ప్రతీకాత్మక చిత్రం
సినిమాల విడుదలపై థియేటర్స్ అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘టక్ జగదీశ్’ ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకోవడంతో మూవీ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్మాతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎగ్జిబిటర్ల వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత దిల్ రాజు, ఠాగూర్ మధు సహా పలువురు అగ్ర నిర్మాతలతో కూడిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా థియేటర్స్ అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ తీరుపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ
ఈ మేరకు నిర్మాతల గిల్డ్ స్పందిస్తూ.. సినిమా థియేటర్స్ అసోసియేషన్ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొంది. సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే ఉంటుందని, తమ సినిమా ఎక్కడ, ఎప్పుడు విడుదల చేసుకోవాలో వారి ఇష్టమని వెల్లడించింది. ఎగ్జిబిటర్లు... డిమాండ్ ఉన్న పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని, చిన్న సినిమాలను విస్మరిస్తున్నారని నిర్మాతల గిల్డ్ ఆరోపించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లందరూ కలిసి ఉంటేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమవుతుందని సూచించిన నిర్మాతల గిల్డ్... కలిసి కట్టుగా పనిచేసి తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని ప్రకటనలో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment