rk singh
-
మన డిస్కంలు ‘ఏ’ గ్రేడ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లో ఏపీలోని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు అత్యుత్తమమని కేంద్రానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ప్రకటించింది. డిస్కంల పనితీరును అంచనా వేసి, వినియోగదారులకు తమ డిస్కం అందిస్తున్న సేవల నాణ్యత గురించి తెలియజేసేందుకు ఆర్ఈసీ అధ్యయనం చేపట్టింది. ‘కన్స్యూమర్ సర్విస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ 2022–23’ పేరుతో ఆ నివేదికను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం.. ఏపీలో 1.92 కోట్ల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కంలకు ఏ–గ్రేడ్ లభించింది. దేశంలోని 62 డిస్కంలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేసినట్లు ఆర్ఈసీ పేర్కొంది. అధ్యయనంలో భాగంగా డిస్కంలను జనరల్, అర్బన్, ప్రత్యేక వర్గంగా విభజించారు. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి, వారు చెప్పిన దాని ప్రకారం స్కోర్ ఇచ్చారు. ఆ స్కోర్ ఆధారంగా ‘ఏ+, ఏ, బి+, బి, సి+, సి, డి+, డి’ అంటూ 7 విభాగాల్లో వినియోగదారుల సేవా రేటింగ్లను కేటాయించారు. ఈ 3వ ఎడిషన్‌లో కేవలం 4 డిస్కంలు మాత్రమే ‘ఏ+’ గ్రేడ్ సాధించాయి. ‘ఏ’ గ్రేడ్‌లో ఏపీతోపాటు 8 రాష్ట్రాల డిస్కంలకు స్థానం లభించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. ‘రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగానే వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ దేశంలో అత్యుత్తమంగా నిలవగలుగుతున్నాం. ప్రభుత్వ ఆర్థక సాయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరుచుకుంటున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించుకుంటున్నాం. వాటి ద్వారా విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచుకుని నష్టాలు తగ్గించుకుంటున్నాం’. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ ఆదర్శంగా నిలుస్తున్నాం ‘డిస్కంలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటోంది. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు విద్యుత్ అందించడంలో రాజీపడకుండా దేశంలో మరెక్కడా లేనంతగా రైతులకు విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. దీనికి రా>నున్న 30 ఏళ్ల వరకూ ఎలాంటి అవాంతరాలు రాకుండా సెకీతో 7 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.’ – ఐ.పృథ్వీతేజ్, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ఎలక్ట్రిక్ వాహనదారులకు ఊరట.. తగ్గనున్న బ్యాటరీల ధరలు!
న్యూఢిల్లీ: విద్యుత్తు వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకిది శుభవార్తే. ఎందుకంటే విద్యుత్తు వాహనాల్లో అత్యంత ఖరీదైన భాగమైన బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఏర్పడింది. దేశం విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా బ్యాటరీలపై మరో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని చెప్పారు. అమ్మకాల పెరిగే బ్యాటరీల ధరలు తగ్గుతాయని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అందుకే స్టోరేజీ బ్యాటరీలకు సంబంధించి పీఎల్ఐ పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలో బ్యాటరీల తయారీ సామర్థ్యం పరిమితంగా ఉన్నందునే ధరలు అధికంగా ఉన్నాయని, దీనికి తోడు ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణఙంచే దూరం కూడా తక్కువగా ఉండటం వల్లనే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతగా ఊపందుకోవడం లేదని ఆయన వివరించారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలకు రూ.18,100 కోట్లతో కేంద్ర సర్కారు 2021 మే నెలలో పీఎల్ఐ ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. దీని ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ఉద్దేశ్యం. దీని ద్వారా 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని దేశీయంగా సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది. ఏసీసీ అనేది బ్యాటరీ స్టోరేజీలో అత్యాధునిక టెక్నాలజీతో కూడినది. విద్యుత్‌ను ఎలక్ట్రో కెమికల్ లేదా కెమికల్ ఎనర్జీ రూపంలో నిల్వ చేసి, అవసరమైనప్పుడు తిరిగి విద్యుచ్ఛక్తి మారుస్తుంది. ఈవీల వాడకం వల్ల దేశీయంగా కాలుష్యం తగ్గుతుందని మంత్రి సింగ్ చెప్పారు. జమ్మూ కశ్మీర్లో లిథియం నిల్వలు బయటపడడాన్ని అదృష్టంగా పేర్కొన్నారు. విద్యుత్‌కు భారీ డిమండ్.. సోడియం అయాన్ బ్యాటరీలపై పరిశోధనలు జరుగుతున్నాయని, సత్పలితాలు వస్తే మంచిదని మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ప్రత్యామ్నాయ కెమిస్ట్రీ అనేది తప్పనిసరిగా పేర్కొన్నారు. ‘‘విద్యుత్‌కు డిమాండ్ ఆగస్ట్‌లో 20 శాతం పెరిగినట్టు మంత్రి చెప్పారు. సెప్టెంబర్‌లోనూ 20 శాతం పెరిగిందని, అక్టోబర్‌లో మొదటి 14 రోజుల్లో 16 శాతం అధిక డిమాండ్ నమోదైనట్టు వెల్లడించారు. -
ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్రమంత్రి ప్రశంసలు కురిపించారు. ‘‘విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆర్డీఎస్ఎస్ రీ వ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పై చర్చించాం. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఈ పథకానికి ఏపీ అర్హత పొందింది. నిధులు అందిస్తాం’’ అని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. అంతకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నారు. చదవండి: స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ -
ఆర్.కె.సింగ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే
వెంగళరావునగర్ (హైదరాబాద్): కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని, వాటిని ప్రజలు నమ్మేస్థితిలో లేరని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం టీఎస్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యుత్ రంగంలో అనేక విజయాలు సాధించినట్టు పేర్కొన్నారు. తెలంగాణకు తిరిగి చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల అప్పులు నిలిపేశామని ఆర్కె సింగ్ అనడం శతాబ్దకాలంలోనే అతిపెద్ద అబద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రుణాల చెల్లింపు ఆపిందిలేదని, ఏ రంగంలో అప్పు తీసుకున్నా సకాలంలో చెల్లించే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. అందువల్లనే బ్యాంకులు ముందుకు వచ్చి అప్పులు ఇస్తామని క్యూ కడుతున్నాయన్నారు. కేంద్రం అబద్ధాలను మానుకోవాలని సూచించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యాన్ని అరికట్టాలని అధికారులను కోరారు. ఎక్కడైనా విద్యుత్ లైన్లు లూజుగా ఉన్నాయని ఫిర్యాదులు అందితే తక్షణమే స్పందించాలని సూచించారు. టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ ఎ.గోపాల్‌రావు మాట్లాడుతూ సంస్థ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని అన్నారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రత్నాకర్‌రావు, పి.సదానందం తదితరులు పాల్గొన్నారు. -
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: శరవేగంగా మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తున్నందున 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఇప్పుడు మనల్ని మనం అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకుంటున్నాము. అభివృద్ధి చెందిన దేశం అవుతుంది.’’ అని కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అన్నారు. భారతదేశం తన మౌలిక సదుపాయాలను శరవేగంగా ఆధునీకరిస్తున్నదని ఉద్ఘాటించిన ఆయన, ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు 3,106 కిలోమీటర్లని ఇది మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పుడు 2014లో కేవలం 353 కిలోమీటర్లేనని పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి చాలా కీలకమైనదని, 2014 నుండి ఈ ప్రయోజనం కోసం మూలధన వ్యయం దాదాపు ఐదు రెట్లు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజిన్ లేని సెమీ హై స్పీడ్ రైలు– వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను రోల్ అవుట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మూలధన వ్యయాల పెంపు.. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత, మూలధన వ్యయాల పెంపు గణనీయంగా పెరిగిందన్నారు. 2021–22లో ఈ వ్యవయాలు 5.5 లక్షల కోట్లయితే, 2022–23లో రూ.7.5 లక్షల కోట్లకు, 2023–24లో రూ.10 లక్షల కోట్లకు ఎగసినట్లు మంత్రి వివరించారు. విద్యుత్ రంగం పురోగతి దేశం గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 223 జీడబ్ల్యూకు చేరుకుందని పేర్కొన్న మంత్రి, 50జీడబ్ల్యూ సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్య స్థాపనలో ఉందని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనంపై ఆయన మాట్లాడుతూ, భారతదేశం సంవత్సరానికి 50జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోందని, 2030 నాటికి 500 జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. రైల్వే రంగం స్పీడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రైల్వే...కాశ్మీర్ లోయతో అనుసంధానమవుతుందని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి 2004లో ప్రారంభించిన ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపారు. 2013–14లో 1,058 మిలియన్ టన్నుల (ఎంటీ)లతో పోలిస్తే, 2022– 23లో అత్యధికంగా 1,512 మిలియన్ టన్నుల (150 శాతం) సరుకు రవాణా జరిగిందని పేర్కొన్నారు. 2030–31 నాటికి సరుకు రవాణాను రెట్టింపు చేసే సామర్థ్యాన్ని సృష్టించేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 91 శాతం బ్రాడ్ గేజ్ నెట్వర్క్ ను విద్యుదీకరించడం జరిగిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాడ్ గేజ్‌ను 100 శాతం విద్యుదీకరించడం జరుగుతుందని మంత్రి ఉద్ఘాటించారు. 3వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్... అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఉందని వివరించారు. 2014లో 74 ఉన్న ఆపరేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 2023 నాటికి 148కి రెట్టింపు అయ్యిందని మంత్రి తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లీట్ పరిమాణం 2014లో 395 నుంచి 2023లో 729కి పెరిగిందని వివరించారు. దేశీయ ప్రయాణీకుల సంఖ్య 2013–14లో 61 మిలియన్లు ఉంటే, 2022–23 నాటికి 136 మిలియన్లకు రెండింతలు పెరిగింది. ఇక అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 2013–14లో 43 మిలియన్లు ఉంటే, 2022–23లో 54 మిలియన్లకు చేరినట్లు వివరించారు. ఉడాన్ పథకం కింద ఇప్పటివరకు 479 రూట్లు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. మొబైల్స్ విప్లవం మొబైల్ ఫోన్ చందాదారుల సంఖ్య 2014లో 90.45 కోట్లు ఉంటే, 2023 నాటికి 114.4 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఈ కాలంలో దాదాపు 24 కోట్ల మంది కొత్త చందాదారులు చేరినట్లు వివరించారు. మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ చందాదారుల సంఖ్య ఇదే కాలంలో 4.56 కోట్ల నుంచి 81.19 కోట్లకు చేరినట్లు మంత్రి తెలిపారు. -
76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపు 76 శాతం అవసరాలను థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచే సమకూర్చుకోవాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1,750 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభలో విద్యుత్, పునరుత్పాదక ఇంథన శాఖ మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ఉద్దేశంతో నిర్మిస్తున్న భిన్నరకాల విద్యుత్ ప్లాంట్ల వివరాలనూ మంత్రి వెల్లడించారు. ‘మొత్తంగా 25వేలకుపైగా మెగావాట్ల సామర్థ్యంతో 18 బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. వాటిలో ఒకటి గ్యాస్ ఆధారిత థర్మల్ ప్లాంట్ ఉంది. మొత్తంగా 18వేల మెగావాట్ల సామర్థ్యంతో 42 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. 8వేల మెగావాట్ల సామర్థ్యంతో అణువిద్యుత్ కేంద్రాలను నెలకొల్పుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సామర్థ్యం దేశం సొంతం. 3.6 శాతం మిగులును సాధించాం. డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడూ 0.7 శాతం మిగులును సాధించాం’ అని మంత్రి వెల్లడించారు. అయితే 2023 ఏప్రిల్–జూన్ కాలంలో మాత్రం 0.2 శాతం లోటు కనిపించిందని మరో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి వెల్లడించడం గమనార్హం. -
హరిత హైడ్రోజన్‌కు త్వరలో మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా హరిత హైడ్రోజన్ తయారీకి భారత్‌ను ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దే విధంగా త్వరలోనే ప్రమాణాలు, మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. దేశీయంగా ఎలక్ట్రోలైజర్ల తయారీ కోసం 15 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంపై (పీఎల్ఐ) కసరత్తు చేసినట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి దీన్ని 60 గిగావాట్ల స్థాయికి పెంచుకోవాలని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించే క్రమంలో ఎలక్ట్రోలైజర్లను తక్కువ సుంకాలతో ఎప్పటివరకూ దిగుమతి చేసుకోవచ్చనేది కేంద్రం నిర్దిష్ట గడువు నిర్దేశిస్తుందని, ఆ తర్వాత నుంచి భారీ సుంకాలు అమల్లోకి వస్తాయ ని చెప్పారు. అలాగే హరిత హైడ్రోజన్ తయారీలో దేశీ పరిశ్రమ తగు రీతిలో పోటీపడే స్థాయికి ఎదిగే వరకూ తొలుత కొన్నేళ్ల పాటు పీఎల్ఐ స్కీము అందుబాటులో ఉంటుందని సింగ్ వివరించారు. దాదాపు రూ. 19,744 కోట్ల జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఆయన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మిషన్ కింద వచ్చే అయిదేళ్లలో 5 మిలియన్ టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. -
65 శాతం పర్యావరణ అనుకూల విద్యుత్
న్యూఢిల్లీ: భారత్ 2030 నాటికి తన మొత్తం విద్యుదుత్పత్తిలో 65 శాతాన్ని శిలాజేతర ఇంధనాల నుంచే కలిగి ఉంటుందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. గ్రీన్ ఎనర్జీపై సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 90 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ప్రస్తుతం ఈ సామర్థ్యం 20 గిగావాట్లుగా ఉన్నట్టు చెప్పారు. 15–20 గిగావాట్ల సోలార్ ఎక్విప్మెంట్ తయారీ సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు తెలిపారు. పీఎల్ఐ పథకం కింద మరో 40 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు కానున్నట్టు చెప్పారు. అధిక సామర్థ్యం కలిగిన సోలార్ ఎక్విప్మెంట్ తయారీకి మళ్లాలని పరిశ్రమకు సూచించారు. మన దేశంలో ఇప్పటికే పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 170 గిగా వాట్లకు చేరుకుందని, మరో 80 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉన్నట్టు చెప్పారు. ‘‘2030 నాటికి 50 శాతం పర్యావరణ అనుకూల ఇంధన విద్యుత్ సాధిస్తామని హామీ ఇచ్చాం. కానీ, దానికంటే ఎక్కువే సాధిస్తాం. 2030 నాటికి 65 శాతం కంటే ఎక్కువ సామర్థ్యం పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచి ఉంటుంది. 2030 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను 33 శాతం తగ్గిస్తామని చెప్పాం. ఇప్పటికే 30 శాతం తగ్గించే స్థాయికి చేరుకున్నాం. కనుక 2030 నాటికి 45 శాతం తగ్గింపు లక్ష్యాన్ని సాధిస్తాం’’అని మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. -
విద్యుత్ బిల్లుపై వెనక్కి తగ్గేదేలే...
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగాన్ని సమూలంగా మార్చేసే విద్యుత్ చట్టసవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకోబోమని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆర్కే సింగ్ తమ వైఖరిని మళ్లీ వెల్లడించారు. విద్యుత్తు సంస్కరణలపై ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆర్కే సింగ్, విద్యుత్ రంగంలో కేసీఆర్ ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకుంటున్నారని, అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో ఉన్న ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకునేందుకు విద్యుత్తు చట్టసవరణ బిల్లు ఉపయోగపడు తుందని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమం అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడుతూ గత నెల లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్తు చట్టసవరణ బిల్లులో పొందుపరి చిన అంశాలన్నీ ప్రజలకు ప్రయోజనం కలి గించేవే అని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా విద్యుత్ పంపిణీ విషయంలో పోటీతత్వం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు తక్కువ ధరల్లోనే మెరుగైన సేవలు అందుతాయని వెల్లడించారు. అంతేగాక విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా ప్రస్తుతం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలను ఏరకంగానూ అడ్డుకోవడం లేదని ఆర్కే సింగ్ స్పష్టత ఇచ్చారు. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు కేవలం రైతులకు మాత్రమే కాకుండా, తాము ఇవ్వాలని భావించిన ఏ వర్గానికి అయినా ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌తోపాటు సబ్సిడీల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరంలేదని ఆర్కేసింగ్ వెల్లడించారు. ఇదీ చదవండి: విద్యుత్తు సామర్థ్యం పెంపునకు కమిటీలు ఏర్పాటు చేయాలి -
కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
మళ్లీ తెరపైకి విద్యుత్ బిల్లు
సాక్షి, హైదరాబాద్: టెలికాం సేవల తరహాలో ప్రైవేటు, ప్రభుత్వ సర్వీసు ప్రొవైడర్ల నుంచి నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులకు సైతం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు మళ్లీ తెరపైకి వచ్చింది. జూలైలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామని, ఇందుకు సర్వసన్న ద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తాజాగా ప్రకటించడంతో దీనిపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. విద్యుత్ పంపిణీ రంగాన్ని డీలైసెన్సింగ్ చేయడంతో పాటు ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలను అనుమతించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం అవుతాయని, కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తీసుకుంటుందని విమర్శలున్నాయి. ఇక ప్రైవేటు విద్యుత్ ! సంస్కరణ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్‌ను సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుకలగనుంది. అలాగే ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు. అయితే ఇందుకు సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. ఫ్రాంచైజీలకు ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీలతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కంలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నష్టాలు బాగా వచ్చే ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుంది. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం.. విద్యుత్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. వినియోగదారులకు ఉచితంగా/రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ప్రతి నెలా సబ్సిడీలను చెల్లిస్తోంది. మిగిలిన రాయితీ భారాన్ని క్రాస్ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. సబ్సిడీలనునగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త బిల్లులో పేర్కొంది. ఆందోళనలో విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధం కావడంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రమైంది. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణతో తమ భవితవ్యం ప్రమాదంలో పడుతుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. బిల్లు విషయంలో కేంద్రం మొండిగా ముందుకు వెళ్తే దేశవ్యాప్త సమ్మెను ప్రకటించే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. ఏటేటా బిల్లుల వాత.. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారిఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లు పేర్కొం టోంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను అలాగే భరించే ప్రస్తుత విధా నానికి ఫుల్స్టాప్ పెట్టాలని తాజా బిల్లు చెబుతోంది.ఈ నిబంధనలను అమలు చేస్తే ఏటా విద్యుత్ చార్జీలు భారీగా పెరిగే అవకాశాలుంటాయని నిపుణులు అంటున్నారు. -
విద్యుత్తు సామర్థ్యం పెంపునకు కమిటీలు ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులే కాకుండా అదనంగా బయోమాస్, హరిత విద్యుత్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కేసింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ బుధవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా కమిటీలు ఏర్పాటు చేశాయని లేఖలో ఆయన గుర్తు చేశారు. 2005తో పోలిస్తే 2030 నాటికి 45 శాతం ఉద్గార తీవ్రత తగ్గింపు విజయవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని కేంద్ర మంత్రి తెలిపారు. స్టీరింగ్ కమిటీల్లో విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, రవాణా, పరిశ్రమలు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ప్రజా పనుల శాఖలు, వాటి ప్రధాన కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. -
ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయి రూ.6,111.88 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,111.88 కోట్ల విద్యుత్తు బకాయిల అంశాన్ని ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న విద్యుత్తుకు తెలంగాణ చెల్లించాల్సిన అసలు మొత్తంపై వివాదం లేదని, వడ్డీ విషయంలోనే సయోధ్య అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ సొమ్ము ఇవ్వనందున ఏపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అంశం కోర్టులో ఉన్నందున్న పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. చెక్‌డ్యాంల బలోపేతానికి రెండేళ్లుగా నిధులివ్వలేదు ఆంధ్రపద్రేశ్లో చెక్‌డ్యాంల బలోపేతానికి వాటర్ బాడీస్ రిపేర్ రెన్నోవేషన్, రీస్టోరేషన్ నిమిత్తం 2019–20, 2020–21ల్లో నిధులు విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు అవినాశ్‌రెడ్డి, వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. హస్తకళల ప్రోత్సాహానికే హున్నార్‌హాట్‌లు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని హస్తకళలను ప్రోత్సహించడానికే హున్నార్‌హాట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో హాట్లు నిర్వహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ హస్తకళల పోటీపై ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు రెడ్డెప్ప, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్, సంజీవ్‌కుమార్, ఎం.వి.వి.సత్యనారాయణ, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఆర్‌ఐపీలో 31 ప్రాజెక్టులు డ్యాం రిహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డీఆర్ఐపీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 31 ప్రాజెక్టులకుగాను రూ.667 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఉమ్మడి ఏపీలో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. గ్రామ్ ఉజాలలో మూడు జిల్లాలు గ్రామ్‌ఉజాల ప్రోగ్రామ్‌లో ఏపీలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. తొలిదశలో గుర్తించిన జిల్లాల్లో లబ్ధిదారుల అవగాహనకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీసీఎస్‌ఎల్) చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రిబ్యునల్ కేటాయింపుల్లోనే అప్పర్‌భద్ర కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన జలాల్లో భాగంగానే తెలంగాణలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు ఉందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర అంశం సమసినట్లేనని భావిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌తో ఏపీ పరిశ్రమల మంత్రి భేటీ
న్యూఢిల్లీ: ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 'రాష్ట్రంలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. మన్నవరం, కొప్పర్తి పారిశ్రామికవాడలో సోలార్ ప్యానెల్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. కోల్ ఇండియా, పవర్ మినిస్ట్రీ సహకారంతో 3 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ఈ పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందనిని కేంద్రమంత్రికి తెలిపినట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (ఆర్బీఐ నూతన పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ) -
అవన్నీ అనవసరమైన భయాందోళనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ ఎన్టీపీసీ, రిలయెన్స్ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సరఫరా కంపెనీలు, విద్యుత్ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సమాచార లోపమే కారణం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), ఢిల్లీలోని డిస్కమ్‌ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్‌లకి, గెయిల్‌కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్ సప్లయ్ చేయలేమని గెయిల్ రాసిన లేఖతో విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖపై లెఫ్ట్‌నెంట్ జనరల్ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్ సరఫరా చేయమని గెయిల్ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి. గుజరాత్లో టాటా పవర్ ఉత్పత్తి నిలిపివేత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌కు 1,850 మెగావాట్లు, పంజాబ్‌కు 475, రాజస్తాన్‌కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే.. బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్‌మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది. అప్పట్లో ఆక్సిజన్‌కూ కొరత లేదన్నారు: సిసోడియా కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్‌కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. -
డిస్కంలకు రూ. 21 వేల కోట్ల రుణం
సాక్షి, ఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు పునరుజ్జీవం కల్పించేందుకు సమూల సంస్కరణలు చేపట్టినట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిస్తూ సంస్కరణల్లో భాగంగా ఈ రెండు రాష్ట్రాల డిస్కంలకు ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రూ. 21 వేల కోట్ల రుణం సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఈ రుణంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 8,370 కోట్లు, తెలంగాణకు రూ.12,652 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. కొన్ని షరతులకు లోబడి ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఈ రుణాన్ని డిస్కంలకు సమకూర్చుతాయని తెలిపారు. మంజూరు చేసిన రుణంలో మొదటి వాయిదా కింద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు రూ. 3,300 కోట్లు, తెలంగాణకు రూ. 6,287 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. లిక్విడిటీ ఇన్ఫ్యూజన్ స్కీమ్ కింద మంజూరు చేసే ఈ రుణం కొన్ని షరతులకు లోబడి మాత్రమే పంపిణీ జరుగుతుందని తెలిపారు. అందులో ప్రధానమైంది ప్రభుత్వ శాఖలు, విభాగాలు డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలను మూడు వార్షిక వాయిదాలలో విడుదల చేయడానికి అంగీకరిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో విద్యుత్ వినియోగానికి సంబంధించి స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు విధిగా అమర్చాని, దాని వల్ల డిస్కంలకు ప్రభుత్వ చెల్లింపులు సకాలంలో జరిగే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ వినియోగదారుల్లో కొన్ని కేటగిరీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ విధానాన్ని కూడా సమూలంగా మార్చాలన్నారు. సబ్సిడీకి సంబంధించిన బకాయలను ప్రతి మూడు మాసాలకు ఒకసారి విధిగా చెల్లించడానికి అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి షరతులకు ఆయా రాష్ట్రాలు అంగీకరించిన తర్వాత మాత్రమే తదుపరి రుణ వాయిదాల విడుదల జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలను ఆయా డిస్కంలు బాధ్యాతాయుతంగాను, పారదర్శకంగాను నిర్వహించాలని తెలిపారు. అందుకోసం ప్రతి త్రైమాసికం ముగిసే నాటికి డిస్కంలు ఎనర్జీ ఆడిట్ ఫలితాలను ప్రచురించాలన్నారు. 2021 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి ఫీడర్ వ్యాప్తంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) మార్గదర్శకాలను అనుసరించి ఎనర్జీ అకౌంటింగ్ చేపట్టాలన్నారు. ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్లో విద్యుత్ నష్టాలను గణనీయంగా తగ్గించే దిశగా డిస్కంలు ఆచరణ సాధ్యమైన కార్యాచరణను రూపొందించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఈ చర్యలు, సంస్కరణల ద్వారా డిస్కంలు నష్టాల ఊబి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుందని మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. -
ఇంధన పొదుపులో ఏపీ ప్రతిభ, కేంద్రం ప్రశంస
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు కోసం చేపట్టిన ‘పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్(పీఏటీ)’ పథకం అమలులో ఏపీ ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని కేంద్రం అభినందించింది. దేశవ్యాప్తంగా పీఏటీ రెండో దశకు సంబంధించి వివిధ పరిశ్రమలు సాధించిన పురోగతిపై సోమవారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అధ్యక్షతన వెబినార్ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) డీజీ అభయ్ భాక్రే పలు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపులో ఏపీ సాధించిన పురోగతిని ఆయన వెల్లడించినట్టు రాష్ట్ర ఇంధన శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పీఏటీ రెండో దశలో ఏపీ 0.25 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ సాధించిందని.. పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు బలమైన మార్గదర్శకాలను రూపొందించిన అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటని ఆయన పేర్కొన్నట్లు తెలిపింది. అలాగే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఐవోటీ ఆధారిత ఇంధన సామర్థ్య టెక్నాలజీని వినియోగించడాన్ని కేంద్రం ప్రశంసించింది. -
పేదలపై భారం మోపలేం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్ భారం వేసేందుకు తాము ఎంతమాత్రం సిద్ధంగా లేమని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతుకు శాశ్వత ఉచిత విద్యుత్‌ను అందించడం బాధ్యతగా భావిస్తున్నామని తెలిపింది. విద్యుత్ ఉద్యోగుల భద్రతకు నష్టం కలిగేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని పేర్కొంది. విద్యుత్ సంస్కరణలపై రాష్ట్రాలతో కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చట్ట సవరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి రాష్ట్ర వాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. విద్యుత్ సంస్కరణల దిశగా అడుగేసిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాదే ముసాయిదా ప్రతిని రాష్ట్రాలకు పంపింది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం దీనిపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో ముసాయిదాలో మార్పులు చేసిన కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు చేపట్టింది. ఉచిత విద్యుత్ అందాల్సిందే: ‘పేదల గృహ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం భారీగా సబ్సిడీ ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా పేదలకు యూనిట్ రూ.1.45కే (50 యూనిట్లలోపు) ఇస్తోంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం గత ఏడాది రూ.1,700 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు డిస్కమ్‌లకు ప్రభుత్వం రూ.9 వేల కోట్ల వరకు సబ్సిడీ ఇస్తోంది. మరోవైపు రైతు కోరినన్ని కనెక్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సబ్సిడీ విషయంలోనూ వెనకాడబోం. రైతుల కోసమే 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం ప్రారంభించింది. వారికి ఉచిత విద్యుత్ అందాల్సిందే..’ అని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. కేంద్రం విద్యుత్ సంస్కరణలు చేపడితే. వ్యవసాయ విద్యుత్ లైన్లు ఎవరు వేయాలి? ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఎవరు కొత్తవి బిగించాలి? అనే అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ విషయాల్లో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడబోదని, కచ్చితమైన విధివిధానాలు ఉండాల్సిన అవసరం ఉందని, రైతు ప్రయోజనాలు కాపాడాలని కోరారు. మా ఉద్యోగులకు కష్టం రావొద్దు కేంద్రం ఏ సంస్కరణలు చేపట్టినా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర విద్యుత్ రంగం బలోపేతం దిశగా వారు ప్రభుత్వంతో మమేకమై పని చేశారని శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. పవన, సౌర విద్యుత్‌ను జాతీయ స్థాయిలో లెక్కించి, రాష్ట్రం వాటా కేటాయిస్తే బాగుంటుందని సూచించగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. పోటీ ఆపరేటర్లు వచ్చినా డిస్కమ్‌లు యథాతథంగా పనిచేస్తాయని చెప్పారు. డిస్కమ్‌ల లైన్లనే ప్రైవేటు ఆపరేటర్లు వాడుకుంటారని, ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ చౌర్యం, మీటర్ల బిగింపు, రీడింగ్‌తో పాటు అనేక అంశాలపై చర్చ జరిగింది. కాగా దక్షిణాది ప్రాంతంలో వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ఏర్పాటును కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. చదవండి: అభిమానికి సీఎం జగన్ ఆత్మీయ ఆలింగనం చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్ -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన మేజర్ జనరల్ ఆర్కే సింగ్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ, తెలంగాణ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ కలిశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించిన సందర్భంగా ఈనెల 18న తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందజేశారు. మేజర్ జనరల్ ఆర్కే సింగ్‌తో పాటు రిటైర్డ్ కల్నల్ రాంబాబు కూడా సీఎంను కలిశారు. సీఎస్‌తో ఆర్కే సింగ్ భేటీ ఆర్కే సింగ్ శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను కలిశారు. ఈనెల 18న తిరుపతిలో నిర్వహించనున్న వేడుకలకు సీఎస్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఆర్కే సింగ్ సీఎస్‌ను కోరారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్సుల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. వాటి నిర్మాణానికి అవసరమైన నిధులను రక్షణ శాఖ నుంచి మంజూరు చేయించాలని కోరారు. ఇలా ఉండగా, డీజీపీ సవాంగ్‌ను కూడా ఆర్కే సింగ్ కలిశారు. తిరుపతిలో నిర్వహించే వేడుకలకు రావాలని ఆహ్వానించారు. -
ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: ఇంధన పొదుపులో దక్షిణమధ్య రైల్వేకు కేంద్రం నుంచి మూడు పురస్కారాలు లభించాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ అవార్డులు ప్రకటించింది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ వర్చువల్ సమావేశంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సోమేశ్‌కుమార్‌కు ఈ పురస్కారాలు అందించారు. పరిశ్రమ/రైల్వే వర్క్‌షాప్ కేటగిరీలో విజయవాడ డీజిల్ లోకోòÙడ్ ప్రథమ బహుమతి పొందింది. భవనాలు/ప్రభుత్వ కార్యాలయాల కేటగిరీలో సికింద్రాబాద్‌లోని ఎస్సీఆర్ అకౌంట్స్ కార్యాలయ భవనం రెండో స్థానంలో నిలిచింది. ట్రాన్స్‌పోర్టు/జోనల్ రైల్వే కేటగిరీలో దక్షిణ మధ్య రైల్వే ‘జోన్ మెరిట్ సర్టిఫికెట్’సాధించింది. తిరుపతి–సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు తిరుపతి–సికింద్రాబాద్ (07456) స్పెషల్ ట్రైన్ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు. -
కేంద్రమంత్రిని కలిసిన విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి బుధవారం కలిశారు. రాయలసీమ కరువు నివారణ పథకం, వైయస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రమంత్రిని కోరారు. రాయలసీమ కరువు నివారణ పథకానికి ఎలక్ట్రికల్ మెకానికల్ కాంపోనెంట్ కింద రూ. 12,012 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు ఎలక్ట్రో మెకానికల్ కాంపోనెంట్ కింద రూ.3,008 రూపాయలు రుణంగా ఇవ్వాలని కూడా విజయసాయి రెడ్డి విన్నవించారు. ఈ రెండు ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పీఎఫ్సీ, ఆర్ఏసీలు రుణం అందించేందుకు ఆదేశాలు ఇవ్వాలని విజయసాయి రెడ్డి ఆర్కే సింగ్‌ను కోరారు. చదవండి: మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తి -
సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు
సాక్షి, అమరావతి: వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సమర్థత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసించారు. ప్రజలకు ఏ మాత్రం భారం కాకుండా విద్యుత్ రంగాన్ని కాపాడాలనే ఆయన ఆలోచనలు అభినందనీయమన్నారు. సంస్కరణ దిశగా అడుగులేస్తున్న ఏపీకి కేంద్రం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ సాయిప్రసాద్ సోమవారం ఆర్కే సింగ్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ వివరాలను శ్రీకాంత్ నాగులాపల్లి ‘సాక్షి’కి వివరించారు. ► రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సీఎం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రికి శ్రీకాంత్ వివరించారు. వ్యవసాయ సబ్సిడీని రైతు ఖాతాలోకే ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రైతుపై భారం పడకుండా చేస్తున్నామని మంత్రికి తెలియజేశారు. ► నగదు బదిలీ విషయంలో వైఎస్ జగన్ నిర్ణయం సాహసోపేతమని, రైతుకు మేలు చేయాలనే ఆలోచన అభినందనీయమని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలకు ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏపీ ముందడుగును అన్ని రాష్ట్రాలకు వివరించి చెబుతామన్నారు. ఇలాంటి డైనమిక్ ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కొనియాడారు. ► రైతుల కోసం రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల గురించి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ సాయిప్రసాద్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఈ ప్రాజెక్టుకు అవసరమైన చేయూతనిస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా దేశవ్యాప్తంగా దాదాపు 69,000 పెట్రోల్ బంకుల్లో కనీసం ఒక్కటి చొప్పునైనా చార్జింగ్ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనితో పాటు ప్రభుత్వ రంగ రిఫైనర్లకు చెందిన సొంత బంకుల్లో (సీవోసీవో) ఈవీ చార్జింగ్ కియోస్క్‌ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో చమురు శాఖ వర్గాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ మేరకు సూచనలు చేశారు. ఇందుకోసం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) తమ నిర్వహణలోని అన్ని సీవోసీవో పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ కియోస్క్‌లను పెట్టే విధంగా చమురు శాఖ ఆదేశాలు జారీ చేయొచ్చని ఆయన సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతరత్రా ఫ్రాంచైజీ ఆపరేటర్లు కూడా తమ ప్రతీ బంకులో కనీసం ఒక్కటైనా కియోస్క్ పెట్టేలా ఆదేశాలిస్తే.. దేశవ్యాప్తంగా ఈవీ చార్జింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యం సాకారం కాగలదని పేర్కొన్నాయి. నగరాలతో పాటు జాతీయ రహదారులపై కూడా ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, వదోదర, భోపాల్ వంటి నగరాలపై చమురు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వివరించాయి. -
సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలం: మంత్రి
పట్నా/న్యూఢిల్లీ: ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసేలోగానే బిహార్‌లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్) శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒంటరిగానే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని ధీమా వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవా కొనసాగిందని, ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో జనతాదళ్ పార్టీతో పొత్తు కొనసాగుతుందని, లోక్‌సభ ఎన్నికల ఫలితం సీట్ల పంపకంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయం చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. (చదవండి: ఎన్డీయేలో చేరనున్న జితన్ రామ్ మాంఝీ) ‘‘బిహార్‌లో మేం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం. అందులో ఎలాంటి సందేహం లేదు. 1996 నుంచి జేడీయూతో బంధం ఉంది. దానిని వదులుకోవాలని అనుకోవడం లేదు. మా స్నేహితులను వదులుకోం. అందుకే సీట్ల పంపకం ప్రక్రియలో సున్నితంగా వ్యవహరిస్తున్నాం. అలా అని మా మధ్య విభేదాలలేమీ లేవు. లోక్‌సభ ఎన్నికల ప్రభావం అయితే దీనిపై ఉంటుందని చెప్పగలను’’ అని ఆర్కే సింగ్ చెప్పుకొచ్చారు. కాగా కేంద్ర విద్యుత్ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన బిహార్‌లోని అరా నియోజకవర్గ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ( చదవండి: నవంబర్ 29లోగా బిహార్ ఎన్నికలు) ఇక ఆర్కే సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ సీనియర్లు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏవిధంగా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జితన్ రామ్ మాంఝీ, శరద్ యాదవ్ వంటి సీనియర్ నేతల ఘర్ వాపసీకి రంగం సిద్ధం చేసిన జేడీయూ సీట్ల సర్దుబాటు విషయంలో ఎలా ముందుకు సాగుతుందనేది చర్చనీయాంశమైంది. జితన్ రామ్ మాంఝీని ఎన్డీయేలోకి ఆహ్వానించిన జనతాదళ్ హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) పార్టీకి తొమ్మిది సీట్లు కేటాయించిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.(చదవండి: నితీశే బిహార్ సీఎం అభ్యర్థి) -
శ్రీశైలం ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి విచారం
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం పవర్‌హౌజ్ ప్రమాద ఘటనపై కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంస్థ భవిష్యత్తు కోసం ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. ఈ సందర్బంగా శ్రీశైల ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన ఆర్కే సింగ్.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఈఏ) ద్వారా విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని హైడ్రల్ పవర్ ప్రాజెక్టులను ఆడిట్ చేసి భద్రతా లోపాలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: శ్రీశైలం ప్రమాదం: ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు) కాగా ఆగస్టు 20న శ్రీశైలం పవర్ హౌజ్‌లో ప్రమాదం జరిగిన విషయం విదితమే. అధికారులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. హైడ్రో పవర్ టన్నెల్లో పని జరుగుతున్న సమయంలో సడన్‌గా మెషీన్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏఈ, డిఈ , ఏఏఈ లతో పాటు మొత్తం 9 మంది సిబ్బంది మృతి చెందారు. (చదవండి: శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం) -
చర్చించాకే విద్యుత్ చట్టంలో మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రాలతో మరోదఫా సంప్రదించిన తర్వాతే విద్యుత్ చట్టంలో మార్పులు తెస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. రాష్ట్రాల నుంచి అందిన అభ్యంతరాలపై లోతుగా చర్చిస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి ఇందులో పాల్గొన్నారు. అభిప్రాయాలు స్వీకరించాం విద్యుత్ పంపిణీ సంస్థల్లో ప్రైవేట్ పోటీ, నియంత్రణ మండలి చైర్మన్, సభ్యుల నియామకాన్ని కేంద్ర పరిధిలోకి తేవడం, విద్యుత్ సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకే అందించే పలు సంస్కరణలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనివల్ల రాష్ట్ర ప్రాధాన్యతలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఏపీతో పాటు పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులతో సుదీర్ఘంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చించారు. ఇప్పటికే ఫీడ్ బ్యాక్ అందిందని, అందరి ఆమోదం తీసుకున్నాకే ముందుకెళ్తామని చెప్పారు. ఫీడర్లవారీగా సోలార్ ప్లాంట్లు ఫీడర్ల వారీగా సోలార్ ప్లాంట్లు నెలకొల్పే రాష్ట్రాలకు వ్యయంలో 30 శాతం సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఏపీలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలను నెడ్‌క్యాప్ ఎండీ రమణారెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. డిస్కమ్‌లను బలోపేతం చేయాలి కోవిడ్–19 నేపథ్యంలో నష్టపోయిన రాష్ట్రాలకు ఆత్మ నిర్భర్ భారత్ కింద సాయం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ప్రాధాన్యతపై చర్చించారు. డిమాండ్‌కు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఏడాదిలోనే బకాయిలన్నీ చెల్లించాం: మంత్రి బాలినేని డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలపై భారం పడకుండా, విద్యుత్ సంస్థలను అప్పుల నుంచి బయట పడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. పాత బకాయిలన్నీ ఏడాది వ్యవధిలోనే చెల్లించామని తెలిపారు. -
చైనా, పాక్‌కు ‘పవర్’ కట్!
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు. తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘మనం ఇక్కడ ప్రతీదీ తయారు చేసుకుంటున్నాం. అయినా కూడా భారత్ రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతయ్యాయి. మన దేశంలోకి చొరబడే పొరుగు దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులను అనుమతించలేం. చైనా, పాకిస్తాన్ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదు. ఆయా దేశాల నుంచి దిగుమతులకు అనుమతులివ్వబోము. ఈ దిగుమతి చేసుకున్న వాటిల్లో (చైనా నుంచి) ఏ మాల్వేర్ ఉందో ట్రోజన్ హార్స్ ఉందో (వైరస్లు). వీటి సాయంతో వారు అక్కడెక్కణ్నుంచో మన విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయొచ్చు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. టవర్ ఎలిమెంట్లు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు మొదలైనవి భారత్‌లోనే తయారవుతున్నా.. వాటిని దిగుమతి చేసుకోవడం ఆందోళనకరమైన విషయమన్నారు. ‘మీ డిస్కంలు చైనా కంపెనీల నుంచి పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయొద్దని కోరుతున్నాం’ అని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులకు మంత్రి సూచించారు. స్వయం సమృద్ధి భారత్ నినాదంలో భాగంగా ఇక్కడ లభించే ఏ పరికరాన్నీ చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకోబోదని చెప్పారు. దిగుమతి చేసుకున్న వాటిని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తుందని, ఆ తర్వాత అవసరమైతే వాటిని రద్దు కూడా చేయొచ్చని కూడా ఆయన తెలిపారు. డిస్కంలకు ఆర్థిక ఊరట... డిస్కంలకు ఆర్థికంగా ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్ పథకాల స్థానంలో ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. కొత్త స్కీమ్ కింద డిస్కంల నష్టాలను తగ్గించేందుకు రాష్ట్రాలు తగు ప్రణాళికలు సమర్పించాల్సి ఉంటుంది. నష్టాలను తగ్గించుకునే ప్రణాళికల్లో లేని డిస్కంలకు ఈ పథకం కింద రుణాలు గానీ గ్రాంట్లు గానీ ఇవ్వడం జరగదని సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో లాగా ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ సంస్థల ద్వారానైనా డిస్కంలను లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. డిస్కంలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్యాకేజీ కింద రాష్ట్రాలు రూ. 93,000 కోట్లు అడిగాయని, ఇప్పటిదాకా రూ. 20,000 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చైనా దిగుమతులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.. చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి విద్యుత్ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో సరిహద్దులున్న దేశాలు.. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యుత్ సరఫరా వ్యవస్థలో వినియోగించేందుకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల యంత్రాలు, పరికరాలు, విడిభాగాలతో మాల్వేర్, ట్రోజన్లు, సైబర్ ముప్పులాంటివి పొంచి ఉన్నాయేమో తెలుసుకునేందుకు, భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసేందుకు దేశీయంగా పరీక్షించడం జరుగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. విద్యుత్ శాఖ నిర్దేశించిన అధీకృత ల్యాబొరేటరీల్లో టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. టిక్‌టాక్‌కు... 45 వేల కోట్ల నష్టం! చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధ యాప్‌ల జాబితాలో బైట్‌డాన్స్‌కు చెందిన యాప్‌లు మూడు(టిక్‌టాక్, విగో వీడియో, హెలో యాప్) ఉన్నాయి. మిగిలిన యాప్‌ల నష్టాలతో పోల్చితే ఈ మూడు యాప్‌ల నష్టాలే అధికమని కైయాక్సిన్గ్లోబల్డాట్కామ్ పేర్కొంది. విదేశాల్లో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన చైనా యాప్‌ల్లో టిక్‌టాక్ కూడా ఒకటి. టిక్‌టాక్‌కు చైనా తర్వాత అత్యధిక యూజర్లు ఉన్నది భారత్‌లోనే. ఈ ఏడాది తొలి 3 నెలల కాలంలో 61.1 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయి. ఇది ప్రపంచవ్యాప్త టిక్‌టాక్ డౌన్‌లోడ్స్‌లో 30 శాతం. -
విద్యుత్ కొనుగోళ్లతో రూ.5 వేల కోట్ల భారం
-
విద్యుత్ కొనుగోళ్లతో రూ.5 వేల కోట్ల భారం
సాక్షి, అమరావతి: సోలార్, విండ్ పవర్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.ఐదు వేల కోట్ల భారం పడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. సోలార్,విండ్ పవర్ల కోసం యూనిట్‌కు రూ.3.55 భారం పడుతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సోలార్, విద్యుత్ పవర్ల కొనుగోలు కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీలో మరింత సంక్షోభం తలెత్తుతోందని పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన విద్యుత్ సరఫరా కంపెనీలు దేశంలోనే అత్యంత తక్కువ విద్యుత్ సరఫరా నష్టాలు నమోదు చేస్తూ మంచి పనితీరు కనబరుస్తున్నా, పై కారణాల వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని లేఖలో ప్రస్తావించారు. భారం రూ.5,300 కోట్లు.. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్ సరఫరా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సోలార్, విండ్ పవర్ల కంపెనీలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతోందని..తగిన పరిష్కార మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో ఏడాదికి 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే.. అందులో 15వేల మిలియన్ యూనిట్లు సోలార్, విండ్ పవర్‌లదేనని..దీనివల్ల పడే భారం రూ.3.55పైసలు చొప్పున ఏడాదికి రూ.5300 కోట్లు అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కొనుగోలు రూపంలో ప్రతి సోలార్, విండ్ పవర్ యూనిట్‌కు రూ.4.84 కన్నా ఎక్కువ చెల్లిస్తోందన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం.. గడిచిన నాలుగేళ్లుగా నిర్ణయించిన పరిమితికి మించి సోలార్, విండ్ పవర్‌ను కొనుగోలు చేస్తున్నామని, దీనివల్ల జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి, సోలార్, విండ్ పవర్ ల కోసం అధిక భారాన్ని మోస్తున్నామన్నారు. చిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రానికి ఇది తీవ్ర నష్టంగా ఉందన్నారు. ఇన్ని సమస్యలున్నా ప్రత్యామ్నాయ, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 175 జిగా వాట్స్ లక్ష్యాన్ని తనకు కష్టం ఉన్నా సరే భుజానకెత్తుకోవాల్సి వచ్చిందని మంత్రి బాలినేని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించిన విధంగానే కేంద్రం కూడా సోలార్, విండ్ పవర్ ప్రమోషన్లో భాగంగా సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుందని సూచించారు. భారాన్ని మోపడం సమంజసం కాదు.. మరోవైపు విభజన నాటికి ఆస్తులు పంపిణీ చేయకుండా కేవలం అప్పులు మాత్రమే పంపిణీ జరగడం రాష్ట్ర ప్రజలకు భారంగా మారిందని పేర్కొన్నారు. అధిక విద్యుత్ ధరల మీద ఏపీ డిస్కంలు ఎన్‌సిఎల్‌టి ను ఆశ్రయించడమో, ఇప్పటికే అధికంగా ఉన్న ధరలను ఇంకా పెంచి వినియోగదారులపై భారాన్ని మోపడం కూడా సమంజసం కాదని సూచిస్తూ..ఈ నేపథ్యంలో ఈ సంక్షోభానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారం చూపేందుకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరులు శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇంధన శాఖ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఇమ్రాన్‌కు ఆర్మీ అండదండలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మిలటరీ, ఐఎస్ఐ మద్దతుతో ప్రధాని గద్దెనెక్కనున్న ఇమ్రాన్ ఖాన్ కారణంగా.. భారత్‌తో సత్సంబంధాల్లో మార్పు ఉంటుందని ఆశలేమీ పెట్టుకోవద్దని రాజకీయ, మిలటరీ నిపుణులు హెచ్చరించారు. ‘ఆయన ఆర్మీ మనిషి. పాక్ ఆర్మీ చెప్పింది చేయడమే ఆయన పని’ అని పాకిస్తాన్లో భారత మాజీ దౌత్యవేత్త జి. పార్థసారథి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సమర్థించారు. ఇమ్రాన్ నాయకత్వంలో పాకిస్తాన్ ఆలోచనాధోరణిలో మార్పు ఉండబోదన్నారు. భారత్‌లోనూ మరో 10 నెలల్లో ఎన్నికలున్నందున మోదీ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌తో దోస్తీకి పాకులాడే ప్రయత్నం చేయకపోవచ్చని మరో మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ నాయకత్వంలో భారత్–పాక్ ఉద్రిక్త పరిస్థితుల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పరోక్షయుద్ధాన్ని కొనసాగిస్తుందన్నారు. -
ఏసీల్లో కనిష్ట ఉష్ణోగ్రత ఇకపై 24 డిగ్రీలే
ఎయిర్ కండీషనర్.. ప్రస్తుతం నగరజీవుల ఇళ్లలో తప్పనిసరిగా మారిన ఉపకరణం. బహుళ జాతి సంస్థల నుంచి ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఓజోన్ పొరను దెబ్బతీసే గ్రీన్హౌస్ వాయువులు భారీగా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీల్లో కనిష్ట ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్ చేయాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విద్యుత్ ఆదాకు ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ సిఫార్సుల్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. లాభమేంటి..? ఎయిర్ కండీషనర్ల(ఏసీ)లో ఉష్ణోగ్రతను ఒక్క డిగ్రీ మేర పెంచితే దాదాపు 6 శాతం విద్యుత్‌ను ఆదా చేయొచ్చు. తద్వారా అనవసరమైన ఖర్చు తగ్గుతుంది. అలాగే మానవశరీరం సగటు ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ బహుళజాతి సంస్థలు, కంపెనీల్లో ఉష్ణోగ్రత 18–21 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇంత చల్లటి వాతావరణంలో దీర్ఘకాలం పనిచేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు దుబారా వ్యయాన్ని తగ్గించేందుకు ఏసీల్లో ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండేలా సెట్టింగ్స్‌ను తప్పనిసరి చేయాలని బీఈఈ కేంద్రానికి సూచించింది. దీనివల్ల ఏటా 2,000 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం జపాన్ సహా పలుదేశాల్లో ఏసీల కనిష్ట ఉష్ణోగ్రతను 28 డిగ్రీలకు పరిమితం చేయడాన్ని బీఈఈ నివేదికలో పేర్కొంది. అమలు చేసేదెలా.. ఏసీల్లోఉష్ణోగ్రతను డీఫాల్ట్‌గా 24 డిగ్రీలు చేయాలని తొలుత విమానాశ్రయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు సహా పలు సంస్థలకు ప్రభుత్వం సూచించనుంది. ఆ తర్వాత 4 నుంచి 6 నెలల పాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రజల నుంచి అభిప్రాయా లను సేకరించి, చివరికి ఏసీల్లో 24 డిగ్రీల ఉష్ణో గ్రతను తప్పనిసరి చేస్తారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ స్పందిస్తూ.. ‘ఏసీల్లో ఉష్ణోగ్రతను 24 డిగ్రీలకు పరిమితం చేయడం వినియోగదారులకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది’ అనే సూచనను కంపెనీలు ఏసీలపై ముద్రించాలని కోరారు. -
త్వరలో విద్యుత్ వివాదాలను పరిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ వివాదాలను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటా మని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలి పారు. సదరన్ రీజినల్ పవర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం సహకరిస్తుందన్నారు. రాష్ట్రాల పునర్విభజన వివాదాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంపకాల వివాదంపై దాదాపు మూడున్నరేళ్ల కింద కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అప్పటి కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) చైర్మన్ నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిందా? లేదా? అన్న సమాచారం తన వద్ద లేదన్నారు. వివాదం నా దృష్టికి రాలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్‌కు సంబంధించి విభజన వివాదాలు నెలకొని ఉన్నాయన్న విషయం తన దృష్టికి రాలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో విద్యుత్ రంగం సాధించిన విజయాలపై మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర నగరాల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైతులకు సౌర విద్యుత్ పంప్ సెట్లను సరఫరా చేసేందుకు కుసుమ్ (కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తమ్ మహాభియాన్) పేరుతో కొత్త పథకా న్ని అమల్లోకి తీసుకురానున్నామన్నారు. దీనిద్వా రా దేశ వ్యాప్తంగా 27.5 లక్షల సోలార్ పంప్సెట్ల ను పంపిణీ చేస్తామని, విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాల్లో 17.5 లక్షల పంప్సెట్లు ఇస్తామన్నారు. త్వరలో కొత్త టారిఫ్ విధానం విద్యుత్ ధరలను నిర్ణయించే టారిఫ్ విధానంలో సమూల సంస్కరణల కోసం ముసాయిదా టారిఫ్ విధానాన్ని ప్రకటించామని ఆర్కే సింగ్ పేర్కొన్నా రు. త్వరలో అమల్లోకి వచ్చే ఈ విధానం ప్రకారం పలు కేటగిరీల వినియోగదారుల మధ్య క్రాస్ సబ్సిడీ 25 శాతానికి మించరాదన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు 15 శాతం లోపు ఉండాలన్నారు. -
25,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు పట్టాలపైకి
న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో రుణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న 25,000 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్వహించేందుకు వీలుగా ఎన్టీపీసీ, ఆర్ఈసీ, పీఎఫ్సీలు కలసి ఓ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. ‘‘పని చేస్తున్న ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. కారణాలేవైనప్పటికీ అవి రుణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిని విక్రయిస్తే వాస్తవ విలువ కంటే చాలా తక్కువే లభిస్తుందన్న ఆందోళన ఉంది. కనుక సరైన విలువ రాని ప్రాజెక్టులను, వాస్తవ విలువ వచ్చేంత వరకు ఎస్పీవీ నిర్వహిస్తుంది’’ అని సింగ్ చెప్పారు. రుణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న 25,000 మెగావాట్ల సామర్థ్యం వరకు ప్రాజెక్టులు తొలి దశలో ఎస్పీవీ కిందకు వెళతాయని, రెండో దశలో మరో 15,000 మెగావాట్ల ప్రాజెక్టుల బదిలీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ విభాగాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఎస్పీవీ కుదుర్చుకుంటుందని చెప్పారు. -
సెప్టెంబర్ 25న ప్రధాని కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబరు 25 న విద్యుత్ రంగంపై పెద్ద ప్రకటన చేయనున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్.కె. సింగ్ చెప్పారు. సీన్బీసీటీవీ 18 ఇంటర్వూలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 25 న ప్రధానమంత్రి విద్యుత్ రంగంపై కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాం, ఇది ప్రజలకు చాలా ముఖ్యమైనదని సింగ్ పేర్కొన్నారు. కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రకటన చేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ప్రయివేటు ప్లేయర్స్ మరింత ప్రాధ్యాన త ఉంటుందనికానీ, కంటెంట్" క్యారేజ్ వేరు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎలు) గౌరవిస్తూ చట్టపరమైన మార్పులను చేయనున్నామని ఆయన తెలిపారు. ఆ ఒప్పందాలకు పభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 25 న బిజెపి జాతీయ కార్యనిర్వాహక కార్యకర్తలను మోదీ ప్రసంగించనున్నారు. దీన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దేశ ఆర్ధిక మాంద్యం మీద ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం సెప్టెంబరు 25 ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక కర్త దీనదయాల్ వార్షికోత్సవం సందర్భంగాపవర్ ఫర్ ఆల్పథకాన్ని లాంచ్ చేయనుంది. 'సౌభాగ్యా' పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు , వైర్లపై సబ్సిడీ ఇవ్వనుందని తెలుస్తోంది. -
'దేశ వ్యతిరేక నినాదాలు చేస్తే చితక్కొడతాం'
అరా: ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే వాళ్లను చావగొడతామని మాజీ హోంశాఖ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నా మిగతావారిలా తాము చూస్తూ ఊరుకోమని వారిని చితక్కొడతామని పేర్కొన్నారు. కాగా, గతేడాది జేఎన్‌యూలో కొంతమంది నిరసనకారులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ సంఘటనను ప్రస్తావించని ఆర్కే సింగ్ ఇన్‌డైరెక్టుగా కామెంట్ చేశారు. కాగా, యోగి ఆదిత్యనాధ్‌ను ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేయడంపై విలేకరులు ప్రశ్నించగా.. జాతీయవాదం కలిగిన ఆయనో మంచి వ్యక్తని సమాధానం ఇచ్చారు. -
'పాక్ ను దెబ్బకు దెబ్బ తీయాలి'
న్యూఢిల్లీ: యూరి సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బకు తీయాలని బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్కే సింగ్ అన్నారు. యూరి ఘటన తరహాలో పాకిస్థాన్ పై దాడి చేయాలని సూచించారు. ప్రతీకార దాడి చేసేంతవరకు ఇస్లామాబాద్ ఇలాంటి దాడులకు పాల్పడుతూనే ఉంటుందన్నారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ చాలా ఏళ్లుగా కుట్రలు కొనసాగిస్తూనే ఉందని ఆరోపించారు. భవిష్యత్ లోనూ దాయాది దేశం కుట్రలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 'మనం దెబ్బకు దెబ్బ తీయనంత కాలం పాకిస్థాన్ తీరు మారదు. మనకు జరిగిన నష్టం వారికి జరిగితే పాకిస్థాన్ కళ్లు తెరుస్తుంద'ని సింగ్ వ్యాఖ్యానించారు. కశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై నలుగురు ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. -
'దెబ్బకు దెబ్బే సమాధానం'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని యురి సెక్టార్లోగల ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిపట్ల కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ ఆర్కే సింగ్ తీవ్రంగా ప్రతిఘటించారు. దీనికి దెబ్బకు దెబ్బే సమాధానం అని చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడిగానే భావిస్తే అంతరాత్మను మోసం చేసుకోవడమే అవుతుందని, ఈ దాడి వెను పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హస్తం ఉందని ఆయన అన్నారు. పేరుకే ఉగ్రవాదుల దాడిలా కనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి దాడిని తలపించేలా తిప్పికొట్టడమే ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఆదివారం వేకువజామున యురి సెక్టార్లో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై జవానులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన పోరాటంలో 17 మంది జవాన్లు వీర మరణం పొందగా, 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఒవైసీపై బీజేపీ నేత ఫైర్
న్యూఢిల్లీ/అలహాబాద్: మాతృదేశంపై ప్రేమ లేకుంటే ఇక్కడ ఎందుకు ఉన్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బీజేపీ నాయకుడు ఆర్కే సింగ్ ప్రశ్నించారు. ఇండియాపై ఇష్టం లేకుంటే తనకు నచ్చిన చోటుకి అసదుద్దీన్ వెళ్లిపోవాలని సూచించారు. తన గొంతుపై కత్తి పెట్టినా 'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని తాను చేయబోనని అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే సింగ్ ఈ విధంగా స్పందించారు. ఒవైసీపై అలహాబాద్ హైకోర్టులో ఐపీసీ 124 ఏ కింద ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కాగా, భారతీయుడిని అయినందుకు తాను గర్విస్తున్నానని ఒవైసీ అన్నారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. -
దావూద్‌ను ఎందుకు చంపలేదు ?
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఆ గడ్డపైనే హతమార్చేందుకు భారత ప్రభుత్వం కోవర్ట్ ఆపరేషన్‌కు ఎప్పుడో సిద్ధపడింది. ఇందుకోసం చోటా రాజన్ ముఠాకు చెందిన కొంత మందిని ఎంపిక చేసి మహారాష్ట్రకు ఆవల గుర్తుతెలియని చోట అవసరమైన శిక్షణ కూడా ఇచ్చింది. అటల్ బిహారి వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రధాన మంత్రి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న అజిత్ డోవెల్ భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డెరైక్టర్‌గా పనిచేసినప్పుడు ఈ కోవర్ట్ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారు. అయితే దావూద్ ఇబ్రహీం డీ-కంపెనీతో సంబంధాలున్న ముంబై పోలీసు ఉన్నతాధికారులు డబ్బుకు అమ్ముడుబోయి ఈ వ్యూహాన్ని వమ్ము చేశారు. కోవర్ట్ ఆపరేషన్ కోసం శిక్షణ పొందుతున్న చోటా రాజన్ ముఠా సభ్యులపై అరెస్టు వారెంట్లు తీసుకొచ్చి వారిని అరెస్టు చేశారు. మాజీ హోం శాఖ కార్యదర్శి, ప్రస్తుత బీజీపీ నాయకుడు ఆర్కే సింగ్, సీదీ బాత్ కార్యక్రమం కింద ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంను హతమార్చేందుకు కోవర్ట్ ఆపరేషన్‌కు ప్రయత్నాలు జరిగినట్టు గతంలో పలుసార్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా వెల్లడవడం మాత్రం ఇదే మొదటిసారి. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం పాక్ రక్షణలో ఉన్న విషయం తెల్సిందే. అందుకు సంబంధించి భారత ప్రభుత్వం తాజా సాక్ష్యాధారాలను కూడా సేకరించింది. ఇప్పటికైనా దావూద్‌పై చర్య తీసుకునేందుకు భారత్ చొరవ తీసుకోవాలని, అందుకు ప్రపంచ టైస్ట్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా నిర్వహించిన తరహాలో ఆపరేషన్ నిర్వహించాలని ఆర్కే సింగ్ సూచించారు. దావూద్‌తోపాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీద్ సయాద్‌కు పాక్ రక్షణ కల్పిస్తున్న విషయం మనకే కాదని, మొత్తం ప్రపంచానికి తెలుసునని ఆయన అన్నారు. పాక్‌లో ఎవరి నుంచి తమకు ముప్పు ఏర్పడుతుందని తెలిసినా అమెరికా చర్యలు తీసుకుంటోందని, అలాగే మనం తీసుకోవాలని ఆయన వాదించారు. దావూద్‌పై కమాండో ఆపరేషన్‌కు మనం సిద్ధపడితే పాకిస్తాన్ యుద్ధానికి వస్తుందనే భయం కొందరిలో ఉందని, మనతో యుద్ధంచేసే మూర్ఖత్వం పాకిస్తాన్‌కు ఉందని తాను భావించడం లేదని ఆర్కే సింగ్ అన్నారు. ఒకవేళ నిజంగా యుద్ధానికి వచ్చినా దాన్ని పటిష్టంగా ఎదుర్కొనే సామర్థ్యం మనకుందని ఆయన చెప్పారు. చర్చల పట్ల ఎప్పుడూ చిత్తశుద్ధి కనబర్చని పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియకు స్వస్తి చెప్పాలని, చర్యల ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సలహాదారులు సరైన సలహాలను ఇవ్వడం లేదని ఆయన అన్నారు. -
'భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ వద్దు'
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్‌ను బీజేపీ ఎంపీ వ్యతిరేకిస్తున్నారు. మన దేశంపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం ఏంటని అభ్యంతరం చెప్పారు. వచ్చే డిసెంబర్లో భారత్-పాక్ క్రికెట్ సిరీస్ నిర్వహణకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. దావూద్ ఇబ్రహీంకు పాక్ ఆశ్రయమిస్తోందని, ముంబై ఉగ్రవాద దాడుల్లో ఆ దేశం ప్రమేయముందని అన్నారు. 26/11 ముందై దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు దెబ్బతిన్నాయి. -
పార్లమెంట్ భద్రత పెంచాలి!
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవన భద్రతా వ్యవస్థలో పలు లోపాలు ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ఒకటి పేర్కొంది. భవ న సముదాయంలో ఏర్పాటు చేసిన 450 సీసీటీవీ కెమెరాల్లో 100 పనిచేయడం లేదని తెలిపింది. మొత్తం 12 గేట్ల వద్ద భద్రతను పెంచాలని సూచించింది. ముగ్గురు ఎంపీలు.. ఆర్కే సింగ్(కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి), సత్యపాల్ సింగ్(ముంబై మాజీ పోలీస్ కమిషనర్), హరీష్ చంద్ర మీనా(రాజస్థాన్ మాజీ డీజీపీ)తో కూడిన ఈ కమిటీ ఇటీవల తన నివేదికను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అందజేసింది. పార్లమెంట్‌లోని భద్రతా సిబ్బందిలో చాలామందికి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్లు, జాకెట్లు, ఆధునిక ఆయుధాలు లేవని, పలు పరికరాలు కాలం చెల్లినవని కమిటీ తెలిపిందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. పార్లమెంట్ గేట్ల వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ సిస్టమ్ యంత్రాలను, ఇతర భద్రతా పరికరాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునీకరించి, జాగిలాలు, నిఘా టవర్లను పెంచాలని కమిటీ సిఫార్సు చేసిందన్నాయి. -
'యూపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందే'
ఉత్తరప్రదేశ్‌లో వరుసపెట్టి జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను చూస్తుంటే అక్కడ పరిపాలన పూర్తిగా స్తంభించిందని, అందువల్ల రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన పరిస్థితులన్నీ అక్కడ ఉన్నాయని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. అక్కడి ప్రభుత్వం విఫలమైందని, శాంతిభద్రతలు అన్నవే లేవని, హత్యలు, అత్యాచారాలు సర్వసాధారణం అయిపోయాయని సింగ్ చెప్పారు. అందుకే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని అన్నారు. రాష్ట్ర పరిపాలనలోని ప్రతి విభాగంలోను రాజకీయ జోక్యం బాగా ఎక్కువైపోయిందని, ముఖ్యంగా పోలీసు విభాగంలోనూ రాజకీయ జోక్యం ఉండటంతో పాలన కుప్పకూలిందని సింగ్ విశ్లేషించారు. అలీగఢ్‌లో ఓ మహిళా జడ్జిపై అత్యాచారం, హత్య సంఘటనను ఆయన ప్రస్తావిస్తూ, చివరకు జడ్జికి కూడా.. తన సొంతింట్లోనూ రక్షణ లేదని, ఇలాగైతే ఎలాగని ప్రశ్నించారు. -
''షిండే హోం మంత్రిగా పనికిరాడు''
''హోం మంత్రిగా సుశీల్ కుమార్ షిండే ఏమాత్రం పనికిరాడు. ఆయన కంటే ఆర్థికమంత్రి చిదంబరం వంద రెట్లు నయం''.. ఈ మాటలన్నది ఎవరో కాదు. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా నిన్న మొన్నటివరకు పనిచేసిన ఆర్.కె. సింగ్!! ఢిల్లీ పోలీసుల బదిలీలు, పోస్టింగులలో కలగజేసుకుంటున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలోను, దావూద్ ఇబ్రహీంను ఇండియాకు రప్పించడంలో అమెరికా సాయం చేస్తోందంటూ తప్పుడు సమాచారం ఇచ్చినందుకు షిండే రాజీనామా చేసే అవకాశముందా అని టీవీ చానళ్ల విలేకరులు ఆర్కే సింగ్‌ను ప్రశ్నించగా ఆయనీ ఘాటు సమాధానం ఇచ్చారు. హోం మంత్రిగా చిదంబరం వందరెట్లు నయమని ఇటీవలే బీజేపీలో చేరిన ఆర్కే సింగ్ చెప్పారు. దావూద్ ఇబ్రహీం విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి అనవసరంగా దేశాన్ని తప్పుదోవ పట్టించారని షిండేపై విరుచుకుపడ్డారు. ఎఫ్‌బీఐ సమావేశాల్లో తాను కూడా పాల్గొన్నానని, కానీ తాము సాయం చేస్తామని వాళ్లు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. తనకు, షిండేకు భేదాభిప్రాయాలున్న విషయం ప్రధానమంత్రితో సహా అందరికీ తెలుసన్నారు. అయితే, రిటైరైన తర్వాత ఆర్కే సింగ్‌కు కొత్తగా ఉద్యోగం ఏదీ ఇవ్వలేదన్న దుగ్ధతోనే ఆయనీ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి వి. నారాయణసామి అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వంలో ఉన్నత పదవిలో పనిచేసిన ఆయనకు చాలా పత్రాల గురించి తెలుసని, ఎలాంటి ఆధారం లేకుండా అనవసరంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. షిండే మాటల మనిషి కాదు, చేతల మనిషని నారాయణసామి కితాబిచ్చారు. ఆర్కేసింగ్ పదవిలో ఉండగా ఈ ఆరోపణలు చేసి ఉంటే వాటికి విలువ ఉండేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.