bhanumathi
-
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో.. యువజంట విషాదం!
మహబూబ్‌నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్‌కుంటలో చోటుచేసుకుంది.అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్‌కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్‌కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సీఐ రవీందర్, ఏఎస్ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
సినిమా కోసం భానుమతి గారి ఇంటికి వెళ్లే కానీ ..!
-
సుప్రీం కొలీజియంలోకి జస్టిస్ యు.యు.లలిత్
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ యు.యు.లలిత్ నూతనంగా చేరారు. జస్టిస్ ఆర్.భానుమతి పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో జస్టిస్ లలిత్ కొలీజియం ఐదో సభ్యుడయ్యారు. కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ ఉన్నారు. అత్యున్నత న్యాయ స్థానంలోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు కొలీజియం సభ్యులుగా ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జీలను కొలీజియం ఎంపిక చేసి, ప్రభుత్వానికి పేర్లను ప్రతిపాదిస్తుంది. జస్టిస్ లలిత్ కొలీజియంలో 2022లో పదవీ విరమణ చేసే వరకు కొనసాగుతారు. -
పేదింటి పిల్ల
చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లికి లోకం తెలియదు. ఇద్దరు చెల్లెళ్లకు ఊహే తెలియదు. తల్లి కోర్టు చుట్టూ తిరుగుతోంది. తిరుగుతోంది.. తిరుగుతోంది. భానుమతి పెద్దయ్యే వరకు.. ‘పరిహారం’ ఆ ఇంటి దరి చేరలేదు! ఆ పేదింటి భానుమతే.. జస్టిస్ భానుమతి. ‘సుప్రీం’ జడ్జిగా నిన్న రిటైర్ అయ్యారు. జూలై 20 జస్టిస్ ఆర్. భానుమతి పుట్టిన రోజు. నేడు ఆమె 66 ఏళ్ల వయసులోకి ప్రవేశించారు. నిన్ననే సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. మూడు రోజుల ముందే.. శుక్రవారం ‘వర్చువల్’గా జరిగిన వీడ్కోలు సమావేశంలో జడ్జిగా తన ముప్పై ఏళ్ల అనుభవంలో ‘అకారణమైన అవరోధాలు అనేకం’ ఎదురైనట్లు చెప్పారు. బహుశా అవి తర్వాత ఎప్పుడైనా పుస్తకంగా రావచ్చు. వీడ్కోలులో మాత్రం ఆ అవరోధాల గురించి ఆమె మాట్లాడలేదు. న్యాయ వ్యవస్థలోని అనివార్యమైన జాప్యానికి తను, తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లు బాధితులైన ఒక విషయాన్ని మాత్రం పంచుకున్నారు. భానుమతికి ఊహ తెలుస్తున్నప్పుడు న్యాయం కోసం తన తల్లి చేసిన పోరాటాన్ని కళ్లారా చూసిన రోజులు అవి. భానుమతి ‘లా’ చదవడానికి ఆ పోరాటం ఒక ప్రేరణగా పనిచేసి ఉండొచ్చు. జస్టిస్ భానుమతిని మరొక రకంగా కూడా గుర్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్భయ కేసు దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయడంలో న్యాయపరమైన అడ్డంకులు తలెత్తుతున్నందున వారిని ఎవరికి వారుగా ఉరి తీయడానికి అనుమతించమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను తోసిపుచ్చి, నలుగురికీ ఒకేసారి శిక్ష అమలు చేయాలన్న ఆదేశాలను ఇస్తూ.. కళ్లు తిరిగి పడిపోయిన జడ్జి.. భానుమతే. అయితే అది ఆమె బేలతనానికి చిహ్నం కాదు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల అలసటలోంచి వచ్చిన తూలిపాటు. వాస్తవానికి 2014లో ఆమె సుప్రీంకోర్టు జడ్జిగా వచ్చిన నాటి నుంచి, నలుగురు దోషులకు మార్చి 20 ఉదయం ఉరి శిక్ష అమలయే ముందరి గంట వరకు నిర్భయ కేసులో వాదోపవాదాలు విన్న ధర్మాసనంలో జస్టిస్ భానుమతి ఉన్నారు. ‘ఎ గ్రేట్ జడ్జ్’ అంటారు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ ఆమెను. ఇక సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దుష్యుంత్ దావే అభిప్రాయంలోనైతే.. ‘ఎ ఫియర్స్లీ ఇండిపెండెంట్ జడ్జ్’! దేనినైనా విభేదించవలసి వస్తే జస్టిస్ భానుమతి ఏమాత్రం సంశయించరని దావే తరచు చెబుతుంటారు. భానుమతి దైవ నిర్ణయం అనే భావనను బలంగా విశ్వసిస్తారు. ‘‘జీసెస్ మనకు ఏదైనా రాసి పెట్టి ఉంటే, దానినిక ఎవరూ మార్చలేరు’’ అని.. వీడ్కోలు సమావేశంలో చెప్పారు ఆమె. హిందూ కుటుంబం ఉంచి వచ్చిన భానుమతి చిన్నతనంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. భానుమతికి బాగా చిన్నగా ఉన్నప్పుడే ఆమె తండ్రి బస్సు ప్రమాదంలో చనిపోయారు. తల్లి, ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లుండేది తమిళనాడులోని ఉతంగరై అనే చిన్న గ్రామంలో. బంధువులు లేరు. తెలిసినవారు లేరు. తండ్రి స్నేహితులు నష్టపరిహారం కోసం భానుమతి తల్లి చేత కోర్టులో కేసు వేయించారు. ఆ కేసు ఏళ్ల పాటు నడిచింది. ఏళ్ల పాటు భానుమతి తల్లిని కోర్టు చుట్టూ నడిపించింది. నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ‘డిక్రీ’ ఇచ్చినప్పటికీ ఆ పరిహారం అందడానికి పిల్లలు పెద్దవాళ్లు అవవలసి వచ్చింది. ఆ ప్రత్యక్ష అనుభవం భానుమతిని ‘లా’ వైపు మళ్లించినట్లుంది. చెన్నైలోని డాక్టర్ అంబేడ్కర్ ప్రభుత్వ ‘లా’ కళాశాలలో చదివారు. ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ సుప్రీం కోర్టు వరకు ఎదిగారు. నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘ఇప్పుడు చాలా నయం. కేసు ఎందుకు ఆలస్యం అవుతోందో తెలుసుకోడానికి ఉంటోంది. టెక్నాలజీ వచ్చాక కేసు ఎంత వరకు వచ్చిందీ, కేసులో ఏం జరుగుతోంది అనే సమాచారం అందుబాటులో ఉంటోంది’’ అని అన్నారు జస్టిస్ భానుమతి. ఈ కోవిద్ సమయంలో ప్రత్యక్ష కోర్టు విచారణలపై కూడా ఆమె నిస్సంకోచంగా తన అభిప్రాయం చెప్పారు. జడ్జిల కమిటీ నిర్ణయం ఎలాంటిదైనా.. కోర్టుకు నేరుగా హాజరు కావాలన్న నిబంధన మాత్రం సరికాదు. కేసుల విచారణ కన్నా, మనుషుల ప్రాణాలు ముఖ్యం’’ అన్నారు భానుమూర్తి. ముఖ్య విశేషాలు ► 1988లో సెషన్స్ జడ్జిగా (తమిళనాడు) భానుమతి కెరీర్ మొదలైంది. ► 2003లో మద్రాసు హైకోర్టు జడ్జిగా పదోన్నతి. ► 2013లో జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం. ► 2014లో సుప్రీం కోర్టు జడ్జిగా పదవీ స్వీకారం. ► సుప్రీం కోర్టుకు జడ్జి అయిన ఆరవ మహిళగా, ఐదుగురు జడ్జిలు సభ్యులుగా ఉండే ‘కొలీజియం’ (న్యాయమూర్తుల నియామక సలహా మండలి) లో రెండో మహిళగా గుర్తింపు. కోలీజయంలో మొదటి మహిళ రూమాపాల్ 2006లో పదవీ విరమణ పొందారు. ► ప్రస్తుతం భానుమతి రిటైర్ అవడంతో సుప్రీంకోర్టులో ఇద్దరు మాత్రమే.. ఇందు మల్హోత్రా, ఇందిరా బెనర్జీ.. మహిళా జడ్జిలు ఉన్నట్లయింది. సుప్రీం కోర్టు చరిత్రలోనే ఒకేసారి ముగ్గురు మహిళా సిట్టింగ్ జడ్జిలు ఉండటం ఇదే మొదటిసారి. గత ఏడాది ఆగస్టులో తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్ కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు ప్రత్యేక ఆహ్వానంపై జస్టిస్ భానుమతి చెన్నై వచ్చినప్పటి చిత్రం. -
హైకోర్టుకు తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్
సాక్షి, అమరావతి: హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా బీఎస్ భానుమతి నియమితులయ్యారు. రిజిస్ట్రార్ జనరల్ పోస్టులో ఓ మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. భానుమతి ప్రస్తుతం విశాఖపట్నం, ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 30లోపు ఆమె కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. హైకోర్టు విభజన తరువాత చీకటి మానవేంద్రనాథ్ హైకోర్టు తొలి రిజిస్ట్రార్ జనరల్‌గా వ్యవహరించారు. ఆరు నెలల పాటు ఆర్జీగా ఉన్న ఆయన ఆ తరువాత హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. రిజిస్ట్రార్ (ఐటీ కమ్ సెంట్రల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్) బి.రాజశేఖర్ రిజిస్ట్రార్ జనరల్ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. తాజాగా బీఎస్ భానుమతిని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా జడ్జీల కోటా నుంచి భానుమతి, హరిహరనాథ శర్మ తదితరుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తి పదవికి 2018 సెప్టెంబర్‌లో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేశారు. 2019 ఏప్రిల్ 15న ఈమె పేరును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కొలీజియం, పదోన్నతిని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అప్పటి నుంచి వీరి పేర్లు సుప్రీంకోర్టు కొలీజియం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. -
పవన్ పార్టీ మొత్తం టీడీపీ కోవర్టులే
-
పవన్ మమ్మల్ని మోసం చేశాడు
పాత పోస్టాఫీసు (విశాఖ) : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తమ కుటుంబాన్ని మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉంటున్న తమను ఇంటి నుంచి వీధికీడ్చి దగా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడుగుల టికెట్ ఇస్తామని జనసేనలో చేర్చుకొని.. చివరకు టీడీపీ వాళ్లు గెలిచేలా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చాడని మండిపడ్డారు. బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన తన మనవడు రఘురాజుకు రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందని, మాడుగుల సీటు ఇస్తామని ఆహ్వానించడంతోనే జనసేనలో చేరామన్నారు. ఆయన చెప్పారనే.. ఇంటింటికీ తిరిగి ప్రచారం కూడా చేసుకున్నామన్నారు. కానీ ఇప్పుడు తన మనవడిని కాదని గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీలో గవిరెడ్డి రామానాయుడు, జనసేనలో గవిరెడ్డి సన్యాసినాయుడు సీట్లు సంపాదించుకోవడం వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రముఖ న్యాయవాది ఎర్రా సన్యాసినాయుడు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు రావాలంటే రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరముందన్న పవన్ కళ్యాణ్ ఇలా చేయడం దారుణమన్నారు. ఎర్రా రఘురాజు మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కల్పించి, సీటు కేటాయిస్తానని చెప్పి ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్ కేటాయించడం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందన్నారు. టీడీపీని గెలిపించడమే ధ్యేయంగా జనసేన నుంచి తమకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల చివరి నిమిషంలో సన్యాసినాయుడు నామినేషన్ ఉపసంహరించుకుని.. గవిరెడ్డి రామానాయుడు గెలవడానికి కృషిచేస్తాడనే ఆరోపణలున్నాయన్నారు. తమకు జరిగిన అన్యాయంపై పవన్‌ను ప్రశ్నిద్దామంటే ఆయన కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో న్యాయవాది జి.రామారావు పాల్గొన్నారు. -
‘పరిటాల కుటుంబసభ్యులే సూత్రధారులు’
అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులే సూరి హత్య కేసులో ప్రధాన సూత్రధారులని మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. సూరి హత్య కేసు తీర్పు అనంతరం గంగుల భానుమతి విలేకరులతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత కుటుంబీకులపై విచారణ జరిపి ఉంటే బాగుండేదన్నారు. భాను కిరణ్ ఓ కాంట్రాక్టు కిల్లర్ అని, పరిటాల సునీత కుటుంబం భానుకిరణ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే సంతోషించే వాళ్లమని చెప్పారు. భానుకిరణ్ విశ్వాసఘాతకుడని పేర్కొన్నారు. సూరి పేరు చెప్పి భానుకిరణ్ కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశారని వ్యాఖ్యానించారు. 2011 జనవరి 4న హైదరాబాద్‌లో గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెరువు సూరి హత్యకు గురయ్యాడు. సూరికి నమ్మకమైన అనుచరుడిగా ఉన్న భానుకిరణ్‌యే ఈ హత్యకు పాల్పడ్డాడు. కారు ముందు సీటులో కూర్చున్న సూరిపై వెనక సీటులో కూర్చున్న భానుకిరణ్ కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం పరారై మధ్యప్రదేశ్‌లో తలదాచుకున్నాడు. 2012, ఏప్రిల్‌లో భానుకిరణ్ అనూహ్యంగా జహీరాబాద్‌లో పోలీసులకు పట్టుబట్టాడు. సుదీర్ఘ విచారణ తర్వాత భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ హైకోర్టులో తీర్పు వెలువడింది. -
గోల్డెన్ బయోపిక్స్ ఇవి వస్తే బాగుండు!
భారతీయ సినిమాకు ఆద్యుడైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 1913లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించాడు. హరిశ్చంద్రుడు నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ సినిమా తీయడానికి దాదా సాహెబ్ ఫాల్కే కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ను తీయడం వెనుక పడిన కష్టాన్ని, తపనని, జీవితాన్ని ఆధారం చేసుకొని మరాఠీలో ‘హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ’ అనే సినిమా తీశారు 2010లో. మనకు సినిమా ఇచ్చిన మహనీయునికి సినిమా ద్వారా ప్రకటించగలిగిన నివాళి అది. కాని తెలుగులో అలాంటి నివాళి మరో ఎనిమిదేళ్లు గడిస్తే తప్ప రాలేదు. సావిత్రి పై తెరకెక్కించిన ‘మహానటి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తొలి బయోపిక్. అయితే సావిత్రి గురించి మాత్రమే బయోపిక్ తీస్తే సరిపోతుందా? నిజానికి మన ఇండస్ట్రీ ఎందరి బయోపిక్లకో బాకీ పడి ఉంది. అవన్నీ నిజరూపు దాలిస్తే తెలుగు ప్రేక్షకులకు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు. బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఎందరి బయోపిక్‌లు ఇంకా తీయవలసి ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ల జీవితం వెండితెర మీద ఎందుకు ఆసక్తికరమో కూడా పరిశీలిద్దాం. చిత్తూరు నాగయ్య ఒకరి జీవితం ఎప్పుడు ఆసక్తిగా ఉంటుందంటే ఆ జీవితంలో నాటకీయ పరిణామాలున్నప్పుడు. చిత్తూరు నాగయ్య తెలుగువారికి సంబంధించి చాలా పెద్ద సింగింగ్ స్టార్. ఇంకా చెప్పాలంటే సింగింగ్ స్టార్ల తరానికి ఆయన ఆఖరు ప్రతినిధి. ఆయన చూసిన స్టార్డమ్ అంతకు ముందు ఎవరూ చూడలేదు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన గీతాలను, సంగీతాన్ని తెలుగువారికి ఇచ్చారు. ఇక ఆయన దానధర్మాల గురించి చాలా కథలే ఉన్నాయి. అంత ఐశ్వర్యం చూసి ఆ తర్వాత దెబ్బ తినడం, కార్లు బంగళాలు పోగొట్టుకోవడం, తన తర్వాత వచ్చిన వారు స్టార్డమ్కు చేరుకున్నా కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో హుందాతనంతో గొప్ప గొప్ప పాత్రల్లో నటించడం ఇవన్నీ ఒక మంచి బయోపిక్కు విలువైన సరంజామా అవుతుంది. నాగయ్య బయోపిక్ వల్ల తొలినాటి తెలుగు సినిమా చరిత్ర కూడా చెప్పినట్టవుతుంది. కె.వి.రెడ్డి తెలుగు దర్శకులలో ఎవరి గురించైనా మొదటి బయోపిక్ తీయదలిస్తే కె.వి.రెడ్డే అందరి ఎంపిక అవుతారనేది వాస్తవం. జనాకర్షక సినిమా ఫార్ములాను కనిపెట్టి సూపర్‌డూపర్ హిట్స్ తీసిన కె.వి.రెడ్డి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ చిత్రాలతో మలుపు తిప్పారు. రాయలసీమ నుంచి వచ్చి మద్రాసులో స్థిరపడి నాగిరెడ్డి, చక్రపాణి వంటి ఉద్దండులతో కలిసి పని చేస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన కె.వి.రెడ్డి బయోపిక్ చాలా విలువైనది అవుతుంది. అసలు ఆయన ‘మాయాబజార్’ ఎలా తీసి ఉంటాడు అన్న ఒక్క అంశాన్ని తీసుకొని కూడా ఒక బయోపిక్ తీస్తే ఎంతో బాగుంటుందని అభిమానులు అనుకుంటే అందులో కాదనేమాట ఏమైనా ఉంటుందా? అదే జరిగితే పింగళి నాగేంద్రరావు, మార్కస్బాట్లే, ఆర్ట్ డైరెక్టర్ గోఖలే... వీళ్లను కూడా తెర మీద చూడొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్.టి.ఆర్ బయోపిక్ తయారవు తున్న సందర్భంగా నాగార్జునను అక్కినేని బయోపిక్ గురించి ప్రశ్నించినప్పుడు ‘అంత డ్రమెటిక్ సంఘటనలు ఏమున్నాయని నాన్నగారి జీవితంలో బయోపిక్ తీయడానికి’ అన్నారు. నిజానికి అక్కినేని జీవితంలో ఉన్న డ్రమెటిక్ సంఘటనలు మరొకరి జీవితంలో లేవు. ఆయనకు చదువు లేదు. నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి పోషించి బాడీ లాంగ్వేజ్ ప్రభావితం అయి ఉంది. మద్రాసు చేరుకున్నాక ముందు జానపద హీరోగా మారి ఆ తర్వాత సోషల్ హీరోగా స్థిరపడడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. గొంతు విషయంలో, పర్సనాలిటీ విషయంలో ఉన్న పరిమితులను జయించడానికి మరెంతో స్ట్రగుల్ చేశాడాయన. మరోవైపు గొప్ప కంఠం, పర్సనాలిటీ ఉన్న ఎన్.టి.ఆర్తో సరిసాటిగా నిలవడానికి, ఆత్మవిశ్వాసంతో పోరాడటానికి ఆయన చేసిన కఠోర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హైదరాబాద్‌కు వలస రావడం, స్టూ్టడియో కట్టడం, కెరీర్ పీక్‌లో ఉండగా మసూచి రావడం, గుండె ఆపరేషన్ వల్ల కెరీర్‌కే దూరమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడటం, వీటన్నింటిని జయించి పెద్ద హీరోగా కొనసాగగలగడం... ఇవన్నీ బయోపిక్ తీయడానికి ఎంతో సరిపోతాయి. జమున దక్షిణాది వారికి యమున తెలుసు. కానీ ఉత్తరాది పేరు జమునతో పాపులర్ అయిన అచ్చ తెలుగు స్టార్ జమున. తెలుగువారి తొలి లాంగ్ స్టాండింగ్ గ్లామర్స్టార్గా ఈమెను చెప్పుకోవచ్చు. భానుమతి, సావిత్రి, బి.సరోజ, రాజశ్రీ వంటి బొద్దు హీరోయిన్ల నడుమ సన్నగా, లావణ్యంగా ఉంటూ గ్లామర్‌ను మెయిన్‌టెయిన్ చేశారామె. పురాణాల్లో సత్యభామ కన్నా సినిమాల్లోని ఈ సత్యభామే తెలుగువారికి ఎంతో ప్రియం అంటే జమున ఆ పాత్రను ఎంత గొప్పగా పోషించారో తెలుస్తుంది. సత్యభామ తీరుకు తగినట్టుగానే జమునలో కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండు. కొన్ని స్పర్థల వల్ల ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ వంటి సూపర్స్టార్లు తమ సినిమాల నుంచి ఆమెను దూరంగా పెట్టినప్పుడు చెదరకుండా, కంగారుపడి రాజీ కుదుర్చుకోకుండా స్థిరంగా నిలబడి పోరాడిన వనిత ఆమె. ఆ సమయంలో హిందీలో కూడా నటించి అక్కడా పేరు గడించారు. హరనాథ్‌ను తెలుగువారి ఆల్టర్నేట్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో జమున పాత్ర ఎంతో ఉంది. రాజకీయాలలో కూడా సక్సెస్ అయిన జమున జీవితం ఒక మంచి బయోపిక్. రాజబాబు చార్లిచాప్లిన్ కథకు రాజబాబు కథకు అట్టే తేడా లేదు. ఒక కమెడియన్‌గా రాజబాబు సాధించినంత క్రేజ్ ఎవరూ సాధించలేదు. రాజబాబు పోస్టర్ మీద ఉంటే ఆ సినిమాలు ఆడేవి. రాజబాబు సినిమాలో ఉంటే డిస్ట్రిబ్యూషన్ చాలా సులువైపోయేది. మద్రాసులో అవకాశాలు రాక ముందు రాజబాబు ట్యూషన్లు చెప్పారు. పస్తులు పడుకున్నారు. తాను గొప్ప స్టార్ అయ్యాక ఖరీదైన కారు కొన్నాక ఏ పేవ్మెంట్ మీద పడుకున్నారో ఆ పేవ్మెంట్ దగ్గరకు వెళ్లి నిలుచునేవాడాయన. పేదల అవస్థలు అనుభవించినవాడు కనుక పేదలకు విపరీతమైన దాన ధర్మాలు చేసేవాడు. ఆయన ఉంటే తమను చూడరు అని పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్లో రాజబాబును పెట్టుకోవడానికి జంకేవారు. రాజబాబు కమెడియన్‌గా ఎంత దుడుకు హాస్యం చేసినా నిజ జీవితంలో తాత్వికుడు. హాస్యనటుడైన కిశోర్ కుమార్ గంభీరమైన సినిమాలు తీసినట్టే తెలుగులో రాజబాబు ‘మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి గంభీరమైన సినిమాలు తీశారు. మద్యపానం ఆయనను 48 ఏళ్ల వయసుకే మృత్యువును చేరువ చేసింది. రాజబాబు బయోపిక్ తీయడం అంటే పరోక్షంగా రమాప్రభ బయోపిక్ తీయడమే. ఒక గొప్ప హాస్యజంటను వెండితెర మీద నిక్షిప్తం చేయవచ్చు ఈ సినిమా తీస్తే. సూర్యకాంతం ఒక గయ్యాళి ప్రేక్షకులకు ఇంత అభిమానమైన వ్యక్తిగా మారగలదా? ఒక గయ్యాళి పేరును భావి తరాలలో ఎవరికీ పెట్టలేని స్థాయిలో ఆమె ముద్ర వేయగలిగిందా? ఒక నటి పేరే ఒక స్వభావం పేరుగా మారడం వెనుక ఆ నటి చేసిన ప్రయాణం ఏమిటి? సూర్యకాంతం కథ చెప్పుకోవడం అంటే తెలుగు సినిమాలో స్త్రీ సహాయక పాత్రల చరిత్ర చెప్పుకోవడమే. నాటి సినిమాలలోనే కాదు నేటి సీరియల్స్‌లో కూడా కథ నడవడానికి సూర్యకాంతం పాత్రే కీలకం అని గ్రహిస్తే ఆమె ఎన్ని సినిమాలను ప్రభావితం చేసి ఉంటుందో ఊహించవచ్చు. తెర జీవితానికి నిజ జీవితానికి పోలిక లేని ఈ నటి బయోపిక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పడంలో సంశయం లేదు. సూర్యకాంతం బయోపిక్ తీయడం అంటే రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభంల బయోపిక్‌ను పరోక్షంగా తీయడమే. ఈమె సినిమా తీయడం కష్టం కాకపోవచ్చు. కానీ ఈమె పాత్రను పోషించే నటిని వెతికి తేవడం మాత్రం కష్టం. ఎందుకంటే సూర్యకాంతం లాంటి సూర్యకాంతం మళ్లీ పుట్టలేదు కనుక. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బాలూ బయోపిక్ అంటే తెలుగు సినిమా సంగీత ప్రయాణాన్ని వెండితెర మీద చూడటమే. ఘంటసాల వంటి లెజండ్ మార్కెట్లో ఉన్నప్పుడు గాయకుడిగా నిలదొక్కుకోవడానికి బాలూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, కఠోర శ్రమతో ప్రయత్నించారు. సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఆయనను దగ్గరకు తీయడం, వారిద్దరి మధ్య అనుబంధం ఈ బయోపిక్‌లో ఒక ఎమోషనల్ పార్ట్ అవుతుంది. బాలూ పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అదీ ఆసక్తికరమైన మలుపు అవుతుంది కథలో. సూపర్ స్టార్ కృష్ణతో స్పర్థ ఒక ముఖ్య ఘట్టం. రామకృష్ణ విజృంభిస్తున్న రోజుల్లో ఏ.ఎన్.ఆర్కు పాడటానికి ఆయన ధోరణిని అనుకరించి హిట్ కొట్టడం, నెమ్మదిగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి ఆయన ప్రతిభ పరివ్యాప్తం కావడం ఎన్ని గంటల సినిమాకైనా ముడిసరుకే. బాలూ బయోపిక్‌లో తప్పనిసరిగా కనిపించే ఇతర పాత్రలు పి.సుశీల, ఎస్.జానకి, సంగీత దర్శకుడు చక్రవర్తి. బాలూ క్లోజ్‌ఫ్రెండ్, ఆయనకు సుదీర్ఘంగా సెక్రటరీగా పనిచేసిన విఠల్ కూడా ఒక ముఖ్య పాత్రధారి. బాలూకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కనుక ఆయన సినిమా అన్ని భాషలలో హిట్టయ్యే అవకాశం ఉంటుంది. వీరు మాత్రమే కాదు... ఎస్.వి.రంగారావు, ఘంటసాల, కత్తి వీరుడు కాంతారావు, బాపు–రమణ, సాలూరు రాజేశ్వరరావు, వాణిశ్రీ, హరనాథ్, దాసరి నారాయణరావు... వీరందరి బయోపిక్‌లు తీయదగ్గవే. కానీ బయోపిక్‌లు తీయడం కత్తిమీద సాము. గతంలో మణిరత్నం వంటి దర్శకులు కూడా ఎం.జి.ఆర్, కరుణానిధిలపై తీసిన బయోపిక్ ‘ఇద్దరు’ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. హిందీలో అజారుద్దీన్ పై తీసిన బయోపిక్ సఫలం కాలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కాంట్రవర్సీలు, ఎత్తి చూపదగ్గ అంశాలు ఉంటాయి. వాటిని కూడా ఒప్పించి బయోపిక్‌లు తీయగలిగితే కథలు లేని ఈ కాలాన వీటికి మించిన కథలు ఉండవు. -
నూరేళ్ల జీవితం
జీవితంలో తమ గొప్పత నానికి అందమైన ముసుగు కప్పుకున్న అపూర్వమైన నటులు– తెలుగు సినీ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు– శ్రీమతి పి. భానుమతి, ఎస్వీ రంగా రావు. ఎందుకు ఫోకస్. తమ గొప్పతనం తమకి తెలుసు. కానీ ఆ ‘గొప్పతనా నికి’ ‘అందమైన’ ఫ్రేమ్‌ని అలంకరించడంలో ఎన్నడూ వీగిపోని నటులు వీరిద్దరూ. వ్యక్తులుగా ఇద్దరూ నాకు తెలుసు. గొప్పగా కాదు. వారి వ్యక్తిత్వా లను పారదర్శకంగా అర్థం చేసుకునే పాటి. భానుమ తిగారితో కలిసి నటించాను. నిజానికి నా జీవితంలో నేను చూసిన తొలి నటీమణి భానుమతిగారే. ఎస్వీతో అంత పరిచయం లేదు. కానీ నేను రాసిన సినీమాల్లో నటించారు. అవేం గొప్ప పాత్రలు కావు. తెలుగు సినీ చరిత్రలోనే ‘బంగారు పాప’ లాగ చిర స్మరణీయం కావలసిన సందర్భం నా కలం నుంచి వచ్చినప్పటికే వేళ మించిపోయింది ఆయనకి. దశాబ్దాల కిందట– నేను విజయవాడలో పని చేసే తొలి రోజుల్లో– ఎందుకనో ఒక్క రోజు– ఒకే ఒక్క రోజు– పూర్తిగా ఆయనతో గడిపే అవకాశం కలసి వచ్చింది. బందరులో సభ. నా ప్రసంగం. ఆ సంబంధమే ఈ మాటలు చెప్పడానికి అర్హతని ఇచ్చాయి. రంగారావుగారు చాలా పెద్ద మనిషి. కానీ దూకుడు– ఎక్కువసార్లు తెచ్చిపెట్టుకున్నది. ఇక విచిత్రం ఏమిటంటే– కాళ్లకి పసుపూ, పారాణీ రాసుకుని పూజలూ, వ్రతాలూ చేసే సంప్ర దాయపరమైన తెలుగు ఇల్లాలు భానుమతి. చక్కని స్కాచ్‌ని సేవించే మహానటుడు రంగారావు. ఏనాడూ ఘటోత్కచుడు, కీచకుడు వంటి పాత్రల పరిధుల్ని అప భ్రంశం చెయ్యకపోగా ఒక్క చెయ్యి విసురులో శతా బ్దాలు దాటి వచ్చేసే పాత్రల్ని వాటి పరిధిలోనే నిలిపి నటించి, విదేశాల్లో కూడా బహుమతులు పుచ్చుకున్న గొప్ప నటుడు రంగారావు. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ గొప్పది. పరిధుల్ని మరిచిపోకుండా పసుపు రాసుకునే తెలుగు ఇల్లాలు వెండి తెర మీద 1956 నాటి డొరిస్ డే పాట "Que Sera Sera'ను ఇంగ్లీషులోనే నటించిన సాహసి. ఇప్పటికీ టీ.నగర్లో భానుమతిగారింట్లో– పూజగదిలో దేవుళ్ల పటాలకు ఆమె పేరు పేరునా బొట్లు పెట్టిన గదిని కొడుకు (అమెరికా నుంచి వచ్చిన డాక్టరు) అలాగే చూసుకుంటున్నాడు– భక్తిగా. ఎక్కడ ఘటోత్కచుడు? ఎక్కడ జగత్ జంత్రీలు, జగత్ కిలాడీలు పాత్రలు? మరి ఇద్దరినీ ఒకచోట దాచడమెందుకు? వారి అనుపమానమైన ‘ప్రతిభ’కి ‘పొగరు’కి అతి సముచితమైన ముసుగు కనుక. సంవత్సరాలు గడిచి– నేను మద్రాసులో ఆయ నింటికి చాలా దగ్గరలో సినీ రచయితగా జీవిస్తున్న సందర్భంలో మరొక్కసారి వారిని హబీబుల్లా రోడ్డులో వారి ఇంట్లో కలిశాను– ఒక కథ చెప్పడానికి. (కథకి సంబంధించిన ఏ వివరాలూ చెప్పను. జరగ లేదు కనుక). కథంతా సావధానంగా విన్నారు. నా రెండు చేతులూ పట్టుకుని ‘రాయండి మారుతీరావు గారు– ఇది నాకు మరొక ‘బంగారు పాప’ అవు తుంది’ అన్నారు. అప్పటికే ఆరోగ్యమూ, నటనమీద పట్టూ జారుతున్న రోజులు. ఆ రోజంతా మా నిర్మాత ‘భంగ్రా’ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు. సినీమాలో శ్రీరామాలయంలో ఓ భక్తుడి పాత్ర. షూటింగ్ బాజా భజంత్రీలతో చేశారు నిర్మాత. అంతే. కొద్ది రోజులకి ఎస్వీ కన్నుమూశారు. ఎక్కడో ఉన్న నేను వార్త విని గతుక్కుమన్నాను. నిర్మాతా, నేనూ, దర్శకుడూ– ఆ పాట రీలు తెప్పించుకుని చాలాసార్లు చూశాం. ఎన్నిసార్లు చూసినా, ఎటు చూసినా రంగారావుగారి విగ్రహాన్ని ఎవరు దాచ గలరు? అందరికీ గుండెలు జారిపోయాయి. ఆ తర్వాత జరిగింది– సినీమా కథ కాదు. సినీమా నెగిటివ్ కథ. ఎస్వీ రంగారావుగారి హఠాన్మరణం తెలుగు సినీ రంగానికీ, నటనకీ, వ్యక్తిగతంగా నాకూ– వెరసీ– నిర్మాతకీ జరిగిన నష్టం. కొందరి శరీరాలు పడి ఉంటాయి. కానీ ఆయన తల్చుకుంటే– శరీ రంలో ప్రతీ భాగం నటించేటట్టు చెయ్యగలడు. మరోసారి రాస్తున్నందుకు క్షమించాలి. ఎన్నో విలక్షణమైన పాత్రల్ని నటించిన భానుమతి అర మోడ్పు కన్నులతో కెమెరాకు నమస్కారం పెట్టినా– చక్కని విదేశీ ద్రవ్యాన్ని ఆరగించే ఘటోత్కచుడు– ఒక్కచేతి విసురుతో పాత్రని శతాబ్దాల ఇవతలకి విసి రేసినా ఏం జరుగుతుందని? కానీ అది కలలో కూడా జరగదు. కారణం వారి ద్దరూ అహంకారులు. సోమర్సెట్ మామ్ ఒక చోట అంటాడు: "Hypocrasy is a full time job' అని. వీరిద్దరూ చాలా ‘జాగ్రత్తపరులైన’ అహంకారులు. వారి స్వభావం ఏనాడైనా చెల్లేదే కానీ, చెల్లని ‘వదరు బోతుతనం’ కాదు. కనుకనే వందేళ్లలో ఒకే ఒక్క ఎస్వీ రంగారావు. ముక్కుమీద గుద్ది చెప్పాలంటే– ఒక్కరే భానుమతి. ఈ కాలమ్‌ని వారిద్దరూ పంచు కున్నా– వెండితెరమీద ఎవరి ఫ్రేమ్‌లు వారివే! రాజీ లేదు. ఇది నూరేళ్ల చరిత్ర. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
ఇప్పుడు భానుమతిగా..
తమిళసినిమా: ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో ఒదిగిపోవడం నటి అనుష్కకు వెన్నతో పెట్టిన విద్య. అరుంధతిలో అందంతో పాటు రౌద్రం చూపించినా, రుద్రమదేవిలో వీరత్వం చూపినా, బాహుబలిలో శౌర్యప్రరాక్రమాలను ప్రదర్శించినా, భాగమతిలో భయబ్రాంతులకు గురి చేసినా అద్భుతమైన నటనతో తనకు తానే అని చాటుకున్న అందరి స్వీటీ అనుష్క. త్వరలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న అనుష్క అంతకు ముందు ప్రఖ్యాత నటీమణి భానుమతిగా మారనున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఇతివృత్తంతో ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)గా తెరకెక్కుతున్న నడిగైయార్ తిలగం(తెలుగులో మహానటి) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పలు విశేషాలతో కూడుకున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో సావిత్రిగా యువ నటి కీర్తీసురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రను ఈమె పోషించడంపై సీనియర్ నటి, సావిత్రి సమకాలీన నటి జమున ఆక్షేపణను వ్యక్తం చేసినట్లు మీడియాల్లో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో చిత్రంపై మరింత ఉత్సుకత కలుగుతోంది. ఇందులో సావిత్రితో అనుబంధం ఉన్న పలువురు గొప్పగొప్ప నటీనటుల పాత్రల్లో యువ తారాగణం నటిస్తున్నారు. ముఖ్యంగా విలేకరి పాత్రలో నటి సమంత, సావిత్రి భర్త జెమినీగణేశన్‌గా మలయాళ యువ నటుడు దుల్కర్సల్మాన్, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అర్జున్‌రెడ్డి చిత్రం ఫేమ్ విజయ్‌దేవరకొండ, ఎస్వీ.రంగారావు పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా నటి భానుమతిగా అనుష్క నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ ఇదే నిజమైతే ఈ చిత్ర కలరే మారిపోతుంది. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - భానుమతి
-
మా బాపు...
గ్రీటింగ్ కార్డు, వెడ్డింగ్ కార్డు, క్యాలెండర్, పుస్తకాలు, కాఫీ కప్పులు... సర్వం బాపు మయం...ఏ స్తోత్రం చదివినా బాపు బొమ్మే... ఏ పుస్తకం తీసినా బాపు కవర్పేజీయే...సినిమాలు తీసి, బొమ్మలు వేసిన బాపు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారని వారి పిల్లలను అడిగితే...కుమార్తె భానుమతి, కుమారులు వేణుగోపాల్, వెంకటరమణ తమ అనుభవాలను పంచుకున్నారు. నాన్న కోసం తాండ్ర తెస్తే, దాన్ని చాకుతో ముక్కలుగా కట్ చేసి అందరికీ పెట్టి, తాను చిన్న ముక్క మాత్రమే తినేవారు. సమోసాను కూడా కట్ చేసేవారు. ఏ వస్తువునూ డబ్బాలో దాచే అలవాటు లేదు. నాన్నకి బామ్మ చేసే స్వజ్జప్పాలంటే చాలా ఇష్టం. అందుకే బామ్మ వేడివేడిగా నాన్నకి, మామకి పెట్టమనేది నాన్నగారికి ఫలానా పాట ఇష్టం... అంటూ నిర్దిష్టంగా లేదు. ప్రతి పాటలోను అందంగా ఉన్న అంశం గురించి మాట్లాడేవారు. అయితే అప్పుడప్పుడు ‘బంగారు పిచిక’ చిత్రంలోని ‘పో... పోపో... నిదురపో...’ పాటలోని పదాల గురించి, సన్నగా వినిపించే సంగీతం గురించి మాత్రం మాట్లాడుతుండేవారు. ‘నాన్న ఎప్పుడూ బొమ్మలు వేసుకుంటూ, చదువుకుంటూ ఉండేవారు. నాన్నని డిస్టర్బ్ చేయొద్దని అమ్మ చెబుతుండేది. చెన్నైలో షూటింగ్ ఉంటే మాత్రం, షూటింగ్ అయిపోయాక మాతోనే గడిపేవారు. రాజమండ్రి లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుంటే మా కుటుంబం, మామ (ముళ్లపూడి వెంకటరమణ) కుటుంబం అందరం కలిసి వెళ్లేవాళ్లం. ‘ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలి, విడిపోకూడదు’ అని చెప్పేవారు నాన్న. ఇప్పటికీ అత్త (ముళ్లపూడి వెంకటరమణ భార్య శ్రీదేవి) మా కోసం ఇక్కడే ఉండిపోయింది’ అంటారు బాపు కుమార్తె భానుమతి. మామ (ముళ్లపూడి వెంకటరమణ), అమ్మ (భాగ్యవతి), ఒకరి తరవాత ఒకరు వెంటవెంటనే పోవడంతో, నాన్న తట్టుకోలేకపోయారు. నాన్న చాలా ఎమోషనల్ పర్సన్. అమ్మ పోయినప్పుడు ఎవరైనా పలకరించడానికి వస్తే, ‘నన్ను కాసేపు వదిలేయండి’ అని లోపలకు వెళ్లిపోయి, ఒంటరిగా కూర్చున్నారు. దాంతో చాలామందికి నాన్న మీద కోపం కూడా వచ్చింది... అంటూ నాన్నగారు బాధ పడిన సంఘటనలు గుర్తుచేశారు చిన్న కుమారుడు వెంకటరమణ. నాన్న మా ఎవ్వరి బొమ్మలు వెయ్యలేదు. ఒక్కోసారి మమ్మల్ని పిలిచి చెయ్యి ఇలా పెట్టు, కాలు అటు పెట్టు, కర్ర పట్టుకో అంటూ పోశ్చర్లు మాత్రం పెట్టించి, బొమ్మలు వేసేవారు. ఉత్తరం చదువుతూ కూర్చున్న అమ్మాయి బొమ్మ మొట్టమొదటిసారి వేసినప్పుడు అమ్మే మోడలింగ్. రెండోసారి అదే బొమ్మ నాన్న నన్ను కూర్చోబెట్టి వేశారు. బొమ్మ అంతా అయ్యాక నా పోజ్ మాత్రమే వేశారని అర్థమైంది. ఆడపిల్లలు బాగా చదువుకుని, బోల్డ్‌గా ఉండాలి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి అనేవారు. తెలుగు వచ్చినవాళ్లు వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడితే నాన్నకి చాలా కోపం వచ్చేది’ అంటూ తండ్రి తాలూకు తీపి జ్ఞాపకాలను వివరించారు భానుమతి. ‘ఎవరైనా ఫలానా టైమ్‌కి ఇంటికి వస్తామంటే ఆ టైమ్‌కి రెడీ అయిపోయేవారు. వాళ్లు ఆ టైమ్‌కి రాకపోతే చాలా అసహనంగా ఉండేవారు. నాన్న చాలా సెన్సిటివ్. తనతో మాట్లాడేవారి గొంతులో కొంచెం తేడా వచ్చినా చాలా బాధపడేవారు’ అని తండ్రిని గుర్తు చేసుకున్నారు వేణుగోపాల్.‘‘ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా, మేమందరం హడావుడి పడేవాళ్లం. నాన్న, మామ మాత్రం తెల్లటి ఇస్త్రీ బట్టలు కట్టుకుని, కాసేపు అందరితో సరదాగా గడిపి, వెంటనే మేడమీదకు వెళ్లిపోయి, పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండేవారు’’ అంటూ బాపురమణలను స్మరించుకున్నారు చిన్నకుమారుడు వెంకటరమణ. ‘‘సినిమాలలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇంట్లో ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కాదు. నాన్న, మామ వారిలో వారు చర్చించుకునేవారు.’’ అంటూ తండ్రి పడిన అంతర్మనధనం గుర్తు చేసుకున్నారు వేణుగోపాల్.‘‘మాకు బంగారం కొనాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా అన్నీ అమ్మే చూసేది. లౌకిక విషయాల మీద వారికి ఆసక్తి ఉండేది కాదు. అలాగే చాలామంది, నాన్నగారికి ‘రాముడు సాక్షాత్కరించాడా’ అని అడుగుతుంటారు. ‘తాను వేసే బొమ్మలకు తనకు రాముడు కనిపించాడని’ నాన్న ఎన్నడూ నాటకీయంగా మాట్లాడేవారు కాదు. కాని ఆ రాముడు కనిపించకుండా ఇన్ని బొమ్మలు వేయగలరా అని మేం అనుకుంటాం’’ అంటూ తండ్రి వేసిన వేలకొలదీ రాముడి బొమ్మలను తలుచుకుంటూ చెప్పారు కుమార్తె భానుమతి.‘‘నాన్నకి కులాలు మతాలు అంటే అస్సలు ఇష్టం లేదు. మేం ఫలానా కులం వాళ్లం అనే ఆలోచనే నాన్నకి లేదు. అందరూ మనుషులే. అందరం సమానమే అనే భావనతో పెంచారు మమ్మల్ని’’ అన్నారు వేణుగోపాల్. – డా. వైజయంతి ‘నాన్న చిత్రకారుడిగా చాలా బిజీగా ఉన్నప్పటికీ, ఎండాకాలం సెలవుల్లో మధ్యాహ్నం సమయంలో పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని రామాయణం కొన్ని వందలసార్లు చెప్పారు. ఇంట్లోనే 16ఎం.ఎం ప్రొజెక్టర్‌తో గోడ మీద స్క్రీన్ ఏర్పాటుచేసి సినిమాలు వేసి చూపించేవారు. – పెద్ద కుమారుడువేణుగోపాల్ మా చిన్నతనంలో పమేరియన్ కుక్కపిల్లను పెంచుకున్నాం. దానికి టిన్టిన్ అని కామిక్ పేరు పెట్టారు. అప్పుడప్పుడు ఆ కుక్క పిల్ల బొమ్మలు వేసేవారు. టిన్టిన్ చచ్చిపోయినప్పుడు, పిల్లలందరం బాగా ఏడవడం చూసి, ఇక ఎన్నడూ ఇంట్లో పెట్స్‌ని పెంచొద్దు అన్నారు. మేం ఏడిస్తే బహుశః ఆయనకి బాధ అనిపించి ఉంటుంది. – చిన్న కుమారుడువెంకటరమణ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - భానుమతి
-
ఒకే ఒక్క భారతీయ విదుషీమణి
- గొల్లపూడి మారుతీరావు, ప్రముఖ రచయిత, నటుడు నేను నా జీవితంలో ప్రత్యక్షంగా చూసిన మొదటి సినీ నటి - భానుమతి గారు. అది సరిగ్గా ఇప్పటికి 62 ఏళ్ళ క్రితం సంగతి. నాకు అప్పుడు పన్నెండేళ్ళు. విశాఖపట్నంలోని చిన్నం వారి వీధిలో ‘పూర్ణా పిక్చర్స్’ అధిపతి గ్రంథి మంగరాజు గారి ఇంటికి ఆమె వచ్చారు. మంగరాజు గారు ప్రసిద్ధ సినీ పంపిణీదారులు. విశాఖపట్నంలోని ‘పూర్ణా టాకీస్’ కట్టింది ఆయనే. అప్పుడే భానుమతి గారి ‘ప్రేమ’ (1952) చిత్రం విడుదలైంది. కారు దిగి, ఇంట్లోకి వెళుతున్న ఆమెను చూస్తే, ఒక మెరుపు తీగలా కనిపించింది. ఆ తరువాత నా జీవితంలో చాలామంది సినీ తారల్ని చూశాను. ఆ పైన నేనూ వాళ్ళలో ఒకణ్ణయ్యాను కానీ, అంత అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటీమణిని నేనెన్నడూ చూడలేదు. ముగ్ధుల్ని చేసే...ఆ ‘మల్లీశ్వరి’ దృశ్యం: భానుమతి గారి సినిమాలంటే, నాకు ఇప్పటికీ ఠక్కున గుర్తొచ్చేది - ‘మల్లీశ్వరి’ (1951). ఆ సినిమా నాటికి ఆవిడ ఓ 8 - 9 చిత్రాలు చేసి ఉంటారేమో! అందులో నాగరాజు పాత్ర పోషించిన (ఎన్టీ) రామారావు గారికి అది తొలి ఆరేడు చిత్రాల్లో ఒకటనుకుంటా! అప్పటికి రామారావు గారు తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఇంకా పట్టుకోని రోజులవి. ఆ సినిమా చూస్తుంటే, ఆవిడ బాడీ లాంగ్వేజ్‌కు ఏ మాత్రం దగ్గరగా రామారావు గారు కనిపించరు. అయితేనేం, అటు మల్లీశ్వరిగా భానుమతి గారు, ఇటు నాగరాజుగా రామారావు గారి జంట ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. నా జీవితంలో నేను ముగ్ధుణ్ణయిన ఒక్క షాట్‌ను చెప్పమంటే - ‘మల్లీశ్వరి’లోని ఒక ఘట్టం చెబుతాను. తిరునాళ్ళకు వెళ్ళి, నాగరాజు, మల్లీశ్వరి తిరిగి వస్తూ, వర్షం వల్ల ఒక మందిరంలో తలదాచుకున్నప్పుడు, రాయల వారు - తిమ్మరుసు మారువేషాల్లో చూస్తారు. మల్లికి రాణివాసం పల్లకీ పంపమని వాళ్ళతో నాగరాజు అంటాడు. అలా చెప్పినప్పుడు, అతణ్ణి వెక్కిరిస్తూ మల్లి ‘పంపించండి సామీ! రాణివాస ప్పల్లకీ!’ అని గమ్మత్తై కంఠంతో, హావభావాలతో చెబుతుంది. ఈ ఒక్క షాట్ కోసం - ‘మల్లీశ్వరి’ని చూడండి. ఇప్పటికే ‘మల్లీశ్వరి’ని చూసేసిన వాళ్ళు కూడా ఈ షాట్ కోసం మళ్ళీ ‘మల్లీశ్వరి’ని చూస్తే, నా అంత ముగ్ధులవుతారని ఆ సినిమా విడుదలైన ఇన్నేళ్ళ తరువాత ఈ 2014లో కూడా నేను ఢంకా బజాయించి చెప్పగలను. అదీ భానుమతి గారి ప్రతిభ. నటుడిగా నేను ఆమెకు లొంగిన క్షణం: అయితే, ఈ ఇమేజ్‌కు ఒక నెగటివ్ పార్శ్వం కూడా ఉంది. ఆవిడ ఎంత ఇండివిడ్యువలిస్టిక్ ఆర్టిస్ట్ అంటే, ఒక్క ‘మల్లీశ్వరి’ తప్ప, లేదా ‘మల్లీశ్వరి’కి ముందు వచ్చిన ఏ ‘స్వర్గసీమ’ (1945) లాంటి పిక్చర్లోనో తప్ప, మిగతా అన్ని సినిమాల్లోనూ, అన్ని పాత్రల్లోనూ ఒక్క భానుమతే కనిపిస్తుంది. భానుమతి అనే ఒక వ్యక్తిత్వం ఆమె చేసిన ఏ పాత్రకూ ఒదగలేదు. అందుకే, ఆవిడ భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు నేను ‘కీ.శే. మల్లీశ్వరి అస్తమయం’ అని రాశాను. ఆవిడ ఏ పాత్రనూ, ఎదుట నటించే ఏ నటుడినీ తన కన్నా ఒక అడుగు ఎక్కువ ఎత్తున నిలబడనివ్వలేదు. దానికి ఉదాహరణ నా అనుభవమే. పన్నెండేళ్ళప్పుడు చూసినందుకే తన్మయుడినైన నేను, అలాంటి భానుమతి గారితో కలసి నటించే అవకాశం ఒకే ఒక్కసారి వచ్చింది - ‘మంగమ్మ గారి మనవడు’ (1984)లో! నేను స్వతహాగా రచయితను గనక, ఆమె డైలాగ్‌కు కౌంటర్‌గా నేను నా డైలాగ్‌ను మలుచుకొని చెప్పబోయాను. అంతే! ఆమె నవ్వుతూనే, ‘గొల్లపూడి గారూ! మీరు ఆ మాట అంటే, నేను మరో మాట అంటాను’ అని సున్నితంగా అన్నారు. నేను అభిమానించే నా సీనియర్ గనక, నా పాత్ర ద్వారా ఆమెకు లొంగిపోయాను. రచయితగా ఆమె చిత్రాలకు వేటికీ పని చేసే అవకాశం నాకు కలగలేదు. కానీ, వ్యక్తిగతంగా నేనంటే ఆమెకు ఎంతో గౌరవం ఉండేది. ఒకసారి మద్రాసులో శాస్త్రి హాలులో ఏదో సభ జరుగుతోంది. అందులో ఆమె ప్రసంగిస్తున్నారు. ఆమె మాట్లాడుతుండగా, నేను హాలులోకి వెళ్ళాను. భానుమతి గారు తన ప్రసంగం ముగిస్తూ, ‘నా తరువాత గొల్లపూడి మారుతీరావు గారు మాట్లాడతారు... నా కన్నా చాలా గొప్పగా’ అంటూ మైకు వదిలి వచ్చి, కూర్చున్నారు. అంత గౌరవం, అభిమానం, మాటలో చమక్కు చూపేవారు ఆవిడ. స్వాభిమానం మాటున మంచుముద్ద: ఒక వ్యక్తిగా చెప్పాలంటే, భానుమతి గారు ఎప్పుడూ తన ఒంటి మీద ‘స్వాభిమానం’ అనే అంగీని తొడుక్కొని ఉండేవారు. అది దాటి చూడగలిగితే, ఆమె ఆర్ద్రతతో, మంచు ముద్ద కాగలిగిన మంచి తల్లి. ఇది నాకు వారి అబ్బాయి డాక్టర్ భరణి కళ్ళ నిండా నీళ్ళతో స్వయంగా చెప్పిన విషయం. భానుమతి గారి లాంటి పెద్దావిడ ఒక వ్యక్తి సామర్థ్యానికి వాత్సల్యంతో లొంగిపోయిన సందర్భం నాకు తెలిసి - ఒకే ఒక్కటి! ఒకే ఒక్కరి విషయంలో! అది మా వాసు (చిన్నవయసులోనే కన్నుమూసిన యువ దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్). ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రానికి మా వాసు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. ఆ కుర్రాడంటే విపరీతమైన అభిమానం ఆవిడకి! వాడి ఉత్సాహం, చురుకుదనం, ప్రతిభ చూసి ఆమె ఎంత ముచ్చటపడేవారో! ఆశ్చర్యం ఏమిటంటే, ఆవిడ మా ఇంటికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ, వాణ్ణి తన దగ్గరకు పిలిపించుకొనేవారు. వాసు ఆకస్మిక మరణం తరువాత ‘గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశాక, ఒక ఏడాది అవార్డు కార్యక్రమానికి భానుమతి గారిని పిలవడానికి వెళ్ళాను. అప్పటికే, ఆమె వార్ధక్యంలో ఉన్నారు. వయసు మీద పడ్డ సింహపు రాణిలా ఉన్నారు. ‘ఆ కుర్రాడంటే నాకు చాలా ఇష్టం. కానీ, నేను అంతసేపు కూర్చోలేను మారుతీరావు గారూ!’ అన్నారు. చిన్నప్పుడు నా కళ్ళ ముందు మెరిసిన మెరుపుతీగను అలా చూసేసరికి కళ్ళు చెమర్చగా, వెనక్కి తిరిగి వచ్చేశాను. సంప్రదాయాలు విడవని సినీ నటి: చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అంత గొప్ప సినీ నటి అయినప్పటికీ, భానుమతి గారు సంప్రదాయానికి ఎప్పుడూ విడాకులు ఇవ్వలేదు. ఆవిడ పూజ గదిలో కుంకుమబొట్లు పెట్టిన వాళ్ళ అమ్మా నాన్న గార్ల ఫోటో నేను చూశాను. ఆమె భర్త - సినీ దర్శకుడు పి. రామకృష్ణారావు గారి ఫోటో నేను చూశాను. అంత పెద్ద నటి, తాను సినిమాల్లో నటించే రోజుల్లో కూడా శ్రావణ శుక్రవారాలకు కాళ్ళకూ, ముఖానికీ పసుపు రాసుకొనేవారని నిర్మాత బి. నాగిరెడ్డి గారి పెద్ద కూతురు నాతో స్వయంగా చెప్పారు. సినీ రంగానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారికి ఆమె ఒక మాట ఇచ్చిందట - ప్రతి సినిమాలోనూ తప్పనిసరిగా ఒక త్యాగరాయ కీర్తన పాడతానని! కర్ణాటక సంగీతం పట్ల, త్యాగరాజ స్వామి పట్ల, తన సంగీతం మీద ఎన్నో ఆశలు పెట్టుకొన్న తండ్రి గారి పట్ల ఆమెకున్న భక్తిప్రపత్తులకు ఇది నిదర్శనం. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో భానుమతిది ఓ చరిత్ర. నటన, రచన, సంగీతం, గానం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ - అలా ఏకంగా 9 అంశాల్లో తనదైన ప్రతిభతో జాతీయ స్థాయిలో బహుమతులందుకొన్న ఒకే ఒక్క భారతీయ విదుషీమణి - పాలువాయి భానుమతి! -
దేనికైనా రాసిపెట్టి ఉండాలి!
అపురూపం మనం తినే ప్రతి బియ్యపు గింజ మీదా మన పేరు రాసి ఉంటుందంటారు! నిజమే... మనకు దక్కాలని రాసిపెట్టి లేకపోతే, ఏదీ దక్కదు. నోటిదాక వచ్చిన కూడు ఆఖరిక్షణంలో నేలపాలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలాంటి ‘ఆఖరి క్షణపు’ అద్భుతాలకు, ఆశ్చర్యాలకు నెలవు... సినిమా ఫీల్డ్. కొన్ని పాత్రలకు ఎవర్నో అనుకుని, ఇంకెవర్నో తీసుకుంటారు. ఉదాహరణకు ‘మిస్సమ్మ’ సినిమానే తీసుకోండి. ఈ సినిమా లేకపోతే సావిత్రి లేదు. ఆమె కెరీర్‌కి ఓ గొప్ప టర్నింగ్ ఇది. నిజానికి ఈ పాత్ర భానుమతిది. నాలుగురీళ్ల షూటింగ్ కూడా జరిగిపోయింది. వరలక్ష్మీ వ్రతం చేసుకుని గంట ఆలస్యంగా షూటింగ్‌కి వచ్చిందని, నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి కయ్‌మన్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌కి ముందే ఇన్ఫామ్ చేశానని భానుమతి గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. దాంతో చిలికి చిలికి గాలివాన అయ్యింది. చక్రపాణి కోపంతో అప్పటికప్పుడు షూట్ చేసిన రీళ్లన్నీ తెప్పించి తగల బెట్టేశారు. భానుమతి వెళ్లిపోయింది. మళ్లీ రాలేదు. ఆ ప్లేస్‌లో సావిత్రి వచ్చింది. గోల్డెన్ చాన్స్ ఆమెకు. ‘మిస్సమ్మ’ సావిత్రికి పెద్దబ్రేక్ ఇచ్చింది. అదంతా ఓ చరిత్ర. ఒకవేళ భానుమతి ‘మిస్సమ్మ’ చేసుంటే... ఎలా ఉండేదో కదా! ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలానే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ మధ్య వంశీ ‘దొంగరాముడు అండ్ పార్టీ’ అనే సినిమా తీశారు. శ్రీకాంత్ హీరో. సుహాసిని అనే కొత్తమ్మాయిని నాయికగా తీసుకున్నారు. ఫొటో సెషన్ కూడా చేశారు. అంతా ఓకే అనుకుని, లాస్ట్ మినిట్‌లో లయను తీసుకున్నారు. ఈ సుహాసిని ఆ తర్వాత ‘చంటిగాడు’ సినిమాతో హీరోయిన్గా ఎంటరైంది. నాగార్జున హీరోగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘డాన్’ సినిమా గుర్తింది కదా! ఇందులో మొదట హీరోయిన్గా మమతా మోహన్‌దాస్‌ని తీసుకున్నారు. ఓపెనింగ్ కూడా జరిగింది. కట్ చేస్తే - తర్వాత ఆ ప్లేస్‌లో అనుష్క వచ్చారు. మమత ఇక్కడ చాన్సు మిస్సయినా, తర్వాత ‘కింగ్’, ‘కేడీ’ సినిమాల్లో నాగ్‌తో కలిసి యాక్ట్ చేశారు. -సేకరణ: శ్రీబాబు -
అపురూపం: స్టార్ డైరెక్టర్స్...
యాక్షన్... చెప్పింది చేయడం! డెరైక్షన్... చెప్పి చేయించుకోవడం!! కొందరికి యాక్షన్ ఈజీ! ఇంకొందరికి డెరైక్షన్ ఈజీ! చాలా కొద్దిమందికే రెండూ ఈజీ! ఎన్టీఆర్, భానుమతి, సావిత్రి, ఎస్.వి.రంగారావు... నటులుగా ఈ నలుగురూ ఆ రోజుల్లో అద్భుతాలు చేసినవారే! అటు దర్శకులుగా కూడా విజయాలు చవిచూసినవారే! ఈ తరానికి ఈ సంగతి అంతగా తెలీకపోవచ్చు. పెద్ద స్టార్ దర్శకత్వం వహించడమన్నది భానుమతితోనే ప్రారంభం! 1953లో ‘చండీరాణి’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి దర్శకత్వం వహించి సంచలనం రేపారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవ స్టిల్ ఇది. దాదాపు 20 ఏళ్ల తరువాత మళ్లీ ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అసాధ్యురాలు’... వంటి 8 చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఎన్.టి.రామారావు ‘సీతారామకళ్యాణం’ చిత్రం తో మొదలుపెట్టి, ‘శ్రీకృష్ణ పాండవీయం’, ‘వరకట్నం’, ‘దానవీర శూరకర్ణ’ వంటి 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాను నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దానవీర శూరకర్ణ’ చిత్రంలో అభిమన్యుడి పాత్రధారి అయిన తనయుడు బాలకృష్ణకు తనకు కావలసిన విధంగా మేకప్‌ను సరిదిద్దుతున్న స్టిల్ ఇది. ఇక 1967, 68 - ఈ రెండు సంవత్సరాలలో ‘చదరంగం’, ‘బాంధవ్యాలు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎస్.వి.రంగారావు. ‘బాంధవ్యాలు’ చిత్రం షూటింగ్లో కెమెరా యాంగిల్‌ను చూసుకుంటున్న ఎస్.వి.రంగారావు. మహానటి సావిత్రి 1968-72... ఈ ఐదేళ్ల కాలంలో ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘చిన్నారి పాపలు’, ‘చిరంజీవి’, ‘మాతృదేవత’, ‘వింత సంసారం’... ఈ నాలుగు తెలుగు చిత్రాలకు, ‘కుళందై ఉళ్ళం’, ‘ప్రాప్తం’ అనే రెండు తమిళ చిత్రాలనూ దర్శకత్వం వహించారు. ‘చిరంజీవి’ చిత్రం సెట్‌పై నటులు ప్రభాకరరెడ్డి, చలంలకు సూచనలు ఇస్తున్న సావిత్రి! ఆ రోజుల్లో క్షణం తీరిక లేని స్టార్స్ వీరు! అయినా... దర్శకత్వం వహించారు. కారణం... దర్శకత్వంపై ఉన్న ఇష్టం! అసలు ‘సినిమా’ అంటేనే వారికి ఇష్టం. అందుకే... నటించారు... నిర్మించారు... దర్శకత్వం వహించారు... వెళ్లిపోయారు! ‘సినిమా’ అనే కారణం కోసం పుట్టారు! కారణం పూర్తవగానే వెళ్లిపోయారు! కారణజన్ములు వాళ్లు! - నిర్వహణ: సంజయ్ కిషోర్ sanjjaykkishor@gmail.com -
నీకెంత పొగరుంటే నాకు పొగరంటావ్!?
ఆత్మాభిమానానికి చీరకడితే ఎలా ఉంటుంది? అని ఆ మధ్య ఓ పెద్దాయన్ను అడిగితే... అచ్చు భానుమతిలా ఉంటుందని అన్నాట్ట. ఆ సమాధానంలో ఆవగింజంత కూడా అతిశయోక్తి లేదు. కొండంత అభిమాన ధనం, ఆకాశమంత అభిమాన గణం వెరసి భానుమతి రామకృష్ణ. విషయపరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ మాటను అంగీకరించాల్సిందే. ‘నా పక్క హీరోలు అనిపించుకునేంత కెపాసిటీ మీ ఇద్దరికి గాక ఎవరికుంది’ అని నాటి అగ్ర హీరోలను సైతం ప్రశ్నించేంత అభిజాత్యం భానుమతి సొంతం. దానికి తగ్గట్టు ఆ ఇద్దరు హీరోలు కూడా భానుమతి విషయంలో కాస్తంత నమ్రతగానే ఉండేవారట. నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతిలోని బహుముఖ ప్రజ్ఞ తెలియని వారు చాలా అరుదు. అలాగే... భానుమతిలోని అసలైన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు కూడా చాలా అరుదే. పెళుసుగా ఉండే ఆ మాట తీరు, గంభీరమైన ఆ ఆహార్యం, రాజసం ఉట్టిపడే ఆ నవ్వు... ఇవన్నీ చూసి.. ‘అహంభావం.. గర్వం.. పొగరు..’ అనేవారు చాలామంది ఉన్నారు. అసలు ఆ మాటకొస్తే... సరస్వతికి ప్రతిరూపమైన భానుమతికి అవన్నీ ఉండటంలో తప్పేంటి? అవన్నీ ఆమెకు ఆభరణాలే. నిజానికి అహంభావిలా కనిపించే ఆ మహాకళాకారిణి మనసు చాలా సున్నితం. అప్పట్లో ఓ తుంటరి జర్నలిస్ట్... కెరీర్ ప్రారంభంలోనే తనలోని ఫైర్ చూపించేద్దామని ఇంటర్వ్యూలో తొలి ప్రశ్నే... ‘మీకు పొగరంటగా?’ అని భానుమతిని అడిగాట్ట. ‘నీకెంత పొగరుంటే నాకు పొగరంటావ్’ అని ఆ జర్నలిస్ట్‌ని ఎదురు ప్రశ్నించి... అతని ఎక్స్ప్రెషన్ మారగానే... పకపకా నవ్వేశారట భానుమతి. ఆమెలోని చిలిపితనానికి ఇదొక ప్రతీక. అదే పత్రికకు భానుమతి ఓ కథ రాసి ఇచ్చారు. దానికి ఇదే జర్నలిస్ట్గారు అందరితో పాటే పారితోషికం కింద ఇరవై రూపాయలు భానుమతికి మనియార్డర్ చేశాట్ట. సదరు పత్రికాధినేత వద్దని వారిస్తున్నా... ‘అంతపెద్ద సూపర్‌స్టార్‌కి, రచయిత్రికి.. ఇంత తక్కువ మొత్తాన్ని మనియార్డర్ చేయడం అవమానించినట్టవుతుంది’ అని మొత్తుకుంటున్నా.. లెక్క చేయకుండా మనియార్డర్ చేశాట్ట ఆ డేరింగ్ జర్నలిస్ట్. రెండో రోజు... ఆ పత్రికా కార్యాలయానికి ఫోన్ రింగ్ అయ్యింది. ఆ జర్నలిస్ట్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతల భానుమతి. జర్నలిస్ట్ గుండె గుభేల్. ‘ఇరవై రూపాయలు మనియార్డర్ పంపి నన్ను అవమానిస్తావా? ఎంత పొగరు నీకు’ అంటూ చడామడా తిట్టేస్తారని తత్తరపడిపోయాడు ఆ జర్నలిస్ట్. కానీ భానుమతి గొంతులో అతననుకున్నంత ఆవేశం లేదు. కొండంత ఆనందం గోచరిస్తోంది. ‘థ్యాంక్సండీ.. లక్షలు పారితోషికం తీసుకున్నప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. నా కథకు మీరందించిన ఇరైవె రూపాయల పారితోషికం నాకు కోటి రూపాయల పెట్టు. ఇప్పుడే ఆ ఇరవై రూపాయలతో షాపింగ్ చేసేశాను. రెండు జాకెట్ ముక్కలు కొనుక్కున్నాను. మా వారికి నాలుగు కర్చీఫ్ తీసుకున్నాను. మా అబ్బాయికి ఓ ఇంక్ బాటిల్ కొన్నాను. థ్యాంక్సండీ’ టకటకా చెప్పేస్తున్నారు భానుమతి. అవతల జర్నలిస్ట్ షాక్. ఇంటర్కమ్లో సంభాషణ వింటున్న సదరు పత్రికాధినేత కూడా షాక్. భానుమతిలోని అల్ప సంతోషానికి ఇదొక ప్రతీక. ఇంతకీ ఆ జర్నలిస్ట్ ఎవరో చెప్పనేలేదు కదూ. ఆయన ఎవరోకాదు. మన ముళ్లపూడి వెంకటరమణ.. సినిమా పుట్టాక... చాలామంది స్త్రీమూర్తులు ఈ రంగంలో రాణించారు. కానీ భానుమతి ఆర్జించిన కీర్తిని, ఆమె సాధించిన ఘనతను మాత్రం ఏ స్త్రీ సాధించలేదన్నది నిర్వివాదాంశం. అందుకే భానుమతి ఎప్పటికీ చిరంజీవే. - బుర్రా నరసింహా