అలహాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అలహాబాద్ హైకోర్టు నేడు కీలకమైన తీర్పు వెలువరించనుంది. ఆరుషిని హత్య చేసింది ఆమె తల్లిదండ్రులేనా అన్న దానిపై ఈ తీర్పు వెలువడనుంది. 2008 మే 16 నోయిడాకు చెందిన ఆరుషి తల్వార్ హత్యకు గురైంది. రాష్ట్ర ప్రభుత్వం 2009లో ఈ కేసును సీబీఐకు అప్పగించగా, సీబీఐ మరో బృందానికి అప్పగించింది. కేసును దర్యాప్తు చేసిన సీబీఐ బృందం పరిస్థితుల ఆధారంగా రాజేష్‌ను అనుమానితుడిగా పేర్కొనడానికి సరైన సాక్ష్యాలు లేనందున నేరాభియోగాలు మోపేందుకు నిరాకరించింది. అంతేకాకుండా కేసును మూసేయాల్సిందిగా సీబీఐకి సిఫారసు చేసింది.
అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు కేసు మూసివేతను నిరాకరించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే ఆరుషి తల్లిదండ్రులను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అనంతరం ఆరుషి తల్లిదండ్రులు నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్‌లు ఇంటి పనిమనిషి హేమరాజ్‌తో కలిసి హత్య చేశారని నిర్ధారిస్తూ 2013లో ఉత్తరప్రదేశ్ కోర్టు దోషులకు జీవిత ఖైదు విధించింది.
2008 మే 23న రాజేష్‌ను మొదటిసారి యూపీ పోలీసులు అరెస్టు చేశారు. దస్నా జైలుకు పంపారు. అయితే 2008 జూలై 11న విడిచిపెట్టారు. అనంతరం 2012లో రాజేష్ బార్య నూపుర్ ఘజియాబాద్ కోర్టు ముందు లొంగిపోవడంతో ఆమెను కూడా దస్నా జైలుకు పంపారు. అయితే ఆరుషి తల్లిదండ్రులు 2013 ఉత్తరప్రదేశ్ కోర్టు తీర్పుపై చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన హైకోర్టు బెంచ్ గత సెప్టెంబర్‌లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment