సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరాలంటూ తనను ఆఫర్ చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పిన నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ బృందం కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆమె చెప్పిన వివరాల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ శుక్ర వారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ ముఖ్యనేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, ఎంఆర్ జీ వినోద్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ఆ నలుగురి వరకే పరిమితం చేయొద్దని, కవితను కలిసి గానీ, సిట్ కార్యాలయానికి పిలిపించి గానీ వాంగ్మూలం రికార్డు చేయాలని కోరారు. లేదంటే సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కోర్టు ముందు దోషిగా నిలబ డాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో నలుగురు ఎమ్మెల్యేలను బందెల దొడ్డిలో బంధించినట్టు ప్రగతిభవన్‌లో ఉంచా రని, అమ్ముడుపోయిన వారే మళ్లీ అమ్ముడు పోతుంటే వారితో కేసీఆర్ రాజకీయం చేయా లనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసహ్య పదజాలంతో చిల్లర పంచాయతీలు పెట్టుకుం టున్న టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజల ఆలోచన లను కలుషితం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం
కాంగ్రెస్‌లో చేరతానంటూ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసినట్టు ఎంపీ అర్వింద్ చెప్పిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా తమకు అలాంటి సమాచారం లేదని రేవంత్ బదులిచ్చారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరే అంశం గురించి తమకు తెలు సని, ఆయన్ను చేర్చుకునేందుకు తమకు అభ్యంతరం లేదని ఖర్గేకు చెప్పామన్నారు. తన పాదయాత్రపై ఏఐసీసీ నిర్ణయం తీసు కుంటుందని రేవంత్ చెప్పారు. ప్రజా సమ స్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే టీఆర్ ఎస్, బీజేపీలు వివాదాస్పద అంశాలపైనే చర్చను పక్కదారి పట్టిస్తున్నారని మండిప డ్డారు. రైతుల సమస్యలపై తాము ప్రజాక్షే త్రంలోకి వెళ్తామని, నేటి ముఖ్యనేతల సమా వేశంలో కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పారు. ఓబీసీల జనగణ నపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై పోరాడతామని వెల్లడించారు.
ఇదీ చదవండి: దాడి.. వేడి: చెప్పుతో కొడతానన్న కవిత.. దీటుగా స్పందించిన అర్వింద్
Comments
Please login to add a commentAdd a comment