నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత(పాత చిత్రం)
నిజామాబాద్: టీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతీ నియోజకవర్గంలో రెండు వేల కోట్ల రూపాయల నిథుల కంటే తక్కువ కేటాయించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం..లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకుంటారా అని నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ..ముందస్తు ఎన్నికలకు పోతున్నామని తనకు తెలియదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మాకు 100 శాతం మార్కులు వేశారు..ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధమని వ్యాఖ్యానించారు.
ఇవే ఫలితాలు వస్తాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం చేసినా ప్రతిపక్షాలకు భయమే..వాళ్ల ఆలోచన ప్రజలు కాదు పవర్ అని అన్నారు. కొంగర కలాన్ సభకు ఆర్టీసీ బస్సులను అద్దెకు మాత్రమే తీసుకుంటున్నామని, ఉద్దరకు తీసుకోవడంలేదని అన్నారు. దీనిపై కూడా విపక్షాలు కోర్టుకు వెళ్తే వారికే మొట్టికాయలు పడతాయని చెప్పారు. జోనల్ వ్యవస్థతో పరిపాలనాసౌలభ్యం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థ ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవడం శుభపరిణామమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment