శఠగోపం
సిద్దిపటరూరల్ : నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలోని శఠగోపం నుంచి గత మూడు రోజులగా నీరు వస్తున్న సంఘటన పోన్నాల గ్రామంలో చోటుచేసుకుంది. అర్బన్ మండల పరిధిలోని పోన్నాల గ్రామంలో గత రెండు నెలల క్రితం నిర్మించిన దుర్గామాత ఆలయంలో ఉన్న శఠగోపం నుంచి నీరు వస్తున్నట్లు ఆలయ పూజారి శ్రీనివాసరాజ్ తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం గత రెండు నెలల క్రితం ఆలయాన్ని నిర్మించి ఆచార్యులైన జనగామ కృష్ణమాచార్యులు చేత దుర్గామాత అమ్మవారి విగ్రహప్రతిష్ట చేశారని తెలిపారు.
రెండు రోజులుగా శఠగోపాన్ని పెట్టే పాత్రలో నీరు ఉండడంతో పూజారి శ్రీనివాస్‌రాజ్ ఏదో తప్పిదం వల్ల పడి ఉండవచ్చని అనుకుని వాటిని పారబోశాడు. మూడో రోజైన సోమవారం ఉదయం పూజారి ఆలయ తలుపులు తీసి శఠగోపం ఉన్న తాంబాలాన్ని చూడగా అది పూర్తిగా నిండిపోయి ఉంది. గ్రామపెద్దలకు ఈ సమాచారాన్ని అందించగా వారు విగ్రహాన్ని ప్రతిష్టించిన కృష్ణమాచార్యుని ఫోన్‌చేయగా అంతా అమ్మవారి మహిమేనని చెప్పగా గ్రామస్తులు తండోపతండాలుగా ఆలయానికి పూజలు, మొక్కులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment