Sathagopam
-
శఠగోపం నుంచి నీరు..
సిద్దిపటరూరల్ : నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలోని శఠగోపం నుంచి గత మూడు రోజులగా నీరు వస్తున్న సంఘటన పోన్నాల గ్రామంలో చోటుచేసుకుంది. అర్బన్ మండల పరిధిలోని పోన్నాల గ్రామంలో గత రెండు నెలల క్రితం నిర్మించిన దుర్గామాత ఆలయంలో ఉన్న శఠగోపం నుంచి నీరు వస్తున్నట్లు ఆలయ పూజారి శ్రీనివాసరాజ్ తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం గత రెండు నెలల క్రితం ఆలయాన్ని నిర్మించి ఆచార్యులైన జనగామ కృష్ణమాచార్యులు చేత దుర్గామాత అమ్మవారి విగ్రహప్రతిష్ట చేశారని తెలిపారు. రెండు రోజులుగా శఠగోపాన్ని పెట్టే పాత్రలో నీరు ఉండడంతో పూజారి శ్రీనివాస్‌రాజ్ ఏదో తప్పిదం వల్ల పడి ఉండవచ్చని అనుకుని వాటిని పారబోశాడు. మూడో రోజైన సోమవారం ఉదయం పూజారి ఆలయ తలుపులు తీసి శఠగోపం ఉన్న తాంబాలాన్ని చూడగా అది పూర్తిగా నిండిపోయి ఉంది. గ్రామపెద్దలకు ఈ సమాచారాన్ని అందించగా వారు విగ్రహాన్ని ప్రతిష్టించిన కృష్ణమాచార్యుని ఫోన్‌చేయగా అంతా అమ్మవారి మహిమేనని చెప్పగా గ్రామస్తులు తండోపతండాలుగా ఆలయానికి పూజలు, మొక్కులు నిర్వహించారు. -
గుడిలో శఠగోపం పెట్టడం
శఠగోపం శిరస్సు మీద పెడతారు. దీని పైన భగవంతుని పాదుకలు ఉంటాయి. దేవుని పాదా లను శిరసున ధరించాలి. భగవంతుని స్పర్శ శిరస్సుకు తగలడం అంటే భక్తులను అనుగ్రహించడం అని అర్థం. శఠగోపం పాదాల ఆకృతిలో ఉంటే మన తలను అవి పూర్తిగా తాకడానికి అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో వాటిని వలయాకారంగా తయారుచేసి పైన పాదాలు ఉండేలా తయారుచేశారని చెబుతారు. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. సాధారణంగా విష్ణ్వాలయంలో అయితే శఠగోపాన్ని తలమీద పెడతారు. శివాలయంలో శఠగోపాన్ని తలమీద ఉంచరు. కళ్లకు అద్దుకోవడానికి వీలుగా కనులముందు ఉంచుతారు. విజ్ఞానశాస్త్రపరంగా చూస్తే... శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచు తో విడివిడిగా గాని తయారుచేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలోని వేడిని ఇది సులువుగా లాగేస్తుంది.