power sector
-
పదేళ్లలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులు
భారత్ తన ప్రతిష్టాత్మకమైన సున్నా కర్బన ఉద్గారాల స్థితి (తటస్థం)ని 2070 నాటికి చేరుకోవాలంటే.. వచ్చే పదేళ్లలో 700 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.60 లక్షల కోట్లు) విద్యుత్ రంగం(Power Sector)లో చేయాల్సి వస్తుందని మూడిస్ రేటింగ్స్ తెలిపింది. పునరుత్పాదక ఇంధనాలు, అణు ఇంధనం, విద్యుత్ ప్రసారం, పంపిణీ, ఇంధన స్టోరేజీ వసతుల కోసం ఈ మొత్తం వెచ్చించాల్సి వస్తుందని వివరించింది.దేశంలో కర్బన ఉద్గారాల విడుదలలో 37 శాతం విద్యుత్ రంగం నుంచే ఉంటోందని మూడిస్ పేర్కొంది. 2026 నుంచి 2051 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏటా జీడీపీలో 1.5–2 శాతం మేర పెట్టుబడులను (వచ్చే పదేళ్లు ఏటా 2 శాతం) ఈ రంగంలో చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. 2034–35 వరకు ఏటా రూ.4.5–6.4 లక్షల కోట్ల చొప్పున, ఆ తర్వాత 2026–51 మధ్యకాలంలో ఏటా రూ.6–9 లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని వెల్లడించింది. ఈ స్థాయిలో పెట్టుబడులను ప్రభుత్వం, ప్రైవేటు రంగం, దేశ, విదేశీ మూలధనం రూపంలో సమకూర్చుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటికీ అధిక శాతం విద్యుత్ బొగ్గు ఆధారితమే ఉన్నందున, ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయని అభిప్రాయపడింది. వచ్చే పదేళ్ల పాటు బలమైన ఆర్థిక వృద్ధి అన్నది బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి విస్తరణను సూచిస్తోందని, ఇది కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యానికి ప్రతికూలంగా మారొచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌లో 20,000 నియామకాలు!తలసరి వినియోగం మూడో వంతేభారత ఆర్థిక వ్యవస్థ ఏటా 6.5 శాతం చొప్పున వచ్చే పదేళ్ల పాటు వృద్ధిని నమోదు చేస్తుందని, దీంతో ఏటా విద్యుత్ డిమండ్ 6 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక పెరుగుదలను చూస్తుందని మూడిస్ రేటింగ్స్ అంచనా వేసింది. ‘భారత్‌లో తలసరి విద్యుత్ వినియోగం (2021–22లో 1,255 కిలోవాట్ హవర్) ప్రపంచ వినియోగంలో మూడింత ఒక వంతుగానే ఉంది. ఆర్థిక వృద్ధితోపాటు, జీవన ప్రమాణాల మెరుగుదల నేపథ్యంలో రానున్న కాలంలో వినియోగం మరింత పెరగనుంది. వచ్చే పదేళ్లలో 450 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం డిమాండ్‌ను తీర్చలేదు. ఈ కాలంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని మరో 35 శాతం పెంచుకోవాల్సి రావచ్చు. 1.7–1.8 రెట్లు పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 2034–35 నాటికి 2–2.2 రెట్లు పెరగాలి. 2023–24 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ తయారీ 23.5 శాతంగా ఉంటే, 2034–35 నాటికి 45–50 శాతానికి చేర్చాలి’అని మూడిస్ వివరించింది. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లే విషయంలో ప్రైవేటు రంగం ఎంతో కీలకమంటూ, విదేశీ నిధులు అంతరాన్ని భర్తీ చేయగలవని పేర్కొంది. -
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు బొగ్గు సెగ
న్యూఢిల్లీ: బొగ్గు అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ ఎంటర్ప్రైజెస్ (ఏఈఎల్) నికర లాభం ఏకంగా 97 శాతం క్షీణించింది. రూ. 58 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ నికర లాభం రూ. 1,888 కోట్లుగా నమోదైంది. ప్రధాన వినియోగదారయిన విద్యుత్ రంగంలో పునరుత్పాదక వనరుల వాటా పెరిగి బొగ్గుకు డిమాండ్ తగ్గడంతో అమ్మకాల పరిమాణం ఏకంగా 42 శాతం మేర క్షీణించింది. ఇక ఆ్రస్టేలియా కార్యకలాపాలకు సంబంధించి విదేశీ మారకంపరంగా నష్టాలు నమోదు కావడం కూడా తాజా పనితీరుకు కారణమయ్యాయి. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం 9 శాతం తగ్గి రూ. 22,848 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఆదాయం 6 శాతం పెరిగి రూ. 72,763 కోట్లకు చేరగా, నికర లాభం 17 శాతం వృద్ధి చెంది రూ. 3,254 కోట్లకు ఎగిసింది. గురువారం బీఎస్ఈలో ఏఈఎల్ షేరు సుమారు మూడు శాతం క్షీణించి రూ. 2,253 వద్ద క్లోజయ్యింది. -
మౌలిక రంగం.. మందగమనం
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక గ్రూప్ సెప్టెంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు (2023 ఇదే నెలతో పోల్చి) కేవలం 2 శాతానికి పరిమితమైంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 9.5 శాతం. 2024 ఆగస్టుతో(1.6 శాతం క్షీణత) పోల్చితే మెరుగ్గా నమోదవడం ఊరటనిచ్చే అంశం. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాలు క్షీణ రేటును నమోదుచేసుకున్నాయి. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్ వృద్ధి రేటు స్వల్పంగా ఉంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య, ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదైంది. -
విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలు
ముంబై: విద్యుత్, ఇంధన రంగాల్లో ఈ ఏడాది నియామకాలు సానుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య) ఈ రంగాల్లో నియామకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 9 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్’ నివేదిక తెలిపింది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల (నెట్ జీరో) లక్ష్యం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తాయని ఈ నివేదిక పేర్కొంది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన రంగం గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. 23 రంగాలకు చెందిన 1,417 కంపెనీల ప్రతినిధులను అడిగి టీమ్‌లీజ్ ఈ నివేదికను రూపొందించింది. ఢిల్లీలో అధికం ఇంధన, విద్యుత్ రంగాల్లో ప్రస్తుత ఉపాధి అవకాశాల పరంగా ఢిల్లీ 56 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరు 53 శాతం, ముంబై 52 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాల పరంగా జైపూర్ 14 శాతంతో ముందుంది. బెంగళూరు, చెన్నై, వదోదర 13 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెట్రోల్లో వృద్ధి అవకాశాలను గుర్తు చేస్తూనే, ద్వితీయ శ్రేణి పట్టణాలు కొత్త అవకాశాలు వేదికగా నిలుస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలు, పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ఆర్థిక వృద్ధికి మద్దతు.. ‘‘విద్యుత్, ఇంధన రంగాల్లో 9 శాతం మేర ఉపాధి అవకాశాల విస్తరణ అన్నది పర్యావరణ అనుకూల భవిష్యత్ దిశగా స్పష్టమైన మార్గాన్ని సూచిస్తోంది. 62 శాతం పరిశ్రమ ప్రతినిధులు తమ సిబ్బందిని పెంచుకుంటున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ 4.0, క్రమానుగతంగా కర్బన రహితంగా మారాలన్న లక్ష్యాలు విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దుతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ తెలిపారు. విద్యుత్, ఇంధన రంగాల్లో ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టీమ్‌లీజ్ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం వృద్ధి అవకాశాల గుర్తించి ప్రస్తావించారు. ఆ తర్వాత సేల్స్ (అమ్మకాలు) విభాగంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహన మౌలిక వసతులు, ప్రీమియమైజేషన్ (ఖరీదైన ఉత్పత్తుల వినియోగం) ధోరణితో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయని ఈ నివేదిక తెలిపింది. -
తుది దశకు చేరిన పవర్ కమిషన్ విచారణ
-
అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం..
-
పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
-
వైట్ పేపర్.. లైట్ తీస్కో.. 'కరెంట్‌పైనా కోతలే'!
శ్వేత పత్రం... యథార్థాలు చెబుతుందన్న అర్థాన్ని వదిలేస్తే.. జస్ట్ తెల్ల కాగితం! ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు రాసుకోవచ్చు. అందుకే... సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే శ్వేతపత్రాల పరంపర మొదలెట్టారు. పోలవరం.. అమరావతి... ఇప్పుడు విద్యుత్ రంగం. కాసుల కోసం ప్రత్యేక హోదాపై రాజీ పడి.. ప్యాకేజీగా తెచ్చుకున్న పోలవరాన్ని తమ వారికి కట్టబెట్టేసి... డబ్బులొచ్చే పనులు మాత్రమే చేసి తాను నాశనం చేసిన జీవనాడి పాపాలను సైతం జగన్‌పైకే నెట్టేయడమన్నది తొలి తెల్ల కాగితం సారాంశం. తను ఏలిన ఐదేళ్లూ గ్రాఫిక్స్‌లోనే చూపించిన అమరావతిని కూడా జగనే దెబ్బ తీశారనేది మరో శ్వేతపత్ర కథనం. కోలుకోలేని బకాయిలతో విద్యుత్ సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేసి... సరఫరా వ్యవస్థను సర్వనాశనం చేసిన చంద్రబాబు... పాత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించి విద్యుత్ వ్యవస్థను పట్టాలెక్కించిన జగన్‌పై మూడో పత్రం సహితంగా మరిన్ని అసత్యాలు వండివార్చారు. ఏడు అంశాలపై శ్వేతపత్రాలు తెస్తానని ముందే చెప్పిన బాబు... తన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయటానికి ముందే కొంత ప్రిపేరయ్యారనేదే ఈ రోత పత్రాల లోగుట్టు!! ఇక విద్యుత్తు పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏర్పాట్లు సరిగా లేవని ఉద్యోగులను బెదిరిస్తూ.. బాబు తన సహజ ధోరణి ప్రదర్శించారు!సాక్షి, అమరావతి: అబద్ధాలతో మునుపటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు మంగళవారం విద్యుత్ శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఐదేళ్లలో ఒక్క సారి కూడా పవర్ హాలిడే విధించకుండా, విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో జరిగినప్పుడు కూడా ఎక్కడా సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన గత ప్రభుత్వంలో లేని తప్పులను, జరగని నష్టాలను కల్పించి శ్వేతపత్రంలో పొందుపరిచారు. తాను గతంలో అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలతో కుదేలైన డిస్కంలను ఆదుకున్న వైఎస్ జగన్ వల్లనే విద్యుత్ రంగం రూ.1,29,503 కోట్ల నష్టం వచ్చిందంటూ చంద్రబాబు కనికట్టు విద్యను ప్రదర్శించారు. 2018–19 నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 5613 మెగావాట్లుకాగా 7,213 మెగావాట్లు అని చంద్రబాబు శ్వేత పత్రంలో అబద్ధాలు చెప్పుకొచ్చారు. ఆ అబద్దాలు..వాటి వెనుక వాస్తవాలు ఇవీ...డిస్కంలకు అప్పుల పాలు చేసింది మీరేగా చంద్రబాబుడిస్కంల నికర విలువ 2014లో చంద్రబాబు గెలిచే నాటికి సుమారు మైనస్ రూ.4,315 కోట్లు ఉంటే, ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి... అంటే 2019 నాటికి నికర విలువ దారుణంగా క్షీణించి ఏకంగా మైనస్ రూ.20వేల కోట్లకు చేరింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్ళలో రూ.13,225 కోట్లు మాత్రమే అప్పటి ప్రభుత్వం సబ్సిడీ చెల్లించింది. 2019–20 నుంచి 2023–24 వరకు నాలుగేళ్ళలోనే సబ్సిడీ, ఆర్థిక మద్దతు కింద జగన్ సర్కారు రూ.47,800.92 కోట్లు చెల్లించింది. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల అప్పులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు 2014 మార్చి నాటికి రూ.29,551 కోట్లు ఉంటే, చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లకు పెరిగాయి. అంటే ఏకంగా 56,663 కోట్లు పెరిగాయి. సగటున అప్పుల వృద్ధిరేటు 24శాతం. అదే జగన్ హయాంలో రూ.86,215 కోట్లు కాస్తా..రూ.1,22,518కోట్లకు పెరిగాయి. అంటే కోవిడ్ లాంటి సంక్షోభాలున్నా, చంద్రబాబు చేసిన అప్పులభారం అధికంగా ఉన్నా... జగన్ హయాంలో పెరిగిన అప్పులు కేవలం రూ.36,303 కోట్లు. వాటి వృద్ధిరేటు 7.3 శాతమే. టీడీపీ ప్రభుత్వం 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధర (యూనిట్ రూ.7)లకు కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా దాదాపు రూ.3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ భారం మోయాల్సి వస్తోంది. ఈ ఒప్పందాల కోసం థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని (బ్యాక్ డౌన్)తగ్గించింది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం డిస్కంలు ఆర్థిక సంస్థల నుంచి మరిన్ని రుణాలను తీసుకోవాల్సి వచ్చింది. బాబు సీఎంగా ఉన్నన్నాళ్లూ విద్యుత్ కొనుగోలు వ్యయం (ట్రూ అప్)ను బిల్లుల్లో సర్ధుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. ఆ ట్రూ చార్జీలే జగన్ హయాంలో ఏపీఈఆర్సీ అనుమతితో డిస్కంలు వేశాయి. మరిప్పుడు ట్రూ అప్ ఛార్జీలను వెనక్కి తీసుకునే ఆలోచన ఉందా?, విద్యుత్ చార్జీల టారిఫ్ పెంచరా? అని విలేకరులు అడిగితే ‘నేను అలా అన్నానా’ అంటూ, అవేవీ జరగవని, చార్జీల పెంపు తప్పదనే సంకేతాన్ని చంద్రబాబు ఇవ్వనే ఇచ్చారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలారేసుకోవాలన్నది ఎవరురాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా రైతు ఖాతాలో నెలవారీ వినియోగ చార్జీలను ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ మొత్తాన్ని రైతులు డిస్కంలకు చెల్లిస్తారు. ఇదంతా తప్పని ఎన్నికల ముందు గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం స్మార్ట్ మీటర్లపై సమాధానం దాటవేశారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెడుతుంటే, రైతులపై విద్యుత్ బిల్లులు భారం వేస్తారని తప్పుడు ప్రచారం చేసిన బాబు..మీటర్లపై మీ వైఖరేమిటని అడిగితే అర్ధం లేని సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్మార్ట్ మీటర్ల గురించి చెప్పకుండా సోలార్ నెట్ మీటరింగ్ గురించి చెప్పుకొచ్చారు. నిజానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలను రూ.8845 కోట్లు ఇవ్వకుండా ఎగవేశారు. దానిని కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది.ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద రూ.43,744 కోట్లను జగన్ ప్రభుత్వం అందించింది. రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచారు. రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం 5 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది.మీ వల్ల కానిది జగన్ చేసి చూపించలేదా?కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లోని 800 మెగావాట్ల యూనిట్ల జాప్యం వల్ల రూ.12,818 కోట్లు నష్టమని అసత్యాల కథ అల్లారు చంద్రబాబు. నిజానికి ఈ రెండు యూనిట్లతో 1,600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చిందే జగన్. ఈ 2 ప్రాజెక్టుల్లో పనులకు స్థిర (ఫిక్సిడ్) రేటును నిర్ణయించారు. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి, పెంచడానికి అవకాశం లేదు. ఎగ్జిక్యూషన్ ఏజెన్సీల్లో జగన్ హయాంలో ఎటువంటి మార్పులు, విజిలెన్స్ విచారణలు కూడా జరగలేదు. అంటే ఈ రెండు ప్రాజెక్టుల అమలులో ఉద్దేశపూర్వకంగా ఎలాంటి జాప్యం జరగలేదు. కోవిడ్ రెండు దశల కారణంగా 2020, 2021ల్లో ఏడాదిన్నరకు పైగా ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. కోవిడ్ మూడో దశలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కార్మికులను సమీకరించడం, వారికి పునరావాసం కల్పించడానికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ పనులు చకచకా జరిపించి 2022 అక్టోబర్‌లో ప్రారంభిచారు. ఎన్టీటీపీఎస్లో యూనిట్లో అదే ఏడాది డిసెంబరులో ఉత్పత్తి మొదలుపెట్టారు. అయితే జీఎస్టీ అమలు, చట్టంలో మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్ వ్యయం పెరిగింది. ఇందులో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదు. అంతేకాకుండా జగన్ హయాంలో ఉత్పత్తి 63,675 మిలియన్ యూనిట్లు కాస్తా, ఉత్పత్తి 2023–24 నాటికి 80,151 మిలియన్ యూనిట్లకు పెరిగింది.‘సెకీ’తో లాభమేగానీ నష్టం లేదువ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారు. అది కూడా యూనిట్ కేవలం రూ.2.49 పైసలకే. ఏపీకి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79పై. (ట్రేడింగ్ మార్జిన్ కలిపి) కన్నా ఇది‡ తక్కువ. ప్రస్తుత సరాసరి విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 ఉంది. దీని వలన ఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. ఈ విద్యుత్‌ను రాజస్థాన్ నుంచి ట్రాన్స్మిషన్ చేయాల్సి రావడం వల్ల అధిక ధర పెట్టారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ సెకీ విద్యుత్‌కు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ విషయాన్ని దాచిపెట్టారు చంద్రబాబు.ఈ మంచి కనిపించలేదా⇒ పునరుత్పాదక విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని గత ప్రభుత్వంలో ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో శంకుస్థాపన చేశారు. ⇒ నెడ్కాప్ ఆధ్వర్యంలో దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ⇒ వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ⇒ రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన భద్రత దిశగా చేస్తున్న కషిని గుర్తించి రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను కేంద్రం ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించింది. అలాగే ఏపీట్రాన్స్కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వరించాయి.ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. ‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. ⇒ రాష్ట్రానికి రావాల్సిన అంతరాష్ట్ర విద్యుత్ ప్రసార చార్జీలపై ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీ ట్రాన్స్‌కో) చేసిన పోరాటం ఫలించి రాష్ట్రానికి రూ.306.2 కోట్ల ఆదాయం సమకూరింది. ⇒ మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అప్పర్ సీలేరులో రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ (పీఎస్పీ)కు కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకువచ్చింది. ⇒ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు 2023లో రూ.2,479 కోట్లతో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.620 కోట్లతో నిర్మించిన 12 సబ్స్టేషన్లను అప్పటి సీఎం జగన్ ప్రారంభించారు. ఇందుకోసం మొత్తం రూ.3,099 కోట్లను వెచ్చించారు. ⇒ ఏపీట్రాన్స్కో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత 99.70 శాతానికి పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌ని ఉపయోగించి ‘ది మోస్ట్ అక్యురేట్’ డే–ఎహెడ్ ఫోర్కాస్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 3 శాతం లోపు ఉన్న ప్రసార నష్టాలను 2.69 శాతానికి ఏపీట్రాన్స్కో తగ్గించింది. ⇒ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 14948 మెగావాట్ల నుంచి 17102 మెగావాట్లకి మెరుగుపడింది. 2022–23 సంవత్సరంలో 93 శాతం (12.40 మిలియన్ మెట్రిక్ టన్) ఉన్న బొగ్గు లభ్యత, 2023–24లో 96.52 శాతానికి (14.74 మిలియన్ మెట్రిక్ టన్)కి పెరిగింది. ⇒ వ్యవసాయం, ఆక్వా ,పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలు కలిపి మొత్తం 39.64 లక్షల మంది వినియోగదారులకు ‘నవరత్నాల’ పథకాల ద్వారా ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను అందించింది. ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించింది. వెనుకబడిన వర్గాల కుటుంబాలకు, ధోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు, చేనేత కార్మికులు, లాండ్రీలు, దారిద్రయ రేఖకు దిగువ ఉన్న వారికి, ప్రొఫెషనల్ గోల్డ్‌స్మిత్‌ల దుకాణాలకు కూడా ఉచిత, సబ్సిడీ విద్యుత్ సరఫరాను చేసింది.తెలంగాణ బకాయిలు వసూలుకు చొరవ తీసుకున్నది జగనేతెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఆంధ్రప్రదేశ్ సరఫరా చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన రూ.7300 కోట్ల బకాయిలను వసూలు చేసేందుకు అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్రంపై అనేక పర్యాయాలు ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి విద్యుత్ బకాయిలు కట్టాల్సిందేనని కేంద్రం తెలంగాణకు చెప్పింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల నుంచి 2014 జూన్ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5625 కోట్ల రుణాలను ఏపీ జెన్కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసింది. కానీ వాడుకున్న విద్యుత్‌కు తెలంగాణ నుంచి అప్పడు అధికారంలో ఉన్న చంద్రబాబు వసూలు చేయలేకపోయారు. ఇప్పుడు ఆ బకాయిలను కూడా గత ప్రభుత్వం ఖాతాలోకి నెట్టే ప్రయత్నం చేశారు. మీరేం చొరవ తీసుకుంటున్నారని విలేకరులు అడిగితే మాత్రం ‘వాళ్లేదో అంటున్నారు. కమిటీ వేస్తాం..చూస్తాం’ అంటూ సమాధానం చెప్పలేకపోయారు. -
విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే: కాకాణి
సాక్షి,నెల్లూరు: సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్థన్ మండిపడ్డారు. ఆయన మంగళవారం చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంపై మీడియాతో మాట్లాడారు.‘సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే. శ్వేత పత్రం పేరుతో వైఎస్ జగన్ విమర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. జగన్ హయాంలో 25 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగింది. చంద్రబాబు చేయనిది కూడా చేసినట్లు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకు సగటు వృద్ధి రేటు కేవలం 1. 9 శాతం. జాతీయ వృద్ధి రేటులో మూడో వంతుకు పడిపోయింది. చంద్రబాబ హయాంలో కోవిడ్ లేదు.. ఉక్రెయిన్ యుద్ధం లేదు. కేంద్రం చెప్పిన లేక్కల ప్రకారమే మాట్లాడుతున్నాం. ..అసలు విద్యుత్ రంగాన్ని కుప్పకూల్చింది చంద్రబాబే, చంద్రబాబు పరిపాలనలోనే అప్పుల కుప్పలు ఉన్నాయి. బాబు దిగిపోయే నాటికి విద్యుత్ రంగంలో రూ. 86,215 కోట్లు అప్పు ఉంది. చంద్రబాబు హయాంలోనే డిస్కంలు కుప్పకూలాయి. విద్యుత్ రంగంపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేత పత్రం అబద్ధాల మయం. వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందనట్టుగా చెప్పారు. జగన్‌ను విమర్శించేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. శ్వేత పత్రం అంటే ఆయా రంగంలో ఉన్న పరిస్థితిని వివరించాలి, కానీ ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యుత్ ఉత్పత్తిని బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ రంగంలో 4.7 శాతం వృద్ధిరేటు నమోదు అయింది. జాతీయ సగటు కంటే ఇది అధికం. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించలేదు. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్పారు. ..రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా విద్యుత్ ఒప్పందాలను చంద్రబాబు చేసుకున్నారు. ట్రూ అప్ ఛార్జిలు ఎత్తేస్తానని బాబు చెప్పగలరా?. ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ధరలు తగ్గుముఖం పడితే, రాష్ట్రంలో మాత్రం యూనిట్‌ను ఏడు రూపాయలకు కొనుగోలు చేసేలా చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల ఎంతో నష్టం జరిగింది. రైతులకు సంబంధించి సబ్సిడీ బకాయిలు కూడా చెల్లించలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెల్లించారు. వినియోగదారులతో పాటు రైతులపై భారం పడకుండా చేశారు. ట్రూ అప్ చార్జీలు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. కానీ తనకు ఏమీ తెలియనట్టు చంద్రబాబు మాట్లాడారు. రైతులకు మీటర్లను పెట్టనివ్వబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దాటవేశారు. ఎన్నికల ముందు మీటర్లు ఉరి తాళ్లు అన్న చంద్రబాబు.. ఇప్పుడైనా స్పందించాలి’ అని కాకాణి అన్నారు’అని అన్నారు. -
అన్నన్న చంద్రన్నా.. పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేత పత్రం!
అమరావతి, సాక్షి: కాకి లెక్కలు.. పచ్చి అబద్ధాలతో పవర్ సెక్టార్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైట్‌పేపర్ ప్రసంగం సాగింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ.. గత ఐదేళ్లలో విద్యుత్‌రంగానికి జరిగిన మంచిని ఏమాత్రం ప్రస్తావించకుండా.. పైగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు చెబుతూ వింత వింత లెక్కలను తెరపైకి తెచ్చారు సీఎం చంద్రబాబు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో తెలంగాణ ఇవ్వాల్సిన రూ. 7వేల కోట్ల విద్యుత్ బకాయిలు జగన్ వైఫల్యమన్న చంద్రబాబు.. తన పాలనలోనే తెలంగాణ విద్యుత్ వినియోగించుకున్నదని మాత్రం గుర్తించకపోవడం గమనార్హం. అలాగే.. ప్రభుత్వం శాఖలు ఇవ్వాల్సిన బిల్లులు కూడా వైఎస్ జగన్ వైఫల్యం అంటూ తప్పుడు ప్రచారం చేశారు.చంద్రబాబు శ్వేత పత్రం.. జగన్ హయాంలో వాస్తవాల్ని పరిశీలిస్తే👉పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తికాక 4737 కోట్లు నష్టమంటూ మరో అబద్ధం అచ్చేసిన వైనంవాస్తవానికి.. పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు వేగంగా జరిగింది వై ఎస్ జగన్ హయాంలోనేచంద్రబాబు హయాంలో కనీసం పునాదులు దాటని జల విద్యుత్ కేంద్రం పనులు👉ఎన్నికలకు ముందు ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తామంటూ చంద్రబాబు ప్రచారంట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తారా?.. మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానం చెప్పని చంద్రబాబు.. రూ. 17,137 కోట్ల ట్రూ అప్ ఛార్జెస్ రద్దుపై మాట దాటేసిన చంద్రబాబు👉విద్యుత్ ఛార్జీలు ఐదేళ్లు పెంచారా..? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేసిన చంద్రబాబు👉చంద్రబాబు గత పాలనలోనే తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విద్యుత్ రంగంగత ఐదేళ్లలో విద్యుత్ రంగానికి ఊపిరిపోసిన వైఎస్ జగన్ ప్రభుత్వంచంద్రబాబు దిగిపోయే నాటికి రూ.68,596 కోట్ల అప్పుల్లో డిస్కమ్ లుగత ఐదేళ్లలో డిస్కమ్ లకు నిధులు పెద్ద ఎత్తున చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వంరూ. 56 వేల కోట్లు డిస్కమ్ లకు చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదీ చదవండి: మళ్లీ చంద్రబాబు మోసం.. ఉచిత ఇసుక ఒట్టిదే!రాష్ట్ర ప్రయోజనాల కోసం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వంకృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్లు,నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల యూనిట్లను జాతికి అంకితంప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి పిన్నాపురంలో శంఖుస్థాపననెడ్కాప్ ఆధ్వర్యంలో 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారంజగన్ హయాంలో.. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు, 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) తో ప్రభుత్వం ఒప్పందంయూనిట్ కేవలం రూ.2.49 పైసలకే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నంసబ్సిడీ బకాయిలను కూడా సకాలంలో విడుదల చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంగత ఐదేళ్లలో ఒక్క సారి కూడా పవర్ హాలిడే విధించకుండా సమర్థవంతంగా విద్యుత్ రంగ నిర్వహణవైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వంఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా రూ.3800 కోట్లు విలువైన 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసిన గత ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఏపీ అధికారులుఏపీట్రాన్స్కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు, పీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు‘కన్సూ్యమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్👉మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు👉అప్పర్ సీలేరులో రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంట్ (పీఎస్పీ)కు కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకువచ్చిన గత ప్రభుత్వం. -
కేసీఆర్‌కు గత ఏప్రిల్‌లోనే నోటీసులు జారీ: జస్టిస్ నరసింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడంలో పాత్రపై మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు గత ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ సహా మొత్తం 25 మంది అధికారులు, అనధికారులకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శులైన సురేష్ చందా, ఎస్కే జోషీ, అరవింద్కుమార్లతో పాటు ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలను విచారించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి మంగళవారం బీఆర్కేఆర్ భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు ‘విద్యుత్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల పరిశీలనలో మీ పాత్రను గుర్తించామని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ అందరికీ నోటీసులు ఇచ్చాం. కేసీఆర్ మినహా నోటీసులు అందుకున్న మిగతా వారంతా గడువులోగా తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ అందజేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నానని, జూలై 31 వరకు గడువు పొడిగించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా, జూన్ 15 వరకు కమిషన్ గడువు పొడిగించింది. అయితే ఇప్పటికీ కేసీఆర్ నుంచి వివరణ అందలేదు. కొందరి వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో అదనపు సమాచారం కోరు తూ మళ్లీ నోటీసులు జారీ చేశాం. నిర్ణయాల్లో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో ఆయనకు నోటీసులు జారీ చేయలేదు..’ అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఎవరు నిర్ణయం తీసుకున్నారో పరిశీలిస్తున్నాం ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాల్లో నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే అంశంపై విచారణ నిర్వహిస్తున్నాం. నిర్ణయాల్లో పాత్రలేని అధికారులు ఒక్కొక్కరిని తప్పించడం (ఎలిమినేషన్) ద్వారా అసలు నిర్ణయం తీసుకున్న వారెవరో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు అంశాల్లోనూ నాటి ప్రభుత్వం నేరుగా నిర్ణయాలు తీసుకుందని జెన్కో, ఇతర విద్యుత్ సంస్థల పాత్ర లేదని ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం అంటే.. నిర్ణయం తీసుకుంది ఎవరు? అనే అంశం పరిశీలిస్తున్నాం..’ అని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి అధికారాలు పెద్ద తప్పిదం ‘ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచి్చనట్టుగా మా లెక్కల్లో తేలింది. ఒప్పందంపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ)కి బదులుగా ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీకి సర్వ అధికారాలు కట్టబెట్టడం పెద్ద తప్పిదం. 12 ఏళ్లకు ఒప్పందం జరిగితే, ఛత్తీస్‌గఢ్ కేవలం మూడు నాలుగేళ్లు మాత్రమే విద్యుత్ సరఫరా చేసి మానుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి 2014లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోగా, నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ దీనిపై సంతకం చేశారు. అయితే ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రమేయం లేకుండానే 2016లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగింది. జీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్ సీఎండీలు దీనిపై సంతకం పెట్టారు. అయితే అప్పటికి ఛత్తీస్‌గఢ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రం (మార్వా) నిర్మాణమే ప్రారంభం కాలేదని మా పరిశీలనలో తేలింది..’ అని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. చర్యలు తీసుకోని ఈఆర్సీ ‘ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరవింద్‌కుమార్ వివరణ ఇచ్చారు. నామినేషన్ విధానంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, దీనికి బదులుగా విద్యుత్ కొనుగోళ్ల కోసం బహిరంగ టెండర్లను నిర్వహిస్తే బాగుంటుందని పేర్కొంటూ అరవింద్‌కుమార్ 2016 నవంబర్ చివరలో రాష్ట్ర ఈఆర్సీకి సుదీర్ఘ లేఖ రాయగా, ఈఆర్సీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలింది. ఈ లేఖ రాసిన వెంటనే తాను ఇంధన శాఖ నుంచి బదిలీకి గురైనట్టు అరవింద్‌కుమార్ తెలిపారు. 2000 మెగావాట్ల విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ ఎస్కే జోషి తొలుత జీవో 22 జారీ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు వీలు కలి్పంచేలా ఈ జీవోను సవరిస్తూ దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనుమతించారు. 1000 మెగావాట్ల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కోసం 2000 మెగావాట్ల విద్యుత్ కారిడార్‌ను బుక్ చేసుకున్నారు. అందులో 1000 మెగావాట్ల లైన్లను కూడా ఎన్నడూ పూర్తిగా వాడుకోలేదు..’ అని వివరించారు. సూపర్ క్రిటికల్‌కి బదులుగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ‘భద్రాద్రి’ ‘ఉత్తర భారత దేశంలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం బీహెచ్ఈఎల్ తయారు చేసిన జనరేటర్లు, బాయిలర్లు నిరుపయోగంగా ఉండడంతో వాటిని తీసుకొచ్చి 1080 మెగావాట్ల సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించినట్టు మా పరిశీలనలో తేలింది. సూపర్ క్రిటికల్‌కి బదులుగా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మించడంతో బొగ్గు వాడకం పెరిగి ఏటా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు వ్యయం పెరిగింది. బొగ్గు వాడకం పెరగడంతో పర్యావరణ కాలుష్యం కూడా పెరిగింది. 25 ఏళ్ల పాటు అధిక వ్యయం, కాలుష్యాన్ని భరించాల్సి ఉంటుంది. తెలంగాణ వచ్చాక కొత్తగూడెంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో రికార్డు కాలంలో నిర్మించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సైతం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోనే నిర్మిస్తున్నారు. కానీ భద్రాద్రి కేంద్రాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి నిర్మించాలని నేరుగా ప్రభుత్వం నుంచే నిర్ణయం వెలువడిందని, ఇందులో తమ పాత్ర లేదని ప్రభాకర్ రావు చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదు త్వరలో మరో మాజీ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రాను విచారిస్తామని, టీజేఏసీ చైర్మన్ కె.రఘు, టీజేఎస్ అధినేత కోదండరాం, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్ రావును కూడా పిలిపించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకుంటామని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. ఈఆర్సీ మాజీ చైర్మన్‌ను విచారించేందుకు వీలుండదని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. యాదాద్రి ఇప్పట్లో పూర్తయ్యేలా లేదుయాదాద్రి, భద్రాద్రి కేంద్రాలను రెండేళ్లలో నిర్మిస్తామని చెప్పి గడువులోగా పూర్తి చేయలేకపోయారు. యాదాద్రి కేంద్రాన్ని ఇటీవల సందర్శించగా, సమీప భవిష్యత్తులో పూర్తయ్యే పరిస్థితి కనిపించలేదు. కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు నిర్వహించకుండా బీహెచ్ఈఎల్కు నామినేషన్ల విధానంలో వీటి పనులు అప్పగించారు. బీహెచ్ఈఎల్ మాజీ, ప్రస్తుత సీఎండీలను పిలిపించి విచారించగా, అవకతవకలు జరిగినట్టు అనుమానాలు ఉన్న అంశాల (గ్రే ఏరియాస్)పై పరిశీలన జరుపుతామని బదులిచ్చారు. తాను స్వల్పకాలం పాటే ఇంధన శాఖలో పనిచేశానని, అప్పట్లో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని, కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయని సురేష్ చందా చెప్పారు..’ అని జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించారు. -
బాబు షాక్‌కు.. జగన్ ట్రీట్మెంట్
అప్పుడు వైఎస్సార్.. ఇప్పుడు జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రభుత్వ హయాం(2004–09) స్వర్ణయుగంలా సాగింది. దేశంలోనే మొదటిసారి ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించారు. ఇందుకు డిస్కంలు వెచి్చంచిన మొత్తాన్ని నయాపైసాతో సహా క్రాస్ సబ్సిడీ రూపంలో వైఎస్సార్ ప్రభుత్వం చెల్లించింది. ఉచిత విద్యుత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా, రైతు బాంధవుడిగా, అపర భగీరథుడిగా, పేదల పక్షపాతిగా, దార్శనికుడిగా ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన పాలనలో అన్ని రంగాలూ ప్రగతిపథంలో నడిచాయి. సుభిక్షమైన వర్షాలతో వ్యవసాయం పండగలా సాగింది. ఆ తర్వాత ఆ స్థాయికి మించి రైతులకు మేలు జరిగింది.. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. బాబు పాలనలో రైతుకు ఉరి (1995–2003) 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో అడుగడుగునా అన్నదాతల ఆక్రందనలే.. ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు ఆడిన బాబు వేలాది మంది రైతుల మెడకు ఉరితాళ్లు బిగించి.. సాగును చిన్నాభిన్నం చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలంటూ వైఎస్సార్‌ను ఎగతాళి చేశారు. మరోసారి బాబు షాక్ (2014– 2019) మరోసారి చంద్రబాబు పాలన. 2014 –19 మధ్య చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఉచిత విద్యుత్ అందించినందుకు డిస్కంలకు సబ్సిడీలు చెల్లించకుండా పెండింగులో పెట్టి అప్పుల భారం పెంచేశారు. విద్యుత్ కొనుగోలు, సరఫరా మధ్య అంతరాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేయకుండా డిస్కంల వ్యవస్థను నాశనం చేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. జగన్ పాలనలో విద్యుత్ ధగధగలు (2019–2024) జగన్ ప్రభుత్వం రాకతో డిస్కంలకు సబ్సిడీలు చెల్లించడంతో పాటు.. విద్యుత్ కొనుగోలు – సరఫరా మధ్య అంతరాలు ట్రూఅప్ రూపంలో కొంత సర్దుబాటు చేశారు. రైతులకు నాణ్యమైన 9 గంటల విద్యుత్ కోసం కొత్త ఫీడర్ల ఏర్పాటుతో పాటు, పాతవాటి సామర్థ్యం పెంచారు. పేదలు, రైతులపై భారం పడకుండా ప్రభుత్వమే సబ్సిడీ భరించి.. మొత్తం రూ.46,581 కోట్లను విద్యుత్ సబ్సిడీగా అందించారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థను బలోపేతం చేశారు. విద్యుత్ వృథా కనీస స్థాయికి తగ్గించి, చోరీలకు చెక్ పెట్టారు. పారదర్శక బిల్లుల విధానం కోసం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్సార్ పాలన స్వర్ణయుగం(2004–2009) తన పాదయాత్రలో రైతు కష్టం తెలుసుకుని.. ఆ రైతుకు ఏం కావాలో గుర్తించి అధికారంలోకి రాగానే వైఎస్సార్ రైతు రాజ్యానికి శ్రీకారం చుట్టారు. ఉచిత విద్యుత్, సాగుకు 9 గంటల విద్యుత్ సరఫరాతో రైతుల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. జగన్ పాలనలో వెలుగుల పంట రైతులకు పగటిపూట 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంచారు. రూ.1,700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటు చేసి రైతులకు పగటి పూట నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసేవారు. ఇందులో 9 గంటల పగటి పూట విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న ఫీడర్లు 3,854 మాత్రమే. మిగిలిన 2,809 ఫీడర్లకు జగన్ ప్రభుత్వం వచ్చాకే అదనపు సామర్థ్యం కలి్పంచారు. 2023లో రూ.2,479 కోట్లతో 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ.620 కోట్లతో నిరి్మంచిన 12 సబ్స్టేషన్లను సీఎం జగన్ ప్రారంభించారు. మొత్తం రూ.3,099 కోట్లను వెచ్చించారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ సంస్థల అప్పులు (రూ. కోట్లలో)సంస్థ పేరు 2014నాటికి 2019నాటికి పెరిగినవి ఏపీజెన్కో 15,712.32 40,750.89 ఏపీఎస్పీడీసీఎల్ 7,140.32 14,336.15 ఏపీఈపీడీసీఎల్ 4,159.15 5,448.4 ఏపీ ట్రాన్స్‌కో 2,691.25 8,060.83 మొత్తం 29,703.04 68,596.27 విద్యుత్ కొను‘గోల్మాల్’ బాబు హయాంలో వాస్తవ ఖర్చులు ఎప్పటికప్పుడు చూపకపోవడంతో నిర్దేశించిన దానికన్నా వ్యయం పెరిగిపోయింది. ఫలితంగా డిస్కంలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సి వచ్చింది. వాటిపై నిరంతరం వడ్డీలు కడుతూ అవి తీర్చలేక మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి. 2016–17 మధ్య బిడ్డింగ్ ప్రక్రియలో పవన విద్యుత్ రూ.2.50 «నుంచి రూ. 2.75 ధరతో కొనుగోలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నా, పలు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల ద్వారా యూనిట్ రూ.4.84కు దాదాపు 3000 మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పీపీఏలతో ఏడాదికి రూ.660 కోట్ల అదనపు భారం ఖజానాపై పడింది. బాబు హయాంలో రాత్రి పూటే కరెంటు వ్యవసాయ రంగానికి పగటిపూట 9 గంటలు కరెంటు సరఫరా చేయాలి. బాబు హయాంలో ఆరేడు గంటలు మాత్రమే అది కూడా రాత్రిపూటే సరఫరా చేశారు. దీంతో నీటి తడులు పెట్టేందుకు పొలాలకు వెళ్లే రైతుల్లో చాలా మంది పాము కాటుకు గురై మరణించారు. చీకట్లో అనేక మంది రైతులు విద్యుదాఘాతంతో మరణించిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంతో పోలి్చతే 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. అయినప్పటికీ రైతులకు మేలు చేసేలా విద్యుత్ సరఫరా జరిగిన దాఖలాల్లేవు. బాబు చీకట్లను పారదోలిన జగన్ చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా జగన్ ప్రభుత్వం 5 లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు మంజూరు చేసింది. పెండింగులో ఉన్న వ్యవసాయ దరఖాస్తుదారులందరికీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారు. దరఖాస్తు చేసిన వెంటనే కొత్త కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19.21 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు ఐదు లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. 39.64 లక్షల మంది లబి్ధదారులకు (అగ్రికల్చర్, ఆక్వా, పశు సంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతరులు) మొత్తం రూ.46,581 కోట్ల విద్యుత్ సబ్సిడీ అందించారు. సోలార్, పవన విద్యుత్‌తో మంచిరోజులు రూ.3,400 కోట్లతో కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. 500 మెగావాట్లు సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్)తో కలిపి వీటితో రానున్న రోజుల్లో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే విద్యుత్ పంపిణీ సామర్థ్యం మెరుగు పడుతుంది. వేసవిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో 260 మిలియన్ యూనిట్లకు పెరిగినా పక్కా ప్రణాళికతో కోతలు లేకుండా సరఫరా చేస్తారు.►రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి యూనిట్ రూ.2.49తో సోలార్ పవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17 వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. వ్యవసాయ విద్యుత్‌కు కావాల్సిన 13 వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే మరో 25 ఏళ్లపాటు ఉండేలా చర్యలు తీసుకున్నారు. 2024 సెప్టెంబర్‌కు 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబర్ నాటికి మరో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్ నాటికి మరో 1000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ మీటర్లతో వృథా, చోరీలకు చెక్ విద్యుత్ వినియోగం పక్కాగా లెక్కకట్టి, వృథా, చోరీల్ని నియంత్రించడమే లక్ష్యంగా డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చి రైతు ఎంత విద్యుత్ వినియోగించుకున్నారో పక్కాగా లెక్కగట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మేరకు యూనిట్ వ్యయాన్ని లెక్కించి రైతుల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా జమచేస్తారు. రైతులపై పైసా భారం పడకుండా జగన్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ► అధికారంలోకి వచ్చాక సామాన్యులపై 41.04 శాతం భారం మోపిన చంద్రబాబు ► విద్యుత్ రంగాన్ని అనవసర పీపీఏలతో గాడి తప్పించిన గత టీడీపీ ప్రభుత్వం ► సబ్సిడీలు చెల్లించకుండా, ట్రూఅప్ ఛార్జీలపై తప్పుడు లెక్కలతో డిస్కంలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు ► టీడీపీ అధికారంలోకి రావడానికి ముందు రూ.29,703 కోట్లున్న అప్పుల్ని రూ.68,596 కోట్లకు పెంచిన ఘనుడు ► నాడు ఉచిత విద్యుత్‌తో దేశానికే ఆదర్శంగా ఏపీని నిలిపిన వైఎస్ రాజశేఖరరెడ్డి ►నేడు సంస్కరణలతో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బాబు హయాంలో విద్యుత్ చార్జీల పెంపు (యూనిట్‌కు రూ.ల్లో).. నెలవారీ 2016 2018 పెరుగుదల వినియోగం (మార్చి) (ఏప్రిల్) శాతం76 140.10 197.60 41.04 78 145.30 202.80 39.57 80 150.50 208.00 38.21 82 155.70 213.20 36.93 85 163.50 221.00 35.17 88 171.30 228.80 33.57 90 176.50 234.00 32.58 92 181.70 239.20 31.65 95 189.50 247.00 30.34 98 197.30 254.80 29.14 100 202.50 260.00 28.40 రైతు బాంధవుడు వైఎస్సార్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అమలుతో సంచలనం సృష్టించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి రైతులు నయాపైసా చెల్లించనక్కర్లేకుండా ఉచిత విద్యుత్ పొందే అవకాశం లభించింది. ఆ రోజు వరకూ ఉన్న వ్యవసాయ విద్యుత్ బకాయిలు రూ.1,259 కోట్లు రద్దయ్యాయి. దేశంలో మొదటిసారిగా ఎలాంటి షరతులు లేకుండా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించిన ప్రభుత్వం వైఎస్సార్‌దే. ఉచిత విద్యుత్ కోసం పంపిణీ సంస్థలు వెచ్చించిన ప్రతి పైసాను ప్రభుత్వం సబ్సిడీగా అందించింది. విద్యుత్ రంగం ప్రగతిబాట గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పలు చర్యలు చేపట్టింది. డిస్కంలకు ఠంచనుగా సబ్సిడీలు చెల్లిస్తోంది. దీంతో గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం దాదాపు రూ.50 వేల కోట్లను çడిస్కంలకు సబ్సిడీల రూపంలో చెల్లించింది. ఇది గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో చెల్లించినదానికంటే దాదాపు రెండున్నర రెట్లు అధికం కావడం గమనార్హం. జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పక్కాగా ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత సరఫరా చేస్తున్నారు. చేతివృత్తుల వారికి, ఆక్వా రంగానికి రాయితీతో విద్యుత్ ఇస్తున్నారు. ఆక్వా రైతుల నుంచి యూనిట్‌కు రూ.1.50 మాత్రమే వసూలు చేస్తూ, రాయితీ రూ.3.50 ప్రభుత్వమే భరిస్తోంది. ఏటా రూ.12 వేల కోట్లకు పైగా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోంది. బాబు తప్పులు.. డిస్కంలకు అప్పులు చంద్రబాబు ఏలుబడి(2014–19)లో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. బాబు సర్కారు డిస్కంలకు క్రాస్ సబ్సిడీని సక్రమంగా చెల్లించలేదు. విద్యుత్ కొనుగోలు, సరఫరా మధ్య అంతరాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేయలేదు. దీంతో డిస్కంలు దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేసవిలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు దిగిపోయే నాటికి డిస్కంలకు ప్రభుత్వం రూ.13 వేల కోట్లకు పైగా బకాయి పెట్టింది. 2014–15 నుంచి 2018–19 మధ్య పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, అవసరాలు తక్కువ చేసి చూపడంతో నిర్దేశిత వ్యయం కంటే వాస్తవ వ్యయం రూ.19 వేల కోట్లు ఎక్కువైంది.ఈ మొత్తంపై ట్రూ ఆప్ సవరణల కోసం విద్యుత్ నియంత్రణ మండలికి నివేదికలు సమరి్పంచలేదు. గత ప్రభుత్వం హయాంలో వార్షిక ఆదాయ, ఖర్చుల నివేదికలు సక్రమంగా సమరి్పస్తే.. ప్రభుత్వం కూడా ఆమేరకు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చేది. సబ్సిడీ భారాన్ని తప్పించుకునేందుకు వాస్తవ వ్యయం చూపకపోవడంతో డిస్కంలు నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో బాబు హయాంలో సబ్సిడీ పెండింగులో పెట్టిన మొత్తం రూ.13 వేల కోట్లు, వాస్తవాలు చూపకపోవడంవల్ల ఏర్పడిన నష్టం రూ.19 వేల కోట్లు కలిపి మొత్తం రూ.31 వేల కోటక్లుపైగా డిస్కంలు నష్టాల్లో కూరుకుపోవాల్సి వచి్చంది. మా మంచి కోసం స్మార్ట్ మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా, చోరీ, మరమ్మతులకు గురైనా ఆ ఖర్చులు విద్యుత్ కంపెనీలే భరిస్తాయని హామీ ఇచ్చారు. మేం పైసా కట్టకుండా మీటర్ పెడతామన్నారు. మాకు తొమ్మిది గంటలు పగలు కరెంటు ఇస్తున్నారు. దానివల్ల మా పంటలు బాగా పండుతున్నాయి. –ఎం.కృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం కరెంటుకు ఢోకా లేదు ఇది వరకు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఇబ్బంది పడేవాళ్లం. ఒకే ట్రాన్స్ఫార్మర్పై మూడు సరీ్వసులుంటే ట్రాన్స్ఫార్మర్ బాగుచేయడానికి ఒకరొస్తే ఇంకొకరు రావడం కుదిరేది కాదు. మోటార్లు ఒకటి కాలిపోతే పక్కవి కూడా కాలిపోయేవి. ఏ మోటర్ దగ్గర సమస్య ఉందో తెలుసుకోవడానికి అన్ని బోర్ల దగ్గరకు తిరిగేవారం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలడం చాలా అరుదు. దెబ్బతిన్నా వెంటనే బాగవుతోంది. –రుద్ర సూర్యనారాయణ, కౌలు రైతు, కృష్ణాపురం -
‘ఇంధన’ సంస్కరణల్లో ఏపీ నవశకం..సరికొత్త కాంతులు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో మునుపెన్నడూ ఎరుగని విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020, ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ– 2022, ఏపీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ– 2023లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వ ఇంధన విధానాలపై ఆసక్తి చూపుతోంది. ప్రపంచ వేదికలపైనా ఏపీపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు పారిశ్రామిక దిగ్గజాలు సైతం విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పట్టాలెక్కిన పలు ప్రాజెక్టులు..విద్యుత్ ఉత్పత్తి సంస్థ (డిస్కం)లపై భారం పడకుండా, ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేసేందుకు పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఎగుమతి పాలసీ–2020ని నోటిఫై చేసింది. ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ–2022, ఏపీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ–2023లను తీసుకొచ్చింది. వీటి ఫలితంగా విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయోడీజిల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలపై పలు ఒప్పందాలు కుదిరాయి.ఓవైపు ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడులతో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పట్టాలెక్కగా, మరికొన్నిటికి ప్రాజెక్టు నివేదికలు సిద్ధమవుతున్నాయి. 11,225 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్రాజెక్టు (8,025 మెగావాట్ల సౌర విద్యుత్, 3,200 మెగావాట్ల పవన విద్యుత్)లను ఇప్పటికే ప్రైవేట్‌కు కేటాయించారు. అలాగే ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సౌర విద్యుత్, 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయి.మెరుగుపడుతున్న పంపిణీ సౌకర్యాలునంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్‌కు సంబంధించి గ్రీన్కో గ్రూప్ సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) మొదటి దశలో 4,500 మెగావాట్ల ఆర్ఈ పవర్, రెండో దశలో 9,000 మెగావాట్ల ఆర్ఈ పవర్‌ను తరలించడానికి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు వద్ద మౌలిక సదుపాయాలతో పాటు 765 కిలోవాట్స్(కేవీ) సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తోంది. అలాగే 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను తరలించడానికి అనంతపురం జిల్లాలోని గుంతకల్‌లో 400 కేవీ సబ్‌స్టేషన్‌ను నిరి్మంచాలని యోచిస్తోంది. 51 గిగావాట్ల ఆర్ఈ పవర్ (18 గిగావాట్ల పవన విద్యుత్, 33 గిగావాట్ల సౌర విద్యుత్)ను తరలించడానికి రాష్ట్రంలో పంపిణీ సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచి్చంది. పీక్ పవర్ డిమాండ్ కోసం పీఎస్పీలు వేరియబుల్ రెన్యువబుల్ ఎనర్జీ (వీఆర్‌ఈ)ని సమతుల్యం చేయడానికి, పీక్ పవర్ డిమాండ్‌ను చేరుకోవడానికి ప్రభుత్వం పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టŠస్ (పీఎస్పీ)లను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 32,400 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు 29 సైట్ల కోసం టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీసీఎఫ్‌ఆర్)లను సిద్ధం చేసింది. మొత్తం 37 చోట్ల 42,270 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీల నిర్మాణానికి స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. దశలవారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), వివిధ అనుమతులను పొందడానికి మూడేళ్ల సమయం పడుతుంది.కాగా 16,180 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీ ప్రాజెక్టులను డెవలపర్లకు కేటాయించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాల భూములను వాటి యజమానుల అంగీకారంతో స్థానిక రెవె న్యూ అధికారుల సహకారంలో సేకరించడానికి ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ మరోవైపు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో రాష్ట్రం భాగమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం దేశం మొత్తం మీద ఐదు రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేయగా వాటిలో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ–2023ని రాష్ట్రం రూపొందించింది. రాష్ట్రంలోని బళ్లారి–నెల్లూరు (కర్ణాటక–ఆంధ్రప్రదేశ్) మధ్య నేషనల్ గ్రీన్ స్టీల్, కెమికల్స్ కారిడార్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ కారిడార్‌లోని స్టీల్, కెమికల్ ప్లాంట్ల కోసం సంవత్సరానికి 5 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను 30 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. విశాఖపట్నంలో నేషనల్ గ్రీన్ రిఫైనరీ ట్రాన్స్పోర్ట్ హబ్‌ను సృష్టించి 20 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌తో సంవత్సరానికి 4 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. -
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాల్లోకి వెళ్లిందని దుయ్యబట్టారు. 2014 జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ సమయానికి డిస్కంల నష్టాలు రూ.12,186 కోట్లు కాగా బీఆర్ఎస్ పదేళ్ల పాలన పూర్తయ్యేసరికి ఆ నష్టాల భారం రూ.62 ,461 కోట్లకు చేరిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్య లపై ఆ శాఖ మంత్రిగా తాను చర్చకు సిద్ధమని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని సంస్కరిస్తూ కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తు న్నామని ఆయన గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దీర్ఘకాలిక అవసరాల కోసమే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు చేశామనే కేసీఆర్ మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. తాము రూ.13 పెట్టి విద్యుత్ కొనుగోలు చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, యూనిట్‌ను కేవలం రూ.3.90కు కొంటున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బీఆర్ఎస్ హయంలో రూ.20లకు కూడా విద్యుత్ కొన్నట్టు రికార్డుల్లో నమోదైందని తెలిపారు. ఎన్టీపీసీ నుంచి తాము ఒక యూనిట్‌ను రూ. 5.60లకు కొనుగోలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కేసీఆర్ హయంలో థర్మల్ విద్యుత్ కొత్త కేంద్రం భద్రాద్రి నుంచి 1080 మెగావాట్లు మాత్రమే వచ్చిందని, ఛత్తీస్‌గఢ్ నుంచి తీసుకున్న 1000 మెగావాట్లను కలిపితే 2080 మెగావాట్లని వివరించారు. 2022లోనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఆగిపోయిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాతే అత్యధిక విద్యుత్ సరఫరా చేశామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను పవర్ ఐల్యాండ్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే 2012లో గ్రిడ్ కుప్పకూలిన తరువాత హైదరాబాద్‌ను పవర్ ఐల్యాండ్‌గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని భట్టి స్పష్టం చేశారు. ’’దేశంలోని 20 కంటే ఎక్కువ ప్రధాన నగరాల్లో ఇలాంటి పవర్ ఐలాండ్ కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చాం’అని వివరించారు. ఫిబ్రవరి నాటికి యాదాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి యాదాద్రి విద్యుత్ ప్లాంట్ నుంచి 2025 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధ్యం అవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు రావడానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 4000 మెగావాట్ల ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేవనెత్తిన అభ్యంతరాలకు పరిష్కారం చూపి కేవలం రెండు నెలల వ్యవధిలోనే యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకువచ్చామని భట్టి తెలిపారు. -
విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. విద్యుత్ రంగాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దడంతోపాటు భవిష్యత్ తరాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రభుత్వం ప్రకటించింది. పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్ధాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను కొత్తగా నెలకొల్పేందుకు తోడ్పాటునందించింది. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో, ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులతో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించిన విద్యుత్ రంగ ప్రగతి ► రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంలో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ సీవోడీ పూర్తి చేసుకుని అందుబాటులోకి వచి్చంది. ఈ 1,600 మెగావాట్లతో కలిపి జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. ► ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా మరో 2 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ► దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 8,025 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. ► వ్యవసాయానికి వచ్చే 30 ఏళ్ల పాటు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను కొనసాగించడం కోసం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ► సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్ధ్యం పెరిగింది. ► చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు కొత్తగా వచ్చాయి. ► పట్టణ ప్రాంతాల్లో పోగయ్యే చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులనూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. 2021లో గుంటూరులో 15 మెగావాట్ల ప్లాంటు, 2022లో విశాఖలో 15 మెగావాట్ల సామర్ధ్యంతో మరో ప్లాంటు ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్ధాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ► 2023 మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సష్టించే అవకాశం ఉంది. ► గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, ఇంధన సామర్థ్యం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగాలలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం నిలిపింది. రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్లు విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ఇంధన రంగంలో ఎన్నో అవార్డులు ఇంధన భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పలు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను వరుసగా రెండేళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. ఏపీ ట్రాన్స్‌కో, నెడ్కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వచ్చాయి. ఏపీఎస్పీడీసీఎల్కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో మన రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. ‘కన్సూ్యమర్ సరీ్వస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని మూడు డిస్కంలకు ‘ఏ’ గ్రేడ్ లభించింది. వీటన్నిటి సాధన వెనుక సీఎం జగన్ ముద్ర, ఆయన ప్రణాళికలు ఉన్నాయి. -
‘పునరుత్పాదక విద్యుత్’.. రెండో స్థానంలో ఏపీ
సాక్షి, విశాఖపట్నం: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యం (రెన్యువబుల్ పవర్ ఆబ్లిగేషన్ (ఆర్పీవో))లో 2021–22 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నెడ్‌క్యాప్ వైస్ చైర్మన్, ఎండీ రమణారెడ్డి తెలిపారు. కర్ణాటక 41.3 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 28.5 శాతంతో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2021–22 నాటికి ఆర్పీవో లక్ష్యాన్ని 21.18 శాతంగా నిర్దేశించగా ఏపీ దాన్ని అధిగవిుంచిందని వివరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), నెడ్‌క్యాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో క్లీన్ గ్రోత్ డ్రైవింగ్ పోర్ట్, ఎనర్జీ ఇంటెన్సివ్లో క్లీన్ ఇన్వెస్ట్మెంట్, కర్బన ఉద్గారాల నియంత్రణలో పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన పరిశ్రమల పాత్ర’ అనే అంశంపై శనివారం విశాఖలో సదస్సు జరిగింది. ఇందులో రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 9,008.78 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఈ రంగంలో దేశంలో ఐదో స్థానంలో నిలిచామని వివరించారు. ఇందులో సోలార్ పవర్ 38.50 గిగావాట్లు కాగా విండ్ పవర్ 44 గిగావాట్లు ఉందని తెలిపారు. దీంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కింద 36.15 మెగావాట్లు, పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.97 మెగావాట్లు, చిన్న హైడ్రో ప్రాజెక్టుల నుంచి 106.80 మెగావాట్లు ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ దేశానికే ఆదర్శం.. 2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పునరుత్పాదక విద్యుత్ ఎగుమతుల పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రమణారెడ్డి తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల విషయంలోనూ రాష్ట్రం 37 శాతంతో దేశంలో అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 4,745.60 మెగావాట్ల సామర్థ్యంతో 8 ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. మరో 3,260 మెగావాట్ల సామర్థ్యంతో 4 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే 2,350 మెగావాట్లతో 2 ప్రాజెక్టులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో, 59,357 మెగావాట్లతో 47 ప్రాజెక్టులు సర్వే దశలో ఉన్నాయని వివరించారు. ఈ మొత్తం 61 ప్రాజెక్టుల్లో 26,050 మెగావాట్ల సామర్థ్యంతో 23 ప్రాజెక్టులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని తెలిపారు. పంప్డ్ హైడ్రో ఎలక్ట్రికల్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. 21 ప్రాంతాల్లో 16.18 గిగావాట్ల ఉత్పత్తికి, 37 ప్రాంతాల్లో 42.02 గిగావాట్ల ఉత్పత్తికి పీఎస్పీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టులకు పూర్తి అనుకూలంగా ఉందన్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుం బిగించింది.. ఈ సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.యువరాజ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ లైఫ్ కార్యక్రమం ద్వారా విద్యుత్ రంగంలో 51.3 శాతం, రవాణా రంగంలో 13.2 శాతం కర్బన ఉద్గారాల నియంత్రణకు భారత్ నడుంబిగించిందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా ఈ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోగలమని ఆకాంక్షించారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. అదే ఏడాది నాటికి భారత్‌లో హైడ్రోజన్ డిమాండ్ 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందన్నారు. ఇది 2050 నాటికి 28 ఎంఎంటీ దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. దానికనుగుణంగా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ జె తారకన్, సీఐఐ చైర్మన్ డా.లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
దేశంలో టాప్–10లో ఏపీ డిస్కంలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తున్నాయి. తాజాగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) ప్రకటించిన టాప్ 62 డిస్కంల జాబితాలో ఏపీ డిస్కంలు జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచి ‘ఏ’ గ్రేడ్ సాధించాయని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, కె.సంతోషరావులు తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ‘సాక్షి’కి వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు తగ్గట్టు రోజువారీ విద్యుత్ సరఫరాలో ఎలాంటి కోతల్లేకుండా అందిస్తూ ఏపీ రికార్డులు సృష్టిస్తోంది. దేశ సగటు విద్యుత్ సరఫరాను మించి రాష్ట్రంలో విద్యుత్‌ను అందిస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన వినియోగదారుల సేవా రేటింగ్ 2022–23 నివేదిక ప్రకారం.. జాతీయ సగటు విద్యుత్ సరఫరా పట్టణ ప్రాంతాల్లో 23.59 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 21.26 గంటలుగా ఉంది. కానీ మన రాష్ట్రంలో పట్టణాల్లో 23.85 గంటలు, గ్రామాల్లో 23.49 గంటల పాటు సరఫరా అందిస్తున్నారు. జాతీయ సగటు అంతరాయ సూచికతో పోల్చితే మన డిస్కంలలో సగానికంటే తక్కువగా ఫీడర్ అంతరాయాలు నమోదవుతున్నాయి. సేవలకు దక్కిన గుర్తింపు ఏడాదిలో ఈ జాతీయ సగటు అంతరాయ సూచిక 200.15 కాగా, ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఎస్పీడీసీఎల్)లో 42, ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(ఏపీఈపీడీసీఎల్)లో 79.68, ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీసీపీడీసీఎల్)లో 103.86 చొప్పున పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఫీడర్‌కు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీ) వైఫల్యం రేటు 2.01 శాతం మాత్రమే ఉంది. దీని జాతీయ సగటు 5.81 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంతే కాకుండా 2017–18లో డిస్కంల పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉంటే అవి 2022–23లో 5.31 శాతానికి తగ్గాయి. కొత్త సర్వీసులకు వంద శాతం మీటరింగ్ పూర్తి చేయడంతో పాటు రిపేర్ వచ్చిన వాటి స్థానంలో త్వరితగతిన కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మాన్యువల్ జోక్యం లేకుండా ఇన్ఫ్రారెడ్(ఐఆర్) పోర్ట్ ద్వారా విద్యుత్ బిల్లులు రీడింగ్ తీస్తున్నారు. అలాగే వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు బిల్లింగ్ హెచ్చరికలు పంపిస్తూ ఆలస్య చెల్లింపుల జరిమానాలు పడకుండా వారిని అప్రమత్తం చేయడం వంటి చర్యలను కేంద్రం తన అధ్యయనంలో పరిగణనలోకి తీసుకుంది. ఆపరేషన్, విశ్వసనీయత, రెవెన్యూ కనెక్షన్లలో చేసిన కృషి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి తీసుకున్న చర్యలు, మీటరింగ్, బిల్లింగ్, తప్పులను సరిదిద్దడం, ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఈ క్రమంలో సాధించిన విజయాల ఆధారంగా జాతీయ స్థాయిలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏపీ డిస్కంలకు టాప్ టెన్‌లో స్థానం కల్పించింది. -
అప్పుల ఊబిలో విద్యుత్ రంగం
మణుగూరు రూరల్: విద్యుత్ సెక్టార్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టివే సిందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. విద్యుత్ కొనుగోలుకు రూ.30,406 కోట్లు, బకాయిల పేరుతో రూ.59,580 కోట్లు అప్పు చేసి లెక్కలు లేకుండా తారుమారు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను శనివారం భట్టి సందర్శించారు. జెన్కో అధికారులతో కలిసి వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి వివరాల గురించి అడిగి తెలుసుకు న్నారు. అనంతరం సీఈ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. బీటీపీఎస్‌తో వచ్చే సమస్యలు అధిగమించేందుకు.. ప్రస్తుతం బీటీపీఎస్‌తో అనేక సమస్యలు తలె త్తుతున్న క్రమంలో వాటిని అధిగమించేందుకు భవిష్యత్‌లో ఉన్నత మైన ప్రణాళికలు రూపొందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. బీటీపీ ఎస్‌లో సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉండగా.. సబ్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగిస్తున్నా రని, దీంతో పర్యావర ణానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్య లను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. జమలాపురం ఆలయాన్ని, మామునూరు పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, రేమిడిచర్లలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మిస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జెన్కో సీఎండీ సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి కృష్ణభాస్కర్, పినపాక, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్ పాల్గొన్నారు. -
విద్యుత్ రంగ అభివృద్ధికి రూ.13వేల కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పరిధిలో దాదాపు రూ.13 వేల కోట్లను ‘ఆర్డీఎస్ఎస్’ ద్వారా వెచ్చిస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. విద్యుత్ సంస్థ (ఏపీజెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఎస్పీసీఎల్, డిస్కం)ల డైరీల ఆవిష్కరణ, ‘ఏపీసీపీడీసీఎల్’ 4వ వార్షికోత్సవం గురువారం నిర్వహించారు. విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో కొత్తగా దాదాపు 484 33/11 కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. విద్యుత్ నష్టాలు ఈ ఏడాది బాగా తగ్గాయని, 10 శాతానికి తీసుకుచ్చామని వివరించారు. ఇటీవల సీఎం జగన్ పలు సబ్స్టేషన్లు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. కృష్ణపట్నం 800 మెగావాట్ల యూనిట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. డాక్టర్ ఎన్టీటీటీపీఎస్‌లో మరో 800 మెగావాట్లు ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 99.7 శాతం ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యతతో మనం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీఎస్పీడీడీఎల్ సీఎండీ, ఏపీసీపీడీసీఎల్ ఇన్చార్జ్ సీఎండీ కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ మాజీ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్ బాబు, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సగానికిపైగా అప్పులు తీర్చాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకే అప్పులు తెచ్చినట్లు మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. తెచ్చిన అప్పుల్లోనూ సగానికిపైగా తీర్చేశామని చెప్పారు. శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం కింద గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సైతం స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలకు అరకొరగా అందుతున్న విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారని... అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రజలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ ఇవ్వలేమని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అమలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుందా లేక అప్పుల సాకుతో కోతలు పెడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఆస్తుల విలువ పెంచాం... 2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు రూ. 44,438 కోట్లు ఉండగా అప్పులు రూ. 22,423 కోట్లు ఉండేవని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు రూ. 81,016 కోట్లకు పెరగ్గా ఆస్తుల విలువ రూ. 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని చెప్పారు. పరీక్షలు వస్తున్నాయంటే.. కిరసనాయిల్ , క్యాండిల్స్ కొనుక్కురావాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. బోరుబావుల్లో నీళ్లు లేకపోతే ఇంట్లో ఎసరు పెట్టే పరిస్థితి లేదని జగదీశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు. బండెడ్లు అమ్ముకునే స్థితి నుంచి... బండెడ్లు అమ్మడం నుంచి పుస్తెలు అమ్ముకునే దాకా... ఏ బోరు వేశారో ఆ భూమి అమ్ముకొనే దాకా పరిస్థితి అప్పట్లో ఉండేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు రైతులు దేశమంతా వలసలు వెళ్లేవారని గుర్తుచేశారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి కరెంటు ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్ ద్వారా విద్యుత్ ఇచ్చే అవకాశం ఉండేది కాదన్నారు. 133 కేవీ, 220 కేవీ, 400 కేవీ అందుబాటులో లేక, బ్యాక్‌డౌన్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదు.. జెన్కో ప్రాజెక్టులను ప్రభుత్వ సంస్థలకే అప్పగించామని, ప్రైవేటుకు ఇచ్చి దోచుకోలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ రంగంపై వాస్తవాలు చెబితే కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్... తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ సీఎం అయ్యాక వెంటనే విద్యుదుత్పత్తి చేయడం కష్టంగా ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గ్రిడ్‌ను అనుసంధానించి విద్యుత్ సరఫ రా, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేశామని తెలిపారు. మొదట అందుబాటులో ఉన్న వ్యవ స్థతో గృహ, వాణిజ్య రంగానికి 24 గంటల కరెంటు ఇచ్చి ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు తెలిపారు. ఒక సంవత్సరంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేసి వ్యవసాయానికి 6 గంటల కరెంటు ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తరువాత 9 గంటల కరెంటు ఇవ్వగలిగామని, రెండు సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లను రెట్టింపు నిర్మించామని తెలిపారు. -
‘ఖబడ్దార్’పై కలకలం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చ గురువారం దారి తప్పింది. ‘ఖబడ్దార్’అంటూ కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య సభలో కలకలం సృష్టించింది. విపక్ష బీఆర్ఎస్ సభ్యులు అంతే దూకుడుతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి ఆవేశంతో ప్రతి సవాళ్ళు విసరడం సభలో వేడిని మరింత పెంచింది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగాన్నే లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి వ్యంగా్రస్తాలు సంధించారు. ‘కిరోసిన్ దీపం కింద చదువుకున్న... కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి వేల కోట్లు ఎలా సంపాదించారు?’అని ప్రశ్నించారు. ప్రజల కోసమే తాను పార్టీ మారిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్‌కు జోకడం తప్ప, ఎదురు చెప్పలేని స్థితి మాజీ మంత్రిది అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు మూకుమ్మడిగా లేచి అభ్యంతరం చెప్పా రు. ప్రతిగా అధికార పక్ష సభ్యులూ లేవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అధికార పక్షం వైపు వేలెత్తి చూపారు. పరస్పర వాగ్వాదం కొనసాగుతున్న తరుణంలోనే రాజగోపాల్‌రెడ్డి ‘పదేళ్ళు భరించాం.. ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. ఖబడ్దార్’అంటూ చేసిన హెచ్చరిక సభా వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. కొత్త వాళ్ళున్నారు... కాస్త జాగ్రత్త వాగ్వాదాల మధ్య మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జోక్యం చేసకుని ‘ఈ సభ లో కొత్త వాళ్ళున్నారు. సభా మర్యాద కాపాడాలి. వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత దూషణలు, తిట్టుకోవడం మంచిది కాదు’అంటూ సలహా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. సభ లో ‘ఖబడ్దార్’అనే పదం వాడొచ్చా? అని బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. దీనిపై రూలింగ్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ఏం జరిగిందో పరిశీలిస్తానని, ఖబడ్డార్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. ఆ తర్వాత సభ సర్దుమణిగింది. చర్చ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ సభ్యులు సభలో లేకపోవడాన్ని గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం కొద్ది సేపటికే బీఆర్ఎస్ సభ్యులు సభలోకి ప్రవేశించారు. -
రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో మైలురాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ (ఏపీజెన్కో) మరో మైలురాయిని అధిగమించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్లోని 8వ యూనిట్ వాణిజ్య ఉత్పత్తికి విజయవంతంగా శ్రీకారం చుట్టింది. కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ 72 గంటలపాటు నిర్విరామంగా వందశాతానికిపైగా సామర్థ్యంతో పనిచేయడంతో.. బుధవారం ఉదయం 10.45 గంటలకు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి (కమర్షియల్ ఆపరేషన్ డేట్– సీవోడీ) ప్రారంభమైంది. ఏపీజెన్కో ఎండీ , ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు సమక్షంలో సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది హర్షధ్వానాల మధ్య ఏపీజెన్కో, ఏపీట్రాన్స్కో, ఏపీపీసీసీ, ఏపీ డిస్కంల ప్రతినిధులు బుధవారం ఉదయం సీవోడీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,760 నుంచి 2,560 మెగావాట్లకు పెంచుకుని ఏపీజెన్‌కోలో డాక్టర్ ఎన్టీటీపీఎస్ అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఎనిమిదో యూనిట్ కోవిడ్ లాంటి కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి వాణిజ్య ఉత్పత్తి సాధించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కేక్ కట్‌చేసి, కొత్త యూనిట్ నిర్మాణంలో భాగస్వాములై సేవలందించిన పలువురిని జ్ఞాపికలతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడంవల్లే ఎనిమిదో యూనిట్ నిర్మాణపనులు పూర్తిచేసి సీవోడీ చేసుకోగలిగామని ఏపీజెన్కో ఎండీ చక్రధర్‌బాబు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహించడంవల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అడుగడుగునా మార్గదర్శకం చేశారన్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీజెన్కో ఉద్యోగులు, భాగస్వామ్య సంస్థలైన బీహెచ్ఈఎల్, బీజేఆర్, ఆర్ఈసీ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. 8,789 మెగావాట్లకు పెరిగిన జెన్కో సామర్థ్యం డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ సీవోడీతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. జెన్కో మొత్తం ఉత్పాదన సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం జెన్కోకి 6,610 మెగావాట్ల థర్మల్, 1,773.600 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ (మొత్తం 8,789.026 మెగావాట్లు) విద్యుదుత్పాదన సామర్థ్యం ఉంది. మొత్తం రాష్ట్ర గ్రిడ్ డిమాండ్‌లో 55 నుంచి 60 శాతం విద్యుత్ అందించే సామర్థ్యం ఏపీ జెన్కోకు వచ్చింది. -
కాంతులీననున్న కొత్త సబ్స్టేషన్లు
సాక్షి, అమరావతి : అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రానున్న రోజుల్లో ఏపీ గణనీయమైన వృద్ధి, పట్టణీకరణ జరిగే క్రమంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా విద్యుత్ రంగం బలోపేతంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుడుతోంది. వీటిలో 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంపోత్సవాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వర్చువల్ విధానంలో చేయనున్నారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. రెండు సోలార్ ప్రాజెక్టులు కూడా.. ఇవికాక.. కడపలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురంలో 100 మెగావాట్ల మరో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లా మైలవరం మండలంలో 1,000 మెగావాట్ల సోలార్ పార్కు అభివృద్ధికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 250 మెగావాట్లను 2020 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. మిగిలిన 750 మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఈ 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా. ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ఏటా 1,500 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిద్వారా సంవత్సరానికి 12 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. అలాగే.. శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎన్.పీ.కుంట, గాలివీడు గ్రామాల వద్ద 1,500 మెగావాట్ల సోలార్ పార్క్‌కు ఎంఎన్ఆర్ఈ ఆమోదం తెలిపింది. వివిధ సోలార్ పవర్ డెవలపర్లు 1,400 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశారు. మిగిలిన 100 మెగావాట్ల కోసం, హెచ్‌పీసీఎల్ ముందుకొచ్చింది. ఈ సోలార్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు పెట్టుబడి అంచనా వేయగా, ఏడాది నిర్మాణ కాలంలో 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ ఏటా 200 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏటా 1.6 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్ణిత సమయానికి పూర్తి చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్ ఆదేశించారు. సీఎం కార్యక్రమం ఏర్పాట్లపై విద్యుత్ సౌధలో సోమవారం ఆయన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి, అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సహాయ సహకారాలతోనే వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు ఇవ్వగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి. మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ. పధ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ, సీఈఓ కమలాకర్ బాబు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పెరిగిన విద్యుత్ వినియోగం కనపడదా!?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు నిరంతరం కోతలు లేకుండా సరఫరా చేయడం కూడా తప్పే అన్నట్లుగా ఉంది రామోజీ తీరు చూస్తుంటే. ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం.. దానివల్ల విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిన విషయం కళ్లకు కనిపిస్తున్నా ఆయన ఇవేమీ పట్టనట్లు అడ్డగోలుగా రాసిపారేస్తూ జనం మెదళ్లను కలుషితం చేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ఈ పెరుగుదల వ్యవసాయ, గృహ విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా.. ‘ప్రజలపై మరో రూ.1,723 కోట్ల భారం’ అంటూ ఆదివారం ఈనాడు పెట్టిన రంకెల్లో ఎప్పటిలాగే ఏమాత్రం పసలేకపోగా అదంతా పూర్తి ఊహాజనితమని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ. పృథ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు కొట్టిపడేశారు. ఈ మేరకు వారు ‘సాక్షి’కి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. వర్షాభావంతో అదనంగా వినియోగం.. నిజానికి.. ఈ ఏడాది వాతావరణంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితులవల్ల వర్షాభావం, తీవ్ర ఎండ, ఉక్కపోతతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. ఈ పెరుగుదల వ్యవసాయ విద్యుత్ రంగంలోను, గృహ విద్యుత్ రంగంలోను స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు వినియోగం దాదాపు 10–31 శాతం వరకు ప్రతి నెలా అదనంగా నమోదవుతోంది. అలాగే, గతేడాది మార్చి నుంచి అక్టోబరు కాలానికి జల విద్యుదుత్పత్తి దాదాపు 3 వేల మిలియన్ యూనిట్లు ఉంటే ఈ సంవత్సరం అది కేవలం 1,260 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. ఇది దాదాపు 60 శాతం తక్కువ. సాధారణంగా ఏటా వినియోగం 7–8 శాతం వరకూ పెరగవచ్చని భావించి ముందస్తు విద్యుత్ సేకరణ ప్రణాళిక తయారుచేస్తారు. కానీ, డిమాండ్ అనుకున్న దానికంటే ఎక్కువగా పెరగడం, దీర్ఘకాలిక వనరులనుంచి లభ్యత అనుకున్నంత రాకపోవడంవల్ల విద్యుత్ కొనుగోళ్లు అనివార్యమయ్యాయి. సర్కారు ముందుచూపు.. ఇలా నెలవారీ విద్యుత్ డిమాండ్‌లో మునుపెన్నడూ లేనంత పెరుగుదలను గమనించి రాబోయే 7నెలల కాలానికి (సెపె్టంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు) వెయ్యి మెగావాట్ల కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆ«దీనంలోని డీప్ ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా ఆగస్టులోనే టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియలో రివర్స్ ఆక్షన్ కూడా పూర్తయ్యాక మనకు కావలసిన విద్యుత్ పరిమాణం లభించేంత వరకు అంటే బిడ్లలో పిలిచిన వెయ్యి మెగావాట్ల వరకు నిబంధనల ప్రకారం వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, ట్రేడర్లకు కొనుగోలు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నెలలో మొత్తంగా ఒకశాతం వరకు విద్యుత్ కొనుగోలును తగ్గించుకునే అవకాశం ఈ టెండర్లలో ఉంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా నిబంధనలకు లోబడి చేపట్టారు. ఎవరైనా సరే ఈ వివరాలు పోర్టల్ వెబ్సైట్ ద్వారా కానీ, దరఖాస్తు ద్వారా కానీ పొందవచ్చు. పరిమితులు, నియంత్రణ లేవు ఇక స్వల్పకాలిక కొనుగోళ్లకు సంబంధించి ప్రతీ యూనిట్‌కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతి ఉంది. మండలి నిర్దేశించిన ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు నిబంధన నియమావళి ప్రకారం.. ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి ఈ అదనపు వ్యయం సర్దుబాటు ఏదైనా ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం పూర్తయ్యాక విద్యుత్ కొనుగోలులో ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగానికి సంబంధించి జరిగిన అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయం లెక్కించి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం మొత్తం విద్యుత్‌కు కటకటలాడుతుండగా రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం వినియోగదారులకు ఎలాంటి వినియోగ పరిమితి, నియంత్రణలు అమలుచేయకుండా వారి డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేస్తున్నాయి. కానీ, రామోజీకి ఇవన్నీ తెలియనివి ఏమీకాదు. తన ఆత్మబంధువు చంద్రబాబును ఉన్నపళంగా సీఎం కుర్చిలో కూర్చోబెట్టడమే ఆయన లక్ష్యం. అందుకే రోజూ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తన విషపుత్రిక ఈనాడులో నిత్యం విషం కక్కుతున్నారు. అంతే..! ఇవ్వకపోతే అలా.. ఇస్తే ఇలానా రామోజీ..? ఎప్పుడైనా ఒకసారి కరెంట్ ఇవ్వకపోతే కోతలు ఎక్కువైయ్యాయంటూ గగ్గోలు పెడతారు. అదే నిరంతరాయంగా సరఫరా చేస్తే అధిక మొత్తం పెట్టి కొనేస్తున్నారంటూ నానా యాగీ చేస్తారు. ఇదెక్కడి నీతి రామోజీ. నిజానికి.. మార్కెట్లో విద్యుత్ రేటు ఎంత ఉంటే అంతకు కొనితీరాల్సిందే. ఏ రాష్ట్రానికైనా ఇదే పరిస్థితి. ఎక్కువ రేటు, తక్కువ రేటు అన్నది మన చేతిలో ఉండదు కదా.. అవసరమైనప్పుడు ఎవరైనా మార్కెట్ రేటును చెల్లించి కొనాల్సిందే.. అదే అవసరంలేనప్పుడు ఎవరూ కొనరు. టెండర్లు కూడా చాలా పారదర్శకంగా నిర్వహిస్తారు. మన ఒక్కరి కోసం రేట్లు పెంచడం లేదా తగ్గించడం అనేది ఉండదు. ఇదంతా మీకు తెలీదా!? చంద్రబాబు అధికారంలో లేడన్న ఒకే ఒక్క కారణంతో ఇంత అడ్డగోలుగా.. దారుణంగా పిచ్చి రాతలు రాసిపారేస్తారా ఏంటి రామోజీ..? 22% పెరిగిన గ్రిడ్ విద్యుత్ వినియోగం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, ఆదేశాల ప్రకారం.. ఇంతటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో కూడా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలనే భావనతో, స్వల్పకాలిక మార్కెట్లో నిబంధనలకు లోబడి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుత నవంబరులో కూడా రికార్డు స్థాయిలో రోజువారీ విద్యుత్ వినియోగం 220 మిలియన్ యూనిట్ల వరకు నమోదవుతోంది. కిందటి ఏడాది నవంబరులో ఇదే కాలానికి సరాసరి విద్యుత్ వినియోగం దాదాపు 180 మిలియన్ యూనిట్లుగా వుంది. అలాగే, కిందటి సంవత్సరంతో పోలిస్తే గ్రిడ్ విద్యుత్ వినియోగం పెరుగుదల దాదాపు 22 శాతం. ఈ పరిస్థితుల్లో కూడా రోజుకి దాదాపు 50 మిలియన్ యూనిట్లను స్వల్పకాలిక మార్కెట్ నుండి కొనాల్సి వస్తోంది. ఇందులో దాదాపు 20 మిలియన్ యూనిట్లు ఆగస్టులో చేపట్టిన టెండర్ల ప్రక్రియ ద్వారా సమకూరుతోంది. ఇలా దేశవ్యాప్తంగా నెలకొన్న విద్యుత్ కొరత పరిస్థితుల కారణంగా వాటిని అధిగమించడానికి తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ముందస్తుగా ఈ స్వల్పకాలిక ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాయి. రోజువారీ వివిధ వనరుల నుంచి అందుబాటులో వున్న విద్యుత్‌ను గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా డిస్కంలు బేరీజు వేసుకుంటున్నాయి. గ్రిడ్ డిమాండ్ బాగా పడిపోయిన రోజుల్లో రోజువారీగా దాదాపు 50శాతం వరకు విద్యుత్ సేకరణ నిలుపుదల, బ్యాక్‌డౌన్ చేసి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. విద్యుత్ ఎక్సే్చంజీల్లో విద్యుత్ కొంటే ఈ బ్యాక్‌డౌన్ సౌకర్యం అందుబాటులో ఉండదు. -
ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు. ‘‘విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆర్డీఎస్ఎస్ రీ వ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పై చర్చించాం. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఈ పథకానికి ఏపీ అర్హత పొందింది. నిధులు అందిస్తాం’’ అని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నారు. చదవండి: స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ -
నిధులు అడగొద్దని మాకేం చెప్పలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ రంగాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్తం చేసి గాలికొదిలేసింది. టీడీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదుకుంది. రైతులతోపాటు వివిధ వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మన విద్యుత్ సంస్థలను ఆదర్శంగా తీసుకునేలా రాష్ట్ర విద్యుత్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులను, రికార్డులను సొంతం చేసుకుంటోంది. అలాంటి విద్యుత్ సంస్థలకు ‘కోతలు వద్దు.. నిధులు అడగొద్దు’ అని ప్రభుత్వం చెప్పినట్టుగా ఈనాడు పత్రిక బుధవారం ఓ కథనాన్ని వండివార్చింది. ఈ ఎల్లో కథనాన్ని ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. ‘ఈనాడు’ అచ్చేసినట్లు నిధులు అడగొద్దని ప్రభుత్వం తమకేమీ చెప్పలేదని తేల్చిచెప్పారు. వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు ముగ్గురు సీఎండీలు బుధవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే... ♦ ఈనాడు తన కథనంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను నిధులు అడగొద్దు అని చెప్పినట్లుగా పేర్కొనడాన్ని ఖండిస్తున్నాం. ఈ కథనం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం ఇవ్వాల్సిన ఆర్థిక మద్దతును ఎప్పటికప్పుడు ఇస్తూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ భాగానికి (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) దాదాపు రూ.6 వేల కోట్లను ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ రూపంలో ఇవ్వాల్సి ఉండగా ఆ మొత్తాన్ని ఇప్పటికే పూర్తిగా చెల్లించింది. ♦ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వినియోగదారులకు 24 గంటల విద్యుత్ అందించడం డిస్కంల బాధ్యత. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రావలసినంత విద్యుత్ రాకపోవడం, ఈ సీజన్లో మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, వేసవి ఎండలతో ఉక్కపోత వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వినియోగదారులు వాడుతున్నదానికి తగ్గట్టు విద్యుత్‌ను సమకూర్చుకోవాలి. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంత ధరైనా వెచ్చించి స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సి వచ్చింది. ఈ కొనుగోళ్లు అన్ని పారదర్శక పోటీ బిడ్డింగ్ విధానంలో విద్యుత్ ఎక్సే్ఛంజ్‌ల ద్వారా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డీప్ (డీఈఈపీ) ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా జరిగాయి. ♦ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన సమయానికి (అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు) విద్యుత్ సరఫరాలో ఏవిధమైన అంతరాయాలు లేకుండా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) సూచనల మేరకు దాదాపు 3,830 మిలియన్ యూనిట్లను స్వల్పకాలిక కొనుగోలు ద్వారా సేకరించడానికి ప్రణాళిక రూపొందించాం. ♦ ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీలు అనేవి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం వసూలు చేస్తున్నాం. నెలవారీ అదనపు విద్యుత్ కొనుగోలు వ్యయం ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం యూనిట్ రూ.0.40 వరకే వసూలు చేసుకోవడానికి కమిషన్ అనుమతినిచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ సర్దుబాటు చార్జీలు వినియోగదారుల విద్యుత్ బిల్లుల్లో కనిపిస్తున్నాయి. -
తప్పుడు ప్రచారం చేస్తే రుణాలు ఆపేస్తాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై విద్యుత్ రంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తే.. రుణాలు, సబ్సిడీలు ఆపేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్. కె.సింగ్ హెచ్చరించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ విషప్రచారం చేస్తున్నారని, వ్యవసాయ పంపుసెట్లకు మినహా అన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. విద్యుత్ సంస్థల ఆడిట్ నివేదికలు, ఎనర్జీ ఆడిట్ ఎప్పటికప్పుడు చేయించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు రుణాలు చెల్లించే స్థితిలో లేవని తమకు సమాచారం అందిందని మంత్రి తెలిపారు. గురువారం ఇక్కడ మంత్రి ఆర్.కె. సింగ్, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, విద్యుత్ శాఖ సహాయ మంత్రి క్రిషన్‌పాల్ గుర్జర్లు ‘విద్యుత్ శాఖ’పై ఏర్పాటైన పార్లమెంట్ సభ్యుల కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్.కె. సింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) రూ.1.57 లక్షల కోట్ల రుణం మంజూరు చేస్తే అందులో ఇప్పటికే రూ. 1.38 లక్షల కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.1.10 లక్షల కోట్లు మంజూరు అయితే.. రూ.91 వేల కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తుంది..: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తుందని కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఒక్కొక్కటి 800 మెగావాట్ల రెండు యూనిట్లు సిద్ధమయ్యాయని, ఈనెల 26న ఒక యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తుందని, మరొకటి డిసెంబర్లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. వీటిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ఎన్టీపీసీ కోరినా స్పందించడం లేదన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోయినా ఎన్టీపీసీ ఒక్కొక్కటీ 800 మెగావాట్లుగల మూడు యూనిట్లను నిర్మిస్తుందని తేల్చి చెప్పారు. కాగా, దేశం మొత్తాన్ని ఒకే గ్రేడ్ కిందకు తీసుకువచ్చి 1.97 లక్షల కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లు వేసినట్లు చెప్పారు. తద్వారా దేశంలో ఏకకాలంలో 1.20 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరఫరా చేస్తే సామర్థ్యం ఏర్పడిందని మంత్రి వివరించారు. -
బాబు షాక్ ఖరీదు రూ.94 వేల కోట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : విద్యుత్తు రంగంలో గత సర్కారు అడ్డగోలు ఒప్పందాలు, తప్పిదాలు రాష్ట్రానికి శాపంగా మారాయి. దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో ఇష్టారాజ్యంగా చేసుకున్న ఒప్పందాలు (పీపీఏ) గుదిబండలా పరిణమించాయి. సరిగ్గా చెప్పాలంటే అదే రేటుతో ఇప్పుడు ఒప్పందం చేసుకుంటే వినియోగదారులపై దాదాపు రూ.లక్ష కోట్ల భారం పడేది! సాధారణంగా సౌర, పవన విద్యుదుత్పత్తి వ్యయం తొలి పదేళ్లు స్థిరంగా కొనసాగి తరువాత నుంచి క్రమంగా తగ్గుతుంది. టీడీపీ సర్కారు మాత్రం వినియోగదారుల నడ్డి విరిచేలా పాతికేళ్ల పాటు అధిక ధరకు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం దారుణమని విద్యుత్తు రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ జరిగింది... టీడీపీ హయాంలో 2014–2019 మధ్య ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు రూ.5.98 చొప్పున చెల్లించాలి. రెండో ఏడాది నుంచి ఏటా మూడు శాతం చొప్పున పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగుతుంది. పదో ఏడాది నాటికి ఒక్కో యూనిట్ కొనుగోలుకు రూ.7.8025 చొప్పున చెల్లించాలి. పదో ఏడాది చెల్లిస్తున్న ధరనే ఒప్పంద కాలం ముగిసే వరకు అంటే 25వ సంవత్సరం దాకా చెల్లించేలా గత సర్కారు ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం తొలి ఏడాది యూనిట్ రూ.5.98 చొప్పున 464 మెగావాట్లకుగాను రూ.365.89 కోట్లు చెల్లించాలి. ఏటా 3 శాతం చొప్పున పెంచడం వల్ల పదో ఏడాది రూ.477.41 కోట్లు చెల్లించాలి. వెరసి 25 ఏళ్లకు గాను కేవలం 464 మెగావాట్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.10,978 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇలా ఆదా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గత నెలలో ఏపీ జెన్కో, ఎన్‌హెచ్‌పీసీ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. మొత్తం రూ.25,850 కోట్ల పెట్టుబడుల ద్వారా 5,314 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 5,300 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో యూనిట్‌కు రూ.2.49 చొప్పున 25 ఏళ్ల పాటు చెల్లిస్తారు. 5,134 మెగావాట్లకు గాను పాతికేళ్లకు ప్రభుత్వం చెల్లించే మొత్తం కేవలం రూ.16,425 కోట్లు మాత్రమే. అంటే ఒక్కో యూనిట్ గత సర్కారు హయాంతో పోలిస్తే సగం కంటే తక్కువ ధరకే లభించడంతోపాటు రూ.వేల కోట్లు ఆదా అయ్యాయి. టీడీపీ పాలనలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం చెల్లిస్తే విద్యుత్తు వినియోగదారులపై అక్షరాలా రూ.94 వేల కోట్ల మేర అదనపు భారం పడేది. పాలకులు ముందుచూపుతో వ్యవహరిస్తే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలే రుజువు చేస్తున్నాయి! ఊరూ.. పేరూ ఒకటే! 464 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా నిమిత్తం ఎస్పీడీసీఎల్ 15 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఇందులో విచిత్రం ఏమిటంటే తొమ్మిది కంపెనీల రిజిస్టర్డ్ ఆఫీసు, కార్పొరేట్ ఆఫీసుల చిరునామా ఒకటే కావడం గమనార్హం. అంతేకాదు.. ఐదు కంపెనీలలో ముగ్గురు కామన్ డైరెక్టర్లుగా ఉండటం మరో విచిత్రం. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, కొందరు డైరెక్టర్లు కనీసం ఐటీ రిటర్నులు కూడా దాఖలు చేయకపోయినా రూ.కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చూపడం మరో విశేషం. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడికి చెందిన కంపెనీలు కూడా వీటిలో ఉండటం పరిశీలనాంశం. ఎల్లో మీడియా ఇవన్నీ దాచిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే యత్నం చేయటాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. -
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేం
హఫీజ్‌పేట్: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేమని, ఇంజినిరింగ్ ఫీల్డ్ ఎంతో విలువైనదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) ప్రాంగణంలో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ–20 సమ్మిట్, అంతర్జాతీయ సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంజినీర్లు భారతదేశంతోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి వారికి అందరికీ అందేలా చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలన్నారు. ఇంజినీరింగ్ రంగంలో ఉండే వాళ్లు మొదట వారి అమ్మను సంతోషపరిచేలా చేస్తే దేశాన్ని కూడా సంతోషపరిచేలా చేస్తారన్నారు. 2030 నాటికి విద్యుత్‌కు ప్రత్యామ్నాంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్నారు. ప్రతియేటా దశాబ్దాలుగా విద్యుత్ రంగంలో 50 మిలియన్ కొత్త కనెక్షన్లు అందిస్తున్నామని, ఇవి మరింత పెరిగేలా చూడాలన్నారు. విద్యుత్‌కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతుందన్నారు. 2070 ఎనర్జీ డిమాండ్ గణనీయంగా పెరగడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం సంతోషించదగ్గవిషయమని, 70 నుంచి 80 శాతం విద్యుత్‌ను సోలార్ ద్వారా వినియోగించేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. భారత దేశం ఆర్థిక రంగం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మరింత పటిష్టంగా మారుతోందన్నారు. చంద్రుడిపై అడుగిడడం కూడా శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల పాత్ర మరువలేనిదని, అందరినీ అభినందిం చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు బ్రోచర్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అధ్యక్షుడు శివానంద్ రాయ్, ఆర్టనైజింగ్ కమిటీ చైర్మన్ పి సూర్యప్రకాశ్, ‘ఎస్కీ’ డైరెక్టర్ డాక్టర జి రామేశ్వరరావు ప్రసంగించారు. తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కీరిట్పారిఖ్, ఐఈఐ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఐ సత్యనారాయణరాజు, సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ ప్రొగ్రెస్ సీనియర్ ఫెల్లో రాహుల్టాంగియా,రీ సస్టేనబిలిటీ లిమిటెడ్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర పీజీ శాస్త్రి, హడ్కో సీఎండీ వి సురే‹Ù, ప్రణాళికాసంఘం మాజీ కమిషనర్ అశోక్‌కుమార్ జైన్ పాల్గొన్నారు. -
అర్హతే ప్రామాణికంగా కరెంట్ సబ్సిడీ
-
పుష్కలంగా కరెంటు
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేసింది. కోవిడ్ కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయించిన ఈ యూనిట్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో చైర్మన్ కె.విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు శుక్రవారం ఉదయం ‘లైట్ అప్’ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆగస్టు నాటికి దీనిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరుగుతుంది. తగ్గనున్న కొనుగోళ్లు ఏపీ జెన్కో ప్రస్తుతం 5,810 మెగావాట్ల థర్మల్, 1773.6 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. లోయర్ సీలేరులో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం రెండు అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్‌కి అందుబాటులోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్ పవర్ హౌస్ సామర్థ్యాన్ని కూడా 120 నుంచి 150 మెగావాట్లకు పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునర్నిర్మించాలని కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వేసవిలో ఎనిమిదేళ్ల తరువాత అనూహ్యంగా డిమాండు పెరిగినప్పటికీ ఏపీ జెన్కో రోజూ సగటున 105 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. రాష్ట్ర మొత్తం వినియోగంలో 40 నుంచి 45 శాతం విద్యుత్ ఏపీ జెన్కో నుంచే వస్తోంది. కొత్తగా లైట్‌అప్ చేసిన యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే రోజూ మరో 15 నుంచి 20 మిలియన్ యూనిట్లను జెన్కో అదనంగా సరఫరా చేస్తుంది. జెన్కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత మేరకు పెరిగితే అంత మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలును డిస్కంలు తగ్గించుకోవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలు విజయానంద్ గత ఏడాది కాలంలో 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యం గల రెండు యూనిట్లు అందుబాటులోకి రావడం ఏపీ జెన్కో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలని జెన్కో చైర్మన్ విజయానంద్ చెప్పారు. ఎన్టీటీపీఎస్ నూతన యూనిట్‌ను ‘లైట్‌అప్’ చేశారు. ముందుగా బాయిలర్‌లో నీటి ద్వారా స్టీమ్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో స్టీమ్ రీడింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేసి ఇంజినీర్లను అభినందించారు. ఆవిరి ప్రక్రియ పూర్తి స్థాయికి చేరగానే బొగ్గు ద్వారా స్టీమ్ రీడింగ్ పెరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల స్టేజ్–2 యూనిట్‌ను గతేడాది అక్టోబర్ 27న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్‌ను ఆగస్టు నాటికి కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)కి వీలుగా సిద్ధం చేయాలని బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు సూచించారు. ట్రయల్ రన్లో వచ్చే లోటుపాట్లను సరిదిద్దుకుని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని జెన్కో ఎండీ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖర్‌రాజు (థర్మల్), బి.వెంకటేశులురెడ్డి (ఫైనాన్స్), సయ్యద్ రఫీ (హెచ్ఆర్, ఐఆర్), సత్యనారాయణ (హైడల్), అంథోనీ రాజ్ (కోల్) తదితరులు పాల్గొన్నారు. -
Fact Check:చట్ట ప్రకారమే చెల్లింపులు
సాక్షి, అమరావతి : ఒకసారి విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిన తరువాత ఒప్పంద కాలానికి కొనుగోలు చేసినా, చేయకపోయినా, ఆ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేసినా, చేయకపోయినా స్థిర ఛార్జీలు అనేవి భరించాల్సిందే. వీటిలో ముఖ్యంగా సిబ్బంది జీతభత్యాలు, అప్పు మీద వడ్డీ, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు, యంత్రాల అరుగుదల, తరుగుదల వంటివి ఉంటాయి. ఈ విషయం విద్యుత్ రంగంపై కనీస అవగాహన ఉన్న వారెవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ, తమవి అత్యున్నత విలువలని గొప్పలు చెప్పుకునే ఈనాడు దినపత్రికకు మాత్రం ఈ విషయం తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన ధ్యేయంగా తప్పుడు కథనాలను నిత్యం వండి వారుస్తోంది. దానిలో భాగంగానే ‘హిందుజాకు దోచిపెట్టింది రూ.1,234 కోట్లు’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. అందులో అసలు నిజాలను ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె పద్మజనార్థనరెడ్డిలతో కలిసి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం విద్యుత్ సౌథలో మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈనాడు అబద్ధాల వెనుక నిజానిజాలిలా ఉన్నాయి.. ఒప్పందాలు ఇప్పటివి కాదు.. హిందూజ సంస్థతో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కొందరు దు్రష్పచారం చేస్తున్నారు. ఈ హిందుజా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) మొదటిసారి 1994లోనే అప్పటి ఎలక్ట్రిసిటీ బోర్డుతో జరిగింది. తరువాత దానిని సవరించి 1998లో 1,040 మెగావాట్ల పవర్ ప్లాంట్ కడతామని ఒప్పందం చేసుకున్నారు. 2001 నాటికి ఆ పీపీఏ గడువు ముగిసింది. తర్వాత వారు మళ్లీ ప్రభుత్వాన్ని సంప్రదించి, మర్చంట్ పవర్ ప్లాంట్కైనా వెళ్తామని అమమతి కోరారు. 2010లో మెగావాట్‌కు రూ.5.33 కోట్లు చొప్పున రూ.5,545 కోట్లతో ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారించారు. వివిధ కారణాలతో విద్యుత్ కేంద్రం నెలకొల్పడంలో జాప్యం జరిగింది. హిందూజా రాకపోయినా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి 2011లో 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి, యూనిట్ రూ.3.60 చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకుంది. 2013లో హిందూజాతో ఒక మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్‌ను ప్రభుత్వం కుదుర్చుకుంది. కానీ, 2014లో పీపీఏ ప్రకారం హిందూజా సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయలేకపోయింది. దీంతో 2016 జనవరిలో మొదటి యూనిట్, జూలైలో రెండవ యూనిట్లో ఈ విద్యుత్ కేంద్రం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. 2016 ఆగస్టులో ఏపీఈఆర్సీ హిందూజా టారిఫ్‌ను యూనిట్ రూ.3.82గా నిర్ణయించి, ఏటా 2,828 మిలియన్ యూనిట్లు తీసుకోవాలని డిస్కంలకు చెప్పింది. రూ.5,623 కోట్లు ఫిక్స్డ్ చార్జీలుగా నిర్ధారించింది. టీడీపీ అనాలోచిత నిర్ణయం ఫలితమే.. ఈ నేపథ్యంలో.. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం నుంచి వైదొలగాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నిర్ధేశించింది. దానికి అనుగుణంగా ఈ ఒప్పందం వద్దని డిస్కంలు చేసిన అభ్యర్ధనకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఈ ఒప్పందంపై న్యాయ పోరాటం, చిక్కులు ప్రారంభమయ్యాయి. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (ఆప్టెల్)ను హిందూజా ఆశ్రయించింది. ట్రిబ్యునల్ టీడీపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆ తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అంతిమంగా ఫిబ్రవరి 2022లో సుప్రీంకోర్టు ‘ఈ ఒప్పందం రద్దు కుదరదు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టినప్పటి నుంచి అమలులో వున్నట్లే’ అని తీర్పునిచ్చింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హిందూజాకు స్థిర చార్జీలు చెల్లించక తప్పని పరిస్థితి. నిజానికి.. ఇన్ని రోజులు హిందుజా విద్యుత్ కేంద్రం అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి విద్యుత్ తీసుకోలేకపోవటానికి కారణం గత ప్రభుత్వం 2018లో తీసుకున్న లోపభూయిష్ట నిర్ణయమే. టీడీపీ ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకోకపోయి ఉంటే, హిందూజా నుంచి విద్యుత్ తీసుకుని ఆ మేరకు చెల్లింపులు చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు విద్యుత్ తీసుకోకుండానే చార్జీలు చెల్లించాల్సి రావడం గత ప్రభుత్వ పాప ఫలితమే. అంతేగాని.. ఉత్తుత్తి విద్యుత్‌కు ప్రభుత్వం డబ్బులు కట్టిందన్న మాటలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అదీగాక.. 2022 మార్చి తర్వాత హిందూజా సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1,040 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసింది. రాష్ట్రానికి అదనంగా 15 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా అవుతోంది. చట్టప్రకారమే అనుమతి.. అప్పీలెట్ ట్రిబ్యునల్ వారి ఉత్తర్వుల్లో హిందూజా టారిఫ్‌ను స్థిర, చర ఛార్జీలుగా విభజించమని ఆదేశాలిచ్చింది. వాటి ప్రకారం కమిషన్ అప్పటి తాత్కాలిక (ఆడ్హాక్) చార్జీ అయిన యూనిట్ రూ.3.82ను స్థిరచార్జీ రూ.1.06గాను.. చరచార్జీ రూ.2.76గాను విభజించింది. దీని ముఖ్యోద్దేశ్యం.. మెరిట్ ఆర్డర్ సూత్రాలను ఈ విద్యుత్ కేంద్రానికి అమలుపరచడమే. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆగస్టు 2022లో ఇచ్చిన తుది ఉత్తర్వుల్లో అప్పటికున్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఇంతకుముందు నిర్ణయించిన తాత్కాలిక (అడ్‌హక్) చార్జీయే 2016 నుంచి 2022 ఆగస్టు వరకు వర్తిస్తుందని చెప్పింది. టారిఫ్ అప్పటికే రెండు భాగాలుగా విభజించినందున ఇందులో స్థిరఛార్జీ చెల్లింపు అన్నది భాగమే కాబట్టి కమిషన్ నిర్ణయం మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరంలేదు. హిందుజాకు స్థిరఛార్జీల బకాయిలు వాళ్ల ఉత్పత్తి అందుబాటు ప్రకటనలను బట్టి చెల్లించాలని అడ్వొకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖా కార్యదర్శి, న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌గుప్తా విద్యుత్ పంపిణీ సంస్థలకిచ్చిన న్యాయ సలహాలో ధ్రువీకరించారు. సుప్రీంకోర్టు, అప్పీలేట్ ట్రిబ్యునల్, ఏపీఈఆర్సీ ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులు, ఎలక్ట్రిసిటీ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ప్రభుత్వం డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆలస్య చెల్లింపు సర్‌చార్జీ (ఎల్పీఎస్ ) స్కీం నిబంధనలకు లోబడి, హిందుజాకు రూ.1,234 కోట్లు స్థిర చార్జీలను చెల్లించడానికి అనుమతినిచ్చింది. ‘ఈనాడు’ అవగాహనా రాహిత్యం.. హిందుజాపై సుప్రీంకోర్టు, అప్పీలేట్ ట్రిబ్యునల్, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన తుది తీర్పుల ప్రకారం హిందూజా విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం అమలు చేయాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వంపైన, డిస్కంలపైన ఉంది. నిజానికి.. హిందూజా దాదాపు రూ.2,401 కోట్లకు అర్జీ పెట్టినప్పటికీ సాంకేతిక, న్యాయపరమైన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కోల్ ఎంత ఉంది, ఆ రోజు నార్మేటివ్ అవైలబిలిటీ ఎంత అనేది ప్రతి యూనిట్ ప్రకారం అన్ని స్థాయిల్లోనూ రోజువారీగా క్షుణ్ణంగా పరిశీలించి చివరికి వారికి మొత్తం రూ.1,234 కోట్లు చెల్లించాలని లెక్కించాం. ఈ చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో జరిగాయి. కాబట్టి, ఈ వివరాలు కమిషన్‌కు ఆర్థిక సంవత్సరం 2022–23 నాల్గవ త్రైమాసికానికి డిస్కంలు సమర్పించే ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు నివేదికలో నిబంధనల ప్రకారం పొందుపరుస్తాయి. వాస్తవాలిలా ఉంటే.. ఈ నిజాలను గాలికొదిలేసి, విద్యుత్ తీసుకోని కాలానికి స్థిరఛార్జీలు హడావిడిగా చెల్లించేశారని, కనీసం కమిషన్ అనుమతి తీసుకోలేదని ఈనాడు రాయడం పూర్తిగా అవగాహనా రాహిత్యం. విషయంపట్ల తగినంత పరిజ్ఞానం, ఏపీఈఆర్సీ ఇచ్చిన వివిధ నిబంధనలు, నియమావళి గురించి అవగాహన లేకుండా అబద్ధాలు అచ్చేశారు. -
ఆర్థిక పటిష్టత ప్రాతిపదికనే ఎల్ఓసీలు
న్యూఢిల్లీ: తమ ఆర్థిక పటిష్టత, శక్తిసామర్థ్యాల ప్రాతిపదికనే ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్‌యూ) ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ను జారీ చేయాలని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఎల్ఓసీల జారీ విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరుతూ చమురు, విద్యుత్ రంగంలోని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కోరిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. సొంత ఆర్థిక బలం ఆధారంగా ఎల్ఓసీల జారీ సాధారణ వ్యాపార ఆచరణలో ఒక భాగం. ఇది సంస్థలు వాటి క్యాపెక్స్ లేదా వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం పోటీ రేట్ల వద్ద నిధులను సమీకరించుకోడానికి అలాగే జాయింట్ వెంచర్లు లేదా అనుంబంధ సంస్థలు లేదా గ్రూప్ కంపెనీల వ్యాపార ప్రయోజనాలను పరిరక్షించుకోడానికి దోహదపడుతుంది. ఇన్ఫ్రా ప్రాజెక్టుల కోసం నిధుల టై–అప్ కోసం బ్యాంకులకు ’లెటర్ ఆఫ్ కంఫర్ట్’ (ఎల్ఓసీ) జారీ చేయడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) గత సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
సంప్రదాయం నుంచి.. స్వచ్ఛత వైపు.. 2029–30 నాటికి లక్ష్యం 64 %
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రగతికి కీలకమైనది విద్యుత్ రంగం. కాగా ఒకప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదనకే ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. దశాబ్దన్నర కిందటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతలు మారుతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణంలో మార్పులు నేపథ్యంలో విద్యుదుత్పాదన సంప్రదాయ విధానం నుంచి సంప్రదాయేతర విధానం వైపు మారుతోంది. బొగ్గుతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న భారత్ పుష్కరకాలంగా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదనకే మొగ్గు చూపుతోంది. సంప్రదాయేతర విద్యుత్‌కే మొగ్గు దేశంలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లకు మొత్తం 3,79,515 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామ ర్థ్యం ఉంది. వీటిలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 2,04,435 మెగావాట్లు (49.7%) కాగా, పవన, సౌర విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 1,21,550 మెగావాట్లు (29.5%). అయితే ఈ సౌర, పవన విద్యుత్ కేంద్రాలు గత దశాబ్దన్నర కాలంగా వచ్చినవే కావడం గమనార్హం కాగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కూడా తన ప్రధాన ఉత్పాదన అయిన థర్మల్ నుంచి సోలార్ వైపు అడుగులేస్తుండటం కీలక పరిణామం. ప్రస్తుతం సంప్రదాయేతర విద్యుదుత్పాదన మొత్తం 42.5 శాతం కాగా, దీనిని 2029–30 నాటికి ఏకంగా 64 శాతానికి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంప్రదాయ (బొగ్గు, లిగ్నైట్, గ్యాస్, డీజిల్ ఆధారిత) అయితే, మరొకటి సంప్రదాయేతర (జల, పవన, సౌర, బయోమాస్, అణు) విద్యుత్. సంప్రదాయ విద్యుత్‌లో కూడా..దేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న నేపథ్యంలో అత్యధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలే ఉండేవి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అయినా.. వాటికి సరిపడా గ్యాస్ లభ్యత లేని కారణంగా నామమాత్రంగా తయారయ్యాయి. ఇక సంప్రదాయేతర ఇంధనంలో ఒకప్పుడు ప్రధానంగా జల ఆధారిత, స్వల్పంగా బయోమాస్‌తో విద్యుదుత్పాదన జరిగేది. డ్యామ్‌లు, రిజర్వాయర్లు ఉన్నచోట మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. ఇది కూడా వర్షాలపై ఆధార పడి ఉండడంతో.. రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువైన సమయంలో విద్యుత్ ఉత్పాదన సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే పవన, సౌర విద్యుత్ తెరపైకి వచ్చాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదన స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ ఇంధనాల కంటే సుస్థిర, పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడమే సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. పడిపోతున్న థర్మల్ ఉత్పాదన సామర్థ్యం.. థర్మల్ విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పాదన సామర్థ్యంలో తగ్గుదల నమోదు అవుతోంది, ఇందుకు ప్రధాన కారణాల్లో బొగ్గు కొరత ఒకటైతే, స్టేషన్ల బ్యాక్‌డౌన్ (వినియోగం తక్కువగా ఉన్న ప్పుడు లేదా సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదన అధికంగా ఉన్నప్పుడు, థర్మల్ కేంద్రాల ఉత్పత్తి నిలిపివేయడం/ తగ్గించడం) మరొకటి. యంత్రాల కాలపరిమితి ముగిసినా అలాగే ఉత్పత్తి చేయడం, బొగ్గులో నాణ్యత లోపించడం వంటి అంశాలతో ఉత్పాదన ఈ సామర్థ్యం తగ్గుతోంది. తాజాగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారం 57.69 శాతం విద్యుత్ ప్లాంట్లు మాత్రమే తమ స్థాపిత సామర్థ్యంలో 35 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయని, మిగిలిన 42.31 శాతం విద్యుత్ ప్లాంట్లు 35 శాతం కంటే తక్కువ ఫీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో నడుస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల, ప్రభుత్వ రంగ సంస్థల్లోని థర్మల్ కేంద్రాలు మాత్రం ఏకంగా 90% పీఎల్‌ఎఫ్‌తో పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా.. సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటులో తెలంగాణ, ఏపీ వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో పవన విద్యుత్ 4,096.95 మెగావాట్లు, సౌర విద్యుత్ 4,390.48 మెగావాట్లు, భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు1,610 మెగావాట్లు, బయోమాస్ 566 మెగావాట్లు, స్మాల్హైడ్రో 162 మెగావాట్లుగా ఉంది. కాగా తెలంగాణలో 5748 మెగావాట్ల సౌర విద్యుత్, 128 మెగవాట్ల పవన విద్యుత్ , 287 మెగావాట్ల రూఫ్‌టాప్, 2381.76 మెగావాట్ల జల విద్యుత్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమలదే సింహభాగం.. పారిశ్రామిక రంగ అభివృద్ధి ముఖ్యంగా విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంది. దేశంలో విద్యుత్ వినియోగంలో సింహభాగం పరిశ్రమల రంగానిదే. అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం తక్కువే. అధికార గణాంకాల ప్రకారం ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పరిశ్రమల రంగానికి 41.36%, గృహావసరాలకు 26.89% , వ్యవసాయానికి 17.99 శాతం, వాణిజ్య అవసరాలకు 7.07% వినియోగిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,255 యూనిట్లుగా ఉంది. -
ఏపీలో విద్యుత్ నష్టాలు తక్కువ
సాక్షి, అమరావతి: ప్రజలకు మెరుగైన సేవలందించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ ముందంజలో నిలుస్తోంది. ఆ కోవలోనే విద్యుత్ రంగంలో విప్లవాత్మక చర్యలను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడమేగాక జాతీయస్థాయిలో అవార్డులు అందుకుంటోంది. తాజాగా టెక్నికల్, కమర్షియల్ (ఏటీసీ) నష్టాలను తగ్గించడంలో ఏపీ ముందంజలో నిలిచి కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది. అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో బుధవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వర్చువల్‌గా సమీక్షించారు. రాష్ట్రాల వారీగా విద్యుత్ సంస్థల పనితీరు, రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) పురోగతిపై చర్చించారు. ఆర్డీఎస్ఎస్లో ప్రధానంగా పరిగణించే ఏటీసీ నష్టాలు మన రాష్ట్రంలో 2018–19లో 16.36 శాతం ఉండేవి. 2021–22లో అవి 11.21 శాతానికి తగ్గాయి. ఈ కాలంలో మూడుశాతానికిపైగా నష్టాలను తగ్గించిన రాష్ట్రాల జాబితాను కేంద్రమంత్రి ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, హరియాణ, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. 5.15 శాతం నష్టాల తగ్గింపుతో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2024–2025 నాటికి ఏటీసీ నష్టాలను 12–15 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పుడే చేరుకున్నాయి. ఉదయ్ డ్యాష్‌బోర్డ్ ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీ ఫోరం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 12 రాష్ట్రాల్లో ఏటీసీ నష్టాలు 25 శాతం కంటే ఎక్కువ, ఆరు రాష్ట్రాలలో 15–25 శాతం మధ్య ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును అంచనా వేయడానికి కేంద్రం ఈ ఏటీసీ నష్టాలనే ప్రామాణికంగా తీసుకుంటోంది. అవి తక్కువగా ఉన్న, వేగంగా తగ్గించుకుంటున్న రాష్ట్రాలకు మాత్రమే ఆర్డీఎస్ఎస్ ద్వారా నిధులు సమకూరుస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ప్రీపెయిడ్ మోడ్‌లో స్మార్ట్‌మీటర్లు అమర్చడంపైనా మంత్రి ఆరాతీశారు. వ్యవసాయ ఫీడర్లకు సౌరవిద్యుత్ వినియోగం ప్రయోజనకరమని తెలిపారు. ఏపీ ఈ దిశగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను అందించవచ్చని మంత్రి వెల్లడించారు. 7 పోక్సో కోర్టులకు జడ్జీలు గుంటూరు లీగల్: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఏడు పోక్సో కోర్టులకు జిల్లా జడ్జీలను బదిలీపై నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) సునీత బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా జిల్లా జడ్జీలను అక్కడే ఉన్న పోక్సో కోర్టులకు బదిలీ చేశారు. అనంతపురంలోని ఎస్సీ, ఎస్టీ, ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి.రాజ్యలక్ష్మి, చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి ఎన్.శాంతి, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రత్యేక మహిళా కోర్టు, తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి డాక్టర్ షేక్ మహమ్మద్ ఫజులుల్లా, నెల్లూరులోని ప్రత్యేక మహిళా కోర్టు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి సిరిపిరెడ్డి సుమ, ఒంగోలులోని ప్రత్యేక మహిళా కోర్టు, రెండో అదనపు జిల్లా జడ్జి ఎం.ఎ.సోమశేఖర్, విశాఖపట్నంలోని ప్రత్యేక మహిళా కోర్టు, ఏడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది, ఏలూరులోని ల్యాండ్ రీఫామ్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.ఉమసునందలను పోక్సో కోర్టులకు జడ్జీలుగా బదిలీ చేశారు. బదిలీ అయిన వారు పోక్సో కోర్టులకు జడ్జీలుగా కొనసాగుతూనే, ప్రస్తుతం వారు పనిచేస్తున్న జిల్లా కోర్టులకు ఫుల్ అడిషనల్ చార్జి జడ్జిగా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. జనరల్ బదిలీలు జరిగే వరకు ఫుల్ అడిషనల్ చార్జి జడ్జీలుగా కొనసాగాలని తెలిపారు. -
పీటీసీ ఇండియా తుది డివిడెండ్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం పీటీసీ ఇండియా గత ఆర్థిక సంవత్సరాని(2021–22)కి తుది డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5.80 చొప్పున చెల్లించనుంది. ఇందుకు వాటాదారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తాజాగా తెలియజేసింది. కంపెనీ ఇప్పటికే షేరుకి రూ. 2 చొప్పున మధ్యంతర డివిడెండును చెల్లించింది. డిసెంబర్ 30న జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో తుది డివిడెండుకు అనుమతి లభించినట్లు వెల్లడించింది. కాగా.. వర్ధమాన విభాగాలైన గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌లో గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో చేతులు కలపడం ద్వారా అవకాశాలను అన్వేషిస్తున్నట్లు కంపెనీ సీఎండీ రజిబ్ కె.మిశ్రా వివరించారు. మార్చితో ముగిసిన గతేడాది కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 552 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) రూ. 458 కోట్ల లాభం నమోదైంది. ఈ కాలంలో 9.3 శాతం అధికంగా 87.5 బిలియన్ యూనిట్ల రికార్డ్ పరిమాణాన్ని సాధించినట్లు పీటీసీ ఇండియా తెలియజేసింది. ఎన్ఎస్ఈలో పీటీసీ ఇండియా షేరు దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 85 వద్ద ముగిసింది. -
ఒక ప్రాంతం.. అనేక కరెంటు కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగ ప్రైవేటీకరణదిశగా కేంద్రం దూకుడు పెంచింది. యావత్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాల మొత్తం ప్రాంతం పరిధిని విద్యుత్ సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంతం(మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లై)గా పరిగణిస్తూ కొత్త విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కం)లకు లైసెన్సులు జారీచేయాలని ఆదేశించింది. లేకుంటే ప్రభుత్వం ప్రకటించిన మరేతర చిన్న ప్రాంతాన్ని కూడా మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లైగా పరిగణిస్తూ కొత్త డిస్కంలకు లైసెన్సులు జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైసెన్స్ రూల్స్(రెండో సవరణ)–2022ను ప్రకటిస్తూ ఈ నెల 28న కేంద్ర విద్యుత్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గత సెప్టెంబర్ 8న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి తెచ్చిన సవరణలకు మరింత స్పష్టతనిస్తూ తాజా నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ప్రభుత్వాలు నిర్దేశించనున్న ఎంత చిన్న ప్రాంతంలోనైనా ఒకటికి మించిన సంఖ్యలో సమాంతర విద్యుత్ కంపెనీల ఏర్పాటుకు కొత్త సవరణలు వీలు కల్పించనున్నాయి. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్/ రెవెన్యూ జిల్లాను కనీస ప్రాంతంగా పరిగణిస్తూ విద్యుత్ కంపెనీలకు లైసెన్సులు జారీ చేయాలని పాత నిబంధనలు పేర్కొంటున్నాయి. విద్యుత్ బిల్లు అమలు కోసమే.. ఒకే ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా, రాష్ట్రాల ఈఆర్సీలు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని, ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్టసవరణ ముసాయిదా బిల్లు–2022లో కేంద్రం ప్రతిపాదించింది. తమ సొంత పంపిణీ వ్యవస్థ ద్వారానే వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ సరఫరా చేయాలని ప్రస్తుత నిబంధనలు పేర్కొంటున్నాయి. అంటే డిస్కంలు విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లతో సొంత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటేనే లైసెన్స్ ఇస్తారు. ‘సొంత వ్యవస్థ ఉండాల’నే నిబంధనను సైతం తొలిగిస్తున్నట్టు విద్యుత్ బిల్లులో కేంద్రం మరో ప్రతిపాదన చేసింది. ఒకే ప్రాంతంలో ఒకటికి మించిన సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు తప్పనిసరిగా ఓపెన్ యాక్సెస్ సదుపాయం కల్పించాలని ఇంకో కీలక ప్రతిపాదన చేసింది. తాజాగా విద్యుత్ సరఫరాకు ఉండాల్సిన కనీస ప్రాంత పరిధిపై పరిమితులను ఎత్తివేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తేవడంతో భవిష్యత్తులో విద్యుత్‌బిల్లు అమలుకు మార్గం సుగమమైంది. విద్యుత్ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే ప్రైవేటు డిస్కంలకు తలుపులు బార్లా తెరిచినట్టు కానుంది. -
విద్యుత్ రంగంలో మరో ముందడుగు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యుత్ రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో నిర్మించిన 3వ యూనిట్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు నిర్వాసితుల ఖాతాల్లో మత్స్యకారేతర పరిహారం జమ చేశారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన 800 మెగావాట్ల ప్లాంటును మీ అందరి సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి (నాన్న గారు) 2008లో శంకుస్థాపన చేశారని తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఈ పవర్‌స్టేషన్ నిర్మాణానికి ఆ మహానేత శ్రీకారం చుట్టగా, నేడు మనందరి ప్రభుత్వంలో పూర్తి సామర్థ్యంతో దానిని ప్రారంభించడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పవర్ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. నాణ్యమైన, నిరంతర విద్యుత్ ►రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ►మననందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఈ ప్రాజెక్టుకు రూ.3,200 కోట్లు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేశాం. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేశాం. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ►ఈ రోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంటుతో పోల్చితే సూపర్ క్రిటికల్ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుంది. భూములిచ్చిన రైతులకు అభివాదం ► ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు థర్మల్ పవర్ ప్లాంటు.. ఈ రెండూ ఈ ప్రాంతంలో రావాలి. వీటి ద్వారా జిల్లా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులందరికీ నిండు మనసుతో శిరసు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నా. ► వీళ్లందరికీ మంచి కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, రెండో దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియను ఈ నవంబర్ పూర్తయ్యేలోగా ప్రారంభించాలని ఆదేశించాం. నెరవేరిన మరో ఎన్నికల హామీ ► ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు ఎన్నికల వేళ ఆరోజు మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి నేను ఇక్కడకు వచ్చాను. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబునాయుడుకు మేమంతా గుర్తుకు వస్తామని ఆ రోజు మీరందరూ చెప్పారు. ► ఆయన ఐదేళ్ల పరిపాలనలో చేసిన మంచేమీ లేకపోయినా, హడావుడిగా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ మళ్లీ మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. మీ అందరి కష్టాలు నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు నేను చెప్పాను. ► ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలకు కూడా బటన్ నొక్కి నేరుగా రూ.36 కోట్ల పరిహారాన్ని వాళ్ల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాం. ఆ వేళ హడావుడిగా కేవలం మోసం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కేవలం 3,500 మందికి అది కూడా రూ.14,000 కూడా సరిగా ఇవ్వని పరిస్థితులు. ఈ రోజు వాళ్లకు మిగతా సొమ్ము ఇవ్వడమే కాకుండా, మిగిలిపోయిన 12,787 కుటుంబాలకు కూడా మంచి చేస్తూ, అందరికీ ఈ ప్యాకేజీ ఇస్తున్నాం. ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్మెర్సిబుల్ కాజ్వే ► నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్మెర్సిబుల్ కాజ్వే నిర్మాణం కోసం రూ.93 కోట్ల కేటాయిస్తూ.. దానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. నా సోదరుడు, శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరిక మేరకు ఈ కాజ్వే నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నా. ► ఇటువంటి ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా అడుగుతున్నా, పట్టించుకోని పాలకులను మనం చూశాం. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రంలోకి వెళ్లే నీటిని ఆపగలుగుతాం. సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్‌నూ ఆపగలుగుతాం. తద్వారా నాలుగు మండలాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల ప్రారంభించిన నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతున్నాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక జట్టీ ► ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ప్రత్యేక జట్టీ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఉప్పుకాలువ, వెంకటాచలం రోడ్డు నుంచి తిరుమలమ్మపాళెం హైలెవల్ బ్రిడ్జి కోసం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రూ.12 కోట్లు అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాం. మరో హైలెవల్ బ్రిడ్జి.. నెల్లూరు నక్కలవాగు – కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటంపాడు (వయా బ్రహ్మదేవం) వరకు మరో రూ.10 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నా. ► ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలని, ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మనం గర్వించాల్సిన రోజు మనం నిజంగా గర్వించాల్సిన రోజిది. అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ కోసం ప్రతి వాగ్దానం చేయడం, అమలు చేయకపోవడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. 3,500 మంది ఎస్సీ, ఎస్టీలకు గాను వారిలో కూడా టీడీపీ వారికే ఇస్తామని, వైఎస్సార్సీపీ వారిని పక్కనపెట్టండని చెప్పి.. ఎవరికీ ఇవ్వలేదు. మా నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో కేవలం 7 పంచాయతీలు మాత్రమే ప్యాకేజీకి ఎంపిక చేశారు. మన ప్రభుత్వం 20 పంచాయతీలతో పాటు, పోర్టుకు, థర్మల్ విద్యుత్ కేంద్రానికి భూములు ఇచ్చిన వారందరికీ రూ.36 కోట్ల ప్యాకేజీ ఇస్తోంది. జగనన్న ఏమి అడిగినా ఇస్తున్నారు. ఉప్పుకాలవ మీద రూ.12 కోట్లతో బ్రిడ్జి, కృష్ణపట్నం నక్కలకాలువ వాగు మీద రూ.9.40 కోట్లతో మరో బ్రిడ్జి మంజూరు చేయాలని అడుగుతున్నాం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఈ రోజు 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 3వ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విద్యుత్ స్టేషన్ దేశంలోనే మొదటిది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అడ్డగోలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో చంద్రబాబు రూ.20 వేల కోట్లకు పైగా నష్టాల్లోకి తోశారు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని బట్టి ఉత్పత్తి కూడా పెంచాలని సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఖర్చు తగ్గేలా ప్రణాళికలు రూపొందించారు. ఇవి ఆచరణలోకి వస్తే మనం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ట్రాన్స్‌కో అభివృద్ధికి రూ.4 వేల కోట్లతో ఎన్నో చర్యలు తీసుకున్నారు. రూ.40 వేల కోట్ల ఆర్థిక సాయంతో డిస్కంల ఆదుకుంటున్నారు. ఇవాళ మనం 45 శాతం విద్యుత్‌ను జెన్కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా పలు విధాలా ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుష్టచతుష్టయం దు్రష్పచారం చేస్తోంది. నిత్యం అసత్యాలు వల్లించే ఈ పచ్చ పత్రికలు చదవద్దని, పచ్చ టీవీలు చూడద్దని విజ్ఞప్తి చేస్తున్నా. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
తీరు మార్చుకోని తెలంగాణ జెన్కో.. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ
సాక్షి, అమరావతి : తెలంగాణ జెన్కో తీరు మారలేదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. దిగువన సాగు, తాగు నీటి అవసరాలు లేవు. అయినా, తెలంగాణ జెన్కో శ్రీశైలం, సాగర్‌లలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. దాంతో శ్రీశైలం, సాగర్‌లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. కృష్ణా నది నికర జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇదే అంశాన్ని వివరిస్తూ, తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కు శుక్రవారం లేఖ రాశారు. లేదంటే రిజర్వాయర్లలో నీరు తగ్గిపోయి, సీజన్ చివర్లో సాగు, తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో తాగు, సాగు నీటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్తుకు కాదని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► ఈ నెల 24 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 213.401 టీఎంసీలు నిల్వ ఉండేవి. వరద కనిష్ట స్థాయికి చేరడంతో స్పిల్ వే గేట్లు మూసేశాం. తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కోలు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ.. దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలంలో నీటి మట్టం 881.3 అడుగుల్లో 195.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే.. 18 టీఎంసీలను శ్రీశైలం నుంచి దిగువకు వదిలేశారు. ► గురువారం ఉదయం 6 గంటలకు నాగార్జునసాగర్‌లో 589.7 అడుగుల్లో 311.150 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన ఎలాంటి తాగు, సాగునీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోంది. ఆ జలాలు నదిలో కలుస్తున్నాయి. ► పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉంది. దాంతో.. ఎగువ నుంచి విడుదల చేస్తున్న నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. ► ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే.. బోర్డు అనుమతితో విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అవసరాలు లేకపోతే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించారు. ► బోర్డు నిర్ణయాన్ని, విభజన చట్టాన్ని తెలంగాణ జెన్కో ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దాంతో కృష్ణా నికర జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. -
ఏపీఈఆర్సీకి మరిన్ని అధికారాలు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అధికారాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు డిస్కంలకు మార్గం సుగమం చేస్తూ మరో గెజిట్ ఇచ్చింది. వాస్తవానికి ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం విద్యుత్ చట్టం సవరణ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో గెజిట్ రూపంలో వీటిని తెచ్చింది. విద్యుత్ చట్టం–2003లోని సెక్షన్ 176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ నియమావళిని సవరించింది. ఈ నెల 21 నుంచే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు గల ఏపీఈఆర్సీకి ప్రస్తుతం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏడాదికోసారి ఆదాయ, వ్యయాల నివేదిక (ఏఆర్ఆర్)లను సమర్పిస్తున్నాయి. ఆ నివేదికలపై బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మరుసటి ఏడాది విద్యుత్ చార్జీల (టారిఫ్) పెంపును మండలి నిర్ణయిస్తుంటుంది. డిస్కంలు మధ్యంతరంగా సమర్పించే ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీలపై అవసరానికి అనుగుణంగా అనుమతులు జారీ చేస్తుంటుంది. విద్యుత్ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంటుంది. కేంద్రం ఇచ్చిన తాజా గెజిట్ ప్రకారం విద్యుత్ కొనుగోలు, పంపిణీ వివరాలు, ఆదాయ వ్యయాలు, రాయితీల గణాంకాలు వంటి నివేదికలను ప్రతి డిస్కం మూడు నెలలకోసారి ఏపీఈఆర్సీకి సమర్పించాలి. వీటిని విద్యుత్ నియంత్రణ మండలి క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ధారించుకున్న తరువాత నెల రోజుల్లోగా కేంద్రానికి పంపించాలి. అలాగే ఇప్పుడు చేస్తున్నట్లుగానే విద్యుత్ చార్జీల సవరణ ఆదేశాలు కూడా సకాలంలోనే చేయాలి. ఇందుకోసం డిస్కంలు సమరి్పంచే లెక్కలు వాస్తవమో కాదో తేల్చాల్సిన బాధ్యత మండలిపై ఉంటుంది. దీంతో ఏపీఈఆర్సీ మరింత అప్రమత్తంగా, కఠినంగానూ వ్యవహరించాల్సి ఉంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
వైర్లు లేకుండా విద్యుత్
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త సాంకేతికత వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతానికి కొంచెం వింతగా అనిపించినా భవిష్యత్తులో సాధారణంగా మారే అవకాశం ఉన్న సరికొత్త పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న అలాంటి కొన్ని సరికొత్త వాస్తవాలను పరిచయంచేసే ప్రయత్నమే ఈ వారం సండే స్పెషల్. వైర్లెస్ విద్యుత్.. ప్రస్తుతం మనకు వైర్లెస్ ఇంటర్నెట్ గురించి తెలుసు. కానీ, వైర్లెస్ కరెంటు గురించి తెలీదు. త్వరలోనే ప్రతి ఇంట్లోకి వైర్లెస్ కరెంట్ అందుబాటులోకి రాబోతోందని దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. 30 మీటర్ల దూరం వరకూ ఇన్ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించి, 400 మిల్లీవాట్ల వైర్లెస్ విద్యుత్‌తో ఎల్ఈడీ లైటును వెలిగేలా చేశారు. ట్రాన్స్‌మీటర్, రిసీవర్ ద్వారా ఈ విద్యుత్ సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్ సేఫ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో ఎలాంటి అపాయాలు జరగవని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు.. ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్‌హోమ్స్ లేదా పెద్దపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇంటర్నెట్ ద్వారా పనిచేసే పరికరాలు)కు విద్యుత్‌ను అందించే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇసుకతో బ్యాటరీ.. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఇసుకతో పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేశారు. దీనిలో ఒకసారి గ్రీన్ పవర్‌ను స్టోర్చేస్తే నెలవరకూ నిల్వ ఉంటుంది. సౌర, పవన విద్యుత్ లాంటి గ్రీన్ ఎనర్జీని ఏడాది పొడవునా అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని ఈ తాజా బ్యాటరీ పరిష్కరించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పునరుత్పాదక విద్యుత్‌ను ఉష్ణం రూపంలో 500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దీనిలో నిల్వచేయొచ్చు. సోలార్, పవన విద్యుత్‌ను గ్రిడ్లతో అనుసంధానించవచ్చు. కానీ, రాత్రివేళ, గాలి లేనప్పుడు విద్యుదుత్పత్తి జరగదు. ఈ సమస్యను పెద్దపెద్ద బ్యాటరీలతో పరిష్కరించవచ్చు. ప్రస్తుతం చాలావరకు బ్యాటరీలను లిథియంతోనే తయారుచేస్తున్నారు. ఇది చాలా ఖరీదైన లోహం. ఫిన్లాండ్ ఇంజినీర్లు ఇసుకతో తయారుచేసిన బ్యాటరీలో తక్కువ ఖర్చుతో విద్యుత్ నిల్వచేయగలిగారు. అమెరికాలోని నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ లే»ొరేటరీ కూడా ఇసుకను హరిత ఇంధనంగా భావించి పరిశోధనలు చేపట్టింది. రాత్రిపూటా సోలార్ విద్యుత్ రాత్రిపూట కూడా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే సోలార్ ప్యానెల్‌ను కాలిఫోరి్నయాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్లు తయారుచేశారు. ఇప్పుడు మనం చూసే సోలార్ ప్యానెల్ ఏదైనా పగటిపూట మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే దానికి సూర్యకాంతి అవసరం. కానీ.. కొత్త ప్యానెల్స్‌తో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ బ్యాకప్ నుంచి పగలు, రాత్రి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. రాత్రిపూట విద్యుదుత్పత్తి కోసం ఇంజనీర్లు థర్మోఎలక్ట్రిక్ జనరేటర్‌ను రూపొందించారు. ఈ జనరేటర్ సోలార్ ప్యానెల్, గాలి, ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ద్వారా ఉత్పత్తి అయిన శక్తిని విద్యుత్‌గా మారుస్తుంది. ఎన్నెన్నో ప్రయోగాలు.. ఇక గాలిపటాలతో విద్యుత్‌ను పుట్టించే టెక్నాలజీని స్కాట్లాండ్కు చెందిన రాడ్ కనిపెట్టారు. ‘ఫ్లయింగ్ టర్బైన్’ టెక్నాలజీని ఆయన ఆవిష్కరించారు. గాలి పటాలు తిరుగుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్ స్టేషన్ విద్యుత్‌గా మారుస్తుంది. మరోవైపు.. బ్రిటన్‌లోని ఒక నైట్‌క్లబ్ తమ క్లబ్‌కు వచ్చి డ్యాన్స్ చేసే కస్టమర్ల శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్ తయారుచేస్తోంది. ‘బాడీహీట్’ పేరుతో ఇలా తయారుచేసిన విద్యుత్‌ను నిల్వచేసుకుని అవసరమైనప్పుడు వాడుకునేలా ఏర్పాటు కూడా చేసింది. పలు దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సముద్ర అలలతో విద్యుదుత్పత్తి చేసే అవకాశాలపై అధ్యయనం జరుగుతోంది. ఇటీవల మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను స్థాపించారు. ఇక బొగ్గు కొరత నుంచి బయటపడేందుకు బ్లూ హైడ్రోజన్ ప్రత్యామ్నాయమని జపాన్ భావిస్తోంది. అమ్మోనియానుగానీ, హైడ్రోజన్‌ను గానీ మండించడం ద్వారా విద్యుదుత్పత్తి చేయడమే ఈ బ్లూ హైడ్రోజన్ విధానం. జపాన్‌లోని టోక్యోలో బ్లూ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో వాహనాలను ఆ దేశం ప్రయోగాత్మకంగా నడిపింది. -
చంద్రబాబు పాపం.. డిస్కంలకు శాపం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి చంద్రబాబు చేసిన పాపాలు శాపాల్లా వెంటాడుతున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, విధానాల వల్ల కుదేలైన విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌లు) అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బకాయిలను సకాలంలో చెల్లించలేదంటూ ‘ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజీ (ఐఈఎక్స్)’ నుంచి క్రయవిక్రయాలు జరపకుండా ఏపీతో సహా 13 రాష్ట్రాలకు చెందిన 29 డిస్కంలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ (పొసోకో) రాష్ట్రాలకు సమాచారం పంపింది. కరెంటు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వీలు లేదని, గురువారం అర్ధరాత్రి నుంచే దీన్ని అమల్లోకి తెస్తున్నామని అందులో పేర్కొంది. మొదటి వాయిదా చెల్లించినా.. ఏపీ డిస్కంలు విద్యుదుత్పత్తిదారులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.17,265 కోట్లు కాగా కేంద్ర విద్యుత్ శాఖ తన ‘ప్రాప్తి వెబ్ పోర్టల్‌లో గడువులోగా చెల్లించలేదని ప్రకటించిన బకాయిలు రూ.412 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. మొత్తం బకాయిలను 12 వాయిదాల్లో చెల్లించేలా లేట్ పేమెంట్ సర్ చార్జ్ (ఎల్పీఎస్) పథకంలో ఏపీ ఇటీవలే చేరింది. మొదటి వాయిదాగా ఈ నెల 6న రూ.1,422 కోట్లను చెల్లించింది. ఈలోగానే కేంద్రం నిషేధిత రాష్ట్రాల జాబితాలో ఏపీని చేర్చింది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఇక్కడి అవసరాలకు సరిపోనప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి కొనుగోలు చేస్తుంటారు. అదే విధంగా మన దగ్గర విద్యుత్ మిగిలితే దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటారు. ఇప్పుడు కేంద్రం నిషేధం విధించడంతో ఏపీతో పాటు 13 రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు జరపలేవు. ప్రస్తుతం రాష్ట్రంలో 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నందున కేంద్రం విధించిన నిషేధం ప్రభావం ఏపీపై అంతగా ఉండకపోవచ్చునని, అయినప్పటికీ తాము కేంద్రానికి లేఖ రాస్తామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఈ పరిస్థితికి ఆ ఆప్పులే కారణం.. టీడీపీ హయాంలో 2014లో రూ.29,703 కోట్లుగా ఉన్న విద్యుత్ రంగం మొత్తం అప్పులు 2019 నాటికి రూ.68,596 కోట్లకు చేరాయి. ఇవి కాకుండా పవర్ జనరేటర్లకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగాయి. టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని బిల్లుల్లో సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని డిస్కంలకు ఇవ్వలేదు. దీంతో 2014–19 మధ్య దాదాపు రూ.20 వేల కోట్లు డిస్కంలు నష్టపోవాల్సి వచ్చింది. టీడీపీ సర్కారు దాదాపు 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏ) అధిక ధర (యూనిట్ రూ. 4.84 + ఇతర ఛార్జీలు అదనం) చొప్పున కుదుర్చుకుంది. దీనివల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు భారం మోయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించడం కోసం అదనంగా రూ.38,836 కోట్ల మేర రుణాలను ఆర్థిక సంస్థల నుంచి డిస్కంలు తీసుకోవాల్సి వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆదుకునేందుకు మూడేళ్లలోనే దాదాపు రూ.40 వేల కోట్లు సాయంగా అందించింది. మరోవైపు విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టింది. -
జేఎస్‌డబ్ల్యూ నియో రూ.10,530 కోట్ల డీల్
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ భారీ డీల్‌కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ 1,753 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పలు ప్రాజెక్టులను మిత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. డీల్ విలువ రూ.10,530 కోట్లు. వీటిలో 17 స్పెషల్ పర్సస్ వెహికిల్స్ (ఎస్పీవీ), మరొకటి అనుబంధ ఎస్పీవీ ఉంది. 1,331 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 10 పవన విద్యుత్ ప్రాజెక్టులు, 422 మెగావాట్ల ఏడు సోలార్ ప్రాజెక్టులు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ చేతికి రానున్నాయి. దక్షిణ, పశ్చిమ, మధ్య భారత్‌లో ఈ ప్రాజెక్టులు నెలకొన్నాయి. వీటి విద్యుత్ కొనుగోలు ఒప్పంద కాలపరిమితి సగటున మరో 18 ఏళ్లు ఉంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఖాతాలో ఇదే పెద్ద డీల్. తాజా కొనుగోలు ద్వారా జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి సాగిస్తున్న ప్రాజెక్టుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4,784 నుంచి 6,537 మెగావాట్లకు చేరింది. నిర్మాణ దశలో ఉన్న 2,500 మెగావాట్ల పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు రెండేళ్లలో జతవనున్నాయి. దీంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సామర్థ్యం 9.1 గిగావాట్స్‌కు చేరుతుంది. -
విద్యుత్ సవరణ బిల్లుపై ఉద్యోగుల నిరసన
సాక్షి, అమరావతి: లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వ్యతిరేకించింది. బిల్లులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపినప్పటికీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో నిరసనలకు దిగారు. విజయవాడలోని విద్యుత్ సౌధలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు కార్యాలయం బయటకు వచ్చి ధర్నా చేపట్టారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను జేఏసీ చైర్మన్ పి.చంద్ర శేఖర్, జనరల్ సెక్రటరీ పి.ప్రతాపరెడ్డి, కన్వీనర్ బి.సాయికృష్ణ తదితరులు కలిసి బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళితే తక్షణమే ఆందోళనలకు దిగేలా కార్యాచరణ రూపొందించినట్టు వెల్లడించారు. ఆందోళనకు ఇదీ కారణం ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలకు లైసెన్స్ విధానాన్ని సులభతరం చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని చెబుతున్నప్పటికీ, విద్యుత్ రంగం ప్రైవేటీకరణను అనుమతించడం వల్ల వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని జేఏసీ అభిప్రాయం పడింది. బిల్లు ఆమోదం పొందితే టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సేవల కోసం వినియోగదారులు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్న విధంగా విద్యుత్ సరఫరాదారుని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు విద్యుత్ పంపిణీ లైసెన్సులివ్వాల్సి వస్తే వాటి కోసం ’క్రాస్ సబ్సిడీ నిధి’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. డిపాజిట్ సొమ్మును ముందుగా చెల్లించకపోతే డిస్కంలు కోరినంత విద్యుత్‌ను ‘జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం’(ఎన్ఎల్డీసీ) సరఫరా చేయదు. -
భావి అవసరాలకనుగుణంగా విద్యుదుత్పత్తి
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ అవసరాలకనుగుణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉజ్వల్ భారత్–ఉజ్వల్ భవిష్యత్తు– విద్యుత్ 2047 గ్రాండ్ ఫినాలే సదస్సులో వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున విశాఖపట్నంలో ఈ మహోత్సవ్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వినియోగదారులకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా మరో 1,600 మెగావాట్లు 2023 జనవరి నాటికి రానుందన్నారు. అదేవిధంగా.. 2024–2026 వరకూ వివిధ దశల్లో పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి 10,067 లేఅవుట్లను విద్యుదీకరించేందుకు రూ.3,483 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వైఎస్సార్ జలకళ పథకంలో భాగంగా రూ.180 కోట్లతో 6,669 బోర్లుకు కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు 33,240 మెగావాట్ల సామర్థ్యం గల 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ థర్మల్ అండ్ కోల్ కోఆర్డినేషన్ జాయింట్ సెక్రటరీ పీయూష్ సింగ్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ సంతోషరావు, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు: ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు కూడా విద్యుత్ వెలుగులు అందించడమే లక్ష్యంగా.. పాతికేళ్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పథకాల్ని ప్రవేశపెట్టామన్నారు. విద్యుదీకరణ ప్రజల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్నారు. నష్టాల్లో కూరుకుపోతున్నా.. డిస్కంలు సబ్సిడీలు కొనసాగిస్తుండటం భవిష్యత్తులో అంధకారంలోకి నెట్టేసేందుకు సూచికలని అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలకు 2021–22 నుంచి 2025–26 వరకు మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. దీని ద్వారా ఏవరేజ్ కాస్ట్ ఆఫ్ సప్లై – ఏవరేజ్ రెవెన్యూ రియలైజ్డ్ అంతరాన్ని 2024–25 కల్లా సున్నా స్థాయికి చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. డిస్కంలు, విద్యుత్ విభాగాల నిర్వహణ సామర్థ్యాల్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్æ స్కీమ్‌ని ప్రధాని ప్రారంభించారు. అదేవిధంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి చెందిన రూ.5,200 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్ని జాతికి అంకితమిచ్చారు. తెలంగాణలో 100 మెగావాట్ల సామర్థ్యం గల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌తోపాటు దేశంలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. చింతపల్లి గిరిజనుడితో ప్రధాని ముఖాముఖి.. చింతపల్లి మండలం రత్నగిరి కాలనీకి చెందిన గిరిజన లబ్ధిదారుడు కాగే క్రాంతికుమార్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. ప్రధాని: క్రాంతికుమార్ ఎలా ఉన్నావ్? క్రాంతికుమార్: చాలా బాగున్నాను సార్ ప్రధాని: మీ గురించి చెప్పండి క్రాంతికుమార్: మాది సుదూర గిరిజన గ్రామం.. చింతపల్లి మండలం రత్నగిరి కాలనీ ప్రధాని: మీ ఊరికి కరెంట్ రాకముందు, వచ్చిన తర్వాత ఏం తేడా గమనించావు? క్రాంతికుమార్: గతంలో సూర్యుడి వెలుగు ఉన్నంతవరకే ఏ పనైనా చేసుకునేవాళ్లం. రాత్రిపూట కిరోసిన్ దీపాలతో ఇళ్లల్లోనే ఉండేవాళ్లం. చదువు కోసం పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కింద మా ఊరికి కరెంట్ వచ్చింది. మా జీవితాలు చాలా బాగుపడ్డాయి. ప్రధాని: చాలా సంతోషంగా ఉంది. మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు గర్వపడుతున్నాం. మరింత నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. క్రాంతికుమార్: థాంక్యూ సార్. -
విద్యుత్ రంగ విజయోత్సవం
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 25 నుంచి 31 వరకు 773 జిల్లాల్లోని 1,546 ప్రాంతాల్లో ఈ వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రంలోనూ వీటి నిర్వహణకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కార్యక్రమాలకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ), మిగిలిన జిల్లాల్లోని కార్యక్రమాలకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లు సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరించనున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ ఆదివారం లేఖ రాశారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నోడల్ అధికారిగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2047 నాటికి విద్యుత్ రంగంలో సాధించాల్సిన లక్ష్యాలతో కూడిన విజన్‌ను ఈ వేడుకల్లో ఆవిష్కరించనున్నట్లు బీఈఈ తెలిపింది. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనున్నట్లు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. కలెక్టర్లు ఈ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.34 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి తెలిపారు. స్వతంత్ర పోరాటంతో సంబంధమున్న గ్రామాలు, ఇటీవల విద్యుద్దీకరణ జరిగిన గ్రామాల్లో ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య’ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో ఎండీ బి.శ్రీధర్, జేఎండీ పృథ్వితేజ్, డిస్కంల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, కె.సంతోషరావు, నెట్ క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శతమానం భారతి: విద్యుత్ రంగం
స్వాతంత్య్రం వచ్చిన వెనువెంటనే బ్రిటిష్ కాలం నాటి విద్యుత్ చట్టాలను రద్దు చేసి, 1948 లో కొత్త స్వదేశీ చట్టాన్ని అమల్లోకి తేవడంతో జాతీయ ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డులు ఏర్పడ్డాయి. దాంతో మన విద్యుత్ వ్యవస్థ విస్తృతం అయింది. అనంతరం 1998 విద్యుత్ నియంత్రణ చట్టంతో విద్యుత్ చార్జీలు, విద్యుత్ బోర్డుల కార్యకలాపాల నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాల పరిధిలో మండళ్లు ఏర్పాటయ్యాయి. విద్యుత్ సరఫరా, పంపిణీల రంగంలోకి ప్రైవేటు సంస్థలకూ ప్రభుత్వం స్థానం కల్పించింది. ఈ మార్పులన్నీ కూడా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడానికే అయినప్పటికీ.. ఈ లక్ష్యం పూర్తిగా నెరవేరిందని చెప్పలేం. వచ్చే పాతికేళ్లలో శతవర్ష స్వాతంత్య్ర వేడుకల నాటికి విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం ద్వారా దేశ అభివృద్ధి ప్రమాణాలను పెంచే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యం 1300 మెగావాట్లు కాగా, తలసరి వార్షిక వినియోగం 17 యూనిట్లుగా ఉండేది! నేడు ఉత్పత్తి సామర్థ్యం నాలుగు లక్షల మెగావాట్లకు పెరిగి, తలసరి వినియోగం 1000కి పైగా యూనిట్లకు చేరుకుంది. భవిష్యత్తులోని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉత్త్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ, అదే సమయంలో వినియోగాన్ని తగ్గిస్తూ విద్యుత్ కొరతను అధిగమించడం అన్నది కూడా స్వతంత్ర భారతి ఏర్పచుకున్న లక్ష్యాలలో ఒకటి. -
ఇంధన రంగంలో భారీ పెట్టుబడులకు ఆస్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సామర్థ్య రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తెలిపారు. అలాగే పెట్టుబడులకు ఏపీలో సానుకూల వాతావరణం కూడా ఉందన్నారు. జాతీయ స్థాయిలో 2031 నాటికి రూ.10.02 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశముందని వెల్లడించారు. ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ అధికారులతో బాక్రే ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన రంగంలో పెట్టుబడుల వల్ల పారిశ్రామిక, రవాణా, భవన నిర్మాణం, తదితర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనివల్ల ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన మెరుగవుతుందన్నారు. ఇంధన రంగంపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతుందని.. దీంతో పర్యావరణం కూడా మెరుగవుతుందని బాక్రే వివరించారు. ఇంధన సామర్థ్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఆయన అభినందించారు. రోడ్ మ్యాప్‌ను రూపొందించాలి.. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలు ద్వారా అన్ని రంగాల్లో 15,787 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేసేందుకు అవకాశం ఉందని అజయ్ బాక్రే తెలిపారు. 2030 నాటికల్లా 6.68 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్విలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని పొదుపు చేయాలనే లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించాలని ఏపీ ఇంధన సంరక్షణ మిషన్‌కు సూచించారు. జాతీయ స్థాయిలో 2030 నాటికి 150 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పారిశ్రామిక రంగాల్లో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల్లో రాష్ట్రం కనబరుస్తున్న ఉత్తమ పనితీరుని చూసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని సహాయక ఏజెన్సీగా నియమించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వినూత్న విద్యుత్.. పంప్డ్ స్టోరేజ్, సోలార్, విండ్ పవర్
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సంస్కరణలు, వినూత్న సాంకేతికతతో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అధునాతన రివర్స్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తోంది. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ప్రైౖవేటు సెక్టర్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ ఇటువంటి ప్రాజెక్టునే స్థాపిస్తోంది. 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో 1,680 మెగావాట్లు పంప్డ్ స్టోరేజ్, 3 వేల మెగావాట్లు సోలార్, 550 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. దీని కోసం కేవలం ఒక టీఎంసీ నీరు సరిపోతుంది. ఇలా ఒకే చోట మూడు రకాల విద్యుత్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసే సమగ్ర పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే ఇది పెద్దది. ఈ నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల సాంకేతికత, వాటి ప్రయోజనాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉత్పత్తి చేస్తుంది.. నిల్వ చేస్తుంది పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ (పీఎస్‌హెచ్) ఒక రకంగా జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. వీటి మధ్య టర్బైన్ల గుండా నీరు ఒకదాని నుండి మరొక దానికి (డిశ్చార్జ్) కదులుతున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది శక్తిని నిల్వ చేయగలదు, అవసరమైనప్పుడు దానిని విడుదల చేయగలదు. ఎగువ రిజర్వాయర్ (రీచార్జ్) లోకి నీటిని తిరిగి పంప్ చేస్తున్నందున దానికి అవసరమైన విద్యుత్‌ను అందించానికి పీఎస్‌హెచ్ ఒక పెద్ద బ్యాటరీలా పనిచేస్తుంది. రెండు విధాల పని ఈ విద్యుదుత్పత్తి కేంద్రాలు జలాశయాల్లోని నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకుంటాయి. అందువల్ల ఎక్కువ నీరు అవసరం ఉండదు. విద్యుత్ ఉత్పత్తికి ఎగువ జలాశయం నుండి జనరేటర్‌ని తిప్పే టర్బైన్ల ద్వారా నీరు ప్రవహించి, విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దిగువ రిజర్వాయర్ నుంచి ఎగువ రిజర్వాయర్‌లోకి నీటిని తిరిగి పంప్ చేయడానికి టర్బైన్లు వెనుకకు తిరుగుతాయి, అప్పుడు కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా రెండు విధాలా ఉపయోగకరంగా ఉంటాయి. హైడ్రో పవర్‌తో ఇవీ ప్రయోజనాలు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకాల ద్వారా విద్యుత్‌ను సరఫరా చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందికి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తక్కువ గాలి, సూర్యరశ్మి లేకపోవడం వంటి పరిస్థితుల్లో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్థికంగా లాభదాయకంగా, పెద్ద ఎత్తున శక్తిని నిల్వ చేయడానికి పంప్డ్ స్టోరేజీ మాత్రమే సరైన మార్గం. ఈ ప్లాంట్లు సామర్థ్యంలో 82 శాతం వరకు పని చేస్తాయి. 80 సంవత్సరాలకంటే ఎక్కువ జీవితకాలం దీని అదనపు ప్రయోజనం. సౌర విద్యుత్ సూత్రమిది ప్రపంచంలో ఒక సంవత్సరం ఉపయోగించే విద్యుత్ కంటే ఒక గంటలో వెలువడే సౌర శక్తి ఎక్కువ. కానీ అంత విద్యుత్‌ను మనం వినియోగించుకోలేము. సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో సోలార్ పానెల్‌లోని ఫొటో వోల్టాయిక్ సెల్స్ వెలుతురుని ఎలక్ట్రాన్లుగా మార్చి విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఒక్కో మాడ్యూల్ ఒకటిన్నర చదరపు మీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. అది 40–60 వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 4–12 శాతం లాస్ అవుతుంది. గాలి చేసే మేలు పవన విద్యుత్ ఉత్పత్తి కూడా క్రమంగా పెరుగుతోంది. గాలిని ప్రత్యేక యంత్రాల ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చడం ద్వారా పవన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మూడు రెక్కలు గల గాలి మరను దీనికోసం వాడుతుంటారు. మన పూర్వీకులు, చాలా ఏళ్ళ ముందు నుంచీ నావలను నడపడానికి, నీటిని తోడటానికి, గింజలను పొడి చేయడానికి వాడేవారు. ప్రస్తుతం దీని ఉపయోగం ఎక్కువగా విద్యుదుత్పత్తిలోనే. పవన విద్యుత్ శిలాజ ఇంధనాల వంటి ఇతర వనరుల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌తో పోలిస్తే తక్కువ గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా భావిస్తున్నారు. సౌర విద్యుత్‌తో మరింత ఉపయోగం భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల విద్యుత్ సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగెళ్లిపోతాయి. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్‌ను హీట్ ఇంజన్ (ఉష్ణోగ్రత భేదాన్ని యంత్ర శక్తిగా మార్చేది)ల నుంచి, ఫొటో వోల్టాయిక్ ఘటాల నుంచి ఉత్పత్తి చేస్తారు. చిన్న, మధ్య తరహా అవసరాల కోసం మొదట్లో ఫోటో వోల్టాయిక్స్నే వాడేవారు. ఆ తరువాత వ్యాపార అవసరాల కోసం సౌర విద్యుత్ ప్లాంట్లు వచ్చాయి. సౌర విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు తగ్గడంతో లక్షలకొద్దీ సౌర ఫలకాలు విద్యుత్ గ్రిడ్‌లో భాగం కావడం మొదలైంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఫొటో వోల్టాయిక్ పవర్ స్టేషన్ కర్ణాటకలోని పావగడలో ఉంది. ఇది ఏటా 2,050 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. -
విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) క్యాంపు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రస్తుతం హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్ నుంచే ఏపీఈఆర్సీ కార్యాకలాపాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల టారిఫ్‌పై కూడా విశాఖపట్నం నుంచే ఆన్లైన్ ద్వారా ఏపీఈఆర్సీ విచారణ జరిపింది. ఇదే నేపథ్యంలో విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటైతే ఇక్కడి నుంచి ఈఆర్సీ ఏడాదిలో కొద్దిరోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. విద్యుత్‌రంగంలో విద్యుత్ చార్జీల నిర్ణయంతో పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఈఆర్సీ పాత్ర కీలకమైంది. అటువంటి ఈఆర్సీ క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటైతే.. విశాఖ కాస్తా విద్యుత్‌రంగ కార్యకలాపాలకు వేదికగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సోలార్ పవర్లో ఏపీ సూపర్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. ఈ రంగంలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలోకి భారత్ చేరగా.. మన దేశంలో మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలిచింది. మెర్కామ్ ఇండియా తాజా రీసెర్చ్ నివేదిక ప్రకారం 2021లో మన దేశం రికార్డు స్థాయిలో 10 గిగావాట్ల సౌరవిద్యుత్ సామర్థ్యాన్ని స్థాపించింది. దీన్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నెలకొల్పినట్లు అధ్యయనంలో వెల్లడైంది. 2020లో దేశంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం పెరుగుదల 3.2 గిగావాట్లు మాత్రమే ఉంది. అంటే 2020తో పోలిస్తే 2021లో పెరుగుదల 210 శాతంగా నమోదైంది. దీంతో డిసెంబర్ 2021 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం సామర్థ్యం 49 గిగావాట్లకు చేరుకుంది. సోలార్ రూఫ్‌టాప్ ఇన్స్టలేషన్లు 2021లో 138 శాతం పెరిగాయి. ఇవి రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పునరుత్పాదక రంగంలో మొదటి మూడు రాష్ట్రాలుగా ఇవి నిలిచాయి. కోవిడ్–19 కారణంగా 2020లో నెలకొల్పాల్సిన ప్రాజెక్టులు 2021లో స్థాపించడంతో ఇది సాధ్యమైంది. ఎదురవుతున్న సవాళ్లు మనదేశం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో, సౌరశక్తిలో ఐదో స్థానంలో, పవన విద్యుత్‌లో నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మనదేశం ఈ ఏడాది 175 గిగావాట్ల ఇన్స్టలేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనుకుంటోంది. అయితే కస్టమ్స్ సుంకం, దిగుమతుల్లో ఎదురవుతున్న పరిమితులు, గ్లోబల్ సప్లయ్ చైన్ సమస్యలు, అధిక జీఎస్టీ.. తదితర అంశాల్లో పునరుత్పాదక విద్యుత్ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. -
నిరంతరం సలహాలు, సూచనల స్వీకరణ
సాక్షి, అమరావతి: ఏడాదికి ఒకసారి టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఎవరైనా వినియోగదారులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఏడాదిలో ఎప్పుడైనా అందించేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. 365 రోజులు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి, సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశముందని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్), టారిఫ్‌లపై ఆన్లైన్ ద్వారా ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనిపై సమీక్షించేందుకు నిర్వహించిన స్టేట్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. -
విద్యుత్ సంస్కరణల్లో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో నిర్దిష్ట సంస్కరణలను చేపట్టి, వాటిని కొనసాగించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందంటూ కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. వార్షిక ఆదాయ, వ్యయ నివేదికలను సకాలంలో ప్రచురించడం, టారిఫ్ పిటిషన్‌ను దాఖలు చేయడం, టారిఫ్ ఆర్డర్ల జారీ, యూనిట్ వారీగా సబ్సిడీ అకౌంటింగ్, ఇంధన ఖాతాల ప్రచురణ, కొత్త వినూత్న సాంకేతికతలను అనుసరించడం వంటి సంస్కరణలను అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని కొనియాడింది. విద్యుత్‌రంగ కార్యకలాపాలను మరింత పటిష్టంగా, సమర్థంగా, స్థిరంగా మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వినియోగదారులందరికీ 24 గంటలూ నాణ్యమైన, నమ్మదగిన, చౌకవిద్యుత్‌ను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు కేంద్రానికి బాగా నచ్చాయి. ప్రగతిశీల రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని కేంద్రం తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాలు 2020లో విద్యుత్‌రంగ సంస్కరణల అమలుకు, తద్వారా లబ్ధిపొందేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో నిర్దిష్ట సంస్కరణలను చేపట్టి, కొనసాగించాలనే షరతుపై అదనపు రుణాలు తీసుకునేందుకు ఆర్థికశాఖ గత ఏడాది జూన్‌లో ‘సంస్కరణ ఆధారిత, ఫలితం ఆధారిత పంపిణీరంగ పథకం’ ప్రారంభించింది. పథకం అమలుకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ని నోడల్ ఏజెన్సీగా నియమించింది. గతేడాది 24 రాష్ట్రాలు ఈ పథకం ద్వారా రూ.13 వేల కోట్ల అదనపు రుణ పరిమితిని పొందేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ సంవత్సరం ఈ పరిమితిని రూ.80 వేల కోట్లకు పెంచింది. అదనపు రుణ పరిమితి సంబంధిత రాష్ట్ర స్థూల, రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో 0.5 శాతంగా కేంద్రం నిర్ణయించింది. -
వాయిదాల్లో విద్యుత్ ఆదా పరికరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వృథాను అరికట్టి, వినియోగదారులకు బిల్లులు తగ్గించడంలో తోడ్పడడంతో పాటు ప్రజలకు, పర్యావరణానికి మేలు చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ రంగం అడుగులు వేస్తున్నాయి. తాజాగా విద్యుత్ పొదుపు కోసం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నడుం బిగించింది. విదేశాల్లో విజయవంతమైన ‘ఆన్ బిల్ ఫైనాన్సింగ్’ విధానాన్ని రాష్ట్రానికి సరిపడేలా రూపొందించాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)ను ఏపీఈఆర్సీ బుధవారం ఆదేశించింది. ఈ మోడల్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అందజేసే మార్గాలపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది. దీనిపై మూడు వారాలలోపు అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరింది. ఉత్పత్తి చేయలేకపోయినా ఆదా చేయగలం.. రాష్ట్రంలో విద్యుత్ రంగం సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించామని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈఆర్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడారు. ఒకరు ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయినా, ఒక యూనిట్ పొదుపు చేయగలరని, ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే 2 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసినట్టేనని నాగార్జునరెడ్డి వివరించారు. వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన చౌక విద్యుత్‌ను అందజేయడం వల్ల వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం మంచి పురోగతి సాధిస్తుందని, దానికోసం ఏపీఈఆర్సీ, విద్యుత్ సంస్థలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. వినియోగదారుల ఇష్టం.. ‘ఆన్ బిల్ ఫైనాన్సింగ్’ విధానంలో భాగంగా బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్), వస్తు ఉత్పత్తి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. వాటి సహకారంతో వినియోగదారులకు ఇంధన సామర్థ్యం కలిగిన ఆధునిక గృహోపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటారు. అలాగే వినియోగదారులు తమ నెల వారీ విద్యుత్ బిల్లుల ద్వారా తాము తీసుకున్న వస్తువులకు తిరిగి చెల్లింపులు చేస్తారు. పరికరాల వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది కాబట్టి బిల్లులు కొంత మేర ఆదా అవుతాయి. ఫలితంగా వినియోగదారులపై వాయిదా భారం అంతగా పడదు. పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి స్మార్ట్ గ్రిడ్లపై పడే అధిక లోడును కొంతమేర నివారించవచ్చని ఏపీఈఆర్సీ వివరించింది. అయితే ఇంధన సామర్థ్య గృహోపకరణాలు ఉపయోగించడం అనేది వినియోగదారులు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప ఎవరినీ బలవంతం చేయడం జరగదు. అలాగే వారు చెల్లించే వాయిదాలు నేరుగా వస్తు ఉత్పత్తి దారులకు వెళతాయని మండలి స్పష్టం చేసింది. -
కృత్రిమ మేధస్సుతో నష్టాలకు చెక్..వాడుకలోకి తెచ్చిన ఏపీ ట్రాన్స్‌కో!
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో పొదుపు చేస్తూ, వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ రాష్ట్ర విద్యుత్ రంగం ముందుకు దూసుకెళ్తోంది. ఫోర్ కాస్టింగ్ మోడల్ కృత్రిమ మేధస్సు(ఏఐ) ద్వారా సత్ఫలితాలను సాధిస్తోంది. ఏపీ ట్రాన్స్‌కోలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ) విద్యుత్ డిమాండ్, వినియోగాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి దీన్ని వినియోగిస్తోంది. ఇది మరుసటి రోజు విద్యుత్ వినియోగాన్ని ముందే అంచనా వేస్తుంది. ప్రతి 15 నిమిషాలకొకసారి రోజువారీ విద్యుత్ డిమాండ్‌ను తెలియజేస్తుంది. విద్యుత్ డిమాండ్, సరఫరా, గ్రిడ్ నిర్వహణ, విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించడం తదితర నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని అధికారులు చెబుతున్నారు. పవన శక్తి, సౌర శక్తి, మార్కెట్ ధరలు, కేంద్ర ఉత్పత్తి స్టేషన్ల మిగులు, ఫ్రీక్వెన్సీ తదితరాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోందని వివరించారు. విద్యుత్ చౌర్యం, బిల్లింగ్, బిల్లుల సేకరణలో అవినీతిని కూడా అరికడుతుందని తెలిపారు. తగ్గుతున్న కొనుగోలు ఖర్చు.. కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంస్థలు కొనుగోలు ఖర్చును తగ్గించుకోగలుగుతున్నాయి. 2019–20, 2020–21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్ పవర్ ఎక్ఛేంజీలతో విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా మొత్తం మీదæ రూ.2,342 కోట్లు ఆదా చేశారు. విద్యుత్ సంస్థల్లో సాంకేతిక, వాణిజ్య నష్టాలు 2018–19లో 13.79 శాతం ఉండగా 2019–20లో 10.95 శాతానికి తగ్గాయి. 2021–22 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో విద్యుత్ కొనుగోళ్ల ద్వారా దాదాపు రూ.95 కోట్లు పొదుపు చేయగలిగారు. సగటున రోజుకు రూ.కోటి ఆదా చేశాయంటే దానికి కృత్రిమ మేధస్సు ప్రధాన కారణమని ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. గ్రిడ్ నిర్వహణలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. పవన, సౌర విద్యుత్‌లో ఆకస్మిక అంతరాయాలు వచ్చినప్పుడు మార్కెట్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంటుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి, వాతావరణ డేటా, సెలవులు, కాలానుగుణ సమాచారం, వాతావరణ సూచన మొదలైన వాటితో సహా 25 సంవత్సరాల సమాచారాన్ని ఉపయోగించి దీనిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. పటిష్ట విద్యుత్ రంగ నిర్మాణంలో భాగంగా.. బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనడానికే ఎక్కువ ఖర్చవుతుంటుంది. దీనిని తగ్గించేందుకు మరుసటి రోజు విద్యుత్ డిమాండ్‌ను కచ్చితంగా అంచనా వేయడం అత్యంత కీలకం. ఏమాత్రం తేడా జరిగినా గ్రిడ్‌కు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విద్యుత్ కోతలు కూడా విధించాల్సి వస్తుంది. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు పటిష్టమైన విద్యుత్ రంగాన్ని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాం. – నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి రాయితీలు పెంచాలి మామిడితోటలకు బనగానపల్లె ప్రాంతం ప్రసిద్దే. చాలా కాలంగా తోటల పెంపకం ఖర్చు ఎక్కువగా అవుతోంది. రూ.లక్షల్లో భరించే స్థోమతులేక చాలామంది మామిడితోటల సాగు తగ్గించారు. రైతులకు ప్రభుత్వం ఎక్కువ రాయితీలు అందిస్తే తోటల పెంపకానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎంతోకాలంగా ఉన్న తోటలను తీసేయలేక ఇప్పటికీ పెంచుతున్నాం. –అబ్దుల్‌హమీద్, మామిడి రైతు, బనగానపల్లె రుణ సౌకర్యం కల్పించాలి ప్రతి రైతు తనకు ఉన్న పొలంలో కొంత పొలాన్ని మామిడి తోట పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రైతులకు వ్యవసాయంతో పాటు మామిడితోటల ద్వారా వచ్చే ఆదాయం లాభసాటిగా ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం పెద్దెత్తున రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బ్యాంకుల ద్వారా తోటల పెంపకానికి రుణ సౌకర్యం కూడా కల్పించాలి. –జక్కా విజయకృష్ణకుమార్, మామిడి రైతు, ఇల్లూరుకొత్తపేట -
‘స్మార్ట్’గా విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు రానున్నాయి. వీటి ద్వారా నాణ్యమైన, సరఫరాలో లోపాలు లేని విద్యుత్‌ను పొందవచ్చు. మొబైల్ ఫోన్ల లాగానే ముందుగా రీచార్జ్ చేసుకొని మనకు ఎంతమేరకు విద్యుత్ అవసరమో అంతే పొందవచ్చు. దీనివల్ల వినియోగదారులు, డిస్కంలకు పలు ప్రయోజనాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ మీటర్లు అమరుస్తున్నారు. 2025 నాటికి స్మార్ట్ మీటర్లు వినియోగంలోకి తేవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. మూడు, నాలుగేళ్లలో అన్ని రాష్ట్రాల్లో 250 మిలియన్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి అవే సంస్కరణలను రైతులు, డిస్కంల శ్రేయస్సు కోసం వినియోగిస్తోంది. ప్రభుత్వ సర్వీసులకు టెండర్లు పిలిచిన ఏపీ డిస్కంలు కేంద్రం రూపొందించిన నమూనా పత్రం ఆధారంగా రాష్ట్రంలోనూ టెండర్లు పిలిచారు. ముందుగా ప్రభుత్వ రంగ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో లక్ష సర్వీసులు చొప్పున, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 1.30 లక్షల సర్వీసులకు టెండర్లు పిలిచారు. డిసెంబర్ 1 నుంచి మీటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు డిస్కంల సీఎండీలు ‘సాక్షి’కి వెల్లడించారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికోసం 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) నుంచి తీసుకోనుంది. ఉచిత విద్యుత్ లక్ష్య సాధనకు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతులపై భారం పడకుండా ఈ మీటర్ల వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించనుంది. నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో రైతుల సమ్మతితో వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకుని మీటర్లు బిగిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,200కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వమే మీటర్లు ఏర్పాటు చేస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ‘సాక్షి’కి తెలిపారు. ఎప్పటికప్పుడు మొబైల్‌కు సమాచారం స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ ద్వారా వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. వినియోగదారులు రీచార్జ్ వంటి సేవలను, ఫిర్యాదులను వారి మొబైల్ ద్వారానే పొందవచ్చు. ఎంత విద్యుత్ అవసరమనుకుంటే అంతే రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వ, వ్యవసాయ సర్వీసులకే స్మార్ట్ మీటర్లు అమర్చనున్నందున ప్రభుత్వమే రీచార్జ్ ప్రక్రియను ప్రత్యామ్నాయ విధానాల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నో ప్రయోజనాలు ► స్మార్ట్ మీటర్లతో మొబైల్ రీచార్జ్ మాదిరిగానే ముందుగా విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల పంపిణీ సంస్థలకు ముందుగానే నగదు జమ అవుతుంది. బకాయిల భారం ఉండదు. ► అవసరం మేరకే విద్యుత్ వినియోగించొచ్చు. వృధా ఉండదు ► సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు లభిస్తుంది ► పంపిణీ వ్యవస్థలో లోపాలను, లో ఓల్టేజిని త్వరగా గుర్తించి, విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించొచ్చు ► గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వ్యవసాయ లోడును కచ్చితంగా లెక్కించవచ్చు. లోడు ఎక్కువ ఉన్న చోట ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్ధ్యం పెంచొచ్చు ► రూఫ్ టాప్ సోలార్ ఉన్నవారికి ఆదాయ వనరుగా మారడానికి టూ–వే ఫ్లో డిటెక్షన్‌తో నెట్ మీటరింగ్‌ను కూడా అందిస్తుంది ► సబ్సిడీ విద్యుత్ పొందే ప్రజల సర్వీసులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు లింక్ చేయడం వల్ల సబ్సిడీ సొమ్ము వారి ఖాతాలకు జమ అవుతుంది ► గ్రిడ్‌ను స్థిరీకరించడానికి స్మార్ట్ మీటర్లు సహాయపడతాయి -
‘విద్యుత్’ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలకు టీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. శుక్రవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం సంస్కరణల పేరుతో దొడ్డిదారిలో చట్టాలు తెస్తోందని ఇవి తెలంగాణ ప్రజలకు ఉరి తాళ్లుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణను సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, ఆర్థికంగా భారం లేని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యుత్ వినియోగంలో దేశ సగటును రాష్ట్రం దాటి పోయిందన్నారు. విద్యుత్ కోసం పరిశ్రమల యాజమాన్యాలు ధర్నాలు చేసిన చరిత్ర ఉమ్మడి ఏపీలో ఉంటే.. రాష్ట్రం వచ్చిన తరువాత 50 వేల పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని తెలిపారు. అంతకుముందు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు, 1104 యూనియన్ సభ్యులు కీలక పాత్ర పోషించారన్నారు. కార్మికుల సంక్షేమ కోసం యూనియన్ పోరాటం చేస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోసం పోరాటం చేస్తే కాల్చి చంపారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదన్న వారి వాదనను తిప్పికొట్టి మిగులు రాష్ట్రంగా నిలిచిందన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులే విద్యుత్ సంస్థకు ప్రత్యక్ష దేవుళ్లని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో రఘుమారెడ్డి -
‘ఆర్ఈ’ పెట్టుబడుల్లో భారత్‌కు 3వ స్థానం
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశాల సూచీలో (ఆర్‌ఈసీఏఐ) టాప్ 3 దేశాలు ఈసారి కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలోనూ, భారత్ యథాప్రకారం 3వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఆర్‌ఈసీఏఐకి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ఈవై విడుదల చేసిన 58వ ఎడిషన్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలకు ఆకర్షణీయంగా ఉన్న టాప్ 40 దేశాలతో ఈవై ఈ జాబితా రూపొందించింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ అంశాలకు కంపెనీలు, ఇన్వెస్టర్లు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత విద్యుత్ విభాగానికి కార్పొరేట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయని సంస్థ పేర్కొంది. ఈసారి పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లలో ఆకర్షణీయతకు కొలమానంగా కొత్తగా పీపీఏ సూచీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది. దీనికి సంబంధించి టాప్ 30 పీపీఏ మార్కెట్లలో భారత్‌కు ఆరో ర్యాంక్ దక్కినట్లు పేర్కొంది. స్వావలంబన సాధించే లక్ష్యంతో విధానపరంగా సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవడం, పునరుత్పాదక విద్యుత్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు, పెట్టుబడులు.. టెక్నాలజీపరమైన పురోగతి తదితర అంశాలు, భారత్‌లో పర్యావరణహిత విద్యుత్ విభాగం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి తోడ్పడుతున్నాయని ఈవై తెలిపింది. అయితే, వేగవంతమైన వృద్ధిని దెబ్బతీసే అవరోధాలను ఈ రంగం జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని హెచ్చరించింది. -
‘గ్రీన్’ విద్యుత్‌పై 20 బిలియన్ డాలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక (గ్రీన్) విద్యుదుత్పత్తి రంగంపై వచ్చే దశాబ్ద కాలంలో 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. పర్యావరణ హిత విద్యుత్‌కు సంబంధించి వివిధ రూపాల్లో తమ పెట్టుబడులు మొత్తం మీద 50–70 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రోలైజర్ల తయారీ భాగస్వాములు మొదలుకుని సౌర.. పవన విద్యుత్ వ్యాపారాలకు అవసరమైన ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పారిశ్రామిక క్లౌడ్ ప్లాట్‌ఫాంలు మొదలైనవన్నీ ఈ కోవలోకి వస్తాయని వివరించారు. వచ్చే నాలుగేళ్లలో సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను మూడు రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు అదానీ పేర్కొన్నారు. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ చాప్టర్ సోమవారం నిర్వహించిన సస్టెయినబిలిటీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా గౌతమ్ అదానీ మాట్లాడారు. మన వైద్య, విద్య, రవాణా తదితర వ్యవస్థల్లో ఉన్న లోపాలను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారులను నిలువరించేందుకు టీకాలైనా ఉన్నాయని.. కానీ వాతావరణ మార్పుల చికిత్సకు ఎలాంటి టీకాలు లేవని అదానీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పు సమస్యలకు తగు పరిష్కార మార్గాలు కనుగొనడమే కాకుండా.. సైన్స్, విధానాలు, సాంకేతిక అభివృద్ధి ద్వారా అందరికీ ప్రయోజనాలు అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 28 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్ .. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్ 28 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తాను గతేడాది చెప్పానని అదానీ పేర్కొన్నారు. అమెరికా తలసరి ఆదాయంలో ప్రస్తుతం ముప్ఫయ్యో వంతుగా ఉన్న భారత్ తలసరి ఆదాయం 2050 నాటికి మూడో వంతుకు చేరుతుందన్నారు. రాబోయే రోజుల్లో అనేక దశాబ్దాల పాటు భారత్ రెండంకెల స్థాయి వృద్ధి సాధించగలదని అదానీ చెప్పారు. మరోవైపు, పర్యావరణ హిత విధానాలను, స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. అక్టోబర్ 6 దాకా సదస్సు.. రాబోయే తరాలకు కూడా వనరులను మిగిల్చే విధంగా.. ప్రస్తుత తరం అవసరాలను తీర్చుకునేందుకు పాటించాల్సిన విధానాలపై (సస్టెయినబిలిటీ) చర్చించేందుకు ఇజ్రాయెల్, కోస్టారికాల భాగస్వామ్యంతో టై నిర్వహిస్తున్న సదస్సు అక్టోబర్ 6 దాకా జరగనుంది. ఇందులో 64 దేశాల నుంచి 25,000 పైచిలుకు సంస్థలు పాల్గొంటున్నాయి. తొలి రోజున ఇరు దేశాల్లోని వ్యవసాయ, సాంకేతిక తదితర రంగాల స్టార్టప్‌లను ప్రోత్సహించే దిశగా ఇజ్రాయెల్, భారత్‌లోని టై విభాగాలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ సదస్సు ఊతంతో రాబోయే రోజుల్లో స్టార్టప్‌లకు దాదాపు 100 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు దక్కే అవకాశం ఉందని టీఎస్ఎస్ 2021 చైర్పర్సన్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ దౌత్యవేత్త నిక్కి హేలీ (వర్చువల్‌గా), కోస్టా రికా దౌత్యవేత్త క్లాడియో అన్సోరెనా, ఇజ్రాయెల్ డిప్యుటీ చీఫ్ ఆఫ్మిషన్రోని క్లెయిన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
Power Sector: భారీ సంస్కరణలు.. అమ్మకానికి ‘లైన్లు’!
సాక్షి, హైదరాబాద్/అమరావతి: దేశంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలకు రంగం సిద్ధం చేసింది. ‘ఎలక్ట్రిసిటీ (ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్లానింగ్, డెవలప్మెంట్ అండ్ రికవరీ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్) రూల్స్–2021’ను అమల్లోకి తెచ్చినట్టు కేంద్ర విద్యుత్ శాఖ ఆదివారం ప్రకటించింది. రాష్ట్రాలు తమ అధీనంలోని విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌లను అమ్ముకోవడానికి, ఇతరుల నుంచి కొనుక్కోవడానికి.. పంచుకోవడానికి కూడా దీనితో అవకాశం ఉండనుంది. ఈ వెసులుబాట్లు రాష్ట్రాలతోపాటు విద్యుదుత్పత్తి కంపెనీలకూ వర్తించనున్నాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ యాజమాన్యంలోని అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ లైన్ల విక్రయానికి వీలు కల్పిస్తూ కేంద్రం ఇటీవలే మార్గదర్శకాలు ఇచ్చింది. తాజాగా విద్యుత్ సంస్థల యాజమాన్యంలోని ట్రాన్స్మిషన్ లైన్ల విక్రయానికి వీలు కల్పించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక రీజియన్ నుంచి మరో రీజియన్‌కు విద్యుత్ సరఫరాకు సరిపడా ట్రాన్స్మిషన్ వ్యవస్థ లభ్యత ఉండేలా చూడటం కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు కేంద్రం పేర్కొంది. తెరపై కొత్త యాక్సెస్ విధానం విద్యుదుత్పత్తి కంపెనీలు తాము ఉత్పత్తి చేసే కరెంటును అమ్ముకోవడానికి ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘పవర్‌గ్రిడ్ కార్పొరేషన్’దేశవ్యాప్తంగా అంతర్రాష్ట ట్రాన్స్మిషన్ నెట్‌వర్క్‌ను నిర్మించి నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను ఆధారంగా చూపి ఈ అంతర్రాష్ట ట్రాన్స్మిషన్ వ్యవస్థను వినియోగించుకోవడం కోసం (లాంగ్ టర్మ్ యాక్సెస్) పవర్‌గ్రిడ్‌కు దరఖాస్తు పెట్టుకుంటున్నాయి. అయితే కేంద్రం తాజాగా లాంగ్‌టర్మ్ యాక్సెస్‌కు బదులు జనరల్ నెట్వర్క్ యాక్సెస్(జీఎన్ఏ) అనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనితో విద్యుదుత్పత్తి కంపెనీలతోపాటు రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్మిషన్ సామర్థ్యాన్ని పొందడం, బదిలీ చేయడం వంటివి చేయొచ్చు. స్వల్ప, మధ్యకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోలుకు వెసులుబాటు కలగనుంది. దీనికోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చూపాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధానం ద్వారా ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్వహణ, చార్జీల వసూళ్లలో హేతుబద్దత వస్తుందని కేంద్రం తెలిపింది. వసూళ్ల బాధ్యతలు పవర్‌గ్రిడ్‌కు.. ట్రాన్స్మిషన్ వ్యవస్థల కోసం జరిగిన ఒప్పందాలన్నీ కొత్త విధానం కింద జీఎన్‌ఏలుగా మారనున్నాయి. అంతేకాదు నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వారి నుంచి ట్రాన్స్మిషన్ చార్జీల వసూలు, బిల్లింగ్, కలెక్షన్, పంపిణీ బాధ్యతలన్నీ పవర్‌గ్రిడ్‌కు వెళ్లనున్నాయి. ఒప్పంద సామర్థ్యానికి మించి అధిక విద్యుత్ తీసుకున్నా, సరఫరా చేసినా 25 శాతంచార్జీలను అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. జీఎన్‌ఏల అమలుపై కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుంది. కొనుగోళ్లలో రోల్‌మోడల్‌గా ఏపీ చౌక విద్యుత్ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఏపీలో విద్యుత్ సంస్థలు అత్యాధునిక సాంకేతికతలను వినియోగిస్తున్నాయి. ఒక రోజు ముందే విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించగలుగుతున్నాయి. ఈ విషయంలో ఏపీ విద్యుత్ సంస్థలు దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయి. 2019–20, 2020–21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్ పవర్ ఎక్ఛేంజీల ద్వారా కొనుగోలు చేయడం ద్వారా రూ.2,342 కోట్లు ఆదా చేయడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ రాష్ట్రాన్ని అభినందిస్తూ ఏపీని రోల్ మోడల్‌గా తీసుకుంటామని ప్రకటించాయి. ఈ క్రమంలోనే దేశమంతటా తాజా నిబంధనలను కేంద్రం ప్రకటించింది. ఎందుకీ కొత్త విధానం? ట్రాన్స్మిషన్ వ్యవస్థ కోసం పెట్టిన భారీ పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడం, అదే సమయంలో ప్రణాళికాబద్ధంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్వహణ, అభివృద్ధి కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. దీనివల్ల ట్రాన్స్మిషన్, జనరేషన్ రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అందని ప్రాంతాలు అభివృద్ధికి దూరమవుతాయని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా వ్యవస్థను నిర్వహించడానికి కొత్త నిబంధనలు దోహదపడతాయని తెలిపింది. కొత్తగా నిర్మించే విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్మిషన్ వ్యవస్థ అభివృద్ధికి అవకాశం ఉంటుందని, ప్లాంట్లపై పెట్టిన పెట్టుబడులు వృథా కావని పేర్కొంది. -
మానిటైజేషన్‌కు ఎన్టీపీసీ రెడీ
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ తాజాగా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలు ఆవిష్కరించింది. మూడు అనుబంధ సంస్థలను లిస్టింగ్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా రూ. 15,000 కోట్ల సమీకరణకు వీలున్నట్లు తెలియజేసింది. జాబితాలో ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్(ఎన్‌వీవీఎన్), నార్త్ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(నీప్కో)తోపాటు.. ఏడాది కాలమే ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ(ఎన్ఆర్ఈఎల్) ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా స్టీల్ పీఎస్‌యూ సెయిల్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ నుంచి సైతం వైదొలగనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఎన్‌ఆర్‌ఎల్‌ను వచ్చే ఏడాది అక్టోబర్‌కంటే ముందుగానే లిస్టింగ్ చేయనున్నట్లు ఎన్టీపీసీ చైర్మన్, ఎండీ గురుదీప్ సింగ్ పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన విభాగంలో 2020 అక్టోబర్‌లో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏడాదికి 7–8 గిగావాట్ల సామర్థ్యాన్ని జత కలుపుకుంటున్నట్లు గురుదీప్ తెలియజేశారు. పవర్ ట్రేడింగ్‌కు ఏర్పాటు చేసిన కంపెనీ ఎన్‌వీవీఎన్ తదుపరి ఫ్లై యాష్ ట్రేడింగ్, వినియోగం, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ మొబిలిటీ, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టింది. గతేడాది మార్చిలో నీప్‌కోలో ఎన్టీపీసీ 100 శాతం వాటాను సొంతం చేసుకుంది. కంపెనీ 7 హైడ్రో, 3 థర్మల్, 1 సోలార్ పవర్ స్టేషన్లను నిర్వహిస్తోంది. 2,057 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 50:50 శాతం వాటాతో ఏర్పాటైన ఎన్టీపీసీ– సెయిల్ జేవీ దుర్గాపూర్, రూర్కెలా, భిలాయ్‌లలో సెయిల్ సొంత అవసరాలకు వీలుగా 814 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లను నెలకొలి్పంది. -
విద్యుత్ కొనుగోళ్లలో రూ.126 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు రూ.126.15 కోట్లు ఆదా చేశాయన్నారు. ఈ పొదుపు ప్రయోజనాలను తిరిగి వినియోగదారుల కోసమే ఉపయోగించాలని ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయని తెలిపారు. బాపూజీ జయంతి సందర్భంగా శనివారం విద్యుత్ సౌధలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఏపీఎస్పీడీసీఎల్ 6,013 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర కంటే 15 పైసలు తక్కువకే కొనుగోలు చేసిందన్నారు. తద్వారా రూ.89.23 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. ఏపీíసీపీడీసీఎల్ రూ.33.25 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.3.67 కోట్లు ఆదా చేశాయన్నారు. ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వరరావు, గ్రిడ్ ట్రాన్స్మిషన్ డైరెక్టర్ కె.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ రంగం బలోపేతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) కె.వెంకటేశ్వరరావు, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి (ఏపీసీపీడీసీఎల్), హెచ్.హరనాథరావు (ఏపీఎస్పీడీసీఎల్), కె.సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు కె.ప్రవీణ్‌కుమార్, కె.ముత్తు పాండియన్, ఇతర అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి వెల్లడించిన ఈ సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ► చౌక విద్యుత్ ఆలోచనను అమలు చేయడం, సరికొత్త రికార్డులను నెలకొల్పడం ద్వారా దేశ వ్యాప్తంగా మన విద్యుత్ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ► ఈ క్రమంలో సామర్థ్యం పెంపు, సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతం చేయడం, వినియోగదారులే ఆధారంగా కార్యక్రమాలను చేపట్టడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ► 2019–20లో 3 లక్షలు ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23గా ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.7.18కి తగ్గించగలిగింది. ► విద్యుత్ సంస్థలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరాల్లో విద్యుత్ సబ్సిడీ, ఇతర చార్జీల కింద మరో రూ.16,724 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. ► 30 ఏళ్లపాటు పగటి పూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ► విద్యుత్ సంస్థలు కార్యనిర్వహణ, ఆర్థిక సుస్థిరత సాధిస్తేనే వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతాం. డిస్కంల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూ.3,669 కోట్ల ట్రూ అఫ్ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ అనుమతించింది. -
ఆ మూడు రంగాలకూ రుణాలివ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ, విద్యుత్ రంగం, ఓడరేవుల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కోరారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) మేనేజింగ్ డైరెక్టర్ జి.రాజ్‌కిరణ్‌రాయ్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆదిత్యనాథ్‌దాస్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం కోసం బోధనాస్పత్రులతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. ఆరోగ్య రంగానికి రూ.2 వేల కోట్ల రుణ సదుపాయం అవసరమని, ఇందుకు సహకరించాలని బ్యాంక్ ఎండీని కోరారు. 2023 నాటికి రాష్ట్రంలో మూడు పంక్షనల్ గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో గ్రీన్ ఫీల్డ్ నౌకాశ్రయాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ రంగంలో చేపట్టిన కార్యక్రమాలకు కూడా రుణ సదుపాయం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యూబీఐ ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్ మాట్లాడుతూ ఈ విషయాల్లో ప్రభుత్వానికి అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఆర్థిక–ఇంధన) డి.కృష్ణ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్సింఘాల్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి, ఏపీ ఎంఐఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. -
పట్టుబట్టిన రాష్ట్రం.. చేజిక్కిన 'పవర్'
సాక్షి, అమరావతి: ప్రజలకు ఇబ్బంది కలిగించే కేంద్ర విద్యుత్ సంస్కరణలపై రాష్ట్రం చేసిన ఒత్తిడి ఫలించింది. కీలకమైన విద్యుత్ ధరల నియంత్రణాధికారం తమ గుప్పిట్లోకి తీసుకునే ఆలోచనను విరమించుకుంది. రాష్ట్రాలకే ఈ అధికారం ఉండేలా ముసాయిదాలో మార్పు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని కొనసాగించేందుకు వీలుగా కేంద్రం ఓ మెట్టు దిగింది. సవరించిన ముసాయిదాపై బుధవారం కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులు అన్ని రాష్ట్రాల విద్యుత్ అధికారులతో చర్చించనున్నారు. తాజా నిర్ణయం వల్ల ప్రజలపై ఇష్టానుసారం విద్యుత్ చార్జీల భారం పడకుండా నియంత్రించే వీలుంది. ముందే స్పందించిన ఏపీ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా చట్ట సవరణకు ముసాయిదా ప్రతిని గత ఏడాది రాష్ట్రాలకు పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ధరలను నిర్ణయించే అధికారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ఉంటుంది. దీన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నది సంస్కరణల్లో ఒక అంశం. దీనివల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. డిస్కమ్‌లు అందించే విద్యుత్ వినియోగదారుడికి చేరడానికి యూనిట్‌కు రూ.6 పైనే అవుతుంది. ఇంత భారం పేద, మధ్య తరగతిపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా 2020–21లో రూ.1700 కోట్లు గృహ విద్యుత్‌కు సబ్సిడీ ఇచ్చింది. రైతన్నకు 9 గంటల పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి ఏకంగా దాదాపు రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోకెళ్తే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. ఏపీ స్ఫూర్తితోనే ఇతర రాష్ట్రాలూ కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ముసాయిదాపై నేడు చర్చ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. అయితే, ఏపీఈఆర్సీలోనూ తమూ ఒక సభ్యుడిని నియమించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీనికి తోడు డిస్కమ్‌లు, విద్యుత్ ఉత్పత్తిదారులకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి కేంద్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటును సూచిస్తోంది. ఈ ప్రతిపాదనను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉత్పత్తి ధరను ఖరారు చేసేది రాష్ట్రాలైనప్పుడు ట్రిబ్యునల్ ఢిల్లీలో ఉంటే సమస్యలొస్తాయని రాష్ట్రాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపే చర్చలు కీలకం కాబోతున్నాయి. ఏపీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా కేంద్రానికి స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చాలని నిర్ణయంచుకున్నట్టు విద్యుత్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కరెంటు అంతరాయాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 2019–20లో 3,90,882 విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకుంటే, 2020–21లో ఇప్పటివరకు 2,54,414 మాత్రమే నమోదు కావడం గమనార్హం. గతంలో విద్యుత్ వాడకం పెరిగినా అందుకు తగ్గట్టుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచలేదు. అలాగే గతంలో నాలుగు గ్రామాలకొక లైన్‌మ్యాన్ ఉండేవారు. దీంతో ఫీడర్ల పరిధిలో కరెంట్ పోతే లైన్‌మ్యాన్ వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో అంతరాయాలు ఏర్పడేవి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఈ అంతరాయాలు సుదీర్ఘ సమయం పాటు కొనసాగేవి. ‘తూర్పు’లో భారీ మార్పు రాష్ట్రంలో ఉన్న మూడు డిస్కమ్‌లలో గ్రామీణ ప్రాంతం, గిరిజన ఆవాసాలు ఎక్కువగా ఉండే తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలో భారీ మార్పు కన్పిస్తోంది. ఈ డిస్కమ్ పరిధిలో గత ఏడాది 1,24,035 అంతరాయాలు ఏర్పడితే ఈ ఏడాది ఇప్పటివరకు చాలా తక్కువగా 28,663 మాత్రమే నమోదయ్యాయి. ఏళ్లనాటి విద్యుత్ స్తంభాలు, లైన్లు మార్చడంపై విద్యుత్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అనధికారిక కనెక్షన్లు క్రమబద్ధీకరించి, లోడ్‌కు తగినట్టు మారుమూల ప్రాంతాల్లో సైతం కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నీ సరఫరాలో అంతరాయాలు తగ్గించడానికి తోడ్పడ్డాయి. చక్కదిద్దేందుకు చర్యలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఫీడర్ల బలోపేతానికి ప్రత్యేకంగా రూ.1,700 కోట్లు కేటాయించింది. దీంతో గ్రామీణ విద్యుత్ సరఫరా జరిగే లైన్ల సామర్థ్యాన్ని పెంచారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో పాటు అధిక లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఆధునీకరించారు. వాడకాన్ని తట్టుకునేలా కండక్టర్లను మార్చారు. ఇంధనశాఖ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇదంతా ఆన్లైన్ ద్వారానే గమనించేలా పారదర్శక విధానం తీసుకొచ్చారు. ఏ సమయంలో అంతరాయం కలిగింది? ఎంతసేపట్లో పరిష్కరించారు? అనేది తెలుసుకుంటుండటంతో సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరిగింది. మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక్కరు చొప్పున ఇంధన సహాయకులను ఏర్పాటు చేశారు. సుశిక్షితులైన ఈ సిబ్బంది అందుబాటులో ఉండటం వల్ల అంతరాయం వచ్చిన వెంటనే వారు హాజరవుతున్నారు. అంతేగాకుండా సమస్యను గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ అంతరాయం ఏర్పడకుండా నివారిస్తున్నారు. (చదవండి: ప్రేమికుల దినోత్సవం రోజున పెళ్లి పుస్తకం) హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది! -
విద్యుత్ సంస్కరణలు: రెండో రాష్ట్రంగా ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ: నిర్దేశిత మూడు విద్యుత్ సంస్కరణలు అమలు చేసి, మధ్యప్రదేశ్ తర్వాత విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. తద్వారా జీఎస్డీపీలో 0.15 శాతం మేర.. అంటే రూ.1,515 కోట్ల మేర అదనపు రుణాలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి పొందింది. కోవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా జీఎస్డీపీలో 2 శాతం అదనంగా రుణాలు తీసుకునేందుకు పరిమితిని పెంచింది. అయితే ఇందులో 1 శాతానికి షరతులు విధించింది. పౌర కేంద్రీకృత సంస్కరణలు అమలు చేస్తే ఈ 1 శాతం రుణ పరిమితినీ వాడుకోవచ్చని పేర్కొంది. (చదవండి: టీడీపీ దౌర్జన్యం.. కర్రలతో దాడి..) రేషన్ కార్డు దేశంలో ఎక్కడైనా వినియోగించుకునేలా వ్యవస్థను రూపొందించడం, సులభతర వాణిజ్య సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు, విద్యుత్ సంస్కరణల్లో ఒక్కో సంస్కరణ అమలు చేస్తే జీఎస్డీపీలో 0.25 శాతం మేర అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు వీలు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మూడు సంస్కరణలు అమలు చేసి తాజాగా విద్యుత్ సంస్కరణల అమలు పూర్తి చేసింది. (చదవండి: అపహాస్యం: మాజీ మంత్రి సైతం పచ్చ కండువాతోనే..) విద్యుత్ సంస్కరణలు మూడింటిలో ఒకటైన విద్యుత్ సబ్సిడీల ప్రత్యక్ష నగదు బదిలీని 2020 డిసెంబర్ 31లోపు ఒక్క జిల్లాలోనైనా పూర్తి చేస్తే జీఎస్డీపీలో 0.15 శాతం మేర అదనపు రుణాలకు అర్హత లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంస్కరణను అమలు చేసింది. 2020 సెప్టెంబర్ నుంచి విద్యుత్ రాయితీలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇస్తూ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 కల్లా అన్ని జిల్లాల్లో ఇలాగే అమలు చేయనుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అమలు చేసిన సంస్కరణల కారణంగా రూ.9,190 కోట్ల మేర అదనపు రుణాలకు అర్హత లభించింది. -
‘మేక్ ఇన్ ఇండియా’.. అదే మన బ్రాండ్
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో దేశీయ ఉపకరణాల వినియోగానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల్లోనూ కొత్త కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యుత్ పంపిణీ విభాగంలో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్లు, రియాక్టర్లు, స్విచ్ గేర్లు, సబ్స్టేషన్ల నిర్మాణ సామగ్రి, జల విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే హైడ్రో టర్బైన్స్, జనరేటర్స్ వంటి భాగాలన్నీ స్థానికంగా తయారైనవే వాడాలని సూచించింది. ఇవీ మార్గదర్శకాలు ► థర్మల్ విభాగంలో ఇప్పటివరకూ విదేశీ పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో స్వదేశంలో తయారైన ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యత ఇవ్వాలి. బాయిలర్స్‌లో వాడే మిల్స్, ఎయిర్ ప్రీ హీటర్స్, టర్బైన్స్లో వినియోగించే ముఖ్యమైన విడి భాగాల విషయంలోనూ దేశీయంగా తయారైన వాటికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► చివరకు బొగ్గు నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే కన్వేయర్లు, ఇతర భాగాలు భారత్‌లో తయారైనవే ఉండాలి. ► బొగ్గును మండించడం ద్వారా వచ్చే బూడిదను నిల్వ చేసే విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలి. కేటగిరీలుగా విభజన.. ► దేశీయ, విదేశీ ఉపకరణాలు వాడే కాంట్రాక్ట్ సంస్థలను కేటగిరీలుగా విభజించాలి. ► దేశీయ పరికరాలు వాడే వారికి కాంట్రాక్ట్ విధానంలో సడలింపులు ఇవ్వాలి. ► విదేశీ, దేశీయ ఉపకరణాలు వాడాల్సిన పరిస్థితుల్లో భారత్‌లో లభించే వస్తువులను దిగుమతి చేసుకునే సంస్థలను ముందుగా గుర్తించి.. విదేశీ దిగుమతి అవకాశం కల్పించాలి. అవసరమైతే విదేశీ వస్తువుల దిగుమతికి వీలుగా దేశీయ కంపెనీలు ఇతరులతో ఒప్పందం చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ► ఈ ముసాయిదాను గతంలోనే విడుదల చేసిన కేంద్రం తాజాగా కొన్ని మార్పులతో రాష్ట్రాలకు పంపింది. దీనిపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరింది. -
మీ వ్యాఖ్యలు బాధించాయి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగం పనితీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమెకు శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలోని వాస్తవ పరి స్థి తులను కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. గత సర్కారు నిర్లక్ష్యంతో విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం.. ► గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలో విద్యుత్ రంగం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంది. ఈ కారణంగా డిస్కంలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి విద్యుత్తు ఉత్పత్తిదారులకు డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.20 వేల కోట్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. డిస్కంలు రూ.27 వేల కోట్ల మేరకు నష్టాలు ఎదుర్కొన్నాయి. వాటి అప్పుల పరిమితినీ దాటిపోయాయి. గత ప్రభుత్వం అత్యధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసిన కారణంగా ఏటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు రెవెన్యూ లోటు ఏర్పడింది. ► గత ప్రభుత్వం విద్యుత్తు రంగంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. డిస్కంలకు సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా అవి అప్పులపై నడిచేలా వ్యవహరించింది. 31 మార్చి 2019 నాటికి విద్యుత్ రంగంలోని అన్ని కార్పొరేషన్ల అప్పులు రూ.70 వేల కోట్లుగా ఉన్నాయి. అధిక ధరకు కొనాల్సి వస్తోంది.. ► ఎస్ఈసీఐ, ఎన్టీపీసీ తదితర కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి తక్కువలో తక్కువ 1 కేడబ్ల్యూహెచ్‌కు రూ. 2.70 చొప్పున రాష్ట్రం విద్యుత్ కొనుగోలు చేస్తున్న వాస్తవంతో మేం ఏకీభవిస్తున్నాం. అయితే ఇది కేవలం విద్యుత్ కొనుగోలు ధర మాత్రమే. దీనికి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు.. సరఫరా, పంపిణీ వ్యయాలు అదనంగా ఉంటాయి. ► పునరుత్పాదక విద్యుత్ విషయంలో బ్యాలెన్సింగ్ చార్జీలు, గ్రిడ్ ఇంటిగ్రేషన్ చార్జీలూ ఉంటాయి. వినియోగదారులకు విద్యుత్ చేరేసరికి వాస్తవ కొనుగోలు ధర కంటే ఎక్కువ వ్యయమవుతోంది. ► ఏపీ విద్యుత్ నియంత్రణ సంస్థ 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన విద్యుత్ సరఫరా సగటు వ్యయం కేడబ్ల్యూహెచ్‌కు రూ.6.87. విద్యుత్తు సరఫరాకు ఇలా ఎం దుకు అధిక వ్యయం అవుతోందంటే.. 1)ఎన్టీపీసీ కుడ్గీ నుంచి అత్యధికంగా రూ.9.44 చొప్పున వెచ్చించి రాష్ట్రం బలవంతంగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. 2) పవర్ గ్రిడ్ సంస్థ అంతర్రాష్ట్ర విద్యుత్తు పంపిణీ కోసం వసూలు చేస్తున్న రేట్లు ఆంధ్రప్రదేశ్ విషయంలో దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఒక మెగావాట్ పంపిణీకి రూ.5.5 లక్షలు వసూలు చేస్తోంది. అదే ఇతర రాష్ట్రాల్లో రూ.లక్ష మాత్ర మే. దీనిపై కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం అనేకసార్లు విన్నవించినా ఉపశమనం లభించలేదు. ఈ కారణంగా పవర్గ్రిడ్కే ఏటా రూ.1,700 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అయినా వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా టారిఫ్ పెంచలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగానికి సరఫరా చేసిన విద్యుత్ టారిఫ్ గరిష్టంగా రూ.7.45 మాత్రమే కానీ రూ.9 కాదు. ఈ టారిఫ్ కూడా ప్రస్తుత ప్రభుత్వం పెంచింది కాదన్న విషయం గమనించాలి. ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కాపాడుతోంది.. ► ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు ఎన్నో చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్ చెల్లింపులుసహా రూ.17,904 కోట్ల మేరకు ఆర్థిక సాయాన్ని అందించింది. ► విద్యుత్ రంగంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ► రాష్ట్రంలో గ్రీన్కో గ్రూప్ 550 మెగావాట్ల పవన విద్యుత్, 1,000 మెగావాట్ల సౌరవిద్యుత్, 1,680 మెగావాట్ల రివర్స్‌పంపింగ్ ప్రాజెక్టు పెట్టేందుకు ప్రతిపాదించింది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రతిపాదనను సమర్పించగా.. రాష్ట్రానికి మరింత మేలు చేసే షరతులతో ఇప్పుడు అమలులోకి తెచ్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఈ సంస్థ మరో ప్రాజెక్టును అమలు చేసేందుకు ముందుకొచ్చింది. ..వారే తప్పుడు సమాచారం ఇస్తున్నారు టీడీపీ అధిష్టానంతో సన్నిహితంగా ఉండే ఆ పార్టీ నేతలు కొందరు గతంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిత్యం దూషించారు. టీడీపీ అధికారం కోల్పోవ డంతోనే అనైతికంగా బీజేపీలో చేరిన ఈ నేతలు వ్యక్తిగత, రాజకీయ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరుపై తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్రం గురించి ఒక అభిప్రాయాన్ని తీసుకునే ముందు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. -
విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపండి: మోదీ
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలకు తగు పరిష్కారం చూపి, పనితీరు మెరుగు పరుచుకునేందుకు సాయపడాలని ప్రధాని మోదీ కోరారు. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా విద్యుత్ పంపిణీ విధానం వేర్వేరుగా ఉండటం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన టారిఫ్ విధానం, విద్యుత్(సవరణ)బిల్లు–2020లోని అంశాలపై సమీక్ష జరిపారు. విద్యుత్ వినియోగదారుకు సంతృప్తి కలిగించాల్సిన అవసరం ఉందన్న ప్రధాని..నిర్వహణ సామర్థ్యం పెంపు, ఆర్థిక సమృద్ధి సాధించాలన్నారు. డిస్కమ్ లు తమ పనితీరును ఎప్పటికప్పుడు వెల్లడించడం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, చెల్లిస్తున్న రుసుములను బేరీజు వేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. నవీన, పునరుత్పాద ఇం ధన వనరుల వినియోగం వ్యవసాయ రంగంలో పెరగాలన్నారు. పూర్తిగా రూఫ్‌టాప్ సౌరశక్తి విని యోగించుకునేలా ప్రతి రాష్ట్రం కనీసం ఒక నగరా న్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. విద్యుత్ పరికరాలను దేశీయంగా తయారు చేసుకోవడంతో ఉద్యోగిత పెంపు వంటి ఉపయోగాలున్నాయన్నారు. -
కేంద్రం పవర్ గేమ్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో సమూల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో విద్యుత్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు విద్యుత్ సరఫరా బాధ్యతలతోపాటు కీలక అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం కాబోతున్నాయి. కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది. అలాగే విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలకు అనుమతించాలని నిర్ణయించింది. దశల వారీగా విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణకు ఈ నిర్ణయం దారి తీయనుంది. వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం పాడాలని మరో నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఎన్నో కీలకమైన సంస్కరణల అమలు కోసం కేంద్ర విద్యుత్ చట్టం– 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు 2020ను ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. దీనిపై జూన్ 5లోగా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. (చదవండి: ఆర్మీలో ‘టెంపరరీ’ జాబ్స్!) రాష్ట్రాల అధికారాలకు కత్తెర ఈఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారాలకు కేంద్రం కత్తెర వేయబోతోంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ), అప్పిలేట్ ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్ఈఆర్సీ)ల చైర్మన్, సభ్యులను.. కేంద్రం నియమించే కమిటీ ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా సుప్రీం కోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఏవైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది. విద్యుత్ చట్టం సవరణలు అమల్లోకి వస్తే ఆ అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోనున్నాయి. ప్రస్తుత విధానంలో రాష్ట్రాలు నియమించుకుంటున్న ఈఆర్సీ చైర్మన్, సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించకుండా, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలు బొమ్మల్లాగా పనిచేస్తున్నాయని, దీంతో విద్యుత్ సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గవర్నర్లను నియమించి రాష్ట్రాలకు పంపినట్లు ఎస్ఈఆర్సీ చైర్మన్, సభ్యులను ఇకపై కేంద్రం నియమించనుందని, దీంతో వీరి నిర్ణయాలు సైతం కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ప్రైవేటీకరణకు రాచబాట! విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఈ సవరణలు వీలు కల్పించనున్నాయి. ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్ సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు. అయితే సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే, ఫ్రాంచైజీల విషయంలో ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీగా నియామకమైన వ్యక్తి/సంస్థతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కంలే బాధ్యులు కానున్నాయి. ప్రధానంగా నష్టాలు బాగా వస్తున్న ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరుత్పాదక విద్యుత్ కొనకపోతే జరిమానా ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో ఏటా డిస్కంలు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందే. నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన ప్రతి యూనిట్‌కు 50 పైసలు చొప్పున డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఈ నిబంధన పెను భారంగా మారే ప్రమాదముంది. ఏటేటా బిల్లుల వాత.. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారిఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం పేర్కొంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను వచ్చే ఏడాదికి సర్పాజ్ చేసుకుంటూ పోతున్న ప్రస్తుత విధానానికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరింది. ఈ నిబంధలను అమలు చేస్తే ఏటా విద్యుత్ బిల్లులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం.. ప్రస్తుతం అవలంభిస్తున్న విద్యుత్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నివాస గృహాలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, హెయిర్ కటింగ్ సెలూన్స్ తదితర కేటగిరీల వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీరికి సంబంధించిన కొంత సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుండగా, మిగిలిన భారాన్ని క్రాస్ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న సబ్సిడీలను నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త విద్యుత్ బిల్లులో పేర్కొంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేకుండానే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రానుంది. దీంతో విద్యుత్ బిల్లులు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం క్రాస్ సబ్సిడీల భారం మోస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, రైల్వే కేటగిరీల వినియోగదారులకు ఈ విధానంతో భారీ ఊరట లభించనుంది. మరోవైపు క్రాస్ సబ్సిడీల ఆదాయానికి గండిపడటంతో ఆ మేరకు చార్జీల భారం సైతం సబ్సిడీ వినియోగదారులైన గృహాలు, ఇతర వినియోగదారులపైనే పడనుంది. వ్యవసాయ కనెక్షన్లకు సైతం మీటర్లు పెట్టి బిల్లులు జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. కేంద్రం తీసుకొస్తున్న జాతీయ టారిఫ్ పాలసీ వస్తేనే విద్యుత్ సబ్సిడీల విషయంపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ప్రస్తుతం ఇలా.. భవిష్యత్తులో ఎలా.. ఇప్పుడు గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.1.45 పైసల నుంచి రూ.9.50 వరకు వినియోగం ఆధారంగా సబ్సిడీతో బిల్లులు వేస్తున్నారు. నెలకు 50 యూనిట్లు మాత్రమే వాడితే యూనిట్‌కు రూ.1.45 చొప్పున, 100 యూనిట్ల లోపు వినియోగిస్తే 51–100 యూనిట్లకు రూ.2.45 చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. 100 యూనిట్లు దాటితే తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, 101–200 యూనిట్లకు రూ.4.30 చొప్పున టారిఫ్ ఉంది. వినియోగం 300 యూనిట్లు దాటితే రూ.7.20, 400 యూనిట్లకు చేరితే రూ.8.50, 400–800 యూనిట్ల వినియోగానికి రూ.9, 800 యూనిట్లు దాటితే రూ.9.50 చొప్పున ధరతో టారిఫ్ వసూలు చేస్తున్నారు. (చదవండి: 9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు) తక్కువ విద్యుత్ వినియోగించే పేదలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఈ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీల అమలును నిలిపేయాల్సి వస్తుంది. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్) ఆధారంగా ఆయా కేటగిరీల వినియోగదారులకు టారిఫ్‌ను నిర్ణయించాలని ఈ బిల్లులో కేంద్రం సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున యూనిట్ విద్యుత్ సరఫరాకు సగటున రూ.7.02 వరకు వ్యయం అవుతోంది. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, తదితర కేటగిరీలకు ఈ వ్యయంలో స్వల్ప తేడాలుంటాయి. ఆయా కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే వ్యయాన్ని సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు లేకుండా పూర్తి స్థాయిలో తిరిగి రాబట్టుకోవాలని కొత్త బిల్లు చెబుతోంది. అంటే, యూనిట్‌కు రూ.7, ఆపై చొప్పున టారిఫ్‌ను వినియోగదారులందరూ చెల్లించాల్సి రానుంది. దీంతో ప్రస్తుతం నెలకు వందల్లో బిల్లులు చెల్లిస్తున్న గృహ, ఇతర కేటగిరీల బిల్లులు ఒక్కసారిగా రూ.వేలకు పెరగనున్నాయి. -
పీపీఏల పాపమే!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు డిస్కమ్‌లకు శాపంగా మారాయి. మార్కెట్లో కారుచౌకగా విద్యుత్ లభిస్తున్నా పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవటానికి ఐదేళ్ల క్రితం చేసుకున్న కొనుగోలు ఒప్పందాలే కారణం. దీనివల్ల విద్యుత్ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. లాక్‌డౌన్‌తో ఒకవైపు విద్యుత్‌కు డిమాండ్ తగ్గిపోగా మరోవైపు రెవెన్యూ వసూళ్లు నిలిచిపోయాయి. 2019–20 విద్యుత్ కొనుగోలు వివరాలను ఏపీ విద్యుత్ సంస్థలు సోమవారం మీడియాకు వెల్లడించాయి. (నేటి నుంచి రిజిస్ట్రేషన్లు) ► 2019–20లో మార్కెట్లో విద్యుత్ సగటు ధర యూనిట్ రూ. 4 మాత్రమే ఉండగా ఏపీ డిస్కమ్‌లు అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేశాయి. పీపీఏలే దీనికి కారణం. ► 2019 ఏప్రిల్ నుంచి 2020 ఏప్రిల్ వరకు రాష్ట్రంలో ఏడాదికి 70,747 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉండగా వినియోగించింది 64,128 మిలియన్ యూనిట్లు. ఇందులో అధిక భాగం దీర్ఘకాలిక పీపీఏలే ఉన్నాయి. ► ప్రస్తుతం మార్కెట్లో సోలార్ విద్యుత్తు ధర యూనిట్ రూ.2 లోపు ఉంటే పీపీఏలున్న సంస్థల నుంచి రూ. 4.80 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. ► రాష్ట్రంలో జల విద్యుత్ యూనిట్ రూ.2.69 మాత్రమే ఉన్నా పీపీఏల వల్ల ఏటా 3,518 మిలియన్ యూనిట్లకే పరిమితం అవుతోంది. ► ఐదేళ్లుగా ఏపీజెన్కో ధర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి భారీగా తగ్గించడంతో అప్పులు వెంటాడుతున్నాయి. వీటికోసం చేసిన రుణాల వల్ల విద్యుత్ ధరలు మార్కెట్ రేటుకన్నా ఎక్కువగా ఉన్నాయి. ► కేంద్ర ప్రభుత్వ విద్యుత్ వాటా మార్కెట్ కన్నా ఎక్కువగా ఉంది. యూనిట్ రూ. 4.64 వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీర్ఘకాలిక పీపీఏలు లేకుంటే ఈ విద్యుత్‌కు బదులు మార్కెట్లో తక్కువకు తీసుకునే వీలుంది. పీపీఏల వల్లే ఇబ్బందులు ‘దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి పెరగడంతో మార్కెట్లో చౌకగా లభిస్తోంది. కానీ ఏపీ డిస్కమ్‌లు గతంలో దీర్ఘకాలిక పీపీఏలు కుదుర్చుకోవడంతో చౌకగా లభించే విద్యుత్‌ను పూర్తిస్థాయిలో తీసుకోలేకపోతున్నాయి. ఇది డిస్కమ్‌లను ఆర్థికంగా దెబ్బ తీస్తోంది’ – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధనశాఖ కార్యదర్శి -
విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామని ఆయన తెలిపారు. విద్యుత్‌రంగంపై బుధవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై ఆయన చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. (మీ చర్యలు స్ఫూర్తిదాయకం) రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 10వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణంపై కూడా ఈ సమావేశంలో అధికారులతో సీఎం జగన్ చర్చించారు. వీలైనంత త్వరగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్ కోసం ఫీడర్ల ఆటోమేషన్ ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. (అవినీతి ఎక్కడున్నా ఏరివేయాలి) -
సోలార్ ‘రీ–ఫిక్సింగ్’!
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ కొనుగోలు ధరల ‘రీ–ఫిక్సింగ్’వ్యవహారంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలపై అనవసరంగా రూ.వందల కోట్ల భారం పడిందని అక్షింతలు వేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ డిస్కంల యాజమాన్యాలకు కాగ్ లేఖ రాసినట్టు ఉన్నత స్థాయి అధికారవర్గాలు ధ్రువీకరించాయి. గడువు పొడిగింపు.. ధరల రీ–ఫిక్సింగ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంపును రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు డిస్కంలు అప్పట్లో మూడు విడతలుగా టెండర్లను ఆహ్వానించాయి. ప్రైవేటు పెట్టుబడిదారులు (డెవలప ర్లు) ముందుకొచ్చి రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తే, వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని డిస్కంలు హామీ ఇస్తూ టెండర్లను నిర్వహించాయి. ఇలా 2014 లో 500 మెగావాట్లు, 2015లో 1,500 మెగావాట్లు, 2016లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు టెండర్లు నిర్వహించారు. మెగావాట్, 5 మెగావాట్లు, 10 మెగావాట్లు, 30 మెగావాట్లు, 50 మెగావాట్లు, 100 మెగావాట్లు.. ఇలా వేర్వేరు ఉత్పాదక సామర్థ్యంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు డిస్కంలు వందల మంది డెవలపర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. చివరిసారిగా 2016లో రివర్స్ బిడ్డింగ్ విధానంలో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు జరగ్గా, ఓ కంపెనీ యూనిట్‌కు రూ.5.17 చొప్పున అత్యల్ప ధరతో విద్యుత్ విక్రయించేందుకు ముందుకొచ్చింది. ఈ టెండర్లలో సగటున యూనిట్‌కు రూ.5.84 ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు డెవలపర్లు బిడ్లు వేశారు. 12 నెలల్లోగా సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఒప్పందంలో డిస్కంలు గడువు విధించాయి. ఎక్కువ మంది డెవలపర్లు గడువులోగా సౌర విద్యుత్ ప్లాంట్లను నిర్మించలేకపోయారు. డెవలపర్ల విజ్ఞప్తి మేరకు అప్పట్లో డిస్కంలు గడువు పొడిగించాయి. ఈ క్రమంలో విద్యుత్ ధరలను పునర్ నిర్ణయిస్తూ (రీఫిక్స్ చేస్తూ) ఆయా విద్యుత్ కేంద్రాల ఒప్పందాలను సవరించాయి. 2016లో నిర్వహించిన టెండర్లలో బిడ్లను దక్కించుకుని గడువులోగా నిర్మాణం పూర్తి కాని ప్లాంట్ల గడువును డిస్కంలు పొడిగించాయి. ఈ క్రమంలో వాటికి చెల్లించాల్సిన విద్యుత్ ధరలను కొంతవరకు తగ్గించాయి. 2016 టెండర్లలో నమోదైన సగటు విద్యుత్ కొనుగోలు ధర రూ.5.84ను ప్రామాణికంగా తీసుకుని, గడువులోగా నిర్మాణం పూర్తి కాని ప్రాజెక్టుల విద్యుత్ ధరను తగ్గించాయి. 2016 టెండర్లలో నమోదైన అత్య ల్ప విద్యుత్ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.5.17ను ప్రామాణికంగా తీసుకుని ఆ మేరకు విద్యుత్ కొనుగోలు ధరలను తగ్గించాల్సి ఉండేదని, ఇలా చేయకపోవడంతో ప్రజలపై విద్యుత్ చార్జీల రూపంలో రూ.వందల కోట్ల భారం పడబోతోందని కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేంద్రం కక్ష సాధింపే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగం అద్భుత ప్రగతి సాధించిందని, దీన్ని ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. సౌర విద్యుత్ ప్లాంట్ల గడువు పొడిగింపు సందర్భంగా వాటి నుంచి కొనుగోలు చేసే విద్యుత్ ధరలను తగ్గించడంతో రాష్ట్ర ప్రజలపై పడే విద్యుత్ చార్జీల భారం తగ్గిందని ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అయినా దీన్ని కూడా తప్పుబడుతూ కాగ్ లేఖ రాయడం వెనక కేంద్రం దురుద్దేశాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
‘పవర్’ఫుల్ సెక్టార్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని రుణ భారం నుంచి విముక్తి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని పూర్తిగా అదుపులోకి తేవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏపీ జెన్కో సామర్థ్యాన్ని పెంచాలన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. గత ఐదేళ్లుగా అత్యధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేయడం, అందినకాడికి అప్పులు చేయడం వల్ల విద్యుత్ సంస్థలు సమస్యల్లో పడ్డాయని అధికారులు తెలిపారు. దాదాపు రూ.70 వేల కోట్ల అప్పులున్నాయని, దీనికి ఏటా వడ్డీనే రూ.7 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి ముందుంచారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలనే దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యధిక ధరలతో ఒప్పందాలొద్దు విద్యుత్ వ్యవస్థలను అప్పుల్లోకి నెడుతున్న విద్యుత్ కొనుగోలు భారాన్ని గణనీయంగా తగ్గించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం అత్యధిక రేట్లతో పీపీఏలు చేసుకున్న విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. ఎక్కువ రేటున్న విద్యుత్ కొనుగోళ్లను ఆపేయాలన్నారు. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకే లభించే ఉత్పత్తి కేంద్రాలు, బహిరంగ మార్కెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చౌకగా లభించే పక్షంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపైనా దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని ఎవరు ముందుకొచ్చినా వారితో ఒప్పందాలు చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల డిస్కమ్‌లపై భారం తగ్గుతుందన్నారు. చౌకగా విద్యుత్ ఇవ్వాలనుకునే పవన, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెన్కోను లాభాల బాట పట్టించాలి ఏపీ జెన్కోను లాభాల బాట పట్టించాలని, ఇందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రైవేట్ థర్మల్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు వస్తున్నప్పుడు ఏపీ జెన్కోకు సమస్యలెందు కొస్తున్నాయని ప్రశ్నించారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన బొగ్గు తేవడమే కాకుండా పూర్తి లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో జెన్కో థర్మల్ ప్లాంట్ నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బొగ్గు నాణ్యతను పరిశీలించేందుకు థర్డ్ పార్టీతో ఎప్పటికప్పుడు ధ్రువీకరించేలా చూడాలన్నారు. జెన్కో పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి వస్తే నష్టాలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు చర్చలు జరిపేలా చేస్తామన్నారు. మనకు రావాల్సిన బకాయిల కింద సింగరేణి బొగ్గు తీసుకోవడమో, ఏపీ పవర్ సెక్టార్ అప్పుల్లో ఇవ్వాల్సిన బకాయిల కింద తెలంగాణకు బదలాయించడమో చేయడం సరైన పరిష్కార మార్గాలుగా సీఎం సూచించారు. నష్టాల్లోకి తీసుకెళ్తున్న పాత ప్లాంట్లపై నివేదిక ఇవ్వాలన్నారు. యూనిట్ గరిష్టంగా రూ.2.80పైసలకే లభించేలా ప్రణాళిక ఉచిత విద్యుత్ కోసం ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌పై సీఎం సమగ్రంగా చర్చించారు. 50 వేల ఎకరాలు గుర్తించామని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గడువు పెట్టారు. విద్యుత్ గరిష్టంగా యూనిట్ రూ 2.80కే లభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మార్కెట్లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ప్రాజెక్టు వ్యయం అనవసరంగా పెరగకుండా చూడాలని కోరారు. అప్పర్ సీలేరులో జెన్కో తలపెట్టిన పంప్డ్ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతనూ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చే విషయమై చర్చించారు. వచ్చే ఐదేళ్లకు విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసి, ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ పొందేలా చూడాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యం గల కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ రంగంలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కచ్చితమైన పారదర్శకత తీసుకురావాలని, ఉద్యోగులకు కూడా అవసరమైన మేర అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కోసం కసరత్తు చేయాలని అధికారులకు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సలహాదారు కృష్ణ, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. (ఇండియన్ జ్యుడీషియల్ సర్వీస్) అప్పుల భారం తగ్గించాలి విద్యుత్ సంస్థలకున్న అప్పులకు చెల్లిస్తున్న అత్యధిక వడ్డీని తగ్గించే ప్రక్రియపై సీఎం సమగ్రంగా చర్చించారు. అత్యధికంగా 12 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తున్న అప్పులపై పునరాలోచన అవసరమన్నారు. 8 శాతం వడ్డీకే అప్పులిచ్చే సంస్థల నుంచి రుణాలు తీసుకుని, అత్యధిక వడ్డీ భారం ఉన్న రుణాలు తీర్చాలని, దీనివల్ల ఏటా కొన్ని వేల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైతే అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు. సంస్థలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని తెలిపారు. ఇక మీదట అనవసరమైన అప్పులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. -
జపాన్ టెక్నాలజీతో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ సంస్థ టెరీ (ది ఎనర్జీ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్) జపాన్ సాంకేతిక పరిజ్ఞానం అందించనుంది. విద్యుత్ వ్యయం నియంత్రణ, పారిశ్రామిక పురోగతి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో (ఎస్ఎమ్ఈ) 35 శాతం వరకు కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజీస్ (ఐజీఈఎస్)తో కలసి టేరీ సంస్థ బుధవారం న్యూఢిల్లీలో వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్–2020ని నిర్వహించింది. ఈ వివరాలను రాష్ట్ర ఇంధనశాఖ మీడియాకు వెల్లడించింది. సదస్సులో టెరీ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ మాట్లాడుతూ ఇంధన సామర్ధ్యం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయన్నారు. జపాన్ ఇండియా టెక్నాలజీ మ్యాచ్ మేకింగ్ ప్లాట్ ఫామ్ (జేఐటీఎమ్ఎమ్పీ) ద్వారా ఐజీఈఎస్ తో కలసి టేరీ సంస్థ ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు అందించనుందన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇంధన పొదుపుకు ఏపీలో ఎక్కువ అవకాశాలున్నట్టు టెరీ అధ్యయనంలో వెల్లడైందని మాథుర్ తెలిపారు. ఇంధన పొదుపు అమలుకు ఐక్యరాజ్యసమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థ (యూనీడో), జీఈఎఫ్ వంటి వివిధ అంతర్జాతీయ సంస్థలు పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్నట్లు అజయ్ మాథుర్ తెలిపారు. చౌక విద్యుత్తే లక్ష్యం సదస్సులో ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి సందేశాన్ని ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి చదివారు. చౌక విద్యుత్ సాధన లక్ష్యానికి ఏపీ కట్టుబడి ఉందని, విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య వెనుక పరమార్థం ఇదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులు, పేదవర్గాల ప్రయోజనానికి విద్యుత్ రంగంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. కార్యక్రమంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భక్రే, ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ స్ట్రాటజీస్ (ఐజీఈఎస్) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కజుహికో టేకుచి, యునిడో ప్రతినిధి డాక్టర్ రెనే వాన్ బెర్కెల్ తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు 21 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. -
టీడీపీ పాలనలో విద్యుత్ రంగం నిర్వీర్యం
సాక్షి, విజయవాడ: గత టీడీపీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏ లు ద్వారా తక్కువ ధరకు సోలార్ పవర్ వస్తున్న అధిక మొత్తం లో కోట్ చేశారన్నారు. విద్యుత్ చార్జీల పెంపు లేదని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడమే ధ్యేయం అని పేర్కొన్నారు. రైతులకు పగటి పూట 9 గంటలు విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం రూ.1700 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు రంగం 70వేల కోట్లు అప్పుల్లో ఉందని చెప్పారు. ఏపీసీపీడీఎల్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఇంధన శాఖ సెక్రటరీ శ్రీకాంత్ తెలిపారు. పీపీఏలు తగ్గించుకుంటూ తక్కువ ధరకు విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. రైతులకు 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. -
వడ్డీల కోసం.. అప్పులు
సాక్షి, అమరావతి: అప్పు తీర్చడం మాట దేవుడెరుగు! అప్పుపై వడ్డీలు కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురైతే? గత ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇదే. ఫలితంగా ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు కోలుకోలేని అప్పుల్లోకెళ్లాయి. గత ఐదేళ్లుగా విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి అంతా సవ్యంగా ఉందంటూ టీడీపీ సర్కారు చేసిన ప్రచారం ఉత్తదేనని తేలిపోతోంది. వాస్తవ గణాంకాలను గత సర్కారు ఏనాడూ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందుంచలేదు. తాజాగా అధికారులు చిట్టా తిరగేస్తే కళ్లు బైర్లుగమ్మే వాస్తవాలు వెలుగులోకొస్తున్నాయి. వాస్తవాలు కప్పిపుచ్చి.. ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టి టీడీపీ సర్కారు ఇబ్బడి ముబ్బడిగా తెచ్చిన అప్పులకు ఏటా రూ.550 కోట్లు వడ్డీనే చెల్లించాల్సి వస్తోంది. ఈ వడ్డీ కోసం కూడా మళ్లీ అప్పులకు వెళ్లడం గత ప్రభుత్వ హయాంలో కనిపిస్తోంది. రోజువారీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసినట్లు వెల్లడవుతోంది. ఇవన్నీ కమిషన్ ముందుంచాలి. కానీ గత ఐదేళ్లుగా కమిషన్‌కు వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టారు. ఐదేళ్లలో రూ.5,838 కోట్ల అప్పు రాష్ట్ర విభజన నాటికి ఏపీలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.2,998 కోట్ల పెట్టుబడి అప్పు (ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం), రూ.7,698 కోట్ల రోజువారీ అప్పు (వర్కింగ్ క్యాపిటల్) ఉంది. మొత్తం కలిపి అప్పు రూ.10,696 కోట్లుగా ఉంది. 2019 మార్చి నాటికి రూ.ఇది 16,534 కోట్లకు చేరింది. అంటే ఈ ఐదేళ్లల్లో రూ.5,838 కోట్లు కొత్తగా అప్పు చేశారు. ఇందులో వర్కింగ్ క్యాపిటల్ రూ.7,698 కోట్ల నుంచి రూ.10,354 కోట్లకు పెరిగింది. గత ఐదేళ్లల్లో మూడుసార్లు ప్రత్యక్షంగా విద్యుత్ చార్జీల భారం మోపారు. శ్లాబుల వర్గీకరణతో ఎక్కువ మందికి అధిక విద్యుత్ చార్జీలు పడేలా పరోక్ష భారం వేశారు. దాదాపు రూ.5 వేల కోట్ల మేర ప్రత్యక్షంగానో పరోక్షంగానో విద్యుత్ చార్జీల భారం ప్రజలపై పడింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే డిస్కమ్‌ల అప్పులన్నీ తీరి లాభాల్లో ఉండాలి. కానీ ఊహించని స్థాయిలో అప్పులు పెరిగాయి. కమిషన్ ముందుకు వాస్తవాలు ఏటా విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కమ్‌ల వాస్తవ ఆర్థిక పురోగతిని వివరించాలి. ఇలా చేయడం వల్ల అప్పులెందుకు చేస్తున్నారనే విషయంపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్ల కోసమే గత సర్కార్ ఎడాపెడా అప్పులు చేసిందనే నిజం బయటకొస్తుంది. ఈ కారణంగా వాస్తవ ఆర్థిక పరిస్థితిని కమిషన్ ముందుకు తేకపోవడంతో ప్రస్తుతం రూ.16 వేల కోట్లకు పైగా అప్పు కనిపిస్తోంది. ఈ మొత్తాన్ని కమిషన్ ముందుంచాలని విద్యుత్ అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే వార్షిక ఆదాయ అవసర నివేదికలపై కసరత్తు చేపట్టారు. ఇక మీదట అప్పులను తగ్గించుకుని ఉన్నవాటి నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా తోడ్పాటు ఇస్తుందని అధికారులు ఆ«శిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఖరీదుతో విద్యుత్ కొనుగోళ్లను ఆపేశారు. పవన, సౌర విద్యుత్ ధరలను పునఃసమీక్షించే దిశగా కసరత్తు మొదలు పెట్టారు. బొగ్గు, ఇతర కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ చేపట్టి అనవసర ఖర్చులను తగ్గిస్తున్నారు. వీలైనంత వరకూ డిస్కమ్‌లను అప్పుల నుంచి ఒడ్డున పడేసేందుకు ఈ చర్యలు చేపట్టారు. సకాలంలో ఏఆర్‌ఆర్‌లు: శ్రీకాంత్ (ఇంధనశాఖ కార్యదర్శి) డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలను సకాలంలో ఏపీఈఆర్సీ ముందుంచుతామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. అప్పులకు వడ్డీలు చెల్లించడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని, దీని నుంచి ఎలా బయటపడాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. విద్యుత్ సంస్థల్లో ఇప్పటికే ఆర్థిక నియంత్రణ కొనసాగుతోందని, రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టుల్లో ప్రజాధనం ఆదా చేస్తున్నామన్నారు. -
బాబు పాపాలే విద్యుత్ శాఖకు శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలో చంద్రబాబు అవినీతి, లంచగొండి తనం, తప్పుడు విధానాల కారణంగా విద్యుత్ సంస్థలకు ఇబ్బంది ఏర్పడిందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన చేసిన తప్పులు, అక్రమాలను వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆపాదించేందుకు టీడీపీ, ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లలో విద్యుత్ రంగంలో అవినీతి, అక్రమాలు, అస్తవ్యస్త విధానాల గురించి ఏరోజూ ప్రజల పక్షాన ఆ వర్గం మీడియా పనిచేయలేదన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో గుర్తించారన్నారు. మార్చి 2019 నాటికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం రూ.20 వేల కోట్లు బకాయిలు పడిందని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి రాగానే విద్యుత్ రంగాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. కేంద్రానికి లేఖ రాయడంతో పాటు సింగరేణి నుంచి బొగ్గు సరఫరాను పెంచాలని కోరారని వివరించారు. మరోవైపు విద్యుత్ కంపెనీల బకాయిలను చెల్లించుకుంటూ వస్తున్నారన్నారు. ఎన్టీపీసీకి రూ.3,414 కోట్లు, ఇతర విద్యుత్ సంస్థలకు రూ.1,200 కోట్లు చెల్లించామని తెలిపారు. -
చతికిలబడ్డ పారిశ్రామిక రంగం!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019 మార్చిలో (2018 మార్చితో పోల్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధి నమోదుకాలేదు. (మైనస్) 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. పారిశ్రామిక రంగంలో ఈ తరహా క్షీణత పరిస్థితి తలెత్తడం 21 నెలల్లో ఇది తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం కలిగిన తయారీ రంగం పేలవ పనితీరు మొత్తం సూచీపై ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► 2018 మార్చిలో ఐఐపీ వృద్ధి రేటు 5.3 శాతం. ► 2017 జూన్‌లో 0.3 శాతం క్షీణత నమోదయ్యింది. అటు తర్వాత ఈ తరహా ఫలితం ఇదే తొలిసారి. ►ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి రేటునూ దిగువముఖంగా సవరించడం గమనార్హం. ఇంతక్రితం ఈ రేటు 0.1 శాతం అయితే ఇప్పుడు 0.07 శాతానికి కుదించారు. ► మార్చి నెలలో తయారీ రంగాన్ని చూస్తే, వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణించింది. 2018 ఇదే నెలలో ఈ రంగం 5.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మొత్తం 23 గ్రూపుల్లో 12 గ్రూపులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. ►భారీ పెట్టుబడులకు ప్రతిబింబమైన భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగం మార్చి నెలలో మరింతగా క్షీణించింది. 2018 మార్చిలో 3.1 శాతం క్షీణతలో ఉన్న ఈ విభాగం, తాజాగా 8.7 శాతం కిందకు దిగింది. ► విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధిలోనే ఉన్నా... ఈ స్పీడ్ 5.9 శాతం నుంచి (2018 మార్చి) 2.2 శాతానికి (2019 మార్చి) పడిపోయింది. ► మైనింగ్ రంగంలోనూ విద్యుత్ రంగం ధోరణే కనబడింది. వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో –5.1 శాతం క్షీణత నమోదయితే, కన్జూమర్ నాన్– డ్యూరబుల్స్ విభాగంలో కేవలం 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. 2018–19లో మూడేళ్ల కనిష్టస్థాయి వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకూ పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు మూడేళ్ల కనిష్టస్థాయి. 2017–18లో వృద్ధి రేటు 4.4 శాతం. 2016–17లో 4.6 శాతం, 2015–16లో 3.3 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి.