Exhibitors
-
ఆంధ్రాలోనూ ఇదే చేయాలి.. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
సంధ్య థియేటర్ దగ్గర మహిళ మృతి చెందిన విషయమై రీసెంట్గా అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇకపై తాను సీఎంగా ఉన్నంత కాలం టికెట్ రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు.. సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అనంతరం ప్రెస్మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్ రెండో సీజన్)తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సింగిల్ స్క్రీన్స్‌కు ఊపిరి పోసేలా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ.. కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని ఎక్కువ రేట్లు పెడుతున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు, థియేటర్ వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రాలోనూ అమలు అవ్వాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ మాట్లాడుతూ.. ఆడియన్స్‌కి టికెట్ రేటు ఎంత ఉందో కూడా తెలియనంత అయోమయంలో ఉన్నారు. తెలంగాణాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేట్లు పెరగడం వల్ల పెద్ద సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దీంతో చిన్న సినిమాకు డబ్బులు ఉండడం లేదు అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్ షో’ వివాదం) -
ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం: విజయేందర్ రెడ్డి
ఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు. ‘నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు. కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తాం’ అని విజయేందర్ రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు వస్తునాయని చెబుతూ పది రోజులు వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయంనైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటాల ప్రతిపాదనలను తెలుగు నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు పంపించింది. -
కొత్త పాయింట్‌తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్‌బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
లైగర్ నష్టాలతో నిరవధిక దీక్ష.. స్పందించిన చార్మీ
బాక్సాఫీస్ బద్ధలు కొడుతుందనుకున్న విజయ్ దేవరకొండ లైగర్ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే! పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహార్ నిర్మించారు. గతేడాది తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ గండం గట్టెక్కలేకపోయింది. ఈ సినిమా వల్ల ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఎదుట రిలే నిరవధిక దీక్షకు పూనుకున్నారు. నష్టాన్ని భర్తీ చేస్తామని పూరీ జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ధర్నాపై నటి, నిర్మాత చార్మీ స్పందించింది. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, త్వరలో వారికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. త్వరలో అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఫిలిం ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా సందేశాన్ని పంపింది. చదవండి: మోడ్రన్ లవ్ చెన్నై... ఆ ఓటీటీలో అప్పుడే స్ట్రీమింగ్! -
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
'లైగర్' మూవీ ఎఫెక్ట్.. ఆందోళనకు దిగిన ఎగ్జిబిటర్స్!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లైగర్'. అనన్యా పాండే కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై ఛార్మి, పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డులు.. నెటిజన్స్ ట్రోలింగ్) అయితే భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా వల్ల తాము ఎంతో డబ్బు నష్టపోయామంటూ నైజాంకు చెందిన ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నష్టాన్ని భర్తీ చేస్తామని చిత్ర నిర్మాత పూరి జగన్నాథ్, డిస్ట్రిబ్యూటర్ తమకు మాటిచ్చి ఆరునెలలు అయిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ తమకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన గడువు ముగియడంతో ఎగ్జిబిటర్లు ఆందోళనకు దిగారు. (ఇది చదవండి: బీస్ట్ మోడ్‌లో హీరో సూర్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో) -
ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ
Director Teja Special Committee On The Issue Of Exhibitors: మంగళవారం (ఆగస్టు 2) ఎగ్జిబిటర్లతో నిర్వహించిన ఫిలిం ఛాంబర్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు. అయితే వీపీఎఫ్ ఛార్జీలను నిర్మాతలే భరించాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగానే ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది. ఇందుకోసం దర్శకుడు తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ చార్జీల నియంత్రణపై ఈ కమిటీలో చర్చించనున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుండగా మరోవైపు వేతన సవరణ గురించి ఫెడరేషన్ నాయకులతో మీటింగ్ ప్రారంభమైంది. కాగా ఇదివరకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. చదవండి: సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ
-
సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి పేర్ని నాని భేటీ
సాక్షి, విజయవాడ: సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. ఆన్లైన్ టికెట్ విధానం, సినిమాటోగ్రఫీ చట్టంలోని సవరణలపై చర్చ జరిపారు. అన్ని సినిమాలపై టికెట్ ధర ఒకే విధంగా ఉండేలా కొత్త విధానం, థియేటర్ల సమస్యలపైన సమావేశంలో చర్చించారు. ఆన్లైన్ టికెట్ విధానానికి అందరూ అంగీకారం: అంబికా కృష్ణ ఆన్లైన్ టికెట్ విధానానికి అందరూ అంగీకరించారని అంబికా కృష్ణ తెలిపారు. చిన్న ఊర్లలోని థియేటర్లలో గ్రేడింగ్ సిస్టమ్ పెట్టాలని థియేటర్ యజమానులకు మంత్రి పేర్ని నాని సూచించారని ఆయన తెలిపారు చదవండి: హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్ -
మూవీ థియేటర్స్ అసోసియేషన్‌పై టాలీవుడ్ నిర్మాతల ఫైర్
సినిమాల విడుదలపై థియేటర్స్ అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘టక్ జగదీశ్’ ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకోవడంతో మూవీ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు నిర్మాతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎగ్జిబిటర్ల వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత దిల్ రాజు, ఠాగూర్ మధు సహా పలువురు అగ్ర నిర్మాతలతో కూడిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా థియేటర్స్ అసోసియేషన్, ఎగ్జిబిటర్స్ తీరుపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్ మీద ఒట్టు!: వర్మ ఈ మేరకు నిర్మాతల గిల్డ్ స్పందిస్తూ.. సినిమా థియేటర్స్ అసోసియేషన్ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొంది. సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే ఉంటుందని, తమ సినిమా ఎక్కడ, ఎప్పుడు విడుదల చేసుకోవాలో వారి ఇష్టమని వెల్లడించింది. ఎగ్జిబిటర్లు... డిమాండ్ ఉన్న పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని, చిన్న సినిమాలను విస్మరిస్తున్నారని నిర్మాతల గిల్డ్ ఆరోపించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లందరూ కలిసి ఉంటేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమవుతుందని సూచించిన నిర్మాతల గిల్డ్... కలిసి కట్టుగా పనిచేసి తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని ప్రకటనలో కోరింది. చదవండి: Karthikeya Engagement: ఘనంగా కార్తికేయ నిశ్చితార్థం -
త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. టాకీస్‌లను తెరవాలన్న దిశగా సినిమా ఎగ్జిబిటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాది నుంచి థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్నామని, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్, సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సునీల్ నారంగ్, అనుపమ్‌రెడ్డి, అభిషేక్ నామా, సదానంద్‌గౌడ్, బాలగోవింద్, రాజ్‌తాడ్ల తదితరులు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. థియేటర్లు మూసి ఉంచిన కాలానికి సంబంధించి ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని, ఎస్జీఎస్టీని రద్దు చేయాలని, షూటింగ్ అనుమతుల చార్జీలను తగ్గించాలని కోరారు. దీనిపై స్పందించిన తలసాని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవచ్చని ఫిలిం చాంబర్ తీర్మానించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ థియేటర్లు తెరవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అంతా ఏకాభిప్రాయానికి వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, ఫిలిం చాంబర్ నేతలు ప్రకటించారు. త్వరలోనే తెరిచే అవకాశం ఉందని వెల్లడించారు. -
వారిని క్షమాపణలు కోరిన సల్మాన్ ఖాన్
కరోనా కారణంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. రేపు(మే 13) ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా మీడియా, థియేటర్ల యాజమాన్యాలతో నిన్న(మంగళవారం) సల్మాన్ జూమ్ మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా భాయిజాన్ ఎగ్జిబిటర్లను క్షమాపణలు కోరాడట. ఎందుకంటే రాధే మూవీ ఎట్టి పరిస్థితుల్లోనైనా థియేటర్లలోనే విడుదల చేయాలని గతేడాది ఎగ్జిబిటర్ల సమాఖ్య ఆయనను కలిసి విన్నవించుకోగా సరే అని ఆయన మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికి కరోనా కారణంగా భాయిజాన్ వారికిచ్చిన మాట తప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్ క్షమాపణలు కోరుతూ.. ‘థియేటర్లలో విడుదల చేయాలని చాలా కాలం ఎదురు చూశాం. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులు రాకపోపోగా రోజురోజు ఇంకా పరిస్థితి దిగజారుతోంది. అందువల్లే రాధేను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అంటూ వివరించాడు. అంతేగాక ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడం వల్ల ఇండియా థియేట్రికల్ రెవెన్యూ మొత్తం జీరో అయిపోయిందని తెలుసు, కానీ తప్పడం లేదంటూ విచారణ వ్యక్తం చేశాడు. అదే విధంగా సల్మాన్ తన అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. పలు అభిమాన సంఘాలు రాధే మూవీ కోసం ఆడిటోరియాలను బుక్ చేసుకుని ప్రైవేటు స్రీనింగ్‌లో చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని సల్మాన్ వ్యతిరేకిస్తు కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ఇలా గుంపులుగా సినిమా చూడటం సరైంది కాదని, దీనికి తాను బాధ్యత వహించాల్సి ఉందటుందని హెచ్చరించాడు. కాగా ప్రభుదేవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడి దిశా పటానీ నటించింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసి సిటీమార్ సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ‘రాధే’ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. -
థియేటర్స్‌లోకి రా భాయ్
ప్రస్తుతం సినిమా థియేటర్స్ పరిస్థితి కాస్త సందిగ్ధంలో ఉంది. ఏదైనా పెద్ద సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారని ఓ వాదన. ప్రేక్షకులు వచ్చేలా ఉంటేనే పెద్ద సినిమా తీసుకొద్దాం అనేది మరో వాదన. సల్మాన్ లాంటి స్టార్ సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా వస్తారని బాలీవుడ్ థియేటర్ యాజమాన్యం భావిస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన తాజా మాస్ ఎంటర్టైనర్ ‘రాధే’ రైట్స్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ‘రాధే’ను థియేటర్స్‌లోనే విడుదల చేయమంటూ ఓ లేఖ ద్వారా కోరింది. ఇలాంటి కష్టసమయంలో థియేటర్స్ బిజినెస్‌కు సహాయంగా నిలబడాలని, సల్మాన్ చిత్రం అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉంటాయని, ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్‌కి తీసుకొచ్చే స్టామినా ఉన్న స్టార్ సల్మాన్ అనేది ఈ లేఖ సారాంశం. ఈ ఈద్‌కి మీ సినిమాను థియేటర్స్‌కు తీసుకురండి భాయ్ అని సల్మాన్‌ని కోరారు. మరి భాయ్ సినిమా థియేటర్స్‌లో వస్తుందా? వేచి చూడాలి. -
బొమ్మొచ్చె వేళాయెరా
అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీటింగ్‌తో సినిమాలు ప్రదర్శించుకోవచ్చు ఏడు నెలల నిరీక్షణ ఫలించింది. ఇన్ని రోజులూ తాళాలేసిన థియేటర్స్‌ని తెరవబోతున్నారు. కోవిడ్ వల్ల ఏర్పడ్డ బ్రేక్ ముగిసింది. ప్రొజెక్టర్ల దుమ్ము దులపబోతున్నారు. పాప్ కార్న్ ఎప్పటిలానే పొంగబోతోంది. నిశ్శబ్దంగా మారిన సినిమా హాళ్లలో సందడి మొదలవ్వనుంది. సినిమాను సినిమాలా చూసే అసలైన మజా మళ్లీ రానుంది. కొంత గ్యాప్ తర్వాత తెరపై బొమ్మొచ్చె వేళయింది. సినీ ప్రేమికుల పండగ మొదలవ్వనుంది. ఈ సందర్భంగా పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏమంటున్నారో చూద్దాం... కరోనా వైరస్.. లాక్డౌన్ వల్ల చాలా సినిమాలు చిత్రీకరణ ఆగిపోయాయి. కానీ లాక్‌డౌన్‌లోనే రామ్‌గోపాల్ వర్మ పలు సినిమాలను చిత్రీకరించారు. అందులో ‘కరోనా వైరస్’ ఒకటి. లాక్డౌన్ వల్ల ఇంట్లో చిక్కుకుపోయిన ఓ కుటుంబం కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్స్ తెరుచుకున్న తర్వాత విడుదల కాబోతున్న తొలి సినిమా ఇదే అని ట్వీట్ చేశారు రామ్‌గోపాల్ వర్మ. లాక్డౌన్ 5లో భాగంగా థియేటర్స్ రీఓపెన్ చేయటం ఆనందమే. కానీ, దీనికి సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి థియేటర్ యాజమాన్యాలు కరెంట్ బిల్లులు కట్టని కారణంగా అందరి పవర్ ఫ్యూజ్‌లు తీసుకుని వెళ్లారు సంబంధిత అధికారులు. అలాగే థియేటర్లు నడవాలంటే కంటెంట్ కావాలి. సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఎవ్వరి దగ్గరా కంటెంట్ లేదు. ఒకవేళ ఏదైనా సినిమా కంటెంట్ ఉన్నా డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని డబ్బులు ఇచ్చి కొనరు. కేంద్రప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వాలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. గతంలో ఉన్న ఖర్చులకంటే ఇప్పుడు థియేటర్లకు శానిటైజేషన్ రూపంలో ఖర్చు ఎక్కువ అవుతుంది. దాన్ని ఎలా అరికట్టాలి? అసలు జనాలు వస్తారా, రారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ థియేటర్లు ఆరంభించాకే సమాధానం దొరుకుతుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతుందో చూడాలి. – డి.సురేశ్‌కుమార్, సాయి సినీచిత్ర (వెస్ట్‌గోదావరి డిస్ట్రిబ్యూటర్) థియేటర్లు ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురు చూస్తున్నాం. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాలిడే. తర్వాత శని, ఆదివారం కావటంతో సోమవారం గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకటిస్తుందనుకుంటున్నాం. మా థియేటర్‌ను పూర్తి స్థాయిలో రెడీ చేయటానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మా థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని షోలకు థియేటర్‌ను ఎలా శానిటైజ్ చేయాలనే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. – అరుణ్, శ్రీరాములు థియేటర్, హైదరాబాద్ బుధవారం సెంట్రల్ గవర్నమెంట్ వారు థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పగానే గురువారం మా స్టాఫ్ అందరినీ పనుల్లోకి రమ్మని చెప్పాం. థియేటర్లో సీటు సీటుకి మధ్య గ్యాప్‌కోసం థర్మాకోల్ షీట్‌ను అమరుస్తున్నాం. ప్రతి షోకి శానిటైజేషన్ చేయటానికి మా స్టాఫ్‌కి తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం సినిమాలను కొనే పరిస్థితుల్లో లేం. మా డిస్ట్రిబ్యూటర్స్ ఏ సినిమా ఇచ్చి ఆడించమంటే ఆ సినిమా ఆడిస్తాం. – కుమార్, దేవి 70 ఎం.ఎం థియేటర్ మేనేజర్, హైదరాబాద్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి షోకు శానిటేజైషన్ చేయటం వల్ల నెలకు దాదాపు 40 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు ఖర్చు అదనంగా పెరుగుతుంది. అలాగే థియేటర్‌కి వచ్చి టికెట్ తీసుకునే ప్రేక్షకుల నుంచి డబ్బును తీసుకోవడానికి కూడా సెపరేట్‌గా శానిటైజ్ చేయటానికి కొత్త మిషన్లను తీసుకోవాలనుకుంటున్నాం. – శ్రీనివాసరెడ్డి -
స్క్రీన్ ఉంది.. సీన్ లేదు
ఒకప్పుడు ‘నేడే చూడండి... మీ అభిమాన హీరో సినిమా’ అంటూ రిక్షాల్లో తిరుగుతూ మైకుల్లో చెప్పేవారు. రిక్షా వెనకాల పిల్లలు పరిగెత్తుతూ సందడి సందడి చేసేవారు. ఇప్పుడు టీవీ, రేడియా, సోషల్ మీడియా ఇలా సినిమా ప్రమోషన్‌కి చాలా ఉన్నాయి. థియేటర్ ముందు అయితే భారీ కటౌట్లు, గజమాలలు, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ సందడి సందడి చేస్తుంటారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో థియేటర్ల ముందు సందడి లేదు. వెండితెర వెలవెలబోతోంది. ‘స్క్రీన్ ఉంది.. సీన్ లేదు’. ‘‘సినిమా చరిత్రలో ఇలా పదీ పదిహేను రోజులు ‘థియేటర్లు బంద్’ కావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైమ్ అని’’ నైజాం ప్రముఖ పంపిణీదారుడు చారి పేర్కొన్నారు. దాదాపు పది రోజులు థియేటర్లు మూసివేయడం ద్వారా ‘సింగిల్ థియేటర్’కి ఏర్పడే నష్టం ఐదారు లక్షలు ఉంటుందని, మల్టీప్లెక్స్‌కి ఇంకా ఎక్కువ ఉంటుందని ఓ పంపిణీదారుడు తెలిపారు. అయితే సినిమా ఆడినప్పుడు సింగిల్ థియేటర్‌తో పోల్చితే మల్టీప్లెక్స్‌కి రాబడి ఎక్కువ ఉంటుందని మరో పంపిణీదారుడు అన్నారు. థియేటర్ల నిర్వహణ గురించి కొందరు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన సమాచారంలోకి వెళదాం... ► ఈ మధ్య ‘సింగిల్ థియేటర్’కి అన్నీ నష్టాలే. ఎందుకంటే సినిమా రిలీజులు పెద్దగా లేవు. చిన్న సినిమాలు మంచి టాక్ తెచ్చుకుని ఓ మూడు నాలుగు వారాలు ఆడితే అప్పుడు లాభాలు చూడొచ్చు. ఇక పెద్ద హీరోల సినిమాలను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తారు. దాంతో ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మంచి వసూళ్లతో థియేటర్ నడుస్తుంది. థర్డ్ వీక్ నుంచి వసూళ్లు పడిపోతుంటాయి. ► మల్టీప్లెక్స్‌లో అయితే ఉన్న మూడు నాలుగు స్క్రీన్స్‌లోనూ పెద్ద సినిమాని ప్రదర్శిస్తారు. వాళ్లకు పర్సంటేజ్ సిస్టమ్ ఉంటుంది. మొదటి వారం వచ్చే వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్ 55 శాతం, ఎగ్జిబిటర్ 45 శాతం తీసుకుం టారు. రెండో వారానికి రివర్శ్. 55 ఎగ్జిబిటర్ (సినిమా ప్రదర్శించేవాళ్లు), 45 శాతం డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. అలా చివర్లో డిస్ట్రిబ్యూర్ 30, ఎగ్జిబిటర్ 70 శాతం తీసుకుంటారు. ► సింగిల్ థియేటర్ అయితే సినిమాని పర్సంటేజ్ పద్ధతిలో కాకుండా రెంటల్ సిస్టమ్‌కి ఇస్తారు. ఏరియాని బట్టి వారానికి నాలుగు లక్షలు రెంట్ ఉంటుంది. ఒకవేళ వసూళ్లు నామమాత్రంగా ఉంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రెంటల్ విధానంలో కాకుండా పర్సంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్ నుంచి డబ్బు తీసుకుంటారు. అది ఎప్పుడూ అంటే ఒక షోకి 50 వేలు వసూలు అయితే.. వారానికి సుమారు 10 లక్షలు కలెక్ట్ అవుతాయి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ 2 లక్షలు రెంట్ ఇచ్చేసి, మిగతా 8 లక్షలు తీసుకుంటారు. అదే వారం మొత్తం 2 లక్షలే వస్తే... ఎగ్జిబిటర్‌కి మొత్తం 2 లక్షలు రెంట్ ఇవ్వకుండా వచ్చిన వసూళ్లలో సగం తీసుకుంటారట పంపిణీదారుడు. అదే మల్టీప్లెక్స్ అయితే పర్సంటేజ్ సిస్టమే. ► అసలు ఒక థియేటర్ నెల మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? అంటే.. బాగా నీట్‌గా మెయింటైన్ చేసే సింగిల్ థియేటర్‌కి ఐదున్నర నుంచి ఆరు లక్షలవుతుందట. ప్రొజెక్టర్ ఖర్చు, ప్రొజెక్టర్ బల్బ్, టాయ్‌లెట్, ఫ్లోర్ క్లీనింగ్, సీట్స్, కరెంట్ బిల్... ఇలాంటివన్నీ ఈ ఆరు లక్షల్లో ఉంటాయి. ప్రొజెక్టర్ నెల రెంట్ 30 వేలు అయితే, బల్బ్ దర 90 వేల నుంచి లక్ష వరకూ ఉంటుంది. రెండు మూడు నెలలకోసారి కొత్త బల్బ్ మార్చాల్సి ఉంటుంది. ఇది సింగిల్ థియేటర్ ఖర్చు. మల్టీప్లెక్స్‌కి వేరే విధంగా ఉంటుంది. అయితే సింగిల్ థియేటర్లో మూడు టికెట్ కౌంటర్లు ఉంటే.. మల్టీప్లెక్స్‌లోనూ దాదాపు అన్నే ఉంటాయని ఓ ఎగ్జిబిటర్ అన్నారు. కాకపోతే మల్టీప్లెక్స్‌లో స్టాఫ్ తక్కువ.. స్క్రీన్లు ఎక్కువ ఉంటాయి. అలాగే సింగిల్ థియేటర్లో సినిమా బాగా ఆడకపోతే క్యాంటీన్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. కానీ మల్టీప్లెక్స్‌లో వేరే వేరే సినిమాలు స్క్రీనింగ్ చేసుకోవచ్చు కాబట్టి క్యాంటీన్ రన్ బాగానే ఉంటుంది. బాగున్న సినిమాని రెండు మూడు స్క్రీన్స్‌లో ప్రదర్శించే వీలు మల్టీప్లెక్స్‌కి ఉంటుంది. అయితే మల్టీప్లెక్స్వాళ్లకు ఉండే కష్టాలు వాళ్లకూ ఉంటాయి కానీ సింగిల్ థియేటర్స్‌కే నష్టం ఎక్కువ అని లెక్కలు చెబుతున్నారు కొందరు ఎగ్జిబిటర్లు. ► మరి ఈ పరిస్థితిలో థియేటర్ని ఎందుకు కంటిన్యూ చేయడం అంటే.. ఎప్పుడో థియేటర్స్ కట్టి ఉన్నాయి. వాటిని ఏం చేయాలన్నా కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఉమ్మడి ప్రాపర్టీ అయితే పెట్టుబడి ఎవరు పెట్టాలి? అనే విషయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది. ఇక పిల్లలు విదేశాల్లో సెటిల్ అయితే ఇక్కడున్న ప్రాపర్టీ మీద పెద్దగా దృష్టి పెట్టరు. అందుకని ఎలాగూ ఉన్నాయి కదా అని థియేటర్స్‌ని నడుపుతున్న ఎగ్జిబిటర్లే ఎక్కువ శాతం ఉన్నారని చారి పేర్కొన్నారు. ► ఇంతకీ పది రోజులు థియేటర్లు మూసేస్తే వచ్చే నష్టం ఎంతా అంటే ‘మినిమమ్ ఐదారు లక్షలు’ అంటున్నారు. ఏరియాని బట్టి ఈ లెక్కలో హెచ్చు తగ్గులుంటాయి. పైగా మార్కెట్లో దొరికే వస్తువులు ఇవాళ కాకపోతే రేపు అమ్ముడవుతాయి. కానీ ఆ రోజు సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోతే ఆ మర్నాడు వస్తారన్న గ్యారంటీ లేదు. ఓ వారం తర్వాత ఆ సినిమా థియేటర్లో ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. గత శుక్రవారం అర్జున, ప్రేమ పిపాసి’, 302, యురేక, మేద వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మర్నాటి నుంచే థియేటర్ల మూతను ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయే అవకాశం ఉంది. అయితే బాగా వినిపిస్తున్న మాట ఏంటంటే... కరోనా కారణంగా ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రావడంలేదు. అందుకని ఇప్పుడు థియేటర్లు మూసినా పెద్దగా నష్టం వాటిల్లదనే చెబుతున్నారు. దానికి ఓ ఉదాహరణ చెప్పాలంటే... ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో 3600 టికెట్లు బుక్ అయితే.. 600 మంది ప్రేక్షకులు అసలు థియేటర్‌కి రాలేదట. బుక్ చేసుకుని మరీ రాలేదంటే కరోనా ఎంత భయపెడుతోందో ఊహించుకోవచ్చు. షూటింగ్ బంద్ కరో కరోనా వైరస్ ప్రభావం అన్ని రాష్ట్రాల చిత్ర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాల చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నటీనటుల సంఘం, నిర్మాతల మండలి సంయుక్తంగా ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ – ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో షూటింగ్స్‌ను నిలిపి వేయాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అన్నారు. ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు సంయుక్తంగా చిత్రీకరణలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొందరు నిర్మాతలకు ఇబ్బందిగా ఉన్నా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. కరోనా కారణంగా తెలంగాణలో ఎక్కడా షూటింగ్స్ జరగవు’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. ‘‘కరోనా వైరస్ చాలా భయంకరమైనది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, మాల్స్ బంద్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా షూటింగ్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ. ‘‘తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్‌తోపాటు షూటింగ్స్ కూడా నిలిపివేయాలనేది అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చిత్రీకరణలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. అభ్యంతరం లేని ఆంధ్రా ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్. ‘‘షూటింగ్స్‌లో వందలమంది పాల్గొంటుంటారు. వారి ఆరోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాజిక బాధ్యతతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అందరం దీన్ని సమర్థిస్తున్నాం’’ అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ జీవితా రాజశేఖర్. ‘‘ప్రభుత్వం మళ్లీ షూటింగ్స్ జరుపుకోవచ్చని తెలియజేసినప్పుడు చిత్రీకరణలు పునరావృతం అవుతాయి. ఈ నిర్ణయాన్ని నిర్మాతలందరూ స్వాగతించాలి’’ అన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్. ఈ సమావేశంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్, ఠాగూర్ మధు, నట్టికుమార్, రామసత్యానారాయణ, సురేందర్‌రెడ్డి, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్ కూడా ఈ నెల 19 నుంచి 31 వరకు జరగకూడదని ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎమ్పీఆర్ఏ) ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తిరిగి షూటింగ్స్‌ను ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలను అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 30న ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఐఎమ్పీఆర్ఏ పేర్కొంది. సి. కల్యాణ్, ప్రసన్నకుమార్, జీవిత, వెంకటేష్, నారాయణదాస్, బెనర్జీ, దామోదర ప్రసాద్, మధు -
క్లిక్.. క్లిక్
ఫొటోగ్రఫీలో ఎప్పటికప్పుడు మారుతున్న ఆధునిక పోకడలను తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది ‘ఫొటో ఎక్స్పో, బ్రాడ్కాస్ట్ అండ్ ఫిల్మ్ ఎక్స్పో’. షేక్‌పేట్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ప్రారంభమయ్యే ఈ మూడు రోజుల ఎక్స్‌పోలో వందకు పైగా ఎగ్జిబిటర్స్ తమ బ్రాండ్స్ ప్రదర్శిస్తారు. సోనీ, కేనన్, హెచ్‌పీ, ఎప్సన్, ఆపిల్, డెల్ తదితర పాపులర్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. వేదిక: జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్, షేక్‌పేట్ సమయం: నేటి ఉదయం 11 గంటలకు.. ఈ నెల 20 వరకు ఎక్స్పో కొనసాగుతుంది.