Clinical examination
-
Clinical Vampirism: ఈ జబ్బు గురించి తెలుసా?
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలా రక్తాన్ని రుచి చూసే ఆ పిశాచాల్లాంటి క్యారెక్టర్స్‌ను ఇంగ్లిష్‌లో ‘వాంపైర్స్’ అని పిలుస్తారు. కానీ అలా రక్తం తాగే కోరికతో ఉండే ఒక జబ్బు ఉంటుందనీ, ఆ మెడికల్ కండిషన్ పేరే ‘వాంపైరిజమ్’ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ వాంపైరిజమ్ గురించిన కథనమే కాస్త సంక్షిప్తంగా... ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతో కొంత రుచి చూస్తుంటాడు. దీనికి ఉదాహరణే... వేలు తెగినప్పుడు గబుక్కున అకస్మాత్తుగా చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఇందులో రక్తాన్ని రుచిచూడడానికంటే... అలా కంటిన్యువస్‌గా రక్తస్రావం జరగకుండా నివారించేందుకే ఇలా తెగిన వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఎవరికి వారు తమ సొంత రక్తాన్ని రుచి చూసే ఆ ప్రక్రియకు ‘ఆటో వాంపైరిజమ్’ అంటారు. వేలు తెగి రక్తస్రావం అవుతున్నప్పుడు చాలామందిలో కనిపించే ఈ ప్రక్రియ చాలా సాధారణమైన ప్రతిక్రియగా భావించవచ్చు. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఓ అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారిలో రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరిక పుట్టడాన్ని ‘క్లినికల్ వాంపైరిజమ్’ అంటారు. మరికొందరిలోనైతే ఇది కాస్త రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ ‘బిహేవియరల్ థెరపీ’ అనే చికిత్స చేస్తారు. అన్నట్టు... ఈ జబ్బు ‘రెన్‌ఫీల్డ్స్’ పేరిట 2023లో ఓ అమెరికన్ మూవీ కూడా విడుదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది ఓ ‘అమెరికన్ యాక్షన్ కామెడీ హారర్’ థీమ్‌తో తయారైన సినిమా. -
ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది.. గమ్మత్తైన ప్రశ్న. దీన్ని శోధించడం కోసం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే ఓ అమెరికా శాస్త్రవేత్త చనిపోయిన తర్వాత ఏం జరగుతుందో..ఆత్మ ఏం చేస్తుందో వంటి షాకింగ్ విషయాలు వెల్లడించాడు కూడా. అందుకోసం దాదాపు 5 వేల మరణాలపై అధ్యయనం చేసినట్లు కూడా వివరించాడు. కానీ ఇక్కడొక వ్యక్తి చావుని చూసి..అంటే..చనిపోయినట్లు డిక్లరయ్యి ఎలాంటి ఆశ లేకుండా.. బతికే అవకాశం కోసం చేస్తున్న వైద్యుల ప్రయత్నాల ఉత్కంఠ నడుమ కోవాలో ఉండి మరీ బతికి బట్టగట్టగలిగాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది..అలాగే తాను నిర్జీవంగా పడిఉన్న సమయంలో చుట్టూ ఏం జరుగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. అదే అతనికి ఒకరకంగా జీవితం విలువను తెలిసేలా చేసిందని ఉద్వేగంగా చెబుతున్నాడు. అసలేం జరిగిందంటే..బ్రిటీష్ రంగస్థల నటుడు, కళకారుడు శివ్ గెర్వాల్ తన భార్యతో కలిసి ఎప్పుడులానే భోజనం చేస్తున్నాడు. ఏమైందో ఏమో సడెన్‌గా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడి భార్యకు కాళ్లు చేతులు ఆడలేదు. వెంటనే అంబులెన్స్‌కి కాల్చేసి అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ సమయంలో అతడి గుండె ఆల్మోస్ట్ ఆగిపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు ఏదైనా ప్రథమ చికిత్స చేద్దామనుకుంటే దేనికి రెస్పాండ్ కాలేదు. అంబులెన్స్‌లో ఉండే సిబ్బంది కూడా ఫస్ట్ ఎయిడ్ చేద్దామనుకుంటే గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. వాళ్లు కూడా చేసేది ఏంలేదని తెలిసి చాలా స్పీడ్‌గా ఆస్పత్రికి తరలించారు. చెప్పాలంటే శివ్ గెర్వాల్ గుండె దాదాపు ఏడు నిమిషాల పాటు ఆగిపోయింది. అక్కడ వైద్యులు కూడా అతడి పరిస్థితి క్రిటికల్ అని చెప్పేశారు. అక్కడ వైద్యుల అతడిని బతికించే నిమిత్తం గుండెని కొట్టుకునేలా సీపీర్ చేశారు. ఆ తర్వాత సర్జరీ చేసి గుండెకి అడ్డుపడుతున్న ధమనికి స్టంట్ వేశారు. అతను సుమారు ఓ నెలపాటు కోమాలోనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే గెర్వాల్కి ఆ టైంలో తన చుట్టు ఏం జరుగుతుందో తెలిసింది. తాను ఏదో అఛేతనంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా బతకాలి నా భార్యతో మాట్లాడలనే ఆత్రుత అతడిలో చలనం తెప్పించి కోమాలోంచి బయటకు వచ్చేలా చేసింది. వైద్యలు సైతం అతడు బతుకుతాడని బావించలేదు. ఓ ప్రయత్నంగా వైద్యులు చేసిన ఆపరేషన్, మరోవైపు గెర్వాల్ బతకాలని తపన పడుతున్న భార్య ఆకాంక్ష వెరసి అతడికి పునర్జన్మనిచ్చాయి. అతడిని ఆ మృత్యుముఖం నుంచి బయటకొచ్చేలా చేసింది. కోలుకుని తాను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక ఆ టైంలో ఏం జరిగింది, తన గుండె ఎలా ఆగిపోయింది తదితరాలను చెబుతూ అందర్నీ షాక్‌కి గురిచేశాడు. మరణాంతరం ఏం జరుతుందో గుదిగుచ్చినట్లు వివరించాడు. మరణాంతరం ఏ జరుగుతుందనే ఆ అనుభవమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు అంతేగాదు తన గుండె ఆగిపోయినప్పుడూ జరిగిన ప్రతిదాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని దాన్ని ఓ కళగా చిత్రకరించేందుకు ప్రయత్నిస్తున్నాని చెబుతున్నారు. ప్రసుతం తాను మరణాంతరం తిరిగి పొందిన జీవితాన్ని అనుభవిస్తున్నాని సంతోషంగా చెబుతున్నాడు. ఇది ఒకరకంగా మరణం గురించి భయం లేకుండా ధైర్యంగా ఉండేలా చేసింది. అంతేగాదు ఈ అనుభవం జీవితంలో ప్రతిక్షణం ఎంత విలువైందో తెలిసి వచ్చేలా చేసింది. ఈ రోజు నేను ఇక్కడ బతికిబట్టగలిగి ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమేగాక సంతోషంగా ఉందని అన్నారు. View this post on Instagram A post shared by shiv grewal (@artshivinder) (చదవండి: జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!) -
క్లినికల్ పరీక్షల నియంత్రణకు ప్రత్యేక కమిటీ
వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: క్లినికల్ పరీక్షల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి గురువారం తెలిపారు. ఔషధాల పనితీరును గుర్తించేందుకు మనుషులపై ప్రయోగించే పద్ధతులపై ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. క్లినికల్ పరీక్షలు, బ్లడ్ బ్యాంకుల నిర్వహణ, కేసీఆర్ కిట్ల పంపిణీ, జికా వైరస్ నివారణ చర్యలు వంటి పలు అంశాలపై మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..బ్లడ్ బ్యాంకులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌లో అదనపు పోస్టుల నియామకాల వివరాలను సిద్ధం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆమోదంతో నియామకాల ప్రక్రియను చేపడతామని చెప్పారు.