Varisu Movie
-
రష్మికను కేవలం పాటల కోసమే వాడుకున్నారు: పరుచూరి
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారసుడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాపై తాజాగా ప్రముఖ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. 'హీరోను పరిచయం చేసిన ఫస్ట్ షాట్ అద్భుతంగా ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేసిన విజయ్, వంశీలను అభినందించాలి. పెద్దింటి పేరెంట్స్‌కు ముగ్గురు కొడుకులు ఉంటారు. వారు ఇల్లు వదిలి వెళ్లిపోతే తిరిగి ఇంటికి తీసుకొచ్చే తమ్ముడి కథ ఇది. హీరో అమ్మచాటు బిడ్డ. కానీ నాన్న కోసం ఎంతో త్యాగం చేస్తాడు. తండ్రి బతికే అవకాశం లేదని తెలిసినప్పుడు మూడో కొడుకును తన స్థానంలో హెడ్‌గా కూర్చోబెడతాడు. దీంతో కోపంతో మిగతా ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. తన సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, అలాంటి వారి బారి నుంచి కాపాడాలంటే చిన్నవాడే బెటర్ అనుకుంటాడు తండ్రి. ఎందుకంటే అప్పటికే పెద్ద కొడుకు శ్రీకాంత్‌కు ఒకరితో ఎఫైర్ ఉంటుంది. రెండో కుమారుడు సొంత కుటుంబానికే ద్రోహం చేయాలని చూస్తాడు. 2.49 గంటల సినిమాలో ప్రేమ చాలా తక్కువగా ఉంది. పాటల కోసం రష్మికను వాడుకున్నారు. ఉమ్మడి వ్యవస్థ, కుట్రలు, కుతంత్రాలు, విడిపోవడాలు.. వీటికి ఎక్కువ నిడివి ఇచ్చారు. దాన్ని కొంచెం కట్ చేసి హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఎక్కువ చూపించి ఉంటే బాగుండేది. ఓ సీన్లో విజయ్ను చైర్మన్‌గా ఎన్నుకోవడానికి తక్కువ ఓట్లు పడ్డాయి. అప్పుడు విజయ్ ఓటేసేవాళ్ల తప్పులను ఎత్తిచూపడంతో వెంటనే వారు మనసు మార్చుకుని హీరోకే ఓటేస్తారు. ఆ సీన్ బాగుంది. వందమందినైనా కొట్టే హీరో తన అన్నయ్య మీద ఒక్క దెబ్బ కూడా వేయడడు. మరొకటి.. తండ్రి అనారోగ్యాన్ని తల్లికి, అన్నలకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడతాడు. అయితే ఒకానొక దశలో తండ్రి సామ్రాజ్యం కుప్పకూలేట్లుగా ఉంటే హీరో దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలను హీరో ఇంటికి తీసుకొచ్చేస్తాడు. లెవంత్ అవర్‌లో తండ్రి అస్థికలు నదిలో కలిపినట్లు చూపించారు. అంతా బాగుంది కానీ ఆ షాట్ చూపించకపోయుంటే బాగుండేది. అస్థికలు కలిపినట్లు కాకుండా హీరోయిన్‌తో హీరో పెళ్లి చేసి తండ్రి అక్షింతలు వేసినట్లు చూపించాల్సింది. ఎంతో కష్టపడ్డ హీరో తండ్రిని కాపాడుకోలేనట్లు చూపించకుండా.. 'నాన్నా.. అంతా సెట్ చేశాను. ఇక నేను తిరిగి అమెరికా వెళ్లిపోతున్నాను' అని చెప్పి ఉంటే బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకో పావుగంటయినా పెంచాల్సింది. అలాగే శ్రీకాంత్‌తో ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయి ఏమైందో చూపించలేదు? చిన్నచిన్న పొరపాట్లు మినహా సినిమా బాగుంది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి. -
ఆ స్టార్ హీరోల సినిమాను తిరస్కరించిన సాయి పల్లవి
డాక్టర్ అవ్వాల్సిన సాయిపల్లవి యాక్టర్ అయ్యారు. అయితే తన గురించి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సాయి పల్లవి బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమైన నటి అని. ఈమె ఒక చానల్ నిర్వహించిన యార్ ప్రభుదేవా అనే కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాతే మలయాళంలో ప్రేమమ్ చిత్రంతో కథానాయక పరిచయం అయ్యారు. ఆ ఒక్క చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. వెంటనే తెలుగులో అవకాశాలు తలుపుతట్టాయి. తెలుగులో ఆమె నటించిన ఫిదా, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు విజయం సాధించడంతో కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. తమిళంలో ధనుష్‌కు జంటగా మారీ–2, సూర్యతో ఎన్జీకే చిత్రాల్లో నటించారు. అయితే ఇక్కడ మారీ–2 చిత్రం మినహా ఇతర చిత్రాలేవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయినా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించడానికి సాయిపల్లవి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ సరసన నటిస్తున్న ఒక్క చిత్రం మాత్రమే ఈమె చేతిలో ఉంది. కాగా ఇటీవల ఇద్దరు తమిళస్టార్ హీరోల సరసన నటించే రెండు అవకాశాలను సాయిపల్లవి తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఎవరో కాదు నటుడు విజయ్, అజిత్ కావడం విశేషం. విజయ్ కథానాయకుడు నటించిన తాజా చిత్రం వారిసులో హీరోయిన్గా ముందు సాయిపల్లవినే అనుకున్నారట. అయితే ఆ చిత్రంలో కథానాయక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె నో చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత నటి రష్మికను ఎంపిక చేశారు. ఆమె కూడా తన పాత్రకు ప్రాధాన్యత లేదని తెలుసిన విజయ్ సరసన నటించాలన్న కోరికతోనే వారిసు చిత్రంలో ఆమె నటించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. సాయిపల్లవి నిరాకరించిన మరో చిత్రం వలిమై. అజిత్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు మొదట సాయిపల్లవినే అనుకున్నారట అయితే ఆ పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంతో ఆమె నిరాకరించినట్లు సమాచారం. నిజానికి ఈ రెండు చిత్రాల్లోనూ గ్లామర్‌కు అవకాశం లేకపోయినా నటనకు కూడా అవకాశం లేకపోవడంతో సాయిపల్లవి నో చెప్పినట్లు తెలిసింది.. -
అఫీషియల్: ఓటీటీలోకి వారసుడు.. అప్పటినుంచే స్ట్రీమింగ్
దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు/వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. థియేటర్లో చూసి చాలారోజులవుతుందని ఫీలవుతున్న విజయ్ ఫ్యాన్స్ ఎంచక్కా బుధవారం నుంచి మరోసారి వారసుడు మూవీ చూసేయొచ్చు. hold tight because the wait is over! here he comes 🤩#VarisuOnPrime, Feb 22 coming soon in Tamil, Telugu and Malayalam!#Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp pic.twitter.com/AM8xYn44bi — prime video IN (@PrimeVideoIN) February 17, 2023 #VarisuOnPrime #Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp @Cinemainmygenes @ramjowrites @rgvhari @ahishor @vaishnavi141081 @Yugandhart_ @SVC_official pic.twitter.com/CLIB7WyO5s — prime video IN (@PrimeVideoIN) February 17, 2023 #VarisuOnPrime #Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp @Cinemainmygenes @ramjowrites @rgvhari @ahishor @vaishnavi141081 @Yugandhart_ @SVC_official pic.twitter.com/xqPBlFyYEg — prime video IN (@PrimeVideoIN) February 17, 2023 చదవండి: ఉపాసనకు సీమంతం జరిపిన ఫ్రెండ్స్.. ఫోటోలు వైరల్ -
టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం కోలీవుడ్ స్టార్స్ క్యూ
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నారు. మన దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ హీరో-టాలీవుడ్ డైరెక్టర్ కాంబోలో ఇటీవల వచ్చిన సినిమాల్లో ‘ప్రిన్స్’ మొదటిది. తెలుగు దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో... తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ, డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్ లో టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన మూవీ - వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ కోలీవుడ్ లో 300 కోట్లు వసూళ్లు చేసింది. విజయ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా వారిసు రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కోలీవుడ్ బాక్సాపీస్ దగ్గర సక్సెస్ అందుకునేందుకు రెడీ అయ్యాడు. తొలిప్రేమ, మజ్ను, రంగ్ దే సినిమాలతో ఆకట్టుకున్నఈ డైరెక్టర్.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ‘వాతి’ అనే మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగులో సార్ పేరుతో ఈ నెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మాఫీయా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు డైరెక్టర్ కోలీవుడ్‌లో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ధనుష్.. వెంకీ అట్లూరి తోనే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. -
అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్?
తమిళ స్టార్ హీరో విజయ్-టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషల్లో వచ్చిన రీసెంట్ మూవీ వారీసు(తెలుగు వారసుడు). సంక్రాంతి కానుక తమిళంలో జనవరి 11న, తెలుగు జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక్కడ దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 210 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. చదవండి: SSMB28 సెట్లో క్రికెట్ ఆడిన తివిక్రమ్.. వీడియో వైరల్! ఏ సినిమా అయిన బాక్సాఫీసు ఫలితాన్ని బట్టి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్టార్ హీరో సినిమాల గురించి చెప్పనవసరం లేదు. థియేట్రికల్ రిలీజ్ అనంతరం రెండు నెలల తర్వాత ఆ చిత్రం ఓటీటీలోకి వస్తుంది. కానీ అంతకుమందే విజయ్ వారసుడు ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా భారీ ధరకు అమెజాన్ వారీసు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలస్తోంది. చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్‌లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట! విడుదలైన నెల రోజుల లోపే అంటే ఫిబ్రవరి 10న ఈ చిత్రం స్ట్రిమింగ్ కాబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజా బజ్ ప్రకారం వారసుడు ఫిబ్రవరి 22న అమెజాన్‌లో అందుబాటులోకి రానుందని సమాచారం. స్టార్ హీరో, పెద్ద బ్యానర్ సినిమా అయినందున వారసుడు చిత్రాన్ని నెల రోజుల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని అమెజాన్ నిర్వహుకులు భావిస్తున్నారట. అందుకే ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనుందట. త్వరలోనే అమెజాన్ దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వునుందని సమాచారం. -
అయితే ఏంటీ..? అది నా సొంత నిర్ణయం: రష్మిక
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారసుడు(వారిసు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో జనవరి 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. టాప్ హీరోయిన్ను ఈ చిత్రంలో కేవలం పాటలకే పరిమితం చేయడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా ఆమె వారసుడు సినిమాలో తన పాత్రపై తొలిసారి స్పందించింది. ప్రాధాన్యత లేకపోయినా కేవలం విజయ్ కోసమే ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలిపింది పుష్ప బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చింది భామ. రష్మిక మాట్లాడుతూ..'తన పాత్రకు స్కోప్ లేకపోయినా నటించా.అవును ఇది నా సొంత నిర్ణయం. నా ఇష్ట ప్రకారమే ఒప్పుకున్నా. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే వారసుడులో నటించా. ఇందులో నా పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని తెలుసు. రెండు పాటల కోసమేనని నాకు తెలుసు. ఈ విషయాన్ని సినిమా షూట్లో ఉన్నప్పుడు విజయ్‌కి సరదాగా చెప్పేదాన్ని. ఈ సినిమాలో నాకు పాటలు తప్ప ఏమీ లేవు అంటూ జోక్స్ వేసేదాన్ని. ఆయన కొన్ని విషయాలను కూడా నేర్చుకున్నా. అని అన్నారు. ఈ చిత్రంలో రష్మిత జిమిక్కి పొన్ను, రంజితమే పాటల్ తన డ్యాన్స్‌తో రష్మిక అదరగొట్టింది. ప్రస్తుతం రష్మిక సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘మిషన్ మజ్ను’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు రణ్‌బీర్ కపూర్, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’, అల్లు అర్జున్ పుష్ప-2 లో కనిపంచనుంది. -
దిల్రాజును ట్రోల్ చేసిన ప్రముఖ నిర్మాత.. వీడియో వైరల్
ఈమధ్యకాలంలో సోషల్‌మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఏది ఎప్పుడు, ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు ఊహించలేం. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా ట్రోల్స్ బారిన పడుతుంటారు. ఇటీవలి కాలంలో దిల్‌రాజు పేరు నెట్టింట బాగా వైరల్ అయ్యింది. వారీసు ప్రీరిలీజ్ ఈవెంట్లో తమిళం, ఇంగ్లీష్ కలిపి ఆయన మాట్లాడిన తీరు ఎంతలా ట్రోల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మీమ్స్, ట్రోల్స్ సహా చివరికి రివ్యూలు కూడా దిల్‌రాజు స్టైల్లో చెప్పి నెట్టింట తెగ హడావిడి చేశారు. తాజాగా నిర్మాత ఎస్కేఎన్ కూడా దిల్రాజును ఇమిటేట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన స్పీచ్ చివర్లో.. ఈ సినిమాలో కామెడీ ఇరిక్కు ఫైట్స్ ఇరిక్కు స్టొరీ ఇరిక్కు.. అంటూ దిల్రాజును ఇమిటేట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Swaggg Starrrrr @SKNonline 🔥 Total auditorium maamulu response kaadu pic.twitter.com/kIgO47vOqP — AYYAPPA REDDY (@lucky59000) January 20, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ 'వారీసు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్ సహా తెలుగులోనూ పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా భారీ ధరకు అమెజాన్ వారీసు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 10న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
అంతకుమించి సాధించేది ఏముంటుంది
‘‘వారసుడు’ సినిమా క్లయిమాక్స్‌లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మా మనసులను హత్తుకున్నాయి అంటూ ప్రతి రోజూ నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మా నాన్న కూడా ‘వారసుడు’ చూసి భావోద్వేగానికి లోనై ఇన్నేళ్లలో తొలి సారి నన్ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకుమించి నేను సాధించేది ఏముంటుంది?’’ అని డైరెక్టర్ వంశీ పైడిపల్లి అన్నారు. విజయ్, రష్మికా మందన్న జంటగా నటించిన తమిళ చిత్రం ‘వారీసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తమిళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో తెలుగులో డబ్ చేసి, ఈ నెల 14న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి పంచుకున్న విశేషాలు. ► ‘ఊపిరి’ని తెలుగు, తమిళ భాషల్లో తీశాం. ‘వారీసు’ని తమిళంలో తీసి, తెలుగులోకి డబ్ చేశాం. తమిళంలో నేను తీసిన తొలి సినిమా ‘వారీసు’ పెద్ద హిట్ కావడం హ్యాపీ. తెలుగులోనూ ఈ సినిమా త్వరలో ‘మాస్టర్’ (విజయ్ హీరోగా నటించారు) కలెక్షన్లను బీట్ చేయబోతోంది. ‘దిల్’ రాజుగారికి ఈ సినిమా డబ్బుతో పాటు గౌరవం తెచ్చి పెట్టింది. మౌత్ టాక్ వల్ల ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతోంది. సినిమా చూసిన యువకులు తమ అవ్వ, తాతలు, ఇతర కుటుంబ సభ్యులకు ఈ చిత్రాన్ని చూడమని చెప్తున్నారు. హిందీలో కూడా మా సినిమాకి ఆదరణ పెరుగుతోంది. ► నేను ఓ లైన్ సిద్ధం చేసుకుని హీరోలకు వినిపిస్తాను.. వారు ఓకే అన్న తర్వాత వారి ఇమేజ్‌కి తగినట్లుగా సన్నివేశాలను రూపొందిస్తాను. ప్రతిసారీ మమ్మల్ని మేము నిరూపించుకోవాలి. అందుకే నా ప్రతి చిత్రాన్ని ఛాలెంజ్‌గా స్వీకరిస్తుంటాను. 2020లో మహేశ్‌బాబుగారితో ఓ సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. పెద్ద స్టార్స్‌తో కమర్షియల్ సినిమాలు చేయడానికే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా తర్వాతి ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్.. ఏ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్‌లో కూడా సంక్రాంతి ఫైట్ బీభత్సంగానే జరిగింది. బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు స్టార్ హీరోలు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు. విజయ్ వారసుడు(వారిసు)గా అజిత్ తెగింపు(తునివు) చిత్రంతో సంక్రాంతి బరిలో దిగారు. వారం రోజుల్లోనే ఈ రెండు సినిమాలు రెండు వందల కోట్లు రాబట్టి బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. ఇప్పటివరకు వారసుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. అటు తునివు సుమారు రూ.250 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లోనూ ఈ రెండు సినిమాలు వసూళ్ల దుమ్ము దులుపుతున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అజిత్, విజయ్ సినిమాలు నేరుగా తలపడటంతో ఎవరు ఎక్కువ వసూళ్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. Triple ah received your love in 7 days nanba 🔥#MegaBlockbusterVarisu crosses 210Cr collection worldwide 😎#VarisuHits210Crs#Thalapathy @actorvijay sir @directorvamshi @SVC_official @MusicThaman @iamRashmika @7screenstudio @TSeries#Varisu #VarisuPongal pic.twitter.com/aVS6vGYhhY — Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2023 #Thunivu 7 Days Box Office 👉Tamilnadu : ₹149.7 CR 👉Andhra & Nizam : ₹6 Cr 👉Kerala : ₹7.50 Cr 👉Karnataka : ₹12.63 Cr 👉Rest of India : ₹7.5 Cr 👉Overseas : ₹66 Cr Total Worldwide Gross : ₹ 249.33* CRS Note: Hindi version yet to release. — TN Theatres Association (@TNTheatres_) January 18, 2023 చదవండి: సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం -
‘వారసుడు డైలీ సీరియల్’.. ట్రోలర్స్‌పై వంశీ పైడిపల్లి ఫైర్
తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘వారసుడు’ డైలీ సీరియల్ అంటూ వస్తున్న విమర్శలపై దర్శకుడు వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ సినిమా డైలీ సీరియల్‌ను తలపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ పోస్టులపై వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. డైలీ సీరియల్స్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయని.. కానీ సినిమా తీయడం సాధారణ విషయమేమీ కాదు.' అంటూ ఫైరయ్యారు వంశీ. వంశీ మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఇదంతా టీమ్ వర్క్. ప్రేక్షకులను అలరించడానిక్ మేం పడే కష్టం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ప్రతి సినిమా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. మనదేశంలో సూపర్‌స్టార్స్‌లో విజయ్ కూడా ఒకరు. ప్రతి సన్నివేశానికి రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయగలమనేది మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. ఆయనే నా సినిమాకు సమీక్షకుడు, విమర్శకుడు. ఆయన కోసం సినిమా చేశా. మరీ ఇంత నెగెటివ్‌గా ఉండకండి. సాఫ్ట్వేర్ జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చా. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే మూవీ చేశా.' అని అన్నారు. -
ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది.. దిల్ రాజు
దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న విడుదలైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లపర్వం సాగిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం మధ్యాహ్నం చెన్నైలో థ్యాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. వారిసు సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా చూసి పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్ అధినేత రమేష్ ప్రసాద్ హైదరాబాద్‌లో చిత్రం చూసి మంచి సినిమా తీశారని ప్రశంసిస్తూ మెసేజ్ పెట్టారు అని చెప్పుకొచ్చాడు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ నటించిన పూవే ఉనక్కాగా, కాదలక్కు మర్యాదై, తీళ్లాద మనం తుళ్లుమ్.. ఇలా కొన్ని సినిమాలు చాలా ఇష్టం. ఇటీవల ఆయన కమర్షియల్ ఫార్మాట్ చిత్రాలే చేస్తున్నారని అనిపించింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కమర్షియల్ చిత్రాలు చేస్తున్న సమయంలో బృందావనం వంటి ఫ్యామిలీ మూవీ చేశాను. అదేవిధంగా ప్రభాస్‌తో మిస్టర్ పర్ఫెక్ట్, మహేశ్‌బాబుతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలను చేశాను. అలాంటి ఎమోషనల్ ఫ్యామిలీ నేపథ్యంలో విజయ్ హీరోగా సినిమా చేస్తే బాగుండు అనుకున్నాను. ఆ కోరిక వల్లే వంశీ పైడిపల్లి చెప్పిన ఈ సినిమా కథను వెంటనే ఓకే చేశాను' అన్నాడు. చదవండి: ప్రియమణి కొటేషన్ గ్యాంగ్ టీజర్ చూశారా? -
అది నా అదృష్టం: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమారంగంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస విజయాల బాటలో కొనసాగుతున్న హీరోయిన్ రష్మిక మందన్నా. శాండిల్‌వుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈమె హవా కొనసాగిస్తోంది. కోలీవుడ్‌లో తాజాగా రష్మిక నటించిన తమిళ-తెలుగు చిత్రం వారిసులో నటుడు విజయ్‌తో రొమాన్స్ చేసింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా రష్మిక తన అనుభవాలను మీడియాతో పంచుకుంది. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 6 ఏళ్లు అయిందని, ఎంతోమంది ప్రతిభావంతమైన, అందమైన నటీమణులు ఉన్నా కూడా తనకు అన్ని భాషల్లోనూ అవకాశాలు లభించడం తన అదృష్టమని చెప్పింది. చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. తన శ్రమకు తోడు దర్శక నిర్మాతల సహకారం, ప్రేక్షకుల అభిమానం, అన్నిటికీ మించి భగవంతుని ఆశీస్సులతోనే ఇన్ని విజయాలు వరించాయనంటోంది. తాను ఇతరుల సమయాన్ని, ప్రయత్నాలను గౌరవిస్తాను అని, ఒక నటిగా నిత్యం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని తెలిపింది. సాధ్యమైనంత వరకు అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పింది. నటుడు విజయ్‌కి తాను వీరాభిమానిననీ, అలా నచ్చిన నటుడితో వారిసు చిత్రంలో నటించడం ఎంతో సంతోషాన్ని కలిగిందని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. -
విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు(తమిళంలో వారీసు) సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే వివాదంగా మారిన ఈ మూవీ తమిళంలో జనవరి 11న, తెలుగులో జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి పూర్తి స్థాయిలో తెరకెక్కించిన ఈ తమిళ చిత్రానికి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాత వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. చదవండి: చిరంజీవి మెసేజ్‌లను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. తెలుగులో వారసుడు టాక్ అంతంతగానే ఉన్నప్పటిక తమిళ ప్రేక్షకులను ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో వసూళ్ల పరంగా దేశవ్యాప్తంగా ఈ సినిమా దూకూడు చూపిస్తోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఫలితంగా వారసుడు మంచి విజయం సాధించింది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తిని సంతరించుకుంది. తాజా బజ్ ప్రకారం.. వారసుడు(వారీసు) మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి సాధారణంగా స్టార్ మీరో మూవీ థియేట్రికర్ రన్ అనంతరం 8 వారాలు అంటే రెండు నెలల తర్వాతే ఓటీటీకి వస్తుంది. ఇక విజయ్ వారసుడు మాత్రం అంతకు ముందే స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే 4 నుంచి 6 వారాలకు వారసుడు మూవీ అమెజాన్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీ, రిలీజ్‌పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించింది. శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్‌లు ప్రధాన పాత్రలు పోషించగా.. ప్రకాశ్ రాజ్ ప్రతికథానాయకుడిగా కనిపించారు. -
Varasudu Collections: వారం కాకముందే సెంచరీ కొట్టిన విజయ్
దళపతి విజయ్ కథానాయకుడి నటించిన ద్విభాషా చిత్రం వారిసు. ఈ సినిమా వారసుడు పేరిట తెలుగులోనూ రిలీజైంది. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు, శిరీష్, పరమ్, వి.పొట్లూరి, పెరల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్లో జనవరి 11న విడుదలవగా తెలుగులో 14న విడుదలైంది. కలెక్షన్లపరంగా రెండు చోట్లా దూసుకుపోతోందీ సినిమా. రిలీజై వారం రోజులు కూడా కాకముందే వంద కోట్ల క్లబ్లో చేరింది. అటు కేరళలో, ఇటు నార్త్‌లో హిందీలోనూ రిలీజవడంతో అక్కడ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది. ఆదివారంతో సంక్రాంతి పండగ హవా ముగియనుండటంతో వసూళ్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశముంది. అటు అజిత్ తునివు, ఇటు చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు గట్టి పోటీనిచ్చినా వాటన్నింటినీ తట్టుకుని నిలబడి వారసుడు వంద కోట్లు రాబట్టడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు ఫ్యాన్స్. కాగా విజయ్‌కు వంద కోట్లు సాధించడం పెద్ద లెక్కేం కాదు. ఇప్పటికే అతడి తొమ్మిది సినిమాలు ఈ ఘనత సాధించగా తాజాగా వారిసు సెంచరీ కొట్టి ఆ జాబితాలోకెక్కింది. తునివు కూడా వంద కోట్ల మార్క్ దాటడం విశేషం. #Varisu TN Box Office FINALLY the film crossed ₹50 cr mark in the 5th day. Day 1 - ₹ 19.43 cr Day 2 - ₹ 8.75 cr Day 3 - ₹ 7.11 cr Day 4 - ₹ 7.24 cr Day 5 - ₹ 9.08 cr Total - ₹ 51.61 cr#Vijay — Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2023 #Varisu has entered the ₹ 100 Cr Club at the #India Box office.. — Ramesh Bala (@rameshlaus) January 16, 2023 చదవండి: రష్మిక టాటూ వెనక స్టోరీ -
ఇన్నాళ్లకు మళ్లీ కన్నీళ్లు వచ్చాయి – ‘దిల్’ రాజు
‘‘వారిసు’ చిత్రంపై తమిళ ప్రేక్షకులు చూపిన స్పందనకి వంశీ పైడిపల్లి, తమన్ ఏడ్చారు. ‘బొమ్మరిల్లు’ సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో నేను కూడా ఏడ్చాను.. మళ్లీ ఇన్నాళ్లకు ‘వారిసు’ చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చాయి. మా నమ్మకం నిజం కావడంతో వచ్చిన ఆనందభాష్పాలు అవి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. దళపతి విజయ్, రష్మికా మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘వారిసు’ (తమిళ్). ‘వారసుడు’ (తెలుగు). ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తమిళ్లో విడుదలైంది. తెలుగులో 14న ‘వారసుడు’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లడుతూ– ‘‘చెన్నైలో ‘వారిసు’ ఆడుతున్న థియేటర్‌కి వెళ్లాను.. క్లైమాక్స్ పూర్తయ్యాక వంశీని అభిమానంతో హత్తుకున్నాను. ప్రేక్షకులు నిలబడి క్లాప్స్ కొట్టడంతో మేం పడ్డ కష్టాలు మర్చిపోయాం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఒక మంచి కథని చెబితే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘వారిసు’ మరోసారి నిరూపించింది. సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. అల్లు అరవింద్‌గారు ఫోన్‌చేసి ‘వెయ్యి కోట్లు పెట్టినా రాని అనుభూతి ఇది’ అని అభినందించారు’’ అన్నారు. ‘‘తమిళంలోలా తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు నటి జయసుధ. -
షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు(తెలుగులో వారసుడు). జనవరి 11న విడుదల కావాల్సిన ఈ మూవీలో తెలుగులో వాయిదా పడిన సంగతి తెలిసిందే. థియేటర్ల ఇష్యూ కారణంగా ఇక్కడ వాయిదా పడగా.. తమిళంలో మాత్రం అదే తేదీకి విడుదలైంది. బుధవారం ఈ చిత్రం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచి వారిసు మంచి హిట్‌టాక్‌ను సొంతంగా చేసుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంది. చదవండి: బాలకృష్ణ వీర సింహారెడ్డి ఓటీటీ పార్ట్నర్ ఇదే? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..! అయితే ఈ సినిమాలో ఆడియన్స్‌కు ఓ ఊహించని ఎలిమెంట్ ఒకటి షాకించిందట. దీంతో ఈ విషయంలో ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రముఖ నటి ఖుష్భు సుందర్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు షూటింగ్ స్పాట్లో మూవీ టీంతో కలిసి దిగిన ఫొటోలను ఖుష్భు తన సోషల్ మీడియలో షేర్ చేసింది కూడా. సెట్లో విజయ్, రష్మిక, ఖష్బు స్టిల్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే సినిమాలో మాత్రం ఖుష్బు ఎక్కడ కనిపించలేదట. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఎక్కడ కనిపించకపోవడం తమిళ ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. చదవండి: రాహుల్‌కు కంగ్రాట్స్ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్ రూమర్స్ సినిమా చూసి బయటకు వచ్చాక ఖుష్బు సినిమాలో ఎక్కడ కనిపించలేదని, ఆమె సన్నివేశాలను ఎందుకు తొలగించారు? అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు మూవీ టీంని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ నుంచి వైరల్ అయిన ఆమె స్టిల్స్, వారిసు టీంతో కలిసి ఆమె షేర్ చేసిన పలు పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. దీంతో ఖుష్బు సీన్లను ఎందుకు తొలగించారన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. వారిసు నుంచి ఆమెను తొలగించారా? ఎందుకు ఆమె సీన్లను తొలగించాల్సి వచ్చింది! అసలేం జరిగిందనేది ఆసక్తిని సంతరించుకుంది. అయితే వీటన్నింటికి సమాధానం రావాలంటే మూవీ టీం నుంచి క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాలి. Extremely happy to be part of this family. ( Was waiting for the official news from the production before me saying anything about it. ) @actorvijay @directorvamshi #DilRaju #Varisu #Varisudu #Vijay66 pic.twitter.com/BcfuWgFTDq — KhushbuSundar (@khushsundar) October 26, 2022 🤔 khushbu character is not in #Varisu Is they deleted the scene or changed the mother character to Jayasudha @directorvamshi pic.twitter.com/mI0I4GPr6J — 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 (@NameIsShreyash) January 11, 2023 Khushboo didi enga daa kanum???#Varisu#VarisuBlockbuster — Nambi (@NambiThalapathy) January 11, 2023 Hi Friends. Enaku oru doubt.#Varisu movie la Khushboo erukanganu sonnagale. 🤔🤔🤔#BlockBusterVarisu #VarisuPongalWinner@7screenstudio @Harish_NS149 @Karthikravivarm — Joseph Jeeva (@jnajeeva) January 11, 2023 Illa enaku puriyala enaku mattum varisula Khushboo kanuku theriyalai ya illa yella rukkuma ? #Varisu — pathukalam (@lavanku11) January 11, 2023 -
వారీసు Vs తునివు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
సౌత్‌లో సంక్రాంతి హడావుడి పీక్స్‌లో ఉంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు క్లాష్ అవుతుండటంతో ఎవరు విన్నర్‌గా నిలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతి పందేలుగా బరిలో దిగగా తమిళనాట అజిత్ తునివు, విజయ్ వారీసు(వారసుడు) బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు జనవరి 11వ తేదీన గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే! ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్లు కలిపితే రూ.50 కోట్ల గ్రాస్ కన్నా తక్కువే ఉన్నాయట. తమిళనాడులో తునివు మొదటిరోజు పాతిక కోట్ల మేర కలెక్షన్స్ కురిపించగా వారీసు దాదాపుగా రూ.20 కోట్లదాకా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళనాడు కాకుండా ఇతర ప్రాంతాలు, విదేశీ వసూళ్లు కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రెండు సినిమాలు బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచేందుకు తెగ పోటీపడుతున్నాయి. కాగా తొమ్మిదేళ్ల తర్వాత అజిత్, విజయ్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. దీంతో ఫస్ట్‌డే ఫస్ట్ షో చూడాలన్న ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. Pongal 2023 TN Box Office Day 1#Thunivu - ₹ 24.59 cr#Varisu - ₹ 19.43 cr — Manobala Vijayabalan (@ManobalaV) January 12, 2023 చదవండి: తండ్రి మరణించిన రెండు రోజులకే సెట్‌కు వచ్చేశాడు: చిరంజీవి థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదు!: నటుడు శ్యామ్
తమిళ సినిమా: నటుడు విజయ్‌తో కలిసి వారీసు చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు శ్యామ్ పేర్కొన్నారు. 12బి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. అలాగే పలు చిత్రాలకు కూడా ఆయన నిర్మాత వ్యవహిరించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారసుడు(తమిళంలో వారీసు) చిత్రంలో ఆయనకు సోదరుడిగా ముఖ్య పాత్రలో శ్యామ్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా నేడు(బుధవారం) 11వ తేదీన భారీ అంచనాల మధ్య వారిసు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన మంచి ఎంటర్టైనర్ కథాచిత్రంగా వారీసు ఉంటుందన్నారు. తాను ఆరంభ దశలో విజయ్‌తో ఖుషి చిత్రంలో చిన్న పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 12బి చిత్రంలో కథానాయకుడిగా నటించినప్పుడు విజయ్ తనను అభినందించారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వారీసు చిత్రంలో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా మాట్లాడతారని,ఎక్కువగా కసరత్తులు చేస్తారన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ ఎవరన్న ఆంశంపై పెద్ద చర్చే జరుగుతోందని, అయితే ఈ విషయంలో రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదని పేర్కొన్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల స్థాయి వేరని, అయితే విజయ్‌కు అజిత్‌కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు. ఇద్దరికీ అత్యధిక సంఖ్యలోనే అభిమానులు ఉన్నారన్నారు. పొంగల్‌కు విడుదల అవుతున్న వారిసు, తుణివు చిత్రాలు రెండు విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాను నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని, గోలీ సోడా 3 చిత్రంలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, మరికొన్ని చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తెలుగు, కన్నడంలోనూ నటిస్తున్నానని, అదే విధంగా త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు శ్యామ్ చెప్పుకొచ్చారు. -
అజిత్, విజయ్ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్
పొంగల్‌కు విడుదలవుతున్న వారీసు, తుణివు చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు చిత్రాలు బుధవారం తెరపైకి రానున్నాయి. దీంతో థియేటర్ల యాజమాన్యం స్పెషల్ షోలకు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. కాగా అజిత్ నటించిన తుణివు చిత్రం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆటల ప్రదర్శనకు, విజయ్ చిత్రం వారీసు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ చిత్రాలకు ప్రభుత్వం 11, 12 తేదీల వరకే స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చింది. ఆ తరువాత పండుగ సందర్భంగా 13 నుంచి 16వ తేదీ వరకు ఎలాంటి ప్రత్యేక ఆటలకు అనుమతి లేదని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా థియేటర్ల ముందు భారీ కటౌట్లును ఏర్పాటు చేయడం, పాలాభిõÙకాలు చేపట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.7 లక్షలతో అజిత్ కటౌట్ తమ అభిమాన నటులను ఆరాధించడం సహజమే. కర్ణాటకకు చెందిన నటుడు అజిత్ అభిమాని ఒకరు భారీ ఎత్తున తుణివు చిత్రంలోని కటౌట్‌ను ఏర్పాటు చేశాడు. ఈ కటౌట్ కోసం అతను అక్షరాల రూ.7 లక్షలు వెచ్చించాడు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
రెమ్యూనరేషన్లో ఆల్ టైమ్ రికార్డ్.. వారీసుకు రూ.150 కోట్లు..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం 'వారీసు'. తెలుగులో వారసుడు పేరుతో ఈనెల 14న రిలీజ్ కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 11న విడుదల కానుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి విజయ్ తీసుకున్న పారితోషికంపై నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారీసు కోసం విజయ్ రూ.150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలవనున్నారు. దాదాపు ఇది బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్‌ను మించిపోయింది. అంతే కాకుండా కోలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. (ఇది చదవండి: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం) విజయ్ సినిమాల ఎంపికలోనూ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్‌లతో సహా యువ దర్శకుతలతో జతకట్టాడు. విజయ్ పూర్తిగా స్క్రిప్ట్‌ల ఆధారంగా సినిమాలను నిర్ణయిస్తాడని.. కమర్షియల్‌తో పాటు ఎంటర్టైనర్కు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూస్తానని నెల్సన్ అన్నారు. విజయ్‌కి ఓవర్సీస్లోనూ ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అలాంటి ఆదరణ ఉన్న చాలా తక్కువ మంది దక్షిణాది నటుల్లో ఈయన ఒకరు. వారిసు సినిమా తమిళంలో జనవరి 11న, హిందీలో జనవరి 13న, తెలుగులో సంక్రాంతి స్పెషల్‌గా 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. -
'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్‌రాజు
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'వారీసు'. తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్ అవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ సినిమా విడుదల చేయనున్న్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడం సందిగ్ధత మొదలైంది. రిలీజ్‌కు రెండు రోజులే ఉన్నా ఇంకా మూవీ టీం క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు. తానే ఒక అడుగు వెనక్కి వేశానని, సినిమాను 11కి బదులుగా 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'చిరంజీవి, బాలయ్య సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. అందరు నిర్మాతలు బాగుండాలి. దీంతో నేనే ఒక అడుగు వెనక్కి తగ్గాను. అందరూ నామీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి. ఇండస్ట్రీ పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాత సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల వేయాలని నిర్ణయించాం' అంటూ వెల్లడించారు. కాగా తమిళంలో వారీసు రిలీజ్లో ఎలాంటి వాయిదా లేదు. ముందుగా అనుకున్న సమయానికే 11న అక్కడ విడుదల చేయనున్నారు. Dil Raju says that, he will make arrangements to bring Thalapathy @actorvijay to Hyderabad before the #Vaarasudu release on Jan-14. #Varisu pic.twitter.com/Jk8kekLyhs — T H M (@THM_Off) January 9, 2023 -
సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది.సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వారీసు సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మూవీ టీం రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే వారీసు విడుదల అవుతుందని, పుకార్లను నమ్మవద్దంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. Meet THE BOSS’s family in 3 days in theatres near you nanba 🤩#3DaysForVarisu#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @iamRashmika @Lyricist_Vivek @7screenstudio @TSeries #Varisu #VarisuPongal pic.twitter.com/RbAsoqrpNS — Sri Venkateswara Creations (@SVC_official) January 8, 2023 -
పొంగల్ బరిలో అగ్ర హీరోలు .. డిస్ట్రిబ్యూటర్లకు కొత్త చిక్కులు
తమిళ అగ్రహీరోలు విజయ్, అజిత్ చిత్రాల మధ్య ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా పోటీ నెలకొంది. విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం వారిసు. నటి రష్మిక మందన్నా కథానాయకి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. తమన్ సంగీతాన్ని అందించారు. అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తునివు. మలయాళ నటి మంజు వారియర్ హిరోయిన్‌గా చేసిన ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. జి.సినిమా సంస్థతో కలిసి బోనీకపూర్ నిర్మించారు. దీనికి అనిరుద్ సంగీత దర్శకుడు. ఈ రెండు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పొంగల్ బరిలో ఢీకొనడానికి సిద్ధమవుతున్నాయి. వారిసు కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రంగా ఉంటుందని ఆ చిత్ర వర్గాలు చెబుతుంటే, తునివు చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా భారీ చిత్రాలు రావడం సహజమే అయినా, అజిత్, విజయ్ ఇద్దరికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉండడం, నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా భావించడం, వీరి చిత్రాల మధ్య అంచనాలు వీటికి కారణాలుగా చెప్పొచ్చు. కాగా అజిత్ నటించిన తునివు చిత్ర విడుదల హక్కులను నటుడు, నిర్మాత, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. ఒకేరోజు రెండు చిత్రాలు విడుదల..! విజయ్ వారిసు చిత్రాన్ని చెన్నై, కోయంబత్తూర్, ఉత్తర ఆర్కాడ్, దక్షిణ ఆర్కాడ్ ఏరియాల్లో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థనే విడుదల చేయనుంది. మిగిలిన ఏరియాలను మాస్టర్ చిత్ర సహ నిర్మాత లలిత్ విడుదల చేయనున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ రెండు చిత్రాలను ఒక రోజు అటు ఇటుగా విడుదల చేస్తారని డిస్టిబ్యూటర్లు భావించారు. వారిసు చిత్రాన్ని 12వ తేదీ విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో తునివు చిత్రాన్ని 11వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు వారిసు చిత్రాన్ని కూడా 11వ తేదీ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈగో కారణంగానే ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. విజయ్ చిత్రం ఆడియో ఆవిష్కరణను ఇటీవల చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ జనవరి ఒకటో తేదీ దీన్ని ప్రసారం చేసింది. ఆ తర్వాత చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. కాగా అజిత్ నటించిన తునివు చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు చేయలేదు. అంతేకాదు చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. తలలు పట్టుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు దీనికి అజిత్ మేనేజర్ మంచి చిత్రానికి పబ్లిసిటీ అవసరం లేదంటూ ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేశారు. అయితే తునివు చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఊర మాస్‌గా ఉన్న ఈ చిత్రం ట్రైలర్ అజిత్ అభిమానులకు పిచ్చ పిచ్చిగా నచ్చేసింది. దీంతో ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకపోయినా తుణివు చిత్ర ట్రైలర్, వారిసు చిత్రం కంటే ఎక్కువ లైకులు పొందుతోందంటూ ఇప్పటి నుంచే సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే వారిసు, తునివు చిత్రాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతుండడంతో ఏ చిత్రానికి ఎన్ని థియేటర్లు కేటాయించాలి, దేనికి మార్నింగ్ షోలు వేయాలి? ఏ హీరో అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో అని డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ చిత్రాల విడుదల విషయంలో సినిమా పెద్దలు చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుందని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రహ్మణ్యం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారిసు, తునివు చిత్రాల టికెట్లను రూ.1000 నుంచి రూ.2 వేల వరకు బ్లాక్‌లో విక్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం టికెట్ రూ.190కి మించరాదని ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు చిత్రాలు మరో నాలుగు రోజుల్లో భారీ అంచనాల మధ్య తెరపైకి రావడానికి ముస్తాబవుతున్నాయి. మరి ఏ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోందో వేచి చూడాల్సిందే. -
'వారీసు' రిలీజ్‌కు ముందే తీవ్ర విషాదం.. ఆర్ట్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'వారీసు'. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారీసు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశారు. గుండెపోటుతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటూనే గతరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా సీతారామం, ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యం సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. సునీల్ బాబుకు భార్య, కూతురు ఆర్య సరస్వతి ఉన్నారు. అంత్యక్రియలు ఈరోజు(శుక్రవారం)జరిగే అవకాశం ఉంది. -
'గ్రౌండ్లో ఎంతమంది ఉన్నా.. చూసేది ఆ ఒక్కడినే'.. వారసుడు ట్రైలర్
తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కించిన చిత్రం 'వారిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తుండగా.. తమన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వారిసు ట్రైలర్
తమిళ స్టార్ విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం వారిసు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. తెలుగులో వారసుడు పేరిట సంక్రాంతికి విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఇందులో ఫ్యామిలీ బంధాలను చూపిస్తూనే విజయ్ను బిజినెస్‌మెన్‌గా చూపించారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా ట్రైలర్ అలా రిలీజైందో లేదో అప్పుడే #VarisuTralier ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. కాగా దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. చదవండి: రష్మికపై ట్రోలింగ్.. రాళ్లు కూడా విసురుతారన్న కన్నడ స్టార్ డూప్లెక్స్ ఇంటిని అమ్మేసిన హీరోయిన్, ఎన్ని కోట్లంటే? -
దళపతి విజయ్‌పై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘నా కెరీర్లో తొలి తమిళ చిత్రం ‘వారసుడు’. ఇందులో విజయ్‌కి బ్రదర్‌గా కీలకమైన పాత్ర చేశాను. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. సినిమా ఒక దృశ్యకావ్యంలా ఉంటుంది’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. దళపతి విజయ్, రష్మికా మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వారిసు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన శ్రీకాంత్ చెప్పిన విశేషాలు. ⇔ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా చేసినప్పటికీ పక్కా తెలుగు మూవీలానే ఉంటుంది. జయసుధగారు, నేను, కిక్ శ్యామ్, శరత్ కుమార్, రష్మిక, సంగీత, ప్రభు.. ఇలా అందరూ తెలుగు సినిమాలు చేసిన వారే ఉండటంతో పూర్తి తెలుగు నేటివిటీ సినిమాలానే ఉంటుంది. వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ కోవలోనే ఈ మూవీలో బ్రదర్స్ మధ్య జరిగే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. విజయ్‌గారు ఎక్కువగా మాట్లాడరు. సెట్లో అడుగు పెడితే ప్యాకప్ చెప్పేవరకూ అక్కడే ఉంటారు. క్యార్వాన్ వాడరు.. సెల్ ఫోన్ కూడా దగ్గర పెట్టుకోరు. ఒక మంచి సినిమా, విజయ్‌లాంటి స్టార్ హీరోతో తమిళంలో అడుగుపెడుతుండటం హ్యాపీ. ⇔ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లోనూ హిట్ సాధిస్తున్నాయి. సంక్రాంతి అనేది సినిమాల పండగ కూడా.. అన్ని సినిమాలనీ ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘వారసుడు’ పండగ లాంటి సినిమా. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ బాగా ఆడాలి.. అదే హ్యాపీ సంక్రాంతి. ‘దిల్’ రాజుగారి ప్రొడక్షన్లో చేయడం ఇదే తొలిసారి. ‘వారసుడు’కి తమన్ అద్భుతమైన మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. ⇔ ‘అఖండ’ తర్వాత డిఫరెంట్‌గా ఉండాలని ‘వారసుడు’లోని పాత్ర చేశాను. అలాగే రామ్‌చరణ్– శంకర్‌గారి సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నాను. కథ, క్యారెక్టర్ నచ్చితే వైవిధ్యమైన పాత్రలు కచ్చితంగా చేస్తాను. -
పవన్ సినిమాతో చాలా నష్టపోయా, కెరీర్లోనే బిగ్గెస్ట్ డ్యామెజ్ : దిల్‌రాజు
పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాతో చాలా నష్టపోయానని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన వారీసు చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న దిల్‌రాజు తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''పవన్ కల్యాణ్ అఙ్ఞాతవాసి సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాను. 2017లో ఈ సినిమా నైజాం రైట్స్ కొనుగోలు చేశాను. నా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్. అదే ఏడాది మహేశ్‌తో తీసిన స్పైడర్ కూడా ఆడలేదు. రెండు సినిమాలు ఒకేసారి బిగ్గెస్ట్ ఫ్లాప్ కావడంతో చాలా నష్టపోయాను. అయినా తట్టుకొని నిలబడ్డాను. మరొకరైతే ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయేవారు. కానీ అదే ఏడాదిలో నిర్మాతగా 6హిట్స్ కొట్టడంతో నేను నిలబడగలిగాను'' అని పేర్కొన్నారు. ప్రస్తుతం దిల్‌రాజు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
1990లోనే నాకు పోటీగా ఒక నటుడొచ్చాడు!
నటుడు విజయ్ కథానాయకుడిగా న టించిన తాజా చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో సంక్రాంతికి బరిలోకి నిలవనుంది. ఇందులో రషి్మక మందన్న నాయకిగా నటించారు. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నటి రష్మికా మందన్నా ముంబాయ్ నుంచి వచ్చారు. ఈమె వేదికపై నృత్య దర్శకుడు జానీ మాస్టర్ తో కలిసి రంజితమే పాటకు స్టెప్స్‌లు వేసి సందడి చేశారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ తాను విజయ్ వీరాభిమానినన్నారు. ఆయన చిత్రానికి పని చేయాలని 27 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని టచ్ చేసినట్లు ఉందని అన్నారు. ఇండియాకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో విజయ్ చిత్రంలోని పాటలను కంపోజ్ చేయటం అంత ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో శింబు, అనిరుధ్ పాటలు పాడడంపై సంతోషం వ్యక్తం చేశారు. అలా అంటే కరుణానిధి ఆశ్చర్యపోయారు.. నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ తాను నటించిన సూర్యవంశం 175వ వేడుకలో భవిష్యత్ సూపర్ స్టార్ విజయ్ అని చెప్పానని, అది తెలిసిన కరుణానిధి ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు విజయ్ పెద్ద సూపర్ స్టార్ అని వ్యాఖ్యానించారు. విజయ్ నంబర్–1 హీరో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ వారీసు రీమేక్ కాదు. పక్కా తమిళ చిత్రం అని తెలిపారు. ఇది తెలుగు, తమిళంలోనే కాదు ఉత్తరాదిలోనూ సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పొంగల్ మనదే అని పేర్కొన్నారు. విజయ్ నటుడుగానే కాదు నిజజీవితంలోనూ సూపర్ స్టారే అని అన్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు అభిమానులు నంబర్–1 అంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో దిల్‌రాజు కూడా నంబర్–1 అంటూ వారిని ఉత్సాహపరిచారు. నటి రష్మిక మాట్లాడుతూ తాను విజయ్ అభిమానిని పేర్కొన్నారు. ఆయన నటించిన గిల్లీ చిత్రాన్ని తన తండ్రితో కలిసి చూశానని, అప్పటి నుంచి ఆయన నటనను డైలాగ్ డెలివరీని ఇమిటేషన్ చేయడం మొదలెట్టానన్నారు. మీకు నచ్చిన నటుడు, మీ క్రష్ ఎవరని అడిగితే విజయ్ అని చెబుతానన్నారు. చివరిగా నటుడు విజయ్ మాట్లాడుతూ 1990లోనే ఒక నటుడు తనకు పోటీగా వచ్చారన్నారు. కొద్దిరోజులు ఆయన తనకు ïపోటీగా నిలిచారన్నారు. ఆయన సక్సెస్ కారణంగా తాను వేగంగా పరిగెత్తాల్సి వచ్చిందన్నారు. ఆయన కంటే ఎక్కువగా విజయం సాధించాలని భావించాలన్నారు. అలా ప్రతి ఒక్కరికి పోటీ దారుడు అవసరం అని పేర్కొన్నారు. తన పోటీదారు పేరు జోసెఫ్ విజయ్ అన్నారు (ఇది విజయ్ అసలు పేరు). అలా ఎవరికి వారు.. తమను తమకే పోటీగా భావించి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అభిమానులకు సూచించారు. -
విజయ్ 'వారసుడు' సినిమానే ఫస్ట్ చూస్తా: అజిత్ డైరెక్టర్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు మూవీకి మొదట మహేశ్‌బాబునే హీరోగా అనుకున్నారు. కానీ ఆయన వేరే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటంతో కుదరలేదు. తర్వాత రామ్‌చరణ్‌తో చేద్దామనుకున్నా ఆయన కూడా ఖాళీగా లేకపోవడంతో చివరకు కోలీవుడ్ స్టార్ విజయ్ దగ్గరకు వెళ్లిందీ ప్రాజెక్ట్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ఈ క్రమంలో దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'విజయ్ తమిళనాడులో నెంబర్ వన్ హీరో.. అజిత్ కంటే పెద్ద స్టార్. కానీ వారిసు, అజిత్ తునివు ఒకేరోజు విడుదలవుతున్నాయి. అందువల్ల తమిళనాడులో 800 థియేటర్లలో 50:50 ఇస్తామన్నారు. కానీ విజయ్ నెంబర్ వన్ హీరో కాబట్టి 50 థియేటర్లు అదనంగా కావాలి' అని మాట్లాడటంతో ఎంత పెద్ద వివాదం ముసురుకుందో తెలిసిందే! దిల్‌రాజుపై, అతడి వ్యాఖ్యలపై అజిత్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. విజయ్ కంటే అజితే గ్రేట్ అని, మధ్యలో నువ్వేంది చెప్పేదని విమర్శించారు. అలా మా హీరో తోపంటే మా హీరో తోపని విజయ్, అజిత్ ఫ్యాన్స్ కొట్టుకున్నంత పని చేశారు. దీనిపై దిల్‌రాజు దిగొచ్చి తానెవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని, పూర్తి ఇంటర్వ్యూ చూసుంటే మీకర్థమయ్యేదని సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తునివు డైరెక్టర్ హెచ్ వినోద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. తునివు, వారిసు.. వీటిలో ఏ సినిమా ముందు చూస్తారు? అన్న ప్రశ్నకు ఆయన.. విజయ్ 'వారిసు' సినిమానే చూస్తానన్నాడు. ఎందుకంటే తునివు సినిమాను ఇప్పటికే చాలాసార్లు చూసేశా కాబట్టి వారిసు చూస్తానంటూ తెలివిగా సమాధానమిచ్చాడు. చదవండి: సినిమా పోస్టర్‌ను కూడా వదలవా? నిర్మాతపై మళ్లీ ట్రోలింగ్ సూట్‌కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్టులు -
అతనే నంబర్‌వన్ హీరో.. దిల్ రాజు కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు కోలీవుడ్ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అగ్రహీరో విజయ్ హీరోగా 'వారిసు'(తెలుగులో వారసుడు)గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే అదే రోజు అజిత్ సినిమా తునివు విడుదల కానుంది. దీంతో రెండు చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది. ఈ సమస్యపై స్పందిస్తూ నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఇంతకీ దిల్ రాజు అన్న మాటలేంటీ? ఫ్యాన్స్ ఎందుకు ఆయనను ట్రోల్స్ చేస్తున్నారో చూద్దాం. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. 'విజయ్ తమిళనాడులో నంబర్‌వన్ హీరో. అజిత్ కంటే పెద్ద స్టార్. కానీ వారిసు, తునివు ఓకే రోజు విడుదలవుతున్నాయి. అందువల్ల తమిళనాడులోని 800 థియేటర్లలో 50:50 ఇస్తామని చెప్పారు. కానీ విజయ్ నంబర్‌వన్ హీరో కావున ఓ 50 థియేటర్లు అదనంగా కావాలని కోరుతున్నా. దీనిపై చెన్నైకి వెళ్లి సీఎం స్టాలిన్ కలిసి విజ్ఞప్తి చేయబోతున్నా.' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేయడంతో వైరలైంది. (ఇది చదవండి: 'వారిసు' చిత్ర వివాదం.. అభిమానులతో విజయ్ భేటీపై సర్వత్రా ఆసక్తి) కోలీవుడ్‌లో విజయ్ నంబర్‌వన్ హీరో అనడంపై అజిత్ అభిమానులు మండిపడుతున్నారు. పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అభిమానుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న వారిసు చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. తెలుగు, తమిళంలో ఓకేసారి ఈ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు భారీ అంచనాల మధ్య అజిత్ 'తునివు' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను అజిత్, దర్శకుడు హెచ్.వినోత్, నిర్మాత బోనీ కపూర్ కాంబినేషన్లో వరుసగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అజిత్ తొలిసారిగా విఘ్నేష్ శివన్‌తో జతకట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై నిర్మాత సురేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు
గత కొంతకాలంగా టాలీవుడ్లో తెలుగు, తమిళ సినిమాల రిలీజ్ విషయం చిన్న వివాదం జరుగుతుంది. సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంతమంది తప్పుబడుతున్నారు. తాజాగా నిర్మాతల మండలి నిర్ణయంపై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఇతర భాషల సినిమాలను ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. సంక్రాంతి సీజన్లో అన్ని సినిమాలు నడుస్తాయన్నారు. ‘తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడట్లేదు. చెన్నైలో ఆర్ఆర్ఆర్ విడుదల చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. లోకల్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్‌లో ఆడిస్తారు. సినిమా బాలేకుంటే తరువాతి రోజే తీసేస్తారు. ఇదొక బిజినెస్ అంతే. ఎవరిష్టం వారిది. ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తారు. అది ఏ భాష సినిమా అని ఎవరూ చూడరు. మన తెలుగు సినిమా కూడా ఇతర భాషల్లో విడుదలయి విజయం సాధిస్తున్నాయి. -
వారీసు మూవీకి థియేటర్లు దొరకడం లేదని బాధపడుతున్నారు, కానీ..: నిర్మాత
బాస్కెట్ ఫిలింస్ అండ్ క్రియేషన్స్ పతాకంపై భాస్కీ దర్శకత్వం వహించిన చిత్రం హై 5. నూతన తారలతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో కార్యక్రమాన్ని చెన్నై ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, నటుడు, నిర్మాత కే.రాజన్, జాగ్వర్ తంగం ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె.రాజన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కుటుంబ అనుబంధాలకు నిలయంగా తమిళనాడు ఉండేదని, అలాంటిది ఇప్పుడు ఒకే ఇంటిలో మనిషికో గది ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదన్నారు. ఆ ఆవేదనను ఆవిష్కరించే చిత్రంగా హై 5 చిత్రాన్ని రూపొందించారని, అందుకు చిత్ర యూనిట్‌కు అభినందనలు అన్నారు. ఇకపోతే వారీసు చిత్రానికి తెలుగులో థియేటర్లు దొరకడం లేదని ఇక్కడ కొందరు బాధపడుతున్నారని, ఇక్కడ చిత్ర పరిశ్రమకు పట్టుకొమ్మలయిన చిన్న చిత్రాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. హై 5 లాంటి చిన్న సినిమాలు ఆడాలన్నారు. దర్శకుడు ఆర్వీ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘హై5’ చిత్ర ట్రైలర్ చూస్తున్నప్పుడు హాలీవుడ్ చిత్రాన్ని చూసినట్లు అనిపించిందన్నారు. చిత్రాన్ని కెనడాలో చిత్రీకరించినట్లు చెప్పారని, మంచి సందేశంతో రూపొందించిన ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు అన్నారు. చిత్ర దర్శక నిర్మాత భాస్కీ మాట్లాడుతూ తల్లిదండ్రులు చివరి దశలో చిన్న పిల్లల మనస్థత్వంతో ప్రవర్తిస్తారని, అయితే ఇంటిలోని వారు దీనిని అర్థం చేసుకోవడం లేదని, తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలని చెప్పే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. -
విజయ్‌ని డామినేట్ చేస్తున్న అజిత్!
కోలీవుడ్ పొంగల్ పోటీలో తాల అజిత్, తలపతి విజయ్ పోటీ పడుతున్నారు.బాక్సాఫీసు ముందర భారీ వార్ జరగబోతుంది.ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ వారిసు ప్రమోషన్లు షూరు అయ్యాయి.రంజితమే పాటతో..రచ్చ మొదలయ్యింది.అయితే అజిత్ మాత్రం..ఒక అడుగు ముందుకు వేసి విజయ్‌ని డామినేట్ చేయబోతున్నాడు.కలెక్షన్ల దగ్గర తనదే పై చేయి అనిపించుకోవాలి అనుకుంటున్నాడు.ఇంతకీ అజిత్ వేస్తున్న స్కెచ్ ఏంటి? కోలీవుడ్ పొంగల్ పోటీలో తలపతి విజయ్ వరిసుతో దూసుకుపోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లతో అలరించటమే కాదు..ఫస్ట్ సింగిల్ రంజితమే సాంగ్ ను రిలీజ్ చేసి..సోషల్ మీడియాలో తన రేంజ్ ఎంటో చూపిస్తున్నాడు..ప్రమోషన్లలో ముందున్నాను అనిపించుకుంటున్నాడు. విజయ్‌తో వార్కి సై అంటున్నాడు అజిత్. తాల అజిత్ ‘తునివు’ మూవీతో విజయ్ తో పోటీకి దిగుతున్నాడు.ఈ సీనియర్ హీరోకు కూడా మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దాంతో విజయ్ ,అజిత్ మధ్య పోటీ రంజుగా మారింది. బాక్సాఫీసు ఫైట్ మరో రేంజ్ కు చేరింది. విజయ్ వరిసుతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే..అజిత్ తునివు పోస్టర్లతోనే సరిపెట్టుకున్నాడు.కాని బాక్సాఫీసు ను శాషించటానికి భారీ స్కెచ్ మాత్రం వేశాడు. కలెక్షన్ల దగ్గర..విజయ్ సినిమాను డామినేట్ చేయాలి అనుకుంటున్నాడు అజిత్.అందు కోసం థియేటర్లను బ్లాక్ చేసుకున్నాడు. తన సినిమా తునివును ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయేలా ప్లాన్ చేశాడు. మొదటి రోజు కలెక్షన్లలో తనదే పై చేయి అనిపించుకోవాలి అనుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరు హీరోలలో ఎవరిది పై చేయి సాధిస్తారన్నది సినిమాలు విడుదయ్యాక తెలుస్తుంది. -
'వారిసు' చిత్ర వివాదం.. అభిమానులతో విజయ్ భేటీపై సర్వత్రా ఆసక్తి
తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆస్థాయిలో అభిమానులను కలిగిన నటుడు విజయ్. ఈయన తన అభిమాన సంఘాల ద్వారా తమిళ ప్రజలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌కి రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆసక్తి ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన నేరుగా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వకపోయినా ఆయన అభిమానులు కొందరు తమిళనాడులోని పలు నియోజకవర్గాల్లో ఆ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఇకపోతే విజయ్ తన అభిమానులను కనీసం ఏడాదికి ఒకసారైనా కలుస్తూ ఉంటారు. అలాంటిది కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన తన అభిమానులతో ప్రత్యేకంగా భేటీ కాలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం విజయ్ స్థానిక పనైయూర్‌లోని తన కార్యాలయంలో అభిమాన సంఘ నిర్వహకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. కారణం విజయ్ తాజాగా నటిస్తున్న వారిసు చిత్ర తమిళం, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా అదే సందర్భంగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దీంతో థియేటర్ల సమస్య ఏర్పడే పరిస్థితి నెలకొనడంతో తెలుగు సినీ నిర్మాతల మండలి పండగ రోజుల్లో తెలుగు చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రకటనను ఇటీవల చేసింది. ఇది తమిళ చిత్రశ్రమంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ వంటి వారు తెలుగు నిర్మాతల మండలి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నటుడు విజయ్ తన అభిమానులతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏఏ విషయాలను గురించి చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వారిసు చిత్ర విడుదల వివాదం గురించి అభిమానులతో చర్చిస్తారా..? ఈ వ్యవహారంలో వారు ఎలా వ్యవహరించాలనే సూచనలు చేస్తారా? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, వారిసు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఆదివారం తన ట్విట్టర్లో స్పష్టం చేయడం గమనార్హం. -
అదే జరిగితే ' అంతకుముందు.. ఆ తర్వాత'.. డైరెక్టర్ లింగుస్వామి సీరియస్..!
అనువాద చిత్రాల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి 'వారిసు' రిలీజ్‌పై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ అంశంపై దర్శకుడు లింగుస్వామి స్పందించారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏం చేయాలో మాకు తెలుసన్నారు. (చదవండి: టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం) సంక్రాంతికి కేవలం తెలుగు చిత్రాలకు మాత్రమే థియేటర్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై కోలీవుడ్ దర్శక, నిర్మాతలు విమర్శలు చేశారు. ఇలా వ్యవహరించడం పద్ధ కాదని డైరెక్టర్ లింగుస్వామి అన్నారు. ఒకవేళ ఆ విధంగానే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లింగుస్వామి హెచ్చరించారు. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారిసుకు రావాల్సిన థియేటర్లు లభించకపోతే పరిస్థితి పూర్తిగా మారుతుందన్నారు. వారు ఇలాగే వ్యవహరిస్తే 'వారిసుకు ముందు, వారిసుకు తర్వాత' అనేలా ఉంటుందని దర్శకుడు లింగుసామి అన్నరు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. దిల్‌రాజు నిర్మాత. యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సిద్ధమైన ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' పేరుతో సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించారు. -
టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం
అనువాద చిత్రాల వివాదం ముదిరేలా కనబడుతోంది. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించే విషయమై, ఇతర సమస్యల గురించి చర్చలు జరపడానికి ఆ మధ్య తెలుగు సినిమాల షూటింగ్స్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరిగిందనే టాక్ వినిపించింది. అయితే ‘వారిసు’ తమిళ సినిమా కాబట్టి షూటింగ్ ఆపలేదని ‘దిల్’ రాజు పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ‘వారిసు’ తమిళ సినిమాయే అనే ముద్ర పడిపోయింది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారిసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా సంక్రాంతి సందర్భంగానే నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే అనిల్ సుంకర నిర్మించిన ‘ఏజెంట్’ సంక్రాంతి రిలీజ్‌కే ముస్తాబు అయ్యింది. వీటితో పాటు తమిళంలో అజిత్ ‘తునివు’ కూడా సంక్రాంతి రిలీజ్‌కే రెడీ అవుతోంది. దాంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల థియేటర్ల సంఖ్య గురించిన అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్‌ను రిలీజ్ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక–నిర్మాతలు అసహనంగా ఉన్నారని టాక్. ఒకవేళ తెలుగులో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమిళంలోనూ తెలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించ కూడదన్నట్లుగా కోలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్స్‌లో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపడం అనేది జరిగే పని కాదని ‘తోడేలు’ ఈవెంట్లో అల్లు అరవింద్ పేర్కొన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాల రిలీజ్‌లను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్స్‌లో తొలి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్‌ను కోరుతూ లేఖ రాశాం’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
10 రోజులు.. 5 కోట్లు.. యూట్యూబ్ మొత్తం షేక్..!
కోలీవుడ్ స్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం 'వారిసు'. టాలీవుడ్లో ఈ చిత్రాన్ని 'వారసుడు' పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రం నుంచి 'రంజితమే' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ సాంగ్ యూట్యూబ్‌ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది. (చదవండి: 'వారీసు' బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ అవుట్) ఈ మాస్ సాంగ్ విడుదలై పది రోజులవుతోన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. రోజురోజుకు ఈ పాటకు ఆదరణ మరింత పెరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ఈ సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటిదాకా 5 కోట్ల వీక్షణలు, 18 లక్షల లైక్స్ సొంతం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. జయసుధ, ఖుష్భూ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. The sensational #Ranjithame hits 50M views 🔥 📽️ https://t.co/Q56reRe9tc 🎵 https://t.co/gYr0tkVJkD#Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Lyricist_Vivek @manasimm @AlwaysJani @TSeries #RanjithameSong #Varisu #VarisuPongal pic.twitter.com/l8ElaoR20h — Sri Venkateswara Creations (@SVC_official) November 16, 2022 -
'వారీసు' బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ అవుట్
తమిళ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వారీసు'. తెలుగులో ఈ సినిమా వారసుడుగా రిలీజ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన రష్మిక, విజయ్‌ల ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకర్షిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది. తమిళ వర్షన్లో విడుదలైన ఈ సాంగ్ అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. (చదవండి: విజయ్, రష్మికల ‘వారీసు’ మూవీ ఎలా ఉంటుందంటే) తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారీసు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నాడు. ఈ చిత్రం కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ కథా చిత్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
Varisu Vs Thunivu: తొమ్మిదేళ్ల తరువాత పోటీలో విజయ్, అజిత్ చిత్రాలు
సినీ పరిశ్రమలో ఒక్కొక్క జనరేషన్లో ఇద్దరు ప్రముఖ హీరోల మధ్య పోటీతత్వం ఉంటోంది. ముఖ్యంగా తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ మధ్య, ఆ తరువాత కమలహాసన్, రజనీకాంత్, తాజాగా విజయ్, అజిత్ మధ్య ఈ పోటీ సాగుతోందని చెప్పవచ్చు. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే వారి అభిమానులు మధ్య మాత్రం హోరా హోరీ పోరు సాగుతుంటుంది. విజయ్, అజిత్ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2001 విజయ్ నటించిన ప్రెండ్స్, అజిత్ నటించిన దిన చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. అలాగే 2007లో విజయ్ నటించిన జిల్లా, అజిత్ నటించిన ఆల్వార్ చిత్రాలు పోటీ పడ్డాయి. ఇక 2014లో విజయ్ నటించిన పోకిరి, అజిత్ నటించిన వీరం చిత్రాలు బరిలోకి దిగాయి. ఆ తరువాత ఇప్పటివరకు వీరిద్దరూ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదల కాలేదు. అలాంటిది తొమ్మిదేళ్ల తరువాత ఈ సంక్రాంతికి విజయ్ నటిస్తున్న వారీసు, అజిత్ నటిస్తున్న తుణివు చిత్రాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారీసు. నటి రష్మిక మందన నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తమిళనాడు విడుదల హక్కులను నిర్మాత లలిత్‌కుమార్ పొందారు. ఇక అజిత్ హీరోగా నటిస్తున్న హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. నటి మంజు వారియర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థ పొందింది. దీంతో మరోసారి విజయ్, అజిత్ అభిమానుల మధ్య పోరు తప్పడం లేదు. వారి విషయాన్ని పక్కన పెడితే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలైతే వసూళ్లకు ముప్పు ఏర్పడుతుందని ఎగ్జిబిటర్లు, డి ్రస్టిబ్యూటర్లు భయపడుతున్నారు.