ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్‌'! కానీ ఆ వ్యక్తి.. | This Man Was Clinically Dead For Seven Minutes | Sakshi
Sakshi News home page

ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్‌'! కానీ ఆ వ్యక్తి..

Published Mon, Sep 11 2023 11:49 AM | Last Updated on Mon, Sep 11 2023 12:40 PM

This Man Was Clinically Dead For Seven Minutes - Sakshi

చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది.. గమ్మత్తైన ప్రశ్న. దీన్ని శోధించడం కోసం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే ఓ అమెరికా శాస్త్రవేత్త చనిపోయిన తర్వాత ఏం జరగుతుందో..ఆత్మ ఏం చేస్తుందో వంటి షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు కూడా. అందుకోసం దాదాపు 5 వేల మరణాలపై అధ్యయనం చేసినట్లు కూడా వివరించాడు. కానీ ఇక్కడొక వ్యక్తి చావుని చూసి..అంటే..చనిపోయినట్లు డిక్లరయ్యి ఎలాంటి ఆశ లేకుండా.. బతికే అవకాశం కోసం చేస్తున్న వైద్యుల ప్రయత్నాల ఉత్కంఠ నడుమ కోవాలో ఉండి మరీ బతికి బట్టగట్టగలిగాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది..అలాగే తాను నిర్జీవంగా పడిఉన్న సమయంలో చుట్టూ ఏం జరుగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. అదే అతనికి ఒకరకంగా జీవితం విలువను తెలిసేలా చేసిందని ఉద్వేగంగా చెబుతున్నాడు. 

అసలేం జరిగిందంటే..బ్రిటీష్‌ రంగస్థల నటుడు, కళకారుడు శివ్‌ గెర్వాల్‌ తన భార్యతో కలిసి ఎప్పుడులానే భోజనం చేస్తున్నాడు. ఏమైందో ఏమో సడెన్‌గా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడి భార్యకు కాళ్లు చేతులు ఆడలేదు. వెంటనే అంబులెన్స్‌కి కాల్‌చేసి అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ సమయంలో అతడి గుండె ఆల్‌మోస్ట్‌ ఆగిపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు ఏదైనా ప్రథమ చికిత్స చేద్దామనుకుంటే దేనికి రెస్పాండ్‌ కాలేదు. అంబులెన్స్‌లో ఉండే సిబ్బంది కూడా ఫస్ట్‌ ఎయిడ్‌ చేద్దామనుకుంటే గుండె ఆగిపోయినట్లు గుర్తించారు.

వాళ్లు కూడా చేసేది ఏంలేదని తెలిసి చాలా స్పీడ్‌గా ఆస్పత్రికి తరలించారు. చెప్పాలంటే శివ్‌ గెర్వాల్‌ గుండె దాదాపు ఏడు నిమిషాల పాటు ఆగిపోయింది. అక్కడ వైద్యులు కూడా అతడి పరిస్థితి క్రిటికల్‌ అని చెప్పేశారు. అక్కడ వైద్యుల అతడిని బతికించే నిమిత్తం గుండెని కొట్టుకునేలా సీపీర్‌ చేశారు. ఆ తర్వాత సర్జరీ చేసి గుండెకి అడ్డుపడుతున్న ధమనికి స్టంట్‌ వేశారు. అతను సుమారు ఓ నెలపాటు కోమాలోనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే గెర్వాల్‌కి ఆ టైంలో తన చుట్టు ఏం జరుగుతుందో తెలిసింది. తాను ఏదో అఛేతనంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా బతకాలి నా భార్యతో మాట్లాడలనే ఆత్రుత అతడిలో చలనం తెప్పించి కోమాలోంచి బయటకు వచ్చేలా చేసింది.

వైద్యలు సైతం అతడు బతుకుతాడని బావించలేదు. ఓ ప్రయత్నంగా వైద్యులు చేసిన ఆపరేషన్‌, మరోవైపు గెర్వాల్‌ బతకాలని తపన పడుతున్న భార్య ఆకాంక్ష వెరసి అతడికి పునర్జన్మనిచ్చాయి. అతడిని ఆ మృత్యుముఖం నుంచి బయటకొచ్చేలా చేసింది. కోలుకుని తాను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక ఆ టైంలో ఏం జరిగింది, తన గుండె ఎలా ఆగిపోయింది తదితరాలను చెబుతూ అందర్నీ షాక్‌కి గురిచేశాడు. మరణాంతరం ఏం జరుతుందో గుదిగుచ్చినట్లు వివరించాడు.

మరణాంతరం ఏ జరుగుతుందనే ఆ అనుభవమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు అంతేగాదు తన గుండె ఆగిపోయినప్పుడూ జరిగిన ప్రతిదాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని దాన్ని ఓ కళగా చిత్రకరించేందుకు ప్రయత్నిస్తున్నాని చెబుతున్నారు. ప్రసుతం తాను మరణాంతరం తిరిగి పొందిన జీవితాన్ని అనుభవిస్తున్నాని సంతోషంగా చెబుతున్నాడు. ఇది ఒకరకంగా మరణం గురించి భయం లేకుండా ధైర్యంగా ఉండేలా చేసింది. అంతేగాదు ఈ అనుభవం జీవితంలో ప్రతిక్షణం ఎంత విలువైందో తెలిసి వచ్చేలా చేసింది. ఈ రోజు నేను ఇక్కడ బతికిబట్టగలిగి ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమేగాక సంతోషంగా ఉందని అన్నారు. 

(చదవండి: జస్ట్‌ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement