'దేశ వ్యతిరేక నినాదాలు చేస్తే చితక్కొడతాం'
అరా: ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే వాళ్లను చావగొడతామని మాజీ హోంశాఖ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నా మిగతావారిలా తాము చూస్తూ ఊరుకోమని వారిని చితక్కొడతామని పేర్కొన్నారు. కాగా, గతేడాది జేఎన్‌యూలో కొంతమంది నిరసనకారులు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ సంఘటనను ప్రస్తావించని ఆర్కే సింగ్ ఇన్‌డైరెక్టుగా కామెంట్ చేశారు.
కాగా, యోగి ఆదిత్యనాధ్‌ను ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చేయడంపై విలేకరులు ప్రశ్నించగా.. జాతీయవాదం కలిగిన ఆయనో మంచి వ్యక్తని సమాధానం ఇచ్చారు.