Director Teja Special Committee On The Issue Of Exhibitors - Sakshi
Sakshi News home page

Director Teja: ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్‌ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ

Published Tue, Aug 2 2022 3:50 PM | Last Updated on Tue, Aug 2 2022 4:49 PM

Director Teja Special Committee On The Issue Of Exhibitors - Sakshi

Director Teja Special Committee On The Issue Of Exhibitors: మంగళవారం (ఆగస్టు 2) ఎగ్జిబిటర్లతో నిర్వహించిన ఫిలిం ఛాంబర్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో వీపీఎఫ్‌ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు. అయితే వీపీఎఫ్‌ ఛార్జీలను నిర్మాతలే భరించాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగానే ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది. 

ఇందుకోసం దర్శకుడు తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ చార్జీల నియంత్రణపై ఈ కమిటీలో చర్చించనున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్‌ ప్రత్యేక కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుండగా మరోవైపు వేతన సవరణ గురించి ఫెడరేషన్ నాయకులతో మీటింగ్ ప్రారంభమైంది. కాగా ఇదివరకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

చదవండి: సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ
భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్‌
సల్లూ భాయ్‌కి లైసెన్స్‌డ్‌ తుపాకీ.. ఎలాంటిది అంటే ?
బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement