
Gollapudi Maruthi Rao Wife Passed Away In Chennai: దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి(81) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దృవీకరించారు. 1961లో గొల్లపూడి మారుతీరావుతో ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
అప్పటి నుంచి వారు చెన్నైలోనే స్థిరపడ్డారు. కాగా 2019లో అనారోగ్యంగా గొల్లపూడి మరణించిన సంగతి తెలిసిందే. ఇక గొల్లపూడి మారుతీరావు భార్య మరణం గురించి తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.