► అబద్దాలకు కేరాఫ్ కేసీఆర్
► మహానేత వైఎస్సార్ హయాంలోనే పవర్‌ప్లాంట్
► ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన పొన్నాల
జనగామ : భూపాలపల్లి, సింగరేణి విద్యుత్ కేంద్రాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చర్చకు రావాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యంతో కలిసి పొన్నాల మాట్లాడారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తాను పట్టుబట్టి భూపాలపల్లిలో మొదటి, రెండు దశల్లో పవర్ ఫ్లాంట్‌ను ఏర్పాటు చేయించానన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో 50వేల మెగావాట్ల మిగులు విద్యుత్తు ఉన్న ఘనత తమకే దక్కుతుందన్నారు.
రెప్పపాటు కరెంట్ పోవడం లేదని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ప్లాంట్లను ఎక్కడ పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. యూపీఏ, ఉమ్మడి వైఎస్సార్ హయాంలో జైపూర్‌లో 18వందల మెగావాట్లు, భూపాల్‌పల్లిలో 6వందల మెగా వాట్ల ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పినట్లు పేర్కొన్నారు. విభజన చట్టంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు విషయం మరుగున పడేశారని మండిపడ్డారు. హైకోర్టు విభజన, ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఇనుప పరిశ్రమ, కాజిపేట కోచ్ ఫ్మాక్టరీ, ఉద్యోగలు విభజన, పోలవరం ముం పు గ్రామాల పరిస్థితులను గంగలో కలిపి కాం గ్రెస్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు.
ఖమ్మం జిల్లాలోని ఇందిరానగర్, ఎత్తిపోతల పథకాలను మార్చి తూతూ మం త్రంగా పనులు చేస్తున్నట్లు రెండు మోటార్లు బిగించి చేతులు దులుపుకున్న వారికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదన్నారు. 2018 నాటికల్లా ఇంటింటికీ తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న మహానుభావుడు, ఇప్పుడు కొత్తగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై శపథం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే తమిళనాడు తరహాలో ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 ఏప్రిల్20న షాద్‌నగర్ సభలో కేసీఆర్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైందని విమర్శించారు.
బడ్జెట్‌లో కేటాయించిన నిధులను ఒక్కసారి గమనిస్తే కేసీఆర్ అబద్దాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి చెంచా రపు శ్రీనివాస్‌రెడ్డి, అధికార ప్రతినిధి రంగరాజు ప్రవీణ్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండా అన్వర్, కౌన్సిలర్లు ఆకుల వేణుగోపాల్‌రావు, వంగాళ కల్యాణి మల్లారెడ్డి, మేడ శ్రీని వాస్, ధర్మపురి శ్రీనివాస్, ఆలేటి లక్ష్మి సిద్దిరా ములు, జక్కుల నిత వేణుమాధవ్, కొత్త కరుణాకర్‌రెడ్డి, మజార్ షరీఫ్, నర్సిం గారావు, చింతల మల్లేశం, మాజీద్, శివరాజ్ తదితరులు ఉన్నారు.