Varisu Movie Art Director Sunil Babu Passes Away - Sakshi
Sakshi News home page

Varisu Art Director : 'వారీసు' రిలీజ్‌కు ముందే తీవ్ర విషాదం.. ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి

Published Fri, Jan 6 2023 9:17 AM | Last Updated on Fri, Jan 6 2023 9:29 AM

Varisu Movie Art Director Sunil Babu Passed Away - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా 'వారీసు'. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

వారీసు ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌ బాబు కన్నుమూశారు. గుండెపోటుతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటూనే గతరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కాగా సీతారామం, ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యం సహా ఎన్నో హిట్‌ సినిమాలకు ఆయన పనిచేశారు. సునీల్‌ బాబుకు భార్య, కూతురు ఆర్య సరస్వతి ఉన్నారు. అంత్యక్రియలు ఈరోజు(శుక్రవారం)జరిగే అవకాశం ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement