దేనికైనా రాసిపెట్టి ఉండాలి! | it's all fate to do something | Sakshi
Sakshi News home page

దేనికైనా రాసిపెట్టి ఉండాలి!

Published Sun, Jan 12 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

దేనికైనా రాసిపెట్టి ఉండాలి!

దేనికైనా రాసిపెట్టి ఉండాలి!

 అపురూపం
  మనం తినే ప్రతి బియ్యపు గింజ మీదా మన పేరు రాసి ఉంటుందంటారు!
 నిజమే... మనకు దక్కాలని రాసిపెట్టి లేకపోతే, ఏదీ దక్కదు.
 నోటిదాక వచ్చిన కూడు ఆఖరిక్షణంలో నేలపాలైనా ఆశ్చర్యపోనవసరం లేదు.
 ఇలాంటి ‘ఆఖరి క్షణపు’ అద్భుతాలకు, ఆశ్చర్యాలకు నెలవు... సినిమా ఫీల్డ్.
 కొన్ని పాత్రలకు ఎవర్నో అనుకుని, ఇంకెవర్నో తీసుకుంటారు.
 ఉదాహరణకు ‘మిస్సమ్మ’ సినిమానే తీసుకోండి.
 ఈ సినిమా లేకపోతే సావిత్రి లేదు.
 ఆమె కెరీర్‌కి ఓ గొప్ప టర్నింగ్ ఇది.


 నిజానికి ఈ పాత్ర భానుమతిది. నాలుగురీళ్ల షూటింగ్ కూడా జరిగిపోయింది. వరలక్ష్మీ వ్రతం చేసుకుని గంట ఆలస్యంగా షూటింగ్‌కి వచ్చిందని, నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి కయ్‌మన్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌కి ముందే ఇన్‌ఫామ్ చేశానని భానుమతి గట్టిగా రిటార్ట్ ఇచ్చారు. దాంతో చిలికి చిలికి గాలివాన అయ్యింది. చక్రపాణి కోపంతో అప్పటికప్పుడు షూట్ చేసిన రీళ్లన్నీ తెప్పించి తగల బెట్టేశారు. భానుమతి వెళ్లిపోయింది. మళ్లీ రాలేదు. ఆ ప్లేస్‌లో సావిత్రి వచ్చింది. గోల్డెన్ చాన్స్ ఆమెకు. ‘మిస్సమ్మ’ సావిత్రికి పెద్దబ్రేక్ ఇచ్చింది. అదంతా ఓ చరిత్ర. ఒకవేళ భానుమతి ‘మిస్సమ్మ’ చేసుంటే... ఎలా ఉండేదో కదా!


 ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలానే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఆ మధ్య వంశీ ‘దొంగరాముడు అండ్ పార్టీ’ అనే సినిమా తీశారు. శ్రీకాంత్ హీరో. సుహాసిని అనే కొత్తమ్మాయిని నాయికగా తీసుకున్నారు. ఫొటో సెషన్ కూడా చేశారు. అంతా ఓకే అనుకుని, లాస్ట్ మినిట్‌లో లయను తీసుకున్నారు. ఈ సుహాసిని ఆ తర్వాత ‘చంటిగాడు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది.


 నాగార్జున హీరోగా లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘డాన్’ సినిమా గుర్తింది కదా! ఇందులో మొదట హీరోయిన్‌గా మమతా మోహన్‌దాస్‌ని తీసుకున్నారు. ఓపెనింగ్ కూడా జరిగింది. కట్ చేస్తే - తర్వాత ఆ ప్లేస్‌లో అనుష్క వచ్చారు. మమత ఇక్కడ చాన్సు మిస్సయినా, తర్వాత ‘కింగ్’, ‘కేడీ’ సినిమాల్లో నాగ్‌తో కలిసి యాక్ట్ చేశారు.
 -సేకరణ: శ్రీబాబు
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement