Aarushi case
-
ఆరుషి కేసులో నేడే తీర్పు
అలహాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ కేసులో తుది తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అలహాబాద్ హైకోర్టు నేడు కీలకమైన తీర్పు వెలువరించనుంది. ఆరుషిని హత్య చేసింది ఆమె తల్లిదండ్రులేనా అన్న దానిపై ఈ తీర్పు వెలువడనుంది. 2008 మే 16 నోయిడాకు చెందిన ఆరుషి తల్వార్ హత్యకు గురైంది. రాష్ట్ర ప్రభుత్వం 2009లో ఈ కేసును సీబీఐకు అప్పగించగా, సీబీఐ మరో బృందానికి అప్పగించింది. కేసును దర్యాప్తు చేసిన సీబీఐ బృందం పరిస్థితుల ఆధారంగా రాజేష్‌ను అనుమానితుడిగా పేర్కొనడానికి సరైన సాక్ష్యాలు లేనందున నేరాభియోగాలు మోపేందుకు నిరాకరించింది. అంతేకాకుండా కేసును మూసేయాల్సిందిగా సీబీఐకి సిఫారసు చేసింది. అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు కేసు మూసివేతను నిరాకరించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే ఆరుషి తల్లిదండ్రులను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించింది. దర్యాప్తు అనంతరం ఆరుషి తల్లిదండ్రులు నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్లు ఇంటి పనిమనిషి హేమరాజ్తో కలిసి హత్య చేశారని నిర్ధారిస్తూ 2013లో ఉత్తరప్రదేశ్ కోర్టు దోషులకు జీవిత ఖైదు విధించింది. 2008 మే 23న రాజేష్‌ను మొదటిసారి యూపీ పోలీసులు అరెస్టు చేశారు. దస్నా జైలుకు పంపారు. అయితే 2008 జూలై 11న విడిచిపెట్టారు. అనంతరం 2012లో రాజేష్ బార్య నూపుర్ ఘజియాబాద్ కోర్టు ముందు లొంగిపోవడంతో ఆమెను కూడా దస్నా జైలుకు పంపారు. అయితే ఆరుషి తల్లిదండ్రులు 2013 ఉత్తరప్రదేశ్ కోర్టు తీర్పుపై చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన హైకోర్టు బెంచ్ గత సెప్టెంబర్‌లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. -
ఆరుషి కేసు చెప్పే గుణపాఠం!
అయిదున్నరేళ్లపాటు ఎన్నెన్నో మలుపులు తిరిగిన ఆరుషి తల్వార్ హత్య కేసు చివరకు ఆమె తల్లిదండ్రులు నూపూర్ తల్వార్, రాజేష్ తల్వార్లకు యావజ్జీవ శిక్ష పడటంతో విషాదకరమైన ముగింపునకు చేరింది. దంపతులిద్దరూ ఢిల్లీ సమీపంలోని నోయిడాలో పేరుపొందిన దంత వైద్యులు. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. వారి ఇంట్లో 2008 మే 15 రాత్రి అప్పటికి 13 ఏళ్ల బాలికైన ఆరుషి, హేమరాజ్ అనే నౌకరు హత్యకు గురయ్యారు. ఆ మర్నాడు ఉదయంనుంచి ఆ జంట హత్యల చుట్టూ రకరకాల కథనాలు అల్లుకున్నాయి. మొదట దర్యాప్తు చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు, అటు తర్వాత దాన్ని స్వీకరించిన సీబీఐ...ఆ క్రమంలో తమకు వినబడిన ప్రతి అంశాన్నీ ఎప్పటికప్పుడు మీడియాకు లీక్ లివ్వడం, వాటి ఆధారంగా మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడటం సాగిపోయింది. దర్యాప్తు ఎలా చేయకూడదో తెలుసుకోవడానికి ఆరుషి హత్య కేసు బలమైన ఉదాహరణ. యూపీ పోలీసులుగానీ, అటు తర్వాత దర్యాప్తును స్వీకరించిన సీబీఐగానీ దర్యాప్తును సక్రమంగా సాగించడంలో విఫలమయ్యారు. సాధారణ పోలీసులకు హత్య కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు గానీ అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థగా పేరున్న సీబీఐ వ్యవహరణ తీరు కూడా అలాగే ఉంది. ఇద్దరూ మీడియాకు లీకులివ్వడంలో చూపించిన ఉత్సాహంలో కాస్తయినా దర్యాప్తు విషయంలో ప్రదర్శించలేదు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించనందున కేవలం ‘పరిస్థితులు పట్టి ఇచ్చే సాక్ష్యాల’ ఆధారంగా తల్లిదండ్రులిద్దరినీ దోషులుగా నిర్ధారిస్తున్నట్టు సోమవారం తీర్పు వెలువరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్యాంలాల్ ప్రకటించాల్సివచ్చింది. వైద్య పరమైన నైపుణ్యం ఉన్నవారే చేయగలిగే రీతిలో ఆరుషి గొంతు నరం కోసివున్నదన్న ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. దంపతులిద్దరూ సాక్ష్యాలను నాశనం చేసిన కేసులో కూడా దోషులని తేల్చారు. ఈ కేసును ఆద్యంతం పరిశీలించినప్పుడు దిగ్భ్రాంతికరమైన అంశాలు వెల్లడవుతాయి. సాధారణంగా నేరం చేసినవారు అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ఏదో ఒక మేరకు వదిలివెళ్తారంటారు. ఈ కేసులో అలాంటివన్నీ లేకుండాపోయాయి. అందుకు మొదటగా తప్పుబట్టాల్సింది యూపీ పోలీసులనే. జంట హత్యల విషయం వెల్లడైన వెంటనే వచ్చిన పోలీసులు నేరం జరిగిన ప్రదేశాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోలేదు. చుట్టుపక్కలవారంతా అక్కడ యధేచ్ఛగా తిరిగారు ఈ క్రమంలో నేరస్తుల వేలిముద్రలవంటి విలువైన సాక్ష్యాధారాలన్నీ చెదిరిపోయాయి. తొలుత కేవలం ఆరుషి మృతదేహం ఒక్కటే లభించింది. మరో మృతుడు హేమరాజ్ ఏమయ్యాడన్నది అప్పటికి తెలియలేదు. ఆ ఇంటిపైనే ఉన్న ఒక గదిలో అతను ఉంటున్నాడని తల్వార్ దంపతులు చెప్పినా ఆ గదికి దారితీసే మెట్ల వద్ద ఉన్న తలుపు తాళం వేసివున్నదని వారు ఊరుకున్నారు. ఆ తాళం బద్దలుకొట్టి వెళ్తే హేమరాజ్‌కు సంబంధించిన సాక్ష్యాలు దొరుకుతాయని వారి ఊహకు అందలేదు. చివరకు మర్నాడొచ్చి తాళం బద్దలుకొట్టారు. తీరా చూస్తే హేమరాజ్ శవం అక్కడపడివుంది. ఇవన్నీ ఇలాపోగా తల్వార్ దంపతులపైనా, వారి కుమార్తెపైనా ఎన్నో కథలు ప్రచారంలోకొచ్చాయి. అందులో రాజేష్ తల్వార్ ప్రవర్తన మంచిది కాదని, ఆయనకు ఇంకెవరితోనో సంబంధాలున్నాయన్న కథనం ఒకటి. ఆరుషినీ, హేమరాజ్నూ ‘అభ్యంతరకరమైన’ పరిస్థితుల్లో చూసిన తల్వార్ దంపతులు కోపం పట్టలేక పోయారని, అందుకే ఆరుషిని ‘పరువు హత్య’చేశారని మరో కథనం. ఇద్దరినీ ‘అభ్యంతరకర పరిస్థితుల్లో’ చూసినప్పుడు వచ్చిన ఆవేశంలో హత్యకు పూనుకుంటే ‘వైద్యపరమైన నైపుణ్యం’ ఉన్నవారు మాత్రమే చేయగలిగినంత ఒడుపుగా ఆరుషిని తల్లిదండ్రులు ఎలా చంపగలిగారు? అసలు ఆ గదిలోనే ఉండాల్సిన హేమరాజ్ శవం...పైనున్న అతని గది ముందు ఎలా పడివున్నట్టు? మీడియాలో వచ్చిన కథనాల సంగతలా ఉంచి ఈ కేసు దర్యాప్తు ఎన్నెన్నో మలుపులు తీసుకుంది. మొదట ముద్దాయిలుగా తేలినవారు ఆ తర్వాత కేసు నుంచి విముక్తులయ్యారు. మొదట దర్యాప్తుచేసిన సీబీఐ బృందానికీ, తర్వాత దర్యాప్తు చేసిన బృందానికీ లభించిన ఆధారాల్లో వైరుధ్యాలున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా తల్వార్ దంపతులపైనా, ఇతర నిందితులపైనా ఎన్నో పరీక్షలు జరిగాయి. ఇందులో పాలీగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్, లైడిటెక్టర్, నార్కో అనాలిసిస్ పరీక్షలున్నాయి. అన్నిటిలోనూ దంపతులిద్దరికీ నేరం గురించి తెలియదన్న నిర్ధారణ జరిగింది. ఇవే పరీక్షల్లో అనుమానితుడిగా తేలిన రాజేష్ తల్వార్ సహాయకుడు కృష్ణ తర్వాత కాలంలో సీబీఐ దర్యాప్తులో నిర్దోషిగా తేలితే, ఆ పరీక్షల్లో అనుమానితులు కాని తల్వార్ దంపతులు ముద్దాయిలయ్యారు. చిత్రమేమంటే ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లభించలేదు గనుక దీన్ని మూసేయడానికి అనుమతించమని కోర్టును సీబీఐ 2010 డిసెంబర్లో అభ్యర్థించినప్పుడు దానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది తల్వార్ దంపతులే. 2010లో కేసు మూసివేత కోరిన సంస్థే మూడేళ్లు గడిచేసరికల్లా ‘మరణశిక్ష విధించదగిన’ నేరమని న్యాయస్థానం ముందు ఎలా వాదించగలిగిందో అనూహ్యం. మొత్తానికి దర్యాప్తు క్రమంలో పోలీసులు, సీబీఐ వ్యవహరించిన తీరువల్ల ఈ కేసులో నిర్ధారణ అయిన అంశాలకంటే అనుమానాలే ఎక్కువున్నాయి. కీలకమైన అంశాలు కొన్నిటిని కోర్టునుంచి సీబీఐ దాచిపెట్టిందని, అందువల్లే తల్వార్ దంపతులకు అన్యాయం జరిగిందని వారి న్యాయవాదులు అంటున్నారు. అప్పీల్‌కు వెళ్తే న్యాయం లభిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఇది మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ కేసు నేర్పిన గుణపాఠంతోనైనా దర్యాప్తు సంస్థలు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాలి. -
తల్వార్ దంపతులకు జీవితఖైదు
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో దోషులుగా తేలిన రాజేశ్, నూపుర్ తల్వార్ దంపతులకు సీబీఐ కోర్టు మంగళవారం జీవితఖైదు శిక్ష విధించింది. జంట హత్యలకు సంబంధించిన ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించి దోషులకు ఉరిశిక్ష విధించాలన్న సీబీఐ తరఫు వాదనలను కోర్టు తోసిపుచ్చింది. పద్నాలుగేళ్ల తమ కుమార్తె ఆరుషి, ఇంటి పనిమనిషి హేమరాజ్ హత్య కేసులో వైద్య దంపతులు రాజేశ్(49), నూపుర్(48)లను కోర్టు సోమవారం దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. శిక్ష ఖరారుపై మంగళవారం కేవలం ఐదు నిమిషాల పాటు వాదనలు సాగాయి. అనంతరం అదనపు సెషన్స్ జడ్జి శ్యామ్‌లాల్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో తల్వార్ దంపతులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు. సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు దంపతులిద్దరికీ మరో ఐదేళ్ల కారాగార శిక్ష, ఎఫ్ఐఆర్ నమోదు సందర్భంగా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రాజేశ్‌కు అదనంగా మరో ఏడాది జైలు శిక్ష విధించారు. ఈ కేసులో పక్కా సాక్ష్యాలు లేకపోవడంతో జడ్జి ప్రాసంగిక సాక్ష్యం (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్)పై ఆధారపడ్డారు. నేరం జరిగిన చోట పరిస్థితులను ఆధారంగా చేసుకొని పోలీసులు చెప్పిన 26 కారణాలను పరిగణనలోకి తీసుకున్నారు. అంతకుముందు సీబీఐ తరఫున ఆర్కే సైనీ వాదిస్తూ.. అత్యంత కిరాతకంగా ఇద్దరిని హతమార్చిన తల్వార్ దంపతులకు మరణశిక్షే సరైనదని అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును అత్యంత అరుదైనదిగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తల్వార్ దంపతుల తరఫున తన్వీర్ మిర్ వాదిస్తూ.. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని, అందువల్ల వారిపై దయ చూపాలని కోరారు. ఏయే సెక్షన్ల కింద శిక్షలు.. ఐపీసీ సెక్షన్ 302(హత్య), 201(సాక్ష్యాల ధ్వంసం), 34(ఉమ్మడి నేర లక్ష్యం) కింద రాజేశ్, నూపుర్ దంపతులకు శిక్ష ఖరారు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. వీటితోపాటు పనిమనిషి హేమ్‌రాజే తన కూతురు ఆరుషిని హత్య చేశాడని పోలీసులకు చెప్పినందుకు రాజేశ్‌ను సెక్షన్ 203 కింద దోషిగా తేల్చినట్లు స్పష్టంచేసింది. సెక్షన్ 302 ప్రకారం దంపతులకు జీవితఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జరిమానా కట్టని పక్షంలో ఆరు నెలలపాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తెలిపింది. అలాగే సెక్షన్ 201 ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగారం, రూ.5 వేల జరిమానా విధించింది. రాజేశ్ ఒక్కడికి సెక్షన్ 203 కింద ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా ఖరారు చేసింది. వివిధ సెక్షన్ల కింద ఖరారు చేసిన ఈ శిక్షలన్నింటినీ ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తన ఉత్వర్వుల్లో స్పష్టంచేశారు. హైకోర్టులో సవాలు చేస్తాం.. సీబీఐ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేస్తామని తల్వార్ దంపతుల తరఫు న్యాయవాదులు తెలిపారు. ‘‘ఇది సరైన తీర్పు కాదు. దీన్ని కచ్చితంగా పైకోర్టులో సవాలు చేస్తాం. రాజేశ్ దంపతులను కావాలని ఇందులో ఇరికించారు’’ అని వారి తరఫు న్యాయవాది రెబెక్కా జాన్ తెలిపారు. ఈ కేసు విచారణలో సీబీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, కావాలనే తల్వార్ దంపతులను వేధించిందని ఆమె చెప్పారు. ఈ కేసులో సీబీఐ మీడియాకు ఒక వాదననే వినిపిస్తూ లీకులు ఇచ్చిందని తల్వార్ దంపతుల తరఫు మరో న్యాయవాది సత్యకేతు శర్మ ఆరోపించారు. మీడియా ముందు లాయర్ల తన్నులాట తీర్పు వెలువడ్డ వెంటనే కోర్టు ఆవరణలో మీడియాకు వివరాలు వెల్లడించేందుకు లాయర్లు పోటీపడ్డారు. టీవీ కెమెరాల ముందే తన్నులాటకు దిగారు. ఒకరినొకరు తోసుకుంటూ దూషించుకున్నారు. ఇంతకూ వీరు అటు తల్వార్ దంపతుల తరఫు న్యాయవాదులు కాదు.. ఇటు సీబీఐ తరఫు న్యాయవాదులు కాదు! తీర్పు అనంతరం నరేష్ యాదవ్ అనే లాయర్ ముందుగా వచ్చి చానెళ్లతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈయన గతంలో సీబీఐకి సహాయ లాయర్‌గా పనిచేశారు. నరేష్ మాట్లాడుతున్న సమయంలో ఆయన వెనకాలే నిలబడ్డ సంజయ్ త్యాగి... మరో లాయర్ కూడా మాట్లాడేందుకు యత్నించారు. దీంతో నరేష్ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఒకరు సంజయ్ నుదుటిపై తుపాకీ ఎక్కుపెట్టాడు. మా లాయర్ మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నావంటూ బూతు పురాణం ఎత్తుకున్నాడు. చివరికి ఇరు వర్గాలు ఒకరినొకరు నెట్టుకుంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. కాసేపటికి వేరేవారు వచ్చి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ఆరుషి తల్లిదండ్రులే హంతకులు: కోర్టు తీర్పు
-
ఆరుషి తల్లిదండ్రులే హంతకులు: కోర్టు తీర్పు
-
ఆరుషి తల్లిదండ్రులే హంతకులు: కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: ఆరుషి, పని మనిషి హేమ్రాజ్ హత్య కేసులో ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే దోషులకు శిక్షలను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి హత్య కేసులో ఎట్టకేలకు ఈ రోజు కోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తుది తీర్పు వెలువడుతున్న ఈ నేపథ్యంలో ఘజియాబాద్ కోర్టు వద్ద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ కేసుకు సంబంధించి 15 నెలల్లో 84 మంది సాక్షులను సీబీఐ విచారించింది. తల్లిదండ్రులు డాక్టర్ రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్లే కూతురు ఆరుషి, తమ వద్ద పని చేసే హేమరాజ్‌ను హత్య చేశారని ఛార్జీషీట్లో పేర్కొన్నారు. ఆరుషిని చంపింది ఆమె తల్లిదండ్రులేనని సీబీఐ కోర్టు నిర్ధారించింది. హత్యతో పాటు సాక్ష్యాధారాలు కూడా వారు తారుమారు చేశారంటూ కోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముందుగా అనుకున్నట్లే ఆరుషి తల్లిదండ్రులు నూపుర్, రాజేష్ తల్వార్లే దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే16, 2008న 14 ఏళ్ల ఆరుషి హత్యకు గురైంది. నిందితుడిగా అనుమానించిన హేమ్రాజ్ కూడా ఆ తరువాత అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తల్లిదండ్రలు ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రారంభం నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజలు ఈ కేసు పట్ల ఆసక్తి చూపించారు. జర్నలిస్టులను సాక్షులుగా పరిగణించాలన్న తల్వార్ విజ్ఞప్తిని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆరుషి హత్య కేసులో సాక్షులను ప్రశ్నించాలన్న తల్వార్ దంపతుల విజ్ఞప్తి సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎడిజి(శాంతి భద్రతలు), సిబిఐ సంయుక్త సంచాలకులు అరుణ్ కుమార్‌లతో పాటు అదనంగా మరో 14 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుగా కొట్టివేసింది. దాంతో వారు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. ఘజియాబాద్ కోర్టు నూపుర్, రాజేష్ తల్వార్లనే హంతకులుగా తీర్పు చెప్పింది. అయితే కోర్టు రేపు శిక్ష ఖరారు చేస్తుంది.