175 కోట్లు కలెక్ట్‌ చేసిన ‘మహర్షి’ | Mahesh Babu Maharshi Movie Collection 175 Crores Gross | Sakshi
Sakshi News home page

175 కోట్లు కలెక్ట్‌ చేసిన ‘మహర్షి’

Published Tue, May 28 2019 8:03 PM | Last Updated on Tue, May 28 2019 8:03 PM

Mahesh Babu Maharshi Movie Collection 175 Crores Gross - Sakshi

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన మహర్షి చిత్రం వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మొదటి ఆట నుంచి డివైడ్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం నిలకడగానే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ 175 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు.

ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. అయితే ఓవర్సీస్‌లో మహర్షి అంతగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. వీకెండ్‌ వ్యవసాయం అనే కాన్సెప్ట్‌ జనాల్లోకి బాగానే చేరింది. ఆ మధ్య పొలాల్లో దిగి వీకెండ్‌ వ్యవసాయాన్ని చాలా మంది ఫాలో అయ్యారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement