
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జష్‌పూర్ జిల్లాలో స్థానిక బీజేపీ నేత ఒకరు గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కన్సబెల్ జన్‌పద్ పంచాయతీ అధ్యక్షుడు, బీజేపీ నేత మోతీలాల్ భగత్(45) తనపై 2016, అక్టోబర్‌లో తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది జనవరిలో తనను ఒడిశాలో పెళ్లి చేసుకున్నాడని వెల్లడించింది. తనకు భార్య ఉందన్న సంగతి దాచిపెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. చివరికి ఈ ఏడాది జూన్‌లో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పింది.
యువతి ఫిర్యాదు మేరకు బీజేపీ నేత భగత్‌పై రేప్, కిడ్నాప్, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. యువతిపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె మైనర్ కనుక నిందితుడిపై పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment