Miracle
-
అనంతపురం : ఆకాశంలో అద్భుతం (ఫొటోలు)
-
ఈ వాతావరణంలో చెట్టుచేమలకే తావులేదు. కానీ ఈ అద్భుతం అక్కడిదే..!
సాధారణంగా వసంత సంరంభమంతా చెట్లు చేమలు ఉన్న చోటనే కనిపిస్తుంది. ఎడారుల్లో వసంతరాగం దాదాపుగా వింతే! వసంతకాలంలో ఎడారిలో పూలు పూసిన దృశ్యం కనిపిస్తే ‘ఎడారిలోన పూలు పూచెనెంత సందడి’ అను పాడుకోక తప్పదు. ఈ పొటోలు అమెరికా న్యూమెక్సికోలోని ‘వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్’ ప్రాంతంలో తీసినవి. వైట్ శాండ్స్ నేషనల్ మాన్యుమెంట్ ప్రాంతం అంతటా దాదాపు 590 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎటు చూసినా తెల్లని ఇసుక తిన్నెలే కనిపిస్తాయి. ఇది ఎడారి. ఇక్కడ ఏడాది పొడవునా ఎండలు భగభగలాడుతుంటాయి. ఇక్కడి వాతావరణంలో చెట్టుచేమలు పెరగడమే అరుదు. అలాంటిది అక్కడ మొక్కలకు పూలు పూయడమంటే, ఊహాతీతమైన సంగతే! ఈ ఎడారిలోని ఇసుక జిప్సమ్ స్ఫటికాల రేణువులతో నిండి ఉండటంతో చాలా తెల్లగా కనిపిస్తుంది. ఈ ఇసుక తిన్నెలు ముప్పయి నుంచి అరవై అడుగుల ఎత్తులో చిన్న కొండల్లా కనిపిస్తాయి. ఈ ఎడారిలో చాలా అరుదుగా అప్పుడప్పుడు మొక్కలు మొలుస్తుంటాయి. ఇంకా అరుదుగా వసంతంలో అవి పూలు పూస్తుంటాయి. ఇటీవల అలాంటి అరుదైన దృశ్యమే ఈ ఎడారిలో కెమెరాకు చిక్కింది. ఇవి చదవండి: ఈ తవ్వకాల్లో ఏం దొరికాయో తెలుసా..!? -
మంచుతో నిప్పు పుట్టించవచ్చా? అదెలా సాధ్యం?
నిప్పు- నీరు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. నిప్పు ఉన్న చోట నీరు ఉండదు. నీరు ఉన్న చోట నిప్పు ఉండలేదు. అయితే ఐస్‌తో కూడా నిప్పు పెట్టొచ్చని చెబితే నమ్ముతారా? సైన్స్ సహాయంతో ఈ అద్భుతం ఎలా జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. సైన్స్ చేసే ఈ అద్భుతం 6వ తరగతి పుస్తకంలో దాగి ఉంది. ఈ ప్రయోగం కుంభాకార లెన్స్ చుట్టూ తిరుగుతుంది. లెన్స్ ఉపయోగించి సూర్యకాంతి సహాయంతో నిప్పును మండించడాన్ని మీరు చూసే ఉంటారు. మంచుతో నిప్పును పుట్టించే ప్రయోగం కూడా ఇలానే సాగుతుంది. మంచుతో నిప్పు పుట్టించాలంటే ముందుగా పారదర్శక మంచు అవసరం. ఈ పారదర్శక మంచు ముక్క కుంభాకార లెన్స్ మాదిరిగా పని చేస్తుంది. ఈ మంచు ముక్క నుంచి సూర్యకాంతిని బయటకు ప్రసరింపజేసి, అది కాగితంపై పడేలా చేస్తే, కొంత సమయం తరువాత ఆ కాగితం నుండి పొగ రావడం ప్రారంభమవుతుంది. తరువాత కాగితంపై మంటలు వ్యాపించడాన్ని గమనించవచ్చు. మంచును కుంభాకార లెన్స్‌గా ఉపయోగించి, మంటలను పుట్టించవచ్చని తెలుసుకున్నాం. అయితే మంచును కుంభాకార లెన్స్‌గా ఎలా తయారు చేయాలనే ప్రశ్న ఎదురవుతుంది. ఇందుకోసం ముందుగా పారదర్శక మంచు ముక్కను తీసుకోవాలి. చాకు సాయంతో ఆ మంచుకు లెన్స్ ఆకారాన్ని ఇవ్వాలి. తర్వాత చేతులతో రుద్ది లెన్స్ మాదిరిగా తయారు చేయాలి. లెన్స్ ఎంత పెద్దదిగా ఉంటే నిప్పు అంత ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. లెన్స్ మందం 2 అంగుళాలు, వ్యాసం 6 అంగుళాలు ఉంటే అప్పుడు నిప్పు వేగంగా వ్యాపిస్తుంది. -
చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!
వైద్యులను దేవునితో సమానమని అంటారు. అయితే వారు కూడా మనుషులే అయినందున ఒక్కోసారి పొరపాటు పడుతుండవచ్చు. మెక్సికోలోని శాన్ లూయిస్ పొటోసికి చెందిన వైద్యుని పొరపాటుకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడేళ్ల బాలిక చనిపోయినట్లు ఒక వైద్యుడు నిర్ధారించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ బాలిక మేల్కొంది. మెక్సికోకు చెందిన కైమెలియా రోక్సానా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అనంతరం ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్థారించాడు. ఇది జరిగిన 12 గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ బాలిక సజీవంగానే ఉందని తెలిసింది. కైమెలియా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె తల్లికి తన కుమార్తె బతికేవుందని అనిపించింది. దీంతో ఆమె శవపేటికను తెరవమని అక్కడున్నవారిని కోరింది. అయితే వారు అందుకు అంగీకరించలేదు. కాగా కొంతసేపటికి శవపేటికలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. వెంతనే దానిని తెరిచి, బాలికను బయటకు తీశారు. ఈ సంఘటన 2022, ఆగస్టు 17 న జరిగింది. దీంతో ఆ చిన్నారికి మరుజన్మ లభించిందని పలువురు పేర్కొన్నారు. అయితే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే విషయానికొస్తే.. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆ చిన్నారిని సాలినాస్ డి హిల్డాల్గో కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్చినప్పుడు, చికిత్స సమయంలో ఆమె గుండెచప్పుడు ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలికలో చలనం రాకపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆ బాలిక తల్లి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు చనిపోలేదని అంటూ గట్టిగా ఏడవసాగింది. అంత్యక్రియల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ బాలక తల్లి తన కుమార్తె శవపేటికలో వణుకుతున్నదని అక్కడున్నవారికి చెప్పింది. అయితే వారెవరూ నమ్మలేదు. ఆ బాలిక శవపేటికలో నుంచి ఏడుస్తూ, తన తల్లిని పిలవసాగింది. దీంతో శవపేటిక తెరవగా లోపల ఉన్న బాలిక సజీవంగా కనిపించింది. ఇది కూడా చదవండి: ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల -
టాప్ విరిగిన విమానం, భయంతో కేకలు: ఈ షాకింగ్ ఘటన ఎక్కడ?
విమాన ప్రయాణంలో పొరపాటున కిటికీ ఓపెన్ చేస్తేనే చాలా ప్రమాదం. అలాంటిది ఒక విమానం ముందు భాగం పై భాగంలో కొంత లేచి పోతే.. పరిస్థితి ఏంటి? మిరాకిల్ ఏంటంటే ఇది సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఏంటి నమ్మలేక పోతున్నారా? అసలు ఊహించడానికే కష్టంగా ఉందా? కానీ షాకింగ్ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఏప్రిల్ 28, 1988, విమానయాన చరిత్రలో అత్యంత దిగ్భ్రాంతికరమైన రోజు. బోయింగ్ 737-297 విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే, ఎవరు తలచుకున్నా వెన్నులో వణుకు పుట్టే ఘటన ఇది. అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243 89 మంది ప్రయాణికులు , ఆరుగురు సిబ్బందిని హవాయి బిగ్ ఐలాండ్‌లోని హిలో నుండి ఓహులోని హోనోలులు వరకు 300కిమీల హాప్లో తీసుకువెళుతోంది ఇంతలో ఫ్యూజ్లేజ్లోని పైభాగం మధ్యలోసగం భాగం ఎగిరిపోయింది. ట్విన్-ఇంజన్, 110-సీట్ బోయింగ్ జెట్ 40 నిమిషాల ఫ్లైట్‌లో సగం దూరంలో ఉండగా, అకస్మాత్తుగా క్యాబిన్ కంట్రోల్ పోయింది. ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం విరిగిపోయింది. అంతే ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 24వేల అడుగుల ఎత్తులో విపరీతమైన గాలులకు ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. భయంతో కేకలు వేశారు. ల్యాండ్ అయ్యే లోపే కూలిపోవడం ఖాయమని దాదాపు అందరూ వణికిపోయారు. భారీ సీలింగ్ ప్యానెల్లు ప్రయాణీకుల తలపై పడ్డాయి. అందరికీ దెబ్బలు, రక్త స్రావాలు. ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టుకున్నా.. ఏం లాభం లేదు.. ఉరుములు, తుఫానులాంటి వాతావరణం. కానీ ఆశ్చర్యకరంగా ఈ విపత్కర పరిస్థితి సంభవించిన పదమూడు నిమిషాల తర్వాత మౌయిలోని కహులుయ్ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతగా డ్యామేజ్ అయిన విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడం చూసి గ్రౌండ్ ఎమర్జెన్సీ సిబ్బంది కూడా తమను తాము నమ్మలేకపోయారు. Let’s take a moment to remember Aloha Airlines Flight 243. On April 28th 1988 the roof ripped off the Boeing 737 at 24,000 ft. The chief flight attendant (the only fatality) fell from the plane and debris struck the tail section. Amazingly the pilot still managed to land safely… pic.twitter.com/TAXzlW6KNo — Mothra P.I. (@Hardywolf359) November 17, 2022 ఇప్పటికీ దొరకని ఎయిర్‌హోస్టెస్ మృతదేహం విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంఘటన నుండి బయటపడ్డారు. 95 మందిలో కేవలం ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమిటంటే ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్లె లాన్సింగ్ ప్రాణం మాత్రం గాల్లోనే కలిసిపోయాయి. ఆమె మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. ''అకస్మాత్తుగా, పెద్ద శబ్దం, చప్పుడు వినిపించింది, కానీ పేలుడు కాదు, ఒత్తిడిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది. పైకి చూసాను , విమానం యొక్క ఎడమ ఎగువ భాగం విచ్ఛిన్నం కావడం, విరగడం, ముక్కలు దూరంగా ఎగిరిపోవడం చూశాను. ఇది ఒక గజం వెడల్పు గల రంధ్రంతో ప్రారంభమై, అలా విరుగుతూనే ఉంది’’ అని విమానం వెనుక కూర్చున్న ఒక ప్రయాణీకుడు ఎరిక్ బెక్లిన్ ది వాషింగ్టన్ పోస్ట్‌తో తన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ది మిరాకిల్ ల్యాండింగ్ ఆఫ్ అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243గా సినిమాగా కూడా తెరకెక్కింది ఈ స్టోరీ. నిజమైన హీరోలంటూ ప్రశంసలు పర్స్సర్ క్లారాబెల్లె లాన్సింగ్తోపాటు, జేన్ సటో-టోమిటా , మిచెల్ హోండా విమానంలో క్యాబిన్ సిబ్బందిగా ఉన్నారు. కెప్టెన్ రాబర్ట్ స్కోర్న్స్టెయినర్కు కాక్‌పిట్‌లో ఫస్ట్ ఆఫీసర్. కోపైలట్ మాడెలైన్ టాంప్కిన్స్ ఉన్నారు. ఈ ఘటనలో వీళ్లు నిజమైన హీరోలంటూ పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. ఇదిఇలా ఉంటే యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) నివేదిక ప్రకారం, డికంప్రెషన్, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది. విమానంలో ఎడమ ఇంజిన్ కూడా విఫలమైంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం బోర్డింగ్ సమయంలో విమానం ఫ్యూజ్‌లేజ్‌లో పగుళ్లను ఒకామె గమనించింది. అయితే ఆమె టేకాఫ్‌కి ముందు సిబ్బందికి చెప్పలేదు. -
నాగకేసరి చెట్ల నుంచి జీవ ఇంధనం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆసక్తి, విషయ పరిజ్ఞానం, సాధించాలనే తపన ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిపుత్రిక. తల్లిదండ్రులు తనని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా, మొక్కవోని దృఢ సంకల్పంతో ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపారు రాజేంద్రపాలేనికి చెందిన దిబ్బ చంద్రవతి. ఆమె తల్లిదండ్రులు దిబ్బ సుందర్రావు, సింగారమ్మ కూలీలు. చంద్రవతి పదో తరగతి మండలంలోని పెదమాకవరం పాఠశాలలోను, ఇంటర్ పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ విశాఖలో చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రెండేళ్లు ఎంఫిల్ చేశారు. పీహెచ్‌డీలో భాగంగా ‘నాగ కేసరి చెట్ల నుంచి జీవ ఇంధన తయారీ’పై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ఆచార్యులు ఎస్బీ పడాల్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురణలు జరగడంతో ఆమెను డాక్టరేట్ వరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో విలువైన ఔషధాలు ఉన్నాయని తెలిపారు. ఆదిమజాతి గిరిజనులు వృక్షాలతో అన్యోన్యంగా ఉంటారని, వివిధ రకాల రోగాలకు వారి పరిసరాల్లో పెరిగే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. అడవిలో పెరిగే నాగ కేసరి చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను నూనెగా మార్చి జీవ ఇంధనంగా తయారు చేశామని ఆమె వివరించారు. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారు చేయవచ్చునని తెలిపారు. పరిశోధన పూర్తి కావడంతో ఏయూ ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నుంచి ఈనెల తొమ్మిదిన డాక్టరేట్ అందుకున్నట్టు ఆమె తెలియజేశారు. -
ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది.. గమ్మత్తైన ప్రశ్న. దీన్ని శోధించడం కోసం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే ఓ అమెరికా శాస్త్రవేత్త చనిపోయిన తర్వాత ఏం జరగుతుందో..ఆత్మ ఏం చేస్తుందో వంటి షాకింగ్ విషయాలు వెల్లడించాడు కూడా. అందుకోసం దాదాపు 5 వేల మరణాలపై అధ్యయనం చేసినట్లు కూడా వివరించాడు. కానీ ఇక్కడొక వ్యక్తి చావుని చూసి..అంటే..చనిపోయినట్లు డిక్లరయ్యి ఎలాంటి ఆశ లేకుండా.. బతికే అవకాశం కోసం చేస్తున్న వైద్యుల ప్రయత్నాల ఉత్కంఠ నడుమ కోవాలో ఉండి మరీ బతికి బట్టగట్టగలిగాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది..అలాగే తాను నిర్జీవంగా పడిఉన్న సమయంలో చుట్టూ ఏం జరుగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. అదే అతనికి ఒకరకంగా జీవితం విలువను తెలిసేలా చేసిందని ఉద్వేగంగా చెబుతున్నాడు. అసలేం జరిగిందంటే..బ్రిటీష్ రంగస్థల నటుడు, కళకారుడు శివ్ గెర్వాల్ తన భార్యతో కలిసి ఎప్పుడులానే భోజనం చేస్తున్నాడు. ఏమైందో ఏమో సడెన్‌గా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడి భార్యకు కాళ్లు చేతులు ఆడలేదు. వెంటనే అంబులెన్స్‌కి కాల్చేసి అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ సమయంలో అతడి గుండె ఆల్మోస్ట్ ఆగిపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు ఏదైనా ప్రథమ చికిత్స చేద్దామనుకుంటే దేనికి రెస్పాండ్ కాలేదు. అంబులెన్స్‌లో ఉండే సిబ్బంది కూడా ఫస్ట్ ఎయిడ్ చేద్దామనుకుంటే గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. వాళ్లు కూడా చేసేది ఏంలేదని తెలిసి చాలా స్పీడ్‌గా ఆస్పత్రికి తరలించారు. చెప్పాలంటే శివ్ గెర్వాల్ గుండె దాదాపు ఏడు నిమిషాల పాటు ఆగిపోయింది. అక్కడ వైద్యులు కూడా అతడి పరిస్థితి క్రిటికల్ అని చెప్పేశారు. అక్కడ వైద్యుల అతడిని బతికించే నిమిత్తం గుండెని కొట్టుకునేలా సీపీర్ చేశారు. ఆ తర్వాత సర్జరీ చేసి గుండెకి అడ్డుపడుతున్న ధమనికి స్టంట్ వేశారు. అతను సుమారు ఓ నెలపాటు కోమాలోనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే గెర్వాల్కి ఆ టైంలో తన చుట్టు ఏం జరుగుతుందో తెలిసింది. తాను ఏదో అఛేతనంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా బతకాలి నా భార్యతో మాట్లాడలనే ఆత్రుత అతడిలో చలనం తెప్పించి కోమాలోంచి బయటకు వచ్చేలా చేసింది. వైద్యలు సైతం అతడు బతుకుతాడని బావించలేదు. ఓ ప్రయత్నంగా వైద్యులు చేసిన ఆపరేషన్, మరోవైపు గెర్వాల్ బతకాలని తపన పడుతున్న భార్య ఆకాంక్ష వెరసి అతడికి పునర్జన్మనిచ్చాయి. అతడిని ఆ మృత్యుముఖం నుంచి బయటకొచ్చేలా చేసింది. కోలుకుని తాను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక ఆ టైంలో ఏం జరిగింది, తన గుండె ఎలా ఆగిపోయింది తదితరాలను చెబుతూ అందర్నీ షాక్‌కి గురిచేశాడు. మరణాంతరం ఏం జరుతుందో గుదిగుచ్చినట్లు వివరించాడు. మరణాంతరం ఏ జరుగుతుందనే ఆ అనుభవమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు అంతేగాదు తన గుండె ఆగిపోయినప్పుడూ జరిగిన ప్రతిదాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని దాన్ని ఓ కళగా చిత్రకరించేందుకు ప్రయత్నిస్తున్నాని చెబుతున్నారు. ప్రసుతం తాను మరణాంతరం తిరిగి పొందిన జీవితాన్ని అనుభవిస్తున్నాని సంతోషంగా చెబుతున్నాడు. ఇది ఒకరకంగా మరణం గురించి భయం లేకుండా ధైర్యంగా ఉండేలా చేసింది. అంతేగాదు ఈ అనుభవం జీవితంలో ప్రతిక్షణం ఎంత విలువైందో తెలిసి వచ్చేలా చేసింది. ఈ రోజు నేను ఇక్కడ బతికిబట్టగలిగి ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమేగాక సంతోషంగా ఉందని అన్నారు. View this post on Instagram A post shared by shiv grewal (@artshivinder) (చదవండి: జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!) -
ఏపీలో పథకాల అమలు భేష్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరు ప్రశంసనీయంగా ఉందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కనిమొళి కరుణానిధి అభినందించారు. కనిమొళి అధ్యక్షతన 11 మంది ఎంపీలతో కూడిన బృందం విశాఖ జిల్లాలోని ఆనందపురం, పద్మనాభం మండలాల్లో శనివారం పర్యటించింది. కేంద్ర నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించారు. శొంఠ్యాంలోని రామ్‌సాగర్ అమృత్ సరోవర్ ట్యాంకుతోపాటు, చందక గ్రామంలో వ్యవసాయ భూరీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. పద్మనాభం మండలం రెడ్డిపల్లి సచివాలయంలో అందుతున్న సేవల గురించి ఆరా తీసింది. వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాల సభ్యులతో మాట్లాడి పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. సచివాలయాల సేవలు అద్భుతం అనంతరం నగరంలోని ఓ హోటల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన సంస్థ విభాగాలకు సంబంధించిన జిల్లా అధికారులు, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అధికారులతో శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరుని ప్రశంసించారు. సమావేశంలో పార్లమెంటరీ కమిటీ సభ్యులు మాల రాజ్యలక్ష్మీషా, అజయ్ ప్రతాప్‌సింగ్, తలారి రంగయ్య, నరాన్భాయ్ జె.రత్వా, ఏకేపీ చిన్‌రాజ్, రాజీవ్ దిలేర్, మహ్మద్ జావెద్, వాజేసింగ్భాయ్ రత్వా, ఇరన్నా కడాది, నరేంద్రకుమార్‌తో పాటు జిల్లా కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. -
కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు.. వైరలవుతోన్న ఫోటో.. నిజమేనా?
హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
తండ్రి తిట్టాడని 90 అడుగుల ఎత్తు నుంచి..
Waterfall Jump Video: చిన్న చిన్న కారణాలతో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటి తరం. తాజాగా.. తండ్రి మందలించాడని ఓ యువతి అఘాయిత్యానికి పాల్పడబోయింది. ఏకంగా 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. కానీ, ఆశ్చర్యకరరీతిలో.. ఆ జలపాతమే ఆమెను రక్షించింది!.. ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లా జగదల్పూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ చౌకీ వద్ద మంగళవారం సాయంత్రం ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. జలపాతం చివరి దాకా వెళ్లి.. నిల్చుంది. ఆ సమయంలో కొందరు ఆమెను గమనించి.. వద్దని వారించారు. కానీ, ఆమె వినకుండా దూకేసింది. కానీ, అంత పై నుంచి పడ్డా కూడా అదృష్టం కొద్దీ ఆమెకు ఏం కాలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాళ్లపై పడకుండా.. నేరుగా నీళ్లలోకి వచ్చి చేరింది. ఆమె బతికే ఉందని గుర్తించిన స్థానికులు పడవల్లో వెళ్లి రక్షించి.. ఒడ్డుకు తెచ్చారు. Watch this Earlier in the day, a woman attempted to commit suicide by jumping into Chitrakoot waterfall of Bastar district, #Chhattisgarh. Fortunately, the woman managed to swim back to shore.#mentalhealth pic.twitter.com/qtBGMaFhnu — Arvind Chauhan (@Arv_Ind_Chauhan) July 18, 2023 ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించి పేరెంట్స్‌కు అప్పజెప్పారు. సెల్‌ఫోన్ అతిగా వాడుతున్నందుకు తండ్రి మందలించడంతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని తెలుస్తోంది. జలపాతం వద్ద కొందరు యువకులు తమ సెల్ఫోన్లలో ఆమె దూకేటప్పుడు దృశ్యాలను బంధించగా.. అవి వైరల్ అవుతున్నాయి. ఇంద్రావతి నదిపై చిత్రాకోట్ జలపాతం ఉంది. దాదాపు 90 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు దూకుతుంటుంది. ఈ వాటర్ఫాల్కు స్థానికంగా మినీ నయాగారా ఫాల్స్‌గా పేరుంది. వానాకాలంలో 300 మీటర్ల విస్తీర్ణంతో ప్రవహిస్తుంటుంది. అయితే చుట్టూ రక్షణా వలయంలాంటివి లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అమెజాన్ అడవుల్లో అద్భుతం
బొగొటా: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో దట్టమైన అమెజాన్ అడవుల్లో ఒక అద్భుతం జరిగింది. విమాన ప్రమాదంలో చిక్కుకొని అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ఏకంగా 40 రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటపడ్డారు. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే ఒక అద్భుతమైతే, క్రూరమృగాలు తిరిగే అడవుల్లో 40 రోజులు ప్రాణాలతో ఉండడం మరో అద్భుతం. దట్టమైన అటవీ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సైనికులు వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పౌష్టికాహార లోపంతో బాగా బలహీనపడిపోవడంతో పాటుగా ఆ చిన్నారుల శరీరంపై పురుగు పుట్రా చేసిన కాట్లు ఉన్నాయి. ఒకే తల్లి బిడ్డలైన నలుగురు చిన్నారుల్లో 13, 9. 4 ఏళ్లతో పాటుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోతారు : అధ్యక్షుడు పెట్రో అడవుల్లో కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు క్షేమంగా వెనక్కి తిరిగి రావడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో మృత్యుంజయులు అన్న మాటకి వీరంతా ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. వీరు ప్రాణాలతో ఉండడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇదొక మేజికల్ డే అని సైనికులు చేసిన కృషిని అభినందించారు. అసలేం జరిగింది? అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలో అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి గత నెల మే 1న ఒక సింగిల్ ఇంజిన్ విమానం బయల్దేరింది. నలుగురు చిన్నారులు, వారి తల్లి, ఒక గైడ్, ఒక పైలెట్‌తో విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తి ఇంజిన్ విఫలం కావడంతో దట్టమైన కీకారణ్యంలో కుప్పకూలిపోయింది. విమానం రాడార్ నుంచి అదృశ్యం కావడంతో అధికారులు వారిని కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆపరేషన్ హోప్ పేరుతో సహాయ చర్యలు మొదలు పెట్టారు. విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల అనంతరం మే 16న అధికారులు విమాన శకలాలను గుర్తించగలిగారు. అక్కడ పైలెట్, గైడ్, చిన్నారుల తల్లి మృతదేహాలు మాత్రమే లభించడంతో పిల్లలు నలుగురు సజీవంగా ఉన్నారని నిర్ణారణకి వచ్చారు. పిల్లలు క్షేమంగానే ఉన్నారనడానికి సైనికుల గాలింపుల్లో పాలసీసా, సగం తిని పారేసిన పండు, జడకు కట్టుకునే రిబ్బన్ వంటివి దొరకడంతో సహాయ చర్యలు మరింత ముమ్మరం చేశారు. పిల్లల అడుగు జాడలు కూడా చాలా చోట్ల కనిపించాయి. వాటి ఆధారంగా దాదాపుగా 150 మంది సైనికులతో పాటుగా జాగిలాల సాయంతో దట్టమైన అడవుల్లో గాలించారు. అడవుల్లో ఉండే గిరిజన తెగలు వారికి సహకారం అందించారు. మొత్తానికి ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత అధికారులు ఆ పిల్లల జాడ కనిపెట్టగలిగారు. హెలికాప్టర్లో రాజధాని బొగొటాలో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎలా మనుగడ సాగించారు? అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇన్నాళ్లూ పులులు, పాములు ఇతర క్రూరమృగాల మధ్య ఎలా మనుగడ సాగించారో వివరాలు తెలియాల్సి ఉంది.ఆ పిల్లలు హ్యూటోటో అనే స్థానిక తెగకు చెందినవారు. పుట్టినప్పట్నుంచి అటవీ ప్రాంతాల్లోనే వారు నివాసం ఉంటున్నారు. అడవుల్లో చెట్లకు కాసే ఏ పళ్లు తినాలో , క్రూర మృగాల బారిన పడకుండా ఎలా తమని తాము కాపాడుకోవాలో కొంతవరకు వారికి అవగాహన ఉంది. అందుకే కీకారణ్యంలో తప్పిపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహాయ కార్యక్రమాల్లో భాగంగా హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహార పొట్లాలు బహుశా పిల్లలను కాపాడి ఉంటాయని సైనికాధికారులు భావిస్తున్నారు. పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో వారి బామ్మ ఫాతిమా వాలెన్సియా ఆనందానికి హద్దులే లేవు. పిల్లల తల్లి పనిలో ఉన్నప్పుడు పెద్దమ్మాయి మిగిలిన చిన్నారుల ఆలనాపాలనా చూసేదని, అదే ఇప్పుడు అడవుల్లో వాళ్లు ఇన్నాళ్లూ గడపడానికి ఉపయోగపడిందని చెప్పారు. -
ఆ దుర్ఘటన మిగిల్చిన కన్నీటి కథలు..తమ వాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబాలు
ఒడిశాలో బాలసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగి నాలుగు రోజులైంది. ఆ ఘటనలో చనిపోయిన వందలాది మందిలో ఇంకా గుర్తించలేని మృతదేహాలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు తమవారెక్కడున్నారో తెలియక వెతుకులాటలో కొందరు కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని శోకం, అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి భార్య, కూతురు ఇదే ప్రమాదం బారిన పడ్డారు. దీంతో అతడు తన భార్య, కూతురు ఆచూకి కోసం ఎంతగానో తపించాడు. చివరికి మార్చురీలో ఎన్నో మృతదేహాలను చూసిన తర్వాత గానీ తన భార్యను గుర్తించలేకపోయాడు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి, ఆ బాధను దిగమింగి కూతురు కోసం వెతకడం ప్రారంభించాడు. ఆమె బతుకుందా లేదా అన్న టెన్షన్‌తో నరకయాతన అనుభవించాడు ఆ వ్యక్తి. చివరికి జిల్లా కలెక్టర్, బాలాసోర్ నివాసితులు సాయంతో కూతురు కోసం భువనేశ్వర్‌కి బయలు దేరాడు ఆ తండ్రి. అలానే పశ్చిమ బెంగాల్‌కి చెందిన మరో తండ్రి హేలారామ్ మాలిక్ తనకు ఈ రైలు ప్రమాదం గురించి తనకు తెలియదని కన్నీటిపర్యంతమయ్యాడు. తన కొడుకు ఫోన్ చేసి తాను తీవ్ర గాయాలతో ఉన్నాని, ప్రమాదం జరిగిందని చెప్పడంతో హుటాహుటినా ఇక్కడకు వచ్చానని చెప్పాడు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆ ఘటన జరిగిన రాత్రికే వచ్చినా.. కొడుకు ఆచూకి కానరాక ఆ తండ్రి ఎలా తల్లడిల్లాడో వివరించాడు. చివరికి తాను తన కొడుకుని మార్చురీలోనే గుర్తించానని, అపస్మారక స్థితిలో ఉంటే చనిపోయాడనుకుని రెస్క్యూ సిబ్బంది మార్చురీలో ఉంచినట్లు తెలిపాడు హేలారామ్. ప్రస్తుతం అతని కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇలాంటి ఎన్నో మిరాకిల్ ఘటనలు తోపాటు, కన్నీటిని మిగిల్చిన విషాద కథలు అక్కడ అడుగడుగున కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, వాస్తవానికి కొన్ని మృతదేహాలను వివిధ ప్రాంతాలకు తరలించడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. అధికారులు ఆయా మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తుపట్టాలనే ఉద్దేశంతో వాటిని పర్యవేక్షించడమే గాక గుర్తుపట్టేలా బాధితు కుటుంబ సభ్యులకు సాయం చేస్తున్నారు. ఈ మేరకు బాలాసోర్ జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ దత్తాతత్రేయ భౌసాహెబ్ షిండే మాట్లాడుతూ..తమకు రెండు కంటట్రోల్ రూంలు ఉన్నాయని, మృతదేహం ఉన్న ప్రదేశంతో సంబంధం లేకుండా ఫోన్ చేసి వివరాలు పొందవచ్చు అని పేర్కొన్నారు. కాగా, ఇంకా 101 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందని కూడా అధికారులు వెల్లడించారు. (చదవండి: ప్రమాదం జరిగి 4 రోజులు .. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు..) -
ప్రయాగ్‌రాజ్‌లో అబ్బురపరచిన కాంతి వలయం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పట్టణంలో ఆకాశంలో అద్భుత దృశ్యం సాక్షాత్కారించింది. శుక్రవారం సూర్యుడి చుట్టూ ఏర్పడిన కాంతి వలయం చూపరులను ఆశ్చర్యపర్చింది. కొన్ని గంటలపాటు కనిపించిన ఈ దృశ్యాన్ని జనం ఫోన్లలో బంధించారు. సూర్యుడి చుట్టూ ఏర్పడే కాంతి వలయాన్ని ‘సన్ హాలో’ అంటారు. వాతావరణంలో కాంతి వెదజల్లినట్లుగా మారినప్పుడు ఇలా రింగ్ లాంటి ఆకృతి ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు వాతావరణంలోని మంచు స్ఫటికాలను ఢీకొట్టినప్పుడు కాంతి వెదజల్లినట్లుగా మారుతుంది. అప్పుడు భానుడి చుట్టూ వలయాన్ని చూడొచ్చు. సాధారణ మేఘాల కంటే అధికంగా తెల్లగా, పలుచగా ఉండే సిరస్ మేఘాల్లో మంచు స్ఫటికాలు ఉంటాయి. -
Turkey-Syria Earthquake: టర్కీ సహాయక చర్యల్లో అద్భుతాలు
-
అరసవల్లిలో అద్బుత దృశ్యం
-
నిర్భయ దోషులకు ఉరి: చివర్లో ఉత్కంఠ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టులో విచారణ జరగడంతో చివరి నిమిషంలో తమకు మరణదండన తప్పుతుందన్న ఆశ నలుగురు నేరస్తుల్లో కనిపించినట్టు చెప్పారు. తీహర్ జైలులోని 3వ నంబర్ బరాక్‌లో ఉన్న దోషుల చివరి నిమిషం వరకు ’కోర్టు నుంచి ఏదైనా వర్తమానం వచ్చిందా’ అన్న ప్రశ్న తమకు ఎదురైందని వెల్లడించారు. ఉదయం 5.30 గంటలకు ఉరితీసే వరకు తమకు కాపలా ఉన్న 15 మంది భద్రతా సిబ్బందిని ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారట. (ఆ మైనర్ ఇప్పుడెక్కడా?!) లడ్డూలు, నూడుల్స్ అడిగారు నలుగురు దోషులకు గురువారం మధ్యాహ్నం రోజూ మాదిరిగా ఆహారంలో రోటీ, పప్పు, అన్నం, కూర ఇచ్చారు. ప్రత్యేకంగా ఏమి అడగలేదని, అందరూ లంచ్ చేశారని జైలు అధికారులు తెలిపారు. అక్షయ్ గురువారం సాయంత్రం టీ తాగాడు. అక్షయ్, పవన్ రాత్రి భోజనం చేయలేదు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ముకేశ్, అక్షయ్, వినయ్ తమకు లడ్డూలు, నూడుల్స్ కావాలని అడగడంతో వాటిని తెప్పించి పెట్టినట్టు వెల్లడించారు. గురువారం రాత్రి 11 గంటలకు దోషులు నలుగురికి న్యాయవాది, మానసిక వైద్యుడి సమక్షంలో చివరిసారిగా వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు జిల్లా మేజిస్ట్రేట్ (పశ్చిమ) డెత్‌వారెంట్‌ను దోషులకు చదివి వినిపించారు. ఉరిశిక్షకు భయపడిన పవన్ కాసేపు గలాభా సృష్టించడంతో అతడి వద్ద ఎక్కువ మంది పోలీసులను ఉంచారు. జైలు సిబ్బంది ఇచ్చిన బట్టలు వేసుకునేందుకు అతడు నిరాకరించాడు. ‘మేము ఇచ్చిన బట్టలను వేసుకోకుండా నేలకేసి కొట్టాడు. తనను క్షమించాలని ఏడుస్తూ వేడుకున్నాడు. ఉరి కంబం దగ్గరకు తీసుకెళుతుండగా దోషులందరూ తమను క్షమించాలని కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధించార’ని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. (నేనైతే ఫాంహౌజ్‌కు తీసుకువెళ్లి తగలబెట్టేవాడిని..) 8వ నంబర్ సెల్ ఉన్న వినయ్ శర్మ, ముఖేష్ సింగ్.. ఒకటో నంబర్‌సెల్ ఉన్న పవన్ గుప్తా, ఏడో నంబర్ సెల్లో ఉన్న అక్షయ్ సింగ్‌లను భద్రత సిబ్బంది ఉరికంబం వద్దకు తీసుకొచ్చారు. వినయ్ శర్మ, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్ సింగ్‌లను ఒకేసారి ఉరి తీశారు. ఆ సమయంలో జిల్లా మేజిస్ట్రేట్, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు సహాయ సూపరింటెండెంట్స్, వార్డెన్, వైద్యాధికారి, ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ ఉన్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన తలారి పవన్ జలాద్‌కు ఒక్కో ఉరికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.60 వేలు చెల్లించినట్టు సమాచారం. జైలులో పనిచేసిన సంపాదించిన మొత్తాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని దోషులు చెప్పినట్టు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 2 వేల నుంచి మూడు వేల వరకు ఉన్నట్టు సమాచారం. డబ్బుతో పాటు వారి బట్టలు, దుప్పట్లను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. (తలారికి లక్ష నజరానా.. జైలు వద్ద హడావుడి) -
మిరాకిల్.. చావు నోట్లోకెళ్లి బయటపడ్డాడు!
సాక్షి, రామగుండం: నిజంగా ఈ కీమెన్ మృత్యువును జయించాడు. గూడ్సు రైలు వస్తుందని ఒక రైల్వే ట్రాక్‌పై నుంచి మరో ట్రాక్‌పైకి వెళ్లడం.. అంతలోనే అటువైపు నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అతనిపైకి దూసుకురావడం.. క్షణాల్లో అతను రైలు ఇంజన్ కిందికి దూరిపోవడం.. అయ్యో.. నుజ్జునుజ్జయి ఉంటాడని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారంతా ఆందోళన చెందడం.. ఇంతలోనే చావు నోట్లోకెళ్లి ప్రాణాలతో బయటపడటం.. ఇదంతా చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది కదూ.. ఔను, ఈ కీమెన్ మృత్యు కోరల్లోకెళ్లి ప్రాణ గండం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలోని కుందనపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. కుందనపల్లి రైల్వేగేటు వద్ద కీమెన్ కత్తుల దుర్గయ్యతో రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యాడు. మూడు రైల్వే ట్రాకుల్లో ఒక ట్రాక్‌పై పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా గూడ్సు రైలు వస్తుండటంతో మరో ట్రాక్ మీదకు కార్మికులు చేరుకున్నారు. అప్పటికే అతి దగ్గరలో ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ క్షణాల్లో కీమెన్ దుర్గయ్యపై దూసుకొచ్చింది. అప్రమత్తమైన ఆయన ఇంజిన్ కిందకు దూరిపోయాడు. రెండు బోగీలు అతని పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు భయాందోళన చెందారు. రైలు కో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్ బ్రేక్ వేసి రైలును కొద్ది దూరంలో నిలిపివేశాడు. అప్పటికే కీమెన్ పైనుంచి రెండు బోగీలు వెళ్లడంతో బాధితుడు నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ భావించారు. కానీ దుర్గయ్య పట్టాల మధ్యలో ప్రాణాలు బిగపట్టుకొని పడుకుని ఉన్నాడు. ఎడమ కాలి ఎముక విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అతడిని రైలు కింద నుంచి బయటకు లాగి హుటాహుటిన స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. -
మహా శివరాత్రి రోజున అద్భుతం!
సాక్షి, పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలో శివరాత్రి పర్వదినం రోజున మహా అద్భుతం చోటు చేసుకుంది. శివుని మెడలో నిత్యం నాగుపాము ఉండడం పరిపాటి. గోధుమ వర్ణం కలిగి ఉన్న అలాంటి నాగుపాము పాత జైన దేవాలయం వద్ద సోమవారం ఉదయం నుంచి నాలుగు గంటలపాటు పడగ విప్పి అటు ఇటు తిరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దృశ్యాన్ని తిలకించిన పలువురు సెల్ఫోన్లలో ఫొటో తీసి వాట్సప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని నాగుపామును దర్శించారు. పలువురు మహిళలు ప్లేటులో పాలు తీసుకొచ్చి పాము వద్ద ఉంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఇటువంటి అద్భుతం చోటు చేసుకోవడం నిజంగా శివుని మహిమేనని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. -
అద్భుతం జరుగుతుంది
హరి గిల్స్, సుమన్ రాణా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మిరాకిల్’. వామన చలన చిత్ర స్టూడియోస్, చిగాస్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ బ్యానర్స్ పై రుద్రపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) దర్శకత్వంలో హరి, విష్ణు నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రం పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. రుద్రపట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఇది నా ఐదో సినిమా. వాస్తవ సంఘటనలకు కల్పన జోడించి ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నాం. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో, ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంతో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తవుతుంది. మార్చిలో మారిషస్‌లో పాటల చిత్రీకరణ జరిపి, మే 24న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది ఫస్ట్ సినిమా. వేణుగోపాల్ చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. కచ్చితంగా మిరాకిల్ అవుతుంది’’ అన్నారు హరి గిల్స్. -
చావడానికి దూకితే...
వ్యక్తిగత కారణాలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. నెలలు కూడా నిండని పసికందుతోసహా ఆత్మాహూతికి సిద్ధపడింది. అమాంతం రైలు పట్టాలపై దూకేసింది. జనాలు చూస్తుండగానే రైలు వాళ్ల మీదినుంచి పోయింది. కానీ, అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రాణాలు నిలిచాయి. భోపాల్: శనివారం ఉదయం ఓ మహిళ, ఓ చంటి బిడ్డతో భూర్హన్‌పూర్ జిల్లాలోని నేపానగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పుష్కక్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు వస్తున్న సమయంలో అమాంతం పట్టాలపైకి దూకింది. జనాలంతా అరుస్తుండగానే రైలు వాళ్ల మీదునుంచి వెళ్లింది. అయితే చిన్న గాయం కూడా కాకుండా ఆ తల్లికూతుళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ట్రాక్‌కు సరిగ్గా మధ్యలో పడిపోవటంతో రైలు వారి మీదుగా వెళ్లింది. షాక్‌లోకి వెళ్లిన మహిళను సమీపంలోని ఆస్పత్రికి ప్రయాణికులు తరలించారు. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన పేరు తబాస్సుమ్ అని, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నానని, ఎటు వెళ్లాలో తెలీని స్థితిలో బిడ్డతో కలిసి చనిపోయేందుకు నిర్ణయించుకున్నానని వివరించింది. దీంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు సఖి సెంటర్‌కు తరలించి, ముంబైలోని ఆమె బంధువులకు సమాచారం అందించారు. -
శఠగోపం నుంచి నీరు..
సిద్దిపటరూరల్ : నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలోని శఠగోపం నుంచి గత మూడు రోజులగా నీరు వస్తున్న సంఘటన పోన్నాల గ్రామంలో చోటుచేసుకుంది. అర్బన్ మండల పరిధిలోని పోన్నాల గ్రామంలో గత రెండు నెలల క్రితం నిర్మించిన దుర్గామాత ఆలయంలో ఉన్న శఠగోపం నుంచి నీరు వస్తున్నట్లు ఆలయ పూజారి శ్రీనివాసరాజ్ తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం గత రెండు నెలల క్రితం ఆలయాన్ని నిర్మించి ఆచార్యులైన జనగామ కృష్ణమాచార్యులు చేత దుర్గామాత అమ్మవారి విగ్రహప్రతిష్ట చేశారని తెలిపారు. రెండు రోజులుగా శఠగోపాన్ని పెట్టే పాత్రలో నీరు ఉండడంతో పూజారి శ్రీనివాస్‌రాజ్ ఏదో తప్పిదం వల్ల పడి ఉండవచ్చని అనుకుని వాటిని పారబోశాడు. మూడో రోజైన సోమవారం ఉదయం పూజారి ఆలయ తలుపులు తీసి శఠగోపం ఉన్న తాంబాలాన్ని చూడగా అది పూర్తిగా నిండిపోయి ఉంది. గ్రామపెద్దలకు ఈ సమాచారాన్ని అందించగా వారు విగ్రహాన్ని ప్రతిష్టించిన కృష్ణమాచార్యుని ఫోన్‌చేయగా అంతా అమ్మవారి మహిమేనని చెప్పగా గ్రామస్తులు తండోపతండాలుగా ఆలయానికి పూజలు, మొక్కులు నిర్వహించారు. -
రేపు ఖగోళ వింత!
న్యూఢిల్లీ: ఆకాశంలో రేపు అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఈ నెల 31న సూపర్‌మూన్‌గా మారే చంద్రుడు బ్లూమూన్, బ్లడ్‌మూన్‌గానూ దర్శనమివ్వనున్నాడు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం జరగనుందనీ, మరో పదేళ్ల తర్వాత కానీ ఇలాంటి అవకాశం రాదని శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఈ ఖగోళ వింతను కెమెరాల్లో బంధించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కన్పిస్తాడు. దీన్నే సూపర్‌మూన్‌గా వ్యవహరిస్తారు. ఓ నెలలో రెండో పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వస్తే దాన్ని బ్లూమూన్‌గా పిలుస్తారు. ఇక చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలోకి చేరినప్పుడు.. భూమి వాతావరణంలోకి వచ్చిన సూర్యకాంతి పరావర్తనం చెంది చంద్రుడిపైకి ప్రసరిస్తుంది. ఎక్కువ తరంగదైర్ఘ్యమున్న ఎరుపు రంగు కిరణాలు చంద్రుడ్ని చేరడంతో చందమామ రుధిర వర్ణంలో ప్రకాశిస్తాడు. దీన్నే బ్లడ్‌మూన్‌గా వ్యవహరిస్తారు. 1866 తర్వాత ఈ మూడు ఖగోళ అద్భుతాలు ఒకేసారి సంభవించడం ఇదే తొలిసారి. భారత్‌లో బుధవారం సాయంత్రం 4.21 గంటల సమయంలో పాక్షికంగా చంద్ర గ్రహణం మొదలు కానుంది. సాయంత్రం 6.21 గంటల నుంచి 7.37 గంటల వరకూ బ్లూ, బ్లడ్‌మూన్ చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం 76 నిమిషాల పాటు కొనసాగనుంది. -
ఫోన్లో మాట్లాడుతూ నేరుగా రైలుకెదురెళ్లింది
ముంబయి: ఈ సంఘటన నిజంగా ఓ మిరాకిల్. భూమ్మీద నూకలుంటే బతికేస్తారంతే అనే మాట కచ్చితంగా ఈ సంఘటనకు, ఇక్కడ పేర్కొంటున్న అమ్మాయికి సరిగ్గా సరిపోతుంది. ఓ గూడ్స్ రైలు కింద పడిన యువతి క్షేమంగా ప్రాణాలతో బయటపడి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. భందప్ ప్రాంత నివాసి అయిన ప్రతిక్ష నతేకర్ (19) అనే యువతి కుర్లాలోని తన స్నేహితురాలి ఇంటికెళ్లింది. ఉదయం 11గంటల ప్రాంతంలో తిరిగొస్తూ కుర్లా రైల్వే స్టేషన్‌లోని ఏడో నెంబర్ ప్లాట్ మీదకు చేరుకునేందుకు పట్టాలపైకి దిగి అవతలి ప్లాట్‌ఫాం నుంచి దిగి వస్తోంది. ఆ సమయంలో ఆమె చెవిలో హెడ్‌ఫోన్స్ ఉన్నాయి. ఫోన్లో తన స్నేహితురాలితో మాట్లాడుతూ గూడ్సు రైలు వస్తుండటాన్ని గమనించలేదు. ఒక్కసారిగా ఆమె తల పైకెత్తగా ఎదురుగా రైలు రావడంతో భయంతో ప్లాట్‌పైకి పరుగెత్తే లోగానే నేరుగా రైలుకెదురెళ్లిన పరిస్థితి కనిపించింది. ఇది చూసిన పైలట్.. ఆ తర్వాత బ్రేకులు వేశాడు. గూడ్సు బండి కావడంతో పెద్ద శబ్దం చేస్తూ కాస్త నెమ్మదిగానే ఆమెను ఢీకొట్టింది. ఆమె మీద నుంచి రెండు మూడు బోగీలు కూడా పోయాయి. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న వాళ్లంతా కూడా ఆ యువతి చనిపోయిందని అనుకున్నారు. అయితే, తన ఎడమ కంటికి చిన్న గాయంతో తప్ప దాదాపు ఎలాంటి హానీ లేకుండానే ఆమె బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కుర్లా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయిన ఈ సంఘటన గత నెల 13న చోటు చేసుకుంది. -
గల్ఫ్ ఆఫ్ అలస్కాలో మిరాకిల్ సీ
-
అలా అద్భుతం జరిగిపోయింది!
మానవత్వంపైనా.. ప్రస్తుత సమాజంపైనా కొంతమందిలో అపోహలు అలాగే ఉండిపోయాయి. ఏరోజుకు ఆరోజు మారిపోయే పత్రికల హెడ్డింగులు చూసి దేశం ఎక్కడికి వెళ్లిపోతోందో అని బాధపడిపోయే తలకాయలూ ఉన్నాయి. ఎక్కడా అవినీతే తప్ప.. మంచితనం, మంచి మనుషులు మచ్చుకైనా కనిపించడం లేదని వాపోయే కొంతమందికి ఊరట కలిగించడానికా అన్నట్టు గతేడాది మన దేశంలో ఓ అద్భుతం జరిగిపోయింది. ఇప్పటికి తలచుకున్నా అది అద్భుతంగానే ఉంటుంది! 2015 ఆగస్టు 8.. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ పరిసరాల్లో దారి తప్పి తిరుగుతున్నారు ఇద్దరు తల్లీకూతుళ్లు. తల్లి పేరు తంగపొన్ను, కుమార్తె పేరు స్వాతి. బీఎస్సీలో చేరేందుకు కౌన్సెలింగ్ కోసం యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడికి వచ్చాక తెలిసింది వారికి.. కౌన్సెలింగ్ చెన్నైలో కాదు కోయంబత్తూర్‌లో అని! అంతే.. వారి గుండెలు బద్దలయ్యాయి. స్వాతి కన్నీటిధారలు ఆగడం లేదు. పెద్ద పెద్ద చదువులు చదవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ అమ్మాయి. తెల్లవారు జాము ఆరున్నర గంటలు కావస్తోంది. కొంతమంది వ్యాయామం కోసం యూనివర్సిటీ గ్రౌండ్లోకి వచ్చారు. స్వాతిని, తంగపొన్నుని చూశారు. దగ్గరకు చేరి ఏమైందో ఆరా తీశారు. జరిగిందంతా వారికి అర్థమైంది. స్వాతి రికార్డులు పరిశీలించారు. బ్రిలియంట్ స్టూడెంట్! ఆ అమ్మాయి కెరీర్ నాశనం కాకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ వ్యక్తి తన కారులో వారిని విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. తన సొంత డబ్బులతో వారిని కోయంబత్తూర్ ఫ్లైట్ ఎక్కించాడు. వారు మార్గమధ్యంలో ఉండగా మరికొందరు కోయంబత్తూర్‌లోని రిజిస్ట్రార్‌ను సంప్రదించారు. జరిగినదంతా చెప్పారు. రిజిస్ట్రార్ మనసు కూడా కరిగిపోయింది. కానీ, ముందురోజే కౌన్సెలింగ్ ముగిసిపోయిందని, మరో గంటలో చేరుకోగలిగితే తాను చేయాల్సింది చేయగలనని ఆయన చెప్పాడు. ఉదయం 7.50లోగా రిజిస్ట్రార్ దగ్గరకు చేరుకోవాలి. దీంతో స్వాతి, తంగపొన్ను విమానం దిగగానే వారికోసం కొందరు వాహనాలతో కాపలా కాశారు. అనుకున్న సమయానికే అక్కడకు చేరుకునేలా చేశారు. రిజిస్ట్రార్ కూడా ముందే అన్నీ సిద్ధం చేసి ఉంచడంతో స్వాతికి అడ్మిషన్ దొరికింది. అంతే.. ఆ నిరుపేద కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. గొర్రెల కాపరిగా జీవితం గడుపుతోన్న తంగపొన్ను తన కుమార్తెకు సీటు లభించడం చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. ఇది కాదంటారా అద్భుతమంటే..!! -
కర్ణాటకలో మిరాకిల్..!
-
ఈ బాలుడికి ఎనిమిది వేళ్లు..
ఝరాసంగం రూరల్: సహజంగా మన చేతిక ఐదు వేళ్లు... రెండు చేతులకు కలిపి 10 వేళ్లు ఉంటాయి. కానీ కాని ఝరాసంగం మండలకేంద్రానికి చెందిన బి.తుల్జారాం కుమారుడు మోహన్ (4)కు మాత్రం పుట్టుక నుంచే ఎనిమిది వేళ్లు ఉన్నాయి. విచిత్రం ఎంటంటే ఎడమ చేతికి నాలుగువేళ్లు, కుడి చేతికి నాలుగు వేళ్లున్నాయి. ఎడమ చేతికి చూడడానికి నాలుగువేళ్లు కనిపించి రెండు రెండువేళ్లు అతుక్కొని ఉన్నాయి. ఎడమ చేతికి ఉన్న నాలుగువేళ్లకు అతుక్కొని ఉన్న రెండు వెళ్లు కలిపితే 10 వేళ్లవుతున్నాయి. ఈ రకంగా చూస్తే కుడి చేతికి నాలుగు వేళ్లు, ఎడమ చేతికి ఆరువేళ్లు ఉన్నాయి. దీంతో ఎవరైనా కొత్తవాళ్లు వచ్చినప్పుడు తమ బాబును వింతగా చూస్తున్నారని తండ్రి తుల్జారాం తెలిపారు. -
ఆకాశంలో అద్భుతం !
ఆకాశంలో హరివిల్లు అనగానే... చల్లగాలి.. కమ్ముకొస్తున్న మేఘాలు... చిరుజల్లులు.. సూర్యకిరణాల ప్రసరణ.. వంటి సప్తవర్ణ సోయగాలు మనకు గుర్తుకొస్తాయి. ఇది సహజసిద్ధమైన ప్రకృతి దశ్యకావ్యం. అయితే అటువంటివేమీ లేకుండానే శుక్రవారం మధ్యాహ్నం భగభగ మండే సూర్యుని చుట్టూ హరివిల్లు ఏర్పడింది. మధ్యాహ్నం 12.02 గంటల సమయంలో ఆకాశంలో సూర్యుని చుట్టూ చక్రం ఆకారంలో హరివిల్లు కనిపించింది. సుమారు 28 నిమిషాలపాటు స్పష్టంగా కనిపించిన ఈ హరివిల్లు ప్రజలకు కనువిందు చేసింది. విజయనగరం, గంట్యాడ, పార్వతీపురం ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎండతీవ్రత వల్ల ఈ అద్భుత దృశ్యాన్ని ఎక్కువసేపు చూడలేకపోయామని ప్రజలు తెలిపారు. దుమ్ము, ధూళి కాలుష్య మేఘాలు సూర్యుని చుట్టూ ఆవర్తనమై ఉన్నప్పుడు వాటిపై సూర్యకిరణాలు పడితే ఇటువంటి దృశ్యం ఏర్పడుతుందని ఆలిండియా ఫిజికల్ సైన్స్ అధ్యాపకుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగ చంద్రశేఖర్ తెలిపారు. ఇటువంటి దృశ్యాలు గతంలోనూ ఏర్పడ్డాయని చెప్పారు. వీటి ప్రభావం పర్యావరణంపై దుష్ర్పభావం చూపే అవకాశం లేదని, ఆందోళన పడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారని పేర్కొన్నారు. - విజయనగరం అర్బన్/గంట్యాడ/పార్వతీపురం -
అహ్మదాబాద్ లో అద్భుతం!
అహ్మదాబాద్: ఇద్దరు మిత్రులు రోడ్డు పక్కన టీ దుకాణం దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది. వారిపైకి అనూహ్యంగా కారు దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారిని కారు గుద్దేసింది. అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారు గుద్దేసిన వారికి ఏమైందోనని ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదం నుంచి వారిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడడం విశేషం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కారులోని వ్యక్తి పొరపాటున యక్సిలేటర్ పెంచడంతో కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని చూసిన వారంతా 'మిరాకిల్' అని వ్యాఖ్యానించారు. -
చైనాలో మిరాకిల్కే మిరాకిల్
బీజింగ్: చైనాలో అద్బుతం చోటుచేసుకుంది. చనిపోయాడని వైద్యులు నిర్ధారించిన ఓ నెల రోజులు కూడా నిండని బాలుడు తిరిగి బతికి వైద్యులను ఖిన్నులను చేశాడు. అది కూడా గడ్డగట్టే శీతలగదిలో 15 గంటలపాటు ఉండి. ఓ పక్క ఇలాంటి మిరాకిల్ ఎలా సాధ్యమైందబ్బా అని వైద్యులు ఆలోచిస్తుండగా అప్పటికే ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిన ఆ పసి బాలుడి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చైనాలో జిన్ హువా లూ అనే వ్యక్తికి నెలలు నిండకుండా ఓ రెండు నెలలు ముందుగా బాలుడు జన్మించాడు. అయితే, అతడిని 23 రోజులపాటు ఇంక్యూబేటర్లో పెట్టారు. అనంతరం ఇప్పుడు ఆ పసిబిడ్డ పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నాడని వైద్యులు చెప్పడంతో అతడిని ఇంటికి తీసుకెళ్లారు. కానీ, పసిబిడ్డను ఇంటికి తీసుకెళ్లిన రెండు రోజులకే తిరిగి అనారోగ్యంతో కనిపించడంతో అతడిని పరీక్షించిన వైద్యులు బాలుడి గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ బాలుడిని రెండు దుప్పట్లో చుట్టేసి మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ శీతల శవాల గదికి మార్చారు. 15గంటల అనంతరం అతడిని ఖననం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతడిని పూడ్చిపెట్టేందుకు వారు తీసుకురావడానికి దుప్పట్లు విప్పగా అందులో నుంచి కేర్ మని బాలుడు గట్టిగా ఏడ్చాడు. ఈ ఘటన చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వైద్యులు చనిపోయాడని నిర్థారించిన కొన్ని గంటల తర్వాత ఆ పసిబాలుడు బ్రతకడం ఒక మిరాకిల్ అయితే, మైనస్ 12 డిగ్రీల సెల్సియస్‌లో ఆ బాబు 15గంటలపాటు ఉండి బ్రతకడం మిరాకిల్కే మిరాకిల్. -
1998 సెప్టెంబర్ 5 నాకు మరుపురాని రాత్రి
కోలకత్తా: నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ ప్రకటించడం పట్ల కోలకత్తా దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ మోనికా బెస్రా (50) సంతోషం వ్యక్తం చేశారు. మానవతామూర్తి, ప్రపంచ శాంతిదూత మదర్ థెరిస్సా తనకు దైవంతో సమానమని ఆమె అభివర్ణించారు. తన అద్భుతమైన శక్తితో క్యాన్సర్ మహమ్మారి నుంచి తనకు విముక్తి కల్పించారని కొనియాడారు. 1998 సెప్టెంబర్ 5వ తేదీ తనకు మరుపురాని రాత్రి అని మోనికా బెస్రా తెలిపారు. మదర్ ఫోటోనూ చూస్తున్న సందర్భంగా... తెల్లటి కాంతి కిరణాలతో పాటు, అపురూపమైన వెలుగును దర్శించానని మోనికా బెస్రా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అద్భుతమైన శక్తి ఏదో తనను ఆవహించి స్పృహ కోల్పోయానన్నారు. మరుసటి ఉదయానికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి కణాలు నాశనమైపోయాయని బెర్సా తెలిపారు. నిజంగా ఇదొక మర్చిపోలేని అద్భుతమన్నారు. ఈ ఘటనతో మదర్ థెరిస్సాకు సెయిండ్ హుడ్ దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రాణాంతకమైన మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తికి పూర్తిగా ఆరోగ్యం వంతుడిని చేయడాన్ని మొదటి అద్భుతంగా, 17 ఏళ్లుగా ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నమోనికా బెస్రాకు స్వస్థత చేకూరడం రెండవ అద్భుతంగా గుర్తించారు. మదర్ థెరిస్సా తన అద్భుత దివ్యశక్తితో వీరిద్దరిని దీవించినట్లు పోప్ పేర్కొన్న విషయం విదితమే. తద్వారా ఆమెకు అద్భుతమైన దైవశక్తి ఉన్నట్టుగా అంగీకరించినట్టు తెలిపారు. 2016 సంవత్సరంలో మదర్ థెరిస్సా దైవదూతగా అవతరించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింన సంగతి తెలిసిందే. -
చెల్లీ ఇక నీకేం కాదు...
చెల్లీ ఇక నీకేం కాదు... అన్నట్టు కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. తన గర్భంలోని ముగ్గురు కవలలనూ కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని వైద్యులూ సవాల్ గా తీసుకున్నారు. ఇద్దరు మగ శిశువుల ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా పాపను రక్షించుకునేందుకు..ఆ తల్లి నెలలు నిండకుండా ముందుగానే ప్రసవం చేయించుకున్న తీరు... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఆస్ట్రేలియాకి చెందిన 22 ఏళ్ళ దన్ స్తాన్ అనే మహిళ ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నడి గర్భిణిగా ఉండగానే ఆమె ప్రసవానికి సిద్ధమైంది. మరో మార్గం లేని సందర్భంలో ఆమె... 28 వారాల్లోనే ప్రసవం చేయించుకుంది. ఇద్దరు మగ శిశువులతోపాటు... కడుపులో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పాపను కూడ రక్షించుకునేందుకు ఆమె భర్త రోహాన్ తో సంప్రదించి ధైర్యం చేసింది. ఆస్పత్రిలో ప్రసవం అనంతరం కాస్త అనారోగ్యంగా ఉన్న బిడ్డలను పదకొండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. అనంతరం ఆ దంపతులు ముగ్గురు బిడ్డలనూ ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళారు. -
ఆకాశంలో అద్భుతం!
-
రామపాద దర్శనం
-
ఘనంగా ప్రారంభమైనా క్రిస్మస్ సంబరాలు
-
మైకేల్ అభిమాని కథ
పాప్‌స్టార్ మైకేల్ జాక్సన్‌కి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉంటారు. అలాంటి ఓ అభిమాని కథతో రూపొందుతున్న చిత్రం ‘మిరాకిల్’. జయ్ శ్రీనివాస్‌రాజ్ సమర్పణలో తిరుమల వెంచర్స్ పతాకంపై ఉదయ్‌బాబు నిర్మిస్తున్నారు. గోపాల్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆనంద్ వంగా తెలియజేస్తూ -‘‘ఈ చిత్రాన్ని మైకేల్ జాక్సన్‌కి అంకితం చేస్తున్నాం.ఇందులో మైకేల్గా, ఆయన అభిమానిగా గోపాల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలతో పాటు మ్యూజిక్, ఎడిటింగ్ కూడా గోపాలే చేయడం విశేషం. సంగీత ప్రధానంగా సాగే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యనారాయణ్.