Special Committee
-
‘మణిపూర్’పై ఏం చర్యలు తీసుకున్నారు: సుప్రీం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రార్థనా స్థలాల రక్షణకు తీసుకున్న చర్యలను తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం మణిపూర్‌లో ప్రార్థనాస్థలాల పునరుద్ధరణ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వర్గ హింసలో దెబ్బతిన్న, ధ్వంసమైన మత సంబంధ నిర్మాణాలపై రెండు వారాల్లోగా కమిటీకి సమగ్ర వివరాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. -
కంటోన్మెంట్ విలీనంపై కమిటీ
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతిపాదన దశలోనే ఉన్న ప్రతిపాదన విధి, విధానాల రూపకల్పనకు ఎనిమిది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విలీన ప్రక్రియ కొనసాగనుంది. రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ, అడిషనల్ పైనాన్షియల్ అడ్వైజర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సెక్రెటరీ, డిఫెన్స్ ఎస్టేట్స్ అడిషనల్ డీజీ, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీజీ, డిఫెన్స్ ఎస్టేట్స్ సదరన్ కమాండ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఫిబ్రవరి 4వ తేదీలోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఎంఓడీ ప్రతిపాదనకు అనుగుణంగా.. కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ఏరియాలను ఆర్మీ నుంచి విడదీసి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసుకోవాల్సిందిగా కోరుతూ గతేడాది మే 23న రక్షణ మంత్రిత్వ శాఖకు ఆర్మీ ప్రతిపాదన పంపింది. తదనుగుణంగా రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా, సివిల్ ఏరియాలను తమ పరిధిలోనికి తీసుకునేందుకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ తన అంగీకారం తెలుపుతూ గత నెల 14న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 9న తొలి సమావేశం విలీనంపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ఈ నెల9న వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరగనుంది. కంటోన్మెంట్ పరిధిలోని భూములు, స్థిర, చరాస్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, రోడ్లు, ట్రాఫిక్, రికార్డులు, స్టోర్ తదితర అన్ని రకాల బదలాయింపుపై రోడ్‌మ్యాప్ రూపొందించనుంది. కమిటీ తొలి భేటీకి ముందే రక్షణ మంత్రిత్వ శాఖ ఓ కీలక ఆదేశాన్ని కమిటీ ముందు ఉంచనున్నట్లు తెలిసింది. ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు? మిలటరీ శిక్షణ కేంద్రాలు, కార్యాలయాలు, స్థలాలకు 500 మీటర్ల పరిధిలో నిర్మాణాలకు సంబంధించి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ పరిధిలోని నిర్మాణాల విషయంలో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. కంటోన్మెంట్లో మాత్రం మినహాయింపు ఉంది. తాజాగా కంటోన్మెంట్‌లోని సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలపనుండటంతో 500 మీటర్ల నిబంధనను ఇక్కడ కూడా అమలు చేస్తామంటూ ఆర్మీ ముందస్తుగానే ప్రకటించింది. దీనికి తోడు ఆర్మీ స్థావరాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను అనుమతించబోమని కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు అమలయ్యే అవకాశముంది. వికాస్ మంచ్ హర్షం.. బాణసంచా కాల్చి సంబురాలు కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కంటోన్మెంట్ వికాస్ మంచ్ (సీవీఎం) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీవీఎం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎం సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. -
గ్యాస్ రేట్ల సమీక్షకు పారిఖ్ కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే సహజ వాయువు రేట్లను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యం వహిస్తారు. నెలాఖరులోగా కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లను నిర్ణయించేందుకు ప్రభుత్వం నిర్దిష్ట ఫార్ములాను ఉపయోగిస్తుంది. ఏటా రెండు సార్లు .. ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న సమీక్షిస్తోంది. దీని ప్రకారం ఒకోసారి ఉత్పత్తి వ్యయాల కన్నా కూడా ధర తక్కువగా ఉండేది. అయితే, ఈ ఏడాది మార్చి నుంచి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగాను క్రూడాయిల్, గ్యాస్ రేట్లు పెరిగాయి. అటు వినియోగదారులకు భారం కాకుండా ఇటు ఉత్పత్తి కంపెనీలూ దెబ్బతినకుండా సముచిత రేటును సిఫార్సు చేసేందుకు పారిఖ్ కమిటీ ఏర్పాటైంది. -
‘మునుగోడు’ ఉప ఎన్నిక సమన్వయానికి కమిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సమన్వయానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చించిన తర్వాత కమిటీని నియమించనున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 15న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి అసెంబ్లీ ఎదుటనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 17న విమోచన దినోత్సవంతో పాటు, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి వచ్చేనెల 2న మహాత్మాగాంధీ జయంతి దాకా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా 16 లోక్‌సభ నియోజకవర్గాలకు నియమించిన కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా పార్టీ ఇన్చార్జిలతో బుధవారం సంజయ్ ఇతర ముఖ్యనేతలు భేటీ కావాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్ -
Tollywood: వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు!
ఇండస్ట్రీలో నెలకొన్న వివిధ సమస్యల కారణంగా ఈ నెల 1నుంచి తెలుగు సినిమాల చిత్రీకరణలను నిలిపి వేస్తున్నట్లుగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు చెబుతున్న సమస్యల్లో వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజు) చార్జీలు కూడా ఒక ప్రధానాంశం. ఈ సమస్య పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫిలిం ఎగ్జిబిటర్స్ హైదరాబాద్‌లోని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశం అయ్యారు. ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, వారికి చెల్లించనున్న వీపీఎఫ్‌పై సుదీర్ఘంగా చర్చించుకున్నాం. చర్చలు ఆశాజనకంగా జరిగాయి. కొత్త వీపీఎఫ్ చార్జీలు వచ్చే నెల 1 నుంచి అమలయ్యే విధంగా కృషి చేస్తాం’’ అని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కానూరి దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ది తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి అనుపమ్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. -
ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ
Director Teja Special Committee On The Issue Of Exhibitors: మంగళవారం (ఆగస్టు 2) ఎగ్జిబిటర్లతో నిర్వహించిన ఫిలిం ఛాంబర్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు. అయితే వీపీఎఫ్ ఛార్జీలను నిర్మాతలే భరించాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగానే ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది. ఇందుకోసం దర్శకుడు తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ చార్జీల నియంత్రణపై ఈ కమిటీలో చర్చించనున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుండగా మరోవైపు వేతన సవరణ గురించి ఫెడరేషన్ నాయకులతో మీటింగ్ ప్రారంభమైంది. కాగా ఇదివరకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. చదవండి: సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
‘మరమ్మతు హక్కుల’ నిబంధనలపై కసరత్తు
న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉత్పత్తులను స్వయంగా లేదా థర్డ్ పార్టీల ద్వారా మరమ్మతు చేయించుకునే హక్కులను (రైట్ టు రిపేర్) కల్పించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 13న తొలిసారిగా భేటీ అయింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ విషయాలు తెలిపింది. రిపేర్లు, విడిభాగాల విషయంలో కంపెనీలు ఏ విధంగా గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయనేది కమిటీ .. సమావేశంలో చర్చించింది. ప్రధానంగా వ్యవసాయ పరికరాలు, మొబైల్ ఫోన్లు/ట్యాబ్లెట్లు, వినియోగ వస్తువులు, కార్ల వంటి ఆటోమొబైల్స్/ఆటోమొబైల్ పరికరాల రంగాల్లో ఇలాంటి ధోరణులను పరిశీలించింది. సాధారణంగా కంపెనీలు తమ ఉత్పత్తుల మరమ్మతుకు తాము తయారు చేసే పరికరాలే వాడాలని, తమ దగ్గరే రిపేరు చేయించుకోవాలని .. థర్డ్ పార్టీలు లేదా సొంతంగా మరమ్మతు చేసుకుంటే వారంటీలు పనిచేయవంటూ షరతులు పెడుతుంటాయి. అలాగే పలు సంస్థలు ఉద్దేశపూర్వకంగా .. కొంత కాలానికి మాత్రమే పనిచేసేలా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఆ తర్వాత అవి రిపేరుకు కూడా పనికి రాకుండా పోవడం వల్ల కస్టమర్లు మళ్లీ కొత్తవి కొనుక్కోవాల్సి వస్తోంది. ఫలితంగా పాతవి వ్యర్ధాల కింద మారుతున్నాయి. ఇలాంటి నియంత్రణలు, గుత్తాధిపత్య ధోరణులు .. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించేవేనని ప్రభుత్వ కమిటీ అభిప్రాయపడింది. సమస్యలు వస్తే ఎలా రిపేరు చేసుకోవాలి, వేటిని ఉపయోగించాలి లాంటి విషయాల గురించి కస్టమర్లకు కంపెనీలు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకోసం థర్డ్ పార్టీలు, వ్యక్తులకు ఆయా సాధనాలను అందుబాటులో ఉంచాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రైట్ టు రిపేర్ వల్ల వ్యర్ధాలను కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు’ రైట్ టు రిపేర్’ని గుర్తించాయి. -
తప్పు చేయలేదు.. నన్ను మోసం చేశారు: అజయ్ మిశ్రా
లక్నో: ఉత్తర ప్రదేశ్ వారణాసి ‘జ్ఞానవాపి మసీదు సర్వే’లో వేటుకు గురైన అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా స్పందించారు. తానేం తప్పు చేయలేదని, తనని మోసం చేశారని అంటున్నారాయన. ‘‘నేనేం తప్పు చేయలేదు. విశాల్ సింగ్ నన్ను మోసం చేశారు. ఇతరులను నమ్మే నా స్వభావం నా కొంప ముంచింది. అర్ధరాత్రి 12 దాకా మేం నివేదికను రూపొందించాం. విశాల్ చేసే కుట్రను కనిపెట్టలేకపోయా. చాలా బాధగా అనిపించింది. సర్వే గురించి ఎలాంటి సమాచారం నేను బయటపెట్టలేదు’’ అని అడ్వొకేట్ అజయ్ మిశ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కమిటీ సర్వే కొనసాగుతున్న టైంలోనే లీకులు అందించారంటూ వారణాసి కోర్టు మంగళవారం అర్ధాంతరంగా అజయ్ మిశ్రాను తప్పించి.. ఆ స్థానంలో విశాల్ సింగ్‌ను కొత్త అడ్వొకేట్ కమిషనర్‌గా నియమించింది. అజయ్ మిశ్రా మీద ఫిర్యాదు చేసిందే విశాల్ సింగ్ కావడం విశేషం. ‘‘అజయ్ మిశ్రా ప్రవర్తన మీద పిటిషన్ దాఖలు చేశా. ఆయన ఓ వీడియోగ్రాఫర్ నియమించుకుని.. అతనితో మీడియాకు లీకులు ఇచ్చారు. పుకార్లు ప్రచారం చేశారు. నేను నా బాధ్యతగా నా నివేదిక సమర్పించా’’ అని పేర్కొన్నారు విశాల్ సింగ్. ఇదిలా ఉంటే.. వీడియోగ్రాఫర్ చేసిన తప్పిదానికి తానేం చేయగలనుంటున్నాడు అజయ్ మిశ్రా. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడిందని హిందూ వర్గం, కాదు.. అది కొలనుకు సంబంధించిన భాగం అని మసీద్ నిర్వాహక కమిటీ వాదిస్తున్నారు. ఇక సర్వే కమిటీ మరో రెండురోజుల్లో వారణాసి కోర్టులో తన నివేదికను సమర్పించనుంది. Gyanvapi Mosque Case: లీకులు చేసినందుకే అడ్వొకేట్ కమిషనర్ తొలగింపు! -
ప్రధాని భద్రతా వైఫల్యంపై ప్రత్యేక కమిటీ
-
ఫిబ్రవరికల్లా కరోనా కట్టడి..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తెలిపింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని అంచనా వేసింది. దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. మార్చిలో లాక్డౌన్ విధించకపోయి ఉంటే కరోనా భారత్‌పై అత్యంత తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని జూన్ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకి ఉండేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడి ఉండేవారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సరైన సమయంలో లాక్డౌన్ విధించి కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు, ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని పేర్కొంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం వంటివి కొనసాగిస్తూ, పండుగ సీజన్లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాల్లో సామూహిక వ్యాప్తి: హర్షవర్ధన్ దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన సండే సంవాద్ కార్యక్రమంలో చెప్పారు. జనసాంద్రత అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రతరంగా ఉందన్నారు. ఓనం ఉత్సవాల సమయంలో కేరళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా నిబంధనల్ని గాలికి వదిలేసినందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. కేరళ నుంచి నేర్చుకున్న పాఠాలతో దసరా, దీపావళి సీజన్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చలికాలంలో సెకండ్ వేవ్ ? దేశంలో వచ్చే శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాల్ని కొట్టి పారేయలేమని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే నిపుణుల కమిటీ సమన్వయ కర్త కూడా అయిన పాల్ దేశంలో మూడు వారాలుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయన్నారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా ఉందని చెప్పారు. అయితే కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్‌తో పాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. చలికాలంలో యూరప్‌లో కరోనా మళ్లీ విజృంభించి నట్టుగానే భారత్‌లో కూడా కేసులు పెరిగే అవకాశాలున్నాయన్న పాల్ కరోనాపై ఇంకా మనం పాఠాలు నేర్చుకునే దశలోనే ఉన్నామని చెప్పారు. శీతాకాలంలో వాయు కాలుష్యం పెరిగిపోవడం వల్ల కూడా కరోనా ఉధృతరూపం దాలుస్తుందన్న ఆయన వచ్చే పండగ సీజన్లో కరోనా విసిరే సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ వైరస్ విజృంభిస్తుందని పాల్ హెచ్చరించారు. పత్రికల ద్వారా సోకదు వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకే అవకాశాల్లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ దశలో ఉన్న ప్రాంతాల్లో కూడా వార్తా పత్రికలు చదవడం అత్యంత సురక్షితమని ఆయన చెప్పారు. పత్రికల ద్వారా వైరస్ సోకుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని పునరుద్ఘాటిం చారు. రోజూ ఉదయం తాను పత్రికలు చదువుతూ టీ ఎంజాయ్ చేస్తానన్నారు. -
స్పోర్ట్స్ కోటా అమలుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: వృత్తివిద్యా కోర్సుల ప్రవేశాల్లో స్పోర్ట్స్ కోటా అమలుపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి శనివారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సాట్స్ వీసీఎండీ నియమితులయ్యారు. సభ్యులుగా ఉన్న త విద్యామండలి ప్రతినిధి, జేఎన్టీయూ, కాళోజీ వర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీల రిజిస్ట్రార్ లేదా వర్సిటీ నియమించిన ప్రతినిధులు, తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్లను నియమించింది. -
ఆ కేసుల విచారణకు ప్రత్యేక కమిటీలు..
సాక్షి, న్యూఢిల్లీ : పోక్సో చట్టం కింద కేసుల విచారణపై పర్యవేక్షణ, నియంత్రణ కోసం న్యాయమూర్తులతో ప్రత్యేక కమిటీలు నియమించాలని సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం అన్ని రాష్ట్రాల హైకోర్టులను కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన బెంచ్ డీజీపీలనూ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేసుల విచారణ వేగవంతానికి, సాక్షులను సకాలంలో కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా పోక్సో కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. యూపీలో అత్యధికంగా 30,883 ఈ తరహాకేసులు పెండింగ్‌లో ఉండగా, మహారాష్ట్ర, గోవాల్లో 16,099 కేసులు, మధ్యప్రదేశ్‌లో 10,117 కేసులు, పశ్చిమ బెంగాల్లో 9894 కేసులు, ఒడిషాలో 6,849 కేసులు, ఢిల్లీలో 6100 కేసులు, బిహార్‌లో 4910 కేసులు, కర్ణాటకలో 4045 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 12 ఏళ్లలోపు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు మరణ దండన విధిస్తూ ప్రభుత్వం చట్ట సవరణను చేపట్టిందని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ కోర్టుకు నివేదించారు. -
ఎదురుదాడికి టీడీపీ సిద్ధం!
సాక్షి, అమరావతి : కేంద్రం నుంచి తమ పార్టీ మంత్రులను ఉపసంహరించుకుని, ఇంకా ఎన్డీఏలో కొనసాగుతున్న టీడీపీ తీరుపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం తెలిసిందే. విమర్శలను తిప్పికొట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ నేతలతో ఎప్పటికప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, కళ వెంకట్రావు, పయ్యావుల కేశవ్‌లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తాజా రాజకీయ పరిణామాలపై ప్రతిరోజు చంద్రబాబుతో చర్చించనుంది. అలాగే ఆదివారం జరగనున్న టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. -
హర్యానాలో ఇద్దరు దళిత బాలికల రేప్, హత్య
చండీగఢ్: హర్యానాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దళిత బాలికలు అత్యాచారానికి, దారుణహత్యకు గురయ్యారు. కురుక్షేత్ర జిల్లాకు చెందిన ఓ బాలిక(15) పదో తరగతి చదువుకుంటోంది. గత మంగళవారం ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదు. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం శరీర భాగాలను ఛిద్రం చేసి కాల్వలో పడేశారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పానిపట్ జిల్లాకు చెందిన ఓ బాలిక(11) శుక్రవారం సాయంత్రం చెత్తను పారేసేందుకు బయటకు వెళ్లగా కొందరు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఉరివేసి చంపారు. ఈ ఘటనలో మృతురాలి పొరుగింట్లో ఉండే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్లినికల్ పరీక్షల నియంత్రణకు ప్రత్యేక కమిటీ
వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: క్లినికల్ పరీక్షల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి గురువారం తెలిపారు. ఔషధాల పనితీరును గుర్తించేందుకు మనుషులపై ప్రయోగించే పద్ధతులపై ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. క్లినికల్ పరీక్షలు, బ్లడ్ బ్యాంకుల నిర్వహణ, కేసీఆర్ కిట్ల పంపిణీ, జికా వైరస్ నివారణ చర్యలు వంటి పలు అంశాలపై మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..బ్లడ్ బ్యాంకులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌లో అదనపు పోస్టుల నియామకాల వివరాలను సిద్ధం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆమోదంతో నియామకాల ప్రక్రియను చేపడతామని చెప్పారు. -
తల్లీబిడ్డల ఆరోగ్యమే అభిమతం
♦ మహిళా అధికారులతో ప్రత్యేక కమిటీ ♦ గర్భిణుల ప్రోత్సాహకం, కేసీఆర్ కిట్స్‌పై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: గర్భిణులకు ప్రసవ సమయంలో ప్రభు త్వం అందించే ఆర్థిక సాయం, నవజాత శిశువులకు బçహూక రించే కేసీఆర్ కిట్స్ ద్వారా తల్లీబిడ్డలకు ఆరోగ్య అలవాట్లను అందించాలన్నదే తమ అభిమతమని సీఎం కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రసవ మరణాలు సున్నా శాతా నికి పడిపోవాలని, భావితరం ఆరోగ్యంగా ఎదగాలని ఆకాం క్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకునే పేద మహిళలకిచ్చే రూ. 12 వేల ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్స్ పథకాల అమలుపై గురువారం ప్రగతి భవన్లో సీఎం సమీ క్షించారు. ‘కేసీఆర్ కిట్’ ద్వారా అందించే వస్తువులను పరిశీ లించారు. మస్కిటో మెష్, సబ్బులు, షాంపూలు, పౌడర్లు, టవళ్లు, డైపర్లు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే కిట్స్ సరఫరా కు టెండర్లు పిలిచామని, మే నుంచి కిట్స్ అందిస్తామని ఆరో గ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ చెప్పారు. రూ.12 వేల ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి కార్యక్ర మాల అమలుకు కార్యాచరణ రూపొందించేందుకు అధికారు లతో ప్రత్యేక కమిటీని నియమించారు. దీనిలో శాంతి కుమారి, వాకాటి కరుణ, స్మితా సబర్వాల్, యోగితా రాణా, ప్రియాంక వర్గీస్ సభ్యులుగా ఉండనున్నారు. గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు... ‘‘నెలలు నిండాక కూడా పేద గర్భిణులు కుటుంబం గడవ డానికి పనులు చేస్తూనే ఉన్నారు. దీంతో వారి ఆరోగ్యం దెబ్బ తినటంతోపాటు పుట్టే పిల్లలపైనా ప్రభావం పడుతుంది. అందుకే గర్భిణులు నెలలు నిండినప్పటి నుంచి శిశువులకు జన్మనిచ్చి వారికి 2, 3 నెలల వయసు వచ్చే వరకు కూలి పనులకు వెళ్లకుండా కుటుంబ అవసరాలు తీరాలనే ఉద్దేశం తో సాయం అందించాలని నిర్ణయించాం. ప్రభు త్వాస్ప త్రుల్లో కాన్పు అయిన పేద మహిళలందరికీ రూ. 12 వేలు, ఆడపిల్ల పుడితే మరో రూ. వెయ్యి అదనంగా ఇస్తాం. ఈ సాయం ఎన్ని విడతల్లో అందించాలి, గర్భిణులకు ఏ నెల నుంచి ఇవ్వాలనేది అధికారులు నిర్ణయిస్తారు. గర్భిణుల పేర్లను నమోదు చేయించాలి. వారికి అవసరమైన మందులు అందించాలి. గ్రామాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలున్నారు. ఈ పనులకు ఎవరిని ఉపయోగించు కుంటే బాగుంటుందో నిర్ణయించాలి. శిశువులకు కేసీఆర్ కిట్స్‌తో ఆరోగ్యవంతమైన సంరక్షణ ప్రారంభమవుతుంది. ప్రసవ మరణాలు తగ్గుతాయి. తల్లీబిడ్డలు క్రమం తప్పకుం డా ఆస్పత్రులకు వస్తే టీకాలు, మందులు సకాలంలో అం దుతాయి’’ అని సీఎం చెప్పారు. ఒంటరి మహిళలకు రూ. వెయ్యి భృతి అందించాలని నిర్ణయించినందున.. ఒంటరి మహిళలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సాయంతో వారి పోషణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి కూడా ఊరటగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
భూమి కొనుగోలు పథకం ప్రతిపాదనల పరిశీలన
కర్నూలు(అగ్రికల్చర్): ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం కింద భూమి కొనిచ్చే ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నియమించిన ప్రత్యేక కమిటీ పరిశీలన చేపట్టింది. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రాలయం, శ్రీశైలం, బనగానపల్లి, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆలూరు నియోజకవర్గాలకు చెందిన తహసీల్దార్లు ప్రతిపాదనలు తెచ్చారు. వీటిని కేఆర్ఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సి, ఈ సెక్షన్ సూపరింటెండెంట్లు రామాంజనమ్మ, ప్రియదర్శిని తదితరులు పరిశీలించారు. మంత్రాలయం, శ్రీశైలం, బనగానపల్లి నియోజకవర్గాల నుంచి 70 ప్రతిపాదనలు రాగా 40 ఆమోదించారు. ఎకరా యూనిట్ కాస్ట్ రూ.5 లక్షలు ఉండగా ప్రభుత్వం రూ.2లక్షలు సబ్సిడీ ఇస్తుంది. స్రీ నిధి నుంచి రూ.3లక్షలు లోన్ ఇస్తారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వీర ఓబులు తదితరులు పాల్గొన్నారు. -
అభినవ్ బింద్రా నేతృత్వంలో..
న్యూఢిల్లీ: ఇటీవల రియోలో ముగిసిన ఒలింపిక్స్‌లో భారత షూటర్ల పేలవ ప్రదర్శనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ కమిటీకి షూటర్ అభినవ్ బింద్రా నేతృత్వం వహించనున్నట్లు జాతీయ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ సమీక్షలో షూటర్ల వ్యక్తిగత ప్రదర్శను సమీక్షించిన అనంతరం వారిపై తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. భారత్ నుంచి హీనా సిద్ధూ, మనవ్ జీత్ సింగ్ సిద్ధూ, గగన్ నారంగ్, జితూ రాయ్, అపూర్వ చండీలా తదితరులతో కూడిన షూటింగ్ బృందం రియోకు వెళ్లిన పతకం సాధించడంలో విఫలమైంది. రియోలో అభినవ్ బింద్రా, జితూ రాయ్‌లు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. ఈ నేపథ్యంలో భారత రైఫిల్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇటీవల భారత రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ కూడా భారత షూటర్ల రియో ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది షూటర్లకు వ్యక్తిగత కోచ్‌లను అనుమతించమే తాము చేసిన అతి పెద్ద తప్పిదమని రణీందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ విషయంపై భవిష్యత్తులో తాము ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందంటూ షూటర్లకు ముందస్తు హెచ్చరికలు పంపారు. -
పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక కమిటీలు
మాడుగుల: గ్రామాల్లో పారిశుధ్యం మెరుగకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేస్తున్నామని డీపీవో కృష్ణకుమారి అన్నారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులు పరిశీలన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. పారిశుధ్య కమిటీల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 550 క్లస్టర్లు ఉండగా వీరిలో 376 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులు, గుమస్తాలు ఉన్నారని చెప్పారు. జిల్లాలో రూ.40 కోట్ల ఇంటి పన్నుల వసూలకు ఇప్పటివరకు రూ.40 కోట్లు మాత్రమే వసూలైందన్నారు. విద్యుత్ బకాయిలు రూ.13 కోట్లలో రూ.7 కోట్లు వసూలైందన్నారు. ఆక్రమణకు గురవుతున్న పంచాయతీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఈవో సత్యనారాయణను ఆదేశించారు. పంచాయతీ షాపింగ్ కాంప్లెక్సు అద్దె వసూలుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయనను ఆదేశించారు. వారపు సంతల్లో గిడ్డంగులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈవోపీఆర్డీ కొంకి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ నుంచి వేరు చేయండి
* దిగ్విజయ్‌ను కోరిన రంగారెడ్డి జిల్లా నేతలు * జిల్లాకు పార్టీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి * దానం పనితీరుపై నేతల ఫిర్యాదు * పొమ్మన లేక పొగబెడుతున్నారన్న దానం * గ్రేటర్ సమీక్షలో నాయకుల వాగ్బాణాలు సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నుంచి తమ నియోజకవర్గాలను విడదీసి, జిల్లాకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లా నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు విన్నవించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ పనితీరు, గ్రేటర్ ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహంపై దిగ్విజయ్‌సింగ్ గురువారం గాంధీభవన్‌లో సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. కమిటీ విభజనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, అప్పటిదాకా ఐక్యంగా ఉండాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. దానం పనితీరు బాగాలేదని ఫిర్యాదు దానం నాగేందర్ పనితీరు బాగాలేదని, 40 శాతానికి పైగా ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు నేతలు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజక వర్గాలు, వార్డులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయని, వాటి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆ జిల్లా నేతలు కోరారు. హైదరాబాద్ పరిధి విస్తృతంగా పెరిగిందని, 28 నియోజకవర్గాల్లో పార్టీని నడిపించడం గ్రేటర్ కమిటీకి సాధ్యంకావడం లేదన్నారు. అయితే జీహెచ్ఎంసీ ప్రాంత మంతా ఒకటే కమిటీ ఉండాలని హైదరాబాద్ నేతలు కోరారు. దీనిపై నేతలు కాసేపు వాదించుకున్నారు. కార్పొరేటర్ టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని, స్కూటర్లపై తిరిగే వారు ఇప్పుడు ఆడి కార్లలో తిరుగుతున్నారని నాయకుడు సిరాజుద్దీన్ ఆరోపించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్‌తో దానంకు సాన్నిహిత్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే మేరీ రవీంద్రనాథ్ అన్నారు. మంత్రి పద్మారావు గౌడ్ ఇటీవలే దానం ఇంటికి వెళ్లిన విషయాన్ని మరో నాయకుడు ప్రస్తావించారు. ఓటర్లను తొలగిస్తే గ్రేటర్ హైదరాబాద్ కమిటీ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో పార్టీని రెండుగా విభజించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సూచించారు. ఎన్నో త్యాగాలు చేశా: దానం భేటీలో దానం నాగేందర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై తనకు సమాచారం ఉండటం లేదన్నారు. ఓటర్ల తొలగింపు వంటి చిన్నచిన్న అంశాలతో సమావేశాలు పెట్టుకుంటున్నారని విమర్శిం చారు. టికెట్ల కోసం డబ్బులు తీసుకున్నట్టుగా ఒక్కరు నిరూపించినా ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. పార్టీ మారుతున్నానంటూ తనపై కొందరు పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సమావేశంలో అంజన్‌కుమార్ యాదవ్, సుధీర్ రెడ్డి, క్యామ మల్లేశం, మల్రెడ్డి రంగారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్యానర్లకు కమిటీ
చట్ట విరుద్ధంగా, అనుమతులు లేకుండా కూడళ్లలో, బస్టాపుల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే ఇక కొరడా ఝుళిపించనున్నారు. ఇందు కోసం హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగనుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా న్యాయమూర్తి ఎస్ రాజేశ్వరన్ వ్యవహరించనున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎక్కడ బడితే అక్కడ రోడ్ల మీద బ్యానర్లు,ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసే సంస్కృతి తాండవం చేస్తోంది. రాజకీయ సభలైనా, వివాహాలైనా, పుట్టినరోజులైనా సరే బ్యానర్లు కట్టాల్సిందే. ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేసుకోవాల్సిందే. వీటి కారణంగా అనేక చోట్ల ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అయితే, ఇక చెప్పలేం. రోడ్లు కన్పించని రీతిలో ముంచెత్తేస్తారు. వీటిపై కొరడా ఝుళిపించే విధంగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి కోర్టుల్లో ఉద్యమిస్తున్నారు. ఎక్కడైనా తనకు బ్యానర్, కటౌట్టు కనిపిస్తే చాలు వాటిని స్వయంగా తొలగించే పనిలో ఆయన నిమగ్నం అవుతారు. ఎట్టకేలకు ఇటీవల హైకోర్టు ఆయన ఉద్యమానికి స్పందించింది. ఇక బ్యానర్లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి ఉంటే, ఆయా జిల్లా కలెక్టర్ల అనుమతిని తప్పనిసరి చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే, నిర్ణీత సమయంలోపు వాటిని తొలగించని పక్షంలో కొరడా ఝుళిపించాలని సూచించింది. అయితే, వీటిని అమలు చేసే వాళ్లు లేరు. దీంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన ట్రాఫిక్ రామస్వామి ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై కోర్టు ధిక్కార కేసు నమోదుకు పట్టుబట్టే పనిలో పడ్డారు. రంగంలోకి కమిటీ : బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు నమోదుకు పట్టుబడుతూ ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బుధవారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహేశ్వరన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సోమయాజులు హాజర య్యారు. నిబంధనల్ని కఠినతరం చేశామని, అనుమతులు తప్పనిసరి అని తన వాదనలో సోమయాజులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. కొరడా ఝుళిపించే విధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవ రత్నం, మరో అధికారి ఏకాంబరం నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు బెంచ్ దృష్టికి తెచ్చారు. ఇందుకు బెంచ్ నిరాకరించింది. ఐఏఎస్ అధికారి జీవ రత్నంను సభ్యుడిగా నియమిస్తూ ఆ కమిటీకి చైర్మన్‌గా న్యాయమూర్తి ఎస్ రాజేశ్వరన్‌ను నియమించింది. రాజేశ్వరన్ నేతృత్వంలోని కమిటీ ఇక బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల వ్యవహారాల్ని పరిశీలిస్తుందని, అనుమతులు లేకుండా, ఇష్టా రాజ్యంగా, చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసే వాటిపై కొరడా ఝుళిపించే విధంగా ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని బెంచ్ స్పష్టం చేసింది. -
కూలిలోనూ కక్కుర్తి !
విజయనగరం మున్సిపాలిటీ: పదిహేను రోజులుగా ఇల్లూ వాకిలి వదిలి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన విద్యుత్ సిబ్బంది శ్రమ దోపిడీకి గురవుతున్నారు. హుదూద్ తుపాను అనంతరం జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థను సరి చేయటంలో వారు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు కూడా. అయితే పలువురు అధికారులు ఈ కష్టజీవుల పొట్ట కొడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందికి ఇవ్వాల్సిన వేతనంలో చేతివాటం ప్రదర్శించి తక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా వారికి చెల్లించవలసిన రూ.50 లక్షల రూపాయలను అధికారులు తమ జేబులో వేసుకున్నట్టు సమాచారం. ఇదే విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విచారణకు ప్రత్యేక కమిటీని వేశారు. హుదూద్ బీభత్సంతో జిల్లాలో విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది. ప్రజలంతా చాలాకాలం పాటు అంధకారంలోనే గడిపారు. ఇలాంటి సమయంలో జిల్లాలో వెలుగులు నింపేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు మనరాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన అధికారులు, సిబ్బంది తరలివచ్చారు. వారి కష్టం ఫలితంగానే జిల్లాలో చీకట్లు తొలిగాయి. పనులు చేపడుతున్న సిబ్బంది వేతనాలు, భోజనాలతో పాటు పనుల్లో వినియోగిస్తున్న యంత్రాల కోసం ఇప్పటి వరకు రూ.5.09 కోట్లు ఖర్చు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా కష్టించి పనిచేస్తున్న సిబ్బందికి చెల్లించాల్సిన రోజు వారీ వేతనాల విషయంలో కొందరు అధికారులు కక్కుర్తి పడుతున్నారు. మాయమాటలు చెప్పి ఇవ్వాల్సిన వేతనం కన్నా రూ. రెండు వందలు తక్కువగా చెల్లిస్తున్నారు. జిల్లాలో 83 సబ్స్టేషన్ల పరిధిలో ఆయా ఏఈలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులను నోడల్ అధికారులుగా నియమించి పనులు నిర్వహిస్తున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పనులను దగ్గరుండి పరిశీలించటంతో పాటు పని చేసే కూలీలకు వేతనాలు, భోజనాలు సమకూర్చాల్సి ఉంది. ఇందులో భాగంగా శాఖాపరంగా ఒక్కో కూలికి రూ.650 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇందులో సిబ్బంది భోజనానికి రూ.150 చెల్లిస్తుండగా... వేతనం కింద రూ.500 ఇస్తున్నారు. అయితే ఈ వేతనాల చెల్లింపుల్లో సబ్‌స్టేషన్ పరిధిలోని నోడల్ అధికారులు, ఏఈలు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో విద్యుత్ పునరుద్ధరణ పనులకు తొలుత 2,200 మంది హాజరుకాగా ఇప్పుడా సంఖ్య 3,297కు పెరిగింది. ఒడిశా రాష్ట్రంతో పాటు ఏపీడీసీఎల్, విజయవాడ, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి సిబ్బంది వచ్చి జిల్లాలో పనులు చేపడుతున్నారు. ఇందులో ఒడిశాకు సంబంధించిన సిబ్బందికి మన వంటకాలు పడకపోవటంతో వారే స్వయంగా పని ప్రదేశంలో వంటలు చేసుకుని భోజనాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి అధికారులు నిర్దేశించిన ప్రకారం రూ.650 చెల్లించాల్సి ఉంది. అదే భోజనాలు అధికారులు పెడితే రూ.500 చొప్పున చెల్లించాలి. కానీ ఒడిశా వాసులకు భోజనం పెట్టకుండానే రూ.450, భోజనాలు పెడుతున్న ఇతర ప్రాంత వాసులకు రూ.300 చొప్పున ఇస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయంపై పలువురు సిబ్బంది జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకునేందుకు వస్తే తమకు ఇచ్చే కూలిని దోచుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఇదే విషయమైన జిల్లాలో పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న విశ్రాంత సీఎండీ రంగనాథం వద్ద సాక్షి ప్రస్తావించగా... ఈ విషయంపై తమ వరకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపై నలుగురు అధికారుల కమిటీగా ఏర్పాటు చేసిన విచారణ చేస్తున్నామని తెలిపారు. బృందం మంగళవారం నుంచి వేతనాల చెల్లింపులపై ఆరా తీస్తోందని, కూలీలకు అన్యాయం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలా కానీ జరిగితే విజెలెన్స్ విచారణ వేయిస్తామన్నారు. -
రిమ్స్‌లో సమస్యలపై ప్రత్యేక కమిటీ
ఒంగోలు సెంట్రల్ : స్థానిక రిమ్స్‌లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ అంజయ్య, ఇతర అధికారులు, భవన నిర్మాణాలకు సంబంధించిన ఇంజినీర్లు, మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ సభ్యులతో కలిసి బుధవారం రిమ్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం రిమ్స్ లెక్చర్‌హాల్‌లో వారందరితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిమ్స్ డెరైక్టర్ అంజయ్య మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) వారు రిమ్స్‌లో ఎంబీబీఎస్ నాలుగో ఏడాది తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయని విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అందుకు కారణమైన సమస్యలను వెంటనే పరిష్కరించి ఎంసీఐ బృందాన్ని మరోసారి తనిఖీలకు ఆహ్వానిస్తూ దరఖాస్తు చేసినట్లు చెప్పారు. రిమ్స్‌లో మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రిమ్స్‌లో సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. రిమ్స్‌లో సమస్యలపై ఆ కమిటీ ప్రతినెలా సమీక్షిస్తుందన్నారు. మెడికల్ కాలేజీ, సిబ్బంది క్వార్టర్స్, ఇతర భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వంతో మాట్లాడి ఎంసీఐ అనుమతులు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. అనంతరం రిమ్స్‌లోని ట్రామాకేర్ విభాగాన్ని పరిశీలించి సిబ్బందికి వేతనాలు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తమకు వేతనాలు పెంచాలంటూ పారిశుధ్య విభాగం సిబ్బంది ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. పలువురు రోగులు, వారి బంధువులు రిమ్స్‌లో నెలకొన్న మంచినీరు, మరుగుదొడ్లు, ఐసీయూలో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో రిమ్స్ ఆర్ఎంవో డాక్టర్ బాలాజీనాయక్ పాల్గొనగా, ఎమ్మెల్యే వెంట ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం తదితరులు ఉన్నారు. -
నీటి విడుదలపై ప్రత్యేక కమిటీ
సాక్షి, హైదరాబాద్: నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగా కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు అయ్యే వరకు ఈ కమిటీ మనుగడలో ఉంటుంది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో ఈ కమిటీదే తుది నిర్ణయం. ఈ మేరకు సాగునీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి వి. నాగిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల అధికారులు ఉంటారు. రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, ఈఎన్సీలు, ఇరు రాష్ట్రాల జెన్కో డెరైక్టర్లు, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారు. అయితే నీటి విడుదల విషయంలో పాత విధానం (ఇప్పటి వరకు అమలులో ఉన్న) ప్రకారమే ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే వరద నియంత్రణ పర్యవేక్షణ బాధ్యత కూడా ఈ కమిటీ కిందకే రానుంది. కాగా కృష్ణా నదిపై ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలా? వద్దా ? అనే విషయాన్ని ఈ కొత్త కమిటీ నిర్ణయిస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ వరద జలాలపై ఆధారపడి ఉండడంతో నికర జల కేటాయింపులు లేవు. దాంతో వరదలు వచ్చిన సమయంలోనే ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే శ్రీశైలం, సాగర్, జూరాల, బీమా, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, డెల్టాలకు నీటి విడుదల షెడ్యూల్‌ను ఈ కమిటీ ప్రకటించనుంది. అలాగే చెన్నై, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు మంచినీటి విడుదలను కూడా కమిటీయే పర్యవేక్షించనుంది.