
సాక్షి, హైదరాబాద్: సాగుకు 24 గంటల విద్యుత్ సరఫరా, ఆటో స్టార్టర్ల తొలగింపు, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ అంశాలను ప్రజలకు వివరించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతిని ధులను సన్నద్ధం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఈ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వీరితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 7న సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాపై ప్రజల్లో సానుకూలత ఉందని, ముఖ్యంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వా నికి సమాచారం వచ్చింది.
నిరంతరం కరెంటు సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఆటో స్టార్టర్ల తొలగింపుపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులు వారితో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాసు పుస్తకాలపైనా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక వ్యవస్థతో రూపొందిస్తున్న పాసు పుస్తకాలు బాగున్నాయని, ఈ విషయాన్ని రైతులకు వివరించా లని యోచిస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం కానున్నారు.
నల్లగొండ నేతల అభినందన..
వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా అమలుపై సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ నేతలు శుభాభినందనలు తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి ఉపసభాపతి నేతి విద్యాసాగర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, నేతలు బండా నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, శంకరమ్మ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment