సాక్షి, ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు.
‘‘విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆర్డీఎస్ఎస్ రీ వ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పై చర్చించాం. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఈ పథకానికి ఏపీ అర్హత పొందింది. నిధులు అందిస్తాం’’ అని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు.
అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నారు.
చదవండి: స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment