భానుమతి, ఎస్వీయార్ (పాత ఫొటోలు)
జీవితంలో తమ గొప్పత నానికి అందమైన ముసుగు కప్పుకున్న అపూర్వమైన నటులు– తెలుగు సినీ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు కనిపిస్తారు– శ్రీమతి పి. భానుమతి, ఎస్వీ రంగా రావు. ఎందుకు ఫోకస్. తమ గొప్పతనం తమకి తెలుసు. కానీ ఆ ‘గొప్పతనా నికి’ ‘అందమైన’ ఫ్రేమ్‌ని అలంకరించడంలో ఎన్నడూ వీగిపోని నటులు వీరిద్దరూ. వ్యక్తులుగా ఇద్దరూ నాకు తెలుసు. గొప్పగా కాదు. వారి వ్యక్తిత్వా లను పారదర్శకంగా అర్థం చేసుకునే పాటి. భానుమ తిగారితో కలిసి నటించాను. నిజానికి నా జీవితంలో నేను చూసిన తొలి నటీమణి భానుమతిగారే. ఎస్వీతో అంత పరిచయం లేదు. కానీ నేను రాసిన సినీమాల్లో నటించారు. అవేం గొప్ప పాత్రలు కావు. తెలుగు సినీ చరిత్రలోనే ‘బంగారు పాప’ లాగ చిర స్మరణీయం కావలసిన సందర్భం నా కలం నుంచి వచ్చినప్పటికే వేళ మించిపోయింది ఆయనకి.
దశాబ్దాల కిందట– నేను విజయవాడలో పని చేసే తొలి రోజుల్లో– ఎందుకనో ఒక్క రోజు– ఒకే ఒక్క రోజు– పూర్తిగా ఆయనతో గడిపే అవకాశం కలసి వచ్చింది. బందరులో సభ. నా ప్రసంగం. ఆ సంబంధమే ఈ మాటలు చెప్పడానికి అర్హతని ఇచ్చాయి. రంగారావుగారు చాలా పెద్ద మనిషి. కానీ దూకుడు– ఎక్కువసార్లు తెచ్చిపెట్టుకున్నది. ఇక విచిత్రం ఏమిటంటే– కాళ్లకి పసుపూ, పారాణీ రాసుకుని పూజలూ, వ్రతాలూ చేసే సంప్ర దాయపరమైన తెలుగు ఇల్లాలు భానుమతి. చక్కని స్కాచ్‌ని సేవించే మహానటుడు రంగారావు. ఏనాడూ ఘటోత్కచుడు, కీచకుడు వంటి పాత్రల పరిధుల్ని అప భ్రంశం చెయ్యకపోగా ఒక్క చెయ్యి విసురులో శతా బ్దాలు దాటి వచ్చేసే పాత్రల్ని వాటి పరిధిలోనే నిలిపి నటించి, విదేశాల్లో కూడా బహుమతులు పుచ్చుకున్న గొప్ప నటుడు రంగారావు. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ గొప్పది. పరిధుల్ని మరిచిపోకుండా పసుపు రాసుకునే తెలుగు ఇల్లాలు వెండి తెర మీద 1956 నాటి డొరిస్ డే పాట "Que Sera Sera'ను ఇంగ్లీషులోనే నటించిన సాహసి. ఇప్పటికీ టీ.నగర్‌లో భానుమతిగారింట్లో– పూజగదిలో దేవుళ్ల పటాలకు ఆమె పేరు పేరునా బొట్లు పెట్టిన గదిని కొడుకు (అమెరికా నుంచి వచ్చిన డాక్టరు) అలాగే చూసుకుంటున్నాడు– భక్తిగా.
ఎక్కడ ఘటోత్కచుడు? ఎక్కడ జగత్ జంత్రీలు, జగత్ కిలాడీలు పాత్రలు? మరి ఇద్దరినీ ఒకచోట దాచడమెందుకు? వారి అనుపమానమైన ‘ప్రతిభ’కి ‘పొగరు’కి అతి సముచితమైన ముసుగు కనుక.
సంవత్సరాలు గడిచి– నేను మద్రాసులో ఆయ నింటికి చాలా దగ్గరలో సినీ రచయితగా జీవిస్తున్న సందర్భంలో మరొక్కసారి వారిని హబీబుల్లా రోడ్డులో వారి ఇంట్లో కలిశాను– ఒక కథ చెప్పడానికి. (కథకి సంబంధించిన ఏ వివరాలూ చెప్పను. జరగ లేదు కనుక). కథంతా సావధానంగా విన్నారు. నా రెండు చేతులూ పట్టుకుని ‘రాయండి మారుతీరావు గారు– ఇది నాకు మరొక ‘బంగారు పాప’ అవు తుంది’ అన్నారు. అప్పటికే ఆరోగ్యమూ, నటనమీద పట్టూ జారుతున్న రోజులు. ఆ రోజంతా మా నిర్మాత ‘భంగ్రా’ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు.
సినీమాలో శ్రీరామాలయంలో ఓ భక్తుడి పాత్ర. షూటింగ్ బాజా భజంత్రీలతో చేశారు నిర్మాత. అంతే. కొద్ది రోజులకి ఎస్వీ కన్నుమూశారు. ఎక్కడో ఉన్న నేను వార్త విని గతుక్కుమన్నాను. నిర్మాతా, నేనూ, దర్శకుడూ– ఆ పాట రీలు తెప్పించుకుని చాలాసార్లు చూశాం. ఎన్నిసార్లు చూసినా, ఎటు చూసినా రంగారావుగారి విగ్రహాన్ని ఎవరు దాచ గలరు? అందరికీ గుండెలు జారిపోయాయి. ఆ తర్వాత జరిగింది– సినీమా కథ కాదు. సినీమా నెగిటివ్ కథ.
ఎస్వీ రంగారావుగారి హఠాన్మరణం తెలుగు సినీ రంగానికీ, నటనకీ, వ్యక్తిగతంగా నాకూ– వెరసీ– నిర్మాతకీ జరిగిన నష్టం. కొందరి శరీరాలు పడి ఉంటాయి. కానీ ఆయన తల్చుకుంటే– శరీ రంలో ప్రతీ భాగం నటించేటట్టు చెయ్యగలడు.
మరోసారి రాస్తున్నందుకు క్షమించాలి. ఎన్నో విలక్షణమైన పాత్రల్ని నటించిన భానుమతి అర మోడ్పు కన్నులతో కెమెరాకు నమస్కారం పెట్టినా– చక్కని విదేశీ ద్రవ్యాన్ని ఆరగించే ఘటోత్కచుడు– ఒక్కచేతి విసురుతో పాత్రని శతాబ్దాల ఇవతలకి విసి రేసినా ఏం జరుగుతుందని?
కానీ అది కలలో కూడా జరగదు. కారణం వారి ద్దరూ అహంకారులు. సోమర్సెట్ మామ్ ఒక చోట అంటాడు: "Hypocrasy is a full time job' అని. వీరిద్దరూ చాలా ‘జాగ్రత్తపరులైన’ అహంకారులు. వారి స్వభావం ఏనాడైనా చెల్లేదే కానీ, చెల్లని ‘వదరు బోతుతనం’ కాదు. కనుకనే వందేళ్లలో ఒకే ఒక్క ఎస్వీ రంగారావు. ముక్కుమీద గుద్ది చెప్పాలంటే– ఒక్కరే భానుమతి. ఈ కాలమ్‌ని వారిద్దరూ పంచు కున్నా– వెండితెరమీద ఎవరి ఫ్రేమ్‌లు వారివే! రాజీ లేదు. ఇది నూరేళ్ల చరిత్ర.
వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment