సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వారిసు ట్రైలర్‌ | Thalapathy Vijay Varisu Official Trailer Released | Sakshi
Sakshi News home page

Varisu Trailer: విజయ్‌ 'వారిసు' ట్రైలర్‌ వచ్చేసింది

Published Wed, Jan 4 2023 5:43 PM | Last Updated on Wed, Jan 4 2023 5:55 PM

Thalapathy Vijay Varisu Official Trailer Released - Sakshi

తమిళ స్టార్‌ విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం వారిసు. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. తెలుగులో వారసుడు పేరిట సంక్రాంతికి విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది.

ఇందులో ఫ్యామిలీ బం​ధాలను చూపిస్తూనే విజయ్‌ను బిజినెస్‌మెన్‌గా చూపించారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా ట్రైలర్‌ అలా రిలీజైందో లేదో అప్పుడే #VarisuTralier ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాగా దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించాడు.

చదవండి: రష్మికపై ట్రోలింగ్‌.. రాళ్లు కూడా విసురుతారన్న కన్నడ స్టార్‌
డూప్లెక్స్‌ ఇంటిని అమ్మేసిన హీరోయిన్‌, ఎన్ని కోట్లంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement