుంటుంది’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ- ‘‘నవంబర్ 14 నుంచి 20 వరకు అంతర్జా తీయ బాలల చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇవి రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేవే అయినప్పటికీ సినీ సంఘాలన్నీ ఇందులో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నాయి. ఇక, చెన్నయ్‌లో జరగనున్న వందేళ్ల సినిమా వేడుక విషయానికొస్తే.. ఆ వేడుకలో పాల్గొనాలా, వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి’’ అని చెప్పారు. చిన్న సినిమాల గురించి చెబుతూ- ‘‘ధియేటర్లలో ఐదో ఆటకు అనుమతించి, ఒక ఆట చిన్న సినిమాకి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాం. అలాగే చిన్న సినిమాలను 150 స్క్రీన్లకు పెంచాలని కోరాం. వీటికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తోంది. ఇంకా జీవో రావాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు ఎన్వీ ప్రసాద్.