Collegium of the Supreme Court
-
హైకోర్టు జడ్జీలుగా ఐదుగురు
న్యూఢిల్లీ: నాలుగు హైకోర్టుల్లో నియామకానికిగాను సుప్రీంకోర్టు కొలీజియం అయిదుగురు జడ్జీల పేర్లను ప్రతిపాదించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో భేటీ అయిన కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫారసులను పంపించింది. కొలీజియంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా ఉన్నారు. జమ్మూ కశీ్మర్ అండ్ లద్దాఖ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ రాహుల్ భారతి, జస్టిస్ మోక్షా ఖజూరియా కజి్మలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియంకోరింది. బాంబే హైకోర్టులో అదనపు జడ్జి అభయ్ అహుజాను శాశ్వత న్యాయమూర్తిగా, కోల్‌కతా హైకోర్టు న్యాయాధికారి చైతలి చటర్జీ(దాస్)ను అదే హైకోర్టులో న్యాయమూర్తిగా, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయాధికారి అరవింద్ కుమార్ వర్మను అదే హైకోర్టులో జడ్జిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. -
3 హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం
అలహాబాద్, కర్నాటక, మద్రాస్ హైకోర్టుల్లో 13 మంది అదనపు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో 11 మంది లాయర్లు కాగా ఇద్దరు న్యాయాధికారులు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. వీరిలో మద్రాస్ హైకోర్టు న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి బీజేపీతో సంబంధాలున్నాయనే ఆరోపణ వివాదం రేపింది. ఈమె పేరును సిఫార్సు చేయడాన్ని మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. బార్‌కు చెందిన 21 మంది లాయర్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ‘‘తాను బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శినంటూ గౌరీ అంగీకరించారు. మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మత ఛాందస భావాలున్న ఆమె న్యాయమూర్తిగా అనర్హురాలు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 10న విచారణ జరగాల్సి ఉంది. దానిపై మంగళవారమే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. పార్టీలతో సంబంధాలున్న వారూ జడ్జీలు కావచ్చని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు అనడం తెలిసిందే. -
సుప్రీం జడ్జీలుగా ఐదుగురికి పదోన్నతి
న్యూఢిల్లీ: పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది. ఐదుగురు హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతకుముందు ఢిల్లీలో మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ తర్వాత సంబంధిత జడ్జీల పేర్ల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ పంకజ్ మిట్టల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, పట్నా హైకోర్టులో మరో జడ్జి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలంటూ కేంద్రానికి సిఫార్సుచేసింది. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. మరోవైపు, ఉత్తరాఖండ్ హైకోర్టులో జడ్జి జస్టిస్ సంజయకుమార్ మిశ్రాను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు జడ్జి ఎన్ కోటీశ్వర్ సింగ్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుచేసింది. -
కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం సమావేశం వివరాలు, తీర్మానాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2017 అక్టోబర్ 3న చేసిన తీర్మానం ప్రకారం.. కొలీజియం చర్చల, తీర్మానాల వివరాలను బయటపెట్టలేమని తెలిపింది. తుది నిర్ణయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. 2018 డిసెంబర్ 12న కొలీజియం భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. కొలీజియం అనేది బహుళ సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ అని, కొలీజియం చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకురాలేమని, సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది. కొలీజియంలోని సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేస్తేనే తీర్మానాలు తుది నిర్ణయాలుగా మారుతాయని, అలాంటి వాటినే బయటపెట్టగలమని వివరించింది. తీర్మానాలే ఫైనల్ కాదు 2018 డిసెంబర్ 12 నాటి కొలీజియం సమావేశం అజెండా వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం భేటీలో సంప్రదింపుల కోసం చేసే తీర్మానాలు ఫైనల్ అని చెప్పలేమని తెలిపింది. తీర్మానాలపై సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేసే దాకా అవి అస్థిర నిర్ణయాలేనని పేర్కొంది. అందరూ సంతకాలు చేస్తేనే నిర్ణయాలు ఖరారవుతాయని వెల్లడించింది. అంటే కొలీజియం వ్యవస్థలోని సభ్యులందరి ఆమోదం ఉంటేనే తీర్మానాలు నిర్ణయాలవుతాయని వివరించింది. కొలీజియం విషయంలో మీడియాలో వచ్చే రిపోర్టులను విశ్వసించలేమని, ఇదే వ్యవస్థలో పనిచేసిన మాజీ సభ్యుడి ఇంటర్వ్యూను పట్టించుకోలేమని ధర్మాసనం ఉద్ఘాటించింది. కొలీజియం పనితీరు పట్ల మాజీ జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్లపై తాము మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించింది. 2018 డిసెంబర్ 12న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమయ్యింది. పలువురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి, తీర్మానాలు చేసింది. అయితే, ఈ తీర్మానాలు, నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. 2019 జనవరి 10న జస్టిస్ మదన్ బి.లోకూర్ పదవీ విరమణ సందర్భంగా కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2018 డిసెంబర్ 12 నాటి భేటీలో కేవలం ప్రతిపాదనలపై చర్చించామని, వాటిని ఫైనలైజ్ చేయలేదని పేర్కొంది. అది మనకు పరాయి వ్యవస్థ: కిరణ్ రిజిజు కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నడుమ వివాదం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ వ్యవస్థను ప్రభుత్వం తప్పుపడుతోంది. కొలీజియం అనేది మనకు పరాయి వ్యవస్థ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే ఆక్షేపించారు. అయితే, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిప్పి కొట్టింది. కొలీజియం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని, అనవసర వ్యాఖ్యలతో దాన్ని పట్టాలు తప్పించవద్దని హితవు పలికింది. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
సీజేఐ సమక్షంలో.. ఉపరాష్ట్రపతి తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. ఎన్‌జేఏసీ సుప్రీం కోర్టు కొట్టివేసిన తర్వాత పార్లమెంటులో ఎటువంటి చర్చ లేదని, ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సమక్షంలోనే ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే.. అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీం కోర్టు దానిని రద్దు చేసింది. ఇలాంటి ఉదాహరణ ప్రపంచానికి తెలియదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారాయన. రాజ్యాంగంలోని నిబంధనలను ఉటంకించిన ఆయన.. చట్టం పరిధిలో ముఖ్యమైన ప్రశ్న ఇమిడి ఉన్నప్పుడు, సమస్యను కోర్టులు పరిశీలించవచ్చని అన్నారు. అయితే.. నిబంధనను రద్దు చేయవచ్చని ఎక్కడా చెప్పలేదు అంటూ పేర్కొన్నారాయన. ఆ సమయంలో రాజ్యాంగ పీఠికను సైతం ప్రస్తావించారు. ఎన్‌జేఏసీ చట్టం.. లోక్‌సభ, రాజ్యసభ రెండు సభల్లోనూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వోటింగ్ ద్వారా ఆమోదం పొందిందని ధన్కర్ గుర్తు చేశారు. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టంతో వ్యవహరించింది. రికార్డు విషయంగా మొత్తం లోక్‌సభ ఏకగ్రీవంగా ఓటు వేసింది. రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. మేధావులను, న్యాయవేత్తలను కోరేది ఒక్కటే. దయచేసి.. రాజ్యాంగ నిబంధనను రద్దు చేయగల ఈ ప్రపంచంలో.. ఒక సమాంతరాన్ని కనుగొనండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. దానిని కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26వ తేదీన ఉప రాష్ట్రపతి ధన్కర్ దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కూడా. -
కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమా?
న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ పనితీరుపై ఇప్పుడు తీవ్ర చర్చ కొనసాగుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి చాలాసార్లు ఈ వ్యవస్థ పారదర్శకత గురించి చర్చ లేవదీశారు. మరోవైపు కొలీజియం కార్యాచరణలు అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కొలీజియం వ్యవస్థలో జవాబుదారీతనం, నిష్పాక్షికత లోపించాయని మరో మాజీ జస్టిస్ కురియన్ స్పష్టం చేశారు. కార్యనిర్వాహక వర్గమైన ప్రభుత్వానికి పాత్ర లేకుండా కొలీజియం కొనసాగడంపై దాని ఏర్పాటుకు కారణమైన తీర్పునిచ్చిన మాజీ చీఫ్ జస్టిస్ వర్మ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదేనా అన్న ప్రశ్న తలెత్తక మానదు. న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీ జియం (తెలుగులో సలహా మండలి అనవచ్చు) వ్యవస్థ పరిపూర్ణమైనదేనా? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్ ఇటీవలి ఇంటర్వ్యూలలో అదే చెబుతున్నారు. అదే సమయంలో, రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలో కొలీజియం అనేది అంతర్గతంగానే ఉందని ఆయన సూచించారు కూడా! అయితే ఈ రెండు అంశాల గురించి ఆయన చెప్పింది సరైం దేనా? దీనిపై ఒక సాధారణ పరిశోధన ఏం చెబుతోందో మీతో పంచుకోనివ్వండి. పైన పేర్కొన్న వాటిలో రెండో అంశాన్ని మొదటగా తీసు కుందాం. కొలీజియం అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపర్చలేదు. మరీ ముఖ్యంగా, ‘చీఫ్ జస్టిస్ సమ్మతి’(కన్కరెన్స్) అనే పదాన్ని జోడించడానికి జడ్జీల నియామక విధానంలో చేసిన సవరణను కూడా రాజ్యాంగ సభలో ఆనాడే ఓడించారు. అయితే 1993లో మాత్రమే సుప్రీంకోర్టు దీన్ని సాధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2)లో ప్రస్తావించిన ‘సంప్రదింపు’ అనే పదం ‘చీఫ్ జస్టిస్ సమ్మతి’ అని నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు ఇది చేయగలిగింది. ఈ రెండు పదాలకు ప్రతి నిఘంటువులోనూ వేర్వేరు అర్థాలున్నాయనే వాస్త వాన్ని అలా పక్కన పెట్టారు. కాబట్టి రాజ్యాంగంలో కొలీజియం అనే భావన కనీసంగా భాగం కానప్పుడు, దాని ప్రాథమిక స్వరూపంలోనే కొలీజియం వ్యవస్థ అంతర్గతంగా ఉందని చెబితే నమ్మడానికి కూడా కష్టంగానే ఉంటుంది. దీనికి బదులుగా ఇది ‘హంప్టీ డంప్టీ సూత్రం’ మీద ఆధారపడి చేసినది. అంటే, ‘‘నేను ఒక పదం ఉపయోగిస్తున్నప్పుడు, అది నేను ఎంపిక చేసుకున్న విధంగానే దాని అర్థం ఉంటుంది’’ అనే సూత్రంపైనే కొలీజియం వ్యవస్థను గతంలో రూపొందించినట్లు కనిపిస్తుంది. ఇక పరిపూర్ణతకు సంబంధించిన ప్రశ్నకు వద్దాం. 2015 జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ కేసు సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ, ‘‘కొలీజియం వ్యవస్థ కార్యాచరణలు నిస్సందేహంగా ప్రజలకూ, చరిత్రకూ కూడా అపారదర్శకంగానూ, చేరుకోలేని విధంగానూ ఉంటున్నాయి’’ అని చెప్పారు. కాగా, జస్టిస్ కురియన్ కూడా ‘‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం, నిష్పాక్షికత లోపించాయి’’ అని అంగీకరించారు. కాబట్టి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కూడా కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైనదని నమ్మలేదన్నమాట. దీనికి ఇక్కడ కొన్ని కారణాలున్నాయి. న్యాయమూర్తులను ఎలా పరిగణనలోకి తీసుకుంటారు, లేదా వారిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేసుకుంటారు అనే ప్రమాణాల గురించి నిజంగానే మనకు తెలీదు. ఇక రెండో అంశం. కొలీజియం అనే న్యాయమూర్తుల నియామక వ్యవస్థ మూసిన తలుపుల వెనుక నడుస్తున్నందున అక్కడ తప్ప కుండా బంధుప్రీతికి అపార అవకాశం ఉంటుంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమ ఛాంబర్లోని జూనియర్లను, చివరకు తమ బంధువులను సైతం జడ్జీలుగా నియమించారని ఆరోపణలు రావ డంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. కొలీజియం ఎంపిక చేసిన న్యాయమూర్తుల నాణ్యత మరో పెద్ద సమస్యగా ఉంటోంది. దీనిగురించి మొదలు పెట్టాలంటే, ఈ దేశం లోని అత్యుత్తమ న్యాయమూర్తులను కొలీజియం నిర్లక్ష్యం చేసింది. దీనికి జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా, జస్టిస్ అఖిల్ ఖురేషీ రెండు ఉదా హరణలుగా నిలుస్తారు. ఖురేషీ కేసు విషయానికి వస్తే, ఆయనను నియమించేంత వరకూ మరే ఇతర న్యాయమూర్తినీ నియమించ డానికి కూడా జస్టిస్ నారిమన్ తిరస్కరించారు. కానీ అది ఎన్నటికీ జరగలేదు. మరింత ఘోరమైన విషయం ఏమిటంటే, అర్హత లేని వ్యక్తులు తరచుగా న్యాయమూర్తులుగా నియమితులు కావడం. దీనికి అద్భుత మైన ఉదాహరణ జస్టిస్ కర్ణన్. చివరకు ఈయన జైలుపాలయ్యేంతగా అధోగతిపాలయ్యారు. అదే సమయంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎమ్ఆర్ షాల విషయానికి వస్తే, సిట్టింగ్ జడ్జిలుగా ఉండికూడా వారు బహిరంగంగానే ప్రధానమంత్రిని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఇది సుప్రీంకోర్టును తీవ్ర ఇబ్బందిలోకి నెట్టింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి బలహీనతలతో కూడిన వ్యవస్థ పరిపూర్ణంగా ఉండగలదా? 1993లో కొలీజియం వ్యవస్థను రూపొందించడానికి మూలమైన తీర్పు చెప్పిన నాటి చీఫ్ జస్టిస్ వర్మ సైతం అలా భావించడం లేదు. ‘బీబీసీ హార్డ్ టాక్’ కోసం జస్టిస్ వర్మ 2004లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొలీజియం విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాననీ, కార్యనిర్వాహకవర్గమైన ప్రభుత్వా నికి కూడా పాత్ర కల్పించే జాతీయ న్యాయ కమిషన్‌ను తాను నమ్ము తున్నాననీ ఆయన అన్నారు. న్యాయమూర్తుల నియామకానికి ఇదే ఉత్తమమార్గంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొలీ జియం రచయితే తన మనసు మార్చుకున్నప్పుడు, ఇక అలాంటి న్యాయ నియామకాల వ్యవస్థ పరిపూర్ణమైనదిగా ఉండగలదా? న్యాయచతురత కలిగిన అభ్యర్థులను ఉన్నత స్థానాల్లో న్యాయ మూర్తులుగా నిలిపినట్లయితే, కార్యనిర్వాహక వర్గం తన వ్యక్తిత్వం, సమగ్రత విషయంలో మరింత ఉత్తమంగా ఉండగలుగుతుందని జస్టిస్ వర్మ వాదించారు. కాబట్టే కొలీజియంలో ప్రభుత్వానికి కూడా తప్పకుండా పాత్ర కల్పించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, వర్మ మరొక అడుగు ముందుకెళ్లారు. 1997లో, ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పడు, కొలీజియం ఒక అభ్యర్థిని సిఫార్సు చేసింది. అయితే నిఘా సంస్థలు ఆయన పట్ల తీవ్ర అభ్యం తరాలు వ్యక్తం చేస్తున్నాయని నాటి ప్రధాని ఐకే గుజ్రాల్ చెప్పగానే, జస్టిస్ వర్మ ఆ అభ్యర్థి పేరును వెనక్కు తీసుకున్నారు. పైగా తాను ఎందుకలా నిర్ణయం మార్చుకోవలసి వచ్చిందో తన తోటి అయి దుగురు న్యాయమూర్తులకు వివరించారు కూడా! వీరిలో తర్వాత ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులు అయ్యారు. అయితే ఈ ముగ్గు రిలో ఒకరు జస్టిస్ వర్మ చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి, ఆయన ఉపసంహరించిన వ్యక్తిని తిరిగి నామినేట్ చేశారు. అలా ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యేలా చూశారు. అంటే ఒక తప్పుడు వ్యక్తిని కూడా కొలీజియం నామినేట్ చేయగలదనడానికి ఇదే రుజువు అని వర్మ అన్నారు. ఇదేమీ ఏకైక ఉదాహరణ కాదని కూడా ఆయన కొనసాగించారు. ఈ అంశం వద్దే దీన్ని ముగించనివ్వండి. ఒక సాధారణమైన పరిశోధన బయటపెట్టిన వాస్తవాలను, ఆందోళనలను మీ ముందు ఉంచాను. నిస్సందేహంగానే ఇక్కడ చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే నేను న్యాయవాదిని కానీ, న్యాయమూర్తిని కానీ కాదు కాబట్టి వాటి గురించి నేను జాగరూకతతో ఉండలేను. అయితే నేను ఈ కథనం ప్రారంభంలోనే వేసిన రెండు ప్రశ్నలను సమర్థిం చడానికి ఇది సరిపోతుంది మరి. కొలీజియం వ్యవస్థ పరిపూర్ణ మైనదేనా? అది మన రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలోనే అంతర్గ తంగా ఉందని భావించవచ్చా? కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా
సాక్షి, న్యూఢిల్లీ: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని కొలీజియం సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీజేఐ సహా 29 మంది న్యాయమూర్తులున్నారు. గరిష్ట సంఖ్య 34. కోల్‌కతాకు చెందిన జస్టిస్ దత్తా 1965లో జన్మించారు. 1989లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. పలు హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా చేశారు. రాజ్యాంగపరమైన, సివిల్ కేసులు వాదించడంలో దిట్టగాపేరొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదిగా పనిచేశారు. 2006లో కలకత్తా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2020 ఏప్రిల్ 28న బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తండ్రి జస్టిస్ సలీల్ కుమార్ దత్తా కూడా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. -
Telangana: హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జీలు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ సోమవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేష్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్ పి.ఎలమందర్, కాజా శరత్, జగన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సుల్లో పేర్కొంది. ఈ సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాగా, సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు. ఏడాది కాలంలో 17 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో 27 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుగురికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కు పెరగనుంది. కొలీజియం సిఫార్సు చేసిన వారి నేపథ్యమిదీ.. ఈవీ వేణుగోపాల్.. 1967, ఆగస్టు 16న కరీంనగర్ జిల్లాకేంద్రంలోని మంకమ్మతోటలో బాలాకుమారి, రాజేశ్వరరావులకు జన్మించారు. తండ్రి చేనేత, వస్త్ర పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్‌గా, తల్లి ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. వేణుగోపాల్.. డాక్టర్ శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు. 1992లో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. తొలుత సీనియర్ న్యాయవాది జే. రామ్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. కరీంనగర్ కోర్టులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. 2007 నుంచి 2013 వరకు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. వివిధ విభాగాల్లో రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లలో వాదించారు. ఉమ్మడి హైకోర్టులో రైల్వే కౌన్సిల్‌గా పనిచేశారు. 2021లో సీనియర్ అడ్వొకేట్‌గా పదోన్నతి పొందారు. నాగేశ్ భీమపాక... 1969, మార్చి 8న భద్రాచలంలో శాంతమ్మ, భూపతిరావులకు జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడైన భూపతిరావు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నాగేశ్.. పాఠశాల విద్య భద్రాచలంలో, ఇంటర్ ఖమ్మంలో, ఎల్ఎల్బీ సీఆర్ రెడ్డి కళాశాలలో, ఎల్ఎల్ఎం నిజాం కాలేజీలో పూర్తి చేశారు. 1993, ఏప్రిల్‌లో అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదిస్తున్నారు. సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్, లేబర్, రెవెన్యూ, మున్సిపల్ చట్టాల్లో మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. పరిశ్రమలు, గనుల కౌన్సిల్‌గా, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ గా, అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. పుల్లా కార్తీక్... 1967, జూన్ 4న జగిత్యాల పట్టణంలో పోచమల్లమ్మ, ఒగ్గు హనుమంతులకు జన్మించారు. పాఠశాల విద్య జగిత్యాలలోనే పూర్తి చేశారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయ్యారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా నుంచే ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1996, మార్చి 27న అడ్వొకేట్‌గా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకున్నారు. అన్ని విభాగాల న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. 2015లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ న్యాయవాదిగా నియమితులయ్యారు. కాజా శరత్... 1971, జనవరి 29న భద్రాచలంలో లలితాంబ, సీతారామయ్యలకు జన్మించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్, డిగ్రీ(బీఎస్సీ) భద్రాచలంలోనే పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ పట్టాపొందారు. ఆంధ్రా వర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా, ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1997, డిసెంబర్ 31న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. తొలుత కొత్తగూడెం, భద్రాచలం ట్రయల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 2002 నుంచి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో అన్ని విభాగాల న్యాయవాదిగా పలు కేసులు వాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. జగన్నగారి శ్రీనివాసరావు.. 1969, ఆగస్టు 31న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో జన్మించారు. ఈయన తండ్రిపేరు మాణిక్యరావు. తల్లిపేరు లక్ష్మీబాయి. పాఠశాల విద్య లింగన్నపేట లో.. గంభీరావుపేటలోని ప్రభుత్వ కాలేజీ నుంచి ఇంటర్మీడియెట్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సై న్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999, ఏప్రిల్ 29న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్‌గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ మ్యాటర్స్‌కు సంబంధించి లో యర్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. నామవరపు రాజేశ్వర్‌రావు.. 1969, జూన్ 30న మహబూబాబాద్ జిల్లా సూదన్‌పల్లిలో జన్మించారు. తల్లి పేరు గిరిజా కుమారి, తండ్రిపేరు సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్‌లో.. హైస్కూల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్‌లో పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 2001, ఫిబ్రవరి 22న అడ్వొకేట్‌గా ఎన్రోల్ చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో.. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తొలుత సీవీ రాములు ఆఫీస్‌లో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు పనిచేశారు. యూజీసీ తరఫు అడ్వొకేట్‌గా విధులు నిర్వహించారు. 2016, ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్‌గా విధులు నిర్వహించారు. 2019, నవంబర్‌లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. -
ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదోన్నతి
సాక్షి, న్యూఢిల్లీ: ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు సోమవారం జాబితా విడుదలైంది. జడ్జిలుగా పదోన్నతి పొందిన వాళ్లలో కొనగంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు. -
ఏపీ కొత్త సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నియమితులు కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు, న్యాయమూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నట్లు భోగట్టా. అలాగే, ఎనిమిది మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ.. ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలిజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఏపీకి మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నట్లు సమాచారం. కొలిజియం సిఫార్సులను అధికారికంగా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా గురించి.. జస్టిస్ మిశ్రా ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెపె్టంబరు 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
TS: హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నియమితులు కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది. కొలీజియం ఇటీవల సమావేశమై పలు హైకోర్టుల సీజేలు, న్యాయ మూర్తుల బదిలీపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 8 మంది న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడంతోపాటు ఐదుగురు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు, 28 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలని కేంద్రానికి కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు పంజాబ్ –హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు రానున్నట్లు తెలియవచ్చింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అమర్నాథ్ గౌడ్ త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కానున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేపథ్యమిదీ... మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 1961 నవంబర్ 30న జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ జన్మించారు. ఆయన తండ్రి బీఎన్ శర్మ వ్యవసాయవేత్తగా ప్రసిద్ధి చెందారు. జబల్పూర్ వర్సిటీ వీసీగా పని చేశారు. ఆయన తల్లి శాంతిశర్మ జబల్పూర్ విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జస్టిస్ సతీశ్‌చంద్ర ప్రాథమిక విద్యా భ్యాసాన్ని క్రైస్ట్‌చర్చ్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో, జబల్పూర్ సెంట్రల్ స్కూల్లో 12 వరకూ చదివారు. 1981లో డాక్టర్ హరిసింగ్‌గౌర్ వర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. అదే యూనివర్సిటీ నుంచి న్యాయ పట్టా అందుకొని 1984 సెప్టెంబర్ 1న మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజ్యాంగం, సేవలు, సివిల్, క్రిమినల్ చట్టాలపై మంచి పట్టున్న జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ... 1993 మే 28న కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా, 2004 జూన్ 28న కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానెల్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాదిగా గౌరవం పొందారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన... 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఆసక్తిగల చదువరి. ఆయన పలు విశ్వవిద్యాలయాలకు సేవలందించారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ సలహా బోర్డులో సేవలందించారు. న్యాయశాస్త్రంలో వివిధ అంశాలపై పరిశోధనా వ్యాసాలు, పత్రాలు రాశారు. ఈ ఏడాది జనవరి 4న కరా>్ణటక హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవలే కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. -
మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో వరసగా వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బొంబాయి హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని గతంలో సిఫారసు చేసిన సుప్రీం కొలిజీయం శనివారం దానిని వెనక్కి తీసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద జస్టిస్ పుష్ప ఇటీవల ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. ఆ తీర్పుల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే శాశ్వత జడ్జిగా నియామకం సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సుప్రీం వర్గాలు వెల్లడించాయి. పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి దిగితే శరీరంతో నేరుగా శరీరాన్ని (స్కిన్ టు స్కిన్) తాకకపోతే పోక్సో చట్టం కింద నేరం కాదంటూ కేసు నుంచి నిందితుడిని విముక్తుడిని చేశారు. మరో కేసులో బాధితురాలి చేతులు గట్టిగా పట్టుకొని, ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడికాదని కేసు కొట్టేశారు. మరో రెండు కేసుల్లో బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రని చేయడం సాధ్యం కాదని, బాధితురాలి సాక్ష్యాన్ని పరిగణించడం కుదరదంటూ వరసగా వివాదాస్పద తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం కొలీజియం జనవరి 20న సమావేశమై పుష్పను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఆమె తీర్పులు వివాదాస్పదం కావడంతో సుప్రీం కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
సుప్రీం కొలీజియంలోకి జస్టిస్ యు.యు.లలిత్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ యు.యు.లలిత్ నూతనంగా చేరారు. జస్టిస్ ఆర్.భానుమతి పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో జస్టిస్ లలిత్ కొలీజియం ఐదో సభ్యుడయ్యారు. కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ ఉన్నారు. అత్యున్నత న్యాయ స్థానంలోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియం సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీలను కొలీజియం ఎంపిక చేసి, ప్రభుత్వానికి పేర్లను ప్రతిపాదిస్తుంది. జస్టిస్ లలిత్ కొలీజియంలో 2022లో పదవీ విరమణ చేసే వరకు కొనసాగుతారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్‌సేన్‌రెడ్డిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సోమవారం సిఫారసు చేసింది. న్యాయవాదుల కోటా నుంచి ఆయన పేరును రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విజయసేన్‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. పడాల రామిరెడ్డి లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేసి 1994 డిసెంబర్ 28న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఆయన తండ్రి జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి.. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత మద్రాస్, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చేసి 2005 మార్చి 2న పదవీ విరమణ చేశారు. ఉమ్మడి ఏపీ మానవహక్కుల కమిషన్ తొలి చైర్మన్‌గా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాలకు లోకాయుక్తగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పనిచేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డికి విజయ్‌సేన్‌రెడ్డి మేనల్లుడు. న్యాయవాదిగా విజయ్‌సేన్‌రెడ్డికి మంచి పేరుంది. అన్ని స్థాయి కోర్టుల్లోనూ కేసుల్ని వాదించారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో రాజ్యాంగపరమైన కేసులతో పాటు సివిల్, క్రిమినల్ కేసులను వాదించడంలో మంచిపేరు సంపాదించారు. ఆయన వద్ద ఎంతోమంది న్యాయవాదులు జూనియర్లుగా చేశారు. ప్రస్తుతం ఆయన వద్ద 20 మంది జూనియర్లు ఉన్నారు. క్రీడల పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. టేబుల్‌టెన్నిస్, టెన్నిస్, స్విమ్మింగ్ పోటీల్లో పలు బహుమతులు సాధించారు. న్యాయ శాస్త్రాన్నే కాకుండా ఇంగ్లిష్, తెలుగు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. పుస్తక పఠనం ఆయన అభిరుచి. కాగా, విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి కేంద్రం సమ్మతి తెలిపి రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత న్యాయమూర్తిగా నియమితులవుతారు. ప్రస్తుతం హైకోర్టులో 24 మంది న్యాయమూర్తుల పోస్టులకు గాను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 12 మంది ఉన్నారు. విజయ్‌సేన్‌రెడ్డి నియామకం అయితే ఇంకా 11 పోస్టులు ఖాళీగా ఉంటాయి. 2019 మే 1న జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కన్నుమూశారు. విజయ్నేన్రెడ్డికి తాత 104 ఏళ్ల బి.ఆగారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయవాదులు.. బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారిల పేర్లకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదముద్ర వేసింది. వీరి ముగ్గురి పేర్లను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు మొత్తం ఆరుగురి పేర్లను హైకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో కృష్ణమోహన్, సురేష్ రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్‌రెడ్డి, జీఎల్ నర్సింహారావు, కె.మన్మథరావులు ఉన్నారు. తాజాగా ఈ జాబితాపై చర్చించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు.. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన కొలీజియం ముగ్గురి పేర్లను కేంద్రానికి పంపింది. ఈ ముగ్గురిలో లలితకుమారి పిన్న వయస్కురాలు. ప్రస్తుతం ఆమె వయసు 48 ఏళ్ల 11 నెలలు. వీరి పేర్లకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే, రాష్ట్రపతి నియామక ఉత్తర్వులిస్తారు. -
అనిరుద్ధా బోస్, ఏఎస్ బోపన్నకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి
-
ప్రమోషన్లకు అర్హతే ప్రామాణికం
సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరు జడ్జిల పదోన్నతి విషయంలో కేంద్రం అభ్యంతరాలను కొలిజియం తోసిపుచ్చింది. జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని తిరిగి న్యాయశాఖకు సిఫార్సు చేసింది. జార్ఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ అనిరుద్ధా బోస్, గౌహతి హైకోర్టు సీజే జస్టిస్ ఏఎస్ బోపన్నకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలంటూ ఏప్రిల్ 12న కొలిజియం కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే సీనియారిటీ, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రీజియన్ కారణాలుగా పేర్కొంటూ... ఈ ఇద్దరి ప్రమోషన్‌ను న్యాయశాఖ తోసిపుచ్చింది. దీనిపై స్పందించిన కొలిజియం.. పదోన్నతికి అర్హతే ప్రామాణికమని స్పష్టం చేసింది. జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ ఏఎస్ బోపన్నకు సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ ఇవ్వాలని మళ్లీ ప్రతిపాదిచింది. అలాగే, బోంబే హైకోర్టు జడ్జ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సూర్యకాంత్‌కు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సహా మొత్తం 31మంది న్యాయమూర్తులకు చోటుంది. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో 27మంది జడ్జిలున్నారు. -
మా సిఫారసులనే తిరస్కరిస్తారా?
కేంద్రానికి ఆ హక్కు ఎక్కడిదన్న సుప్రీంకోర్టు కొలీజియం - న్యాయ నియామకాల విధివిధానాల సవరణల్లో మార్పులు చేయాలని సూచన - ‘ఎంఓపీ’ని కేంద్రానికి తిప్పి పంపిన కొలీజియం న్యూఢిల్లీ: న్యాయ నియామకాలకు సంబంధించి తాము చేసిన సిఫారసులను జాతీయ ప్రయోజనాల పేరుతో తిరస్కరించటానికి ప్రభుత్వానికి ఏ హక్కు ఉందని సుప్రీంకోర్టు కొలీజియం ప్రశ్నించింది. సుప్రీంకోర్టుకు, 24 హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి మార్గదర్శకం చేసే విధివిధానాల పత్రం (మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ - ఎంఓపీ)ని కేంద్ర ప్రభుత్వం సవరించి పంపించగా.. అందులో కొన్ని నియమాలను మార్చాలని సూచిస్తూ కొలీజియం శనివారం నాడు ప్రభుత్వానికి తిప్పిపంపించింది. దీంతో దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థ - న్యాయవ్యవస్థకు మధ్య మరోసారి ఘర్షణ తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. భారత ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఈ ఎంఓపీని పూర్తిగా తిరస్కరించలేదని, కొన్ని మార్పులు మాత్రమే సూచించిందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ► కొలీజియం చేసిన సిఫారసులను ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల రీత్యా తిరస్కరించవచ్చంటూ కేంద్రం తాజాగా చేసిన సవరణ.. ఆ సిఫారసులను కొలీజియం పునరుద్ఘాటించినట్లయితే ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించేలా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ► అలాగే.. కొలీజియం చేసిన ఏదైనా సిఫారసును కేంద్రం ఒకసారి తిరస్కరించినట్లయితే.. కొలీజియం దానిని పునరుద్ఘాటించినప్పటికీ కేంద్రం తప్పనిసరిగా పునఃపరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా తాజా సవరణలో చేర్చటాన్ని కొలీజియం వ్యతిరేకించింది. ► సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, పదోన్నతుల్లో కేంద్రంలో అటార్నీ జనరల్‌కు, రాష్ట్రాల్లో అడ్వొకేట్ జనరళ్ల నిర్ణయానికి చోటుండాలంటూ కేంద్రం చేసిన సవరణపైనా కొలీజియం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల.. న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్షంగా తమ నిర్ణయాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని కొలీజియం వ్యాఖ్యానించింది. ► అలాగే.. ప్రస్తుతం ఒక సిఫారసు చేసిన తర్వాత న్యాయమూర్తిని నియమించటానికి దాదాపు మూడు నెలల కాలం పడుతోందని.. ఆ సమయాన్ని తగ్గించేందుకు గల మార్గాలను చూపాలని కూడా కొలీజియం కోరినట్లు సమాచారం. ► కొలీజియం వ్యవస్థను మరింత పారదర్శకంగా చేసేందుకు.. న్యాయ నియామకాలకు సంబంధించిన ఎంఓపీని సమీక్షించి, పునఃలిఖించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా.. కేంద్రం ఆ మేరకు ఎంఓపీలో సవరణలు సూచించింది. ఇందులో అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి కీలక పాత్ర పోషించారు. దీన్ని న్యాయమంత్రి సదానందగౌడ గత మార్చిలో సీజేఐకి పంపించారు. ఈ సవరణలపై కొలీజియం లేవనెత్తిన అంశాల విషయంలో కేంద్రం అటార్నీ జనరల్ అభిప్రాయం కోరినట్లు తెలిసింది.