
ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయంటూ పెద్ద ఎత్తున కలకలం రేగిన గంటల వ్యవధిలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లోలేని సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, ఆ సమయంలో అగ్ని మాపక సిబ్బందికి భారీ స్థాయిలో నోట్ల కట్టలు దొరికాయని జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగింది.
అయితే యశ్వంత్ వర్మ ఇంట్లో ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు. తాము అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారంతో జడ్జి వర్మ ఇంటికి వెళ్లినమాట వాస్తవమేనని కానీ అక్కడ ఎటువంటి నోట్ల కట్టలు దొరకలేదంటూ స్పష్టం చేశారు.
‘ మా కంట్రోల్ రూమ్ కు మార్చి 14వ తేదీ రాత్రి గం. 11. 30 నిమిషాలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. భారీ అగ్ని ప్రమాదం జరిగిందనేది దాని సారాంశం. దాంతో మా అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో అక్కడికి వెళ్లారు. మేము సరిగ్గా 11.45 నిమిషాలకు అక్కడ వెళ్లారు మా సిబ్బంది. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులకు కూడా మేము సమాచారం ఇచ్చాం. అగ్ని ప్రమాదాన్ని నివారించిన తర్వాత మా టీమ్ అక్కడ నుండి వెళ్లిపోయింది. మా ఆపరేషన్ లో ఎటువంటి నగదు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో లభించలేదు’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment