
తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలవనున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్‌ని కోరబోతున్నారు.
(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే?)
కొత్త రిలీజయ్యే సినిమా టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు లాంటి విషయాలని సదరు నిర్మాతలు పవన్ కల్యాణ్‌తో చర్చించనున్నారు. ఈ భేటీకి వెళ్లేవారిలో అశ్వనీ దత్, చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, వివేక్, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.
(ఇదీ చదవండి: అలాంటివాటిని పట్టించుకోరు కానీ.. మాపై పడి ఏడుస్తారు: అనసూయ కౌంటర్)