జస్టిస్ యు.యు.లలిత్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ యు.యు.లలిత్ నూతనంగా చేరారు. జస్టిస్ ఆర్.భానుమతి పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో జస్టిస్ లలిత్ కొలీజియం ఐదో సభ్యుడయ్యారు. కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ ఉన్నారు. అత్యున్నత న్యాయ స్థానంలోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియం సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీలను కొలీజియం ఎంపిక చేసి, ప్రభుత్వానికి పేర్లను ప్రతిపాదిస్తుంది. జస్టిస్ లలిత్ కొలీజియంలో 2022లో పదవీ విరమణ చేసే వరకు కొనసాగుతారు.
Comments
Please login to add a commentAdd a comment