Ponnala
-
మాణిక్యం ఠాగూర్ ముఖం చాటేశారా.?
-
శఠగోపం నుంచి నీరు..
సిద్దిపటరూరల్ : నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలోని శఠగోపం నుంచి గత మూడు రోజులగా నీరు వస్తున్న సంఘటన పోన్నాల గ్రామంలో చోటుచేసుకుంది. అర్బన్ మండల పరిధిలోని పోన్నాల గ్రామంలో గత రెండు నెలల క్రితం నిర్మించిన దుర్గామాత ఆలయంలో ఉన్న శఠగోపం నుంచి నీరు వస్తున్నట్లు ఆలయ పూజారి శ్రీనివాసరాజ్ తెలిపారు. గ్రామస్తుల కథనం ప్రకారం గత రెండు నెలల క్రితం ఆలయాన్ని నిర్మించి ఆచార్యులైన జనగామ కృష్ణమాచార్యులు చేత దుర్గామాత అమ్మవారి విగ్రహప్రతిష్ట చేశారని తెలిపారు. రెండు రోజులుగా శఠగోపాన్ని పెట్టే పాత్రలో నీరు ఉండడంతో పూజారి శ్రీనివాస్‌రాజ్ ఏదో తప్పిదం వల్ల పడి ఉండవచ్చని అనుకుని వాటిని పారబోశాడు. మూడో రోజైన సోమవారం ఉదయం పూజారి ఆలయ తలుపులు తీసి శఠగోపం ఉన్న తాంబాలాన్ని చూడగా అది పూర్తిగా నిండిపోయి ఉంది. గ్రామపెద్దలకు ఈ సమాచారాన్ని అందించగా వారు విగ్రహాన్ని ప్రతిష్టించిన కృష్ణమాచార్యుని ఫోన్‌చేయగా అంతా అమ్మవారి మహిమేనని చెప్పగా గ్రామస్తులు తండోపతండాలుగా ఆలయానికి పూజలు, మొక్కులు నిర్వహించారు. -
చర్చకు సిద్ధమా.!
► అబద్దాలకు కేరాఫ్ కేసీఆర్ ► మహానేత వైఎస్సార్ హయాంలోనే పవర్‌ప్లాంట్ ► ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన పొన్నాల జనగామ : భూపాలపల్లి, సింగరేణి విద్యుత్ కేంద్రాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చర్చకు రావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యంతో కలిసి పొన్నాల మాట్లాడారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తాను పట్టుబట్టి భూపాలపల్లిలో మొదటి, రెండు దశల్లో పవర్ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేయించానన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో 50వేల మెగావాట్ల మిగులు విద్యుత్తు ఉన్న ఘనత తమకే దక్కుతుందన్నారు. రెప్పపాటు కరెంట్ పోవడం లేదని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ప్లాంట్లను ఎక్కడ పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. యూపీఏ, ఉమ్మడి వైఎస్సార్ హయాంలో జైపూర్‌లో 18వందల మెగావాట్లు, భూపాల్‌పల్లిలో 6వందల మెగా వాట్ల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పినట్లు పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు విషయం మరుగున పడేశారని మండిపడ్డారు. హైకోర్టు విభజన, ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఇనుప పరిశ్రమ, కాజిపేట కోచ్ ఫ్మాక్టరీ, ఉద్యోగలు విభజన, పోలవరం ముం పు గ్రామాల పరిస్థితులను గంగలో కలిపి కాం గ్రెస్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. ఖమ్మం జిల్లాలోని ఇందిరానగర్, ఎత్తిపోతల పథకాలను మార్చి తూతూ మం త్రంగా పనులు చేస్తున్నట్లు రెండు మోటార్లు బిగించి చేతులు దులుపుకున్న వారికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదన్నారు. 2018 నాటికల్లా ఇంటింటికీ తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న మహానుభావుడు, ఇప్పుడు కొత్తగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై శపథం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే తమిళనాడు తరహాలో ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 ఏప్రిల్20న షాద్‌నగర్ సభలో కేసీఆర్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైందని విమర్శించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను ఒక్కసారి గమనిస్తే కేసీఆర్ అబద్దాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి చెంచా రపు శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధి రంగరాజు ప్రవీణ్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండా అన్వర్, కౌన్సిలర్లు ఆకుల వేణుగోపాల్‌రావు, వంగాళ కల్యాణి మల్లారెడ్డి, మేడ శ్రీని వాస్, ధర్మపురి శ్రీనివాస్, ఆలేటి లక్ష్మి సిద్దిరా ములు, జక్కుల నిత వేణుమాధవ్, కొత్త కరుణాకర్‌రెడ్డి, మజార్ షరీఫ్, నర్సిం గారావు, చింతల మల్లేశం, మాజీద్, శివరాజ్ తదితరులు ఉన్నారు. -
ఆదర్శప్రాయుడు.. గంగసాని
గుండెపోటుతో మృతిచెందిన కమ్యూనిస్టు యోధుడు సత్యపాల్‌రెడ్డి నివాళులర్పించిన సీపీఐ జాతీయ నేత నారాయణ.. రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు జనగామ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీపీఐ రాష్ట్ర నాయకుడు గంగసాని సత్యపాల్‌రెడ్డి(85) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని జనగామ బీరప్పగడ్డలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. సత్యపాల్‌రెడ్డి మరణవార్త తెలుసుకున్న నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు జనగామకు చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలతో పాటు జనగామ జిల్లా కోసం జరుగుతున్న పోరాటంలో తన ప్రత్యేకత చాటుకున్నారు. రఘునాథపల్లి మండలం గబ్బెటలో 1931లో జన్మించిన సత్యపాల్‌రెడ్డి ఐదేళ్ల క్రితం జనగామలో స్థిపపడ్డారు. ఆయనకు భార్య వినోద, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అంత్యక్రియల్లో వేలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎర్రజెండా సైన్యం సత్యపాల్ : నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేవాదళ్‌ను స్థాపించి 30ఏళ్లుగా శ్రమించి ఎర్రజెండా కు అండగా సైన్యాన్ని అందించిన గొప్ప నాయకుడు సత్యపాల్‌రెడ్డి అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ కొనియాడారు. సత్యపాల్ మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో సైతం జనసేవాదళ్‌ను పటిష్టం చేసి జాతీయ నేతల ప్రశంసలు అందుకున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటూ, ముఖ్య నాయకులకు రక్షణగా నిలిచారని కొనియాడారు. ఇప్పుడున్న ఎర్రచొక్కా వలంటీర్లను సత్యపాలత్రెడ్డి రూపంలో చూసుకుంటామని కన్నీటి పర్యంతమయ్యారు. సత్యపాల్‌రెడ్డి గొప్ప నాయకుడు : పొన్నాల దివంగత సత్యపాల్‌రెడ్డి గొప్ప నాయకుడని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొ న్నాల లక్ష్మయ్య కొనియాడారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పిం చారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టుల్లో అరుదైన నాయకుడు సత్యపాల్‌రెడ్డి అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెం కటరెడ్డి మాట్లాడుతూ తుది శ్వాస విడిచే వరకు నిజాయితీ, నమ్మకం తో పనిచేసిన సత్యపాల్‌రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. జా తీయస్థాయిలో జనసేవాదళ్కు కమాండర్‌గా పనిచేసిన ఆయన, చండ్ర రాజేశ్వర్‌రెడ్డి, నల్లమల్ల గిరిప్రసాద్, తమ్మారెడ్డి సత్యానారాయణ లాంటి గొప్పవారితో అనుబంధం పెంచుకున్నారన్నారు. మాజీఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, ఐజేయూ ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంక ట్‌రెడ్డి, సీహెచ్.రాజారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సారంపల్లి వాసుదేవరెడ్డి, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్, జెడ్పీటీసీ రంజిత్‌రెడ్డి, విజయ్ సారథి, అజయ్, సీపీఎం, సీపీఐ డివిజన్ కార్యదర్శులు ఆముదాల మల్లారెడ్డి, బర్ల శ్రీరాములు, బండ యాదగిరిరెడ్డి, దాసరి కళావతి, మోకు కనకారెడ్డి, శశిధర్ నివాళులర్పించారు. -
పొన్నాల, కొమ్మూరిపై కేసు
జనగామ : జనగామ జిల్లా చేయాలని నినదిస్తూ జూన్ 26న నిర్వహించిన 48 గంటల బంద్‌లో పా ల్గొన్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మె ల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డితో సహా మరో 18 మంది ఉద్యమకారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పొన్నాల లక్ష్మయ్య, దశమంతరెడ్డి మినహా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, 18మంది ఎండీ అన్వర్, ధర్మపురి శ్రీని వాస్, మేడ శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, మాజీద్, మంగళ్లపల్లి రాజు, పిట్టల సురేష్, పెద్దోజు జగదీష్, మహంకాళి హరిచ్చంద్రగుప్త, గుజ్జుల నారాయణ, నాగారపు వెంకట్, ఎల్లయ్య బుధవారం కోర్టుకు హాజరయ్యారు. జూనియర్ సివిల్ జడ్జి ఎదుట వారిని హాజరుపరుచగా, ఈనెల 5కు కేసు వాయిదా వేశారు. ఏ1గా పొన్నాల లక్ష్మయ్య, ఏ2గా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఏ3గా దశమంతరెడ్డిపై కేసు నమోదు చేశారు. 26వ తేదీన జాతీయ రహదారిపై జరిగిన ఆందోళనలో పాల్గొన్న కారణంగా వీరిపై కేసు నమోదు చే సినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఈ నెల 5కు కేసు వాయిదా వేశారు. -
టీఆర్ఎస్ది నిరంకుశ పాలన
తుర్కపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తూ రైతులపైన లాఠీచార్జి, కాల్పులు జరిపిస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని మాజీమంత్రి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ నిర్వాసితులను పరామర్శించడానికి వెళ్లిన ఆయనను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి నల్లగొండ జిల్లా తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. 4 గంటల పాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013 చట్టానికి మద్దతు తెలిపి పార్లమెంట్లో ఓటేసిన కేసీఆర్ నేడు 123 జీఓ పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్‌పై అసెంబ్లీ చర్చచకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కోరినా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. 2013 చట్టం ప్రకారం రైతులను ఆదుకోవాల్సి ప్రభుత్వం.. వారి జీవితాలతో చలగాటమాడుతోందని ఆరోపించారు. రైతులకు న్యాయం చేస్తే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలిచి పోరాడుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వకుంట్ల రమ్యరావు, బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, తంగెళ్ల రవికుమార్, పొత్నక్ ప్రమోద్‌కుమార్, ఉదయ్‌చందర్‌రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్?
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. కార్యనిర్వాహక అధ్యక్షునిగా మల్లు భట్టి విక్రమార్కకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఇప్పటికే ఉత్తమ్, భట్టికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం. అలాగే సీఎల్పీ నేత జానారెడ్డిని హుటాహుటిన ఢిల్లీకి రావాలని కూడా దిగ్విజయ్ ఆదేశించారు. శనివారమే ఈ మార్పులకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని భావించినప్పటికీ రాత్రి పొద్దుపోయేదాకా ఏఐసీసీ స్పందించలేదు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను, సీఎల్పీ నేత జానారెడ్డిని మారుస్తున్నారంటూ కాంగ్రెస్ వర్గాల్లో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్టానం కూడా వారం రోజులుగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే పొన్నాలను ఇటీవల ఢిల్లీకి పిలిపించింది. ఆయన నాయకత్వంపై పార్టీ వర్గాల నుంచి వస్తున్న విమర్శలపై చర్చించింది. ముఖ్యంగా పీసీసీ, సీఎల్పీ మధ్య సమన్వయం లేకపోవడంపై ప్రశ్నించినట్లు సమాచారం. పొన్నాల సమాధానంపై సంతృప్తి చెందని అధినాయకత్వం మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్ పదవిని జానారెడ్డి ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికే ఆ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని మల్లు భట్టి విక్రమార్కకు అప్పగిస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దిగ్విజయ్ నివాసం వద్ద శనివారమంతా మీడియా పడిగాపులు కాసింది. చివరకు దిగ్విజయ్ స్పందిస్తూ.. ‘ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వచ్చేదాకా నిరీక్షించండి’ అని పేర్కొన్నారు. మరోవైపు జానారెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లారు. అక్కడే ఉన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి అగ్రనేతలు గులాంనబీ ఆజాద్, జైరాం రమేశ్, జైపాల్ రెడ్డిలను కలిశారు. అయితే సీఎల్పీ నేతను మార్చాలంటే ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని, ఆయన నుంచి రాజీనామా తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా, సీఎల్పీ నేత జానారెడ్డికితోడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ పేరు దాదాపు ఖరారవడంతో నల్లగొండ జిల్లాకే రెండు కీలక పదవులు దక్కినట్టయింది. -
740 మంది ఆత్మహత్య చేసుకున్నా...
నల్లగొండ జిల్లా (భువనగిరి): విద్యుత్ సమస్యతో 740 మంది రైతులు చేసుకున్న ఆత్మహత్యలకు బాధ్యులు మీరుకారా అన్ని టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరి రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రికి ద్యాసలేదన్నారు.మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం ప్రధానమైన విద్యుత్ సమస్యపై దృష్టిపెట్టి ఉంటే ఇంతమంది రైతులు చనిపోయేవారా అని ప్రశ్నించారు. రైతులు విద్యుత్ సమస్యతో చనిపోతున్నారని ఊరూర ఆధారాలు చూపినా ముఖ్యమంత్రికి పట్టింపులేదన్నారు. పరిపాలనలో అపరిపక్వత, ప్రజాసామ్యం ముసుగులో నియంతృత్వం కొనసాగుతుందన్నారు. విద్యుత్ సమస్యపై ఎదురౌతున్న సమస్యలపై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్నారు. కనీసం రాష్ర్టంలో అఖిల పక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు. గాలిపర్యటనలతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధానమైన ప్రజా సమస్యలను గాలికొదిలిన ముఖ్యమత్రిపై ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాచని హెచ్చరించారు. అచరణకు సాద్యంకాని హామిలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటికైనా గాలిమాటలు కట్టిపెట్టి ఇచ్చిన హామిలు నెరవేర్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. పూటకో హామీతో కేసీఆర్ ప్రజలకు ఇంకా మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఆ భద్రతతో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడన్నారు. దళితులకు మూడు ఎకరాల సాగు భూమ ఇస్తానన్న ముఖ్యమంత్రి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న119 నియోజకవర్గాల్లో దళితులకు కొన్ని ఇచ్చే భూములకు సుమారుగా 2,67,750 కోట్ల నిధులు అవసరం అవుతాయన్నారు. ఇంతవరకు ఆ నిధులఊసే లేదన్నారు.ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎప్పడిస్తావని ప్రశ్నించారు. రెండు గదులు ఇళ్ల నిర్మాణానికి ఇంత వరకు జీవో ఎందుకు జారీ చేయలేదని నిలదీశారు. విద్యార్థులకు ఇంతవరకు ఉపకార వేతనాలు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. అర్హులందరికి పించన్లు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వారిని ఎందుకు యాతనకు గురి చేస్తున్నావ ని ప్రశ్నించారు. ఎన్నికలముందు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎర్రగడ్డ వైపు ఎందుకు చూస్తున్నావని ఆయన ఎద్దెవా చేశారు. కేసీఆర్ ఎర్రగడ్డవైపు వెళ్లోద్దని భగవంతున్ని వేడుకుంటున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికి ప్రజలు ఇచ్చిన ఓటమి తీర్పును స్వీకరిస్తూనే ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉద్యమిస్తుందన్నారు. ప్రపంచంలో 3 వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అన్న విషయాన్ని గుర్తుందచుకోవాలన్నారు. ఈసమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడిద బిక్షమయ్యగౌడ్, నాయకులు గూడూరు నారాయణరెడ్డి,తంగెల్లపల్లి రవికూమార్,పోతంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆరు నెలల్లోనే తిరుగుబాటు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఆరు నెలల్లోనే తిరుగుబాటు చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల అన్నారు.. వీరు కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షలో పాల్గొని మాట్లాడారు.. వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఆరు నెలల్లోనే తిరుగుబాటు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జిల్లా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో శనివారం చేపట్టిన సమీక్షా సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో 75లక్షల మందికి పింఛన్లు, 50లక్షల మందికి ఇళ్లు, రైతాంగానికి రుణాలు అందించిన చరిత్ర ఉందన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతోనే ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యత్వానికి ప్రజలు, వివిధ వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రంలో 25లక్షల సభ్యత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సభ్యత్వ నమోదులో జిల్లా అగ్రగామిగా ఉందన్నారు. సోనియాగాంధీ జన్మదినాన్ని తెలంగాణ డిక్లరేషన్ డేగా ప్రకటించిన విషయాన్ని వివరించారు. నియోజకవర్గాల వారీగా పార్టీని పటిష్టం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని అన్నారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.ఎస్.కుంతియా మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యత్వాన్ని నెలాఖరు వరకు పూర్తి చేయాలని అన్నారు. సభ్యత్వంపై సమీక్ష జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో చేపట్టిన సభ్యత్వంపై పొన్నాల, కుంతి యా సమీక్షించారు. ఈ నెలాఖరు వరకు పూర్తి సభ్యత్వాన్ని చేపట్టి జిల్లాను మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని సూచించా రు. జిల్లా, నియోజకవర్గ ముఖ్య నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే ఒక్కో నియోజకవర్గం వారీగా సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి కుసుమకుమార్, డీసీసీ అధ్యక్షుడు నాయి ని రాజేందర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు బలరాంనాయక్, బస్వరాజు సార య్య, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, పొదెం వీరయ్య, డాక్టర్ విజయరామారావు, ఎర్రబెల్లి స్వర్ణ, కొండేటి శ్రీధర్, దుగ్యాల శ్రీనివాసరావు, జంగా రాఘవరెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వెంకటస్వామిగౌడ్, భరత్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు డాక్టర్ హరిరమాదేవి, సిరిసిల్ల రాజయ్య, ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బట్టి శ్రీనివాస్, శ్రీకర్, ఘంట నరేందర్‌రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, పోశాల పద్మ, బిన్ని లక్ష్మణ్, సాంబారి సమ్మారావు, బస్వరాజు కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8,550 పుస్తకాలకు సభ్యత్వం చేపట్టిన 4,400 పుస్తకాలు టీపీసీసీ అధ్యక్షుడికి అందజేశారు. దొంతి గైర్హాజరు జిల్లా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తొలి నుంచి పొన్నాల, దొంతి మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. దొంతి తిరిగి కాంగ్రెస్‌కు రావడం పొన్నాలకు ఇష్టం లేదనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే దొంతి సైతం సమీక్ష సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నర్సంపేట నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమీక్షలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పొన్నాలను ప్రశ్నించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు కాకుండా ఓడిపోయిన అభ్యర్థికే ప్రాధాన్యతనిస్తున్నారనే అంశాన్ని లేవనెత్తినట్లు సమాచారం. దీంతో సమావేశం కొంత వేడెక్కినట్లు తెలిసింది. తన ఓటమికి కూడా ఇదే కారణమని అన్నట్లు తెలిసింది. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, కుంతియా, కుసుమకుమార్‌ను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
'విష్ణు, వంశీల గొడవ పార్టీకి సంబంధం లేదు'
హైదరాబాద్: కాంగ్రెస్ యువ నాయకులు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిల మధ్య జరిగిన గొడవ పార్టీకి సంబంధం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గొడవ జరిగిన రోజు ఇద్దరితో మాట్లాడానని పొన్నాల చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ పెళ్లి సందర్బంగా విష్ణు, వంశీ గొడవ పడి పరస్పరం ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం విష్ణు గాంధీభవన్‌లో పొన్నాలను కలిశారు. గొడవ విషయం ప్రస్తావనకు రాలేదని పొన్నాల, విష్ణు చెప్పారు. తమ గొడవకు పార్టీకి సంబంధం లేదని విష్ణు చెప్పారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించేందుకు పొన్నాలను కలిసినట్టు వివరించారు. -
గాంధీ భవన్లో సోనియా పుట్టినరోజు వేడుకలు
-
సభ్యత్వంపై నిస్తేజం
⇒ మొక్కుబడిగా సాగుతున్న ⇒ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ⇒ నేడు ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, పొన్నాల రాక సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీలో నూతనోత్తేజం నింపేందుకు అధిష్టానం చేపట్టిన ఈ కార్యక్రమానికి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ఇన్చార్జీలు లేని నియోజకవర్గాలే కాదు, అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు జిల్లా నాయకత్వంలో గ్రూపు విభేదాలు ఇంకా రగులుతూనే ఉండటంతో ఈ సభ్యత్వ నమోదుకు ప్రధాన అవరోధంగా తయారైంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జీలు సభ్యత్వ నమోదు పుస్తకాలను ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు అప్పగించి వెళ్లిపోయారు. కనీసం వీరు నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉండకపోవడంతో కార్యకర్తలు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో సభ్యత్వ నమోదు పలుచోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్కో బూతుకు 50 చొప్పున సభ్యత్వాలు చేయించాలని నిర్ణయించారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది నుంచి 15 వేల చొప్పున నమోదు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల తొమ్మిది వరకు నిర్దేశిత లక్ష్యం చేరుకునేలా నేతలు చొరవ చూపాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు గత 15న నిర్మల్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందే ఆసిఫాబాద్‌లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఎక్కడ కూడా ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఎలాగైనా డిసెంబర్ నెలాఖరు లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఇన్చార్జీలు లేనిచోట్ల.. జిల్లాలో ప్రస్తుతానికి మూడు నియోజకవర్గాలకు నాయకులెవరూ లేకపోవడంతో ఇక్కడ సభ్యత్వ నమోదు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసిన కె.ప్రేంసాగర్‌రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడ సభ్యత్వ నమోదు బాధ్యతను తీసుకునే నాయకుడే లేకుండాపోయారు. ద్వితీయ శ్రేణి నేతలు జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి వంటి నేతలు ఈ కార్యక్రమాన్ని షురూ చేసినా మొక్కుబడిగా కానిచ్చేస్తున్నారు. ఇక మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జి.అరవింద్‌రెడ్డి కూడా ఎన్నికలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడ ఈ సభ్యత్వ నమోదును భుజాన వేసుకునే నాయకుడెవరూ లేకుండా పోయారు. ఒకవేళ ఎవరైనా ఈ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకొచ్చినా తీరా పదవులు, టిక్కెట్లు తమకు దక్కుతాయనే ధీమా కనిపించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. ద్వితీయ శ్రేణి నాయకులే అడపాదడపా సభ్యత్వాలు చేయిస్తున్నారు. ముథోల్‌లో నియోజకవర్గంలో ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా ఈ కార్యక్రమం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన పక్షంలో తప్పకుండా తనకే టిక్కెట్టు దక్కుతుందనే భరోసా లేకపోవడంతో ఈ ప్రక్రియపై శ్రద్ధ వహించడం లేదు. రెండు, మూడు చోట్ల మినహా జిల్లాలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
బంగారు కాదు ... బాధల తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: కోతల కరెంటు... అరకొర రుణమాఫీ...పత్తాలేని ఫీజు రీయింబర్సమెంట్... దిక్కూమొక్కూ లేకుండా పోయిన పింఛ న్లు... ఇది బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు చేసుకుని వెలుగులు అని ప్రచారం చేసుకుంటున్న సీఎం అసలు ఆ కరెంట్ ఎన్నాళ్లకు వస్తుందో చెప్పగలరా అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో పొన్నాల విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో రూ.6 లక్షల కోట్ల హామీలు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. పునర్విభజన చట్టం కల్పించిన హక్కులను సాధించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పంటల సమయంలో రాజకీయం చేసి, ఐదు నెలల తరువాత తీరిగ్గా ఒప్పందాలు చేసుకుంటే ఏం ఒరుగుతుందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, విపక్షాలు నిలదీస్తాయని ఆందోళన చెందే ఛత్తీస్‌గఢ్ వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దక్షిణాది ముఖ్యమంత్రుల మండలి అధ్యక్షుడై కూడా కరెంటు సమస్యను సమస్యను నివారించలేకపోతున్నారని అన్నారు. భూపాపల్లి థర్మల్ పవర్ ప్రాజెక్టు 3వ యూనిట్, కంతనపల్లి హైడ్రోపవర్ ప్రాజెక్టులను ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ‘ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మా సభ్యులు ప్రజల ముందు ఉంచుతారు. రాజకీయాలు మాని ప్రజల గురించి ఆలోచించండి. ప్రభుత్వ అసమర్ధతను మాపై రుద్దకండి..’ అని చురక అంటించారు. నీటి పంపకంలో కృష్ణా బోర్డు విధానాలు న్యాయబద్ధంగా, సమంజసంగా లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విద్యుత్తు రాకుండా అడ్డుకుంటున్నారని ఏపీ సీఎం చంద్రబాబును నాలుగున్నర నెలల తరువాత కేసీఆర్ విమర్శిస్తున్నారని, బాబు విద్యుత్ దోపిడీపై ఇంతకాలం రాష్ట్రపతి, ప్రధానిని ఎందుకు కలవలేదని పొన్నాల ధ్వజమెత్తారు. -
తొలి ముఖ్యమంత్రే.. తొలి ముద్దాయయ్యాడు!
-
ప్రజలను అవమానిస్తే గుణపాఠం తప్పదు
కేసీఆర్‌కు పొన్నాల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ప్రజలను అవమానపరిచి, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే, వారి చేతిలో సీఎం కేసీఆర్‌కు గుణపాఠ ం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుభవరాహిత్యం,అవగాహనాలేమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, పాలకులు ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు. రైతులు, పేదలు,విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, అణగారిన వర్గాలు ఇలా అన్ని వర్గాలకు ప్రభుత్వం వ్యతిరేకి అనేది స్పష్టమవుతోందన్నారు. బంగారు తెలంగాణ, ఆత్మగౌరవపాలన అంటే, ఇదేనా ? అని ఆయన నిలదీశారు. ఇప్పటికైనా పద్ధతిని మార్చుకుని ప్రజలను గౌరవించి, విపక్షాల విలువైన సలహాలను తీసుకోవాలని హితవుపలికారు. సంక్షేమపథకాల పేరిట ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలు ప్రజలను అవమానించేందుకే ఉపయోగపడుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన కుల,ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఏ విధంగా చెల్లకుండా పోతాయన్నారు. పేదలను దొంగలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. ప్రజలకు అవసరమైనవి గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం చేస్తున్న వింతచేష్టల వల్ల వికలాంగులు,వృద్ధులు, వితంతువులు, మహిళలు, విద్యార్థులు , ఉద్యోగులు ఇలా కోట్లాదిమంది ఇబ్బందిపడుతున్నారని పొన్నాల ధ్వజమెత్తారు. ఇప్పుడు అవసరం లేని వాటర్‌గ్రిడ్ గురించి, మూసీప్రక్షాళన గురించి గంటల తరబడి సమీక్షలు, పర్యటనలు చేస్తున్న సీఎం ఒక్కసారైనా గ్రామాలకు వెళ్లి రైతుల సమస్యలు, కరెంట్‌కోత, దరఖాస్తు దారుల వెతలు, వాస్తవాలు గమనించాలన్నారు. -
కేసీఆర్ ఆటలు సాగనీయం: పొన్నాల
‘‘పండుగ చేసుకోవాల్సిన కొత్త రాష్ట్రంలో చావు డప్పులు మోగుతున్నాయి. నాలుగు నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. కనికరం లేని ప్రభుత్వమిది. రైతు, పేదల వ్యతిరేకి కేసీఆర్ రాక్షస పాలన కొనసాగిస్తుండు. రుణ మాఫీ సహా ఏది అడిగినా వాయిదాలతోనే సరిపెడుతుండు. చివరకు అసెంబ్లీ సమావేశాలను, సొంత పార్టీ ప్లీనరీలను కూడా వాయిదాలపై వాయిదా వేస్తున్నాడంటే కేసీఆర్‌ది ‘వాయిదాల పాలన’ కాక మరేంది? కరెంట్ అడిగిన పాపానికి రైతులను గొడ్డును బాదినట్లు బాదిన చరిత్ర ఆనాడు చంద్రబాబుదైతే.. ఈనాడు కేసీఆర్‌దే. విద్యుత్ ఇవ్వడం చేతగాని కేసీఆర్ సీఎం సీట్లో కూర్చోవడమెందుకు? బిడ్డా కేసీఆర్.. ఇక నీ ఆటలు సాగనీయం. ఏడు గంటల విద్యుత్, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది.’’ -
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని పొన్నం శుక్రవారమిక్కడ విమర్శించారు. విహార యాత్రలు, పండుగల పేరుతో కాలం గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. కాగా విద్యుత్ కోతలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్లో కలెక్టరేట్ వద్ద నేడు ధర్నా చేపడుతున్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయల్దేరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు తీవ్రమైన నేపథ్యంలో రైతులు నిర్వేదానికి గురవుతున్నారు. విద్యుత్ కోతలతో పంటలు పూర్తిగా ఎండిపోవటంతో రైతులు నిరసన వ్యక్తం చేస్తూ పంటకు నిప్పు పెట్టారు. వరంగల్ జిల్లా హన్మకొండ మండలం నక్కలపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
కరెంట్ కోతలపై రైతుల నిరసన
చేర్యాల, మహబూబాబాద్, జనగామ రూరల్ : కరెంట్ కోతలపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, మండల అధ్యక్షులు కొమ్ము రవి ఆధ్వర్యంలో చేర్యాల మండలంలోని మండలంలోని ముస్త్యాల సబ్‌స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కరెంట్ కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పొన్నాల వైశాలి డిమాండ్ చేశారు. ముస్త్యాల కిష్టయ్య, ఉడుముల బాల్‌రెడ్డి, ఉట్లపల్లి శ్రీనివాస్, ముస్త్యాల యాదగిరి, నాగమల్ల భిక్షపతి, మాదాసు చంద్రమ్మ, బొమ్మగోని రవీంధర్, ఖుర్షీదాభేగం, మంచాల చిరంజీవులు, తాటిపాముల వెంకటేశం, బుడిగె గురువయ్య, వంగాల శ్రీదేవి, పచ్చిమడ్ల వెంకటయ్య, సత్యనారాయణ, పల్లె కనకయ్య, బండారి శ్రీశైలంలతో పాటు పలువురు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని ఏడీఈ కార్యాలయూన్ని రైతులు ముట్టడించారు. కరెంట్ కోతలతో ఎకరం పం టను పండించుకునే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలోజు శ్రీహరి, రాళ్ళబండి నాగరాజు, బద్దిపడగి క్రిష్ణారెడ్డి, నర్సిరెడ్డి, జయరాములు, ఇబ్రహిం, బాల మల్లు, కనకచారి, రాంచంద్రం, మహేశ్, బాల స్వామి, భూమిగారి ప్రభాకర్, పోచయ్య, కిష్టయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, దాని అనుబంధ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కరెంటు కోతలపైన పలు సం ఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళణ కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని న్యూడెమోక్రసీ కురవి సబ్ డివిజన్ నాయకుడు వజ్జ రాము ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలిచి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆలకుంట్ల కొమురయ్య, తుపాకుల వెంకన్న, సత్యం, లిం గయ్య, పెంటయ్య, ముత్తయ్య, పైండ్ల యాక య్య, వెంకన్న, రమేష్, రాజు, తదితరులు పా ల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం లో జనగామ మండలంలోని పెంబర్తి గ్రామం వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. సంఘం డివిజన్ నాయకులు పంపర మల్లేశం, వై.బాలరాజు, ఏ.ఆంజనేయులు, పీ.అర్జున్, బీ.బాలరాజు, స్వామియాదగిరి పాల్గొన్నారు. -
అధికార బలంతోనే గెలవగలిగారు
-
వాళ్ళకేమైన బుద్ధి పని చేస్తుందా ?
-
తెలంగాణ కోసం మీరేం చేశారూ?
-
ఫోటో లేదని ఫ్లెక్సీలు చింపేశారు....
-
ఫోటో లేదని ఫ్లెక్సీలు చింపేశారు....
మెదక్ : తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నా కాంగ్రెస్ నేతలు ....తమ తీరు మార్చుకోవటం లేదు.ఓవైపు మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామని చెబుతూనే మరోవైపు ఘర్షణలకు దిగటం విశేషం. అది కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలోనే కాంగ్రెస్ నేతలు గొడవకు దిగారు. మెదక్ జిల్లా దుబ్బాక కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సోమవారం రసాభాసగా మారింది. ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ఫోటో వేయలేదంటూ ఆయన వర్గీయులు గొడవకు దిగారు. ఫ్లెక్సీలు చించివేసి పొన్నాల ఎదుటే ఘర్షణకు దిగారు. దాంతో అవాక్కవటం పొన్నాల వంతు అయ్యింది. -
దిగ్విజయ్ సింగ్, పొన్నాలపై కార్యకర్తల ఆగ్రహం
-
అంతా... మీ వల్లే...!
-
టీఆర్ఎస్... కాస్కో
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. లేనిపక్షంలో ప్రజల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఓడిపోవడం బాధాకరమన్నారు. ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు పెరిగిపోవడం కూడా దేశంలో కాంగ్రెస్ ఓటమికి కారణమని విశ్లేషించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రతిపక్ష పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ సీనియర్ నేతలు ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌కు, రాష్ట్రానికి చేసిన కృషిని వక్తలు కొనియాడారు. వైఎస్ పేరు ను నేరుగా ప్రస్తావిస్తూ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆయనను స్మరించుకోగా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాత్రం వైఎస్ పేరును ప్రస్తావించకుండా నాటి ప్రభుత్వ గొప్పతనాన్ని వివరించారు. వైఎస్ వల్లే నాడు పార్టీకి వైభవం: దిగ్విజయ్ ‘‘రెండు ఎంపీ సీట్లున్న టీఆర్ఎస్ వల్ల తెలంగా ణ ఎలా సాధ్యమవుతుంది? అయినా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం. నాడు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాత్ర అమోఘం. ఆయన వల్లే కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. అయితే ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి. వారి ఆశలే మరో పార్టీకి అవకాశమిచ్చాయి. గుజరాత్ మోడల్ అన్న నినాదంతో నరేంద్ర మోడీ చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తెద్దాం. రుణమాఫీ, గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వంటి హామీలను కేసీఆర్ అమలు చేయాల్సిందే. లేకుంటే నిలదీస్తాం’’ అని దిగ్విజయ్ అన్నారు. తెలంగాణ ఇచ్చినా ఎలా ఓడాం?: కుంతియా తెలంగాణ ఇచ్చినా ఎందుకు ఓడిపోయామో లోతుగా ఆలోచించాలని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.కుంతియా అన్నారు. కాంగ్రెస్‌ను ఎలా బలోపేతం చేయాలో ఆలోచించాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు అన్నారు. నాటి సీఎం మాటకు కట్టుబడ్డారు: పొన్నాల ‘‘అధికారంలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే అధికార పార్టీ కార్యకర్తలు, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం చరిత్రలో ఎన్నడూ లేదు. కరెంటు లేక, నీరందక, రుణాలు మాఫీ కాక రైతులు రోడ్లపైకి వస్తుంటే కేసీఆర్ సింగపూర్ యాత్రకు వెళ్లడం గర్హనీయం. 2004లో అధికారంలోకి వచ్చిన 5 నిమిషాల్లోనే అసాధ్యమనుకు న్న ఉచిత విద్యుత్, బకాయిల రద్దు, కేసుల ఎత్తివేత వంటి హమీలన్నీ అమలు చేసిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రిదైతే.. అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తున్న ఘనత ఈనాటి సీఎం కేసీఆర్‌ది.’’ అని పొన్నాల అన్నారు. ‘‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వ లోపాలున్నాయి. కార్యకర్తలంతా మమ్మల్ని క్షమించాలి.’’ అని ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. -
దిగ్విజయ్ సింగ్, పొన్నాలపై కార్యకర్తల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు భయపడినట్లే జరిగింది! పార్టీ కార్యాచరణ సదస్సు విషయంలో అంతా అనుకున్నట్లే అయ్యింది!! భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఆదివారం నాడు మొదలైన కీలక సదస్సు ఆదిలోనే రసాభాసగా మారింది. వేదికపై ముఖ్య నేతలు ప్రసంగిస్తుండగానే కార్యకర్తలు అడ్డుతగిలారు. అంతా మీ వల్లే అంటూ చీవాట్లు పెట్టారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించాల్సిందేనని పట్టుబట్టారు. ఇదంతా మీడియా కెమెరాలు చిత్రీకరిస్తుండటంతో కాంగ్రెస్ పెద్దలు బిక్కమొహాలేయాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడ వద్ద ఓ కాలేజీ ప్రాంగణంలో ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఆదివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, కార్యదర్శి రామచంద్ర కుంతియా, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ సహా దాదాపుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులంతా ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు ప్రారంభమైన వెంటనే తెలంగాణ అమరవీరులకు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంతాపం తెలిపే తీర్మానాలను ప్రవేశపెట్టడంతోపాటు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రారంభ సదస్సులో దిగ్విజయ్, పొన్నాల, కుంతియా, కొప్పుల రాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటమికి కారణాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రతిపక్ష పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించారు. అంతలోనే చుక్కెదురు.. సదస్సులో ముఖ్య నేతలు మాత్రమే ప్రసంగిస్తుండటం.. అక్కడికి వచ్చిన వేలాది మందిలో ఒక్కరికి కూడా అవకాశమివ్వకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. పలుమార్లు సదస్సును అడ్డుకున్నారు. నేతలు ప్రసంగిస్తుండగా లేచి నిలబడి తిట్ల దండకం అందుకున్నారు. ‘‘మీ వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చింది. కష్టపడే కార్యకర్తలను పక్కనబెట్టి మీ చెంచాగాళ్లకే టిక్కెట్లు ఇచ్చుకున్నారు. సిగ్గులేకుండా మళ్లీ మీరే మాట్లాడుతున్నారా? ఎందుకు ఓడిపోయామనే దానిపై కనీసం కార్యకర్తలను మాట్లాడనీయరా?’’ అంటూ నిలదీశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వల్లే పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు. తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సభ ఆరంభం నుంచి నేతల ప్రసంగాలు ముగిసే వరకు కార్యకర్తలు తమ నిరసనను కొనసాగించారు. కార్యకర్తలను బుజ్జగించేందుకు వేదికపైనున్న నేతలు ఎంత ప్రయత్నించినా వినలేదు. కాంగ్రెస్ నేతలు జ్ఞాన సుందర్, నారాయణ స్వామి సహా నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు పదేపదే సదస్సును అడ్డుకున్నారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జానారెడ్డి, దానం నాగేందర్ మైక్ అందుకుని పలుమార్లు బుజ్జగించినా, కార్యకర్తలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పినా గొడవ సద్దుమణగలేదు. అక్కడున్న మీడియా ఈ దృశ్యాలను చిత్రీకరిస్తుండటంతో సదస్సు ఉద్దేశం పక్కదారి పడుతోందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని గ్రహించిన దిగ్విజయ్ సింగ్ గొడవ చేస్తున్న కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సుకు అంతరాయం కలిగిస్తున్న కార్యకర్తలందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారందరినీ వీడియో ద్వారా గుర్తించాలని టీపీసీసీని ఆదేశించారు. ఆయా కార్యకర్తలంతా తక్షణమే సదస్సు నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించారు. అయినా కార్యకర్తలెవరూ సదస్సును వీడలేదు. దిగ్విజయ్‌సింగ్, పొన్నాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఓటమికి కారణం కాంగ్రెస్ నాయకత్వం, రాష్ర్ట పెద్దలేనని ఆరోపించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన దిగ్విజయ్.. నినాదాలు చేసే కార్యకర్తలను తక్షణమే బయటకు పంపాలని ఆదేశించడంతో దానం నాగేందర్ అనుచరులు వారందరినీ బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఈ సదస్సులో గొడవలు జరిగితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని, పార్టీకి నష్టం వాటిల్లుతుందని శనివారం నాటి సమీక్షా సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేవలం భవిష్యత్ కార్యాచరణకే ఈ భేటీని పరిమితం చేయాలని వారు గట్టిగా సూచించారు. అయినా అంతా అనుకున్నట్టే సదస్సులో కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంది. -
అర్థం లేని వ్యాఖ్యలు మానుకోవాలి
-
సొంత వాళ్లే ముంచారు
చేసింది చెప్పుకోలేక ఓడాం సాధారణ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌లో చర్చ ‘వరంగల్ లోక్‌సభ’ పరిధిలో ముగిసిన పొన్నాల సమీక్ష సారయ్య, సిరిసిల్ల, దుగ్యాల గైర్హాజరు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకంగా పనిచేశారు. టిక్కెట్ల కేటాయింపు ఆలస్యంగా జరిగింది. తెలంగాణ ఇచ్చిన విషయం, హామీలపై స్పష్టంగా చెప్పలేకపోయాం. డబ్బులు ఉన్న నేతలకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఇవ్వడంతో వారు కొందరికే ప్రాధాన్యం ఇచ్చారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో బాగా పని చేసింది. ఓటమితో అయినా మన పార్టీ నేతల తీరు మారాలి. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన అందరిపై చర్యలు తీసుకోవాలి. ఓట్లు వేయిస్తానని చెప్పి డబ్బులు దండుకున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. పార్టీపై సమీక్షలు కాదు, నాయకులపై సమీక్షలు చేయాలి. చిన్న కార్యకర్తలను ఎదిగేలా చేయాలి. కాంగ్రెస్ బలోపేతం కోసం చర్యలు మొదలుపెట్టాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలి.’ ...సాధారణ ఎన్నికల్లో ఓటమిపై నియోజకవర్గాల సమీక్షలో కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు ఇవీ. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమిపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింట సమీక్ష పూర్తయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు ఎవరూ వెళ్లకపోవడంతో ఈ సెగ్మెంట్‌పై సమీక్ష జరగలేదు. వరంగల్ తూర్పు సెగ్మెంట్‌కు ఇటీవలి వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య సమీక్షకు హాజరు కాలేదు. మొదటి నుంచి పొన్నాలకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ సమీక్షకు వెళ్లలేదని తెలిసింది. సారయ్యకు సన్నిహితంగా ఉండే వరంగల్ మాజీ లోక్‌సభ సభ్యుడు సిరిసిల్ల రాజయ్య సైతం సమీక్షకు హాజరుకాలేదు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దుగ్యాల శ్రీనివాసరావు సైతం సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, కొండేటి శ్రీధర్, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జి.విజయరామారావు, నేతలు భువనగిరి ఆరోగ్యం, హరిరమాదేవి, టి.విద్యాసాగర్, జి.రమాకాంత్‌రెడ్డి, ఈవీ.శ్రీనివాస్, బట్టి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా కమిటీని వెంటనే నియమించాలని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాపోలు జయప్రకాశ్, ఈవీ.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, లక్ష్మణ్‌గౌడ్ కోరారు. నైరాశ్యం వద్దు... ఆరు నియోజకవర్గాల సమీక్షల్లో నాయకులు చెప్పిన అంశాలను ఆలకించిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య... పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్ర పార్టీ నేతలను పరిశీలకులుగా నియమిస్తామని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై క్రమశిక్షణ సంఘం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ‘అసలైన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. పార్టీని కూడగట్టడం... ముందుకు ఎలా వెళ్లాలో వంటి అంశాలపై గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుందామన్నారు. ఓటమి సహజమని... ఎవరూ నైరాశ్యం చెందొద్దన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా... మన వాళ్లు మనకు ఉంటారు, అందరం కలిసి పార్టీ కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నేతలు కలిసి వరంగల్ కార్పొరేషన్లో విజయం కోసం ప్రణాళిక రూపొందించుకుందాం’ అని పొన్నాల అన్నట్లు విశ్వసనీయనీయ వర్గాల ద్వారా తెలిసింది. పరకాల : ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఇనుగాల వెంకట్రామిరెడ్డి సహా 25 మంది నాయకులు ఈ సమీక్షకు హాజరుకాగా... సాంబారి సమ్మారావు గైర్హాజరయ్యూరు. టికెట్ల కేటాయింపులో ఆలస్యం కావడంతో ప్రజల్లోకి వెళ్లలేకపోయామని... ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని పలువురు అభిప్రాయపడ్డారు. కొందరు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ వారితో చేతులు కలపడంతో నష్టపోయామని చెప్పారు. ఇలాంటి వారిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ పొన్నాల చెప్పారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన నేతలకు పదవులు ఇవ్వొద్దని పొన్నాలను పలువురు కోరారు. భూపాలపల్లి : టీఆర్ఎస్ మేనిఫెస్టో, కేసీఆర్ బహిరంగ సభలు ఎన్నికల్లో ప్రభావితం చూపాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర నేతలు చెప్పారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలతో సింగరేణి కార్మికులు, యువత ముఖ్యంగా కొత్త ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని పలువురు అన్నారు. పాలకుర్తి... పాలకుర్తి : నియోజకవర్గ సమీక్షకు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు హాజరు కాలేదు. కొడకండ్ల, పాలకుర్తి నుంచి నాయకులు ఎవరు హాజరుకాలేదని తెలిసింది. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన దుగ్యాల శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాంచారని చెప్పారు. ఈ అంశాలు తమ పరిశీలనలో ఉన్నాయని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. వర్ధన్నపేట : నియోజకవర్గ సమీక్షలో కాంగ్రెస్ నాయకులు మోసం చేయడం వల్లే ఓడిపోయామని పార్టీ నేతలు చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వారు ఇప్పుడు కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన 11 మంది నాయకులపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన సీనియర్ నాయకులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వరంగల్ పశ్చిమ : నియోజకవర్గ సమీక్షలో ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ... ‘ఎవరి మీద ఫిర్యాదు చేయను. ఏ ఒక్కరు చేస్తేనో విజయం రాదు. కాంగ్రెస్ విజయం కోసం ఎవరు పనిచేశారు, ఎవరు చేయలేదని నేను చెప్పదలుచుకోలేదు. ఏ ఒక్కరో ఇద్దరో వ్యతిరేకంగా పనిచేసినా, అనుకూలంగా వ్యవహరించినా... మెజారిటీ విషయంలో అంత తేడా ఉండదు. పార్టీ ఓటమిపై అందరం పరిశీలించుకోవాలి. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం అందరం కృషి చేయాలి’ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ : నియోజకవర్గ సమీక్ష సాదాసీదాగా జరిగింది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనను పట్టించుకోవడం లేదని భువనగిరి ఆరోగ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకు ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని అన్నారు. -
పొన్నాలకు ఝలక్!
-
ఏం చేస్తుందీ ప్రభుత్వం?
-
నేతలు.. క్రమశిక్షణారాహిత్యం
కాంగ్రెస్ ఓటమికి కారణాలివే.. నిజామాబాద్ జిల్లా సమీక్షలో నేతలు హైదరాబాద్: పార్టీ నేతల్లో క్రమశిక్షణారాహిత్యం.. సొంత పార్టీ నేతలే ఇష్టానుసారంగా మాట్లాడడం.. టికెట్లు రాలేదని కొందరు... టీఆర్ఎస్తో చేతులు కలిపి మరికొందరు సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల మంగళవారం పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు పార్టీ ఓటమికి గల కారణాలను కుండబద్దలు కొట్టారు. ఈ సమీక్షకు జిల్లా ముఖ్యనేతలు పీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, సురేష్‌షెట్కార్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌లు హాజరయ్యారు. శాసనమండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్, మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి రాలేదు. -
టీపీసీసీ చీఫ్‌ని మార్చేస్తారా ?
-
టీ కాంగ్రెస్‌లో విభేదాలు
-
టీ పీసీసీకి కొత్త అధ్యక్షుడు!
అధిష్టానం పొన్నాలను తొలగించనుంది: వీహెచ్ కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే సమర్థుడైన నాయకుడు ఉండాలని వ్యాఖ్య మండిపడ్డ పొన్నాల.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించబోనని హెచ్చరిక హైదరాబాద్: తెలంగాణ పీసీసీలో సీనియర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీని ప్రక్షాళన చేసేదిశగా టీపీసీసీ చీఫ్‌ను అధిష్టానం తప్పించనుందని ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ వి.హనుమంతరావు పేర్కొనగా... పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే సీనియర్లనైనా వదిలిపెట్టబోమంటూ పొన్నాల తీవ్రంగా స్పందించారు. శనివారం ఉదయం సీఎల్పీ నేత జానారెడ్డితో భేటీ అనంతరం వీహెచ్ మాట్లాడగా.. అనంతరం పొన్నాల గాంధీభవన్‌లో వీహెచ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వీహెచ్ శనివారం ఉదయం సీఎల్పీ నేత కె.జానారెడ్డి నివాసానికి వెళ్లి కొద్దిసేపు ఆయనతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుని మార్పు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారని ఆయన చెప్పారు. అందులో భాగంగా పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే సమర్థుడైన నాయకుడు అవసరం ఉందన్నారు. ఈ సారి టీపీసీసీ అధ్యక్షుని నియామకం ఢిల్లీలో జరగకూడదని... పార్టీ పెద్దలు రెండ్రోజులపాటు రాష్ట్రంలో మకాం వేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నియమించాలని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ మీరొద్దు.. వీహెచ్ వ్యాఖ్యలపై పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో ఉన్న నేతలంతా తనకు సన్నిహితులేనని, పార్టీకి ఉపయోగపడే సూచనలు చేస్తామంటే ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వీహెచ్‌లాంటి వ్యక్తులకు తన స్థాయి తక్కువనుకుంటే హైకమాండ్ పెద్దలను కలసి అభిప్రాయాలను చెప్పుకోవచ్చన్నారు. -
కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు!
-
పొన్నాలపై వేటు లేనట్టే(నా)?!
-
'తెలంగాణ ఏర్పాటులో భాగమైనందుకు గర్వపడుతున్నాం'
-
పొన్నాల, ఉత్తమ్ రాజీనామా చేయాలి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ తిప్పర్తి : కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ టీ-పీసీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో టీ-పీసీసీ వైఫల్యం చెందిందని విమర్శించారు. దీనివల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కనపెట్టి అనామకులకు టీపీసీసీ పగ్గాలు ఇచ్చారని.. దీంతో వారు ఎన్నికల్లో తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతను అందరి ఎమ్మెల్యేల అంగీకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. -
'ఓటమికి కారణాలు అన్వేషిస్తున్నాం'
-
ఓటమి చవిచూసిన ప్రముఖులు
-
మావోడే గెలుత్తడు!
అభ్యర్థుల గెలుపుపై జోరుగా బెట్టింగ్ - రూ. 5 వేల నుంచి రూ. 5 లక్షల వరకు పందెం - ముఖాముఖి పోటీ ఉంటే మరింత ఎక్కువ - జనగామ, ‘తూర్పు’పైనే అందరి దృష్టి హన్మకొండ, న్యూస్‌లైన్ : వరంగల్ ‘తూర్పు’లో ఎవరు గెలుస్తరు...మాజీ మంత్రి బస్వరాజు సారయ్యా, కొండా సురేఖనా... కారు దూసుకుపోయింది... సురేఖ గెలుస్తది...కాదు.. కాదు... రెండు, మూడొందల ఓట్లతో సారయ్య గెలుస్తడు... ఓకే బెట్టా... సురేఖ గెలుస్తదని నా పందెం రూ.లక్ష... సారయ్య గెలుస్తడని నా బెట్టు రూ.లక్ష... ...సాధారణ ఎన్నికలు ముగియడంతో జిల్లాలో బెట్టింగ్ జోరందుకుంది. నువ్వా... నేనా అన్నట్టు పోటీపడిన సెగ్మెంట్లలో బెట్టింగ్ వీరులు కాయ్ రాజా కాయ్ అంటూ రూ.లక్షల్లో పందెం కాస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ, మొన్నటివరకు మంత్రిగా ఉన్న బస్వరాజు సారయ్య సొంత ఇలాకా వరంగల్ తూర్పు నియోజకవర్గాలపైనే పందెం రాయుళ్లు దృష్టిపెట్టారు. వీటితోపాటు తీవ్ర పోటీ ఉన్న, రెబల్స్ పోటీలో ఉన్న సెగ్మెంట్లలో మాత్రమే గెలుపోటములపై పందెం కాస్తున్నారు. జిల్లా నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఎన్నెన్నిసీట్లు వస్తాయనే అంశంపైనా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రాజకీయ వర్గాలే కాకుండా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, సీనియర్ ఉద్యోగులు, రియల్టర్లు పోటీపడి పందెం కాస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మందు, బిర్యానీతో రూ.ఐదు వేలతో పందెం జోరు మొదలై... రూ. ఐదు లక్షల వరకు దాటుతున్నట్లు తెలిసింది. నీకా.. నాకా... జనగామ సెగ్మెంట్లో టీపీసీసీ చీఫ్ పొన్నాల గెలుపుపై రూ.లక్షల్లో పందెం కాస్తున్నట్లు సమాచారం. పొన్నాల ఓడిపోతాడని ఈ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్ హైదరాబాద్‌లో దాదాపు రూ. 20 లక్షల పందెం కాసినట్లు ప్రచారం సాగుతోంది. పొన్నాల గెలుస్తాడని కొంత మంది... ముత్తిరెడ్డి గెలుస్తాడని మరికొంత మంది జోరుగా పం దెం కడుతున్నారు. ఈ ఒక్క సెగ్మెంట్‌పైనే పందెం రాయుళ్లు దాదాపు రూ.50 లక్షల వరకు బెట్టింగ్ కాసినట్లు గుసగుసలు వినిపిస్తున్నారు. - వరంగల్ తూర్పు సెగ్మెంట్లో వ్యాపార వర్గాలు రూ.లక్షల్లో బెట్టింగ్ సాగిస్తున్నట్లు సమాచారం. కారు గుర్తుపై ఓ బట్టల వ్యాపారి రూ. 5 లక్షలు పందెం కాసినట్లు ప్రచారం జరుగుతోంది. సార య్య, సురేఖ మధ్య తీవ్ర పోటీ ఉందని.. వీరిద్దరిలో ఎవరైనా తక్కువ మెజార్టీతో గెలుస్తారని అధి క సంఖ్యలో పందెం రాయుళ్లు బెట్టు కడుతున్నారు. - నర్సంపేట సెగ్మెంట్‌పై ఓ రైస్‌మిల్లర్ రూ. 3 లక్షల పందెం కాసినట్లు సమాచారం. ఇక్కడ టీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ ఉందని... వారిపైనే పలువురు పందెం కాసినట్లు వినికిడి. - మానుకోట ఎంపీ స్థానంలో పోలీసులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థులపై పందెం పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడని ఓ డీఎస్పీ... టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడని మరో డీఎస్పీ రూ. లక్ష చొప్పున బెట్టు కాసినట్లు సమాచారం. - భూపాలపల్లిలో చీఫ్ విప్ గండ్ర మూడో స్థానంలో ఉంటారని... ఆయనే గెలుస్తారని... బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని, టీఆర్ఎస్కూ చాన్స్ ఉందంటూ పలువురు జోరుగా పందెం కడుతున్నారు. ఇక్కడ నువ్వా... నేనా అన్నట్లు పోటీ ఉండడంతో దాదాపు రూ.20 లక్షల బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. - డోర్నకల్‌లో రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్పైనే పలువురు పందెం కాస్తున్నారు. - ములుగు నియోజకవర్గంలో సీతక్క గెలుస్తుందని కొందరు... చందూలాల్ గెలుస్తాడని మరికొందరు పందెం కట్టారు. - పరకాలలో ముద్దసాని సహోదర్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డికి విజయూవకాశాలు ఉన్నాయని.. మా వోడు గెలుస్తాడంటే.. మావోడు గెలుస్తాడని పలువురు బెట్టింగ్ సాగిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ ఇప్పటివరకు ప లువురు సుమారు రూ.10లక్షల వరకు పందెం కాసినట్లు సమాచారం. - పాలకుర్తిలో మూడు పార్టీల అభ్యర్థుల మధ్య బెట్టింగ్ సాగుతోంది. చివరి రెండు రోజుల్లో పంపకాలు భారీగా జరిగాయని పలువురు బెట్టింగ్ సాగిస్తున్నారు. - వరంగల్ పశ్చిమలో బెట్టింగ్ మందు, విందు, బిర్యానీకే పరిమితమైంది. ఇక్కడ వినయభాస్కర్ గెలుస్తాడని ఎక్కువ మంది పందెం కడుతున్నట్లు సమాచారం. -
విజయం నాదే!
గెలుపుపై అభ్యర్థుల ధీమా ఎక్కువ సీట్లలో టీఆర్ఎస్, కాంగ్రెస్ సొంత లెక్కల్లో మునిగిన అభ్యర్థులు అనుచరులతో జోరుగా చర్చలు నేతలకు మే 16 వరకు తప్పని టెన్షన్ సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక గెలుపోటముల చర్చలు మొదలయ్యాయి. అక్కడ అలా అయ్యిందంటే... ఇక్కడ ఇలా జరిగింది అంటూ విశ్లేషణలు ఊపందుకున్నాయి. అభ్యర్థులు.. ప్రచార తీరుతో సంబంధం లేకుండా ఖర్చు లెక్కల ఆధారంగా ఫలితాలను అంచనా వేసుకుంటున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే గ్రామాల వారీగా తమకు పోలైన ఓట్లు ఇన్ని అని లెక్కలు వేసుకుంటున్నారు. మండల స్థాయి నేతలతో చర్చిస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి తమకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసుకుంటున్నారు. మొత్తంగా ఫలితం తమకే అనుకూలంగా ఉంటుందన్న నిర్ణయానికి వస్తున్నారు. ఇలా.. అభ్యర్థుల ఫలితాల అంచనా ప్రక్రియ మే 16 వరకు కొనసా గే పరిస్థితి కనిపిస్తోంది. ఆ రోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు అభ్యర్థులు ఫలితాల విషయం లో టెన్షన్ పడాల్సిందే. పోలింగ్‌తో నాయకులు, ఓటర్ల నుం చి ఒత్తిడులు తగ్గినా... ఫలితాల విషయంలో ఇప్పుడు అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఆదివారం జరిగిన పోలింగ్ సర ళి ప్రకారం ఎక్కువ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-బీజేపీ కూటమి రేసులో బలంగా ఉంది. జనగామలో ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య పోటీ సాగింది. వరంగల్ తూర్పులో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోటీ ఉన్నట్లు కనిపించింది. మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, కొండా సురేఖ ల మధ్య ఇక్కడ తీవ్రపోటి ఉంది. నరేంద్రమోడి హవాతో విజయం వరిస్తుందని బీజేపీఅభ్యర్థి రావుప ద్మ భావిస్తున్నారు. ఇక్కడ ఫలితాల పై అభ్యర్థులు, ఓటర్లలోనూ ఉత్కం ఠ ఉంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్, కాంగ్రెస్ అభ్యర్థి ఎర్రబెల్లి స్వర్ణ మధ్య ప్రధానంగా పో టీ ఉంది. బీజేపీ అభ్యర్థి ఎం.ధర్మారావు గెలుపుపై ధీమాతో ఉన్నారు. నర్సంపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి దొంతి మాధవరెడ్డిల మధ్య ప్రధాన పో టీ ఉంది. టీడీపీ అ భ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్, కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్, మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి మంద కృష్ణమాదిగల మధ్య పోటీ ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్ఎస్ అభ్య ర్థి టి.రాజయ్య, కాంగ్రెస్ అభ్యర్థి జి.విజయరామారావుల మధ్య పోటీ ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ ర సవత్తరంగా ఉంది. టీఆర్ఎస్ అభ్య ర్థి ఎన్.సుధాకర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాసరావు, టీడీపీ అ భ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్క డ వచ్చే ఫలితాలపై అందరిలో ఆసక్తి ఉంది. ములుగు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య, టీఆర్ఎస్ అభ్యర్థి ఎ.చందూలాల్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. పరకాలలోనూ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి ఎం.సహోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, టీ డీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి బరిలో ఉన్నారు. వీరు ముగ్గురి మధ్య పోటీ ఉంది. భూపాలపల్లి నియోజకవర్గంలోనూ త్రిముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్ అ భ్యర్థి మధుసూధనాచారి, బీజేపీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావుల మధ్య నువ్వా..నేనా.. అన్నట్టు ఉంది. ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. మహబూబాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.కవిత, టీఆర్ఎస్ నుంచి బానోత్ శంకర్‌నాయక్ పోటీలో ఉన్నారు. వీరి మధ్య పోటీ ప్రధానంగా ఉంది. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్.రెడ్యానాయక్, టీఆర్ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. వైఎస్సాఆర్సీపీ అభ్యర్థి సుజాతమంగీలాల్ ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. -
గిట్లయితె కష్టం... ఇంకా కష్టపడాలె..
-
దమ్ముంటే నా ఆస్తులపై విచారణ జరిపించు.
పొన్నాలకు కేసీఆర్ సవాల్ ఠ నువ్వెంత... నీ బతుకెంత.. పిచ్చికూతలు కూస్తే నాలుక చీరే స్తా పీసీసీ పదవి కొనుక్కుని టికెట్లు అమ్ముకున్నోడివి... నన్ను విమర్శిస్తావా? సన్నాసుల చేతిలో రాష్ట్రాన్ని పెడితే అధోగతే కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణను వల్లకాడు చేసినయి కబ్జా భూముల కోసమే బీజేపీతో బాబు దోస్తీ టీడీపీకి ఓటేస్తే.. మోరీలో పారేసినట్లే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే }రామరక్ష అని వ్యాఖ్య కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ సుడిగాలి పర్యటన కరీంనగర్: ‘‘పొన్నాలా.. పిచ్చికూతలు కూస్తున్నవ్. నీ లెక్కెంత...నీ బతుకెంత... ఇలానే కూతలు కూస్తే నాలుక చీరేస్తా. నా ఆస్తులపై విచారణ జరిపిస్తావా.. దమ్ముంటే విచారణ జరిపించు..’’ అని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సవాల్ విసిరారు. ఆంధ్రోళ్లు మన నీళ్లు ఎత్తుకుపోతుంటే జెండా ఊపి, పదవుల కోసం నోరుమూసుకున్న వ్యక్తికి.. టీఆర్ఎస్ను విమర్శించే హక్కు లేదని మండిపడ్డారు. పొన్నాల పీసీసీ పదవి కొనుక్కుని, టికెట్లు అమ్ముకున్నాడని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తుంటే.. తనపై కారుకూతలు కూయడమేమిటని విమర్శించారు. సోమవారం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. కోరుట్ల నుంచి మొదలైన కేసీఆర్ పర్యటన ధర్మపురి, జగిత్యాల, గంగాధర (చొప్పదండి), కథలాపూర్ (వేములవాడ), తిమ్మాపూర్ (మానకొండూర్), హుజూరాబాద్, మంథని, పెద్దపల్లితో పాటు మెదక్ జిల్లా దుబ్బాకలో సాగింది. కాంగ్రెస్, టీడీపీలను విమర్శిస్తూ.. టీఆర్ఎస్ హామీలను ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రసంగాలు కొనసాగాయి. మా సోపతి ఎందుకు? తెలంగాణ బిల్లులో టీఆర్ఎస్ పాత్ర లేనపుడు కాంగ్రెస్‌కు టీఆర్ఎస్కు సోపతేమిటని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో టీఆర్ఎస్కు సంబంధం లేదని సోనియాగాంధీ చెబుతున్నారని.. అలాంటప్పుడు విలీనం విషయంలో తాను మాట తప్పాననడం సిగ్గుచేటని మండిపడ్డారు. 2012 సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధిష్టానం పిలిస్తే ఢిల్లీకి వెళ్లామని, కానీ హైదరాబాద్‌పై కిరికిరి పెట్టడంతో తిరిగి వచ్చేశామని చెప్పారు. కాంగ్రెస్‌తో ఇక యుద్ధమేనని 2012 నవంబర్ 7, 8 తేదీల్లో కరీంనగర్ వేదికగా జరిగిన మేధోమథన సదస్సులో ప్రకటించామని గుర్తు చేశారు. తాను తప్పులు చేసి ఉంటే కాంగ్రెసోళ్లు ఎప్పుడో జైలుకు పంపేవారని.. తప్పులు దొరకకే పిచ్చికూతలు కూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏమరుపాటుగా ఉంటే మళ్లీ గోస తప్పది.. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏళ్లుగా లాఠీచార్జీలు, తుపాకీ తూటాలను ఎదుర్కొన్నాం.. దీక్షలు చేశాం.. కేసుల పాలయ్యాం.. రాష్ట్ర కలను సాకారం చేసుకున్నాం.. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. సన్నాసుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టినా.. అధోగతి పాలుకాక తప్పది. 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని వల్లకాడు చేసినయి. మళ్లీ మేమే సిపాయిలమంటూ.. రాష్ట్రాన్ని మేమే ఇచ్చామంటూ ఎగేసుకొని వస్తున్నరు.. జాగ్రత్త.. వారిని నమ్మితే నట్టేట మునుగుడే.. 1948లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అప్పటి నాయకుల తప్పిదాల వల్ల 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విలీనమైంది. తిరిగి తెలంగాణ సాధనకు 60 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ భవిష్యత్ తరాలకు అనుకూలంగా ఓటు వేయకపోతే మళ్లీ కష్టాలు తప్పవు..’’ అని కేసీఆర్ హెచ్చరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు శ్రీరామరక్ష అని, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నూరుశాతం అమలుచేసి తీరుతామని చెప్పారు. హామీలన్నీ నెరవేరుస్తం.. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ. లక్ష వరకూ రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో బతికేలా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీళ్లు వచ్చేలా సిద్దిపేట తరహాలో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. దళితుల కోసం ఐదేళ్లలో రూ. 50 వేల కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామన్నారు. ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ చెప్పారు. ధర్మపురి, యాదగిరిగుట్టలను పుణ్య క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబునాయుడు ఆంధ్రా బాబేనని, దేవుళ్ల దగ్గర కూడా అపచారం చేసిన చంద్రబాబు ఇప్పటివరకు తగిన ఫలితం అనుభవిస్తూనే ఉన్నాడని విమర్శించారు. శ్రీధర్‌బాబు ఆట ముగిసింది..: తెలంగాణ ద్రోహిగా మిగిలిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆట ముగిసిపోయిందని కేసీఆర్ అన్నారు. మంథని సభలో శ్రీధర్‌బాబు వైఖరిని ఎండగట్టారు. మంథనిలో పుట్ట మధును గెలిపిస్తే మంథనిలో కుర్చీవేసుకొని కూర్చొని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కబ్జా భూముల కోసమే బీజేపీతో చంద్రబాబు దోస్తీ తెలంగాణలో లక్షా పైచిలుకు ఎకరాల ట్రస్టు భూములు కబ్జాకు గురయ్యాయని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుంటారనే భయంతోనే చంద్రబాబునాయుడు బీజేపీతో జతకట్టాడని కేసీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో భూదాన్, గౌతమి ట్రస్టు భూములు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన భూములు పరుల చేతుల్లో ఉన్నాయన్నారు. టీడీపీ ఆంధ్రా పార్టీ అని.. దానికి ఓటేస్తే మోరీలో పారేసినట్లేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇంకా టీడీపీ జెండాలను పట్టుకుని తిరగడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని.. తమ్ముళ్లు కష్టపడి సంపాదించిన సొమ్మును ఖాళీ చేయించేందుకు చంద్రబాబు కుట్రపన్నాడని ఆరోపించారు. వచ్చేది టీఆర్ఎస్ సర్కారే.. సంగారెడ్డి: ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను చేయించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైందని మెదక్ జిల్లా దుబ్బాకలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. ఆంధ్రోళ్లు చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు రెండు మూడేళ్లు కరెంట్ కష్టాలు తప్పవన్నారు. ఈ సభల్లో టీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, పేర్వారం రాములు, వినోద్‌కుమార్, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌తో పాటు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు. -
'నన్ను విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు'
-
'కొట్టినా.. తిట్టినా.. తెలంగాణ దిక్కే మాట్లాడత'
-
పొన్నాలకు కోర్టులో శిక్ష తప్పదు
తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాకూబ్‌రెడ్డి బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : తెలంగాణ కోసం ఎగిసి పడిన ఉద్యమాన్ని అణచివేసేం దకు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అనేక కుట్రలు చేశా డు.. విద్యార్థులను తీవ్ర ఇబ్బం దులకు గురిచేశాడు.. తనపై చేయించిన దాడి కేసు కోర్టులో నడుస్తోంది.. ఆయనకు శిక్ష తప్పదని తెలంగాణ జిల్లాల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, కేయూ విద్యార్థి డాక్టర్ యాకూబ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని తెలిపాడు. మండల కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వడ్డేపల్లి మల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఉద్యమానికి ద్రోహం చేసిన పొన్నాల ఓటమే లక్ష్యంగా టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నామని చెప్పారు. తల్లి తెలంగాణను కాపాడుకునేందుకు ప్రాణాలను పణంగా పెట్టి టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌లను గెలిపించుకోవడానికి ఊరూ రా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షు డు కందుకూరి ప్రభాకర్, కేయూ జేఏసీ కోఆర్డినేటర్ పామాకుల కొమురయ్య, పార్టీ మండల అధ్యక్షుడు నల్లగోని బాలకిషన్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇర్రి రమణారెడ్డి, ఉల్లెంగుల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ సభకు అభ్యర్థుల డుమ్మా
దాదాపు సగం మంది గైర్హాజరు ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆ పార్టీ అభ్యర్థులు కరువయ్యారు. కరీంనగర్లో సోనియా బహిరంగ సభ నిర్వహణలో టీపీసీసీ ఘోరంగా విఫలమైంది. తెలంగాణలో పార్టీ తరఫున పోటీ చేస్తున్న మొత్తం 119 మంది ఎమ్మెల్యే, 17 మంది ఎంపీ అభ్యర్థులను ఈ సభకు టీపీసీసీ ఆహ్వానించింది. అందరినీ ఇక్కడికి రప్పించి.. సోనియాకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు సభా వేదికపై పరిచయ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు హెలీపాడ్ నుంచి వేదికపైకి వెళ్లే మార్గంలో అభ్యర్థులందరినీ క్యూలో నిలబెట్టేందుకు వీలుగా సోనియా భద్రతను చూసుకునే ఎస్పీజీ అధికారుల నుంచి టీపీసీసీ చీఫ్ పొన్నాల ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. అభ్యర్థుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. తీరా సమయానికి ఎమ్మెల్యే అభ్యర్థులు సగానికిపైగా సభకు డుమ్మా కొట్టారు. ఇక ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులే హాజరయ్యారు. దీంతో పార్టీలోని సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు తొలిసారిగా తెలంగాణలో ఎన్నికల పర్యటనకు వస్తే.. కనీసం మర్యాదపూర్వకంగానైనా కలిసేందుకు రావాల్సిన అభ్యర్థులు ముఖం చాటేయడంతో పార్టీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోనియా వచ్చే సమయానికి క్యూలో నిలబడే అభ్యర్థులు కరువవడంతో పొన్నాల హడావుడి పడటం కనిపించింది. అప్పటికప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులను సైతం క్యూ లైన్లోకి అనుమతించారు. అమ్మ దృష్టిలో పడేందుకు అదృష్టం కలిసిరావడంతో.. సోనియాకు నమస్కారం పెట్టేందుకు, పాదాభివందనం చేసేందుకు.. కండువాలు బహుకరించేందుకు చోటా లీడర్లు పోటీ పడ్డారు. -
పొన్నాలకు కష్టమే(నా) ?
-
కేసీఆర్ నీచుడు, నయవంచకుడు
టీయూడబ్ల్యూజే ‘మీట్ ది ప్రెస్’లో టీపీసీసీ చీఫ్ పొన్నాల కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే సంతాపం తెలపలేదు {పొఫెసర్ జయశంకర్‌ను అవమానించాడు ఏ స్థాయికైనా దిగజారే అలాంటి బతుకు నాకు వద్దు తెలంగాణలో ఆత్మహత్యలన్నింటికీ టీఆర్ఎస్సే కారణం హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నీచుడు.. పిరికిపంద, వెన్నుపోటుదారుడు, మాట తప్పే మనిషి, నమ్మించి మోసం చేసే నయవంచకుడు.. ’’ అంటూ టీపీసీసీ చీఫ్ పొన్నాల విరుచుకుపడ్డారు. మునుపెన్నడూ లేనంతగా కేసీఆర్‌పై విమర్శలు, ఆరోపణల వర్షం కురిపించారు. ఆయనలాంటి బతుకు తనకు వద్దే వద్దని.. అలాంటి వ్యక్తిని మరెక్కడా సృష్టించొద్దని దేవుడిని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి పొన్నాల హాజరయ్యారు. టీయూడబ్ల్యూజే నాయకులు పల్లె రవికుమార్, రమేశ్ హజారే, క్రాంతి, పీవీ శ్రీనివాస్, మారుతీసాగర్ పాల్గొన్న ఈ కార్యక్రమంతో పాటు, అంబేద్కర్ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పొన్నాల మాట్లాడారు. ‘‘కేసీఆర్ వెన్నుపోటు పొడిచే వ్యక్తి. చంద్రబాబు వెన్నుపోటు ప్రభుత్వంలో భాగస్వామి. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం సంతాపం కూడా తెలపని వ్యక్తి. ఎంపీ పదవి విషయంలో ప్రొఫెసర్ జయశంకర్‌ను అవమానించిన నీచుడు. కేసీఆర్ చేతిలో ఆలె నరేంద్రకు జరిగిన అవమానం అంతా ఇంతా కాదు. తన అవసరం కోసం ఏ స్థాయికైనా దిగజారే నైజం. అలాంటి బతుకు నాకొద్దు. ప్రపంచంలో మరెక్కడా అలాంటి వ్యక్తిని సృష్టించొద్దని దేవుడిని కోరుకుంటున్నా..’’ అని పొన్నాల మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను తిరస్కరించడం ఖాయమన్నారు. తెలంగాణలో హంగ్ ఏర్పడే ఆస్కారమే లేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాటల్లోనే... కేసీఆర్ ది నిరంకుశత్వం. కరీంనగర్ సభలో దళితులు పాదాభివందనం చేస్తున్నా.. వారించలేదు. టీఆర్ఎస్కు అభ్యర్థులే కరువయ్యారు. కాంగ్రెస్‌కు, నాకు భయపడి అరువు తెచ్చుకున్న నాయకులకు టికెట్లిచ్చిండు. రైతుల రుణాలు మాఫీ చేయాలంటే రూ. 78 వేల కోట్లు కావాలి. అది తెలంగాణ బడ్జెట్‌తో సాధ్యం కాదు. అయినా గాలి మాటలు చెబుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు. పోలవరం, బాబ్లీ వద్దంటూ మాటలు చెప్పే కేసీఆర్... ఫాంహౌస్‌లో పోలవరం కాంట్రాక్టర్‌తో మంతనాలు జరుపుతున్నారు. బాబ్లీ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను పార్టీలో చేర్చుకున్నారు.తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలన్నింటికీ టీఆర్ఎస్సే కారణం. ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టడం వల్లే బలిదానాలు జరిగాయి. కిరోసిన్ పోసుకుని చస్తానంటూ బెదిరించిన వ్యక్తి (హరీశ్‌రావును ఉద్దేశిస్తూ..) అగ్గిపుల్ల మర్చిపోయి యువతను రెచ్చగొట్టాడు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పదవులను కేటాయిస్తామని అంబేద్కర్ జయంతి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. వారసులకు టికెట్ ఇవ్వబోమని హైకమాండ్ ఎన్నడూ చెప్పలేదు. గెలుపు, సామాజిక కోణమే ప్రధానాంశంగా టికెట్లు కేటాయించాం. మా కోడలు వైశాలికి టికెట్ అవసరం లేదని భావించామే తప్ప ఇప్పించలేని చేతకానితనం కాదు. -
'అధికారంలోకి వచ్చేది మేమే... డౌటా ?'
-
కాంగ్రెస్‌లోకి టీఆర్ఎస్ కీలక నేత శ్రవణ్
-
అభ్యర్థులైతే ఉన్నారు... సారథులే లేరు...
-
'కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి'
-
'పొత్తులు లేవు... చర్చలూ లేవు'
-
టీఆర్ఎస్తో పొత్తుకే కాంగ్రెస్ మొగ్గు ?
-
కాంగ్రెస్ 'చేతి'కే సుత్తి కొడవలి..?
-
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు..
-
'తెలంగాణ ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఏం చేసింది ?'
-
'పొత్తుకు తలుపులు తెరిచే ఉన్నాయి'
-
మాట తప్పిన కెసిఆర్: పొన్నాల
-
తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో పొన్నాల..?
-
మౌలిక వసతుల్లో నగరమే బెస్ట్: మంత్రి పొన్నాల
అమీర్‌పేట, న్యూస్‌లైన్: రానున్న స్వల్ప కాలంలో హైదరాబాద్.. మలేషియాకు దీటుగా అభివృద్ధి సాధిస్తుందని, ఇదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజినీర్స్ (ఐఎస్ఎల్ఈ) హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం అమీర్‌పేట్ గ్రీన్‌పార్కు హోటల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నాల మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం తరుపున రాయితీలు ఇస్తున్నామని, ఐటీ, ఫార్మా.. ఏ రంగానికైనా హైదరాబాద్ అనుకూల వేదికగా ఉందన్నారు. అందుకే ప్రపంచ దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయన్నారు. దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మౌలిక సదుపాయాల పరంగా ముందంజలో ఉందన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేయనుందని, దీని ద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఐఎస్ఎల్ఈ ఏపీ సెంటర్ చైర్మన్ కృష్ణశాస్త్రి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసమూర్తి, కర్ణాటక సెంటర్ చైర్మన్ నర్సింహస్వామి పాల్గొన్నారు. -
మంత్రి పొన్నాలకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లందంటూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. 2009 ఎన్నికల్లో జనగాం శాసనసభ స్థానం నుంచి 236 ఓట్ల మెజారిటీతో పొన్నాల లక్ష్మయ్య గెలుపొందారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదంటూ పొన్నాల ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో అక్రమాలు జరిగాయని, ఓడిన పొన్నాలను గెలుపొందినట్లు ప్రకటించారని నాటి నుండి టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదే వాదనతో అప్పటి టిఆర్ఎస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, పొన్నాల ఎన్నికపై 2010లో కోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ తీర్పును పొన్నాల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణపై అదే ఏడాది సుప్రీంకోర్టు స్టే విధించింది. నాటి నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది.