‘ఇదేమీ చెత్త బుట్ట కాదు.. మాకెందుకు ఆ జడ్జి?’ | Allahabad High Court Lawyers Reject Justice Yashwant Varma | Sakshi
Sakshi News home page

‘ఇదేమీ చెత్త బుట్ట కాదు.. మాకెందుకు ఆ జడ్జి?’

Published Fri, Mar 21 2025 6:40 PM | Last Updated on Sat, Mar 22 2025 4:47 PM

Allahabad High Court Lawyers Reject Justice Yashwant Varma

న్యూఢిల్లీ:  భారీ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్ వర్మ((Justice Yaswant Varma) ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ  సుప్రీం కోర్టు కొలిజీయం((Supreme Court Collegium) ) తీసుకున్న నిర్ణయంపై సదరు హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.   ఒక హైకోర్టులో అవినీతిని చేసిన జడ్జిని తమకెందుకు బదిలీ చేస్తున్నారంటూ ప్రశ్నించింది.  అలహాబాద్ హైకోర్టుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.  ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసింది అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.

‘సుప్రీంకోర్టు కొలిజీయం తీసుకున్న నిర్ణయం చాలా సీరియస్ అంశం. అలహాబాద్ హైకోర్టు ఏమైనా చెత్త బుట్టా.. ప్రస్తుతం యశ్వంత్ వర్మ అంశం చాలా తీవ్రమైనది. ప్రస్తుత పరిస్థితిపై విచారణ జరగాలి. అసలే అలహాబాద్ హైకోర్టుకు జడ్జిలు తక్కువగా ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి అలహాలబాద్ హైకోర్టులో జడ్జిల కొరత తీవ్రంగా ఉంది. ఆ తరుణంలో అవినీతి మరకలు అంటుకున్న యశ్వంత్ సిన్హా మాకెందుకు? అంటూ సీజేఐకి రాసిన లేఖలో పేర్కొంది.

రూ. 15 కోట్లు పైమాటే..?
అయితే అగ్ని ప్రమాదంతో బయటపడిన జస్టిస్ యశ్వంత్ వర్మ కరెన్సీ కట్ల వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ నోట్ల కట్టలు విలువ ఎంత ఉంటుందని ఇప్పటివరకూ అధికారంగా ప్రకటించకపోయినా, వాటి విలువ రూ. 15 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. నిజంగా ఒకవేళ ఆ  నోట్ల కట్టల విలువ భారీ స్థాయిలో ఉంటే జడ్జి యశ్వంత్ వర్మ చిక్కుల్లో పడినట్లే. ఈ అంశంపై సీజేఐ సంజీవ్ ఖన్నా తీవ్రంగా దృష్టి సారించినట్లు సమాచారం.

మార్చి 14వ తేదీన జస్టిస్‌ వర్మ ఇంట్లో లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది నోట్ల కట్టలు కనిపించాయి. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలపడంతో సీజ్ చేసి ఉన్నతాధికారులకు అందించారు. ఈ వ్యహహారం కాస్తా ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.

గతంలో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా పని చేసిన అనుభవం ఉన్న యశ్వంత్ వర్మ..  బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. తాజాగా నోట్ల కట్టల వ్యవహారం బయటపడటంతో వర్మ  భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ యశ్వంత్ వర్మ స్పందించకపోవడంతో  ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మరింత బలం చేకూర్చున్నట్లే అవుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

బదిలీకి దర్యాప్తునకు సంబంధం లేదు
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ  ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. దర్యాప్తునకు, బదిలీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయనే కారణం చేత అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేశామని వార్తల్లో నిజం లేదన్నారు.  ఈ రెండు అంశాలకు ఎటువంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement