
మహర్షి చిత్రం సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లితో సూపర్‌స్టార్ మహేష్ బాబు కలిసి చాలా రోజులు జర్నీ కొనసాగించారు. ఇక ఈ జర్నీలో ఇరువురి ఫ్యామిలీలు కూడా దగ్గరయ్యాయి. దీంతో ఈ రెండు కుటుంబాలు ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఆ మధ్య అందరూ కలసి విదేశీ టూర్లకు కూడా వెళ్లారు.
ఇరు కుటుంబాల్లో ఏవైనా ఈవెంట్స్ జరిగితే అందరూ అక్కడే ప్రత్యక్షమవుతున్నారు. తాజాగా వంశీ పైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా.. ఒకేచోటకు చేరి సెలబ్రేట్ చేశారు. వంశీ పైడిపల్లికి కేక్ తినిపిస్తున్న ఫోటోను మహేష్ షేర్ చేస్తూ.. వంశీ పైడిపల్లికి బర్త్‌డే విషెస్ తెలిపాడు. మహేష్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ సర్ అని తెలిపాడు.
Thank You for everything Sir... 🤗😊 https://t.co/7CuMUqkM0P
— Vamshi Paidipally (@directorvamshi) July 27, 2019
Comments
Please login to add a commentAdd a comment