వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: క్లినికల్ పరీక్షల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి గురువారం తెలిపారు. ఔషధాల పనితీరును గుర్తించేందుకు మనుషులపై ప్రయోగించే పద్ధతులపై ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. క్లినికల్ పరీక్షలు, బ్లడ్ బ్యాంకుల నిర్వహణ, కేసీఆర్ కిట్ల పంపిణీ, జికా వైరస్ నివారణ చర్యలు వంటి పలు అంశాలపై మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..బ్లడ్ బ్యాంకులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌లో అదనపు పోస్టుల నియామకాల వివరాలను సిద్ధం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆమోదంతో నియామకాల ప్రక్రియను చేపడతామని చెప్పారు.
క్లినికల్ పరీక్షల నియంత్రణకు ప్రత్యేక కమిటీ
Published Fri, Jun 30 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
Advertisement