Allahabad High Court
-
కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరమే, కానీ..
న్యూఢిల్లీ: మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ ఈ ఘటనపై విచారణ అంశం ప్రస్తుతానికి తమ పరిధిలో లేదని సీజేఐ బెంచ్ పిటిషనర్‌కు స్పష్టం చేసింది.మహా కుంభమేళా దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికారులే బాధ్యత వహించాలంటూ అడ్వొకేట్ విశాల్ తివారీ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఘటనపై సమగ్ర నివేదికను సమర్పించేలా యూపీ సర్కార్‌ను ఆదేశించాలని, అదే సమయంలో తమ నిర్లక్య వైఖరితో మరణాలకు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారాయన. అంతేకాదు.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు జారీ చేయాలని విశాల్ తివారీ తన పిల్లో ప్రస్తావించారు.అయితే ఘటన దురదృష్టకరమైనదే అయినప్పటికీ.. ఉత్తర ప్రదేశ్ అధికారులపై చర్యలకు ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. అలాగే.. ఈ పిల్‌పై విచారణ జరపలేం అని చెప్పారు. ఈ ఘటనపై జ్యూడీషియల్ కమిటీ ఏర్పాటైంది. కాబట్టి, అలహాబాద్ హైకోర్టును సంప్రదించండి అని పిటిషనర్ విశాల్ తివారీకి సీజేఐ సూచించారు. దీంతో ఆయన తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. మరోవైపు.. హైకోర్టులో ఇదే అంశంపై పిల్ దాఖలైన విషయాన్ని యూపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.కుంభమేళాలో భాగంగా.. మౌనీ అమావాస్య అమృత స్నానాలను పురస్కరించుకుని త్రివేణి సంగమం వద్ద జనవరి 29వ తేదీ అర్ధరాత్రి దాటాక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తుల మృతి, 60 మందికి గాయాలైన సంగతి తెలిసిందే. -
ఏడాదిలోగా విడాకులివ్వలేం
ప్రయాగ్‌రాజ్: హిందూ వివాహ చట్టం ప్రకారం.. హిందూ మతంలో వివాహ బంధానికి ఎంతో పవిత్రత ఉందని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. హిందూ దంపతులకు పెళ్లయిన ఏడాదిలోనే విడాకులు మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. అసాధారణమైన పరిస్థితుల్లో తప్ప వారికి విడాకులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. పవిత్రమైన వారి బంధాన్ని విచ్ఛిన్నం చేయలేమని వెల్లడించింది. తమకు విడాకులు మంజూరు చేయాలంటూ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ దోనాది రమేశ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. హిందూ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేయాలంటే వివాహమైన తర్వాత కనీసం ఏడాదిపాటు ఆగాలని హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14 సూచిస్తున్నట్లు వెల్లడించింది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు ఉంటుందని సూచించింది. నిశాంత్ భరద్వాజ్, రిషికా గౌతమ్ అనే దంపతులు పెళ్లయిన సంవత్సరంలోగానే పరస్పర అంగీకారంతో విడాకుల కోసం తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వారి దరఖాస్తును కింది కోర్టు తిరస్కరించడంతో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కోసం సంవత్సరంలోగా దరఖాస్తు చేయడం చెల్లదని, దాన్ని తాము విచారించబోమని హైకోర్టు వెల్లడించింది. -
‘సహ జీవన’ సంబంధాలకు తగు పరిష్కారం కనుగొనాలి
ప్రయాగ్‌రాజ్: సమాజం ఆమోదించకున్నా నేటి యువత సహ జీవన సంబంధాలకు మొగ్గు చూపుతోందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి సందర్భాల్లో నైతిక విలువలను కాపాడేందుకు తగు పరిష్కారం లేదా నిబంధనలను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. వివాహం పేరుతో మహిళతో శారీరక సంబంధం కొనసాగించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారణాసి వాసి ఆకాశ్ కేసరి బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ నళిన్ కుమార్ శ్రీవాస్తవ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సహ జీవనం వైపు యువతీయువకులు ఆకర్షితులవుతున్నారు. కొన్నాళ్లు కలిసున్నాక ఇష్టం లేకుంటే అతడు లేక ఆమె చాలా సులువుగా ఈ బంధం నుంచి బయటపడేందుకు అవకాశముంది. అందుకే, ఇలాంటి బంధాలకు యువత తొందరగా లొంగిపోతోంది. అందుకే, సమాజంలో నైతిక విలువలను పరిరక్షించేందుకు సహ జీవన సంబంధాలకు ఒక పరిష్కారం కనుగొనాల్సిన సమయమిదే’అని పేర్కొన్నారు. ఓ మహిళతో ఆకాశ్ కేసరి ఆరేళ్లపాటు సహజీవనం చేశాడు. అనంతరం పెళ్లికి నిరాకరించాడంటూ బాధిత మహిళ సార్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కేసరిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆ మహిళ మేజర్ అనీ, అంగీకారంతోనే ఆమె సహజీవనం చేసిందని కేసరి లాయర్ వాదించారు. ఆమెకు కేసరి అబార్షన్ చేయించలేదని, పెళ్లి చేసుకుంటానని అతడు మాట కూడా ఇవ్వలేదని చెప్పారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి కేసరికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
అలహాబాద్ హైకోర్టు నిర్ణయంతో అన్యాయం జరగదు
న్యూఢిల్లీ: శ్రీ కృష్ణ జన్మభూమి– షాహి ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి హిందూ పిటిషనర్లు వేసిన 15 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయం సహేతుకంగానే ఉందని, ఇరువర్గాల వారికీ న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. 1991నాటి ప్రార్థనాస్థలాల చట్టానికి సంబంధించిన కేసుల విచారణలో ఉన్నామని, ఈ దశలో ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అవసరమనిపిస్తే తర్వాత దీనిపై విచారణ చేపడతామని పేర్కొంది. అయితే, హైకోర్టులో దాఖలైన పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాకున్నా అన్నిటినీ కలిపి విచారించనుండటంతో తమకు అన్యాయం జరుగుతుందని మసీదు తరఫు లాయర్ వాదించారు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తేందుకు అవకాశం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. మసీ దులు, దర్గాలు తదితర ప్రార్థనాస్థలాలకు సంబంధించిన పిటిషన్లపై ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు డిసెంబర్ 12న ఆదేశాలివ్వడం తెలిసిందే. అదేవిధంగా, మందిరం– మసీదు వివాదంపై హిందూ పక్షం వేసిన 15 అప్పీళ్లపై ఒకే దఫాలో విచారణ చేపడతామని గతేడాది జనవరి 11వ తేదీన అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. -
అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్‌పై వేటు తప్పదా?
న్యాయ్యవస్థలో అత్యంత కీలమైన వారు న్యాయమూర్తులు. రాగద్వేషాలకు అతీతంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) మద్దతుగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిచేందుకు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు యత్నిస్తున్నాయి.అసలేంటి వివాదం?ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం (డిసెంబర్ 8) అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు.పదవి నుంచి తొలగించాల్సిందేజస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతసామరస్యాన్ని భంగపరిచేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తాయి. న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తప్పించేందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేయగా సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా బలపరిచారు. రాజ్యసభలో విపక్ష సభ్యుల నుంచి బుధవారం నాటికి 38 మంది సంతకాలు సేకరించారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది.అంత ఈజీ కాదు..హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుడిని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద వ్యవహారమే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లో దీని ప్రస్తావన ఉంది. న్యాయమూర్తిని తొలగించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌ను అందజేయాలి. పార్లమెంట్లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని అదే సెషన్లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.చదవండి: మందిర్- మసీదు పిటిషన్లపై ‘సుప్రీం’ సంచలన ఆదేశాలుఅయితే ఇదంతా మనం చెప్పుకున్నంత సులభమేమీ కాదు. పార్లమెంట్లో తీర్మానాన్ని చర్చకు అంగీకరించడానికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించిన పక్షంలో లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తి పదవీత్యుడయ్యారనేలా ఈ వ్యవహారం సాగుతుంది. కాగా, తాజా వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.గతంలోనూ తీర్మానాలుహైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. 1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు. 2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. -
ఇది హిందుస్తాన్
ప్రయాగ్‌రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్‌ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
రాహుల్ గాంధీ పౌరసత్వంపై కోర్టులో పిటిషన్
లక్నో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీకి భారత్, యూకే పౌరసత్వాలు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం ఉందని, కాబట్టే భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కర్ణాటకు చెందిన న్యాయవాది ఎస్ విఘ్నేష్ శిశిర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. విఘ్నేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును డిసెంబ్ 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలతో రాహుల్ పౌరసత్వంపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే హోం మంత్రిత్వ శాఖ సూచించారు. ఈ సందర్బంగా పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిశిర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి రెండు యూకే, భారత్‌లో పౌరసత్వం ఉందనే ఆధారాలు లభించాయి. వాటన్నింటిని కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి రెండు దేశాల్లో పౌరసత్వం ఉండకూడదు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. -
యూపీ మదర్సాచట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం(నవంబర్ 5) కొట్టివేసింది. మదర్సా చట్టంలో రాజ్యాంగ ఉల్లంఘన ఏదీ లేదని స్పష్టం చేసింది. 17 లక్షల మంది విద్యార్థులు మరియు 10,వేల మంది మదర్సా ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యా వ్యవస్థలో సర్దుబాటు చేయాలనే అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. మదర్సాచట్టాన్ని పూర్తిగా కొట్టివేయనవసరం లేదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించింది. అభ్యంతరాలున్న పలు సెక్షన్లను సమీక్షించవచ్చని తెలిపింది.ఇదీ చదవండి: అన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వానివి కావు: సుప్రీంకోర్టు -
Allahabad High Court: సమ్మతి ఉన్నా, భయపెడితే అత్యాచారమే
ప్రయాగ్‌రాజ్: సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్నాసరే ఆ సంబంధం భయంతో కొనసాగితే అత్యాచారంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ వేసిన కేసు విచారణ సందర్భగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ఆపాలంటూ తమను ఆశ్రయించిన రాఘవ్ కుమార్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలు సివిల్ సరీ్వసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రాఘవ్ పరిచయమయ్యాడు. ఆమెను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లిచేసుకుంటానని నమ్మించి బలవంతంగా ఆ బంధాన్ని కొనసాగించాడంటూ బాధితురాలు ఆగ్రా జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు ఆగ్రా జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీన్ని సవాలు చేస్తూ రాఘవ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ అనీస్ కుమార్ గుప్తా సారథ్యంలోని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది. -
రాహుల్ పౌరసత్వ కేసు విచారణ: పిటిషనర్ న్యాయవాదిపై హైకోర్టు ఆగ్రహం
లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పిటిషనర్ తరపు న్యాయవాది ఎంత సేపటికి వాదనలు ముగించకపోవడంతో ధర్మాసనం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.వివరాలు.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగాఎన్నికైన రాహుల్ గాంధీ భారతీయ పౌరుడు కాదని, ఆయన బ్రిటిష్ పౌరుడని పేర్కొంటూ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ తన న్యాయవాది అశోక్ పాండే ద్వారా ఈ పిల్ దాఖలు చేశారు.దీనిపై స్టిస్ రాజన్ రాయ్ మరియు జస్టిస్ ఓం ప్రకాష్ శుక్లాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా దాదాపు 90 నిమిషాల పాటుఅశోక్ పాండే వాదనలు వినిపించారు. అయితే ఆయన వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ఉత్తర్వులను రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.అయినప్పటికీ న్యాయవాది పాండే తనకు వాదించేందుకు మరింత సమయం కావాలని పట్టుబట్టారు. దీనిపై ధర్మాసనం స్పందింస్తూ.. తనకు, తన పిటిషనర్‌కు వాదనలు వినిపించేందుకు సరైనసమయం ఇచ్చిందని, తమ వాదనలన్నీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పడంతో న్యాయవాది పాండే అసహనానికి గురయ్యారు.తనకు వాదించడానికి మరింత సమయం కావాలని పట్టుబట్టారు. 20 రోజులపాటు వాదనలు జరుగుతాయని, కానీ ధర్మాసనం గంట కూడా తన మాటలు వినడం లేదని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, వాదనలు తగినంతగా ఉంటే ఆ విషయాలపై విచారణలు 20 రోజుల పాటు కొనసాగించవచ్చని పేర్కొంది. న్యాయవాది పాండే చేస్తున్న వాదనలను ఇప్పటికే కోర్టు విని పరిశీలించిందని ధర్మాసనం మరోసారి నొక్కి చెప్పింది.అయినప్పటికీ పాండే వినకుండా.. బెంచ్ వ్యక్తిగతంగా వ్యవహరించకూడాదని అన్నారు. దీంతో ధర్మసానం ఆగ్రహంవ్యక్తం చేసింది. మీరు మా సహనాన్ని పరిక్షిస్తున్నారు. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారు. మీకు వాదించడానికి తగినంత సమయం ఇచ్చాము. మీ ప్రవర్తన చూస్తుంటే ఇతర కేసులను వినకుండా చేయాలని చూస్తున్నట్లు ఉంది అని పేర్కొంది. చివరికి న్యాయమూర్తులు న్యాయస్థానం నుంచి బయలుదేరుతుండగా.. హైకోర్టు తుది కోర్టు కాదని వ్యాఖ్యానించారు.తన వాదనలు అనంతరం కొత్త పిటిషన్ దాఖలు చేసేందుకు తాజా పిల్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని బెంచ్‌ను అభ్యర్థించారు పాండే. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఒకవేళ పిల్‌ను పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, కోర్టు సమయాన్ని 90 నిమిషాల వృధా చేసినందుకు బెంచ్ అతనిపై పెనల్టీ విధిస్తుందని మందలించింది. -
నీట్ పరీక్షా ఫలితాలు.. కోర్టులో విద్యార్ధినికి చుక్కెదురు
ఢిల్లీ: ఇటీవల ఓ విద్యార్ధిని తన నీట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ చిరిగిందని, ఫలితంగా మార్కులు తక్కువ వచ్చాయని అలహాబాద్ హైకోర్టులో జూన్ 12న పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఓఎంఆర్ షీట్‌ను పరిశీలించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆ పిటిషన్‌పై జస్టీస్ రాజేస్ సింగ్ చౌహాన్ ధర్మాసనం జూన్ 18న విచారణ చేపట్టింది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ అవతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.ఈ తరుణంలో నీట్ పరీక్ష రాసిన ఆయుషి పటేల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్ పరీక్షను జాతీయ పరీక్ష మండలి (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఫలితాల్ని విడుదల చేస్తోంది. అయితే ఈ జూన్ 4న విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఆయేషాకు 335 మార్కులు వచ్చాయి. ఆ మార్కులపై విద్యార్ధిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆన్సర్ కీ ఆధారంగా తనకు 715 మార్కులు వస్తాయని, కానీ వేరే అప్లికేషన్ నంబర్‌తో విడుదలైన పరీక్ష ఫలితాల్లో కేవలం 335 మార్కులే వచ్చాయని అలహదాబాద్ కోర్టులో వాపోయారు. ఎన్టీఏ ఓఎంఆర్ చించేసిందిఅంతేకాదు జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన, తన ఫలితాలు వెలువడడంలో జాప్యం జరిగిందని తెలిపింది. తొలుత నీట్ ఫలితాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. ఓఎంఆర్ షీట్ చిరిగిపోయిందని ఎన్టీఏ ఆమెకు మెయిల్ చేసినట్లు తెలిపింది. ఓఎంఆర్ షీట్‌ను ఉద్దేశపూర్వకంగా చింపేసిందని ఎన్టీఏపై ఆయుషి ఆరోపణలు గుప్పించింది. తన ఓఎంఆర్ షీట్‌ను మరోసారి పరిశీలించాలని అన్నారు. అంతేకాదు ఎన్టీఏపై విచారణ చేపట్టాలని, త్వరలో జరగాల్సిన అడ్మిషన్ కౌన్సిలింగ్ జరపకుండా నిలిపి వేయాలని కోరారు. నకిలీ పత్రాలు సమర్పించిఅయితే, కోర్టు ఆదేశాలతో ఎన్టీఏ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్‌ను సమర్పించింది. ఆ ఓఎంఆర్ షీట్ చిరిగిపోలేదు. విద్యార్ధిని నకిలీ ఓఎంఆర్ షీట్‌ను కోర్టుకు సమర్పించినట్లు నిర్దారణకు వచ్చింది. అందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎన్టీఏను ఆపలేమని కోర్టు పేర్కొంది. పిటిషన్ ఉపసంహరణఎన్టీఏ సైతం ఆయుషిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తన ప్రతిపాదనను కోర్టు ముందు ఉంచింది. అయితే వరుస పరిణామాలతో ఆయుషి తరుపు న్యాయవాది తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కోరగా అందుకు కోర్టు అంగీకరించింది. NEET जैसी परीक्षाओं में लाखों बच्चे मेहनत से तैयारी करते हैं और अपनी जिंदगी के सबसे कीमती पल इस तैयारी में लगाते हैं। पूरा परिवार इस प्रयास में अपनी श्रद्धा और शक्ति डालता है। लेकिन साल दर साल इन परीक्षाओं में पेपर लीक, रिजल्ट से जुड़ी गड़बड़ियाँ सामने आई हैं।क्या परीक्षा कराने… pic.twitter.com/mcHwsVb4IH— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 10, 2024ప్రియాంక గాంధీ సైతంఇక ఆయేషీ పటేల్ తనకు అన్యాయం జరిగిందంటూ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి, పేపర్ లీకేజీలు, అవకతవకలపై చర్య తీసుకోవాలని కోరారు. ఆయుషి పటేల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీజేపీ నేతలు ప్రియాంక గాంధీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు, అసత్యాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోన్నారు. -
యూపీ మదర్సా చట్టం రద్దు కేసులో.. సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్- 2004ను రద్దు చేస్తూ గత నెలలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో రాష్ట్రంలోని 16,000 మదర్సాలు యథావిధిగా కొనసాగనున్నాయి. హైకోర్టు నిర్ణయం ప్రాథమికంగా సరికాదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మదర్సా చట్టం-2004 సెక్యులరిజం సూత్రాలను ఉల్లంఘిస్తోందని, ఇది రాజ్యంగ విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని తెలిపింది. ఈ తీర్పు 10 వేల మదర్సా టీచర్లు, 17 లక్షల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. మదర్సాలో మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ సబ్జెక్టులను కూడా మదర్సాల్లో బోధిస్తున్నారని, అక్కడి విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించే అవసరం లేదని తాము భావిస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థించాయి. అనుమానిత మతం, ఇతర సంబంధిత అంశాలపై చర్చ జరగాలని కోరాయి. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మదర్సా బోర్డ్ లక్ష్యం, ఉద్దేశం నియంత్రణ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదంటూ తెలిపింది. ఈ అంశంపై లేవనెత్తిన సమస్యలను మరింత నిశితంగా పరిశీలించాల్సి వుందని సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ , కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఉత్తరప్రదేశ్ మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని మార్చి 21న అలహాబాద్ హైకోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది లౌకికవాద భావనకు విరుద్ధమైనదని తెలిపింది. యూపీ మదర్సా చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ.. ప్రస్తుతం మదర్సాల్లో చదువుతున్న విద్యార్ధులను సాధారణ విద్యా విధానంలోకి మళ్లించే పథకాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని పేర్కొంది. మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటును సవాలు చేస్తూ అన్షుమన్ సింగ్ రాథోడ్ ఈ పిటిషన్ వేశారు. -
జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
లక్నో: జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం ఉదయం సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్ కా తేకానాలో హిందువుల పూజలకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ(ఏఐఎంసీ) పిటిషన్‌ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న కోర్టు రిజర్వ్ చేసింది. మసీదు సెల్లార్లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. ఇదీ చదవండి.. యోగి బాటలో థామి సర్కారు -
భర్తకు ఆదాయం లేకపోయినా..మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందేనా?
ఇటీవల కాలంలో దంపతుల మధ్య సయోధ్య లేకపోవడం వల్లనో లేక ఇతరత్ర కారణాల వల్లనో విడాకులకు దారితీస్తున్నాయి. ఫ్యామిలీ కోర్టుల్లో అందుకు సంబంధించిన కేసులు సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇద్దరి సమ్మతంతో విడిపోయినప్పటికీ స్త్రీకి ఎంతో కొంత భరణం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లైయిమ్ చేసుకోవాల్సింది సదరు మహిళే. ఒకవేళ ఆమె క్లైయిమ్ చేసుకున్నప్పటికీ కొందరూ ప్రబుద్ధులు తనకు ఆదాయం లేదని, లేదా కుటుంబాన్ని చూసుకోవాల్సి ఉందంటూ భరణం ఇవ్వకుండా తప్పించుకునే ప్లాన్లు వేస్తుంటారు. దీంతో సదరు మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే అలాంటి ఎత్తుగడలకు చెక్‌పెడుతూ అలహాబాద్ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే..అలహాబాద్‌కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని సదరు మహిళ అత్తమామలపై ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమె 2016 నుంచి తల్లిదండ్రులతోనే జీవిస్తుంది. అయితే ఫామిలీ కోర్టు ఆమెకు నెలకు రూ. 2000 భరణం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. తనకు ఆదాయం లేదని, తన తల్లిదండ్రులను, అక్కచెల్లెళ్లను చూసుకోవాల్సి ఉండటంతో తాను భరణం చెల్లించలేనంటూ పిటీషన్ వేశాడు. అంతేగాదు తన భార్య టీచింగ్ ద్వారా నెలకు రూ. 10 వేలకు సంపాదిస్తున్నారని కాబట్టి తాను ఇవ్వలేనని పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే ధర్మాసనం ఆదాయం లేకపోయినా లేదా ఉద్యోగం లేకపోయినా రోజూ కూలిగా రూ. 300 నుంచి రూ. 400 వరకు సంపాదించొచ్చు అంటూ ఆ వ్యక్తికి మొట్టికాయలు వేసింది. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా విడిపోయిన భార్యకు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందేనని పేర్కొంది ధర్మాసనం. ఆ వ్యక్తి పిటిషన్‌ను జస్టిస్ రేణూ అగర్వాల్ సారధ్యంలోని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తోసి పుచ్చింది. సదరు వ్యక్తి ఆయన భార్యకు చెల్లించాల్సిన మొత్తం భరణం రికవరీ బాధ్యతలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించారు జస్టిస్ రేణు అగర్వాల్. అలాగే సదరు వ్యక్తి తన భార్య ఉద్యోగం చేస్తుందనేందుకు ఆధారాలు సమర్పించడంలో కూడా విఫలమయ్యారని హైకోర్టు పేర్కొంది. అదీగాక ఆ వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నందున కార్మికుడిగా పని చేసైనా భార్యకు భరణం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తి గతేడాది ఫిబ్రవరి 21న రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సీఆర్పీసీ 125 సెక్షన్ కింద భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమస్యలనే ఫేస్ చేస్తుంటే..భయపడొద్దు. ధైర్యంగా మహిళలకు అనుకూలమైన చట్టాల గురించి సవివరంగా తెలుసుకుని కోర్టులో పోరాడండి. అదే సమయంలో మహిళలు కూడా తమ వైవాహిక బంధాన్ని చిన్న చిన్న విషయాలకు తెంచుకునే యత్నం చేయకుండా పెద్దలతో సయోధ్య చేసుకునేలా ప్రయత్నించి, మను వివాహ వ్యవస్థను కాపాడుకునే యత్నం చేద్దాం. (చదవండి: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది) -
జ్ఞానవాపి కేసు: ముస్లిం సంఘాలకు చుక్కెదురు
ఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్‌పై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. -
షాహీ ఈద్గాలో సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గాలో సర్వే చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సర్వేను పరిశీలించేందుకు అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించేందుకు కూడా అంగీకరించింది. ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ శుక్రవారం షాహి మసీద్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ ట్రస్ట్ చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను పిటిషన్ రూపంలో సవాల్ చేయాలని సూచించింది. దీనితో పాటు దీనిపై ట్రస్ట్ వేసిన మరో పిటిషన్‌పై కూడా జనవరి 9వ తేదీన విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. -
షాహీ ఈద్గా మసీదు సర్వేపై స్టేకు సుప్రీం నిరాకరణ
లక్నో: కృష్ణ జన్మభూమి వివాదంలో షాహీ ఈద్గా మసీదు సర్వేను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి అలహాబాద్ హైకోర్టు గురువారం ఆమోదం తెలిపింది. ఈ ఆమోదాన్ని నిలిపివేయాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్ మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్ ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని నిర్దేశించింది. ఇందుకు తగిన విధివిధానాలను డిసెంబర్ 18న నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. మధురలో దాదాపు 13.37 ఎకరాల భూమిలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు షాహీ ఈద్గా మసీదును నిర్మించాడని హిందూ తరుపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ స్థలాన్ని శ్రీ కృష్ణ విరాజ్‌మాన్‌కు చెందినదిగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు మసీదు ప్రాంతాన్ని కూల్చివేయవద్దని పిటీషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు -
షాహీ ఈద్గాలో సర్వే చేయండి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని మథుర నగరంలో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో షాహీ ఈద్గాను నిర్మించారంటూ దాఖలైన కేసు గురువారం కీలక మలుపు తీసుకుంది. కోర్టు పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న మసీదు ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సర్వే కోసం కమిషనర్‌ను నియమించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ‘త్రిసభ్య కమిషన్ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. సర్వే సందర్భంగా అక్కడి కట్టడాలు దెబ్బ తినకుండా చూడాలి. డిసెంబర్ 18న జరిగే ఈ కేసు తదుపరి విచారణలో సర్వే విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ సర్వేను ఇరు పక్షాల తరఫు ప్రతినిధులు ప్రత్యక్షంగా గమనించవచ్చు. పూర్తి పారదర్శకమైన నివేదికను కోర్టును కమిషన్ అందించాలి. ఈ నివేదికపై అభ్యంతరాలుంటే ఈద్గా తరఫు లాయర్లు తమ అభ్యంతరాలు తెలుపుతూ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ తన ఉత్వర్వులో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తా మని షాహీ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. ఇటీవలి కాలంలో ఆలయం–మసీదు వివాదాల్లో అలహాబాద్ హైకోర్టు ఇలా సర్వేకు ఆదేశాలివ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవలే వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలివ్వడం, సర్వే పూర్తయి భారత పురావస్తు శాఖ నుంచి తుది నివేదిక కోసం వేచి ఉన్న సంగతి తెల్సిందే. ‘‘మసీదు ప్రాంగణంలో కమలం ఆకృతిలో ఉన్న పునాదులతో ఒక నిర్మాణం ఉంది. అది హిందువులు పూజించే శేషనాగును పోలి ఉంది. పునాదిపై హిందూ మత సంబంధ గుర్తులు, నగిïÙలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’’ అని ఇటీవల పిటిషనర్ తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ కోర్టులో వాదించారు. -
గుట్కా యాడ్ నటనలో కనీసం టెన్ పర్సెంట్ అన్నా నటించొచ్చు కదా సార్!
గుట్కా యాడ్ నటనలో కనీసం టెన్ పర్సెంట్ అన్నా నటించొచ్చు కదా సార్! -
భార్యకు 18 ఏళ్లు దాటితే.. భర్తపై వైవాహిక అత్యాచారం కేసుండదు
ప్రయాగ్‌రాజ్: భార్య వయస్సు 18 ఏళ్లు, అంతకు మించి ఉన్న సందర్భాల్లో వైవాహిక అత్యాచారం(మారిటల్ రేప్) అభియోగం నుంచి వ్యక్తికి రక్షణ ఉంటుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి భర్తపై ఐపీసీ సెక్షన్ 377ను వర్తింప జేయడంపై గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచి్చన తీర్పును ఈ సందర్భంగా ఉదహరించింది. అయితే, ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2017)కేసులో సుప్రీంకోర్టు తీర్పుననుసరించి వ్యక్తి, 15–18 మధ్య వయస్సున్న అతడి భార్య మధ్య జరిగే ఎలాంటి లైంగిక సంపర్కమైనా అత్యాచారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఓ వ్యక్తి వేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నెల 6న ఈ మేరకు పేర్కొంది. అయితే, పిటిషనర్‌పై కట్నం వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై తమ తీర్పు ప్రభావం ఉండబోదని తెలిపింది. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిపై 2013లో ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323, 377తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లోని దిగువ కోర్టుతోపాటు, అప్పిల్లేట్ కోర్టు కూడా అతడిని దోషిగా పేర్కొన్నాయి. వీటిని సవాల్ చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశాడు. విచారించిన హైకోర్టు.. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323 కింద నమోదైన కేసుల్లో దిగువ కోర్టులిచి్చన తీర్పులను సమరి్థస్తూ తీర్పు వెలువరించింది. -
కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు... దేవుళ్లం అనుకుంటున్నారు
అహ్మదాబాద్: కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు తమను తాము దేవుళ్లుగా భావించుకుంటున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వాళ్లు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. అహ్మదాబాద్‌లో రాత్రిపూట వెళ్తున్న ఓ జంట నుంచి ట్రాఫిక్ పోలీసులు బెదిరించి డబ్బుల వసూలు చేశారంటూ వచి్చన వార్తలను కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, న్యాయమూర్తి జసిస్ అనిరుద్ధ పి.మాయీ ధర్మాసనం దీనిపై శుక్రవారం జరిపింది. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన హెల్ప్‌లైన్‌ను కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘పోలీసులపై ఫిర్యాదు చేయాలంటే సామాన్యులు మీ కార్యాలయాల ముందు వరుస కట్టాలా? వారిని లోపలికి అనుమతించేదెవరు? మామూలు జనానికి పోలీస్ స్టేషన్లో కాలు పెట్టడమే కష్టం. ఇక పోలీస్ కమిషనర్, కలెక్టర్ కార్యాలయాల్లోకి వెళ్లడమైతే దాదాపుగా అసాధ్యం! మీ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు దేవుళ్లలా, రాజుల మాదిరిగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు. ఇంతకుమించి మాట్లాడేలా మమ్మల్ని రెచ్చగొట్టొద్దు’’అని జస్టిస్ అగర్వాల్ అన్నారు. పోలీసులపై ఫిర్యాదులకు గ్రీవెన్స్ సెల్‌తో పాటు హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని, అందరికీ తెలిసేలా దాన్ని ప్రచారం చేయాలని గత విచారణ సందర్భంగా జారీ చేసిన ఆదేశాలు అమలు కాకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది. -
Nithari Killings: నిఠారి వరుస హత్యల కేసులో దోషులకు విముక్తి
ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: 2006 నాటి నిఠారి వరుస హత్యల కేసులో నిందితులుగా మణీందర్ సింగ్ పంధేర్, పని మనిషి సురేంద్ర కోలీలకు అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. నోయిడాలోని ఓ బంగ్లా వెనుక 8 మంది చిన్నారుల ఎముకలు కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఇద్దరూ కలిసి పలువురు బాలికలపై లైంగికదాడికి, దారుణ హత్యలకు పాల్పడటంతోపాటు నరమాంస భక్షకులుగా మారినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ పంధేర్, కోలీలు వేసిన పిటిషన్‌ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వీరిద్దరికీ వ్యతిరేకంగా కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో పంధేర్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని ఆయన లాయర్ మనీషా భండారి చెప్పారు. అయితే, మరో కేసులో జీవిత ఖైదు శిక్షపడిన కోలీ మాత్రం జైలులోనే ఉంటాడని అన్నారు. తీర్పు ప్రతి అందాక తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.2007లో పంధేర్, కోలీలపై 19 కేసులు నమోదయ్యాయి. అయితే, సాక్ష్యాలు దొరకలేదంటూ మూడు కేసుల్లో మాత్రమే సీబీఐ అభియోగ పత్రాలు నమోదు చేయగలిగింది. మిగతా 16 కేసులకుగాను మూడు కేసుల నుంచి కోలీ బయటపడ్డాడు. ఒక కేసులో విధించిన మరణశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. కోలీకి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో 12 కేసుల నుంచి అతడికి విముక్తి లభించింది. అదే సమయంలో, పంధేర్‌పై ఉన్న ఆరు కేసుల్లో, ఒకటి సీబీఐ వేసింది కాగా, మరో అయిదు బాధితుల కుటుంబాలవి. గతంలో సెషన్స్ కోర్టు అతడిపై ఉన్న మూడు కేసులను కొట్టివేసింది. మిగతా మూడింటిలో 2009లో ఒకటి, తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో రెండు కేసుల నుంచి పంధేర్ బయటపడినట్లయిందని అతడి లాయర్ చెప్పారు. కోలీ ఘజియాబాద్ కారాగారంలో, అతడి మాజీ యజమాని పంధేర్ నోయిడా జైల్లో ఉన్నారు. -
నిఠారీ హత్యలు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ్యవ్యాప్తంగా చర్చనీయాశమైన నిఠారీ హత్యల కేసులో అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిఠారీ హత్య కేసులో దోషులుగా తేలిన అన్ని కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది.ముఖ్యంగా సురీందర్ కోలికి మరణశిక్షను కూడా అలహాబాద్ హైకోర్టు కోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురీందర్ కోలీపై ఉన్న 12 కేసుల్లో నిర్దోషిగా తేల్చింది. అలాగే మరో నిందితుడు వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్‌పై ఉన్న రెండు కేసుల్లోనూ నిర్దోషి అని కోర్టు సోమవారం నిర్ధారించింది. అత్యాచారం, హత్య ఆరోపణలపై దోషులుగా తేల్చిన ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు విధించిన మరణశిక్షను సవాలు చేస్తూ కోలీ, పంధేర్‌లు దాఖలు చేసిన అప్పీళ్లను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్వీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు మోనీందర్ సింగ్ పందేర్‌పై మొత్తం 6 కేసులు ఉండగా, అన్నింటిలోనూ నిర్దోషిగా కోర్టు తేల్చిందని మోనీందర్ సింగ్ పంధేర్ తరపు న్యాయవాది మనీషా భండారీ వెల్లడించారు. 2006లో నోయిడాలోని నిథారీ ప్రాంతంలో మధ్య మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటిలో వరుస హత్యలు కలకలం రేపాయి. 2006, డిసెంబరు 29న నోయిడాలోని నిథారీలోని పంధేర్ ఇంటి వెనుక ఉన్న కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో ఈ సంచల హత్యలు వెలుగులోకి వచ్చాయి. సురీందర్, పంధేర్ ఇంట్లో పనిమనిషిగా ఉండేవాడు. ఈ సందర్భంగా పిల్లలను మిఠాయిలు, చాక్లెట్లతో మభ్య పెట్టి ఇంట్లోకి రప్పించేవాడు. ఆ తరువాత పంధేర్వారిపై అత్యాచారం చేసి హత్య చేశాడనేది ప్రధాన ఆరోపణ. బాధితుల్లో ఎక్కువ భాగం ఆ ప్రాంతం నుండి తప్పిపోయిన పేద పిల్లలు, యువతులవిగా గుర్తించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు పిల్లల మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువల్లో పడవేసేవారనీ సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా నరమాంస భక్షక ఆరోపణలు కూడా చేసింది. 2007లో పంధేర్, కోలీలపై సీబీఐ 19 కేసులు నమోదు చేసింది. అయితే 19 కేసుల్లో మూడింటిని తొలగించిన సీబీఐ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా సురేంద్ర కోలీపై బాలికలపై అనేక అత్యాచారాలు , హత్యలకు పాల్పడి దాదాపు 10 కంటే ఎక్కువ కేసులలో మరణశిక్ష విధించాయి కోర్టులు. జూలై 2017లో, 20 ఏళ్ల మహిళ పింకీ సర్కార్ హత్య కేసులో స్పెషల్ CBI కోర్టు పంధేర్, కోలీలను దోషులుగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. దీన్ని అలహాబాద్ హైకోర్టుకూడా సమర్ధించింది. అయితే, కోలీ క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయంలో జాప్యంకారణంగా దీన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఈ నిఠారీ హత్యల్లో మరో బాధితురాలు 14 ఏళ్ల రింపా హల్దార్ హత్య, అత్యాచారానికి సంబంధించి 2009లో సాక్ష్యాలు లేకపోవడంతో పంధేర్‌ను నిర్దోషిగా ప్రకటించింది. #WATCH | Manisha Bhandari, lawyer of Nithari case convict Moninder Singh Pandher, in Prayagraj, Uttar Pradesh "Allahabad High Court has acquitted Moninder Singh Pandher in the two appeals against him. There were a total of 6 cases against him. Koli has been acquitted in all… pic.twitter.com/BYQHeu3xvz — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 16, 2023 -
ఐదు పేజీల తీర్పుపై... 60 పేజీల సారాంశమా!
న్యూఢిల్లీ: ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఐదు పేజీల తీర్పును సవాలు చేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు రూపంలో సుప్రీంకోర్టులో ఏకంగా 60 పేజీల సినాప్సిస్ (సారాంశం) సమర్పించాడో వ్యక్తి! దీనిపై విస్మయం వ్యక్తం చేయడం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం వంతయింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక పిటిషన్‌దారుకు రూ.25 వేల జరిమానా కూడా విధించింది! ఆ మొత్తాన్ని ఏదన్నా స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆరోగ్య కారణాలతో అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి సుదీర్ఘ దరఖాస్తులపై సుప్రీంకోర్టు గతేడాది అసహనం వ్యక్తం చేసింది. వాటిలో పేజీల సంఖ్యపై తక్షణం పరిమితి విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ: జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ సర్వేకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సర్వే కొనసాగించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించింది జ్ఞానవాపి మసీదు కమిటీ. ఒకవైపు సర్వే ఇవాళ మొదలుకాగా.. మరోవైపు మసీద్ కమిటీకి సుప్రీంలో చుక్కెదురుకావడం గమనార్హం. అయితే శుక్రవారం ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ సర్వే ద్వారా చరిత్ర పునరావృతం అవుతుందని.. గాయాలు తిరిగి తెరపైకి వస్తాయని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. అయితే.. ఈ వాదనలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. మనం ఇప్పుడు గతంలోకి వెళ్లొద్దు అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. ASI Survey నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వలేమంటూ పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. అయితే అదే సమయంలో జ్ఞానవాపిలో చేసే సర్వే నాన్-ఇన్వాసివ్ మెథడ్(పరికరాల్లాంటివేం ఉపయోగించకుండా) చేయాలని, ఎలాంటి డ్యామేజ్ జరగొద్దంటూ పురావస్తు శాఖను ఆదేశించింది సుప్రీం. అందుకు ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ అంగీకరించారు. జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించి.. ఆ నివేదికను నాలుగు వారాల్లోగా అందజేయాలంటూ జులై 21వ తేదీన వారణాసి(యూపీ) జిల్లా కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI)ను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు జూలై 24న తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై విచారణ జరిపి, తగిన తీర్పు వెల్లడించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు గురువారం తీర్పు చెప్తూ, సైంటిఫిక్ సర్వేను నిర్వహించాలని ఆదేశించింది. న్యాయం కోసం ఇక్కడ సైంటిఫిక్ సర్వే నిర్వహించడం అవసరమని, దీనివల్ల ఇరు పక్షాలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఈ సర్వే జరుగుతోంది. సర్వే కోసం ఏఎస్ఐకి నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. -
జ్ఞానవాపీ మసీదులో సర్వేకు ఓకే
ప్రయాగ్‌రాజ్/వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. శాస్త్రీయ సర్వేకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. జిల్లా కోర్టు ఉత్తర్వు సముచితమేనని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకునే ఉన్న జ్ఞానవాపీ మసీదు ఆలయంపైనే నిర్మించిందా లేదా తేల్చేందుకు ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు జూలై 21న అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మసీదు కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఏఎస్ఐ సర్వేపై జూలై 26 సాయంత్రం 5వరకు స్టే ఇచ్చింది. ఈ మేరకు మసీదు కమిటీ సర్వేను ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు సీజే ధర్మాసనం జూలై 27 వరకు హిందు, మసీదు కమిటీ వర్గాల వాదనలు విని, తీర్పు రిజర్వు చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ఆవరణలో ఏఎస్ఐ అధికారులు తక్షణమే తమ పనులు ప్రారంభించవచ్చని, సర్వేలో భాగంగా ఆ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపరాదని స్పష్టం చేసింది. ఏఎస్ఐ అధికారులు సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సహకరించాలంటూ ఏఎస్ఐ తమను కోరిందని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.రాజలింగం తెలిపారు.జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వే నిలుపుదల కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. -
జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు
అలహాబాద్: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను వెంటనే ప్రారంభించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ గత నెలలో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ.. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కాగా కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా లేదా అనేది తెలుసుకునేందుకు మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు జూలై 21న అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్నిఆదేశించింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. దీంతో భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధిస్తూ.. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. సుప్రీం ఆదేశాలతోప్రారంభమైన కొన్ని గంటల్లోనే సర్వే నిలిచిపోయింది. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 27న విచారణ చేపట్టగా.. ఆగస్టు 3న తీర్పు వెల్లడించే వరకు సర్వే చేపట్టరాదని స్టే విధించింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్ఐకి అనుమతినిచ్చింది. చదవండి: ‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం #WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09 — ANI (@ANI) August 3, 2023 -
ఙ్ఞానవాపిలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
-
ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుపై హైకోర్టు ఫైర్
భారీ అంచాల మధ్య విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రామాయణం ఇతీహాసం ఆధారంగా ఓ రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ జానకిగా నటించారు. సాంకేతికపరంగా ఈ చిత్రం మెప్పించినా.. కంటెంట్ పరంగా అలరించలేకపోవడంతో పాటు కొన్ని సన్నివేశాలు రామాయణానికి విరుద్ధంగా తీర్చిదిద్దారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు పలు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి. ఈ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు కోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలాంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుని ధర్మాసనం తప్పుబట్టింది. సెన్సార్‌కు పంపిన సమయంలో ఇలాంటి డైలాగ్స్‌ని ఎందుకు సమర్థించారని కోర్టు ప్రశ్నించింది. (చదవండి: ఓటీటీకి 'ది కేరళ స్టోరీ'.. ఆలస్యం అందుకేనన్న ఆదాశర్మ!) ఇలాంటి వాటి వల్ల భవిష్యతు తరాలకు ఎలాంటి సందేశాలను అందించాలనుకుంటున్నారని మండిపడింది. సినిమా దర్శకనిర్మాత విచారణకు హాజరుకాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఆదిపురుష్ చిత్రంలో కొన్ని సంభాషణలు అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో..చిత్రబృందం వాటిని తొలగించింది. అయినప్పటికీ వివాదం మాత్రం ఆగడం లేదు. -
Gyanvapi Case: వారణాసిలోనే జ్ఞానవాపి కేసు..ఆ వ్యాజ్యం చెల్లుతుంది.!
జ్ఞానవాపి కేసులో ముస్లీం కమిటికి చుక్కెదురైంది. మసీదు కమిటీ హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను బుధవారం అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో హిందూ మహిళలు వేసిన వ్యాజ్యం చెల్లుబాటవుతుందని అనూహ్యమైన తీర్పు ఇచ్చింది కోర్టు. అలాగే స్థానిక వారణాసిలోనే కేసు కొనసాగేలా అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హిందు మహిళల బృందానికి భారీ ఊరట లభించినట్లయ్యింది. వారణాసిలో జ్ఙానవాపి మసీదులో పూజలు చేసుకునే హక్కును కోరుతూ హిందూ మహిళల బృందం లక్ష్మీ దేవి, రేఖా పాఠక్, సీతా సాహు, మంజు వ్యాస్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ కేసు తెరపైకి వచ్చి గణనీయమైన వివాదాస్పదానికి దారితీసింది. ఈ వివాదం ఏప్రిల్ 2021 నుంచి కోర్టులోనే ఉంది. వారణాసి జిల్లా న్యాయమూర్తి ఈ కేసు నిర్వహణను సమర్థించారు. ఇదిలా ఉండగా, అంజుమన్ ఇంతేజామియా మసీదు(ఏఐఎం) కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం, 1995 సెంట్రల్ వక్ఫ్ చట్టం ప్రకారం ఈ కేసును నిర్వహించడం సాధ్యం కాదని వాదిస్తూ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 23, 2022న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కాగా, హిందూ మహిళల పిటిషన్‌పై వారణాసి కోర్టు మసీదు సముదాయంపై సమగ్ర సర్వే నిర్వహించాలని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది కూడా. (చదవండి: Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు స్టే)) -
శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన అన్ని కేసులు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లు మథుర జిల్లా కోర్టు విచారణలో ఉన్నాయి. అయితే కృష్ణ జన్మభూమి కేసు జాతీయ ప్రాధాన్యత కలిగినదని, దీనిని హైకోర్టు విచారణ చేపట్టాలని హిందూ పిటిషనర్లు కోరారు. మే 3న విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీ కృష్ణ జన్మభూమి కేసులపై తామే విచారణ చేపడతామని హైకోర్టు శుక్రవారం ప్రకటించింది. ఆ మేరకు సంబంధిత కేసులను హైకోర్టు తనకు బదిలీ చేసుకుంది. కాగా శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం పక్కన ఉన్న షాహి ఈద్గా మసీదు నిర్మితమైందంటూ భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మాన్, రంజనా అగ్నిహోత్రితోపాటు మరో ఏడుగురు సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షాహీ మసీదు ఈద్గా నిర్వహణ కమిటీ, శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్, శ్రీ కృష్ణ జన్మ స్థాన్ సేవా సంస్థాన్‌లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. మసీదు స్థలంపై హిందువులకే హక్కులు ఉంటాయని వాదించారు. హిందూ దేవాలయాలను కూలగొట్టి ఈద్గాను నిర్మించారని తెలిపారు. అలాంటి నిర్మాణం మసీదు కాబోదని పేర్కొన్నారు. ఆ భూమిని మసీదు నిర్మాణం కోసం ఎవరూ ఇవ్వలేదని తెలిపారు. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరు అమ్మాయిలకు ఓకే ర్యాంకు.. అదెలా? -
ఇక్కడ ఎవరూ ఎవరినీ... బెదిరించలేరు
ప్రయాగ్‌రాజ్: కొలీజియం విషయంపై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు మరోసారి స్పందించారు. ప్రయాగ్‌రాజ్‌లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ 150వ వార్షికోత్సవంలో పాల్గొని రిజిజు ప్రసంగించారు. హైకోర్టు జడ్జీల బదిలీలు, నియామకాల్లో ఏదైనా ఆలస్యమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై శనివారం మంత్రి రిజిజు మాట్లాడారు. ‘ భారత్‌లో ప్రజలే అసలైన యజమానులు. మనమంతా సేవకులం. రాజ్యాంగం చూపిన మార్గనిర్దేశకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకే మనం ఇక్కడ ఉన్నాం. ప్రజాభీష్టం మేరకు రాజ్యాంగానికి లోబడే దేశపాలన కొనసాగనుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ బెదిరించలేరు. కొన్ని సార్లు కొన్ని అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. బాధ్యతాయుత పదవుల్లో ఆసీనులైన వారు ఏదైనా చెప్పేముందు ఆలోచించాలి’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలనుద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దేశంలోని వేర్వేరు కోర్టుల్లో 4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘చిన్న చిన్న కేసులు కోర్టుల బయటే పరిష్కారం పొందుతాయి. దీంతో కోర్టులకు కేసుల భారం చాలా తగ్గుతుంది’ అని మంత్రి అన్నారు. -
ఆదిపురుష్ సినిమాపై ఫిర్యాదు.. ఎందుకంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాను ఇటీవల వివాదాలను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై మరొకరు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆదిపురుష్ సినిమాపై అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సెన్సార్ బోర్డు అనుమతి లేకుండానే ప్రోమోను విడుదల చేశారని ఆరోపిస్తూ తివారి అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సినీ నిర్మాత ప్రోమోను రిలీజ్ చేయడం నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సెన్సార్ బోర్డుకు నోటీసులిచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 21 కి వాయిదా వేసింది. ఈ సినిమాలో సీతా దేవిగా కృతిసనన్ ధరించిన దుస్తులపై కూడా పిటిషన్లో అభ్యంతరాలు తెలిపారు. రాముడు, సీత దేవతలను ప్రజలు నమ్ముతారని.. అయితే ఈ చిత్రంలో వారి నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమా నిర్మాత, దర్శకుడిని 'ప్రతివాదులు పేర్కొంటూ పిటిషన్ వేశారు. -
Viral Video: నగదు లేకున్నా పర్లేదు పేటీఎం చెయి! ఉద్యోగికి షాకిచ్చిన కోర్టు
ప్రపంచమంతా డిజిటల్మయమవడంతో ‘చిల్లర’కు కొరత ఏర్పడింది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఎంత మొత్తమైనా ఆన్లైన్లో చెల్లించేస్తున్నారు చాలామంది. మామూలుగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేక సేవలు పొందినప్పుడు డబ్బులు ఆన్లైన్ చెల్లింపు యాప్‌ల ద్వారా చేయడం తెలిసిందే. కానీ, ‘మామూలు’ కూడా ఆన్‌లైన్‌గా మారడం ఇక్కడ ప్రత్యేకం. అలహాబాద్ హైకోర్టులో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైకోర్టుకు పనుల నిమిత్తం వచ్చే లాయర్ల వద్ద అక్కడ పనిచేసే జమాదార్ (బండిల్స్ ఎత్తేవాడు) ‘టిప్పు’ వసూలు చేసేవాడు. అయితే, ఇటీవల కాలంలో చాలామంది చెల్లింపులు ఆన్‌లోనే చేస్తున్నారు. అందువల్ల చిన్న నోట్ల కరెన్సీకి కొరత ఏర్పడింది. దీంతో జమాదార్ రాజేంద్ర కుమార్ ఆన్లైన్ సేవలను వాడుకోవాలనుకున్నాడు. నగదు లేకుంటే పేటీఎం ద్వారా చెల్లించినా సరేనంటూ వాళ్లకు ఆఫర్ ఇచ్చాడు. అంతేకాకుండా పేటీఎం క్యూ ఆర్ కోడ్‌ను ఏకంగా యూనిఫారంకు తగిలించుకుని కోర్టు విధులకు హాజరయ్యాడు. కానీ, ఈ తతంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగుచూసింది. రాజేంద్ర కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్ ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టగా విషయం నిజమేనని తేలింది. దీంతో రాజేంద్ర కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. సాధారణంగా కేసులో విజయం సాధించిన లాయర్లు జమాదార్‌కు కొంత చిల్లర టిప్పుగా ఇస్తారని కొందరు హైకోర్టు ఉద్యోగులు చెప్పుకొచ్చారు. కానీ, రాజేంద్ర కుమార్ కోర్టు పరిసరాల్లో, అది కూడా యూనిఫాంకు పేటీఎం స్టికర్‌ను అంటించుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. (చదవండి: వీడియో కాల్‌తో విపత్తు.. ఫోన్ లిఫ్ట్ చేశామో పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి..) -
హైకోర్టు జడ్జికే దమ్కీ.. పోలీస్ అధికారులపై వేటు
లక్నో: పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ నేరుగా హైకోర్టు జడ్జితో మీ ఇల్లు ఎక్కడా, ఎక్కడికి రావాలి అని ప్రశ్నించడంతో సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... గత ఆదివారం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాష్ సింగ్ జిల్లాకు వచ్చినప్పుడూ ఈ ముగ్గురు పోలీసులకు ఎస్కార్ట్ డ్యూటీ పడింది. దీంతో ఆ ముగ్గురు పోలీసులు న్యాయమూర్తితో ఫోన్లో ఇల్లు ఎక్కడ ఉంది, ఎక్కడకు రావాలి అని నేరుగా ప్రశ్నించారు. దీంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యి పోలీస్ సూపరింటెండ్‌కి పిర్యాదు చేశారు. అంతే అధికారులు అదేరోజు ఆ ముగ్గురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. ఐతే ఈ విషయామై నేరుగా న్యాయమూర్తిని సంప్రదించకూడదని అధికారులు తెలిపారు. న్యాయమూర్తి ప్రోటోకాల్‌ని పర్యవేక్షిస్తున్నావారి వద్ద నుంచి సమాచారం తెలుసుకోవాలని చెప్పారు. ఐతే వారు న్యాయమూర్తి ఫోన్ నెంబర్ ఎలా సంపాదించారనేది తెలియరాలేదన్నారు. (చదవండి: స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? పరువు, గౌరవం కోసం ఎంతకైనా వెళ్తా...నటీ ఖుష్బు సీరియస్) -
‘ఆర్య సమాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవ్’
లక్నో: ఆర్య సమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ల విషయంలో న్యాయ స్థానం తీవ్రంగా స్పందించింది. పత్రాల వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో నమ్మకాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. ఈ క్రమంలో.. ఆర్య సమాజ్ సొసైటీ ఇచ్చే వివాహ ధ్రువపత్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని అలహాబాద్ హైకోర్టు తేల్చింది. ఆర్యసమాజ్‌లో ప్రధాన్‌లు ఇచ్చే సర్టిఫికెట్‌కు చట్టబద్ధత లేదు. వివాహాలను తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందేనని స్సష్టం చేసింది. ఈ మేరకు ఏకసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నా దాన్ని రిజిస్టర్ చేయకపోతే న్యాయస్థానాల పరిధిలో అధికారికంగా గుర్తించలేమని పేర్కొన్నారు. కేవలం ఆ సంస్థ ఇచ్చే పత్రాలు వివాహ చట్టబద్ధతను నిరూపించలేవని అన్నారు. ఒక తండ్రి తన కూతురి విషయంలో అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై విచారణ సమయంలో.. న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ శ్యాం సమాశ్రయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఆర్యసమాజ్ సొసైటీలు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాలతో కోర్టు నిండిపోయింది. ఈ కోర్టు, ఇతర హైకోర్టులలో వివిధ విచారణల సమయంలో వాటి చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పత్రాల వాస్తవికతను కూడా పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో ఆర్య సమాజ్ సంస్థ నమ్మకాలను దుర్వినియోగం చేసింది. ఈ కేసులో.. వివాహం రిజిస్టర్ కానందున పైన పేర్కొన్న సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే పార్టీలు వివాహం చేసుకున్నట్లు భావించలేము’ అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దొంగతనానికి వచ్చి కక్కుర్తితో అడ్డంగా బుక్కయ్యారు -
లఖింపూర్ ఘటన.. కేంద్రమంత్రి కుమారుడికి బెయిల్ నిరాకరణ
లక్నో: కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది అలహాబాద్ హైకోర్టు. బెయిల్ కోరుతూ ఆశిష్ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 15నే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారం వెల్లడించింది. గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆశిష్ మిశ్రా. నిరసనలు చేస్తున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఈ దుర్ఘటనలో నలుగురు అన్నదాతలు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో గేతేడాది అక్టోబర్ 9నే అరెస్టయిన ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆశిష్ బెయిల్‌ను రద్దు చేసింది. మంత్రి కుమారుడు అయినందుకు కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా అదే కారణంతో ఆశిష్‌కు బెయిల్ నిరాకరించింది. చదవండి: ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్ -
తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదుల్లో ఏముందంటే...
లక్నో: భారత పురావస్తు శాఖ తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులకు సంబంధించి కొన్ని ఫోటోలను విడుదల చేసింది. ఈ మేరకు తాజ్‌మహల్‌ని పరిరక్షిస్తున్న ఆర్కియాలజీ సర్వే ఆప్ ఇండియా (ఏఎస్ఐ) మూతపడ్డ గదులకు సంబంధించిన మరమత్తుల ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు ఇటీవలే తాజ్‌మహల్‌లో మూతపడ్డ 22 గదులు తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పిటిషన్ పెద్ద హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలిచింది. అయితే అలహాద్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారించడానికి ముందే న్యూస్ లెటర్ జనవరి 2022 పేరుతో ఆర్కియాలజీ సర్కే ఆప్ ఇండియా(ఏఎస్ఐ) తాజ్‌మహల్‌లో మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు మే9 వ తేదీన తాజ్‌మహల్‌లో అండర్ గ్రౌండ్ వర్క్స్ అనే పేరుతో మూతపడ్డ 22 గదుల చిత్రాలను వారి అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయగా, వీటిని తాజాగా ఏఎస్ఐ విడుదల చేసింది. అంతేగాదు తాజ్‌మహల్ పునరుద్ధరణకు ముందు తర్వాత ఫోటోలను గురించి వివరించింది. గోడలు మెట్లు, పాడైన సున్నపు ప్లాస్టర్ రీప్లాస్టర్‌గా స్క్రాప్ చేయడం వంటి పనులు చేపట్టినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. అలాగే తాజ్‌మహల్ బయటి వైపున, యమునానది ఒడ్డున కూడా మరమత్తుల పనులు చేపట్టినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా మరమత్తులకు సంబంధించిన ఫోటోలతోపాటు "స్మారక కట్టడం పునరుద్ధరణ పనులు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. Click on the link to download/view the January issue of @ASIGoI's Newsletter.https://t.co/tIJmE46UR4 pic.twitter.com/UKWsTA2nPZ — Archaeological Survey of India (@ASIGoI) May 9, 2022 (చదవండి: ‘తాజ్ మహల్ కాదు.. తేజో మహాలయా పిటిషన్’.. కోర్టు ఏమందంటే..) -
తాజ్ మహల్: గదులు తెరిపించాలన్న పిటిషన్ తిరస్కరణ
అలహాబాద్: తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్ చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టకుండానే తిరస్కరించింది. అంతేకాదు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించొద్దంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది. ‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్‌డీలు చేసుకోండి. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ’’ అంటూ బెంచ్ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థిలు పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్‌లో కాదు అంటూ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది. సీల్ చేసి ఉన్న గదులను తెరిపించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్ మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి తేజ్ మహాలయా అని.. అది శివుడి ఆలయం అంటూ ఆయన వాదించారు. అంతేకాదు నిజనిర్ధారణ కమిటీ ద్వారా అసలు చరిత్రను వెలుగులోకి తేవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరారు. మొఘలుల కాలానికి చెందిన తాజ్ మహల్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. ఈ కళాఖండం 1982లో యనెస్కో వరల్డ్ హెరిటేర్ సైట్ గుర్తింపు దక్కించుకుంది కూడా. చదవండి: తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా -
భర్తను పరస్త్రీతో పంచుకోవడం కంటే.. చావే మేలు అనుకుంది!
భర్త విషయంలో భారతీయ స్త్రీలు విపరీతమైన ఆలోచనా ధోరణితో ఉంటారని, తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటారని, పరాయి స్త్రీతో బంధాన్ని పంచుకోవడానికి ఏమాత్రం సహించబోరని అలహాబాద్(ఉత్తర ప్రదేశ్) హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహిత మహిళలు భర్త తమకు మాత్రమే సొంతం అనుకుంటారు. వాళ్ల గురించి విపరీతంగా ఆలోచిస్తుంటారు. ఒకవేళ అతను గనుక వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నా, వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం.. చివరికి ఆలోచనా చేసినా అది ఆ భార్యను కుదిపేసే అంశమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో తీవ్ర నిర్ణయాలే తీసుకుంటారు. ఈ కేసులోనూ అదే జరిగింది అంటూ జస్టిస్ రాహుల్ చతేర్వేది నేతృత్వంలో ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. తన భర్త రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకోబోతున్నాడని, లేదంటే వివాహం చేసుకున్నాడనే ఒక్క కారణం చాలూ.. ఆమె తన ప్రాణం తీసుకునేందుకు అంటూ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలు.. వారణాసి మాండువాది చెందిన సుశీల్ కుమార్ అనే వ్యక్తి, అతని కుటుంబం మీద అతని భార్య చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వాళ్ల మీద కేసు నమోదు అయ్యింది. అయితే భార్య ఆత్మహత్యకు తామేమీ కారణం కాదని, కేసుల నుంచి ఉపశమనం ఇప్పించాలని సుశీల్ కోర్టులను ఆశ్రయించాడు. అయితే సుశీల్ కుమార్‌కు ఇదివరకే రెండు వివాహాలు అయ్యాయని, మరో వివాహం చేసుకోవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ధృవీకరించినట్లయ్యింది. -
ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దు
న్యూఢిల్లీ: లఖీంపూర్‌ఖేరీ ఘటనలో నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. వారంలో లొంగిపోవాలని ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టులో బాధితులకు సరైన న్యాయం జరగలేదని అభిప్రాయపడింది. ‘‘సాక్ష్యాలను కోర్టు హ్రస్వదృష్టితో వీక్షించింది. అసంబద్దమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్లోని అంశాలకు అనవసర ప్రాధాన్యమిచ్చింది’’ అంటూ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. అసంబద్ధ అంశాలను పరిగణనలోకి తీసుకుంది. విచారణలో పాల్గొనేందుకు బాధితులకున్న హక్కును నిరాకరించింది. బెయిలిచ్చేందుకు తొందర పడింది. వీటన్నింటినీ గమనించిన మీదట బెయిల్‌ను రద్దు చేస్తున్నాం’’ అని తెలిపింది. మిశ్రా మళ్లీ బెయిల్ కోరవచ్చని ధర్మాసనం చెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ దానిపై మూణ్నెల్ల లోపు హైకోర్టు సమగ్ర విచారణ జరపవచ్చని పేర్కొంది. యూపీలోని లఖీంపూర్‌ఖేరీలో గతేడాది అక్టోబర్‌లో రైతు నిరసనల సందర్భంగా నిరసనకారులపైకి కారు దూసుకుపోయిన ఘటనలో నలుగురు మరణించారు. ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఫిబ్రవరిలో ఆయనకు బెయిల్ రాగా దాని రద్దు కోరుతూ బాధిత కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. బాధితులకు హక్కుంది బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తమ లాయర్ వీడియో కనెక్షన్ పోవడంతో వాదన విన్పించలేకపోయామన్న బాధితుల వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో హైకోర్టు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వం, నిందితుడి వాదనల ఆధారంగా తీర్పులిస్తారనే అభిప్రాయం ఇటీవలి దాకా ఉండేది. బాధితులకు ఈ విచారణలో భాగస్వామ్యం ఉండదన్నట్టుగా భావించేవారు. కానీ వారికీ విచారణలో పాల్గొనే హక్కుంటుంది’’ అని చేసింది. ఈ కేసులో బాధితులకు సక్రమ హియరింగ్‌లో పాల్గొనే హక్కు లభించలేదని అభిప్రాయపడింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ప్రాథమిక అంశాలను పరిశీలించవచ్చు. ప్రస్తుత కేసు తీవ్రతను, ఆరోపణలు రుజువైతే పడే శిక్ష తీవ్రతను, నిందితుడు పారిపోయే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలను, అతని విడుదల సమాజంపై చూపే ప్రభావాన్ని అంచనా వేయడంలో హైకోర్టు హ్రస్వదృష్టితో వ్యవహరించింది. బెయిల్ మంజూరు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసింది’’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్ఐఆర్నే సర్వస్వంగా పరిగణించకూడదని హితవు పలికింది. మంత్రి తప్పుకోవాలి: కాంగ్రెస్ ఆశిష్ బెయిల్ రద్దు నేపథ్యంలో ఆయన తండ్రి, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాను ప్రధాని మోదీ ఎప్పుడు కోరతా రని కాంగ్రెస్ ప్రశ్నించింది. మోదీ ప్రభుత్వం రైతులను ఎన్నాళ్లు అణచివేస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. రైతులపై అధికారుల సాక్షిగా అన్యాయం, దౌర్జన్యం జరుగుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. వారికి న్యాయం కోసం అందరూ మద్దతివ్వాలన్నారు. చదవండి: భారత్‌కు బ్రిటన్ ప్రధాని.. నేరుగా మోదీ సొంత రాష్ట్రంలోనే -
జైల్లోనే ఆశిష్ మిశ్రా
లక్నో: లఖీంపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిలు మంజూరు చేసినా జైలు నుంచి విడుదల కాలేదు. 2021 అక్టోబర్‌లో ఆశిష్‌ను పోలీసులు సెక్షన్ 147, 148, 149, 302, 307, 326, 34, 427, 120బీ కింద అరెస్టు చేశారు. వీటితో పాటు ఆయుధాల చట్టం కింద కూడా ఆశిష్‌పై నేరారోపణ చేశారు. తాజాగా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్లో 302, 120 బీ సెక్షన్లకు సంబంధించి వివరాల్లేవు. సెక్షన్ 302 హత్యాయత్నంకు సంబంధించినది కాగా 120 బీ సెక్షన్ క్రిమినల్ కుట్రకు సంబంధించినది. బెయిల్ ఆర్డర్లో ఈ రెండు చట్టాల గురించి పేర్కొనకపోవడంతో ఆశిష్ విడుదల జరగలేదు. దీనిపై స్పందిస్తూ బెయిల్ ఆర్డర్లో ఈ రెండు సెక్షన్లను కూడా చేర్చాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ఆశిష్ న్యాయవాది చెప్పారు. రైతు ఆందోళనల సమయంలో నలుగురు రైతుల మరణానికి కారణమయ్యాడని ఆశిష్‌పై కేసు నమోదైంది. బెయిల్ కోసం ఆశిష్ యత్నిస్తుండగా గురువారం హైకోర్టులో ఊరట దొరికింది. -
భార్యభర్తల గొడవ.. కోర్టు సంచలన తీర్పు!
అహ్మదాబాద్: ఒక మహిళను భర్తతో కలిసి నివశించాలని, కాపురం చేయాలని కోర్టులు బలవంతం చేయలేవని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కుటుంబ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. అంతేకాకుండా ముస్లిం చట్టం బహుభార్యత్వం అనుమతిస్తోంది కానీ ప్రోత్సహించలేదని, అందువల్ల ఒక వ్యక్తి తొలిభార్య అతనితో కలిసి ఉండేందుకు నిరాకరించవచ్చని కూడా వ్యాఖ్యానించింది. సవతులతో కలిసి జీవించాలని భార్యను బలవంతం చేసే హక్కును భర్తకు ఇవ్వలేదని తెలిపింది. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి ఒక ఆశగా మిగలకూడదన్న ఢిల్లీ హైకోర్టు అభిప్రాయాన్ని గుజరాత్ హైకోర్టు గుర్తు చేసింది. దాంపత్య హక్కులు కేవలం భర్తకు మాత్రమే సొంతమైనవి కాదని జస్టిస్ పార్దివాలా, జస్టిస్ నీరల్ మెహతాల బెంచ్ అభిప్రాయపడింది. ఈ విషయంలో తీర్పు ఇచ్చేముందు భార్య అభిప్రాయాన్ని కుటుంబ కోర్టు తెలుసుకోవాలని సూచించింది. 2010లో పిటిషనర్ మహిళకు ఒక వ్యక్తితో వివాహమైంది. 2015లో వీరికి ఒక కుమారుడు కలిగాడు. నర్సుగా ఆమెను ఆస్ట్రేలియాకు పంపాలన్న భర్తకుటుంబ నిర్ణయంతో వ్యతిరేకించి 2017లో ఆమె అత్తింటి నుంచి బయటకు వచ్చింది. దీనిపై భర్త కుటుంబ కోర్టును ఆశ్రయించగా కాపురానికి వెళ్లాలని ఆమెను కోర్టు ఆదేశించింది. దీనిపై ఆ మహిళ హైకోర్టుకు వెళ్లింది. విచారణ జరిపిన కోర్టు బలవంతంగా కాపురం చేయించడం జరగదని తేల్చిచెప్పింది. -
జడుపు ఒద్దు, జాగ్రత్త ముఖ్యం
దాదాపు రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచమంతటికీ చెబుతున్న పాఠం! తాజా వైవిధ్యం ‘ఒమిక్రాన్’ విషయంలో పొల్లుపోని అక్షర సత్యం. వైరస్ బారినపడి భంగపోకుండా విరుగుడు కార్యాచరణకు తిరుగులేని బ్రహ్మాస్త్రం! తూర్పు దేశాల్లో వాతావరణం చూశాక, ఇక్కడ అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన జాగ్రత్తలపై అందరూ చేస్తున్న హెచ్చరిక ఇదే! ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్ని వాయిదా వేయాలన్న అలహాబాద్ హైకోర్టు సూచనని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ర్యాలీల్ని, సభల్ని రద్దు చేయించాలని న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్నీ కోరింది. వచ్చేవారం క్షేత్ర పర్యటన చేసి నిర్ణయిస్తామని ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. ఎన్నికలు వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు. రాత్రి పూట కర్ఫ్యూని యూపీ ప్రభుత్వం అప్పుడే ప్రకటించేసింది. క్రిస్టమస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగల దృష్ట్యా ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలిచ్చాయి. దేశంలో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో పాటు పాలకులు, న్యాయస్థానాలు పౌరసమాజాన్ని ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తం చేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో, ఈ దిశలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. తూర్పులోని అమెరికా, ఐరోపా దేశాలలో కేసుల ఉధృతి పెరిగిన క్రమంలోనే మన దేశంలోనూ కేసుల సంఖ్య పెరగడం గడచిన రెండేళ్లుగా రివాజయింది. ఆఫ్రికాలో మొదలై అత్యంత వేగంగా నూరు దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వ్యాప్తి అమెరికా, ఐరోపాను వణికిస్తోంది. రోజువారీ కోవిడ్ కొత్త కేసులు అమెరికాలో 2.65 లక్షలకు చేరాయి. కిందటి వారం రోజుల సగటు 1.88 లక్షల కేసులుగా నమోదయింది. ఇక బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్)లో రోజువారీ కొత్త కేసులు 1.22 లక్షలు కాగా, కిందటి వారం సగటు 96 వేల కేసులు. ఇప్పటివరకు వచ్చిన కరోనా అన్ని వైవిధ్యాల కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండి, కొత్త కేసుల్లో వాటి శాతం రమారమి పెరుగుతోంది. మన దేశంలో కోవిడ్ రెండో అల ఉధృతి తీవ్రంగా ఉన్నపుడు జరిగిన భారీ నష్టం మనందరికీ గుర్తుంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కేసులు సంఖ్య ఇబ్బడి–ముబ్బడిగా పెంచి, ఇపుడు మూడో అలను మనమే రేపిన వాళ్లమౌతాం! ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అసాధారణమని, అత్యంత వేగవంతమని అన్ని అధ్య యనాలూ తేల్చాయి. ఆఫ్రికా, అమెరికా, బ్రిటన్లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే ధృవీకరించింది. దాన్ని నిజం చేస్తూ, దేశంలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా, ముఖ్యంగా భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వైవిధ్యంతో పోలిస్తే ఒమిక్రాన్ ‘అంత ప్రమాదకారి కాదు’ అనే నివేదికలు వస్తున్నాయి. వైరస్ సోకినా, ఆస్పత్రికి వెళ్లి ఐసీయూలో ఉండాల్సిన అవసరం వచ్చేది తక్కువ కేసుల్లోనే! అలా అని నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్–19 తొలి అల తీవ్రత మందగిస్తున్నపుడు ప్రజానీకం చూపిన అలసత్వానికి దేశం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్ నిబంధనల్ని పాటించ కుండా, ‘ఇంకెక్కడి కోవిడ్...?’ అని పౌరులు చూపిన విచ్చలవిడితనం, నిర్లక్ష్యం నికర ఫలితం... రెండో అల ఉధృతి! దేశం అల్లాడిపోయింది. నెల వ్యవధిలో లక్షమందిని కోల్పోయిన పాడు కాలం, కళ్ల జూశాం! ఇపుడైనా... నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శరీరంలోకి జొరబడ్డ వైరస్ పరిమాణం–ఉధృతి పెరిగితే ఎవరికైనా ప్రమాదమే! అప్పటికే ఇతరేతర జబ్బులున్న వాళ్లకు ఇది అత్యంత ప్రమాదకరం. ఏ టీకా తీసుకోని వారూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు 140 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. దేశ జనాభాలో అర్హులైన (18 ఏళ్లు పైబడ్డ) వారిలో 60 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడగా, మొత్తమ్మీద 89 శాతం మంది అర్హులకు కనీసం ఒక డోసైనా టీకా ఇచ్చినట్టయింది. ఈ కార్యక్రమాన్ని వేగిరపరచాలని, త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ‘జనం బతికుంటే, ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు తర్వాతైనా పెట్టుకోవచ్చు’అంటూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయం నూరుపాళ్లు సత్యం! అధికరణం 21 ద్వారా రాజ్యాంగం భరోసా ఇచ్చిన మనిషి జీవించే హక్కును ఉటంకిస్తూ ఆయనీ వ్యాఖ్య చేశారు. విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టే రాష్ట్రాల సరిహద్దుల్లో, బస్స్టేషన్లలో, రైల్వేస్టేషన్లలోనూ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ స్ఫూర్తిని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌరసమాజం కూడా చిత్తశుద్దితో స్వీకరించాలి. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కనబరచాలి. న్యాయస్థానాలు నిర్దేశించినట్టు, ప్రభుత్వాలు ఆదేశిస్తు న్నట్టు, మనమంతా గ్రహిస్తున్నట్టు... చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం, మూతి ముసు గులు ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా చేయాలి. పండుగలు, పబ్బాల గురించి మతాలకతీతంగా ఆలోచించాలి. ఏ పండుగలైనా ప్రజల ప్రాణాలకన్నా మిక్కిలి కాదు. సభలు, సమావేశాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం కష్టమౌతుంది కనుక వాటిని నిలువరించాలి. ఈ విషయం నిర్లక్ష్యం చేస్తే, న్యాయస్థానమే చెప్పినట్టు... పరిస్థితులు రెండో అల విపరిణామాల్ని మించే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! -
ఒమిక్రాన్ అలజడి.. యూపీ ఎన్నికలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
లక్నో: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న క్రమంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సూచించింది. ఈసీ సహా ప్రధాని మోదీని కూడా ఈ మేరకు కోరింది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. పైగా ఒమిక్రాన్ సెకండ్ వేవ్‌ను మించి ఉండొచ్చని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 300 దాటాయి. ఈ క్రమంలోనే సర్వత్రా ఆందోళన నెలకొందని అభిప్రాయపడింది. గతంలో యూపీలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో కేసులు, మరణాలు విపరీతంగా పెరిగడం చూశాం. మనం వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా.. వీలైతే రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరింది. ప్రజలు ప్రాణాలు ముఖ్యమని ఆ తర్వాతే ఎన్నికలైనా ఏవైనా అని ధర్మాసనం అభిప్రాయపడింది. వచ్చే ఏడాది యూపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అలహాబాద్ కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రధాన మంత్రికి ఈ మేరకు సూచన చేసింది. చదవండి: ఆందోళనలో 50 లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం!.. ఆ చట్టానికి మోక్షం ఎప్పుడో? -
మీర్జాపూర్ వెబ్ సిరీస్ వివాదం.. హైకోర్టు కీలక నిర్ణయం
అలహాబాద్: మీర్జాపూర్ వెబ్ సిరీస్ రూపకర్తలకు ఊరట లభించింది. నిర్మాతలు ఫర్హాన్ అఖర్, రితేష్ సిధ్వానీలపై దాఖలైన ఎఫ్ఐఆర్ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దర్శక-రచయితలు కరణ్ అన్షుమాన్, గుర్మీత్ సింగ్, పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణలపై నమోదైన ఎఫ్ఐఆర్ను కూడా హైకోర్టు రద్దు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వెబ్ సిరీస్ రూపొందించారని ఆరోపిస్తూ కొత్వాలి దేహత్ పోలీస్ స్టేషన్ (మీర్జాపూర్)లో స్థానిక జర్నలిస్ట్ అరవింద్ చతుర్వేది జనవరి, 17న ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 295-ఏ, 504, 505, 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67-ఏ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెబ్ సిరీస్‌లో మీర్జాపూర్ పట్టణాన్ని చెడుగా చిత్రీకరించి మత, సామాజిక, ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ముందుగా నిర్మాతలు కోర్టు ఆశ్రయించారు. తర్వాత దర్శక-రచయితలు కూడా న్యాయస్థానం తలుపు తట్టారు. జనవరి, ఫిబ్రవరిలో వీరిని అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశిలిచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ పూర్తిగా కల్పితమని, అన్ని మతాలను తాము గౌరవిస్తామని అంతకుముందు ఉన్నత న్యాయస్థానానికి వీరు విన్నవించుకున్నారు. వీరి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్లను కోర్టు రద్దు చేసింది. (చదవండి: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్) అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌కు వీక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఇప్పటికే రెండు సిరీస్‌లు విడుదలయ్యాయి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజాల్, దివ్యేందు శర్మ, కుల్‌భూషణ్ ఖర్బందా, రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, ప్రమోద్ పాఠక్, హర్షిత గౌర్, షాజీ చౌదరి తదితరులు నటించారు. ఇదిలావుంటే మూడో మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత!) -
పౌరసత్వ సవరణ చట్టంపై ప్రసంగం: కఫీల్ ఖాన్‌కు ఊరట
లక్నో: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) లో పౌరసత్వ సవరణ చట్టం అంశంపై 2019 లో డాక్టర్ కఫీల్ ఖాన్ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగానికి సంబంధించిన కేసులో అలహబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సాంకేతిక కారణాలతో అతడిపై నమోదైన క్రిమినల్ కేసులను పక్కన పెట్టింది. అలీగఢ్ మేజిస్ట్రేట్ ముందు ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తప్పనిసరి ముందస్తు అనుమతిని పోలీసులు తీసుకోలేదని డాక్టర్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ గౌతమ్ చౌదరి అంగీకరించారు. ఈ కేసులో ఇప్పుడు సరైన విధానాన్ని అనుసరించమని కోరుతూ న్యాయమూర్తి కేసును తిరిగి స్థానిక కోర్టుకు పంపారు. ఈ సందర్భంగా3 డాక్టర్ కఫీల్ ఖాన్ మాట్లడుతూ.. ‘‘ఇది భారతదేశ ప్రజలు సాధించిన భారీ విజయం. ఈ తీర్పు న్యాయవ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచింది. అలహాబాద్ హైకోర్టు తీర్పుతో ఉత్తరప్రదేశ్ ప్రజలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉన్నతాధికారం పూర్తిగా బహిర్గతమైంది. ఈ ధైర్యమైన తీర్పు భారతదేశం అంతటా జైళ్లలో మగ్గుతున్న ప్రజాస్వామ్య అనుకూల పౌరులు, కార్యకర్తలందరికీ నమ్మకాన్ని, ఆశను ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. భారత ప్రజాస్వామ్యం దీర్ఘకాలం వర్థిల్లాలి’’ అంటూ నినాదాల చేశారు. (చదవండి: పౌర స్వేచ్ఛకు పట్టం) డాక్టర్ కఫీల్ ఖాన్ తన డిసెంబర్ 13, 2019 పౌరసత్వ సవరణ చట్టం అంశంపై తన ప్రసంగం ద్వారా ఏఎంయూ యొక్క శాంతియుత వాతావరణాన్ని, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేశారు. అంతేకాక అతను మతం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించాడని కఫీల్ ఖాన్‌పై అభియోగాలు మోపారు. ఈ క్రమంలో కఫీల్‌ని జనవరి 29, 2020 న అరెస్టు చేశారు. తర్వాత, ఈ కేసులో జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చింది. (చదవండి: వివాహేతర సంబంధం: డీఎన్ఏ పరీక్ష ఉత్తమం) పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించడం.. భారతదేశ భద్రతకు.. విదేశీ దేశాలతో దాని సంబంధాలకు భంగం కలిగించారని అనుమానించినట్లయితే, ఒక సంవత్సరం వరకు కోర్టులో ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రజలను నిర్బంధించడానికి ఈ కఠినమైన చట్టం ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. గత సెప్టెంబర్‌లో, అలహాబాద్ హైకోర్టు డాక్టర్ ఖాన్‌ను సుదీర్ఘంగా నిర్బంధించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. అతడిని వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, భారతీయ శిక్షాస్మృతి కింద క్రిమినల్ చర్యలు కొనసాగుతున్నాయి. -
ఆచరణ సాధ్యం కానీ ఆదేశాలు వద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆచరణ సాధ్యం కానీ, అమలు చేయడం వీలుకానీ ఆదేశాలు ఇవ్వొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం కింది కోర్టులకు సూచించింది. ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో... సుమోటోగా స్వీకరించింది అలహబాద్ హైకోర్టు. విచారణ పూర్తైన తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న ప్రతీ గ్రామానికి ఐసీయూ సౌకర్యం కలిగిన రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో పాటు నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రంలో అన్ని నర్సింగ్ హోమ్‌లలో ఉన్న బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలంది. నిష్పత్తికి తగ్గట్టుగా ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయాలంది. సుప్రీంలో అప్పీల్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకి వెళ్లింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం వాస్తవంలో సాధ్యం కాదని పేర్కొంది. నెల నుంచి నాలుగు నెలల సమయం ఇచ్చి ఇన్ని అద్భుతాలు చేయమంటే మా వల్ల కాదంటూ వాదించింది. కోర్టు చేసిన వ్యాఖ్యల వల్ల ఉత్తర ప్రదేశ్‌లో ఆరోగ్య సిబ్బంది మనోస్థైర్యం దెబ్బతింటోందని వివరించింది. అలా వద్దు ఉత్తర ప్రదేశ్ వాదనలు విన్న తర్వాత... ఆచరణలో సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వొద్దంటూ అలహబాద్ హైకోర్టుకు సూచించింది సుప్రీం కోర్టు. కరోనాతో విలవిలాడుతున్న ప్రజల కష్టాలను చూసి కోర్టు స్పందించి ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పు పట్టలేమంది. అయితే కోర్టు వెలువరించే ఆదేశాలు ఆచరణలో సాధ్యమయ్యేవిగా ఉండాలంటూ తేల్చి చెప్పింది. ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందని పేర్కొంది. -
తాండవ్ వివాదం: ‘ఆమె అరెస్ట్ తప్పదు’
లక్నో: అమెజాన్ ముఖ్య అధికారి అపర్ణ పురోహిత్‌కి అలహాబాద్ హై కోర్టులో చుక్కెదురయ్యింది. ‘తాండవ్’ వెబ్ సీరిస్ మీద నమోదైన కేసుకు సంబంధించి ఆమె దరఖాస్తు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హై కోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్ తిరస్కరించారు. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయిన పొలిటికల్ డ్రామా తాండవ్‌పై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాండవ్ మేకర్స్‌పై ఉత్తరప్రదేశ్ నోయిడాలో కేసు నమోదు చేశారు. తాండవ్ వెబ్ సిరీస్‌లో మతపరమైన శత్రుత్వం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఇందుకు గాను ఈ వెబ్ సీరిస్ మేకర్స్‌పై చర్యలు తీసుకోవాలిందిగా ఫిర్యాదులో కోరారు. అపర్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సిద్ధార్థ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పిటిషన్‌దారుకి ఈ దేశ చట్టాలపై చిన్నచూపు ఉన్నట్లు ఆమె ప్రవర్తన ద్వారా తెలుస్తోంది. ఈ కారణంగా ఆమెకు కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించదు’’ అన్నారు. ‘‘ఒకవేళ దేశ పౌరులు ఇలాంటి నేరాలకు పాల్పడితే.. ఇక్కడి జనాల నుంచి వ్యతిరేకతను, నిరసనను చవి చూడాల్సి వస్తుంది. అప్పుడు వెంటనే ఈ దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన శక్తులు చురుకుగా మారతాయి. చిన్నవిషయాన్ని పెద్దదిగా చేసి.. భారతీయ పౌరులు అసహనంగా ఉన్నారు.. 'ఇండియా' నివసించడానికి అసురక్షిత ప్రదేశంగా మారిందని ఆరోపిస్తూ వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ప్రచారం చేస్తూ.. చర్చను లేవనెత్తుతాయి. దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి’’ అన్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ జైలులో చాలా రోజులు గడిపిన తరువాత ఇటీవల సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన హాస్యనటుడు మునవర్ ఫరూకి కేసును ప్రస్తావిస్తూ, న్యాయమూర్తి.. "పాశ్చాత్య చిత్ర నిర్మాతలు వారి దైవమైన యేసు ప్రభువును, ఇతర ప్రవక్తలను ఎగతాళి చేసే సాహసం చేయరు. కాని హిందీ చిత్ర నిర్మాతలకు ఈ విషయంలో ఎలాంటి హద్దులు లేవు. ఇప్పటికే అనేక సార్లు వారు హిందూ దేవతలను చాలా ఘోరంగా అవమానించారు’’ అని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో హిందీ చిత్ర పరిశ్రమలో చారిత్రక, పౌరాణిక వ్యక్తుల ఇమేజ్ను అణచివేసే చర్యలు పెరిగాయని.. దీన్ని సరైన రీతిలో అడ్డుకోకపోతే భారతీయ సామాజిక, మత పరిస్థితులు వినాశకరమైన పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని.. ఇలాంటి చర్యలు సరైనవి కావని జస్టిస్ సిద్ధార్థ్ అభిప్రాయపడ్డారు. ఈ దేశ సాంఘిక, సాంస్కృతిక వారసత్వం గురించి పెద్దగా తెలియని దేశంలోని యువ తరం ప్రస్తుతం సినిమాల్లో చూపించిన వాటిని క్రమంగా నమ్మడం ప్రారంభిస్తారని.. ఇద దేశ సమైక్యతను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: 'తాండవ్' వివాదం.. నాలుక కోస్తే రూ. కోటి రివార్డు అమెజాన్ నెత్తిన పిడుగు: సుప్రీంకోర్టు నోటీసులు -
పౌర స్వేచ్ఛకు పట్టం
యుక్త వయసొచ్చిన జంట కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదంటూ బుధవారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ద్వారా పౌర స్వేచ్ఛకు మరోసారి ఉన్నత న్యాయస్థానం పట్టం కట్టింది. ప్రత్యేక వివాహ చట్టంలోని 30 రోజుల నోటీసు గడువు నిబంధన తప్పనిసరి కాదని, ఐచ్ఛికం మాత్రమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమకిచ్చే నోటీసును ప్రచురించటం అవసరమో కాదో ఆ జంట తెలిపితే దాని ప్రకారం వ్యవహరించాలని వివరించింది. నోటీసు బహిరంగపరచటం వల్ల పెళ్లాడే జంట విష యంలో అన్యుల జోక్యం ఎక్కువైందని ధర్మాసనం భావించింది. మన దేశంలో వివిధ మతాలవారికి వేర్వేరు వివాహ చట్టాలున్నాయి. అయితే కుల, మతాల్లో విశ్వాసం లేనివారికీ లేదా వేర్వేరు మతా లకు చెందిన జంటలకు, తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లాడదల్చుకున్నవారికి వర్తించే విధంగా 1954లో ప్రత్యేక వివాహ చట్టం అమల్లోకొచ్చింది. ద్రవిడ ఉద్యమం జోరుగా వున్న సమ యంలో వివాహ సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు పాటించకుండా బహిరంగ వేదికలపై కేవలం దండలు మార్చుకుని అనేక జంటలు ఒక్కటయ్యాయి. అలాంటి దంపతుల మధ్య కాలం గడిచాక విభేదాలు రావటం, మహిళ జీవితం అనిశ్చితిలో పడటం పర్యవసానంగా ఇలాంటి చట్టం వుండటం అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే ప్రత్యేక వివాహ చట్టం నిస్సహాయులైన మహిళలకు తోడ్పడినా, దానివల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. పెళ్లాడదల్చుకున్నవారు దర ఖాస్తు ఇచ్చాక వివాహ నమోదు అధికారి 30 రోజుల నోటీసు ఇవ్వాలని, ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే వివాహాన్ని నమోదు చేసుకుని జంటకు ధ్రువీకరణ పత్రం అందజేయాలని ఆ నిబంధన నిర్దేశిస్తోంది. ఆచరణలో ఇది అనేక సమస్యల్ని సృష్టిస్తోంది. అంతవరకూ తమ తమ తల్లిదండ్రుల వద్ద వుండే జంట సహజంగానే నోటీసు పంప టానికి ఆ చిరునామాలు ఇవ్వాల్సివుంటుంది. దాని కాపీ నోటీసు బోర్డులో కూడా పెడతారు. ఇంటి కొచ్చే నోటీసును తల్లిదండ్రుల కంటబడకుండా చేయటం సాధ్యమవుతున్నా, రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద ప్రదర్శించే నోటీసుతో జంటకు తిప్పలొచ్చిపడుతున్నాయి. ఛాందసవాదులు ఆ నోటీసుల్లో వున్న చిరునామాలు చూసి నేరుగా అక్కడికి పోయి సమాచారం ఇవ్వటం లేదా ఫోన్ చేసి చెప్పటం రివాజ వుతోంది. దాంతో ఇరు కుటుంబాలవారూ యువతీయువకుల్ని నిర్బంధంలో వుంచుతున్నారు. ఛాందసవాదుల వేధింపులు సరేసరి. పైగా నిబంధన ప్రకారం పెళ్లికి ముగ్గురు సాక్షులుండాలి. వివా హంపై 30 రోజుల్లో అభ్యంతరాలు వ్యక్తమైన పక్షంలో వారొచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. దీంతో సాక్షు లుగా వుండటానికి అనేకులు సంశయిస్తారు. హైకోర్టు తీర్పు పర్యవసానంగా నోటీసు నిబంధన తమకు సమ్మతం కాదని తెలియజేస్తే వివాహ నమోదు అధికారి ఇతరత్రా గుర్తింపు పత్రాల ఆధా రంగా వారి వివాహాన్ని నమోదు చేయాల్సివుంటుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో విలువైనది. నిరుడు నవంబర్ 24న ఇదే కోర్టు యుక్తవయసొచ్చినవారికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వుంటుందని, అందులో జోక్యం చేసుకోవటం రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించటమే నని స్పష్టం చేసింది. సరిగ్గా అదే రోజు ‘పెళ్లి కోసం మతం మార్చుకోవటాన్ని’ నిరోధిస్తూ యూపీ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొచ్చింది. భిన్న మతాలకు చెందిన జంటలో ఎవరో ఒకరు అవతలివారి మతానికి మారుతున్నట్టు ప్రకటించటం, అందుకు అనుగుణంగా తమ పేరు మార్చుకోవటం రివాజు అవుతున్నందున ఆర్డినెన్సు అవసరమైందని ప్రభుత్వం తెలిపింది. మతాంతర వివాహాలను నిరో ధించే ఉద్దేశంతోనే దాన్ని తీసుకొచ్చారని స్పష్టమవుతూనే వుంది. ఇప్పుడు ప్రత్యేక వివాహ చట్టం విషయంలో ఇచ్చిన తీర్పు ప్రేమికుల జంటకుండే రాజ్యాంగపరమైన హక్కును మరోసారి తేటతెల్లం చేసింది. ఆర్డినెన్సు వచ్చాక యూపీలో మతాంతర వివాహం చేసుకునే జంటలకు వేధింపులు ఎక్కు వయ్యాయి. మూడేళ్లక్రితం పెళ్లి చేసుకున్న జంటలను సైతం పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆర్డినెన్సు ప్రకారం నేరం రుజువైతే పదేళ్లవరకూ జైలు శిక్ష పడుతుంది. వాస్తవానికి మతాంతర, కులాంతర వివాహాలు చేసుకునే జంటలు మన దేశంలో చాలా స్వల్పం. ఆ కొద్దిమందికీ కూడా ప్రత్యేక వివాహ చట్టం నిబంధనలు అవరోధంగా వున్నాయని, వాటి కార ణంగా ఆ జంటలు వేధింపులు ఎదుర్కొనవలసి వస్తున్నదని 2012లో లా కమిషన్ నివేదిక తెలి పింది. వివాహంతో ఒక్కటవుదామనుకునే వారిపై ఎటూ కుటుంబాల ఒత్తిడి వుంటుంది. తల్లిదండ్రుల్లో అత్యధికులు తాము ఎంపిక చేసినవారినే పిల్లలు జీవిత భాగస్వాములుగా అంగీకరించాలని ఆశిస్తారు. అందుకు అంగీకరించని పిల్లలపై వారి ఆగ్రహావేశాలూ సర్వసాధారణమే. కానీ బల వంతంగా తాము అనుకున్నవారితో పెళ్లి జరిపించటానికి ప్రయత్నించటం... కక్షలకు పోయి హతమార్చేందుకు వెనకాడకపోవటం ఇటీవల పెరిగింది. పిల్లల చర్యతో తమ పరువు పోయిందని ఆ తల్లిదండ్రులు భావించటమే కారణం. ఇది ఆందోళక కలిగించే ధోరణి. ఇది చాలదన్నట్టు అందులో తలదూర్చాలని యూపీ సర్కారుతోపాటు మరికొన్ని బీజేపీ ప్రభుత్వాలు నిర్ణయించటం దారుణం. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆర్డినెన్సులపై ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో యుక్తవయసొచ్చిన జంట వివాహ నిర్ణయంలో రాజ్యం లేదా రాజ్యేతర శక్తుల జోక్యం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వటం మెచ్చదగ్గది. రెండేళ్లక్రితం కేరళకు చెందిన హదియా కేసులో సుప్రీంకోర్టు సైతం ఇటువంటి తీర్పే ఇచ్చింది. ఒక అంశంలో న్యాయస్థానాలు పదే పదే íß తబోధ చేయాల్సిరావటం, బాధ్యతగల ప్రభుత్వాలే వాటిని పెడచెవిన పెడుతుండటం విచారకరం. -
మతాంతర వివాహం: ఆ హక్కు ఎవరికీలేదు
సాక్షి, న్యూఢిల్లీ : మతాంతర వివాహాలను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం రూపొందించిన తరుణంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మేజర్లైన ఇద్దరు యువతీయువకుల మధ్య జరిగిన వివాహాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి స్వేచ్ఛను హరించే హక్కు, అధికారాలు ఇరు కుటుంబాల సభ్యులకు కూడా లేదని తీర్పును వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ శ్రీవాస్తవతో కూడిన ఏకసభ్య ధర్మాసనం శనివారం తీర్పునిచ్చింది. లక్నోకు చెందిన ఇద్దరు యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో వారి వివాహానికి పెద్దలు అంగీకారం తెలపలేదు. దీంతో పెద్దల అభిష్టానికి విరుద్ధంగా గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరిని కుటుంబ సభ్యులు వేధించసాగారు. వివాహాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో జంట హైకోర్టును ఆశ్రయించింది. (వింత వివాహం: ఓ వరుడు.. ఇద్దరు వధువులు) తమ ప్రేమకు వ్యతిరేకంగా పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని, తమకు రక్షణకు కల్పించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బాధితులకు బాసటగా నిలిచింది. ఇరు కుటుంబాల సభ్యుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. యువతీ, యువకులు స్వేచ్ఛను హరించే హక్కు వారికి లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా నూతన దంపతులకు కొన్ని రోజుల పాటు పోలీసు భద్రతను కల్పించాల్సిందిగా స్థానిక డీఎస్పీని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు కుటుంబ సభ్యులను వదులుకుని వచ్చిన వధువుకు ఆర్థికంగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత భర్తపై ఉందని, వెంటనే ఆమె పేరు మీద 3లక్షల రూపాయల నగదును జమచేయాలని పేర్కొంది. కాగా మతాంతర వివాహాలను నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం మధ్య ప్రదేశ్ సైతం ఇలాంటి చట్టాన్నే రూపొందించింది. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలపై దేశ వ్యాప్తంగా చర్చసాగుతోంది. (ప్రేమలో పడ్డవారిని శిక్షించడం నేరం) -
మరోసారి తెరపైకి అయోధ్య కేసు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్ బీజేపీ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ (92), మురళీ మనోహార్ జోషీ (86), ఉమాభారతి, కళ్యాణ్ సింగ్, వీహెచ్‌పీ నేత వినయ్ కటియార్లతో పాటు మొత్తం 32 మంది నిర్ధోషులుగా తేల్చుతూ లక్నో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అయోధ్యకు చెందిన ఇద్దరు వ్యక్తులు సవాలు చేశారు. స్థానికులైన హాజీ మహ్మద్ అహ్మద్ (74), సయ్యద్ అల్కఖ్ అహ్మద్ (81) అనే ఇద్దరు ముస్లిం వ్యక్తులు సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ముందు ఓ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పును పునఃసమీక్షించాలని పిటిషన్లో కోరారు. (వృద్ధ నేతను వెంటాడుతున్న బాబ్రీ విధ్వంసం) కాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిపై సీబీఐ అభియోగాలు నమోదు చేయగా.. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ సమయంలో 17 మంది చనిపోయారు. మిగిలిన 32 మందిని నిర్దోషులని సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు ప్రకటించింది. మసీదు కూల్చివేతకు నిందితులు కుట్ర పన్నినట్లుగా ఎలాంటి స్పష్టమైన, విశ్వసనీయ సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. పైగా, అందులో రామ్‌లల్లా విగ్రహం ఉన్నందున, ఆ నిర్మాణాన్ని కాపాడేందుకు విశ్వహిందూ పరిషత్ నేత దివంగత అశోక్‌సింఘాల్ ప్రయత్నించారని దాదాపు 2,300 పేజీల తీర్పులో సీబీఐ న్యాయమూర్తి ఎస్కే యాదవ్ వెల్లడించారు. నిందితులంతా రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణ సమయంలో కూల్చివేత ఘటన నాటి వార్తాకథనాలను కానీ, వీడియో క్యాసెట్లను న్యాయమూర్తి సాక్ష్యాలుగా పరిగణించలేదు. (ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!) ఒరిజినల్ కాపీలు కానందున వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేదన్నారు. కోర్టుకు సమర్పించిన వీడియోలు కూడా స్పష్టంగా లేవన్నారు. అలాగే, నెగెటివ్స్ సమర్పించనందున, ఘటనకు సంబంధించిన ఫొటోలను కూడా సాక్ష్యాలుగా పరిగణించలేమన్నారు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామాలయ నిర్మాణం కోసం వినియోగించాలని సుప్రీంకోర్టు 2019 నవంబర్‌లో చారిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని మరో ప్రముఖ ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీజే రంజన్ గొగోయ్ తీర్పులో పేర్కొన్నారు. ఆ 32 మంది వీరే.. 1, ఎల్కే అడ్వాణీ, 2. మురళీ మనోహర్ జోషి, 3. కళ్యాణ్ సింగ్, 4. ఉమాభారతి, 5. వినయ్ కతియార్, 6. సాక్షి మహరాజ్, 7. సాధ్వి రితంబర, 8. మహంత్ నృత్య గోపాల్ దాస్, 9. రామ్‌విలాస్ వేదాంతి, 10. చంపత్ రాయ్, 11. సతీష్ ప్రధాన్, 12. ధరమ్ దాస్, 13. బ్రిజ్ భూషణ్ సింగ్, 14. పవన్ కుమార్ పాండే, 15. జై భగవాన్ గోయల్, 16. లల్లూ సింగ్, 17. జైభాన్ సింగ్ పావాయా, 18. ఆచార్య ధర్మేంద్ర దేవ్, 19. రాంజీ గుప్తా, 20. ప్రకాశ్ శర్మ, 21. ధర్మేంద్ర సింగ్ గుర్జార్, 22. ఆర్ఎం శ్రీవాస్తవ, 23. సతీష్ ప్రధాన్ కరసేవకులు: 24. రామ్ చంద్ర ఖత్రి, 25. సుధీర్ కక్కర్, 26. అమన్ నాథ్ గోయల్, 27. సంతోష్ దుబే, 28. వినయ్ కుమార్ రాయ్, 29. కమలేష్ త్రిపాఠి, 30. గంధి యాదవ్, 31, విజయ్ బహదూర్ సింగ్, 32. నవీన్ భాయ్ శుక్లా. -
ప్రేమ పెళ్లిళ్ల పంచాయతీ
ప్రేమించి పెళ్లాడే జంటలకు ఇప్పుడు సమాజంలో తల్లిదండ్రులు మొదలుకొని కులం, మతం, ఆర్థిక స్థోమత వంటి అడ్డంకులెన్నో వుండగా... ఇవి చాలవన్నట్టు రాజ్యం కూడా ఆ పాత్ర పోషించడానికి ఉవ్విళ్లూరుతున్న తరుణంలో అలహాబాద్ హైకోర్టు మంగళవారం ఎన్నదగిన తీర్పునిచ్చింది. యుక్తవయసొచ్చినవారికి తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వుంటుందని, అందుకు అడ్డుపడటం జీవించే హక్కుకు పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. చిత్రమేమంటే... ఈ తీర్పు వెలువడిన కాసేపటికే ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ‘పెళ్లి కోసం మతం మారడాన్ని’ నిరోధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌లో ఎక్కడా ‘లవ్‌జిహాద్’ ప్రస్తావన లేకపోయినా, దీని ప్రధాన ఉద్దేశం మతాంతర వివాహాలను అడ్డుకోవడమే. ఉత్తరప్రదేశ్ మాదిరే తాము కూడా చట్టాలు తీసుకొస్తామని హరియాణా, మధ్యప్రదేశ్‌లలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రకటించాయి. పెళ్లికి ముందు మతం మార దల్చుకున్నవారు రెండు నెలలముందు జిల్లా మేజిస్ట్రేట్‌కు వర్తమానం ఇవ్వాలని, అనుమతివచ్చాకే మతం మారాలని ఆర్డినెన్స్ ముసాయిదా చెబుతోంది. పెళ్లయినవారికి ఇది వర్తించదు. పెళ్లి ముసుగులో హిందూ యువతులను ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని కొన్నేళ్లుగా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దానికి ‘లవ్ జిహాద్’ అన్న పేరు కూడా పెట్టాయి. మూడేళ్లక్రితం కేరళకు చెందిన వైద్య విద్యార్థిని హదియా కేసు సమయంలో ఈ లవ్ జిహాద్ బాగా ప్రచా రంలోకొచ్చింది. హదియా తల్లిదండ్రులు కేరళ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హదియా, ఆమె ప్రియుడు పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం కలిగించింది. ఆ పెళ్లి చెల్లదని కేరళ హైకోర్టు ప్రకటించింది. దానిపై అప్పీల్కెళ్లినప్పుడు సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పు చెల్లదని ప్రకటించడమేకాక, అసలు ‘లవ్ జిహాద్’ ఉందో లేదో తేల్చాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు ఆదేశాలిచ్చింది. దాని ఆచూకీ ఏం దొరకలేదని ఆ సంస్థ మరికొన్నాళ్లకు తేల్చి చెప్పింది. మన దేశంలో పెద్దలు కుదిర్చి చేసే పెళ్లిళ్లే అధికం. సంఖ్యాపరంగా తక్కువే అయినా...వాటికి సమాంతరంగా ప్రేమ వివాహాలూ వుంటున్నాయి. ఈ వివాహాల్లో అత్యధికం కులాంతరమైనవి గనుక ఆ ప్రేమికులకు కష్టాలు తప్పడం లేదు. మతాంతర వివాహాలైతే చెప్పనవసరం లేదు. ఈ మాదిరి వివాహాలను గుర్తించేందుకు 1954లోనే ప్రత్యేక వివాహ చట్టం వచ్చినా వాటికి ఆటంకాలు తప్పడం లేదు. ‘లవ్ జిహాద్’ సృష్టికర్తలెవరోగానీ రెండు పొసగని విషయాలతో పదబంధం కూర్చారు. అరబిక్ పదమైన జిహాద్‌కు ఖురాన్లో ఉన్నతాశయం కోసం చేసే పోరాటమన్న అర్థం వుంది. అది తనపై తాను చేసుకునే పోరాటం కూడా కావొచ్చు. ఆ జిహాద్ పదానికి ప్రేమతో ముడిపెట్టి దాన్ని నేరపూరిత చర్యగా అందరూ భావించేలా చేయడం లవ్‌జిహాద్ సృష్టికర్త ఆంతర్యం. ఒక యువతికి మాయమాటలు చెప్పి, ఆమెను మభ్యపెట్టి, ఆమె ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకుంటే అది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 366 కింద నేరం అవుతుంది. అందుకు పదేళ్ల శిక్ష పడుతుంది. కానీ యుక్తవయసు వచ్చినవారు ప్రేమించుకుంటే, వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారైనంతమాత్రాన దాన్ని ‘లవ్ జిహాద్’గా ఎలా పరిగణిస్తారు? ‘గజం మిథ్య... పలాయనం మిథ్య’ అన్నట్టు ఈ లవ్ జిహాద్‌ను నిరూపించే కేసు దేశంలో ఒక్కటీ లేదు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పునకు మూలకారణమైన ఉదంతంలో యువతి ప్రియాంక ఖర్వార్ తండ్రి ఆమె పెళ్లాడిన సలామత్ అన్సారీపై చిన్నపిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి వర్తింపజేసే అత్యంత కఠినమైన పోక్సో చట్టంకింద, మరికొన్ని సెక్షన్లకింద కేసులు పెట్టాడు. ఈ పెళ్లి దురుద్దేశపూరితమైనదని, మోసపూరితమైనదని ఆయన అభియోగం. వీటిని కొట్టేయాలన్న జంట వినతిని హైకోర్టు అంగీ కరించింది. తాము ఎవరితో కలిసివుండాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛ యువజంటకు వుంటుందని తేల్చిచెప్పింది. ఈ వ్యక్తిగత సంబంధంలో జోక్యం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో 2014లోనూ, మొన్న సెప్టెంబర్‌లోనూ ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పులు సరైనవి కాదని ధర్మాసనం చెప్పడం ఇక్కడ గమనార్హం. ప్రియాంక, సలామత్‌లను తాము హిందూ, ముస్లిం మతాలకు చెందిన వారిగా చూడటం లేదని... ఎదిగిన ఇద్దరు వ్యక్తులుగా, స్వేచ్ఛాయుతంగా నిర్ణయం తీసుకున్నవారిగా పరిగణిస్తున్నామని చెప్పింది. హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్‌లలో ఖాప్ పంచాయతీలు అనాగరిక తీర్పులకు పెట్టింది పేరు. ఆడపిల్లల వస్త్రధారణ మొదలుకొని కులాంతరవివాహాలవరకూ అవి తీర్పులిస్తుంటాయి. అడపా దడపా మరణశిక్షలు విధించిన చరిత్రకూడా వాటికుంది. ఆ పంచాయతీలను ప్రభుత్వాలు చూసీచూడనట్టు వదిలేయడం సరికాదని, వాటి అదుపునకు చట్టం తీసుకురావాలని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు చెప్పింది. ఆ చట్టం రాలేదు సరికదా... ఇప్పుడు మతాంతర వివాహాల నియంత్రణకు ఏకంగా రాజ్యమే ఖాప్ పంచాయతీ అవతారమెత్తింది. చట్టాలు సమాజశ్రేయస్సుకూ, దాని పురోగతికి తోడ్పడాలి తప్ప రాజ్యాంగబద్ధంగా తమకు నచ్చిన జీవితాన్ని ఎంపిక చేసుకునేవారిని నేరస్తులుగా పరిగణించకూడదు. తమ ఇష్టానికి భిన్నంగా పెళ్లి చేసుకున్న సంతానంపై తల్లిదండ్రులు అలకబూనటాన్ని, కోపగించటాన్ని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ స్వయంగా రాజ్యమే అందులోకి జొరబడి, ఆ పిల్లల ఇష్టాయిష్టాలను నియంత్రించాలనుకోవడం, వాటిని నేరపూరితం చేయడం సామాజికంగా తిరోగమనం తప్ప మరేమీ కాదు. పౌరుల్లో రాజ్యాంగ నైతికతను పెంచాల్సిన ప్రభుత్వమే అందుకు భిన్నంగా ప్రవర్తించడం అంతర్జాతీయంగా మన ప్రతిష్టను పెంచదు. -
లవ్ జిహాద్ : కోర్టు సంచలన తీర్పు
లక్నో : వివాదాస్పద లవ్ జిహాద్ అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందు వర్గానికి చెందిన యువతి, ముస్లిం మతానికి చెందిన యువకుడి చేసుకున్న వివాహం చట్టబద్ధమైనదిగా పేర్కొంది. దేశ పౌరులకు రాజ్యాంగ కల్పించిన ప్రాథమిక హక్కులకు లోబడే వారిద్దరూ వివాహం చేసుకున్నారని స్పష్టం చేసింది. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి బలవంతపు మతమార్పిడి ద్వారా వివాహం చేసుకున్నారని యువతి కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. పూర్తి వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక కర్వార్ (హిందు), సలామత్ అన్సారీ (ముస్లిం) గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకుడి అభ్యర్థన మేరకు పెళ్లికి ముందు ప్రియాంక మత మార్పిడి చేసుకున్నారు. తన పేరును ఆలియాగా మార్చుకున్నారు. అయితే వీరిద్దరి వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యువతి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేయించి, ముస్లిం మతంలోకి మార్చి వివాహం చేసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మైనరైన తమ కుమార్తెను మోసగించి చేసుకున్న వివాహాన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా వరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీనిపై సుమారు ఏడాది పాటు విచారణ జరిపిన వివేక్ అగర్వాల్, పంకజ్ నఖ్వీల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం నాడు తుది తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘యువతీ, యువకులను తాము మత ప్రతిపాదకన చూడటంలేదు. ప్రియాంక హిందు, అన్సారీ ముస్లిం అయినప్పటికీ వారి వివాహాన్ని మత కోణంలో విభజించలేం. కులం, మతం, వర్గంతో సంబంధంలేకుండా ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే హక్కు పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించింది. యువతి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నా అని చెబుతోంది. దీనిలో ఎలాంటి బలవంతం లేదని కోర్టు విశ్వసిస్తోంది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. వివాహం సమయంలో యువతి వయసు 20 ఏళ్లు. తన విచక్షణ మేరకే మతమార్పిడి చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. వీరి వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది’ అంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. యువతి తల్లీదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఏడాది కాలంగా దంపతులిద్దరూ సుఖ,సంతోషాలతో గడుపుతున్నారని వారి జీవితంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. కాగా లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు చర్యలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. హిందు యువతులను ముస్లిం వ్యక్తులను వివాహం చేసుకోవడాన్ని నేరంగా పరిగణించే చట్టానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పలువురు సీఎంలు ప్రకటించారు. మధ్యప్రదేశ్, అస్సోం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు ఈ మేరకు చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలోనే అలహాబాద్ హైకోర్టు తీర్పు రావడం గమనార్హం. -
‘గోవధ నిషేధంపై త్వరలోనే బిల్లు’
బెంగళూరు: రాష్ష్ర్టంలో గోవధ నిషేధం త్వరలోనే వాస్తవరూపం దాల్చబోతోందని కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గోవధను నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. ఇక ‘లవ్ జిహాద్’పై చర్చ నేపథ్యంలో పెళ్లి పేరుతో మతం మారేందుకు కుదరదని ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కర్ణాటకలో అమలు చేస్తామని సీటీ రవి తెలిపారు. తమ సోదరీమణులను ‘లవ్ జీహాద్’ పేరుతో మతం మార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.(చదవండి: లవ్ జిహాద్‌ను అంతం చేస్తాం: యడియూరప్ప) కాగా, తమ మతాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ గత జూలైలో పెళ్లి చేసుకున్న ఓ జంట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అమ్మాయి తన ఇష్టంతోనే మతం మారినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. తమ విషయంలో జోక్యం చసుకోవద్దని అమ్మాయి తండ్రితో పాటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని ఆ జంట కోర్టును కోరింది. అయితే వివాహం పేరుతో మతం మారడం కుదరదని పేర్కొంటూ కోర్టు వారి పిటిషన్ కొట్టివేసింది. Cow Slaughter Ban will be a reality in Karnataka in the near future. In have asked Animal Husbandry Minister Sri @PrabhuChavanBJP to get "The Karnataka Prevention of Slaughter & Preservation of Cattle Bill" passed in the Cabinet and present the same in upcoming Assembly Session. — C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) November 20, 2020 -
వివాహేతర సంబంధం: డీఎన్ఏ పరీక్ష ఉత్తమం
అలహాబాద్ : పిల్లల పితృత్వాన్ని నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించటం ఒక్కటే న్యాయబద్ధమైన, శాస్త్రీయమైన మార్గమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించటానికి భర్తకు.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి వివాహేతర సంబంధం కలిగిలేనని, భర్త ఆరోపణలు అబద్ధమని తేల్చడానికి భార్యకు డీఎన్ఏ పరీక్ష ఉత్తమమైనదని పేర్కొంది. నీలం అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వివేక్ అగర్వాల్ మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చని గతంలో అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పిన సంగతి తేలిసిందే. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని పేర్కొంది. వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న ఘటనలో న్యాయస్థానం ఈ సంచలన తీర్పునిచ్చింది. -
లవ్ జిహాద్ : విస్తరిస్తున్న కొత్త వివాదం
దేశంలో గతకొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కొత్త చర్చకు దారితీసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంతమంది భిన్న మతాల యువతీ యువకులు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. మరోవైపు దేశంలో వేగంగా విస్తరిస్తున్న లవ్ జిహాద్‌పై బీజేపీ పాలిత ప్రభుత్వాలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి. మతాంతర వివాహాలను విరుద్ధంగా చట్టల రూపకల్పనకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేవలం వివాహం కోసమే మతాల మారటం సమంజసం కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సాక్షి, న్యూఢిల్లీ : మూడేళ్ల క్రితం కేరళ వేదికగా వెలుగుచూసిన లవ్ జిహాద్ నేడు దేశంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. 25 ఏళ్ల ఓ హిందూ యువతి ముస్లింగా మతమార్పిడి చేసుకుని హిందూ యువకుడిని వివాహం చేసుకోగా.. అది చెల్లదంటూ కేరళ హైకోర్టు 2018లో వివాదాస్పద తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈ జంటకు ఉపశమనం అభించింది. కేరళ హైకోర్టును ఇచ్చిన తీర్పును కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం.. హదియా తన భర్తతో కలిసి స్వేచ్ఛగా జీవించవచ్చని సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చజరిగింది. అప్పటి నుంచి దేశంలో ఏదో ఓ మూలన లవ్ జిహాద్ నినాదం వినపడుడూనే ఉంది. తన ఇష్టపూర్తిగానే మత మార్పిడి చేసుకుని ఇతర మతస్థుడిని వివాహం చేసుకున్నా అంటూ యువతి చెబుతున్నా.. తమ కుమార్తెను బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఛండీగఢ్ సమీపంలోని ఫరీదాబాద్‌లో ముస్లిం యువకుడి చేతిలో దారుణంగా హత్యకు గురైన నికితా తోమర్ ఉదంతం మరోసారి లవ్ జిహాద్‌పై చర్చకు దారితీసింది. తమ కుమార్తె మతమార్పిడికి ఒప్పుకోకపోవడంతోనే ప్రేమోన్మాది తన బిడ్డను బలితీసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. (ఉరి తీయండి లేదా ఎన్కౌంటర్ చేయండి) హిందు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనే దుర్భుద్ది మరోవైపు హిందు యువతులకు వలవేసి ముస్లిం యువకులు మోసపూరిత వివాహాలు చేసుకుంటున్నారని పలువురు హిందు సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందు యువతులను మోసం చేసి వివాహం చేసుకుంటున్న ముస్లిం యువకులపై కఠిన చర్యలకు తీసుకోవాలని గత అక్టోబర్‌లో బీజేపీపాలిత అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా వాడకం విచ్చలవిడిగా పెరిగినే నేపథ్యంలో చాలామంది అమాయక బాలికలు మోసపోతున్నారని, హిందు అమ్మాయిలను వివాహం చేసుకోవాలనే దుర్భుద్దితో కొంతమంది ముస్లిం యువకులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర మంత్రి హేమంత్ బిశ్వా ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దలకు ఇష్టం లేకున్నా దొంగచాటుగా వివాహం చేసుకుంటున్నారని, ఇలా ఎంతో మంది యువతులు ముస్లింల చేతిలో మోసపోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా మోసపూరితమైన మతాంతర వివాహాలపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. లవ్ జిహాద్‌కు చెక్ : యోగీ ఇకపై లవ్ జిహాద్ పేరుతో వివాహం చేసుకుంటే ఏమాత్రం ఉపక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సైతం మతాంతర వివాహాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లవ్ జిహార్‌పై కఠినమైన చట్టం తీసుకురావలని అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రామ్నామ్ సత్య యాత్ర ప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. అలాంటి వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ఇలాంటి తరుణంలో వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం సంచలనంగా మారింది. ఇతర మతాలపై ఎలాంటి అవగహాన లేకుండా కేవలం వివాహం కోసమే మతమార్పిడి చేసుకోవడం సమంజసం కాదని న్యాయస్థానం స్పష్టం చెప్పింది. ఈ తీర్పు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీసింది. లవ్ జిహాద్‌పై దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి చట్టం లేకపోవడంతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నారు. ఈ తరుణంలోనే అలహాబాద్ హైకోర్టు తీర్పుపై పలు విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. యువతీ, యువకులు అభిప్రాయలకు విరుద్ధంగా తీర్పు ఉందని పలువురు ప్రజాస్వామికవాదలు పెదవి విరుస్తున్నారు. మనుషులు ఇష్టాయిష్టాలపై చట్టం చేసే హక్కు ఎవరికీ లేదని వాదిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అయితే మత మార్పడి అనేది ఇతరుల అభిప్రాయాలను అవమానపరిచే విధంగా ఉండకూడదు అనేది రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఇక ఈ లవ్ జిహాద్ అనే వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి. -
నచ్చిన వారితో ఉండొచ్చు; సంచలన తీర్పు
అలహాబాద్: యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని పేర్కొంది. వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న ఘటనలో న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్పూర్కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆచూకీ కనిపెట్టిన పూజా కుటుంబ సభ్యులు వారిద్దరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. తెలిసినవారి ద్వారా బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేజర్లమైన తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు జడ్జి విచారణ చేపట్టారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు యువతిని కోర్టులో హాజరుపర్చారు. భర్తతోనే కలిసి ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తీర్పు వెలువరించారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం.. భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చు. చదవండి: ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?! -
ఉరి తీయండి లేదా ఎన్కౌంటర్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని సమీపంలోని ఫరిదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న యువతి నికితా తోమర్ (21) హత్య ఉదంతంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బలవంతపు మత మార్పిడికి ఒప్పుకోకపోవడంతోనే ప్రేమోన్మాది తౌసీఫ్ తమ బిడ్డను బలితీసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గత మూడు రోజులుగా ఇంటి ఆరు బయట కూర్చోని నిరసన తెలుపుతున్నారు. లవ్ జిహాద్ పేరుతో నికితా తోమర్‌ను అతి కిరాతకంగా హతమార్చిన తౌసీఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి మహిళా సంఘాలతో పాటు, విద్యార్థి సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. ‘వెంటనే ఆ దుర్మార్గుణ్ని కాల్చి చంపండి.. లవ్ జిహాద్ ముర్దాబాద్’ అనే నినాదాలు ఆ ప్రాంతంలో మిన్నంటుతున్నాయి. కాగా గత నెల 26న ఫరిదాబాద్‌లో బల్లాగఢ్‌లో పరీక్ష రాసి వస్తుండగా నికితా తోమర్‌ని రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తౌసీఫ్ నేరాన్ని అంగీకరించాడు. నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు. ఆమెపై కాల్పులు జరిపుతున్న దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. అయితే ఇస్లాం మతంలోకి మారమని తౌసీఫ్ తమ కుమార్తెపై ఒత్తిడి తెచ్చాడని, నిరాకరించడంతోనే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో నిందితుడిపై ఫిర్యాదు కూడా చేశామని బాధితురాలి తండ్రి కన్నీంటి పర్యంతమవుతున్నారు. (పెళ్లి కోసమే మతం మారడం సరికాదు) అయితే గతంలో కేరళ యువతి వివాహం కేసులో హైకోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చిన లవ్ జిహాద్.. తాజాగా నికిత హత్యతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో పెళ్లి కోసం కొంతమంది యువతీ, యువకులు మతం మారడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇదే పెను వివాదానికి దారితీస్తోంది. తమ కుమార్తెకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొత్త చర్చకు దారితీస్తోంది. వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని న్యాయస్థానం సంచనల తీర్పును వెలువరించింది. ముస్లిం అయిన యువతి పెళ్లికి నెల రోజుల ముందు మాత్రమే హిందూ మతం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి కోసమే ఈ మతమార్పిడి జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యానించారు. ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా.. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మతం మారడం సరైనది కాదంటూ 2014లో ఇచ్చిన తీర్పును ఉటంకించారు. అయితే జాతీయ స్థాయిలో లవ్ జిహాద్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చట్టాలు లేకపోవడం గమనార్హం. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం.. దేశ పౌరులు ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని అనుసరించొచ్చు, ఆ మత విధానాలను పాటించవచ్చు. -
ఆడ పిల్లల జీవితాలతో ఆటలు మానండి
లక్నో: కేవలం పెళ్లి కోసమే మతం మారడం సరికాదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. లవ్ జిహాద్ విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని శనివారం చెప్పారు. ఆడబిడ్డల, అక్కాచెల్లెమ్మల గౌరవ మర్యాదలతో కొందరు ఆటలాడుకుంటున్నారని, వారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రామ్నామ్ సత్య యాత్ర ప్రారంభిస్తామని గట్టిగా హెచ్చరించారు. అలాంటి వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. లవ్ జిహాద్‌కు చెక్ పెట్టడంపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మల్హానీ అసెంబ్లీ స్థానానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. శనివారం ఎన్నికల ప్రచారంలో యోగి మాట్లాడారు. లవ్ జిహాద్లో భాగస్వాములైన వారి పోస్టర్లను రోడ్ల పక్కన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. (అస్సాం, మిజోరాంల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు) -
పెళ్లి కోసమే మతం మారడం సరికాదు
అలహాబాద్ : వివాహం కోసమే మతం మారాలనుకోవడం ఆమోదనీయం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. మతాంతర వివాహం చేసుకున్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముస్లిం అయిన యువతి పెళ్లికి నెల రోజుల ముందు మాత్రమే హిందూ మతం తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి కోసమే ఈ మతమార్పిడి జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యానించారు. వివాహ కోసమే మతం మారడం ఆమోదనీయం కాదంటూ మరో కేసులో, 2014లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఉటంకించారు. ఇస్లాం మతానికి మారి ముస్లింను పెళ్లి చేసుకున్న హిందూ యువతికి సంబంధించిన కేసులో 2014లో అలహాబాద్ హైకోర్టు.. ‘ఇస్లాం విశ్వాసాలు, సంప్రదాయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా.. ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే మతం మారడం సరైనది కాదు’ అని పేర్కొంది. -
అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే
లక్నో: హాథ్రస్ సామూహిక అత్యాచార బాధిత యువతి భౌతిక కాయాన్ని అర్థరాత్రి దహనంచేయడం మానవహక్కుల ఉల్లంఘన అని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. హాథ్రస్ లాంటి ఘటనల్లో శవ దహనానికి మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంప్రదాయాలను పాటించకుండా, అర్థరాత్రి శవాన్ని దహనం చేయడం బాధిత మహిళ మానవ హక్కులను, వారి కుటుంబ సభ్యులు, బంధువుల మానవ హక్కులను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. హాథ్రస్‌కు సీబీఐ బృందం హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను మంగళవారం సీబీఐ ప్రశ్నించింది. నేరం జరిగిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. మంగళవారం ఉదయం హాథ్రస్ చేరుకున్న సీబీఐ బృందం మొదట బాధితురాలి సోదరుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత, వారి కుటుంబం నుంచి పూర్తి వివరాలను సేకరించారు. సంఘటన పూర్వాపరాలపై వారిని లోతుగా ప్రశ్నించారు. మరోవైపు, హాథ్రస్ కేసు విచారణకు సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో మరో నలుగురు అధికారులు కొత్తగా చేరారు. సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబ్ నుంచి కూడా నిపుణులు ఈ బృందంలో చేరారు. -
కోర్టులో హాజరైన హాథ్రస్ బాధిత కుటుంబీకులు
లక్నో: యూపీలోని హాథ్రస్లో నలుగురు యువకుల చేతిలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన దళిత యువతి కుటుంబ సభ్యులు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ ఎదుట హాజరయ్యారు. కేసును కోర్టు విచారించి తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. బాధితురాలి తల్లి, తండ్రి, ఆమె ముగ్గురు సోదరులు కోర్టుకొచ్చారు. బాధిత యువతి శవాన్ని దహనం చేయడంలో, పై అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవని, శాంతి భద్రతలను పరిగణనలోనికి తీసుకొని, రాత్రే దహనసంస్కారాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కోర్టుకి తెలిపారు. కేసు విచారణ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలంటూ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 14న అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీ ఆసుపత్రిలో మరణించింది. ఆ తరువాత హడావిడిగా యువతి భౌతిక కాయాన్ని దహనం చేశారంటూ జిల్లా అధికార యంత్రాంగం ఆరోపణలెదుర్కొంటోంది. -
హాథ్రస్ ఘటనసై ఆలహాబాద్ హైకోర్టు విచారణ
లక్నో: హాథ్రస్ ఘటన కేసుపై అలహాబాద్ లక్నో బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. బాధిత మృతురాలికి గుట్టుచప్పుడుగా అర్థరాత్రి అంత్యక్రియలు జరిపించిన ఉత్తర ప్రదేశ్ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసింది. తమ బంధించి బలవంతంగా పోలీసులు అంత్యక్రియలు జరిపించారని బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేసిన హైకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 2వ తేదికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. చదవండి: నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం -
నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం
లక్నో/హాథ్రస్: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో కామాంధుల రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి కుటుంబ స భ్యులు సోమవారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు హాజరు కానున్నారు. పటిష్టమైన భద్రత మధ్య వారిని న్యాయస్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువతిపై అత్యాచారం, హత్య కేసు లో బాధిత కుటుంబ సభ్యుల వాదనను కోర్టు నమోదు చేయనుంది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రంజన్ రాయ్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సోమవారం విచారించనుంది. ధర్మాసనం ముందు హాజరు కావాలని యూపీ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం), డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వీకే సాహిని హాజరుకానున్నారు. రంగంలోకి దిగిన సీబీఐ.. హాథ్రస్ ఘటనను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఆదివారం ఉదయం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సామూహిక అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. సీబీఐ ఘజియాబాద్‌కు చెందిన ప్రత్యేక టీమ్ ఈ కేసును విచారిస్తుందని అధికారులు తెలిపారు. -
హత్రాస్ ఘటనలో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై అత్యాచారం, ఆపై అర్థరాత్రి అంతిమ సంస్కారాలు నిర్వహించడంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో బాధితురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యుల హక్కులు పోలీసులు, స్థానిక అధికారులు హరించినట్లు తమ దృష్టికి వచ్చిందని న్యాయస్థానం పేర్కొంది. ప్రజాగ్రహం ఉదృతమవుతున్న నేపథ్యంలో ఘటనపై వారికున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. హత్రాస్ అత్యాచార ఘటన, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను సుమోటో కేసుగా స్వీకరిస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు సీనియర్లు న్యాయమూర్తులు జస్టిస్ రాజన్‌రాయ్, జస్ప్రిత్ సింగ్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. (అత్యాచారం జరగలేదు) దీనిలో భాగంగానే ఈ నెల 12లోపు తమముందు హాజరుకావాలని స్థానిక పోలీసు అధికారులతో పాటు బాలిక అంత్యక్రియలు నిర్వహించిన ప్రతిఒక్కరికీ గురువారం రాత్రి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న ఉన్నాతాధికారులకు కూడా నోటీసులు పంపింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘19 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య. ఆపై యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా అర్థరాత్రి సమయంలో పోలీసులే అంతిమ సంస్కారాలు నిర్వహించడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ సమయంలో బాలికతోపాటు కుటుంబ సభ్యులకున్న ప్రాథమిక హక్కులను హరించినట్లు మా దృష్టికి వచ్చాయి. ఈ ఘటనలో గుర్తుతెలియని బలమైన వ్యక్తుల ప్రయేయం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజనిజాలను వెల్లడిస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది. (హత్రస్ నిరసనలు: అది ఫేక్ ఫోటో!) అంతేకాకుండా మృతులకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారం వారి హక్కు అని పేర్కొన్న న్యాయస్థానం.. పర్మానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రాంజీ సింగ్ ముజీబ్ భాయి వర్సెస్ యూపీ ప్రభుత్వం, ప్రదీప్ గాంధీ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులను ప్రస్తావించింది. ఈ హక్కులు ఉల్లంఘన జరిగినట్లు తమ విచారణలో తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని యూపీ పోలీసులు ప్రకటించడంతో వివాదం మరింత చెలరేగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలో కూడా అదే విషయం స్పష్టమైందని గురువారం యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మెడపై అయిన తీవ్రస్థాయి గాయం కారణంగా ఆమె చనిపోయిందన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని, అత్యాచారం కానీ, గ్యాంగ్ రేప్ కానీ జరగలేదని అందులో స్పష్టంగా ఉందని వెల్లడించారు. ఆయన ప్రకటనపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేసు నుంచి దోషులను తప్పించడానికి యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే, నలుగురు నిందితులు సందీప్, రాము, లవ్‌కుశ్, రవి తనను గ్యాంగ్ రేప్ చేశారని బాధిత యువతి వాంగ్మూలం ఇచ్చినట్లు గతంలో ఎస్పీ విక్రాంత్ వీర్ వెల్లడించడం గమనార్హం. వారంకూడా గడవకముందే రిపోర్టును మార్చడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తన స్టేట్మెంట్ను మార్చుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లి, తనతో పాటు తన కుటుంబ సభ్యులతో కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. -
సోషల్ మీడియా ఓ గన్నులాంటిది: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి తన చేతిలో తుపాకీని వాడినట్టుగానే సోషల్ మీడియాను వాడవచ్చునని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రిమినల్ కేసులు, బెయిల్ వంటి అంశాల్లో సోషల్ మీడియా ద్వారా చేసే పోస్టులపై మార్గదర్శకాలుండాలంది. కరోనా కట్టడి, లాక్డౌన్ వంటి అంశాల్లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలను లక్ష్యంగా చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆరోపణలపై కాంగ్రెస్ నేత సచిన్ చౌధరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు సచిన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఏడాదిన్నర పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని షరతు విధించింది. దీంతో సచిన్ సుప్రీంను ఆశ్రయించారు. శుక్రవారం దీని విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బాబ్డే సోషల్ మీడియాకి సచిన్ దూరంగా ఉండాలన్న హైకోర్టు ఆదేశాలను సమర్థించారు. ఏదైనా కేసులో నిందితుడు తుపాకీకి దూరంగా ఉండాలని ఆదేశం ఇవ్వడం ఎలాంటిదో, సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉండమని చెప్పడం అలాంటిదేనన్నారు. -
సీఏఏ అల్లర్లు: యోగికి షాకిచ్చిన హైకోర్టు
లక్నో : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో పాటు ఎన్ఆర్సీ చట్టాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో పదిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఉక్కుపాదం మోపారు. అల్లర్ల కారణంగా ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులన.. ఆందోళకారుల నుంచే వాసూలు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని బిజ్నోర్ జిల్లా న్యాయస్థానం సమర్థించడంతో పాటు వెంటనే నగదు చెల్లించాలని ఆరుగురు ఆందోళనకారులకు నోటీసులు జారీచేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఉద్యమకారులు.. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వారి పిటిషన్ల్పై విచారణ జరిపిన న్యాయస్థానం స్థానిక కోర్టు ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని హైకోర్టు తెలిపింది. దీంతో సీఎం యోగి నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. -
నా భర్తను చంపేస్తారేమో?!
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరిగిన నిరసనల్లో విద్వేషపూరిత ప్రసంగం చేశారన్న ఆరోపణలపై గత జనవరిలో అదుపులోకి తీసుకున్న పిల్లల వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్ భార్య షబీస్టా ఖాన్ కోర్టును ఆశ్రయించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జైలులో ఉన్న భర్తను కలిసిన అనంతరం ఆయన భద్రతపై ఆమె అనేక సందేహాలు వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని వుందని ఆందోళన వ్యక్తం చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. తన భర్త జైలుల్లోపల మానసిక వేధింపులకు గురవుతున్నారని, ఆయన ప్రాణానికి ప్రమాదం పొంచివుందని పేర్కొన్నారు. జైలుకు తీసుకువచ్చిన ఐదు రోజుల పాటు ఆహారం కూడా ఇవ్వకుండా చాలా అమానవీయంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అంతేకాదు జైలు లోపలే తన భర్తను హత్య చేసే ప్రమాదం వుందని, తన భర్తకు భద్రత కల్పించాని విజ్ఞప్తి చేస్తూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాగే యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ హోమ్, యూపీ డీజీ( జైలు)కు కూడా తన లేఖను అందించారు. కాగా 2017లో ప్రభుత్వ ఆస్పత్రిలో 60మంది చిన్నారులు ఆక్సిజన్ కొరతతో మృతిచెందిన ఘటనలో అరెస్టయి నిర్దోషిగా బయటపడ్డ డాక్టర్ కఫీల్ ఖాన్‌ను గతేడాది (డిసెంబర్ 12న) అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) లో సీఏఏ పై రెచ్చగొట్టేలా ప్రసంగించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రజా భద్రత చట్టం(ఎన్ఎస్ఏ) ప్రయోగించిన అనంతరం మధుర జైలుకు తరలించారు. గత వారం, ఖాన్ మామ నుస్రుల్లా అహ్మద్ వార్సీని రాజ్‌ఘాట్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులుకాల్చి చంపారు. 2018 లో ఖాన్ సోదరుడిపై హత్యా యత్నం జరిగింది. కాని అతను ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. -
సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సహించేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఓ ప్రైవేట్ మెడికల్ కళా శాల పట్ల ఉదారంగా వ్యవహరించిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతించారు. శుక్లా తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా సూచన మేరకు ప్రాథమిక విచారణ జరిపామని, అవినీతిపై ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. శుక్లాపై ఉన్న అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్న కమిటీ నివేదిక ఆధారంగా గొగోయ్ విచారణకు అనుమతించారు. దర్యాప్తు జరిపేందుకు వీలుగా అనుమతి కోరుతూ ప్రాథమిక విచారణపై ఒక సంక్షిప్త నివేదికను కూడా సీబీఐ అందజేసింది.‘శుక్లా అవినీతి దర్యాప్తు అంశంపై మీ లేఖలో జోడించిన గమనికను పరిగణించడం జరిగింది. విచారణకు అనుమతి మంజూరు చేస్తున్నాం’అని గొగోయ్ చెప్పారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల తరువాత జస్టిస్ శుక్లా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటిదాకా శుక్లాను న్యాయవ్యవస్థకు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. -
అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించండి
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చే విషయంలో ముడుపులు అందుకున్నారని జస్టిస్ శుక్లాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ పీకే జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్లాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. ‘శుక్లా మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ విచారణలో తేలింది. దీనిని తీవ్రంగా పరిగణించిన కమిటీ ఆయన్ను విధుల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. హైకోర్టులో ఆయన న్యాయపరమైన విధులు నిర్వర్తించేందుకు వీలు లేదు. దీంతో శుక్లాను విధుల నుంచి తొలగించండి’అని గొగోయ్ ప్రధానిని కోరారు. -
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ శ్రీదేవి
సాక్షి, హైదరాబాద్: అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న తెలుగు మహిళ జస్టిస్ గండికోట శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు గతవారం కొలీజియం తీర్మానం చేసింది. ఈ సిఫార్సు కార్యరూపం దాలిస్తే తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమె ఖ్యాతి గడిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2016లో జిల్లా, సెషన్స్ జడ్జిగా పదో న్నతి పొందారు. అలాగే వివిధ హోదాల్లో పనిచేశారు. ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆమె అలహాబాద్ హైకోర్టు సీజే ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం, ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించి ఆ మేర కేంద్రానికి సిఫార్సు చేసింది. -
హీరోయిన్ అరెస్ట్‌పై హైకోర్టు స్టే..!
లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. మొరాబాద్‌కు చెందిన ఓ ఆర్గనైజర్ గత నెలలో సోనాక్షిపై క్రిమినల్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి వేధింపులకు, ఇబ్బందులకు గురిచేయ్యవద్దనే ఉద్దేశంతోనే స్టే విధిస్తున్నామని అలహాబాద్ హైకోర్టు వివరించింది. నవంబర్ 24న సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెప్టెంబర్ 30న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనాక్షి రూ. 37 లక్షలు తీసుకున్నారని, చివరి నిమిషంలో ఈవెంట్రి ఆమె హాజరుకాలేదని ఆరోపిస్తూ ప్రమోద్ శర్మ అనే ఆర్గనైజర్ ఫిర్యాదు చేశారు. ఆమె రాకపోవడంతో తనకు భారీఎత్తున నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసుని విచారించిన న్యాయముర్తి ఆమె అరెస్ట్‌పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో సోనాక్షి సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
యూపీలో 12,460 నియామకాల రద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన రెండు భారీ రిక్రూట్మెంట్లపై అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది. మొదటి దశలో 12,460 మందిని ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, వారందరి ఉద్యోగాలనూ కోర్టు పూర్తిగా రద్దు చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన 2016 డిసెంబర్లో వెలువడగా, నియామక ప్రక్రియను ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు తాజాగా ఆదేశించింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తయిందే కానీ ఇంకా ఎవరినీ ఉద్యోగాల్లో నియమించలేదు. ఇక రెండో ప్రక్రియలో 68,500 ఉద్యోగాలకు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం లంచాలు తీసుకుని, నిబంధనలు పాటించకుండా తమకు ఇష్టమైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తోందంటూ పలువురు ఉద్యోగార్థులు కోర్టును ఆశ్రయించడంతో అలహాబాద్ హైకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. రెండో నియామక ప్రక్రియలో అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా మార్చేశారనే ఆరోపణలున్నాయి. -
జోహ్రిపై విచారణకు కమిటీ
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సీఓఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి రాకేశ్ శర్మ, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ శర్మ, ఢిల్లీ మహిళా హక్కుల సంఘం మాజీ చైర్పర్సన్ బర్ఖాసింగ్ ఇందులో ఉన్నారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. -
పవర్ కంపెనీలకు భారీ షాక్
అలహాబాద్ హైకోర్టు పవర్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఎన్‌పీఐలపై ఆర్బీఐ చర్యలపై మధ్యంతర ఊరటనిచ్చేందుకు సోమవారం నిరాకరించింది. ఈ తీర్పుతో దాదాపు 60కిపైగా దిగ్గజ కంపెనీలను భారీగా ప్రభావితం చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌ను సమర్ధించిన కోర్టు ప్రధానంగా విద్యుత్ సంస్థలకు ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. ఆర్బీఐ మంజూరు చేసిన 180 గ్రేస్ పీరియడ్(ఆరునెలలు) నేటితో ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. భారీగా రుణ పడిన సంస్థలు చెల్లింపులను ఆలస్యం చేస్తే వెంటనే చర్యల్నిప్రారంభించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకసర్క్యులర్ జారీ చేసింది. రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ సర్క్యులర్ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. దీనిపై కొన్ని విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో దివాలా పిటిషన్లపై సుప్రీంకోర్టులో రేపు (మంగళవారం) వాదనలు జరగనున్నాయి. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ హ్యారీ డౌల్ చెప్పారు. ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు ఐబీసీ క్రింద చర్యల్ని ప్రారంభిస్తాయనీ, అలాగే కంపెనీలు స్వతంత్రంగా పై కోర్టుకు అప్పీల్ చేయవచ్చని ఆయన చెప్పారు. నిరర్దక ఆస్తుల వ్యవహారంలో ఆర్బీఐ సర్క్యులర్‌ను అనుసరించాల్సి ఉంటుందని యుకో బ్యాంకు వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులు ఇపుడు దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు.. విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు దాదాపు 1.74 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. -
హైకోర్టు జడ్జీలుగా నియమించలేం
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న ఇద్దరికి అదే హైకోర్టులో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం రెండోసారి కూడా వెనక్కు పంపింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయవాదులపై ఫిర్యాదులు ఉన్నందున వారిని జడ్జీలుగా నియమించలేమని కేంద్రం పేర్కొంది. ఆ ఇద్దరు న్యాయవాదుల్లో ఒకరైన మహ్మద్ మన్సూర్.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దివంగత సాఘిర్ అహ్మద్ కుమారుడు కావడం గమనార్హం. న్యాయవాదులు మహ్మద్ మన్సూర్‌తోపాటు బష్రత్ అలీని అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలంటూ చాలా రోజుల క్రితమే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆ ఇద్దరిపై ఫిర్యాదులున్నాయన్న కారణం చూపుతూ అప్పట్లో కేంద్రం ఈ ప్రతిపాదనను తిప్పిపంపింది. ఆ ఫిర్యాదులు తీవ్రమైనవేమీ కాదంటూ కొలీజియం మరోసారి అవే పేర్లను సిఫారసు చేయగా, ఏ నిర్ణయమూ తీసుకోకుండా రెండున్నరేళ్లు కాలయాపన చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు వారిరువురీ పేర్లను తిరస్కరిస్తున్నట్లు గత నెలలో కొలీజియంకు తెలిపింది. కొలీజియం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ చలమేశ్వర్ ఇటీవలే పదవీ విరమణ పొందినందున కొత్త కొలీజియం ఏర్పాటైన అనంతరం ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. -
ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా : హైకోర్టు
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయకపోవడంపై అలహాబాద్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉనావోలో యువతిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదైన ఇప్పటివరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ప్రభుత్వానికి ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా, లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశామని త్వరలోనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం కోర్టుకి నివేదించినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో తీర్పును శుక్రవారం వెలువరించనుంది. బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగార్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు డీజీపీ మాట్లాడుతూ.. కేసు సీబీఐకి అప్పగించినందున మళ్లీ కొత్తగా కేసు నమోదుచేసిన తర్వాతే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయగలమని తెలిపారు. బాధితురాలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఆయన విచారణను ప్రభావితం చేస్తారని అన్నారు. తన తండ్రిని చంపేశారని, ఇప్పుడు తన కోసం పోరాడుతున్న తన బాబాయి జీవితం గురించి భయపడుతున్నానని ఆమె చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌తోపాటు, ఆయన సోదరుడిపై చర్యలు చేపట్టాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ఎదుట యువతి బంధువులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. -
వారంలో వర్సిటీ అధ్యాపక నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,061 పోస్టుల భర్తీకి వారంలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పోస్టు ల భర్తీలో వర్సిటీలవారీగానే రోస్టర్ కమ్ రిజర్వేషన్ అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలోనూ పోస్టుల భర్తీలో వర్సిటీలవారీగానే రోస్టర్ కమ్ రిజర్వేషన్‌ను అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసేవారు. అయితే ఇటీవల అలహాబాద్ హైకోర్టు వర్సిటీలవారీగా కాకుండా యూనివర్సిటీల్లో సంబంధిత విభాగాలవారీగానే రోస్టర్ కమ్ రిజర్వేషన్లను పోస్టుల భర్తీలో అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో యూజీసీ అన్ని వర్సిటీల వీసీలకు ఈ మేరకు లేఖలు రాసింది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలు గందరగోళంలో పడ్డాయి. పోస్టుల భర్తీలో యూనివర్సిటీలవారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లు పాటించాలా లేక యూజీసీ తాజా నిబంధనల ప్రకారం పోస్టులను విభాగాలవారీగా రోస్టర్ కమ్ రిజర్వేషన్లు అమలు చేయాలా అనే విషయాన్ని ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో నోటిఫికేషన్ల జారీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి దీనిపై యూజీసీ అధికారులతో చర్చించారు. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ చేసేందుకు సిద్ధమైందని, అందువల్ల ప్రస్తుతానికి పాత విధానం ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని యూజీసీ సూచించింది. దీంతో త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని యూనివర్సిటీలకు సూచించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు. -
బరాత్ కోసం హైకోర్టులో యువకుడి పిటిషన్
లక్నో : బరాత్ అనుమతి కోసం యూపీకి చెందిన ఓ దళిత యువకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతను పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టులో అతనికి చేదు అనుభవమే ఎదురైంది. స్థానిక పోలీసులను ఆశ్రయించాలంటూ కోర్టు అతనికి సూచిస్తూ.. పిటిషన్‌ను కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే... కాస్గంజ్ పరిధిలోని ఓ గ్రామంలో గత నెలరోజులుగా దళిత-అగ్రవర్ణాలకు మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో థాకూర్ పెద్దలు దళితుల వివాహా వేడుకలకు అడ్డుపడుతున్నారు. కాదని వేడుకలను నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. శీతల్ అనే దళిత యువకుడికి ఈ మధ్యే వివాహం నిశ్చయమైంది. నెలాఖరులో వివాహం కూడా. అయితే గ్రామంలోనే థాకూర్ పెద్దలు అడ్డుపడుతుండటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ ప్రయోజనం లేకపోవటంతో చివరకు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘తమ ఆదేశాలకు దిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని థాకూర్ పెద్దలు బెదరిస్తున్నారు. ఇది మా ప్రభుత్వం.. మీరు ఎవరిని ఆశ్రయించినా వ్యర్థమే. ఎవరూ జోక్యం చేసుకోరు అంటూ చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. బరాత్‌తో నా వివాహం జరుపుకునేందుకు అనుమతి ఇప్పించండి’ అని శీతల్ పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక ఈ వ్యవహారంపై సంజయ్ కుమార్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీస్ శాఖ కూడా ఈ వ్యవహారంలో చేతులెత్తేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కావాలంటే పొరుగు గ్రామంలో నిర్వహించుకోవాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది.