పార్టీ నేతల్లో క్రమశిక్షణారాహిత్యం.. సొంత పార్టీ నేతలే ఇష్టానుసారంగా మాట్లాడడం.. టికెట్లు రాలేదని కొందరు... టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపి మరికొందరు సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు.
కాంగ్రెస్ ఓటమికి కారణాలివే.. నిజామాబాద్ జిల్లా సమీక్షలో నేతలు
హైదరాబాద్: పార్టీ నేతల్లో క్రమశిక్షణారాహిత్యం.. సొంత పార్టీ నేతలే ఇష్టానుసారంగా మాట్లాడడం.. టికెట్లు రాలేదని కొందరు... టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపి మరికొందరు సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కూడా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల మంగళవారం పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు పార్టీ ఓటమికి గల కారణాలను కుండబద్దలు కొట్టారు.
ఈ సమీక్షకు జిల్లా ముఖ్యనేతలు పీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, సురేష్‌షెట్కార్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌లు హాజరయ్యారు. శాసనమండలి ప్రతిపక్ష నేత డి. శ్రీనివాస్, మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి రాలేదు.