
ఒవైసీపై బీజేపీ నేత ఫైర్
న్యూఢిల్లీ/అలహాబాద్: మాతృదేశంపై ప్రేమ లేకుంటే ఇక్కడ ఎందుకు ఉన్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బీజేపీ నాయకుడు ఆర్కే సింగ్ ప్రశ్నించారు. ఇండియాపై ఇష్టం లేకుంటే తనకు నచ్చిన చోటుకి అసదుద్దీన్ వెళ్లిపోవాలని సూచించారు. తన గొంతుపై కత్తి పెట్టినా 'భారత్ మాతాకీ జై' అనే నినాదాన్ని తాను చేయబోనని అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే సింగ్ ఈ విధంగా స్పందించారు.
ఒవైసీపై అలహాబాద్ హైకోర్టులో ఐపీసీ 124 ఏ కింద ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కాగా, భారతీయుడిని అయినందుకు తాను గర్విస్తున్నానని ఒవైసీ అన్నారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.