
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. భారీ అవినీతి ఆరోపణ నడుమ యశ్వంత్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత వర్మ ఇంట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరగ్గా, అక్కడ పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయని ఒకవైపు ఆరోపణలు.. వీటి విలువ కోట్ల రూపాయిలు ఉంటుందని మరొవైపు అంచనాలు. ఒకవైపు జస్టిస్ ఇంట్లో ఏమీ నగదు దొరకలేదని ఢిల్లీ అగ్ని మాపక చీఫ్ అన్నట్లు ఒకవైపు, తాను అనలేదని మళ్లీ మరొకవైపు. ఇవే వార్తలు గత రెండు రోజుల నుంచి. చక్కర్లు కొడుతున్నాయి.
అంటే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు విషయం బయటకురాదు. న్యాయవవస్థలో ఉన్న ఒక జడ్జిపై ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ‘లెక్క సరిచేసుకునే’ బాధ్యత సదరు జడ్జిపై కూడా ఉంటుంది. ఇప్పటివరకూ జస్టిస్ యశ్వంత్ వర్మ నుంచి ఒక్క మాట పెదవి దాటలేదు. మరి ఆయన మౌనం పాటిస్తున్నారా.. వెనుక ఉండి ఏమైనా ‘ కథ’ నడిపిస్తున్నారా అనేది కూడా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
2018లోనే వర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్..!
తాజాగా జరిగింది ఒకటైతే,. 2018లో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సింబాలి సుగర్ మిల్స్ కుంభకోణానికి సంబంధించి యశ్వంత్ పై కేసు ఫైల్ చేసింది సీబీఐ. దానికి ఆ సమయంలో యశ్వంత్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు దొరకడంతో సీబీఐ ఎప్‌ఐఆర్ నమోదు చేసింది.
అయితే 2012 సంవత్సరంలో జనవరి, మార్చి నెలల మధ్యలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ)కి సింభోలి షుగర్ మిల్స్ వందల కోట్లలో టోకరా వేసి ఘటన అప్పట్లో సంచలనమైంది.. సదరు బ్యాంకును మోసం సుమారు రూ. 148.59 కోట్లను అక్రమ మార్గంలో సింభోలి షుగర్ మిల్స్ ఖాతాలోకి మళ్లించారు. 5వేలు మంది రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి బ్యాంక్ రుణానికి వెళ్లి, ఆ రైతుల పేర్లతో తప్పుడు పత్రాలు(కేవైసీ) సృష్టించి మోసానికి తెరలేపారు సింభోలి షుగర్ మిల్స్.

2015లో అసలు విషయం వెలుగులోకి..
అయితే సింభోలి షుగర్ మిల్స్ మోసం చేసిన విషయాన్ని ఓబీసీ బ్యాంకు 2015లో గ్రహించింది. ఆ షుగర్ మిల్స్ తీసుకున్న రుణం మోసం చేసి తీసుకున్నదిగా డిక్లేర్ చేసింది. ఇందులో మొత్తం రుణం రూ. 97.85 కోట్లు కాగా, అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ. 109 కోట్లుగా బ్యాంకు పేర్కొంది. దీనిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించిన గుర్పాల్ సింగ్ పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కి గుర్పాల్ సింగ్ అల్లుడు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఎప్ఐఆర్ ఆధారంగా ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమాంతరంగా దర్యాప్తు చేశాయి. అయితే ఈ కేసులో పెద్దగా పురోగతి కనిపించకపోవడంతో దర్యాప్తు అంశం పక్కకు పోయింది.
అలహాబాద్ హైకోర్టు జోక్యంతో 2023లో మళ్లీ కొత్తగా..
ఈ భారీ అవినీతిని సీరియస్ గా తీసుకున్న అలహాబాద్ హైకోర్టు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయవవస్థను కుదిపేసిన ఈ తరహా అవినీతిపై దర్యాప్తు కచ్చితంగా సమగ్రంగా జరగాలని పేర్కొంది. ఇందులో రుణాలు ఎగవేతకు సంబంధించి ఏడు బ్యాంకులను లింక్ చేసింది హైకోర్టు. సుమారు ఏడు బ్యాంకులు కలిపి బయారూ. 900 కోట్లు సింభోలి షుగర్ మిల్స్ కు రుణాన్ని మంజూరు చేసినట్లు గుర్తించిన హైకోర్టు.. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దాంతో 2024 ఫిబ్రవరిలో సీబీఐ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన కంపెనీ డైరెక్టర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెకర్లపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి విచారణను తిరిగి ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment