
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో రుణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న 25,000 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్వహించేందుకు వీలుగా ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీలు కలసి ఓ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. ‘‘పని చేస్తున్న ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. కారణాలేవైనప్పటికీ అవి రుణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి.
వాటిని విక్రయిస్తే వాస్తవ విలువ కంటే చాలా తక్కువే లభిస్తుందన్న ఆందోళన ఉంది. కనుక సరైన విలువ రాని ప్రాజెక్టులను, వాస్తవ విలువ వచ్చేంత వరకు ఎస్‌పీవీ నిర్వహిస్తుంది’’ అని సింగ్ చెప్పారు. రుణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న 25,000 మెగావాట్ల సామర్థ్యం వరకు ప్రాజెక్టులు తొలి దశలో ఎస్‌పీవీ కిందకు వెళతాయని, రెండో దశలో మరో 15,000 మెగావాట్ల ప్రాజెక్టుల బదిలీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ విభాగాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎస్‌పీవీ కుదుర్చుకుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment