Vamshi Paidipally
-
వంశీ స్టోరీ లైన్ కి అమీర్ ఖాన్ ఫిదా ...
-
వైజాగ్ మా సెంటిమెంట్ : వంశీ పైడిపల్లి
అల్లిపురం (విశాఖ దక్షిణం): వైజాగ్ మా సెంటిమెంట్ అని వారసుడు చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. వైజాగ్ వచ్చినప్పుడల్లా నగరంలో సంపత్ వినాయగర్ ఆలయం, సింహాచలం సింహాద్రి అప్పన్న గుడికి వెళ్లడం ఆనవాయితీ అన్నారు. తన సినిమాలన్నీ విశాఖలోనే షూటింగ్‌లు జరుపుకున్నాయన్నారు. భారత్ సూపర్ స్టార్ విజయ్ ఇటువంటి కథ ఒప్పుకోగానే తనకు భయమేసిం దన్నారు. వారసుడు చిత్ర యూనిట్ నగరంలోని మెలోడి థియేటర్లో శుక్రవారం సాయంత్రం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ వారసుడు తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కావడం గర్వంగా ఉందన్నారు. తమన్ సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచిందన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ బృందావనం తరువాత దర్శకుడు వంశీతో మళ్లీ పని చేశానన్నారు. దిల్‌రాజు ఉత్తమ నిర్మాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నటి సంగీత, డి్రస్టిబ్యూటర్ ప్రతినిధి దిల్ శ్రీనివాస్, థియేటర్ మేనేజర్లు గౌరీ శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘వారసుడు డైలీ సీరియల్’.. ట్రోలర్స్‌పై వంశీ పైడిపల్లి ఫైర్
తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘వారసుడు’ డైలీ సీరియల్ అంటూ వస్తున్న విమర్శలపై దర్శకుడు వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ సినిమా డైలీ సీరియల్‌ను తలపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ పోస్టులపై వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. డైలీ సీరియల్స్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయని.. కానీ సినిమా తీయడం సాధారణ విషయమేమీ కాదు.' అంటూ ఫైరయ్యారు వంశీ. వంశీ మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఇదంతా టీమ్ వర్క్. ప్రేక్షకులను అలరించడానిక్ మేం పడే కష్టం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ప్రతి సినిమా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. మనదేశంలో సూపర్‌స్టార్స్‌లో విజయ్ కూడా ఒకరు. ప్రతి సన్నివేశానికి రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయగలమనేది మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. ఆయనే నా సినిమాకు సమీక్షకుడు, విమర్శకుడు. ఆయన కోసం సినిమా చేశా. మరీ ఇంత నెగెటివ్‌గా ఉండకండి. సాఫ్ట్వేర్ జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చా. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే మూవీ చేశా.' అని అన్నారు. -
తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి
సంక్రాంతి రోజున ఓ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఆయన తాజాగా తెరకెక్కించిన మూవీ వారసుడు(తమిళంలో వారీసు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. పండుగ రోజున వంశీ తన తల్లి, తండ్రి, భార్యతో కలిసి కుటుంబ సమేతంగా థియేటర్లో వారసుడు మూవీ చూశారు. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన ఇక ఈ సినిమా చూసిన వంశీ పైడితల్లి తండ్రి సైతం భావోద్వేగానికి గురయ్యారు. పుత్రోత్సాహంతో ఆయనను హుత్తుకుని ఎమోషనల్ అయిన వీడియో వంశీ పైడిపల్లి షేర్ చేశారు. ‘‘నా జీవితంలో అతి పెద్ద విజయం సాధించాను. ‘వారసుడు’ వీక్షించి నా తండ్రి ఎంతగానో ఆనందించారు. ఈరోజు నేను నా జీవితంలో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాను. జీవితాంతం ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. నాన్నా.. నువ్వే నా హీరో. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’’ అంటూ వంశీ రాసుకొచ్చారు. చదవండి: ఆస్కార్ రావాలంటే సినిమాకు ఎలాంటి అర్హతలుండాలి..? ‘మహర్షి’ వంటి కమర్షియల్ విజయం తర్వాత వంశీ తెరకెక్కించిన పూర్తిస్థాయి తమిళ చిత్రం ‘వారీసు’. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించగా.. జయసుధ, ఖుష్బూ, శరత్‌కుమార్, శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు పోషించారు. తమిళంలో ఈ చిత్రం జనవరి 11న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. My Biggest achievement was today when My " Naanna / Appaa " was overwhelmed watching #Vaarasudu ( #Varisu )... This is the moment I will cherish for lifetime.. " You are my HERO Naannaa ".....Love You to Eternity... ❤️ pic.twitter.com/E5SokU8x8g — Vamshi Paidipally (@directorvamshi) January 14, 2023 -
Varasudu Movie Review: వారసుడు మూవీ రివ్యూ
టైటిల్: వారసుడు నటీనటులు: విజయ్, రష్మిక మందన్నా, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, శ్రీకాంత్, జయసుధ, సుమన్, శ్యామ్, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ దర్శకత్వం: వంశీ పైడిపల్లి సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ విడుదల తేదీ: జనవరి 14, 2023 తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారీసు. టాలీవుడ్లో 'వారసుడు'గా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటించింది. తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. తమిళ వర్షన్ జనవరి 11నే విడుదల కాగా.. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. శరత్‌కుమార్(రాజేంద్ర) ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. అతని భార్య జయసుధ(సుధ). వీరికి ముగ్గురు కుమారులు. విజయ్(విజయ్), శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్). పెద్ద పెద్ద మైనింగ్ కాంట్రాక్టులు డీల్ చేస్తుంటారు. రాజేంద్రతో జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) బిజినెస్‌లో పోటీ పడుతుంటాడు. రాజేంద్రతో పాటు శ్రీకాంత్, శ్యామ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. ముగ్గురు కుమారులు కావడంతో వారసుడిని ప్రకటించి బిజినెస్‌ను ఎవరికీ అప్పగించాలనే ఆలోచిస్తూ ఉంటాడు రాజేంద్ర. కానీ విజయ్‌కు తన తండ్రి వ్యాపారంలో కొనసాగడం ఇష్టం లేదని చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోమంటాడు రాజేంద్ర. ఆ తర్వాత సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తాడు. మరోవైపు జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) రాజేంద్ర కాంట్రాక్టులు కొట్టేసేందుకు కుట్రలు చేస్తుంటాడు. కానీ అతని వల్ల కాకపోవడంతో శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్)ను పావులుగా వాడుకుని వారి కుటుంబాన్ని దెబ్బతీస్తాడు. ఊహించని సంఘటనలతో రాజేంద్ర కుటుంబం విడిపోతుంది. ఆ తర్వాత రాజేంద్రకు ఓ భయంకర నిజాన్ని డాక్టర్ ఆనంద్(ప్రభు) చెబుతాడు. అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంటి నుంచి వెళ్లగొట్టిన విజయ్ తిరిగొచ్చాడా? అసలు రాజేంద్రకు డాక్టర్ చెప్పిన భయంకర నిజం ఏంటి? ఆ తర్వాత కుటుంబం అంతా కలిసిందా? జై, అజయ్ మళ్లీ కుటుంబంతో కలిశారా? రాజేంద్ర తన వారసుడిగా ముగ్గురిలో ఎవరినీ ప్రకటించారు? రాజేంద్ర బిజినెస్‌ను అలాగే కొనసాగించారా? చివరికి కుటుంబం, బిజినెస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే అసలు కథ. కథ ఎలా ఉందంటే.. కథ విషయానికొస్తే.. రోటీన్ స్టోరీ అయినప్పటికీ తెరపై రిచ్ లుక్ కనిపించేలా చేశారు. ప్రకాశ్ రాజ్ ఎంట్రీతో కథ మొదలు కావడం, బిజినెస్ డీల్స్, కాంట్రాక్టులు అంతా రోటీన్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ తప్ప.. రొమాంటిక్ సీన్స్ పెద్దగా కనిపించవు. విజయ్, కిచ్చా మామ(యోగిబాబు) మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పించడం ఖాయం. ఫస్టాప్‌లో కుటుంబంలో గొడవలు, బిజినెస్ కాంట్రాక్టలతో కథనం సాగుతుంది. కథలో జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకులు ఊహకు అందేలా ఉన్నాయి. అయితే సీరియస్ సీన్లలోనూ కామెడీ పండించడం వంశీ తనదైన మార్క్ చూపారు. కథలో కొత్తదనం లేకపోవడం వల్ల ప్రేక్షకులకు అంతగా ఆసక్తి కలగకపోవచ్చు. కథ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ప్రేమ, అప్యాయతలను కొత్త కోణంలో చూపించారు డైరెక్టర్ వంశీ. సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకవైపు బిజినెస్ కాపాడుకోవడం, అలాగే కుటుంబాన్ని ఒక్కటి చేయడం ఈ రెండు అంశాల ఆధారంగా కథను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు విజయ్ యాక్షన్ ప్రేక్షకులకు అలరిస్తాయి. హీరోయిన్ రష్మిక పాత్రను కొంతమేరకే పరిమితం చేశారు. కుటుంబ సభ్యుల మధ్యే పోటీ, బిజినెస్‌లో పెత్తనం కోసం వారి మధ్య జరిగే పోరాటం చుట్టే స్టోరీ నడుస్తుంది. విజయ్ ఫైట్స్, పాటలు అభిమానులను అలరించడంలో సందేహం లేదు. సెకండాఫ్‌లో రంజితమే సాంగ్ గ్రాండ్‌గా తెరకెక్కించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఫ్యామిలీ ఎమోషన్స్, బిజినెస్ చుట్టే కథను నడిపించడం రోటీన్‌గా అనిపిస్తుంది. ఇలాంటి కథలు గతంలోనూ వచ్చినప్పటికీ కాస్త భిన్నంగా చూపించారు. కొన్ని చోట్ల ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కంటతడి పెట్టించారు. ఓవరాల్‌గా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను తెరపై సరికొత్తగా ఆవిష్కరించారు వంశీ. ఎవరెలా చేశారంటే.. విజయ్ తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. సీరియస్ సీన్లలో కామెడీ పండించడం, ఫైట్ సీన్స్, డ్యాన్స్‌తో విజయ్ అదరగొట్టారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్‌లో తనదైన మార్క్ చూపించారు. రష్మిక పాత్ర చిన్నదే అయినప్పటికీ తన గ్లామర్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిజినెస్ మ్యాన్‌గా శరత్ కుమార్, అమ్మ పాత్రలో జయసుధ ఒదిగిపోయారు. శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, ప్రభు, యోగిబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. తమన్ సంగీతం సినిమాకు అదనపు బలం. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. ప్రవీణ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. -
రెమ్యూనరేషన్లో ఆల్ టైమ్ రికార్డ్.. వారీసుకు రూ.150 కోట్లు..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం 'వారీసు'. తెలుగులో వారసుడు పేరుతో ఈనెల 14న రిలీజ్ కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 11న విడుదల కానుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి విజయ్ తీసుకున్న పారితోషికంపై నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారీసు కోసం విజయ్ రూ.150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలవనున్నారు. దాదాపు ఇది బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్‌ను మించిపోయింది. అంతే కాకుండా కోలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. (ఇది చదవండి: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం) విజయ్ సినిమాల ఎంపికలోనూ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్‌లతో సహా యువ దర్శకుతలతో జతకట్టాడు. విజయ్ పూర్తిగా స్క్రిప్ట్‌ల ఆధారంగా సినిమాలను నిర్ణయిస్తాడని.. కమర్షియల్‌తో పాటు ఎంటర్టైనర్కు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూస్తానని నెల్సన్ అన్నారు. విజయ్‌కి ఓవర్సీస్లోనూ ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అలాంటి ఆదరణ ఉన్న చాలా తక్కువ మంది దక్షిణాది నటుల్లో ఈయన ఒకరు. వారిసు సినిమా తమిళంలో జనవరి 11న, హిందీలో జనవరి 13న, తెలుగులో సంక్రాంతి స్పెషల్‌గా 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. -
విజయ్,రష్మిక మందన్నా 'వారసుడు' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్!
దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వారసుడు. తమిళంలో వారిసు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేయనుంది. మొదట జనవరి 11న రావాల్సిన ఈ చిత్రాన్ని జనవరి 14కు వాయిదా వేసినట్లు తాజాగా దిల్ రాజున ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అనంతరం ఈ సినిమాపై పలువురు పాత కథ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొత్త పాయింట్ ఏం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్‌రాజు గతంలో వంశీ పైడిపల్లి తాను తీసిన బృందావనం చిత్రాన్నే అటూ ఇటూ మార్చి వారసుడు రూపొందించాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో వారసుడు మూవీ సంబంధించిన స్టోరీ లైన్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పలు తమిళ్ వెబ్సైట్లు ఈ మూవీ కథ ఇదేనంటూ కథనాలు రాసుకొస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. వంశీ పైడిపల్లి కొత్త పాయింట్‌తో వారసుడు తెరకెక్కించాడు అంటున్నారు. చదవండి: నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన ‘వారసుడు మూవీ విజయ్ రాజేంద్రన్ అనే బడా వ్యాపారి చూట్టూ చూట్టూ తిరుగుతుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్ తల్లిదండ్రులు శరత్ కుమార్, జయప్రద నటిస్తుండగా.. శ్రీకాంత్, శ్యామ్‌లు అన్న పాత్రలు పోషించారు. ఇందులో ప్రకాశ్ రాజ్ విజయ్‌కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీ ఓనర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వారిసు ట్రైలర్
తమిళ స్టార్ విజయ్ కథానాయకుడిగా నటించిన చిత్రం వారిసు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. తెలుగులో వారసుడు పేరిట సంక్రాంతికి విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఇందులో ఫ్యామిలీ బంధాలను చూపిస్తూనే విజయ్ను బిజినెస్‌మెన్‌గా చూపించారు. ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సినిమా ట్రైలర్ అలా రిలీజైందో లేదో అప్పుడే #VarisuTralier ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. కాగా దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. చదవండి: రష్మికపై ట్రోలింగ్.. రాళ్లు కూడా విసురుతారన్న కన్నడ స్టార్ డూప్లెక్స్ ఇంటిని అమ్మేసిన హీరోయిన్, ఎన్ని కోట్లంటే? -
ఆర్మీ క్యాంపులో విజయ్ దేవరకొండ.. ఆ ప్రాజెక్ట్ కోసమేనా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయాడా? లైగర్ ఫ్లాప్ తర్వాత కాస్త విరామం తీసుకున్న యంగ్ హీరో మరో ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తన తదుపరి సినిమా జనగణమన షూటింగ్ కోసం సైనికులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. గన్ పట్టుకుని ఉన్న ఓ ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. బాక్సాఫీస్ వద్ద లైగర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆపేసినట్లు చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా విజయ్ ఆర్మీ క్యాంపులో కనిపించడంతో ఈ చిత్రానికి సంబంధించిన పనులు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఫోటో-షేరింగ్ యాప్‌లో చిత్రాన్ని షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. 'దేశంలో అత్యంత పెద్ద దుర్ఘటన యూరీ' అని రాశాడు. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా ప్రకటన కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఛాపర్ నుండి బయటకు రావడం కనిపించింది. గతంలో ఈ చిత్రం ఆగిపోయిందన్న రూమర్లను నిర్మాత ఛార్మీ కౌర్ అవన్నీ ఫేక్ అంటూ ట్వీట్ చేసింది. వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్‌ల సహకారంతో ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఈ పాన్-ఇండియా చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో 3 ఆగస్టు 2023న విడుదల కానుంది. -
సూపర్ స్టార్ బర్త్‌డే.. మహేశ్‌కు చిరు, వెంకీల స్పెషల్ విషెస్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నేటితో 47వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. మంగళవారం(ఆగస్ట్ 9) మహేశ్ బర్త్‌డే సందర్భందగా సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటితో పాటు ప్రముఖ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లిలు మహేశ్‌కు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. హ్యాపీ బర్త్‌డే మహేశ్’ అంటూ రాసుకొచ్చారు. ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏🏻 Wishing @urstrulyMahesh a happy birthday. 💐🎂 pic.twitter.com/7fDFnDDtwi — Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2022 వెంకటేశ్ ట్వీట్ చేస్తూ.. ‘హ్యపీ బర్త్‌డే చిన్నోడా’ అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలోని వారిద్దరి ఫొటోను షేర్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, సురేందర్ రెడ్డి, అడవి శేష్ పలువురు సినీ ప్రముఖులు మహేశ్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఇక ఫ్యాన్ హంగామా అయితే మాములుగా లేదు. సోషల్ మీడియాను మహేశ్ బర్త్‌డే విషెష్ చెబుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో మహేశ్ బాబు బర్త్ డే ట్యాగ్ నెంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. Happy birthday dearest @urstrulyMahesh! Wishing you love and laughter this year Chinnoda ❤️ pic.twitter.com/jPcmyazO8v — Venkatesh Daggubati (@VenkyMama) August 9, 2022 Happy Birthday @urstrulymahesh anna! Wishing you lots of joy and success as always! — Jr NTR (@tarak9999) August 9, 2022 Happiest birthday to the most humble Superstar, an Amazing Director's Hero and more than that an incredible human being @urstrulyMahesh garu ♥️🤗 Wish you many More Blockbuster Hits sir! ✨#HBDSuperstarMahesh pic.twitter.com/QedO98qVjV — Anil Ravipudi (@AnilRavipudi) August 9, 2022 Happiest Birthday @urstrulyMahesh Sir... Wishing my brother all the more Happiness and the Best of everything always.. 🤗🤗 #HBDSuperstarMahesh pic.twitter.com/kkIYoStoGx — Vamshi Paidipally (@directorvamshi) August 9, 2022 Happy Birthday Superstar @urstrulyMahesh.. You are a heart-throb not only for the fans but also for the directors.. Keep Amazing all of us!!#HBDSuperStarMahesh pic.twitter.com/bCJ1dM1Sp8 — Sreenu Vaitla (@SreenuVaitla) August 9, 2022 Happy Birthday to the actor class apart and a true gentleman @urstrulyMahesh anna. Wishing you all the love and success 🤗 #HBDSuperstarMaheshBabu pic.twitter.com/A66F9r2RtS — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 9, 2022 Many many happy returns of the day sir 🤗 .@urstrulyMahesh So beautiful how the world is celebrating your birthday & we, the #Major team, are happy to have received your mentorship, love & support. You’ve been a guiding light and inspiration. Lots of love sir & happy birthday :) — Adivi Sesh (@AdiviSesh) August 9, 2022 -
విజయ్, రష్మికల ‘వారీసు’ మూవీ ఎలా ఉంటుందంటే
తెలుగు, తమిళ భాషల్లో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారీసు(తెలుగులో వారసుడు). ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది విజయ్‌కి స్పెషల్ చిత్రం అని చెప్పాలి. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై ఎందుకంటే ఇప్పటివరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఈ మూవీతో నేరుగా పలకిరించబోతున్నాడు. దీంతో ఈ మూవీ కథ, కథనాలు ఎలా ఉంటాయన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 4వ షెడ్యూల్‌ను ఇటీవలే హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. త్వరలో విశాఖపట్టణంలో షూటింగ్‌కు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోందని సమాచారం. ఇలాంటి సందర్భంలో వారీసు, చిత్ర అప్డేట్ను నటుడు శరత్‌కుమార్ వెల్లడించారు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత ఇది కుటుంబ సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్, రొమాన్స్ అంటూ జనరంజిక కథా చిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా విజయ్ అభిమానులు కోరుకునే విధంగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయన్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో ఒక్క పాత్రలోనే కనిపిస్తారని స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. విజయ్ అభిమానులకు ఈ చిత్రం డబుల్ ధమాకా అవుతుందట! -
విజయ్ బర్త్‌డే: వారసుడు నుంచి విజయ్ సెకండ్ లుక్ పోస్టర్
తమిళ స్టార్ దళపతి విజయ్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తమిళనాట అయితే విజయ్ పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్ గ్రాండ్ సెలబ్రెట్ చేస్తున్నారు. విజయ్‌కి పలువురు సినీ ప్రముఖులు సైతం విషెస్ తెలుపుతున్నారు. అంతేకాదు ఆయన బర్త్‌డే సందర్భంగా విజయ్ సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంతో తెరకెక్కుతున్న విజయ్ 66 మూవీకి సంబంధించిన మరో అప్డేట్ను తాజాగా వదిలారు మేకర్స్. నిన్న ఈమూవీ టైటిల్‌తో పాటు విజయ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చిత్రం బృందం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Vijay As Varisu: వారసుడుగా వస్తోన్న దళపతి విజయ్ వారిసు(తెలుగులో వారసుడు) అని టైటిల్ ఖారారు చేశారు ఈ మూవీకి. తాజాగా ఈ చిత్రంలోని విజయ్‌కి సంబంధించిన మరోలుక్ వదిలారు. చూట్టూ పిల్లలు, గాలి పటాలు, చెరుకు గడలు మధ్య ఎండ్ల బండిలో పడుకుని ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు విజయ్. ఈ సెకండ్ లుక్ పోస్టర్ చూస్తుంటే సంక్రాంతిని గుర్తు చేస్తుంది. అంటే ఇందులో విజయ్ పలు షేడ్స్‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా ఇందులో సరదాగా నవ్వుతూ కనిపించిన విజయ్ లుక్కు అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో విజయ్ కొత్తలుక్ పలు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే! Sankranthi 2023 is going to be special with the arrival of #Vaarasudu #VaarasuduSecondLook#Vaarasudu#Varisu#HBDDearThalapathyVijay Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman @Cinemainmygenes @KarthikPalanidp pic.twitter.com/GySYHlT488 — Sri Venkateswara Creations (@SVC_official) June 22, 2022 -
విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ 66వ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ లోకేషన్స్‌కు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. హైదరాబాద్‌లోని ఓ నర్సరీలో చిత్రికరించిన సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. దీంతో దర్శకుడు వంశీ పైడిపల్లి ఆసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో మూవీ బృందానికి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టాడట. ఇకపై ఇలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు షూటింగ్ స్పాట్లో ఎవరిని మొబైల్ ఫోన్స్ అనుమతించడం లేదని సమాచారం. చదవండి: వెకేషన్లో చరణ్, ఉపాసన.. క్యూట్ పిక్ షేర్ చేసిన మెగా హీరో హైదరాబాద్‌లో రోడ్డు పక్కనే ఉన్న ఓ నర్సరీలో విజయ్, రష్మికలకు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరిగింది. ఇందులో విజయ్ క్యాజువల్ డ్రెస్‌లో ఉండగా.. రష్మిక పోట్టి ఫ్రాక్‌లో కనిపించింది. ఆ నర్సరీ రోడ్డు పక్కనే ఉండటంతో వాహనదారులంతా ఆగి మరి షూటింగ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ రూపొందిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఆరంభంలో విడుదల కానుంది. చదవండి: ఆ హీరో నన్ను అలా పిలవడం ఇష్టం లేదు: రష్మిక షాకింగ్ కామెంట్స్ #Thalapathy66 - Exclusive Pic 💥🔥 pic.twitter.com/RDFXA0EGdl — M∆HI - Infinity Plus YouTube (@MahilMass) June 10, 2022 #Thalapathy66 Shooting Spot Full Size Image 😍🔥#Beast @actorvijay pic.twitter.com/0JvsS91yHg — Vijay Fans Page (@VijayKWoodKing) June 9, 2022 #Thalapathy66 leaked 🥳 pic.twitter.com/DuhRm1WEbs — Kings😎 (@ikarthik7744) June 8, 2022 -
Vijay 66: హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న విజయ్ మూవీ
దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్లో పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ప్రధాన తారాగణంతో 25 రోజుల పాటు చిత్రీకరించిన భారీ షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్లో చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. దళపతి 66 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవికి బంపర్ ఆఫర్! అలాగే ఈ సినిమాలో చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు షూటింగ్ పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు సెట్స్‌కి వచ్చి షూట్లో పాల్గొనడంతో ప్రతిరోజూ ఒక పండగలా షూటింగ్ జరిగింది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయిలో సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: సింగర్ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు.. Hai Chellam sssss. We are back #thalapathy66 pic.twitter.com/K2mK2TlNgi — Prakash Raj (@prakashraaj) May 22, 2022 -
సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ స్టార్ నటుడు విజయ్ (ఫొటోలు)
-
విజయ్-వంశీ పైడిపల్లి సినిమా వచ్చేది ఆ పండుగకే..
Vijay Vamshi Paidipally Movie Will Release In 2023: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా ఓ సినిమా రానుంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మంగళవారం (మే 10) తాజా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో భారీ తారాగణం కనువిందు చేయనుందని సమాచారం. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కనువిందు చేయనున్నారట. వీరితో పాటు శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. అలాగే ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. భారీ తారాగణంతోపాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు కూడా వర్క్ చేస్తున్నారు. చదవండి: పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు Privileged to have @RealSarathKumar sir onboard for #Thalapathy66.@actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_Official @Cinemainmygenes @karthikpalanidp#TeamThalapathy66 pic.twitter.com/9tYxYISbSP — Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గ్రాండ్ గా లాంచ్ అయిన విజయ్-రష్మిక మూవీ (ఫొటోలు)
-
చెన్నైలో గ్రాండ్ లాంచ్ అయిన విజయ్-రష్మిక మూవీ, నిర్మాత దిల్ రాజు
Vijay, Rashmika Mandanna Movie Starts In Chennai: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ ద్విభాషా చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ నేరుగా చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. ఇదివరకు దీనిపై ప్రకటన రాగా తాజాగా ఈ మూవీ చెన్నైలో గ్రాండ్‌గా ప్రారంభమైంది. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమా బుధవారం ఉదయం పూజ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు హీరోహీరోయిన్ల తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. చదవండి: హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు ద్విభాషా చిత్రంగా రూపొందే ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందించనున్నాడు. నేటి నుంచే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందని ఈ సందర్భంగా చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే మిగతా నటీనటులకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Elated to kick start the ambitious#Thalapathy66 with a Pooja ceremony in Chennai @actorvijay @directorvamshi @iamRashmika @MusicThaman @SVC_official @Cinemainmygenes #Thalapathy66Launched pic.twitter.com/3Z6Rev7fbi — Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2022 -
వేరే లెవల్.. దిల్‌రాజుకు షాకిచ్చిన విజయ్
Thalapathy Vijay Shocking Remuneration For Vamshi Paidipally Movie: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ త్వరలోనే తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం విజయ్ దాదాపు రూ.100కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. విజయ్‌కి తమిళం తర్వాత తెలుగులోనూ మాంచి మార్కెట్ ఉంది. చివరగా ఆయన నటించిన మాస్టర్ సైతం తెలుగులో సుమారు రూ.15 కోట్లు రాబట్టిందని టాక్. దీంతో తన మేనియాను దృష్టిలో ఉంచుకొని వంద కోట్ల పారితోషికం అడిగినట్లు సమాచారం. ఇక విజయ్ చేస్తున్న తొలి తెలుగు ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. -
దుబాయ్‌లో మహేశ్‌బాబు న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తుంటారు. ఇటీవలె మోకాలి సర్జరీ కోసం దుబాయ్ వెళ్లిన మహేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అక్కడే ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ఆయన తాజాగా న్యూ ఇయర్ వేడకలు జరుపుకుంటున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం ఫ్యామిలీతో కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో జాయిన్ అయ్యారు. దీంతో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీపా దగ్గర వీరంతా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటించిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్ ప్రీమియర్ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేశారు. చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన సతిమణి, అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, బాబీ, గుణశేఖర్, అలీ, సత్యదేవ్, విశ్వక్ సేన్, ఆనంద్ దేవరకొండతో పాటు రొమాంటి చిత్ర బృందం, పూరీ, ఛార్మీలు పలువురు సినీ సెలబ్రెటీలు ఈ ప్రీమియర్ షోని వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘రొమాంటిక్’ సినిమా చాలా బాగుందని.. హీరోగా ఆకాశ్ తప్పకుండా విజయం సాధిస్తాడని పేర్కొన్నారు. దీంతో ఈ ప్రీమియర్ షోకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికాశర్మ హీరోయిన్గా నటించింది. చదవండి: భార్య విరానికాపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తమిళ హీరో విజయ్‌ని డైరెక్ట్ చేయనున్న వంశీ పైడిపల్లి
‘మహర్షి’ సినిమాకి జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి తన నెక్ట్ మూవీని ప్రకటించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్‌తో తదుపరి సినిమా చేయనున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి ఆదివారం (సెప్టెంబర్ 26న) డైరెక్టర్ వంశీ అధికారిక ప్రకటన చేశాడు. ఈ ప్రాజెక్టు గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక బృందం ఈ మూవీకి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. కాగా విజయ్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘బీస్ట్’లో నటిస్తున్నాడు. ఆ మూవీ పూర్తి కాగానే వంశీ సినిమా పట్టాలెక్కనుంది. చదవండి: ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్ రాజు #Thalapathy66... Sharing with you all an exciting update about my next film with The #Thalapathy @actorvijay Sir, Produced by #DilRaju garu & #Shirish garu under my home banner @SVC_official pic.twitter.com/R24UhFGNlW — Vamshi Paidipally (@directorvamshi) September 26, 2021 -
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
-
Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్
అన్నదాతలు, సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, సాహసమే శ్వాసగా తీసుకునే పరాక్రమవంతులు, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలు... మరెందరో స్ఫూర్తి ప్రదాతలకు సాక్షి మీడియా గ్రూప్ సలాం చేస్తోంది. వారి ప్రతిభకు గుర్తింపుగా ఈనెల 17న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డులను అందజేసింది. అందులో భాగంగా 2019గాను మహేశ్‌బాబుకు మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘థ్యాంక్యూ భారతీగారు.. మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘మహర్షి’ చిత్రం మా అందరికీ చాలా ప్రత్యేకం. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ.. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులైంది.. ఇలాంటి ఓ అవార్డు ఫంక్షన్ చూసి. మా నిర్మాతలు అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్’ రాజుగార్లకు థ్యాంక్స్.. ‘మహర్షి’కి పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకం. 2020 అనే ఏడాదిని మేమందరం మిస్ అయిపోయాం.. మీరు అవార్డు ఇచ్చి మళ్లీ ఫంక్షన్స్ చేసుకునేలా చేశారు.. మా డైరెక్టర్ వంశీకి థ్యాంక్స్. ‘మహర్షి’ లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు మహర్షి’ విడుదలై రెండున్నరేళ్లు అయింది.. ఈ అవార్డు మేం చేసిన పనికి గుర్తింపు మాత్రమే కాదు.. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు.. మళ్లీ మంచి రోజులు వస్తాయని. ఇది నా ఒక్కడి అవార్డే కాదు.. మొత్తం మా టీమ్‌ది. నేను చేసిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజుగారు నా కుటుంబ సభ్యుల్లో ఒకరు. రాజు, శిరీష్, లక్ష్మణ్ గార్లకు కూడా థ్యాంక్స్. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంటే కాదు.. మన సంస్కృతి. మళ్లీ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడే రోజుల కోసం వేచి చూస్తున్నా. ‘మహర్షి’ ప్రొఫెషనల్‌గా నాకు ఎంత ఇచ్చిందో తెలియదు కానీ వ్యక్తిగతంగా మహేశ్‌బాబుని ఇచ్చింది. నాకు జీవితాంతం రుణపడి ఉంటారని మహేశ్ అన్నారు.. ఆ మాట నాది. నేను ‘మహర్షి’ కథ చెప్పిన రోజు ఆయన చెప్పారు.. ‘ఈ సినిమాకి చాలా అవార్డులు అందుకుంటారని.. ఆ మాటలన్నీ నిజమయ్యాయి.. నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ సార్’. – వంశీ పైడిపల్లి, మోస్ట్ ఇన్స్పైరింగ్ మూవీ (మహర్షి) మహేశ్ వెన్నెముకగా నిలిచారు ఈ అవార్డుకి మా ‘మహర్షి’ సినిమాని ఎంపిక చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి థ్యాంక్స్. నాకెప్పుడూ ఓ ఎగై్జట్‌మెంట్ ఉంటుంది. మంచి సినిమా తీస్తే డబ్బులే కాదు.. గొప్ప గౌరవం తీసుకొస్తుందని నమ్ముతాను. ‘మహర్షి’ కథను వంశీ చెప్పినప్పుడు అదే నమ్మాను.. దానికి మహేశ్‌గారు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమా ప్రేక్షకులకే కాదు అవార్డ్స్, రివార్డ్స్ వరకూ వెళుతున్నందుకు థ్యాంక్స్. వంశీ పైడిపల్లి చెప్పినట్లు మాది పెద్ద ప్రయాణం. తన ఐదు సినిమాల్లో నాలుగు సక్సెస్‌ఫుల్‌గా చేశాం.. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. మహేశ్‌గారితో కూడా మా బ్యానర్లో హ్యాట్రిక్ సాధించాం. – నిర్మాత ‘దిల్’ రాజు, మోస్ట్ పాపులర్ మూవీ (మహర్షి) -
ఒకే ఫ్రేములో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్
Vamshi Paidipally Birthday: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకచోట చేరితే ఎలా ఉంటుంది? అబ్బో, ఆ సందడే వేరంటారా? ప్రముఖ దర్శకులంతా కలిసి ఇప్పుడు అదే పని చేశారు! టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి జూలై 25న పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన స్నేహితులతో పాటు ఇండస్ట్రీ సహచరులకు పార్టీ ఇచ్చాడు. ఈ క్రమంలో బర్త్‌డే వేడుకలకు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో టాలీవుడ్ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ, పరశురామ్, సుకుమార్, బోయపాటి శ్రీను, మెహర్ రమేశ్, కీర్తి సురేశ్, దిల్ రాజు- ఆయన భార్య, కార్తీ, అల్లు అరవింద్, సోనూసూద్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ బర్త్‌డే వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, పరశురామ్ సుకుమార్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, మెహర్ రమేశ్‌లు ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇది కాస్త ఆలస్యంగా బయటకు రాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
తెలుగు సినిమా చేయనున్న విజయ్!
తమిళ హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గత నాలుగేళ్లుగా విజయ్ నటించిన చిత్రాలు అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఒకేసారి విడుదల అవుతున్నాయి. సర్కార్, అదిరింది, విజిల్, మాస్టర్ వంటి చిత్రాలు విజయ్‌కి ఇక్కడ అభిమానులను సంపాదించిపెట్టాయి. ఈ చిత్రాలకు లభించిన ఆదరణను చూసి, తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకున్నారట విజయ్. ‘బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి చెప్పిన కథను విన్నారట. ఈ కథ విజయ్‌కి నచ్చిందని, త్వరలో వీరిద్దరి కాంబినేషన్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని ఫిల్మ్‌నగర్ టాక్. చదవండి: మనవరాలికి ఇళయరాజా సంగీత పాఠాలు -
ఫన్ ఫ్యామిలీ, నైటౌట్.. మహేశ్ ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన చిత్రం మహర్షి. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి, మహేశ్ బాబు మధ్య స్నేహబంధం మరింత బలపడింది. మహేశ్ గారాలపట్టి సితార, వంశీ కూతురు ఆద్య కలిసి ఓ యూట్యూబ్ ఛానల్‌ను కూడా మొదలుపెట్టారు. రెండు ఫ్యామిలీలు టైం దొరికినపుడల్లా సరదాగా గడుపుతుంటాయి. అందుకు ఈ ఫోటోనే నిదర్శనం. మహేశ్-వంశీ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో డిన్నర్ చేశారు. అనంతరం అంతా కలిసి కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ..ఫన్ ఫ్యామిలీస్..నైటౌట్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని మహేశ్ ప్రకటించాడు. అయితే వంశీ వినిపించిన కథలు నచ్చకపోవడంతో రిజెక్టు చేశాడు. ఇపుడు పరశురాంతో కలిసి సర్కారు వారి పాట చేస్తున్నాడు ప్రిన్స్. -
మళ్లీ కలుస్తున్నారు
‘ఎవడు’ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరో రామ్‌చరణ్. ఈ కాంబినేషన్ మళ్లీ కలవనుందని ఈ మధ్య తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా పక్కా అనేది తాజా సమాచారం. ఇటీవలే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్. దసరా తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’లో అతిథి పాత్ర చేస్తున్నారు రామ్‌చరణ్. ఈ సినిమాలకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యాక వంశీ పైడిపల్లి సినిమా చిత్రీకరణ మొదలుపెడతారు చరణ్. ఇదో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని టాక్. -
కాంబినేషన్ రిపీట్?
ఆరేళ్ల క్రితం వచ్చిన ‘ఎవడు’ (2014)తో హీరో రామ్‌చరణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ కుదిరింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కుతుందనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కొత్త స్టోరీ లైన్ రామ్‌చరణ్‌కు నచ్చిందట. దీంతో ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నారట వంశీ. ఈ సంగతి ఇలా ఉంచితే... రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’లో నటిస్తున్నారు చరణ్. ఇందులో ఎన్టీఆర్ మరో హీరో. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. -
సీతు పాప సింపుల్ యోగాసనాలు
హైదరాబాద్: నేడు(జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆద్య, సితారలు అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా సులువైన యోగాసనాలు ఎలా వేయాలో వివరిస్తూ ఓ వీడియోను తమ ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. సునాయసంగా వేసే యోగాసనాలతో పాటు, ఆ ఆసనాలతో కలిగే లాభాలను చక్కగా వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక వీరి ప్రయత్నానికి, డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. (సితార డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా) ఇక మహేశ్‌బాబు ముద్దుల కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్య ఇద్దరూ కలిసి ఏ అండ్ ఎస్ అనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆటలు, విజ్ఞానం, వినోదానికి సంబంధించిన పలు వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల తర్వాత మహేశ్, రష్మికలను ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు ఇంటర్వ్యూచేసి అకట్టుకున్నారు. ఆడియన్స్‌కు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ పలు వీడియోలను పోస్ట్ చేస్తుండటంతో ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్‌కు అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. (మా నాన్న మాకు మంచి ఫ్రెండ్) -
మహేశ్ కాదనడంతో చరణ్‌తో..
‘మహర్షి’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రం మహేశ్ బాబుతోనే చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ మీట్లో మహేశ్‌తో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు కూడా. అయితే కారణాలు ఏంటో తెలియదు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. వంశీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చినప్పటికీ పూర్తి స్క్రిప్ట్ పట్ల సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ చిత్రం నుంచి మహేశ్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు మహేశ్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో అయోమయంలో పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ షాక్ నుంచి కోలుకొని రామ్ చరణ్ కోసం వంశీ పైడిపల్లి ఓ సబ్జెక్ట్‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్ కథాంశంతో స్క్రిప్ట్‌ను సిద్దం చేసి త్వరలోనే మెగాపవర్ స్టార్‌ను కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మహేశ్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్‌నే చరణ్‌కు వినిపిస్తాడా లేక చరణ్ కోసం మరో కథను ఎంచుకున్నాడో తెలియదు. అంతేకాకుండా తన కారణంగా అప్సెట్ అయిన వంశీని శాంతపరిచే క్రమంలో ఈ సినిమాను మహేశే నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు సమచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఫిలింనగర్ సర్కిళ్లలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక వంశీ-చరణ్ కాంబినేషనలో వచ్చిన ‘ఎవడు’ సినిమా సపర్‌డూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: ‘అల..వైకుంఠపురములో’.. 1 బిలియన్ వ్యూస్ ‘ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా’ -
మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!
రెబల్‌స్టార్ ప్రభాస్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా వచ్చిన చిత్రం ‘మున్నా’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజ్ నిర్మించారు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు సూపర్‌డూపర్ హిట్ సాధించడం, ఫస్ట్ లుక్ పోస్టర్లలో ప్రభాస్ లుక్ కొత్తగా డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. అయితే అభిమానుల అంచనాలను ‘మున్నా’ అందుకోలేకపోయాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ స్టైలీష్ లుక్‌ను, ఇలియానా అందచందాలను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ చిత్రం విడుదలై నేటికి పదమూడేళ్లయింది. అప్పటితో పోలిస్తే ప్రభాస్ క్రేజ్ వెయ్యింతలు అయింది. దీంతో మరోసారి ఆ సినిమా ముచ్చట్లు సోషల్‌మీడియాలో మారుమోగిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం ట్విటర్లో ‘#13yearsformunna’ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: ‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’ ట్రెండింగ్ టిక్‌టాక్‌లో శృతిహాసన్, అక్షర హాసన్ -
మణిశర్మ, తమన్.. ఇప్పుడు అనిరుద్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్వకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేసవి తర్వాత ప్రారంభం కానుందట. అయితే సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పట్నుంచి ఎన్నో వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కథ ఇదేనంటూ, హీరోయిన్ ఈవిడేనంటూ అనేక గాసిప్స్ వచ్చాయి. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేదానిపై అటు మహేశ్ ప్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఆభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా వారికి ఊహకందిన పేర్లను సూచిస్తూ మహేశ్ సినిమాకు సంగీత దర్శకుడు ఇతడేనంటూ పేర్కొంటున్నారు. ఈ జాబితాలో ఎక్కువగా వినిపించిన పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. తిరిగి మునపటి ఫామ్‌లోకి వచ్చిన మణిశర్మ మహేశ్ తాజా చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారని తొలుత వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. దీంతో డైరెక్టర్ వంశీ మణిశర్మ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ‘అల.. వైకుంఠపురుములో’ మ్యూజిక్ ఆల్బమ్‌తో మ్యాజిక్ చేసిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరును కూడా చిత్ర బృందం పరిశీలిస్తోందని మరో టాక్. మహేశ్-తమన్ కలయికలో వచ్చిన దూకుడు, బిజినెస్‌మన్ సినిమాల్లోని పాటలు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. దీంతో ఈ సినిమాకు తమనే సంగీత దర్శకుడు అంటూ ఊహాగానాలు మరింతగా పెరిగాయి. తాజాగా మరో సంగీత దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అజ్ఞాతవాసి, గ్యాంగ్‌లీడర్ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితుడైన అనిరుద్ రవిచంద్రన్ మహేశ్-వంశీ చిత్రానికి సంగీతం అందిచనున్నాడని టాలీవుడ్లో వినిపిస్తోంది. అంతేకాకుండా మహేశ్, వంశీలకు మంచి స్నేహితుడైన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర బృందం ఎవరిని ఫైనల్ చేస్తుందో వేచి చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి మహేశ్ విదేశాల నుంచి తిరిగొచ్చాక ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. చదవండి: నాది చాలా బోరింగ్ లైఫ్! ‘ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్’ -
డబుల్ ధమాకా?
బాల నటుడిగా ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో డబుల్ యాక్షన్ చేశారు మహేశ్‌బాబు. హీరోగా మారిన తర్వాత పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేయలేదాయన. కానీ త్వరలోనే స్క్రీన్‌పై మహేశ్‌ను రెండు పాత్రల్లో చూడబోతున్నాం అని సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో మహేశ్‌బాబు రెండు పాత్రల్లో కనిపిస్తారని టాక్. అందులో ఒక పాత్ర గ్యాంగ్‌స్టర్‌గా ఉంటే మరోటి ప్రొఫెసర్ పాత్ర అని తెలిసింది. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
మహేశ్‌బాబు చిత్రంలో విజయ్ దేవరకొండ?
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ సక్సెస్‌ను విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా కుటుంబసమేతంగా విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నాడు మహేశ్. ఇక తన 27వ చిత్ర దర్శకత్వ బాధ్యతలను వంశీ పైడిపల్లికి అప్పగించిన విషయం తెలిసిందే. మహర్షితో సూపర్ డూపర్ హిట్ అందించిన వంశీపై నమ్మకంతో మరో సినిమాకు మహేశ్ సైన్ చేశాడు. ‘సరిలేరు’ సక్సెస్ మీట్లో ‘మహర్షి, సరిలేరు’ చిత్రాల కంటే గొప్ప చిత్రాన్ని అభిమానులకు అందిస్తానని వంశీ మాటిచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే విజయ్ దేవరకొండ- మహేశ్ బాబు ఒకే స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. మహేశ్-వంశీ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రంలో టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టు సమాచారం. విజయ్ కోసం వంశీ స్పెషల్ క్యారెక్టర్ రూపొందిచనట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విజయ్‌ది కీలక పాత్రన లేక అతిథి పాత్రనా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేశ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా విజయ్ కూడా ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది నిజం కావాలిన అటు టాలీవుడ్ ఇటు అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరు ఒకే తెరపై కనిపిస్తే రచ్చరచ్చే అని అంటున్నారు. కాగా, మహేశ్ విదేశాల నుంచి తిరిగొచ్చాక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: శేఖర్ మాస్టర్‌కు మహేశ్ బాబు బంపర్ ఆఫర్.. సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ -
ఏజెంట్ మహేశ్
‘మహర్షి’ సినిమా తర్వాత మరోసారి హీరో మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జేమ్స్ బాండ్ సినిమాల తరహాలో స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోందట. ఇందులో మహేశ్ సీక్రెట్ ఏజెంట్‌గా (రహస్య గూఢచారి) నటిస్తారని తెలిసింది. మే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత రెండు నెలలు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు మహేశ్. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి న్యూయార్క్‌కి హాలిడేకి వెళ్లారు. ఈ హాలిడే పూర్తయిన తర్వాత షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. -
శ్రుతి కుదిరిందా?
చిన్న బ్రేక్ తర్వాత వరుస సినిమాలు అంగీకరిస్తున్నారు శ్రుతీహాసన్. రవితేజతో ‘క్రాక్’ సినిమా చేస్తున్నారామె. ఇపుడు మరో పెద్ద సినిమాలో కూడా కనిపించబోతున్నారని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతీహాసన్ పేరుని పరిశీలిస్తున్నారట దర్శకుడు వంశీ పైడిపల్లి. గతంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జోడీగా నటించిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఎవడు’ సినిమాలోనూ శ్రుతీహాసనే హీరోయిన్. వచ్చే ఏడాది వేసవి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో మహేశ్, శ్రుతీ రెండోసారి జోడీ కడతారా? వేచి చూడాలి. -
‘మహర్షి’ డిలీటెడ్ సీన్
సూపర్‌స్టార్ మహేష్ బాబు మహర్షి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి..నేడు వందరోజుల పండుగను జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సామాజిక సందేశంతో కూడుకుని, కమర్షియల్ అంశాలతో ఉండటంతో బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టింది. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో కొన్ని సీన్లకు కత్తెర వేశామని మూవీ ప్రమోషన్లలో చిత్రయూనిట్ పేర్కొన్నసంగతి తెలిసిందే. అయితే నేడు వందరోజులు అయిన సందర్భంగా.. ఈ మూవీ నుంచి తీసేసిన సన్నివేశాన్నిరిలీజ్ చేశారు. కాలేజ్‌లో గొడవకు సంబంధించిన ఈ సన్నివేశం అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. మహర్షి తరువాత మహేష్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ.. సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని రెడీ చేస్తున్నాడు. -
ఇది ‘మహర్షి’ కలిపిన బంధం
మహర్షి చిత్రం సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లితో సూపర్‌స్టార్ మహేష్ బాబు కలిసి చాలా రోజులు జర్నీ కొనసాగించారు. ఇక ఈ జర్నీలో ఇరువురి ఫ్యామిలీలు కూడా దగ్గరయ్యాయి. దీంతో ఈ రెండు కుటుంబాలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఆ మధ్య అందరూ కలసి విదేశీ టూర్లకు కూడా వెళ్లారు. ఇరు కుటుంబాల్లో ఏవైనా ఈవెంట్స్ జరిగితే అందరూ అక్కడే ప్రత్యక్షమవుతున్నారు. తాజాగా వంశీ పైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా.. ఒకేచోటకు చేరి సెలబ్రేట్ చేశారు. వంశీ పైడిపల్లికి కేక్ తినిపిస్తున్న ఫోటోను మహేష్ షేర్ చేస్తూ.. వంశీ పైడిపల్లికి బర్త్‌డే విషెస్ తెలిపాడు. మహేష్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్ అని తెలిపాడు. Thank You for everything Sir... 🤗😊 https://t.co/7CuMUqkM0P — Vamshi Paidipally (@directorvamshi) July 27, 2019 -
కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం
‘‘ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు మాకు అద్భుతమైన ప్రయాణం దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్న దానికి, మాకు లభించిన అనుభవాన్ని పంచాలనుకుంటున్నాం. ఇందుకోసం కొంతమంది నిర్మాతలతో మా వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) అసోసియేట్ అవుతోంది. స్క్రిప్ట్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఆయా చిత్రనిర్మాతలకు మా సంస్థ నుంచి మద్దతు ఇస్తాం. మా సంస్థ ద్వారా ఎంతోమంది నిర్మాతలకు, రాబోయే నిర్మాతలకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాం’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పంపిణీరంగం నుంచి నిర్మాతగా మారి, ఎన్నో విజయాలు చూస్తున్నారు ‘దిల్’ రాజు. ఎస్వీసీ సంస్థ 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘1999లో ‘ఒకే ఒక్కడు’ సినిమాతో మా వెంకటేశ్వర ఫిల్మ్స్ మొదలైంది. ఈ సినిమాకు ముందు (1998 జూలై 24) ఇదే జూలై 24న ‘తొలిప్రేమ’ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామ్యులుగా ఉన్నాం. పవన్‌కల్యాణ్‌గారిని స్టార్‌ని చేసిన సినిమా అది. ‘పెళ్లి పందిరి’ సినిమా సక్సెస్ మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకువచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే మా డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన నిర్మాతలందరికీ ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ పదహారేళ్లలో 32 సినిమాలు తీశాం. 2017లో ఆరు, గత ఏడాది మూడు సినిమాలు మా సంస్థ నుంచి వచ్చాయి. ఈ ఏడాది నాలుగు సినిమాల రిలీజ్లు ప్లాన్ చేస్తున్నాం. ఒక సినిమా సక్సెస్ కావాలంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు కావాల్సినవి ఎన్నో ఉంటాయి. శివలెంక కృష్ణప్రసాద్‌గారు, విజయ్, సత్యనారాయణరెడ్డి, కృష్ణ, గోపీ, రాహుల్, హరి, సాగర్, రాహుల్ యాదవ్ నక్కా, విజయ్ చిల్లా, మహేశ్ కోనేరు, రాజీవ్.. ఇలా ఈ నిర్మాతలందరితో మాకు ఒక మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో మా సంస్థతో అసోసియేషన్ గురించి ఆలోచించాం. వారితో ట్రావెల్ అవుతూ మా సంస్థ నుంచి వస్తున్న మంచి సినిమాల మాదిరిగానే వారు కూడా మంచి సినిమాలు తీయడానికి మా వంతు కృషి చేస్తాం. వీరేకాదు, మంచి సినిమాలు చేయాలని మంచి స్క్రిప్ట్‌ను తీసుకువస్తే మా ఎస్వీసీని వాడుకుని తెలుగు ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాం.అలాగే డబ్బు సంపాదిస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా «థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘రాజుగారితో నాకు 18ఏళ్ల పరిచయం ఉంది. సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీవైపు వచ్చారు రాజు, శిరీష్, లక్ష్మణ్. ‘ఎస్వీసీ’ సక్సెస్ఫుల్ జర్నీలో నా వంతుగా నాలుగు సినిమాలు ఉండటం హ్యాపీగా ఉంది. ఎస్వీసీని నా మాతృసంస్థగా భావిస్తాను. రైటర్‌గా నాకు జన్మనిచ్చారు. ఈ సంస్థ సపోర్ట్‌తో నాలాంటి దర్శకులు చాలామంది స్థిరపడే అవకాశం ఉంది’’ అన్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. ‘‘ఎస్వీసీ’ జర్నీలో నాది 2015–2019 టైమ్. ‘దిల్’ రాజుగారి జడ్జిమెంట్, లక్ష్మణ్ ప్లానింగ్, శిరీష్ ఎగ్జిక్యూషనే ఈ సంస్థ సక్సెస్‌కు కారణమనిపిస్తోంది. ఎస్వీసీ అంటే సక్సెస్ వీళ్ల కేరాఫ్ అడ్రస్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఇండస్ట్రీలో అన్నింటినీ అన్ని రకాలుగా చూసినవాడే నిర్మాత. ఈ ముగ్గురూ ఇంత దూరం వచ్చారు. వీరితో అసోసియేట్ అవ్వడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ‘‘ఇలాంటి పెద్దబ్యానర్లో అసోసియేట్ అయితే చిన్న సినిమాలు మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతాయి’’ అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్. ‘‘నిర్మాత అంటే ప్రతిరోజూ యుద్ధమే. 20ఏళ్లలో దాదాపు 95 శాతం విజయాలతో ఈ సంస్థ టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా నిలబడింది’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ‘‘ఆర్య’ సినిమా సమయంలో నేను, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ ఈ బ్యానర్‌తో అసోసియేట్ అయ్యాం. ఈ రోజు మేమంతా నిర్మాతలుగా మారాం’’ అన్నారు విజయ్ చిల్లా. ‘‘సినిమా చూపిస్తా మామా’ చిత్రం నుంచి ఈ సంస్థతో అసోసియేట్ అయ్యాను’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. లక్ష్మణ్, శిరీష్, సాగర్, కృష్ణ, గోపీ తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ బర్త్‌డే.. వారికి చాలెంజ్ విసిరిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా సోషల్ మీడియాలో ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. ఈ చాలెంజ్ సినీ ఇండస్ట్రీ వరకు వెళ్లింది. ఎంపీ సంతోష్ ఈ చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని.. కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ చాలెంజ్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి, మాజీ ఎంపీ కవిత, విజయ్ దేవరకొండ, నితిన్‌లకు విసిరారు. దీనికి స్పందిస్తూ.. ‘ఈ చాలెంజ్‌ను విసిరినందుకు ధన్యవాదాలు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో అవసరం’ అంటూ వంశీ పైడిపల్లి ట్వీట్ చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అటవీశాఖ ద్వారా అమలు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధిలో భాగంగా కీసరగుట్ట అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును సొంత నిధులతో తీర్చిదిద్దుతాం అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. #GiftASmileChallenge Thank You @MPsantoshtrs Anna for this challenge... Glad to be a part of this amazing initiative that will gift many smiles for sure.. much needed.. :) #HappyBirthdayKTR @KTRTRS https://t.co/mheNpVwLc0 — Vamshi Paidipally (@directorvamshi) July 23, 2019 -
భారత్-ఆసీస్ మ్యాచ్‌కు ‘మహర్షి’
ఓవల్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందడి చేశారు. మహర్షి చిత్రం విజయవంతం కావడంతో ప్రస్తుతం వరల్డ్ టూర్లో ఉన్న మహేష్ బాబు ప్రపంచకప్‌లో టీమిండియా మ్యాచ్‌లను వీక్షించేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లారు. క్రికెట్లో రెండు దిగ్గజ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌పైనే ప్రస్తుతం ఇరు దేశాలకు చెందిన క్రికెట్ ప్రియుల దృష్టి కేంద్రీకృతమై వుంది. గత కొన్ని రోజులుగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ కుటుంబం.. వంశీ పైడిపల్లి ఈ మ్యాచ్‌ను వీక్షిస్తూ.. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రేటింగ్ మహర్షి అంటూ వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు. #INDvAUS.. At the Oval.. :)#CelebratingMaharshi pic.twitter.com/eINFf18umX — Vamshi Paidipally (@directorvamshi) June 9, 2019 -
175 కోట్లు కలెక్ట్ చేసిన ‘మహర్షి’
సూపర్‌స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన మహర్షి చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మొదటి ఆట నుంచి డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం నిలకడగానే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ 175 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఓవర్సీస్లో మహర్షి అంతగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ జనాల్లోకి బాగానే చేరింది. ఆ మధ్య పొలాల్లో దిగి వీకెండ్ వ్యవసాయాన్ని చాలా మంది ఫాలో అయ్యారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించారు. -
రైతులను సన్మానించిన ‘మహర్షి’ చిత్రబృందం
సాక్షి, నిర్మల్ : వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలె ఈ మూవీ వందకోట్లను కలెక్ట్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లి తన సొంత గ్రామమైన ఖానాపూర్లోని లక్ష్మీ థియేటర్లో సందడి చేశారు. అక్కడి రైతులకు మహర్షి సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. అంతేకాకుండా చిత్రయూనిట్ రైతులను ఘనంగా సన్మానించింది. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. తాను పుట్టిన ఊర్లోని సినిమా హాల్లో రైతులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. -
రైతుల్నిసన్మానించడం అభినందించదగ్గ విషయం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహర్షి సినిమా దర్శకనిర్మాతలు
-
‘మహర్షి’ రిస్క్ చేస్తున్నాడా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే సినిమాకు యునానిమస్‌గా పాజిటివ్ టాక్ మాత్రం రాలేదు. ముఖ్యంగా సినిమా లెంగ్త్ విషయంలో విమర్శలు గట్టిగానే వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహర్షి టీం మరికొన్ని సీన్స్‌ను యాడ్ చేసేందుకు రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ ఇంటికి రిషి (మహేష్ బాబు) వెళ్లే సీన్ నిడివి పెంచటంతో పాటు సెకండ్ హాఫ్లోనూ రెండు సన్నివేశాలను యాడ్ చేయనున్నారట. ఇప్పటికే లెంగ్త్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మహర్షి సినిమాకు రిపీట్ ఆడియన్స్ కోసం చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన మహర్షి సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డుల మీద కన్నేసిన చిత్రయూనిట్ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. -
టికెట్ రేట్ల పెంపుకి ప్రభుత్వం కారణం కాదు
‘‘కొన్ని సినిమాలు చూసినప్పుడు ‘వావ్.. ఎంత మంచి సినిమా చేశారు.. ఎంత బాగా తీశారు’ అనిపిస్తుంది. ‘మహర్షి’ నా సినిమా కాకపోయినా, మా సంస్థ ఈ సినిమాతో అసోసియేట్ కాకపోయినా కూడా నేను అలాగే ఫీలయ్యేవాణ్ణి. ‘మహర్షి’ గ్రేట్ సినిమా అని అందరూ అంగీకరిస్తారు’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా, ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై సి.అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు పంచుకున్న విశేషాలు... ► మహేశ్‌గారి కెరీర్‌లోని టాప్ సినిమాల లిస్టులో ‘మహర్షి’ కూడా ఉంటుంది. ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకలో నేను చెప్పినట్టు.. ‘ఈ సినిమా ఎంత సక్సెస్ కావాలని ఆశపడుతున్నారో అంతే కోరుకోండి’ అని అభిమానులకు చెప్పాను. అది అతి నమ్మకంతో చెప్పలేదు. ఈ సినిమాతో నా ప్రయాణం, కథ, ప్రీ రిలీజ్‌కి ముందే సినిమా చూడటంతో నమ్మకంతోనే ఆ మాట చెప్పాను. ► అశ్వినీ దత్‌గారి పేరు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉంది. మే 9న ఆయన సంస్థలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి’ సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి. పీవీపీగారు కూడా ప్యాషన్‌తో ఈ సినిమాతో అసోసియేట్ అయ్యారు. ఈ సినిమాతో వంశీ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటాడు. మ్యాజిక్ క్రియేట్ చేసే సినిమా ఇది. ఈ మాట కూడా అతి నమ్మకంతో అనడం లేదు. ► భారీ బడ్జెట్‌తో చేసిన సినిమా కావడం వల్ల పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఐదో షో కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ జీఓ వల్ల 8 గంటలకే షోలు పడతాయి. మామూలుగా తెలంగాణలో 8 గంటల షోల ట్రెండ్ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున 5 గంటలకే షోలు స్టార్ట్ అవుతాయి. మేం అనుమతి ఇస్తే వాళ్లు అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా షోలు మొదలుపెడతారు. ► తెలంగాణ ప్రభుత్వం కాకుండా, థియేటర్ల ఓనర్లే కోర్టు ద్వారా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అలాగే ఆంధ్రాలోనూ పెరిగాయి. తెలంగాణలో రూ.80 టికెట్ రూ.100 చేశారు. రూ.100ది రూ.125 చేశారు. మల్టీప్లెక్స్‌ల వారు రూ.150 ఉన్న చోట రూ.200 చేశారు. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్, కర్నూలు... ఇలా అక్కడ రూ. 200 ఉంది. మల్టీప్లెక్స్‌లలో బెంగుళూరులో వీకెండ్లో రూ.300–500 ఇచ్చేంత ప్రొవిజన్ ఉంది. తెలంగాణలో అది లేదు. తెలుగు స్టేట్స్లో లిమిటేషన్ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని కొన్ని మీడియాల్లో తప్పుడు వార్తలు రాశారు. ► ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి సినిమాలు విడుదలైనప్పుడు రేట్లను పెంచుకోవచ్చు. కానీ తెలంగాణలో అది ఇది వరకు లేదు. పక్క రాష్ట్రాల వారితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కనీసం పెరగాలి కదా అని థియేటర్ల వాళ్లు వెళ్లి టిక్కెట్ల పెంపునకు అనుమతి తెచ్చుకున్నారు. ► ఒకప్పుడు సక్సెస్ఫుల్ సినిమా జర్నీకి జూబ్లీ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత అవి 100 రోజులయ్యాయి. ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి సినిమాకు కూడా 50 రోజులే అవుతున్నాయి. ఒక గ్రేట్ సినిమా వచ్చినా రెవెన్యూ అనేది మేజర్‌గా తొలి నాలుగు రోజులే ఉంటుంది. ఆ వీకెండ్స్ ఉన్న రెవెన్యూ మెయిన్‌గా సాగుతోంది. ఇప్పుడు అందరూ సినిమాను ఫాస్ట్‌గా చూడాలనేది ఒకటి, రెండోది పైరసీ వల్ల డ్యామేజ్ ఎక్కువగా జరుగుతోంది. ఎంత కంట్రోల్ చేసినా పైరసీ వస్తూనే ఉంది. అలాంటప్పుడు పెద్ద సినిమాల టార్గెట్ రీచ్ కావాలంటే టికెట్ ధరల పెంపు తప్పదు. ► నేను ఖర్చు పెట్టింది, వచ్చింది... ఇలాంటి నిజాలు ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియకుండా, ఎవరికి కావాల్సినవి వాళ్లు రాసుకుంటున్నారు. నిజానిజాలు ఏంటన్నది నాకు తెలుసు. నా పార్టనర్లకు తెలుసు. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనేదాని మీద చాలా విషయాలు ఉంటాయి. లాంగ్ ప్రాజెక్టులకు డ్యామేజ్లు పడతాయి. వడ్డీలు కావొచ్చు, అనుకోని అంశాలు కావొచ్చు... వాటన్నింటినీ బడ్జెట్లోకి తీసుకోలేం. ► ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లున్నాయి. ఆన్లైన్ బుకింగ్‌లో ఎక్స్ట్రార్డినరీ పుల్లింగ్ ఉంది కాబట్టి, ఒక థియేటర్ ఫుల్ అయితే, పక్క థియేటర్ వాళ్లను అడిగినా సినిమా వేస్తారు. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ‘మహర్షి’. రెవెన్యూ ఎంత వస్తుందనేది చూడాలి. -
ఇకనుంచి నా ఫ్యాన్స్‌కీ అది మ్యాజికల్ డేట్ అవుతుంది
20 ఏళ్లు.. 25 సినిమాలు. హీరోగా మహేశ్‌బాబు జర్నీ ఇది. ఈ జర్నీలో మహేశ్ ఎప్పటికీ మరచిపోలేని తీయని జ్ఞాపకం ఒకటి ఉంది. ఆ విషయంతో పాటు మహేశ్‌బాబు ఇంకా చాలా విశేషాలు చెప్పారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్’రాజు, పీవీపీ నిర్మించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు. ► మహర్షి’ సినిమా చేయడానికి కారణం? కథ విని, చాలా ఎగై్జట్ అయ్యాను. సినిమాలో కాలేజ్ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అని, కాన్ఫిడెంట్‌గా చేద్దాం అని వంశీ పైడిపల్లితో చెప్పాను. ఎందుకంటే హీరోగా 20 ఏళ్లు పూర్తయింది. 25 సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్లీ కాలేజ్ స్టూడెంట్ అంటే నమ్మేలా ఉండాలి. ఆ ఎపిసోడ్ దాదాపు 45 నిమిషాలు ఉంటుంది. అందుకే దాన్ని మేం బాగా డీల్ చేశాం. సినిమాలో అది నా ఫెవరెట్ పోర్షన్. సినిమా చూస్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాను. ఆడియన్స్‌కు కూడా తప్పకుండా నచ్చుతుంది. ► వంశీ ఈ కథతో మీ కోసం రెండేళ్లు వెయిట్ చేయడం గురించి? నిజానికి ఓ 20 నిమిషాలు కథ విని వంశీని పంపించేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆ టైమ్‌లో నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు 40 నిమిషాలు కథ చెప్పాడు. బాగా నచ్చింది. ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే మీ సినిమా ఉంటుంది అని చెప్పాను. ‘పర్లేదు. వెయిట్ చేస్తాను. ఆ వెయిటింగ్ గ్యాప్‌లో కథకు ఇంకా మెరుగులు దిద్దుతాను’ అని చెప్పాడు. మీరు తప్ప ఈ సినిమాలో హీరోగా ఎవరూ కనిపించడం లేదు అన్నాడు. వంశీ కన్విక్షన్‌కు హ్యాట్సాఫ్. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ► 25వ సినిమా ‘మహర్షి’ అని ముందే ప్లాన్ చేశారా? నేను చేయాల్సిన సినిమాలు ఉండటం. వంశీ వెయిట్ చేయడం. ఇలా అన్నీ కలిసి ‘మహర్షి’ నా కెరీర్లో 25వ సినిమా అయింది. 25వ సినిమాగా ఇదే చేయాలని ప్లాన్ చేసి చేయలేదు. ‘మహర్షి’లో మంచి డెప్త్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆడియన్స్ ఇలాంటి సినిమాను చూసి ఉండరు. ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్, మాస్, యూత్.. హీరో ఫ్యాన్స్.. ఇలా అన్ని యాంగిల్స్‌ని కవర్ చేశాడు వంశీ. ► ఈ మధ్య మీరు సోషల్ మేసేజ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది? అదేం కాదు. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాల్లో మంచి మెసేజ్ ఉంది. అలాంటి సినిమాల్లో నటించడం నాకు హ్యాపీగా ఉంది. అలాగే ‘మహర్షి’ సినిమాలో కూడా ఓ పవర్ఫుల్ పాయింట్ ఉంది. అది ఇప్పుడే చెప్పి ప్రేక్షకుల ఎగై్జట్‌మెంట్ తగ్గించేయను. ► ‘శ్రీమంతుడు’ సినిమాలో దత్తత అనే పాయింట్ ఉంది. ఇందులోనూ అలాంటి పాయింట్ ఏదైనా? ఉంటుంది. ఓ పవర్ఫుల్ పాయింట్‌ను టచ్ చేశాం. సినిమా రిలీజ్ రోజున ఆడియన్స్ ఎగై్జట్ అవుతారని అనుకుంటున్నాం. ఆ పాయింట్ రైతుల సమస్యల గురించా? అనే విషయం ఇప్పుడే చెప్పలేను. థియేటర్స్‌లో చూడాల్సిందే. ► ఈ సినిమాలో మూడు లుక్స్‌లో కనిపిస్తున్నారు. మీ ఫేవరెట్ లుక్ ఏది? ఇంతకు ముందు ఒకే లుక్‌లో సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఈ సినిమాలో మూడు లుక్స్ ఉంటాయి. స్టూడెంట్‌లా, రైతులా, బిజినెస్‌మన్‌లా కనిపిస్తాను. ఏ లుక్ ట్రై చేసినా అది ఆ సినిమా, అందులో క్యారెక్టర్ ప్రకారమే ఉంటుంది. అలాగే లుక్ మార్చడమంటే హెయిర్ స్టయిల్ మార్చడం, గడ్డం పెంచడం తప్ప కొత్తగా ఏమీ ఉండదు (నవ్వుతూ). ► ఇది మల్టీ ప్రొడ్యూసర్స్ సినిమా.. అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువైనట్లుంది? అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీగారికి ముగ్గురూ నిర్మించారు. ‘మహర్షి’ చాలా పెద్ద స్కేల్ సినిమా. ఇంత బాగా రావడానికి వాళ్ల ముగ్గురి సపోర్ట్ చాలా ఉంది. సినిమాలో హీరో న్యూయార్క్‌లో సీఈవో. అంటే కార్లు, హెలికాప్టర్లు కావాలి. అప్పుడు అనుకున్నదానికంటే ఖర్చు ఎక్కువ అయ్యింది. ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలను విలేజ్‌లో షూట్ చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. సెట్ వేశాం. ఆ సీన్స్‌లో ప్రతిరోజూ దాదాపు వెయ్యిమంది జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది. డిసెంబర్లో షూట్ చేశాం. 5 గంటలకు సూర్యుడు వెళ్లిపోతాడు. లైట్ ఫెయిల్ అవుతుంది. ఆ షెడ్యూల్ మరో పది రోజులు పెరిగింది. ఇలాంటి కారణాలు ఉన్నాయి. ► ఇక మీ నుంచి ఏడాదికి కనీసం రెండు సినిమాలు అశించవచ్చా? ఈ రోజుల్లో సినిమా అనేది టఫ్ టాస్క్ అయిపోయింది. నాన్నగారి టైమ్‌లో 300– 350 సినిమాలు వరకూ చేశారు. ఇప్పుడు 25వ సినిమానే పెద్ద ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరో విషయమేటంటే పెద్ద సినిమా చేయాలంటే కనీసం 8 నుంచి 10 నెలలు సమయం పడుతుంది. ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి అంత సమయం పడుతుంది. పెద్ద సినిమా షూటింగ్ అంటే అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద సినిమా ఐదారు నెలల్లో వస్తే అద్భుతమే. ‘భరత్ అనే నేను’ తర్వాత నెల రోజుల కంటే ఎక్కువ టైమ్ తీసుకోలేదు నేను. వెంటనే ‘మహర్షి’ స్టార్ట్ చేశాం. ► వంశీతో వర్క్ంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వంశీ కథ ఎలా చెప్పాడో అలానే తీశాడు. కథను చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు. అది నా పెర్ఫార్మెన్స్ అయినా కూడా కావొచ్చు. బాగా చేశాడు. సినిమా రిలీజైన తర్వాత వంశీకే పేరు వస్తుంది. అంత బాగా తీశాడు. చాలా ఎక్స్ట్రార్డినరీగా తీశాడు. ఈ కథను రెండేళ్లు రాశాడు. స్క్రిప్ట్‌పై ఎంత టైమ్ స్పెండ్ చేస్తే అవుట్‌పుట్ అంత బాగా వస్తుంది అంటాం. ఈ సినిమాకు అలా జరిగింది. ► 20 ఏళ్ల జర్నీ గురించి ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో కొందరు దర్శకులకు థ్యాంక్స్ చెప్పి, కొందరు దర్శకుల పేర్లు ప్రస్తావించకపోవడానికి కారణం? ఆ ఈవెంట్‌కు వచ్చే ముందు దాదాపు 16 గంటలు ప్రయాణం చేసి యూరప్ నుంచి వచ్చాను. స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వచ్చారు. ఆ హడావిడిలో మర్చిపోయాను. అది నా మిస్టేక్. దర్శకుడు పూరి జగన్నాథ్‌కు థ్యాంక్స్. ‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ని చేసిన ఫిల్మ్. అలాగే దర్శకుడు సుకుమార్‌గారికి థ్యాంక్స్. ‘1: నేనొక్కడినే’ క్లాసిక్ కల్ట్ సినిమా నా కెరీర్లో. వన్నాఫ్ మై ఫెవరేట్ డైరెక్టర్ సుకుమార్. ► అలాగే కొందరు దర్శకులు కథ రెడీ చేసుకున్నాక వెయిట్ చేయలేకపోతున్నారు అనే కామెంట్ కూడా చేశారు? వంశీ రెండేళ్లు వెయిట్ చేశాడని అతన్ని అభినందించడానికి, పొగడటానికి అన్న మాట అది. సుకుమారుగారి గురించి కామెంట్ చేశాననట్లు రాశారు. సుకుమార్‌గారిని పాయింట్ అవుట్ చేసి అన్నది కాదు. సుకుమార్‌గారు నాకు స్పెషల్ డైరెక్టర్. భవిష్యత్‌లో మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం. ► హిట్టయిన డైరెక్టర్స్ పేర్లు మాత్రమే ప్రీ–రిలీజ్ వేడుకలో చెప్పారనే విమర్శ ఉంది.. సక్సెస్.. ఫెయిల్యూర్ అని కాదు. నా కెరీర్ గ్రాఫ్‌లో ఈ దర్శకుల సినిమాలు చాలా కీలకం. అందుకే వాళ్ల పేర్లు చెప్పాను. ‘మురారి’ అనే సినిమా నటుడిగా నాకు చాలా క్రూషియల్. మహేశ్ యాక్ట్ చేయగలడు అని చెప్పిన సినిమా అది. ‘ఒక్కడు’ నన్ను స్టార్‌ని చేసింది. ‘అతడు’ సినిమా నాకు యూఎస్‌లో మార్కెట్‌ని ఓపెన్ చేసింది. ‘పోకిరి’ సినిమా తర్వాత సూపర్‌స్టార్ అన్నారు. ఇవన్నీ నాకు ముఖ్యమైన సినిమాలు. ఇప్పుడు నా జర్నీలో ‘మహర్షి’ 25వ సినిమా. అంతేకానీ హిటై్టన డైరెక్టర్స్ పేర్లు చెప్పడమే అని కాదు. ► ‘శ్రీమంతుడు’ సినిమాతో ‘మహర్షి’కి పోలికలు ఉన్నాయి అంటున్నారు? ఈ సినిమాకు, ‘శ్రీమంతుడు’ సినిమాతో సంబంధం లేదు. సినిమా చూస్తే తెలుస్తుంది. టీజర్ అప్పుడు పోల్చి చూశారేమో.. ట్రైలర్ వచ్చిన తర్వాత అలాంటి కామెంట్స్ ఏం వినబడలేదు. ► 25 సినిమాలు చేశారు. మీ కెరీర్లో మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? నాన్నగారితో ‘మురారి’ మార్నింగ్ షో సినిమా చూశాను. అది కూడా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో. ‘మురారి’ సినిమా క్లైమాక్స్ తర్వాత నా భుజంపై నాన్నగారు చేయి పెట్టారు. అదే నా మోస్ట్ మెమొరబుల్ మూమెంట్. సినిమా బాగుందా? బాలేదా? అలా ఏం చెప్పలేదు. భుజంపై చేయి వేసి అలా తడిమారు.. అంతే. ‘మహర్షి’ సినిమా గురించి నాన్నగారు ఏం చెబుతారో అని ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నాను. ► మే 9న చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి? మే 9 నిజంగా మ్యాజికల్ డేట్. అశ్వనీదత్ గారికి రెండు బ్లాక్‌బస్టర్ సినిమా (జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి)లు ఉన్నాయి. ఇక నుంచి మా అభిమానులకు కూడా ఆ డేట్ మ్యాజికల్‌గా మారబోతోంది. ► బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాలు అంగీకరిస్తాను అంటున్నారు.. బ్రౌండ్ స్క్రిప్ట్ ముఖ్యం. అరగంట కథ విని ఎగై్జట్ అవ్వడం కన్నా మూడు గంటలు స్క్రిప్ట్ విని చేయడం మంచిది. షూటింగ్‌లోకి దిగిన తర్వాత స్క్రిప్ట్ గురించి మళ్లీ డిస్కషన్స్ ఉండకూడదని నా ఫీలింగ్. నేను గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. ‘స్పైడర్, బ్రహ్మోత్సవం’ సినిమాలు 20 నిమిషాల నరేషన్ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. సేమ్ టైమ్ షూటింగ్లో దిగినప్పుడే నాకు తెలిసిపోయింది. మన లోపల ఉన్న భయం చెప్పేస్తుంది. ఆ తప్పులు మళ్లీ రిపీట్ చేయకూడదు అనుకుంటున్నాను. ఇక మీదట డిటైల్డ్ స్క్రిప్ట్ ఉండి.. కథ నచ్చితేనే సినిమా చేస్తాను. ► బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, రాజమౌళిలతో మీరు సినిమాలు చేయాల్సి ఉందేమో? రాజమౌళిగారు, నేను ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. కేఎల్ నారాయణగారు నిర్మాత. నా కమిట్మెంట్స్, ఆయన కమిట్మెంట్స్ పూర్తయినప్పుడు మా కాంబినేషన్లో సినిమా ఉంటుంది. త్రివిక్రమ్‌గారితో కూడా చర్చలు జరుగుతున్నాయి. ► హిస్టారికల్ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా? హిస్టారికల్ సినిమాలు చేయాలంటే నాకు భయం. రాజమౌళిగారిలాంటి దర్శకులు కన్విన్స్ చేసినప్పుడు చేస్తాను. ► అడవి శేష్‌తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా గురించి? అడవి శేష్ ‘గూఢచారి’ సినిమా చూశాను. నచ్చింది. అలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకున్నాం. సోనీ పిక్చర్స్‌వారు కలసి పని చేద్దాం అని వచ్చారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. నాకు నచ్చిన అన్ని కథలను నేను చేయలేను. వీలైతో వాటిలో కొన్నింటిని నిర్మిస్తాను. ► మీ సినిమాలు వేరే భాషలో విడుదల కాకపోయినా ఒక్క తెలుగులోనే మీ మార్కెట్ 150 కోట్ల వరకూ ఉంటుంది. అది గర్వంగా ఉంటుందా? ప్రౌడ్గాను ఉంది. అలాగే టెన్షన్‌గానూ ఉంది. థియేట్రికల్ బిజినెస్ 130 కోట్లు వరకూ జరిగినప్పుడు కలెక్షన్స్ 150–160 కోట్లు ఉన్నప్పుడే బయ్యర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. అలా ఉండాలంటే సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అయి తీరాలి. వేరే ఆప్షన్ లేదు. ► మేడమ్ తుస్సాడ్స్వాళ్లు తయారు చేసిన మీ స్టాచ్యూ చూసి మీ వైఫ్, పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు? నమ్రతా రియాక్షన్ కంటే సితార మా పాప రియాక్షన్ మాత్రం ప్రైస్‌లెస్. స్టాచ్యూ అంటే ఏదో అనుకుంది కానీ చూసి షాక్ అయింది. ఫస్ట్ టైమ్ ఆ బొమ్మను చూసినప్పుడు తను ఇచ్చిన రియాక్షన్ మర్చిపోలేనిది. ► దర్శకుడు సుకుమార్‌తో మీ సినిమా సడన్‌గా ఎందుకు క్యాన్సిల్ అయ్యింది? సుకుమార్‌గారు, నేను ముందు సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ వరుసగా అన్నీ సోషల్ మెసేజ్‌లు, ఇంటెన్స్ సినిమాలు చేస్తున్నాను అనిపించింది. అందుకే అనిల్ రావిపూడిగారి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని అనుకున్నాను. నాకు కొత్తగా, ఫ్రెష్‌గా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లు ఉంటుందనుకున్నాను. అదే సుకుమార్‌గారితో చెప్పను. చెరో సినిమా చేశాక మళ్లీ కలిసి సినిమా చేద్దామనుకున్నాను. ► అనిల్ రావిపూడి సినిమా మీ ఫ్యాన్స్ సలహా మేరకు అంగీకరించారా? ‘మహర్షి’ తర్వాత అనిల్‌తో సినిమా చేయా లన్నది నా ఛాయిస్. ఆ సినిమా జూన్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ‘దూకుడు’ తర్వాత ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేయలేదు. ఇలాంటి సినిమా నేను చేసి చాలా రోజులు అయింది. మైనపు బొమ్మ ఆవిష్కరణలో భార్యాపిల్లలతో మహేశ్ -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి రిలీజ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ లాంటి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ బడా ప్రాజెక్ట్ అదే స్థాయిలో విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మహర్షి.. మహేష్ 25వ సినిమా కూడా కావటంతో అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్ టీం. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, జయసుథ, మీనాక్షి దీక్షిత్, రాజేంద్ర ప్రసాద్, ముఖేష్ రుషి ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు. -
చలో ప్యారిస్
ప్రొఫెషనల్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని భలేగా బ్యాలెన్స్ చేస్తుంటారు మహేశ్‌బాబు. సెట్లో నటుడిగా ఎంత అంకితభావంతో ఉంటారో అంతే సరదాగా కుటుంబంతో సమయాన్ని గడుపుతుంటారు. తన 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన ఉత్సాహంలో కుటుంబంతో కలిసి మహేశ్‌బాబు ఆదివారం ప్యారిస్‌కి ఫ్లైట్ ఎక్కారు. అక్కడికి వెళ్లే ముందు దుబాయ్‌ని చుట్టేశారని తెలిసింది. ‘ప్యారిస్‌కు పయనం అవుతున్నాం’’ అని మహేశ్ భార్య నమ్రత పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే... వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మించిన ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘ఎఫ్ 2’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ చిత్రం ప్రారంభం అవుతుందనే ఊహాగానాలు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నాయి. గతంలో తన తండ్రి కృష్ణ బర్త్‌డేకి మహేశ్‌బాబు సినిమాల అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
మహేష్ తరువాత చెర్రీతో!
మహేష్ బాబు హీరోగా మహర్షి సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు వంశీ పైడిపల్లి, తదుపరి చిత్రాన్ని కూడా కన్ఫామ్ చేశాడు. ఇప్పటికే మహర్షి పనులు చివరి దశకు చేరుకోవటంతో నెక్ట్స్ సినిమా పనులు ప్రారంభించారన్న టాక్ వినిపిస్తోంది. తన నెక్ట్స్ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట వంశీ. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఎవడు సినిమా సక్సెస్ కావటంతో నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ పనుల్లో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఈ సినిమా 2020 జూలైలో రిలీజ్‌కానుంది. అంటే అప్పటి వరకు చరణ్ బిజీగా ఉంటాడు. ఆ తరువాతే వంశీ, చరణ్ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. -
మీకు రుణపడి ఉన్నాం : మహర్షి దర్శకుడు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ ఆన్లైన్ సరికొత్త రికార్డ్లను నెలకొల్పింది. అంతేకాదు కొందరు మహేష్ ఫ్యాన్స్ ఈ టీజర్‌కు యానిమేటెడ్ వర్షన్‌ను రూపొందించారు. టీజర్‌లోని సీన్స్, క్యారెక్టర్స్‌ను 2డీ యానిమేషన్లో రూపొందించిన ఈ టీజర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ యానిమేటెడ్ టీజర్‌పై స్పందించిన మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ‘టీజర్ అద్భుతంగా ఉంది. మీరు ప్రతీ సినిమాను మాకు ప్రత్యేకంగా మార్చేస్తున్నారు. మీకు రుణపడి ఉంటాం, ఈ వీడియో రూపొందించిన మహేష్ అభిమానులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బర్త్‌డే పార్టీలో మహేష్, తారక్
ఈ జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేయటంలో పాటు ప్రైవేట్ పార్టీలలోనూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు తరుచూ పార్టీల్లో పాల్గొంటు అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా మహేష్, తారక్ లు పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తన భార్య మాలిని పుట్టిన రోజు సందర్భంగా ట్రీట్ ఇచ్చాడు. ఈ పార్టీకి మహేష్, తారక్ లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈసందర్భంగా అంతా కలిసి తీసుకున్న సెల్పీని నమ్రత తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మహర్షి సినమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram Wishing my dear dear friend Malini paidipally a very happy birthday!! Her special big one ♥️♥️#cozyevenings #closefriends #goodtimes ❣️❣️ A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Apr 8, 2019 at 11:53am PDT -
‘మహర్షి’ ఆల్‌టైం రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ 25వ సినిమా కూడా కావటంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగా దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఉగాది సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తూ టాలీవుడ్లో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. విడుదలైన 12 గంటల లోపే 10 మిలయన్ల(కోటి)కు పైగా వ్యూస్ సాధించి ఆల్‌టైం రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 12.5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. మరో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. 12.6 Million Real Time Views in 24 hours🔥🔥 RISHI is on RAMPAGE🤘#JoinRishi... https://t.co/y0HGn7FQFb#TrendsettingMaharshiTeaser#Maharshi #SSMB25 @urstrulyMahesh @directorvamshi @hegdepooja @allarinaresh @ThisIsDSP @kumohanan1 pic.twitter.com/XA1ijMWY1S — Sri Venkateswara Creations (@SVC_official) 7 April 2019 -
ల్యాండ్‌మార్క్ మూవీ అవుతుంది
‘‘మహేశ్‌బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఉన్నప్పుడు కథను చెప్పాలనుకుంటున్న స్టయిల్లో చెబుతూనే ఆయన స్టార్డమ్ పక్కన పెట్టకుండా చేయాలి. కాబట్టి కాస్త సమయం పట్టింది. ‘ఊపిరి’ సినిమా సమయంలో మహేశ్‌గారికి ఈ ఐడియా చెప్పాను. 6 నెలల తర్వాత కథ చెప్పాను. ఈ కథను చెప్పే సమయంలో ‘మహర్షి’ ఆయన 25వ సినిమా అవుతుంది అని తెలియదు. అలా కుదిరింది. మహేశ్‌గారి కెరీర్లోనూ, మా అందరి కెరీర్లలోనూ ‘మహర్షి’ ల్యాండ్‌మార్క్ మూవీ అవుతుంది’’ అని వంశీ పైడిపల్లి అన్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం టీజర్ శనివారం రిలీజైంది. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘మహర్షి’లో మొదటి పాట రిలీజ్ చేసినప్పుడు ఇది ఫ్రెండ్షిప్ మూవీ అన్నారు. టీజర్ చూడగానే అభిప్రాయాలు మార్చుకున్నారు. ట్రైలర్, పాటలన్నీ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటారు. వంశీ 5 సినిమాల్లో 4 నాతోనే చేశాడు. ఈ సినిమా మీద 3 ఏళ్లుగా వర్క్ చేస్తున్నాడు. కంటెంట్ పరంగా, మేకింగ్ పరంగా అద్భుతమైన సినిమా ఇది. సినిమా చూశాక ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. మా కష్టాన్ని మే 9న ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. ‘‘టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా మీద అందరం నమ్మకంగా ఉన్నాం. నిర్మాతల సహకారానికి థ్యాంక్స్. అడిగింది కాదనకుండా ఇచ్చారు. మహేశ్‌గారు నిజంగా డైరెక్టర్స్ యాక్టరే. రిషి పాత్రకు ఊపిరి పోశారు. ఆయన నమ్మకం, సపోర్ట్ కారణంగానే ఇంత మంచి సినిమా చేయగలిగాం. ప్రస్తుతం ఒక పాట చిత్రీకరిస్తున్నాం. మరో పాట బ్యాలెన్స్ ఉంది. నరేశ్‌గారు అద్భుతమైన పాత్ర చేశారు. రాజుగారితో సినిమాలు చేస్తూనే ఉంటాను’’ అన్నారు వంశీ పైడిపల్లి. -
మహర్షి మాటలు వినండి
స్టూడెంట్‌గా, బిజినెస్‌మేన్‌గా రిషి ఎలా ఉంటాడో చూశాం. రిషి స్నేహితులు రవి, మహాలను చూశాం. రిషి డైలాగ్ చెబితే ఎలా ఉంటుందో ఉగాది సందర్భంగా చూడబోతున్నాం. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని ‘చోటీ చోటీ బాతే...’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 9గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు దర్శకుడు వంశీ పైడిపల్లి వెల్లడించారు. ‘చోటీ చోటీ బాతే..’ సాంగ్‌ను కూడా మార్చి 28న ఉదయం 9గంటల 9 నిమిషాలకే విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇందులో స్టూడెంట్‌గా, బిజినెస్‌మేన్‌గా మహేశ్‌బాబు కనిపిస్తారు. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో మొదలైందని తెలిసింది. ‘మహర్షి’ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలనుకుంటున్నారు. -
మహర్షి గాళ్‌ఫ్రెండ్
‘నీ దూకుడు.. సాటెవ్వడూ..’ అంటూ ‘దూకుడు’ టైటిల్ సాంగ్‌లో కనిపించిన హీరోయిన్ గుర్తుండే ఉంటారు. తన పేరు మీనాక్షి దీక్షిత్. ‘లైఫ్ స్టైల్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు. ‘బాడీగార్డ్, బాద్షా’ వంటి సినిమాల్లో టైటిల్ సాంగ్‌లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారీ బ్యూటీ. లేటెస్ట్గా ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబు గాళ్‌ఫ్రెండ్‌గా కనిపిస్తారట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన అమ్మాయి పాత్రలో మీనాక్షి కనిపిస్తారట. ఈ పాత్ర ఫుల్ గ్లామరస్‌గా ఉంటుందట. దాని కోసం మీనాక్షి తన లుక్‌ని టోటల్‌గా మార్చుకున్నారు. ‘‘వంశీగారు నాకోసం ఓ ఆసక్తికరమైన పాత్రను రాశారు. మహేశ్‌బాబుగారికి, నాకు ఉండే కెమిస్ట్రీ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది’’ అని తన పాత్ర గురించి పేర్కొన్నారు మీనాక్షి. ‘మహర్షి’ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. తొలి పాటను ఈ 29న విడుదల చేయనున్నారు. -
ఏం సక్కగున్నారో!
మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్ బాబు క్యారెక్టర్లో పలు షేడ్స్ ఉంటాయి. స్టూడెంట్‌గా, బిలీయనీర్‌గా, ఆధునిక రైతుగా మహేశ్ కనిపిస్తారని తెలిసింది. ఆల్రెడీ రెండు లుక్స్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక్కడున్న ఫొటోలోని మహేశ్ లుక్ స్టూడెంట్ పోర్షన్‌లోనిదని తెలుస్తోంది. ఈ ఫొటో చూసి, ఏం సక్కగున్నారో! అంటూ మహేశ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో రిషిగా మహేశ్‌బాబు, రవిగా ‘అల్లరి’ నరేశ్, మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. ‘మహర్షి’ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. -
వైరల్ అవుతున్న ‘మహర్షి’ వీడియో
-
అడవిలో వేట!
మహేశ్‌బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ జూన్‌లో ప్రారంభం అవుతుంది. తాజాగా ఈ సినిమా కథనం సింహాచలం అడవుల నేపథ్యంలో సాగుతుందనే వార్త ప్రచారంలోకొచ్చింది. ఇది రీవెంజ్ డ్రామా అట. అంతేకాదు ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్ ఫుల్ గడ్డంతో ఉంటుందట. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే అడవిలో మహేశ్ వేట ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. -
అబుదాబీ ఫ్లైట్ ఎక్కనున్న ‘మహర్షి’ టీమ్..!!
మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట చిత్రబృందం. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాల కోసం అబుదాబీ ఫ్లైట్ ఎక్కుతారట ‘మహర్షి’ టీమ్. అంతటితో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని టాక్. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర చేస్తున్నారు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఎఫ్ 2’ తో సూపర్ సక్సెస్‌ను అందుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మహేశ్‌కు అనిల్ ఓ స్టోరీ లైన్‌ను చెప్పగా ఇంప్రెస్ అయిన మహేశ్ స్క్రిప్ట్‌ను డెవలప్ చేయమని చెప్పారని ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. ‘మహర్షి’ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. -
‘మహర్షి’ మరింత ఆలస్యం కానుందా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ 25వ చిత్రం కూడా కావటంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నాట్టుగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి విడుదల మరింత ఆలస్యం కానుందట. ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 5న కాకుండా ఏప్రిల్ 26న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ ఈ సినిమాప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే రిలీజ్ ఆలస్యమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. -
‘మహర్షి’ డిజిటల్ రైట్స్.. తెలిస్తే షాకే!
‘భరత్ అనే నేను’ లాంటి బ్లాక్‌బస్టర్ తరువాత సూపర్‌స్టార్ మహేష్ నటిస్తోన్న చిత్రం మహర్షి. ఇన్నేళ్ల సినీ కెరీర్లో గడ్డంతో కనిపించని మహేష్.. ఈ మూవీ కోసం న్యూ లుక్‌ను ట్రై చేశాడు. మహేష్ కొత్త లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలె న్యూయార్క్ షెడ్యుల్‌ను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విలేజ్ సెట్ వేసి ఓ 25రోజులు షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఓ రేంజ్లో అమ్ముడుపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందీ డబ్బిండ్ రైట్స్‌ను దాదాపు 22కోట్లకు అమ్మినట్లు, అమెజాన్ ప్రైమ్ దాదాపు 12కోట్లకు డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. -
విలేజ్‌లో మహర్షి
స్నేహితుడు, క్లాస్మేట్ రవి ఉండే విలేజ్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నారట రిచ్ బిజినెస్‌మేన్ రిషి. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ యూఎస్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు, జయసుధ, పూజాలపై కీలక సన్నిశాలను ప్లాన్ చేశారు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో విలేజ్ సెట్ రెడీ చేస్తున్నారు. సినిమాలోని కథ పరంగా రాజమహేంద్రవరానికి దగ్గరగా ఉండే ఓ గ్రామంలో ‘అల్లరి’ నరేశ్ ఉంటారట. ఒక కారణం చేత నరేశ్‌ను కలవడానికి మహేశ్‌బాబు ఆ గ్రామానికి వెళతారు. ఆ కారణం ఏంటి? అనేది సస్పెన్స్. హైదారాబాద్‌లో వేసిన విలేజ్ సెట్లో ఈ సన్నివేశాలనే దాదాపు 25 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. ‘మహర్షి’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
బ్యాక్ టు ఇండియా
ప్రయాణంలో భాగంగా అమెరికా వెళ్లారు మహర్షి. ఆయన పని దాదాపు పూర్తి కావొచ్చిందట. దాంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. అశ్వినీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు రిషి అనే పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. నవంబర్ 2న ఈ టీమ్ తిరిగి ఇండియా వచ్చేస్తారట. తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ప్రారంభించనున్నారని సమాచారం. ఈ సెట్ పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా ఉంటుందట. మిగిలిన భాగం చిత్రీకరణ ఎక్కువ శాతం ఇక్కడే జరుపుతారని తెలిసింది. ఈ సినిమాలో మహేశ్ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. మహేశ్‌బాబు స్నేహితుడి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఉగాది స్పెషల్‌గా ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రాసాద్. కెమెరా: కేయు మోహనన్. -
రిషి ప్రయాణం ఎటు?
డెహ్రాడూన్‌లో తన ప్రయాణాన్ని మొదలెట్టారు రిషి. తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత గోవా వెళ్లారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నారు. మరి.. నెక్ట్స్ ఎటు? అంటే అమెరికానే అట. తన 25వ చిత్రం ‘మహర్షి’ కోసం మహేశ్‌బాబు రిషిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రయాణం గురించే మేం చెబుతున్నది. మహేశ్‌బాబు హీరోగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా షూటింVŠ ఈరోజుతో హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తి కానుంది. ఆ తర్వాతి షెడ్యూల్‌ని కూడా హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు వంశీ. వచ్చే వారం స్టార్ట్ కానున్న ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత అమెరికా ప్రయాణం అవ్వనున్నారు చిత్రబృందం. అక్కడ దాదాపు రెండు నెలలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబు తల్లిగా సీనియర్ నటి జయప్రద కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కేయు మోహనన్. -
నచ్చితే పది మందికి చెప్పండి
‘‘శంకర్‌గారు, ఉషాగారిలాంటి తల్లిదండ్రులు ఉండటం నాగశౌర్య అదృష్టం. డైరెక్టర్ శ్రీనివాస్ నా కుటుంబంలోని వ్యక్తి. తనకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. ‘నర్తనశాల’ అనే టైటిల్ పెట్టి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి’’ అన్నారు వంశీ పైడిపల్లి. ‘ఛలో’ వంటి హిట్ చిత్రం తర్వాత నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. కష్మిరీ పరదేశి, యామినీ భాస్కర్ హీరోయిన్స్. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. వంశీ పైడిపల్లి ఆడియో సీడీలను విడుదల చేసి మాట్లాడుతూ – ‘‘ఒక క్లాసిక్ సినిమాను తీసుకుని అందులోని క్యారెక్టర్స్‌ను కాంటెంపరరీగా డిజైన్ చేసి ఎంటర్టైన్ చేస్తూ తీసిన సినిమా ఇది. ‘గీత గోవిందం’తో ఎంటర్టైన్మెంట్ వేవ్ స్టార్ అయింది. అది ‘నర్తనశాల’కు కంటిన్యూ కావాలి’’ అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘వంశీ పైడిపల్లిగారు మొదటి నుండి మా సినిమాకు తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అజయ్, శివాజీరాజాగారు, యామినీ, కష్మీరి అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. సాగర్ మహతి మంచి సంగీతం అందించారు. డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి సినిమాను చాలా బాగా తీశారు. చెప్పింది చెప్పినట్లు తీశారు. మా అమ్మానాన్నలకు చాలా థ్యాంక్స్. వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మా ఫ్యామిలీకి ఎప్పుడూ సపోర్ట్ చేసే బుజ్జి అంకుల్, శ్రీనివాస్‌రెడ్డి అంకుల్‌కు థాంక్స్. డెఫినెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోతే చూడొద్దు. నచ్చితే పది మందికి చెప్పండి’’ అన్నారు. ‘‘శౌర్య, శంకర్‌గారికి, ఉషాగారికి థాంక్స్. సినిమా చాలా ప్లెజంట్‌గా, కామిక్‌గా ఉంటుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’అన్నారు దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి. ‘‘ఒక మనసు’ చిత్రం కోసం మా బ్యానర్లో శౌర్య పనిచేశాడు. హార్డ్‌వర్కర్. తనకు మంచి పేరెంట్స్ ఉండటంతో.. కెరీర్ చక్కగా వెళుతోంది. ఐరా బ్యానర్‌ను స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేస్తున్నారు’’ అన్నారు మధుర శ్రీధర్ రెడ్డి. ‘‘శంకర్‌గారు, బుజ్జిగారు, గౌతమ్, ఉషాగారే.. ఈ సినిమాకు మూల స్తంభాలు. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నందినీ రెడ్డి. శివాజీ రాజా మాట్లాడుతూ – ‘‘ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. నా కోసమే ఈ సినిమా చేశారా? అనిపించేలా ఉంటుంది. సాగర్ మహతి చాలా మంచి సంగీతం ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. -
అప్పుడు ఫైటింగ్... ఇప్పుడు టాకింగ్!
రిషి జర్నీ గురించి తెలుసుకోవడానికి విజయ్ దేవరకొండ ‘మహర్షి’ సెట్స్‌కి వెళ్లారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్, రవి పాత్రలో నరేశ్ కనిపిస్తారు. ఈ సినిమా సెట్స్‌కు వెళ్లారు హీరో విజయ్ దేవరకొండ. ‘‘నైస్ టైమ్.. విజయ్ నీ హాలీడేని బాగా ఎంజాయ్ చెయ్’’ అన్నారు మహేశ్. ‘‘మహేశ్ సార్, వంశీ అన్నను కలవడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు మహేశ్ అన్న మూవీ టిక్కెట్స్ కోసం కౌంటర్ దగ్గర ఫైట్ చేసేవాడ్ని. ఇప్పుడు ఆయనతో కలిసి వర్క్ గురించి మాట్లాడే అవకాశం వచ్చింది’’ అని ఆనందం వ్యక్తం చేశారు విజయ్ దేవరకొండ. అన్నట్లు.. హాలీడే ఎంజాయ్ చెయ్ అని మహేశ్ ఎందుకు అన్నట్లు అనే విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హాలిడే మూడ్‌లో ఉన్నారు. జెర్మనీ వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ‘మహర్షి’ సినిమా కెమెరామెన్ కేయూ మోహనన్ బర్త్ డే వేడుకలు సెట్స్‌లో జరిగాయి. చిత్రబృందం సమక్షంలో మోహనన్ కేక్ కట్ చేశారు. ‘మహర్షి’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. -
అటూ ఇటూ తిరిగి నర్తనశాల నాకే వచ్చింది
‘‘కొడుకు కలల్ని అర్థం చేసుకుని తనకి నచ్చినట్లు సినిమాలు తీస్తున్నారు నాగశౌర్య తల్లిదండ్రులు. వారి ఆశీర్వాదానికి మించిన ఆశీస్సుల కంటే ఇంకేం కావాలి. ‘నర్తనశాల’ వంటి క్లాసిక్ టైటిల్‌తో తీసిన ఈ చిత్రంలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో నటించారు. టీజర్లో కొత్తదనం కనిపించింది. నా మిత్రుడు శ్రీనివాస్‌కి ఈ చిత్రం మంచి హిట్ తీసుకొస్తుంది. ఈ సినిమా కెమెరామేన్ విజయ్ సి.కుమార్ నాన్నగారు పాత ‘నర్తనశాల’ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడం విశేషం’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. నాగశౌర్య హీరోగా, కష్మీర పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నర్తనశాల’. శంకర ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉష మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘2013లో నేను హీరోగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు శ్రీనివాస్ చక్రవర్తి ‘నర్తనశాల’ కథ వినిపించారు. చాలా బాగా నచ్చింది. అప్పు చేసి అయినా ఈ సినిమా నిర్మించాలనిపించింది. అప్పటి నుంచి ఈ కథ అటూ ఇటూ తిరిగి మళ్లీ నా వద్దకే రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా తీస్తా. 15 కోట్లు పెట్టండి? అంటే ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం నాపై ప్రేమతో చాలా ఖర్చుపెట్టి ఈ సినిమా తీశారు. వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘నా గురువు కృష్ణవంశీగారు. నాగశౌర్య, శంకర్ ప్రసాద్‌ల ప్రోత్సాహంతో నా కల తీరింది’’ అన్నారు శ్రీనివాస్ చక్రవర్తి. నటుడు శివాజీ రాజా, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కొరియోగ్రాఫర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అవును.. మహర్షి నిజమే
మహేశ్‌బాబు.. ఆరడుగుల అందగాడు. అలా నడిచొస్తుంటే అమ్మాయిలు తన వంకే చూస్తుండిపోతారు. కానీ ఫర్ ఏ చేంజ్ అమ్మాయిల పైపు సరదాగా చూసే తుంటరి కాలేజీ స్టూడెంట్ పాత్రలో మహేశ్ కనిపిస్తే? అభిమానులకు పండుగే. అలాంటి పాత్రలోనే మహేశ్‌ని చూపించబోతున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది మహేశ్ 25వ చిత్రం. ఇందులో మహేశ్‌బాబు ‘రిషి’ అనే కాలేజ్ స్టూడెంట్ పాత్రలో కొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నారు. గురువారం మహేశ్‌బాబు బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. టీజర్లో మహేశ్ జస్ట్ స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే స్టైల్ ఆకట్టుకునే విధంగా ఉంది. సోమ వారం ‘సాక్షి’లో ప్రచురించినట్టుగా సినిమాకు ‘మహర్షి’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇందులో ‘అల్లరి’ నరేశ్ రవి అనే పాత్రలో మహేశ్‌బాబు ఫ్రెండ్‌గా కనిపించనున్నారు. డెహ్రాడూన్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ 12న గోవాలో స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కెమెరా: కె.యు. మోహనన్. -
మహేష్ బాబు ‘మహర్షి’ టీజర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి టీజర్‌ను కాసేపటి క్రితం రిలీజ్ చేశారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా డబుల్ ట్రీట్ అందిస్తామని ఇది వరకే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత రాత్రి టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు టీజర్‌ను వదిలారు. మీట్ రిషి అన్న కాప్షన్‌తో.. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్న మహేష్.. అమ్మాయిలును ఓరకంటగా చూస్తూ వెళ్తున్న టీజర్ ఆకట్టుకునేలా ఉంది. దేవీ మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. -
ఫ్యాన్స్‌కు మహేష్ బాబు బర్త్‌డే గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : నేడు (ఆగస్టు 9) టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా లేటెస్ట్ మూవీ అప్డేట్ ఇచ్చారు. దీంతో మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీ. ‘భరత్ అనే నేను’ అనంతరం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘ప్రిన్స్’ మహేష్ హీరోగా ఓ సినిమాను పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందరు అనుకున్నట్లుగా సూపర్‌స్టార్ 25వ మూవీ పేరు రిషి కాదని మహర్షి అని తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో మహేష్ షేర్ చేసుకున్నారు. ఓ చేతిలో ల్యాప్‌టాప్‌తో ఉన్న మహేష్.. మరో చేత్తో షర్ట్ కాలర్‌ను పట్టుకున్న ఈ ఫస్ట్‌లుక్ ఫొటోను బుధవారం అర్ధరాత్రి దాటాక సోషల్ మీడియాలో మహేష్ పోస్ట్ చేశారు. ఈ మధ్యే మహేష్ బాబుపై కొన్ని కాలేజీ సీన్లను తెరకెక్కించారు. అయితే ఇటీవల ఈ చిత్రబృందం.. కొన్ని అక్షరాలను ( R I S ) సోషల్‌మీడియాలో రిలీజ్ చేస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్... సినిమా టైటిల్‌ను ‘రిషి’ అని, లేకపోతే మహేష్ క్యారెక్టర్ పేరు రిషి అని ఊహించేసుకున్నారు. అయితే అందరు అనుకున్నట్లుగానే మహేష్ బర్త్‌డే రోజు (ఆగస్టు 9న) వీటన్నింటికి ఓ సమాధానం దొరికింది. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ మహర్షి అని మహేష్ చేసిన ట్వీట్‌తో స్పష్టమైంది. మరోవైపు టాలీవుడ్ రాజకుమారుడికి పుట్టినరోజు విషెస్‌తో సోషల్ మీడియాలో భారీ పోస్టులు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మహేష్ కెరీర్లో 25వ మూవీ ‘మహర్షి’కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. 2019లో ఈ మూవీ విడుదల కానుంది. -
మహేష్ టైటిల్‌పై రచ్చ.. వైరల్!
మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ లాంటి భారీ హిట్ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఓ సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే మహేష్ బాబుపై కాలేజ్ సీన్స్‌ను తెరకెక్కించారు. అయితే ఆగస్టు 9న ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు. అసలే మహేష్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ టాలీవుడ్ ప్రిన్స్ పుట్టిన రోజున అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఆ వేడి ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంది. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ క్రియేట్ చేస్తున్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఈ చిత్రబృందం.. గత రెండు రోజులుగా కొన్ని అక్షరాలను ( R I S ) సోషల్‌మీడియాలో రిలీజ్ చేస్తున్నాయి. వాటిని ఆధారంగా చేసుకున్ని ఫ్యాన్స్... సినిమా టైటిల్‌ను ఊహించేసుకున్నారు. ఇప్పుడు వారు ఊహించిన పేరు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ‘రిషి’ అని టైటిల్ ఉంటుందని కొందరు.. మహేష్ చేయబోయే పాత్ర పేరు రిషి కావొచ్చని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా.. ఆగస్టు 9న వీటన్నింటికి ఓ సమాధానం దొరకనుంది. -
ప్రయాణం మొదలు
హైడ్‌లైన్ చూసి మహేశ్ బాబు ఎక్కడికైనా ప్రయాణం మొదలెడుతున్నారు అనుకుంటున్నారా? అవును. అయితే ఇది వ్యక్తిగత ప్రయాణం కాదు.. సినిమా ప్రయాణం. ఆ ప్రయాణం గురించిన వివరాలు తెలియాలంటే ఆగస్ట్ 9వరకూ ఆగాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘దిల్’రాజు, అశ్వనీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది మహేశ్ 25వ చిత్రం. ఈ సినిమా లోగోను శనివారం మహేశ్ బాబు కుమార్తె సితార, వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 9న రిలీజ్ చేయనున్నారు. ‘‘ఆగస్ట్ 9న మా జర్నీ మొదలవుతుంది. మా జర్నీలో మీరూ ఓ భాగం అవ్వండి’’ అని పేర్కొన్నారు వంశీ పైడిపల్లి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. ∙సితార, ఆద్య -
పెళ్లి కూతురి డైలమా
సాధారణంగా కాబోయే పెళ్లి కూతురు శుభలేఖలను చూసినప్పుడు ఊహల్లో తేలిపోవడమో, చుట్టూ నలుగురూ ఉంటే సిగ్గు పడటమో.. సీన్ ఇలా ఉంటుంది. కానీ ఒక చేతిలో శుభలేఖను పట్టుకుని మరో చేతితో సిగరెట్ పట్టుకుని కాబోయే పెళ్లి కూతురు ఏదో ఆలోచిస్తుంటే మాత్రం ఎక్కడో తేడా ఉన్నట్లే. ‘శుభలేఖ+లు’ సినిమా టీజర్లో పెళ్లి కూతురు ఇలానే కనిపిస్తుంది. శ్రీనివాస సాయి, దీక్షా శర్మ జంటగా శరత్ నర్వాడే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సి. విద్యాసాగర్, ఆర్. ఆర్. జనార్థన్ నిర్మించారు. ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. ‘‘వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమంటారు పెద్దలు. కానీ పెళ్లికి ముందు ఎలాంటి విషయాలనూ దాచకూడదని నేటి తరం యువత అభిప్రాయపడుతున్నారు. ఫలితం ఎలా ఉన్నా స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెలలోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ప్రియా వడ్లమాని, వంశీ నెక్కంటి, మోనా బేద్రే ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమాకు కేఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించారు. -
మళ్లీ కలిశారు
మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ మళ్లీ కలిశారు. రీసెంట్గా మహేశ్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ‘భరత్ బహిరంగ సభ’ సందర్భంగా ఈ ముగ్గురు స్టార్లు కలిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఇలా టాప్ హీరోలందరూ విభిన్న సందర్భాలలో ఒకే ఫ్రేమ్‌లోకి రావడం ఇండస్ట్రీలోని మంచి వాతావరణానికి సంకేతమని ఇండస్ట్రీ వాసులు అనుకుంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో ఎన్టీఆర్, ‘ఎవడు’ సినిమాలో రామ్‌చరణ్ ఇప్పుడు తాజా సినిమాలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బృందావనం, ఎవడు, ఊపిరి’ వంటి విజయాలతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న వంశీ పైడిపల్లి జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ పూజా హెగ్డేలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
లుక్ చేంజ్
మహేశ్‌బాబు దాదాపు క్లీన్ షేవ్‌లో ఉంటారు. లేటెస్ట్ సినిమా కోసం గడ్డం పెంచి అందర్నీ ఆశ్చర్యపరిచారాయన. అయితే ఈ లుక్ సినిమా మొత్తం కాదు. కేవలం కొంత పోర్షన్ వరకే. సినిమాలో కనిపించే కాలేజ్ ఎపిసోడ్స్ వరకు మహేశ్‌బాబు పొడువైన జుత్తు, గడ్డం, మీసాల్లో కనిపిస్తారట. ఆ కాలేజ్ సీన్స్ కంప్లీట్ అవడంతో గడ్డాన్ని ట్రిమ్ చేసి మళ్లీ తన లుక్‌లోకి వచ్చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ‘అల్లరి’ నరేశ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘దిల్’రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను డెహ్రాడూన్‌లో 24రోజులు షూట్ చేశారు చిత్రబృందం. ఈ షెడ్యూల్లోనే కాలేజ్ ఎపిసోడ్ అంతా కంప్లీట్ చేశారు. ఇందులో మహేశ్, ‘అల్లరి’ నరేశ్ స్టూడెంట్స్‌గా రైతు సమస్యల మీద రీసెర్చ్ చేస్తారనీ, ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్ర కథ ఉండబోతోందనీ సమాచారం. నెక్ట్స్ షెడ్యూల్ యూఎస్‌లో ఈ నెల మూడో వారం నుంచి స్టార్ట్ కానుంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన నాలుగు ట్యూన్స్‌ను కంపోజ్ చేశారట దేవీశ్రీ ప్రసాద్. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 9న విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఉగాది సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. -
హ్యాపీ బర్త్‌డే
‘హ్యాపీ బర్త్‌డే నరేశ్’ అంటూ మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి విషెస్ చెబితే, ‘అల్లరి’ నరేశ్ బర్త్‌డే కేక్ కట్ చేశారు. నరేశ్ బర్త్‌డే డెహ్రాడూన్‌లో జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. శనివారం ‘అల్లరి’ నరేశ్ బర్త్‌డే. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్ సినిమా టీమ్ సమక్షంలో జరిగింది. ‘‘మా రవికి (సినిమాలో క్యారెక్టర్ పేరు) జన్మదిన శుభాకాంక్షలు. మీతో అద్భుతమైన టైమ్ స్పెండ్ చేస్తున్నాను. రాబోయే సంవత్సరాలు కూడా మీకు బెస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పూజా హెగ్డే, శిరీష్, కెమెరామేన్ కేయు మోహనన్ పాల్గొన్నారు. ఈ సినిమా షెడ్యూల్ విషయానికి వస్తే.. జూలై సెకండ్ వీక్ వరకూ డెహ్రాడూన్‌లో కాలేజ్ సీన్స్ షూట్ చేయనున్నారట. ఆ తర్వాత అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు.